కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విమర్శలు చేశారు. బెంగాల్‌లో మొత్తం 42 సిట్లతో బీజేపీ విజయం సాధించాలనే లక్ష్యంతో టీఎంసీని ప్రధాని మోదీ టార్గెట్ చేశారు.
ఆయన శనివారం బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ‘టీఎంసీ అంటేనే అవినీతి. ఇక్కడికి వచ్చిన ప్రజలు ఇచ్చిన విశ్వాసంతో చెబుతున్నా.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే సర్కార్ 400 స్థానాల్లో విజయం సాధింస్తుంది. టీఎంసీ అంటే దౌర్జన్యాలు, కుటుంబ రాజకీయం, దోహానికి ప్రతిరూపం. బెంగాల్ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పట్ల విసుగు చెందారు.
సందేశ్‌ఖాలీ మహిళల విషయాన్ని ప్రస్తావిస్తూ... టీఎంసీ నేతలు సందేశ్‌ఖాలీ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని అన్నారు. బాధలో ఉన్న తల్లులు సోదరీమణులకు మద్దతు ఇవ్వాల్సింది పోయి టీఎంసీ ప్రభుత్వం నిందితుల పక్షాన నిలబడుతోందని మోదీ విమర్శించారు. న్యాయం కోసం సందేశ్‌ఖాలీ మహిళలు ఎంత వేడుకుంటున్నా, నిరసనలు తెలిపినా టీఎంసీ ప్రభుత్వం మాత్రం వినిపించుకోలేదని మోదీ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment