కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ దెరెక్ ఓ బ్రియెన్ కేంద్ర మంత్రి అమిత్ షాపై విమర్శలు చేశారు. ఆదివారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ మోదీ-అమిత్ షా, మీ మైండ్ గేమ్స్ పనిచేయవు. మీ సీట్ల లెక్కల స్టంట్లన్నీ గుజరాత్‌లోని జిమ్‌ఖానాలో ప్రయత్నించండి. ఇది బెంగాల్’’ అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ శనివారం జరిగిన 30 అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన తెలిపారు.
కాగా, ఈ ఉదయం అమిత్ షా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడుతూ.. ‘‘ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. గ్రౌండ్ లెవెల్‌నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం 30 స్థానాకు గాను 26 గెలుచుకుంటాం. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అస్సాంలోనూ 47 స్థానాలకు 37 గెలుస్తాం. ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు, అత్యధికంగా నమోదైన పోలింగ్ శాతం మాకు పాజిటివ్ సంకేతాలు. ఎలక్షన్ కమిషన్‌కు కృతజ్ఞతలు’’ అని అన్నారు.
Mind games won’t work, Mo-Sha. Try your seat prediction stunts at the Gujarat Gymkhana.
— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) March 28, 2021
This is Bengal. #KhelaHobe #TMCSweepsPhase1
Comments
Please login to add a commentAdd a comment