
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం దిశగా పయనిస్తోంది. ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్‌లో మమతా బెనర్జీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక బెంగాల్‌లో టీఎంసీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ దీదీకి అభినంధనలు తెలిపారు. బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహాయ, సహకారాలు ఉంటాయన్నారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ బాగా బలం పుంజుకుంది అన్నారు మోదీ. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తదితరులు దీదీకి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment