Mamata banarjee
-
‘ఇక మీవంతు’..మమతకు బీజేపీ హెచ్చరిక
కోల్‌కతా: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో ఉత్సాహంలో మునిగితేలుతున్న బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఎసీఎం మమతా బెనర్జీని టార్గెట్‌గా చేసుకుని ‘ఇక మీవంతు’ అని హెచ్చరించారు. కోల్‌కతాతో విలేకరులతో మాట్లాడిన సువేందు అధికారి ‘ఢిల్లీలొ విజయం మనదే.. ఇక 2026లో బెంగాల్ వంతు వస్తుంది’ అని అన్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం దేశానికి ఎంతో అవసరమని, అవినీతి, అబద్ధాల రాజకీయాల ముగింపునకు ఇది నాంది అని సువేందు అధికారి పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అవినీతికి పాల్పడిందని, దీనికి ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు.ఢిల్లీ దేశ రాజధాని అని, దీనిని అంతర్జాతీయ స్థాయి నగరంగా మార్చాల్సివుందని, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని నాశనం చేసిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి జరిగినట్లే, ఢిల్లీలో కూడా జరిగి ఉండాల్సిందని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం యమునా ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని, అయితే ఢిల్లీ ప్రభుత్వం వాటిని నిర్వహించడంలో విఫలమైందన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఢిల్లీలోని 90 శాతం బెంగాలీ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్, రోహింగ్యా చొరబాటుదారులకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డులను ఇవ్వడం ద్వారా ఉచిత విద్యుత్, నీరు వంటి సౌకర్యాలను అందించిందని, ఇది దేశ భద్రతకు ముప్పు అని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఇలాంటి కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లే, ఢిల్లీలో జరిగిన అన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలలో కేజ్రీవాల్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. -
Mahakumbh-2025: యాత్రికులకు మమతా సర్కారు హెల్ఫ్‌డెస్క్
కోల్‌కతా: మౌని అమావాస్య నాడు మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురు మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన మమతా సర్కారు పశ్చిమ బెంగాల్ నుంచి కుంభమేళాకు వెళ్లేవారికి పలు సూచనలు జారీ చేసింది. ఒక హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.కుంభమేళాకు పశ్చిమబెంగాల్ నుంచి వెళుతున్న యాత్రికులకు ఏదైనా అత్యవసర పరిస్థితి(Emergency) తలెత్తినప్పుడు ఈ హెల్ప్‌డెస్క్ సాయం అందించనుంది. వారంలో ప్రతిరోజూ 24 గంటల పాటు సహాయం అందించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ, పౌర రక్షణ శాఖ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ హెల్ప్‌డెస్క్(Helpdesk) పర్యవేక్షణ జరగనుందని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో యాత్రికులు మహా కుంభమేళాకు వెళ్తున్నారని, వారికి సహాయం చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు.ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు హెల్ప్‌లైన్ నంబర్ (033) 2214-3526, టోల్-ఫ్రీ నంబర్ 1070ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో పశ్చిమ బెంగాల్(West Bengal)కు చెందిన నలుగురు యాత్రికులు మృతిచెందగా, తొమ్మిది మంది గల్లంతయ్యారు. ఇదిలావుండగా మహా కుంభమేళాలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల గణాంకాలను ప్రభుత్వం అందించాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.బీజేపీ ప్రభుత్వాన్ని ఎవరూ విశ్వసించడం లేదన్న అఖిలేష్ ఒక ప్రకటనలో ఈ ప్రభుత్వానికి దేశ ప్రజల విషయంలో ఎలాంటి దార్శనికత లేదు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు, యువత, పేదలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ గణాంకాల కంటే, మహా కుంభ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన, గాయపడిన, తప్పిపోయిన వారి గణాంకాలు చాలా ముఖ్యమైనవని అఖిలేష్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి -
Mamata Banerjee: రాజీనామాకైనా సిద్ధం
కోల్‌కతా: బెంగాల్ ప్రజల కోసం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. వైద్యురాలికి న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని తెలిపారు. ‘వైద్యుల సమ్మెపై ప్రతిష్టంభన ఈ రోజుతో తొలిగిపోతుందని ఆశించిన బెంగాల్ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను. జూనియర్ డాక్టర్లు నబన్నా (సచివాలయం)కు వచ్చి కూడా చర్చలకు కూర్చోలేదు. తిరిగి విధులకు వెళ్లాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని మమత గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. ‘సదుద్దేశంతో గత మూడురోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మెడికోలు చర్చలకు నిరాకరించారు’ అని సీఎం అన్నారు. ‘ప్రజల కోసం నేను రాజీనామా చేసేందుకు సిద్ధం. కానీ ఇది పద్ధతి కాదు. గడిచిన 33 రోజులుగా ఎన్నో అభాండాలను, అవమానాలను భరించాం. రోగుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో చర్చలకు వస్తారని భావించా’ అని మమత పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినా.. తమ ప్రభుత్వం జూనియర్ డాక్టర్లపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోదని హామీ ఇచ్చారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారంతో జూనియర్ డాక్టర్లు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. నెలరోజులకు పైగా వీరు విధులను బహిష్కరిస్తున్నారు. సెపె్టంబరు 10న సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను బేఖాతరు చేశారు. మమత సమక్షంలో చర్చలకు జూడాలు డిమాండ్ చేయగా.. బెంగాల్ ప్రభుత్వం దానికి అంగీకరించి వారిని గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చల కోసం నబన్నాకు రావాల్సిందిగా ఆహా్వనించింది. అయితే ప్రత్యక్షప్రసారం ఉండాలనే జూడాల డిమాండ్‌ను ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చర్చలు జరగలేదు. రెండుగంటలు వేచిచూశా సమ్మె చేస్తున్న డాక్టర్లను కలవడానికి రెండు గంటల పాటు సచివాలయంలో వేచిచూశానని, వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని మమత అన్నారు. గురువారం సాయంత్రం 5:25 గంటలకు సచివాలయానికి చేరుకున్న డాక్టర్లు ప్రత్యక్షప్రసారానికి పట్టుబట్టి బయటే ఉండిపోయారు. ప్రత్యక్షప్రసారం డిమాండ్‌కు తాము సానుకూలమే అయినప్పటికీ హత్యాచారం కేసు కోర్టులో ఉన్నందువల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే.. చర్చల రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేశామని మమత వివరించారు. ‘పారదర్శకత ఉండాలని, చర్చల ప్రక్రియ పక్కాగా అధికారిక పత్రాల్లో నమోదు కావాలనే రికార్డింగ్ ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు అనుమతిస్తే జూడాలతో వీడియో రికార్డును పంచుకోవడానికి కూడా సిద్ధం పడ్డాం’ అని మమత చెప్పుకొచ్చారు. రహస్య పత్రాలపై ఇలా బాహటంగా చర్చించలేమన్నారు. గడిచిన నెలరోజుల్లో వైద్యసేవలు అందక రాష్ట్రంలో 27 మంది చనిపోయారని, 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ‘15 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని చర్చలకు పిలిచాం. కానీ 34 మంది వచ్చారు. అయినా చర్చలకు సిద్ధపడ్డాం. చర్చలు సాఫీగా జరగాలనే ఉద్దేశంతోనే వైద్యశాఖ ఉన్నతాధికారులెవరినీ పిలువలేదు (వైద్యశాఖ కీలక అధికారుల రాజీనామాకు జూడాలు డిమాండ్ చేస్తున్నారు)’ అని మమతా బెనర్జీ అన్నారు. నబన్నాకు చేరుకున్న జూనియర్ డాక్టర్లను ఒప్పించడానికి ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్, డీజీపీ రాజీవ్ కుమార్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. ముమ్మర సంప్రదింపులు జరిపారు. అయినా జూడాలు తమ డిమాండ్‌పై వెనక్కితగ్గలేదు. ప్రభుత్వం జూడాలను చర్చలకు పిలవడం రెండురోజుల్లో ఇది మూడోసారి. రాజకీయ ప్రేరేపితంచర్చలు జరపాలని తాము చిత్తశుద్ధితో ఉన్నామని, అయితే డాక్టర్ల ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని మమతా బెనర్జీ సూచనప్రాయంగా చెప్పారు. ‘డాక్టర్లలో చాలామంది చర్చలకు సానుకూలంగా ఉన్నారు. కొందరు మాత్రమే ప్రతిష్టంభన నెలకొనాలని ఆశిస్తున్నారు’ అని ఆరోపించారు. బయటిశక్తులు వారిని నియంత్రిస్తున్నాయన్నారు. ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని, వాటికి వామపక్షాల మద్దతుందని ఆరోపించారు. మమత రాజీనామా కోరలేదు: జూడాలు ప్రత్యక్షప్రసారాన్ని అనుమతించకూడదనే సర్కారు మొండి పట్టుదలే చర్చలు కార్యరూపం దాల్చకపోవడానికి కారణమని జూనియర్ వైద్యులు ఆరోపించారు. తామెప్పుడూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా కోరలేదని స్పష్టం చేశారు. ప్రతిష్టంభనకు వైద్యులే కారణమని మమత పేర్కొనడం దురదృష్టకరమన్నారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా విధుల బహిష్కరణ కొనసాగిస్తామని తేలి్చచెప్పారు. -
గూండాల చేతిలో పశ్చిమ బెంగాల్: సువేందు అధికారి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వరుసగా జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతృత్వంలోని మమత ప్రభుత్వంపై బీజేపీ నేత సువేందు అధికారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సువేందు అధికారి డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ గూండాలు, రేపిస్టుల చేతుల్లో ఉందని సువేందు ఆరోపించారు. శనివారం నుంచి ఇప్పటి వరకు ఏడు లైంగిక వేధింపుల ఘటనలు జరిగాయని అన్నారు. నిందితులు టీఎంసీతోప్రత్యక్ష సంబంధం కలిగినవారేనని, వీరని మమతా బెనర్జీ పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. మమతా సాగిస్తున్న అవినీతిని బీజేపీ బయటపెడుతుందని అన్నారు. అంతకుముందు బీర్భూమ్లో నర్సుపై వేధింపుల ఘటనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ సీఎం మమతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరిపాలనతో పాటు పోలీసింగ్ వైఫల్యమే ఇటువంటి ఘటనలకు కారణమన్నారు. మమతకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ఆమె తప్పుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. -
మనిషితనం మాయమైందా?
సమాజం సహించలేని కొన్ని ఘటనలు ఆవేదన కలిగిస్తాయి. ఆగ్రహం రప్పిస్తాయి. చట్టాలెన్ని ఉన్నా ఆగకుండా సాగుతున్న అకృత్యాలపై ఏమీ చేయలేమా అన్న ఆక్రోశం రగిలిస్తాయి. కోల్‌కతా వైద్యశిక్షణార్థి ‘అభయ’ ఘటన నుంచి దేశం ఇంకా తేరుకోక ముందే, మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లో పసిపిల్లల పాఠశాలలో నాలుగేళ్ళ వయసు చిన్నారులు ఇద్దరిపై పాఠశాల పనివాడి అమానుష కృత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన వివరాలు వింటుంటేనే మనసు వికలమవుతుంది. ప్రజా నిరసనల రీత్యా మహారాష్ట్ర సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది సరే, పిల్లలకు బడిలోనే భద్రత లేకపోతే ప్రతి ఒక్కరికీ విద్యాహక్కు గురించి చర్చిస్తే ఏమి లాభమన్న బొంబాయి హైకోర్ట్ తాజా వ్యాఖ్యలు నిష్ఠురమైనా నిజమే. ఇప్పుడిక ప్రతి స్కూలులో నెలరోజుల్లోగా సీసీ టీవీ కెమెరాలు పెట్టాలి, వారంలో మూడుసార్లైనా ఆ ఫుటేజ్‌ను పరిశీలించాలి లాంటి సర్కారీ ఆదేశాలు షరా మామూలే. కానీ, కోల్‌కతా నుంచి బద్లాపూర్ దాకా అన్నిచోట్లా రాజ్యవ్యవస్థ చేతిలో ప్రజావిశ్వాసం కుప్పకూలడం సమకాలీన భారత విషాదం. పసిపిల్లలపై అకృత్యం జరిగితే, ఆ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సహకరించడానికి బదులు సదరు ‘ఆదర్శ విద్యాలయం’ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం విషాదం. విద్యాబుద్ధుల కోసం బడికి పిల్లల్ని పంపి, వారు అక్కడ భద్రంగా ఉంటారని భావించే కన్నవారికి ఇది భరించలేని కష్టం. పైగా, ఫిర్యాదు దాఖలుకు వారిని 11 గంటల పైగా వేచి ఉండేలా చేయడం దేనికి సంకేతం? ఇలాంటి ఘటనల్లో పాఠశాల వారినీ బాధ్యుల్ని చేస్తూ, ‘పోక్సో’ చట్టం కింద కేసు కట్టాలి. ఆ కనీస బాధ్యతను సైతం పోలీసులు విస్మరించడం క్షమించరాని దుర్మార్గం. చివరకు బొంబాయి హైకోర్ట్ ఆ లోపాన్ని ఎత్తిచూపాల్సి వచ్చింది. ‘అభయ’ ఘటనలోనూ అచ్చంగా ఇలాంటివే జరిగాయి. ఇలాంటి ఆటవిక చర్యలు ఎక్కడ జరిగినా జెండాలకు అతీతంగా రాజకీయ పక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాల్సి ఉండగా, స్వీయ రాజకీయలబ్ధికై ప్రయత్నించడం సిగ్గుచేటు. కోల్‌కతా ఘటనపై రచ్చ చేసే పార్టీ బద్లాపూర్పై నోరు మెదపదు. త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలోని బద్లాపూర్పై హంగామా చేసేవారు కోల్‌కతా ఘటనపై కంటితుడుపుకే పరిమితమవుతారు. రాజ్యాంగబద్ధ హోదాలోని బెంగాల్ గవర్నర్ టీవీ డిబేట్లలో కూర్చొని రాష్ట్ర సర్కార్‌ను దూషిస్తూ ఇంటర్వ్యూలిస్తుంటే ఏమనుకోవాలి? సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటనలపైనా నిజాయతీ వదిలేసి నీచ రాజకీయాలు చేస్తే దేశం ఏటు పోతుంది?ఉవ్వెత్తున ఎగసిపడ్డ భారీ నిరసనల నేపథ్యంలో కోల్‌కతా అంశంపై సుప్రీమ్ కోర్ట్, బద్లాపూర్ ఘటనపై బొంబాయి హైకోర్ట్ తమకు తాము స్వచ్ఛందంగా విచారణ చేపట్టడమే ఒకింత ఊరట. న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల్లో మినుకు మినుకుమంటున్న ఆశాదీపానికి కోర్టు చొరవ ఒక చిన్న కాపుదల. ఇవాళ దేశంలో రోజూ 90 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆనక హత్య చేసి, అడ్డు తొల గించడాలూ పెరిగిపోతున్నాయి. నోరు విప్పి చెప్పుకోలేని వారి పట్ల నీచప్రవర్తనలూ పెచ్చరిల్లుతున్నాయి. మన మధ్యే మామూలు వ్యక్తుల్లా తిరుగుతున్న మానవ మృగాలను నిరోధించడం కఠిన సమస్యే. అయితే, మనసుంటే మార్గాలుంటాయి. మహిళలు, పిల్లల కోసం ‘మినీ – పోలీస్ స్టేషన్ల’ను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం లాంటివి సిఫార్సు చేస్తున్నాయి. సుప్రీమ్ కోర్ట్ గురువారం బెంగాల్ సర్కార్‌కు ముక్కచీవాట్లు పెట్టిన నేపథ్యంలో సీఎం మమత సైతం తీవ్రతను అంగీకరించారు. అత్యాచార నేరాలపై అత్యంత కఠిన చట్టాలు చేయాలనీ, ఇలాంటి కేసుల్ని 15 రోజుల్లో పరిష్కరించేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పెట్టాలనీ ప్రధానిని కోరారు. అంతకన్నా ముందు సమాజంగా మనం ఆత్మశోధన చేసుకోవాలి. 2012 నాటి ‘నిర్భయ’ ఘటన తర్వాత కఠినచట్టాలు చేసినా పరిస్థితులు మారలేదంటే లోపం ఎక్కడున్నట్టు? వావివరుసలు లేవు, వయసులో చిన్నాపెద్దా విచక్షణ లేదు, చట్టం పట్ల భయభక్తులు అసలే లేవు. ఇలా ఉచ్చం నీచం మరిచి, చివరకు చిన్నారులపైనా మనుషులు మృగాలుగా మారడానికి దారి తీస్తున్న సాంఘిక, మానసిక పరిస్థితుల్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మన వెనకాలే ఊడలు దిగుతున్న ఈ వికృత ధోరణిని పెంచి పోషిస్తున్న మన వినోద, వినిమయ సంస్కృతులు, వైయక్తిక ప్రవర్తనల్ని సమీక్షించుకోవాల్సి ఉంది. ఈ భూతాన్ని ఆపేదెలా అని సత్వరమే ఆలోచించాల్సి ఉంది. ఇప్పటికీ ఆడవాళ్ళను ఆటవస్తువులుగా చూసే సామాజిక వైఖరి, మగవాళ్ళు ఏం చేసినా చెల్లుతుందనే ఆధిపత్య భావజాలం లాంటి అనేక అంశాల్లో మనం మారాల్సి ఉంది. కోర్టుల చొరవ, ఆదేశాలతో రానున్న రోజుల్లో కోల్‌కతా కేసు, బద్లాపూర్ కేసులు త్వరితగతినే తేలితే తేలవచ్చు. నిందితులకు కఠిన శిక్షలూ ఖాయం కావచ్చు. కానీ, దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ ఒకటి రెండు కేసుల్లోనే కాదు... వెలుగులోకి రాని వందల ఘటనలకు మూలకారణమైన మౌలిక అంశాలపై మనం ఎప్పటికి కళ్ళు తెరుస్తాం? సాక్షాత్తూ శిష్యులపై రేప్‌తో 20 ఏళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు హర్యానాలో ఎన్నికల వేళ పదేపదే పెరోల్ ఇస్తూ పోతుంటాం. గత నాలుగేళ్ళలో 234 రోజులు ఆయన జైలు బయటే ఉన్నారు. మైనర్ బాలిక రేప్ కేసులో జీవిత ఖైదులో ఉన్న మరో బాబా ఆశారామ్ బాపూను ఆయుర్వేద చికిత్సకై తాజాగా బయటకు వదులుతాం. అన్ని వ్యవస్థలనూ నీరుగార్చి, అధికారం సహా అనేక బలహీనతలతో పాలకులు చేసే ఈ పాపాలన్నీ శాపాలు కాక మరేమవుతాయి? జనం మూడోకన్ను తెరవాల్సిన సమయం వచ్చింది. -
అలా అనుకుంటే మనం ఎన్నిసార్లు రాజీనామా చేయాల్సివచ్చేదో!
-
వాళ్లకు ఎలాంటి శిక్ష వేయాలంటే..: గంగూలీ
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఇలాంటి దారుణానికి పాల్పడిన దుండగులకు కఠినమైన శిక్ష విధించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు. భవిష్యత్తులో ఇలాంటి దురాగతాలకు పాల్పడాలన్న ఆలోచన వచ్చినా భయంతో వణికిపోయేలా తీర్పునివ్వాలని కోరాడు.కాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్యకళాశాల ట్రైనీ డాక్టర్ హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. అత్యంత పాశవికంగా బాధితురాలిపై దారుణానికి పాల్పడ్డారు దుండగులు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ కేసులో 30 మందిని అనుమానితులుగా చేర్చి.. విచారిస్తున్నామని తెలిపింది.రోజూ జరిగే ఘటనల్లో ఇదొకటి?అయితే, ఈ ఘటనపై స్పందించిన సౌరవ్ గంగూలీ.. ‘రోజూ జరిగే ఘటనల్లో ఇదొకటి’ అని అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో అభిమానులు సైతం దాదాపై విరుచుకుపడ్డారు. బాధ్యతారహిత వ్యాఖ్యలు సరికాదంటూ ట్రోల్ చేశారు. ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన ఈ లెజెండరీ క్రికెటర్.. కాస్త ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు నెటిజన్లు.ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన గంగూలీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు . ‘‘గత ఆదివారం నేను మాట్లాడిన మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఇదొక భయానక ఘటన అని నేను ఆరోజే చెప్పాను. ప్రస్తుతం సీబీఐ, పోలీసులు ఈ కేసులో లోతుగా విచారణ జరుపుతున్నారు. దోషులు ఎవరన్నది తేలిన తక్షణమే వారికి కఠినాతికఠినమైన శిక్ష విధించాలి.వాళ్లకు పడే శిక్ష ఎలా ఉండాలంటే?భవిష్యత్తులో మరొకరు ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే వణికిపోయే పరిస్థితి ఉండాలి. ఎంత కఠినమైన శిక్ష విధిస్తే అంత మంచిది’’ అని ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. కాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో గంగూలీకి సత్సంబంధాలు ఉన్నాయంటారు అతడి సన్నిహిత వర్గాలు. ఇక దేశాన్ని కుదిపేస్తున్న డాక్టర్ హత్యాచార ఘటన నేపథ్యంలో దీదీ సర్కారు వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ప్రతిపక్షాలు, ప్రజలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రాగా.. పైవిధంగా స్పందించాడు దాదా.కాగా 1992 నుంచి 2008 వరకు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన గంగూలీ.. మేటి కెప్టెన్, బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. 113 టెస్టులాడి 7212, 311వన్డేల్లో 11363 పరుగులు సాధించాడు. బెంగాల్ క్రికెట్ ముఖచిత్రంగా నీరజనాలు అందుకున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగానూ గతంలో పనిచేశాడు. చదవండి: తప్పంతా ఆమెదేనా?.. ఇంకా మగాడు మగాడే అంటారా?: సిరాజ్ పోస్ట్ వైరల్ -
కోల్‌కతా వైద్యురాలి కేసు: సీఎం మమతకు ప్రియాంకా గాంధీ విజ్ఞప్తి
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణంపై జూనియర్ వైద్యులు, నర్సులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నిరసనలతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఇది హృదయవిదారకమైన ఘటనగా అభివర్ణించారు. ఈ కేసు దర్యాఫ్తును వేగవంతం చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు. నిందితులను కఠినంగా శిక్షించినప్పుడే మృతురాలి కుటుంబానికి, వైద్య సిబ్బందికి న్యాయం జరుగుతుందని అన్నారు. మహిళలు పని చేసే ప్రదేశంలో భద్రత అనేది పెద్ద సమస్యగా మారిందని వాపోయారు. మహిళల భద్రత కోసం తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.कोलकाता के आरजी कर मेडिकल कॉलेज में ट्रेनी डॉक्टर के साथ दुष्कर्म और हत्या की घटना दिल दहलाने वाली है। कार्यस्थल पर महिलाओं की सुरक्षा देश में बहुत बड़ा मुद्दा है और इसके लिए ठोस प्रयास की जरूरत है। मेरी राज्य सरकार से अपील है कि इस मामले में त्वरित और सख्त से सख्त कार्रवाई…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 12, 2024చదవండి: కోల్‌కతా వైద్యురాలి కేసు.. పోలీసులకు చుక్కలు చూపిస్తున్న నిందితుడు -
నీతి ఆయోగ్ సమావేశంలో తనను ఘోరంగా అవమానించారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపాటు... భేటీ నుంచి వాకౌట్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ధ్యానం చేస్తూ ఎవరైనా కెమెరా తీసుకెళ్తారా?: మమత
బారూయ్‌పూర్(పశి్చమబెంగాల్): వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధాని మోదీ చేయబోయే ధ్యానంపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అనుమానం వ్యక్తంచేశారు. మంగళవారం పశి్చమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ నియోజకవర్గంలో టీఎంసీ ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత ప్రసంగించారు. ‘‘ మేం ఖచి్చతంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం. ఆయన ధ్యానం చేసుకోవాలనుకుంటే చేసుకోమనండి. కానీ ఆయన మెడిటేషన్ చేస్తున్నపుడు టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారాలు చేస్తే ఒప్పుకోం. ధ్యానం చేసేందుకు వెళ్తూ ఎవరైనా కెమెరా వెంట తీసుకెళ్తారా?’’ అని అన్నారు. -
శోభాయాత్రపై రాళ్ల దాడి.. సీఎం మమతపై బీజేపీ ఆగ్రహం!
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శ్రీరామ నవమి శోభాయాత్రపై రాళ్ల దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ముర్షిదాబాద్ జిల్లాలోని రెజినగర్‌లోని శక్తిపూర్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, కొందరు గాయపడినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో పోలీసులు లాఠీచార్జి చేశారని, రెజీనగర్‌లో ఒక వర్గాన్ని టార్గెట్ చేశారని బీజేపీ ఆరోపించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బుధవారం సాయంత్రం శక్తిపూర్‌లో శ్రీరామనవమి ఊరేగింపులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ గాయపడింది. బాధితురాలిని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. Mamata Banerjee is a blot on West Bengal. She, once again, failed to protect Ramanavami Shobha Yatras. Hindu devotees targeted in Rejinagar, Murshidabad. Hindus are a minority in this area. Just pointing it out, so that she doesn’t blame the Hindus for the attack on themselves… pic.twitter.com/pzvJt0aZ4x — Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 17, 2024 శ్రీరామ నవమి పండుగ సందర్భంగా పోలీసులు ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. శ్రీరామ నవమి ఊరేగింపునకు రక్షణ కల్పించడంలో సీఎం మమతా బెనర్జీ మరోసారి విఫలమయ్యారని ఆరోపించారు. శోభా యాత్రపై దాడికి మమతా బెనర్జీ మతపరమైన రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని అమిత్ మాల్వియా పేర్కొన్నారు. ముర్షిదాబాద్‌లో అల్లర్ల అనంతరం మేదినిపూర్‌లోని ఎగ్రాలో ఒక వర్గంపై దాడి జరిగింది. ఈ నేపధ్యంలో బీజేపీ కార్యకర్తలు ఎగ్రా పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఈ ఘటనలకు బెంగాల్ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలంటూ నినాదాలు చేశారు. -
దమ్ముంటే నాపై పోటీ చేయ్.. సీఎం మమతా బెనర్జీకి అదిర్ సవాల్
సాక్షి, కోల్‌కతా : వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అదిర్ రంజన్ చౌదరి సవాల్ విసిరారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బెహ్రాంపూర్ స్థానం నుంచి తనపై పోటీ చేయాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను బెహ్రాంపూర్ లోక్‌సభ సీటును కేటాయింది. ఇప్పటికే ఆ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన అదిర్ రంజన్.. యూసుఫ్ పఠాన్ ఎంపికపై స్పందించారు. ‘దేశంలోని పౌరులు ఎవరైనా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఓటు వేయోచ్చు. పోటీ చేయోచ్చు. మమత స్వయంగా వెళ్లి గోవాలో ఎటువంటి సమస్య లేకుండా బరిలోకి దిగొచ్చు. అయితే, ఒక్కసారైనా మమతా బెనర్జీ తనపై పోటీ చేయాలని సవాలు విసిరారు. తృణమూల్ కాంగ్రెస్ యూసుఫ్ పఠాన్‌ను గౌరవించాలనుకుంటే, బయటి వ్యక్తులను పంపే బదులు ఆయనను రాజ్యసభకు పంపించి ఉండాల్సిందని అధిర్ రంజన్ అన్నారు. యూసఫ్ పఠాన్ పట్ల మమతా బెనర్జీకి చిత్తశుద్ధి ఉంటే, గుజరాత్లో అతనికి (యూసుఫ్ పఠాన్) సీటు ఇవ్వాలని కూటమి (ఇండియా కూటమి)ని అడిగారు. కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్ సీటు ఇచ్చారు. తద్వారా పరోక్షంగా బీజేపీకి సాయం చేసినట్లే చేసి.. కాంగ్రెస్‌ను ఓడించేలా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. -
Kolkata: ప్రధాని పర్యటన వేళ.. బీజేపీపై ‘దీదీ’ ఫైర్
కలకత్తా: పశ్చిమబెంగాల్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు, తమ పార్టీ నేతలను అరెస్టు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత, సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. బుధవారం కలకత్తాలో ప్రధాని పర్యటన నేపథ్యంలో మమత చేసిన వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి. ‘టీఎంసీ నేతలను అరెస్టు చేయాల్సిందిగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు వచ్చినట్లు మాకు తెలిసింది. మాకు న్యాయమైన లోక్‌సభ ఎన్నికలు కావాలి. బీజేపీ ఎన్నికలు వద్దు. బెంగాల్ గురించి మాట్లాడేవాళ్లు ఉత్తరప్రదేశ్ రావాలి. గత రెండు రోజుల్లో అక్కడ ఇద్దరు మైనర్లను కట్టేసి హత్య చేశారు. యూపీ కంటే బెంగాల్ చాలా బెటర్. బీజేపీ రెచ్చగొట్టే చర్యలను బెంగాల్ మహిళలు తిప్పికొట్టారు. వారంతా మాతోనే ఉన్నారు’అని మమత తెలిపారు. కాగా, ప్రధాని మోదీ బుధవారం కలకత్తాలో దేశంలతోనే తొలి అండర్ వాటర్ మెట్రో లైన్ ఈస్ట్ వెస్ట్ కారిడార్‌ను ప్రారంభిస్తారు. ఇదీ చదవండి.. కాసేపట్లో మళ్లీ రైతుల ఢిల్లీ ఛలో -
‘మోదీకి రెండు నిమిషాల పని..’ బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో గుండాలు, అత్యాచార నేరస్తులు అధికార పార్టీ టీఎంసీ జెండా కింద రక్షింపబడుతున్నారని బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. ‘బెంగాల్లో గుండాలు, అత్యాచారానికి పాల్పడే వ్యక్తులు ఎక్కువ అయ్యారు. వారంతా కూడా టీఎంసీ జెండా కింద రక్షణ పొందుతున్నారు. టీఎంసీ నేరస్తులను, అత్యాచార నిందితులను రెండు నెలల నుంచి కాపాడుతోంది. బీజేపీ, మీడియా నిరసనల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ... తర్వాతే ఆయన్ను టీఎంసీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీఎంసీ పార్టీ బెంగాల్ మొత్తాన్ని నాశనం చేస్తోంది. మహిళల నుంచి భూములు లాక్కుంటున్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించిన ప్రధానమంత్రి మోదీకి.. బెంగాల్లో పరిస్థితులను శాంతింప చేయటం కేవలం రెండు నిమిషాల పని’ అని ఎంపీ దిలీప్ ఘోష్ అన్నారు. #WATCH | Medinipur, West Bengal: BJP MP Dilip Ghosh says, "Goons and rapists are present in every nook and corner of the state, protected under the flag of TMC. TMC protected a criminal, a rapist for two months... After being pressured by our protests and the media, the state… pic.twitter.com/szqaLyhalp — ANI (@ANI) March 3, 2024 శనివారం బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో బెంగాల్ నుంచి మొత్తం 42 స్థానాలకు 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లను గెలుచేకున్న విషయం తెలిసిందే. ఈసారి బెంగాల్ 35 స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. -
టీఎంసీ అంటేనే అవినీతి: ప్రధాని మోదీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విమర్శలు చేశారు. బెంగాల్లో మొత్తం 42 సిట్లతో బీజేపీ విజయం సాధించాలనే లక్ష్యంతో టీఎంసీని ప్రధాని మోదీ టార్గెట్ చేశారు. ఆయన శనివారం బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ‘టీఎంసీ అంటేనే అవినీతి. ఇక్కడికి వచ్చిన ప్రజలు ఇచ్చిన విశ్వాసంతో చెబుతున్నా.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే సర్కార్ 400 స్థానాల్లో విజయం సాధింస్తుంది. టీఎంసీ అంటే దౌర్జన్యాలు, కుటుంబ రాజకీయం, దోహానికి ప్రతిరూపం. బెంగాల్ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పట్ల విసుగు చెందారు. సందేశ్‌ఖాలీ మహిళల విషయాన్ని ప్రస్తావిస్తూ... టీఎంసీ నేతలు సందేశ్‌ఖాలీ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని అన్నారు. బాధలో ఉన్న తల్లులు సోదరీమణులకు మద్దతు ఇవ్వాల్సింది పోయి టీఎంసీ ప్రభుత్వం నిందితుల పక్షాన నిలబడుతోందని మోదీ విమర్శించారు. న్యాయం కోసం సందేశ్‌ఖాలీ మహిళలు ఎంత వేడుకుంటున్నా, నిరసనలు తెలిపినా టీఎంసీ ప్రభుత్వం మాత్రం వినిపించుకోలేదని మోదీ మండిపడ్డారు. -
బిహార్‌లో కూటమిగా పోటీ.. టీఎంసీ మిత్ర పక్షమే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్‌లో కూటమి, సీఎం మమతా బెనర్జీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ఇండియా కూటమి బీజేపీపై పోరాడుతుందని తెలిపారు. బిహార్‌లో ఇండియా కూటమిలో భాగంగా బీజేపీపై పోటీ చేస్తామని అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో కీలకమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్లు తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా మంగళవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు గమనిస్తే.. ఆమె ఇండియా కుటమిలో కీలకమైన భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తుందని తెలిపారు. మమతా బెనర్జీ ఇండియా కూటమికి కీలకమైన మిత్రపక్షమని తెలిపారు. ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలిగినప్పటికీ తాము బిహార్‌లో మిగిలిన పార్టీలతో ఇండియా కూటమిలో భాగంగానే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ దిగుతామని వెల్లడించారు. తమ భాగస్వామ్య పార్టీలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగం కాదంటే.. తాను ఎప్పటికీ అంగీకరించలేనని రాహుల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీని ఒంటరిగా ఎదుర్కొంటామని.. లోక్‌సభ ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకుంటామని మమతా బెనర్జీ చెప్పటమే రాహుల్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది. బెంగాల్ మమతా కాంగ్రెస్‌కు ఐదు లోక్ సభ స్థానాలు కేటాయించడానికి సిద్ధపడినా సీపీఎంతో పొత్తు కారణం ఇది సాధ్యం పడదని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలిగిప్పటికీ.. ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల భాగస్వామ్యంతో బలంగానే ఉంది. 40 లోక్‌సభ స్థానాలు ఉన్న బిహార్‌లో ఇండియా కూటమి సాధ్యమైనన్ని సీట్లు గెలవడానికి కాంగ్రెస్ ప్రణళికలు రచిస్తోంది. -
‘దిగజారుడు వ్యాఖ్యలంటూ.. టీఎంసీ కౌంటర్’
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై చేసిన వ్యాఖ్యలకు టీఎంసీ గట్టి కౌంటర్ ఇచ్చింది. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన టీఎంసీ.. ‘తమ అధికారానికి సవాలు విసురుతున్న మహిళను బీజేపీ ఓర్చుకోలేకపోతుందని తెలిపడానికి ఇలాంటి వ్యాఖ్యలే నిదర్శం. లింగ పక్షవాతంతో కూడిన పాతకాలపు మనస్తత్వాన్ని బీజేపీ బహిరంగంగా వ్యక్త పరుస్తోంది’ అని ‘ఎక్స్’లో విరుచుకుపడింది. After PM @narendramodi's "didi o didi" catcall, Union Minister @girirajsinghbjp now joins the list of @BJP4India leaders who made degrading comments about Smt. @MamataOfficial. It's evident that the BJP leaders find it incredibly hard to fathom a woman in power challenging their… pic.twitter.com/ZCM8GehdIC — All India Trinamool Congress (@AITCofficial) December 6, 2023 కాగా, 29వ విడత కోల్‌కత్ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న సీఎం మమతా.. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, మహేష్ భట్ల కోరిక మేరకు వేదికపై కాలు కదిపారు. దీనిపై బీజేపీ కేంద్రమంత్రి గిరిరాజ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘మమతా డాన్స్ చేస్తూ.. వేడుక చేసుకుంటోంది. ఫిల్మ్ ఫెస్టివల్లో డాన్స్ చేయాల్సిన అవసరం ఏముంది’ అని విమర్శించారు. దీంతో ఆయన మాటాలు.. దిగజారుడు తనానికి ప్రతీక అని టీఎంసీ మండిపడింది. ఇదికూడా చదవండి: వారి తర్వాత.. కాంగ్రెస్‌లో బీసీ సీఎం లేరు: నిశికాంత్ దుబే -
కూటమి కెప్టెన్ దీదీ !
-
సీఎం మమతా బెనర్జీకి శ్రీలంక అధ్యక్షుడు ఆసక్తికర ప్రశ్న
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే ఆసక్తికర ప్రశ్న అడిగారు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక్కటైన ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తారా..? అని రణిల్ విక్రమసింగే దీదీని అడిగారు. అందుకు ఆమె.. చిరునవ్వుతూ ప్రజల మద్దతు ఉంటే అధికారంలోకి వస్తాం అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం మమతా బెనర్జీ దుబాయ్, స్పెయిన్ పర్యటనలో ఉన్నారు. దుబాయ్ పర్యటనలో భాగంగా ఎయిర్‌పోర్టులో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే, సీఎం మమతా బెనర్జీని కలిశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నవంబర్‌లో కలకత్తాలో జరగనున్న బిజినెస్ సమ్మిట్‌కు ఆయన్ని మమతా బెనర్జీ ఆహ్వానించారు. శ్రీలంకలో పర్యటించాలని సీఎం మమతను రణిల్ విక్రమసింగే ఆహ్వానించారు. His Excellency The President of Sri Lanka Ranil Wickremesinghe saw me at the Dubai International Airport Lounge and called me to join for some discussion. I have been humbled by his greetings and invited him to the Bengal Global Business Summit 2023 in Kolkata. HE the President… pic.twitter.com/14OgsYjZgF — Mamata Banerjee (@MamataOfficial) September 13, 2023 ఇండియా కూటమి సమన్వయ కమిటీ నేడు ఢిల్లీలో భేటీ కానుంది. కమిటీలో నేతలు ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో చర్చలు జరపనున్నారు. లోక్‌సభ సీట్ల షేరింగ్, పార్టీల మధ్య విభేదాలు, ప్రచారాలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ మీటింగ్‌కి టీఎంసీ దూరంగా ఉంది. తమ రాష్ట్రంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు సీట్లను పంచుకునే ప్రసక్తే లేదని ఇప్పటికే మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కూటమిపై శ్రీలంక అధ్యక్షుడు అడిగిన ప్రశ్న ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదీ చదవండి: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు.. -
గ్యాస్ సిలిండర్ ధర రూ.3000 అవుతుంది..!
కోల్‌కతా: జల్పైగురి జిల్లాలోని ధుప్గురి ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి గ్యాస్ ధర రూ.3000 అవుతుందని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గించడంపై స్పందిస్తూ డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీ పార్టీపైనా ప్రధాని నరేంద్ర మోదీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ ఇది రక్షాబంధన్ కానుక అంటారు.. ఏ.. రక్షాబంధన్ ఐదేళ్లకు ఒక్కసారే వచ్చిందా ఏంటి? ఎన్నికలు దగ్గర పడుతున్నందున ప్రధాని కొత్త డ్రామాకు తెర తీశారన్నారు. 2024 ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం గ్యాస్ ధర రూ.3000కు చేరుతుందని అన్నారు. అదే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మాత్రం ఒక సిలిండర్ ధర కేవలం రూ.500కే అందిస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని అన్నారు.. మీకెవరికైనా ఆ డబ్బులు వచ్చాయా అని ప్రశ్నించారు. కేంద్రం ఆ డబ్బులు ఇవ్వకపోగా ఉపాధి హామీ నిధులను నిలిపివేసిందని అన్నారు. వందరోజుల పని దినాలు పథకం కింద పని చేసిన వారికి కూడా డబ్బులు ఎగ్గొట్టారని ఆరోపణలు చేశారు. పైగా వారంతా ఇక్కడికొచ్చి బాంగ్లాదేశ్ నినాదమైన 'జోయ్ బెంగాల్' ని ఇక్కడ బెంగాల్లో నినదించి ఈ ప్రాంతాన్ని అవమానిస్తారు. సెప్టెంబర్ 5న జరగబోయే ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఘోరంగా ఓడించాలని ఈ ఓటమికి ఆ అభ్యర్థి ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా సిగ్గుపడాలని ప్రజలను అభ్యర్ధించారు. ఈ దెబ్బతో బీజేపీ పార్టీకి ప్రజల బలం ఏమిటో తెలిసి రావాలని అన్నారు. ఈ సందర్బంగా అభిషేక్ ఈ ఉపఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సీఎంతో మాట్లాడి ధుప్గురికి మూడు నెలలో సబ్ డివిజన్ హోదా కల్పిస్తామని అన్నారు. అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష నేత సువెందు అధికారి.. ముందు ఆశా వర్కర్ల జీతాలు, గ్రూపు-డి ఉద్యోగుల జీతాలు ఎందుకంత తక్కువగా ఉన్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంతో సమానంగా డీఏ చెల్లించే విషయమై ఎంతకాలం ఎదురుచూడాలని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. అభిషేక్ బెనర్జీకి రాజ్యాంగం పట్ల కొంచెం కూడా గౌరవం లేదని ఉంటే ఎన్నికల సమయంలో ఆచరణసాధ్యం కానీ హామీలు ఇచ్చేవారు కాదని విమర్శించారు. ভোট মরশুমে মানুষের মন জয় করতেই রান্নার গ্যাসের দাম ২০০ টাকা কমিয়েছে কেন্দ্রের জনবিরোধী বিজেপি সরকার। আগামী দিনে কেন্দ্রের সরকার বদলে গেলে গ্যাসের দাম কমে ৫০০ টাকা হয়ে যাবে।#TrinamooleNaboJowar #WestBengal #Jalpaiguri pic.twitter.com/eATYbLdtv8 — Trinamoole Nabo Jowar (@TMCNaboJowar) September 2, 2023 ఇది కూడా చదవండి: ఇకపై బహుభార్యత్వం నిషేధం.. డిసెంబర్లో బిల్లు -
కమ్యూనిస్టుల కంచుకోటనే కూల్చేశా.. మీరెంత?
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ యూత్ వింగ్ నిర్వహించిన ర్యాలీ సందర్బంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే నిరంకుశత్వం రాజ్యమేలుతుందని ఈ ఏడాది చివర్లోగాని వచ్చే ఏడాది ప్రారంభంలో గాని లోక్‌సభ ఎన్నికలు ఉంటాయని అధికార బీజేపీని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రత్యర్ధులు గెలుపుకోసం ఎంతటి దారుణానికైనా తెగిస్తారని.. ఇటీవల పర్గణాస్ జిల్లా 24 నార్త్‌లో బాణాసంచా కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదం లాంటి దురాగతాలకు పాల్పడటానికి కూడా వెనకడుగు వేయరని. అలాంటివారికి వారికి కొంతమంది పోలీసులు కూడా సహకరిస్తుండటం సరికాదన్నారు. చాల మంది పోలీసులు తమ పనిని తాము చిత్తశుద్ధితో చేసుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రమే దుష్టశక్తులతో చేతులు కలిపారని ఆరోపించారు. ర్యాగింగ్ నిరోధక విభాగం ఉన్నట్లే అవినీతి నిరోధక విభాగం కూడా ఉందని వారికి గుర్తు చేస్తున్నానన్నారు. కాషాయం బాణాసంచాతో ఏమి ప్రయోజనం ఉంటుంది? పచ్చ బాణాసంచాతో అయితే వాతావరణానికి కూడా మేలు కలుగుతుంది కదా అన్నారు. ఇప్పటికే కాషాయ పార్టీ ఎన్నికల కోసం తన అమ్ములపొదిలో అస్త్రాలన్నిటినీ సిద్ధం చేసిందని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే వారు దేశమంతటా మత విద్వేషాలు రెచ్చగొట్టారు. మళ్ళీ వారు అధికారంలోకి వస్తే దేశాన్ని ద్వేషపూరితంగా మార్చేస్తారు. బీజేపీ ఇతర పార్టీల వారికి అవకాశం లేకుండా ఎన్నికల కోసం మొత్తం హెలికాఫ్టర్లన్నిటినీ బుక్ చేసేశారన్నారు. ఇదే క్రమంలో ఆమె బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ని కూడా లక్ష్యం చేసుకుని ఘాటు విమర్శలు చేశారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వొద్దు. పశ్చిమ బెంగాల్లో మూడు దశాబ్దాలు రాజ్యమేలిన కమ్యూనిస్టుల కంచుకోటకు బీటలు వారేలా చేసిన ఘనత నాదని పరోక్షంగా గవర్నర్‌ని ఉద్దేశించి అన్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో 'గోలీ మారో' అంటూ నినాదాలు చేస్తున్న ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలను కటకటాలోకి నెట్టామని, మళ్ళీ లాంటి నినాదాలు చేసేవారంతా ఇది యూపీ కాదు బెంగాల్ అని గుర్తుంచుకోవాలన్నారు. ఇది కూడా చదవండి: ఆ లెక్చరర్ని ఎందుకు సస్పెండ్ చేశారు.. సుప్రీంకోర్టు -
అమిత్ షా వ్యాఖ్యలను సమర్ధించిన మమతా
న్యూఢిల్లీ: లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రెవేశ పెట్టిన సమయంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మీ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించమని, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మోదీనే అధికారంలోకి వస్తారని అన్నారు. అమిత్ షా వ్యాఖలపై స్పందిస్తూ.. అమిత్ షా చెప్పింది కరెక్టే వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో INDIA కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీలో అధికారాలపై పట్టు కోసం ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం ఎలాగైనా పార్లమెంటులో బిల్లును ఆమోదింప చేసుకోవాలన్న మొండి పట్టుదలతో ఉంది. ఈ నేపధ్యంలో గురువారం బిల్లును ప్రవేశ పెడుతూ అమిత్ షా ప్రతిపక్ష INDIA కూటమిని టర్గెట్ చేసి.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే.. మీరంతా కొత్తగా ఏర్పడిన మీ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించమంటూ వ్యాఖ్యలు చేశారు. సమావేశాల అనంతరం విపక్ష కూటమిలో ప్రధాన సభ్యురాలు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విలేఖరుల సమావేశంలో అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ అమిత్ షా చెప్పింది వాస్తవం. ఢిల్లీలోనే పార్లమెంటు ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అధికారం INDIA కూటమిదే. మాతృభూమిని కాపాడుకోవడం కోసమే INDIA కూటమి ఏర్పడిందన్నారు. NDA బలహీనమైందని అందులోని వారంతా కూటమిని విడిచిపెట్టి ఎప్పుడో వెళ్లిపోయారని అన్నారు. నిరుద్యోగ సమస్య పెరిగి దేశం మరింత దయనీయ స్థితికి చేరకుండా, మతపరమైన విద్వేషాలు చెలరేగకుండా ఉండాలంటే మా కూటమి అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. వారు దేశమంతా కాషాయమయం చేసేస్తామంటున్నారు. మాకు కూడా కాషాయమంటే ఇష్టమే... కానీ మిగతా రంగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ‘మంచి చేయడానికి పొత్తులు పెట్టుకోవాలి’ -
మమతా బెనర్జీకి తప్పిన పెను ప్రమాదం
బెంగాల్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ ఉదయం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టరును అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జల్పాయిపూర్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు మమతా బెనర్జీ. అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని బాగ్డోగ్రా ఎయిర్ పోర్టుకు వెళ్తూ బైకుంఠాపూర్ అడవులు దాటుతుండగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. దీంతో సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్ వద్ద హెలికాప్టరును ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు సిబ్బంది. ఒక్కసారిగా వర్షం ఉధృతం కావడంతో మార్గం స్పష్టంగా లేక ముందుకు వెళ్లడం ప్రమాదకరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఈ ఘటనలో మమతా బెనర్జీ స్వల్ప గాయాలతో బయటపడినట్లు చెప్పారు అధికారులు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బాగ్డోగ్రా ఎయిర్ పోర్టుకు చేరుకొని మమతా బెనర్జీ కోల్‌కతా పయనమైనట్లు తెలిపారు అధికారులు. Due to low visibility, West Bengal CM Mamata Banerjee's helicopter made an emergency landing at Sevoke Airbase. She was going to Bagdogra after addressing a public gathering at Krinti, Jalpaiguri. She is safe, says TMC leader Rajib Banerjee (file pic) pic.twitter.com/IVNIPV3oJD — ANI (@ANI) June 27, 2023 ఇది కూడా చదవండి: సెంచరీ దాటిన కిలో టమాట ధరలు.. కారణమిదే! -
బెంగాల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. కేంద్ర బలగాల మోహరింపుపై సుప్రీం ఓకే..
పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం షాక్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర బలగాలను మోహరించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఎన్నికలను నిర్వహించడమంటే.. హింసకు లైసెన్స్ ఇవ్వడం కాదని పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ)ని ధర్మాసనం తప్పుబట్టింది. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం ఎస్ఈసీ విధి అని స్పష్టం చేసింది. హింస జరిగిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ సంయుక్తంగా ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాళు చేస్తూ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఇందులో ఎలాంటి తప్పు లేదని తీర్పులో పేర్కొంది. ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు..సుప్రీంను చేరిన బెంగాల్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నామినేషన్ వేళ రాష్ట్రంలో హింస చెలరేగింది. జూన్ 9న పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా బెంగాల్ అంతటా పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. అల్లరిమూకలు బాంబులు విసిరారు. ఇందులో 9 మంది మృతి చెందారు. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, సీపీఐఎంలు అధికార టీఎంసీని విమర్శించాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులకు వ్యతిరేకంగా ప్రభుత్వమే అందోళనకారులకు మద్దతునిస్తోందని ఆరోపించారు. జులై 8న పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 75వేల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 61 వేల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. జులై 11న ఒట్ల లెక్కింపు జరగనుంది. ఇదీ చదవండి: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అల్లర్లు.. బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుని హత్య -
పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు..సుప్రీంను చేరిన బెంగాల్ ప్రభుత్వం
పశ్చిమ బెంగాల్:పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలనే కలకత్తా హైకోర్టు ఆదేశాలపై పశ్చిమ బంగాల్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) సంయుక్తంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ సమావేశమైన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. గురువారం నుంచి 48 గంటలపాటు పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టు ఎస్ఈసీని ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా అల్లర్లు చెలరేగిన జిల్లాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వం వహించిన డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అల్లర్లు చెలరేగిన జిల్లాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. 2021 కలకత్తా మున్సిపల్ ఎన్నికల్లో, 2022లో మున్సిపల్ ఎన్నికల్లో హింసాకాండ జరిగిన నేపథ్యంలో హైకోర్టు కేంద్ర బలగాలను నియమించాలని ఎస్ఈసీకి ఆదేశించింది. జూన్ 9న పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా బెంగాల్ అంతటా పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. అల్లరిమూకలు బాంబులు విసిరారు. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, సీపీఐఎంలు అధికార టీఎంసీని విమర్శించాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులకు వ్యతిరేకంగా ప్రభుత్వమే అందోళనకారులకు మద్దతునిస్తోందని ఆరోపించారు. ఇదీ చదవండి:'కాంగ్రెస్‌లో చేరడం కంటే.. బావిలో దూకి చావడం మేలు' -
అమితాబ్ వ్యాఖ్యలపై.. బీజేపీ, టీఎంసీ వాగ్యుద్ధం
కోల్‌కతా: భావప్రకటన స్వేచ్ఛపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల మంటలు రేపాయి. గురువారం కోల్‌కతాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నటుడు షారూక్ ఖాన్ సమక్షంలో అమితాబ్ మాట్లాడుతూ పౌర హక్కులు, భావప్రకటన స్వేచ్ఛపై ఇంకా ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఆ వ్యాఖ్యలు మమత నిరంకుశ ధోరణికి అద్దం పట్టేలా ఉన్నాయంటూ బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ విమర్శించారు. టీఎంసీ ఎంపీ, నటి నస్రత్ జహాన్ వాటిని ఖండించారు. బీజేపీ పాలనతో నిజంపై అన్ని రంగాల్లోనూ నిర్బంధం కొనసాగుతోందని ఆరోపించారు. ఇదీ చదవండి: కేంద్రం మొద్దు నిద్ర: రాహుల్ -
‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’.. సీజేఐకి దీదీ వినతి
కోల్‌కతా: ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే దేశం రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థను కాపాడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐకి విజ్ఞప్తి చేశారు. కోల్‌కతాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సైన్స్ కాన్వకేషన్ కార్యక్రమానికి సీజేఐ యూయూ లలిత్ హాజరైన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు మమత. ‘ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. వారు ఎవరినైనా దుర్భాషలాడగలరా? వారు ఎవరినైనా నిందించగలరా? సర్, మన గౌరవం దెబ్బతింటోంది. తీర్పు వెలువడేలోపే ఎన్నో జరిగిపోతున్నాయని చెప్పేందుకు చింతిస్తున్నాను. నేను చెప్పేది తప్పు అనుకుంటే, క్షమించండి.’అని పేర్కొన్నారు మమతా బెనర్జీ. ఎన్‌యూజేఎస్ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా అభివర్ణించారు దీదీ. ఈ సందర్భంగా సీజేఐ యూయూ లలిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: ‘తప్పుచేశా.. క్షమించండి’..గుడిలో చోరీ చేసిన సొత్తు తిరిగిచ్చిన దొంగ -
సౌరవ్ గంగూలీని ఐసీసీ ఎన్నికల్లో పోటీచేయించాలి: దీదీ
-
గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్’
కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీకి రెండోసారి అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. గంగూలీని వంచించారని, అన్యాయంగా రేసు నుంచి తప్పించారని ఆరోపించారు. దాదా బెంగాల్‌కు మాత్రమే కాదు యావత్ దేశానికి గర్వకారణమని, అత్యంత ప్రజాదరణ గల వ్యక్తి అని కొనియాడారు. టీమిండియా కెప్టెన్‌గా విశేష సేవలందించిన ఆయనకు ఇలా జరగడం తనను షాక్‌కు గురి చేసిందని మమత పేర్కొన్నారు. గంగులీ ఏం తప్పు చేశారని ఆయనను పక్కకు పెట్టారని ప్రశ్నించారు. గంగూలీ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు మమత. బీసీసీఐ పదవి ఇవ్వనప్పుడు ఆయనను ఐసీసీకి పంపితే న్యాయం చేసినట్లవుతుంది సూచించారు. అందుకే ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాదాకు అనుమతి ఇవ్వాలని కోరారు. తన విజ్ఞప్తిని ప్రతీకార రాజకీయంగా చూడొద్దని, క్రికెట్ కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, కార్యదర్శిగా జైషా రెండోసారి కొనసాగేందుకు కోర్టు అనుమతిచ్చిన విషయాన్ని మమత గుర్తు చేశారు. అమిత్‌షా కుమారుడైన జైషాను మాత్రం కొనసాగించి, గుంగూలీని తప్పించానికి కారణమేంటని ప్రశ్నించారు. ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల నామినేషన్‌కు అక్టోబర్ 20 చివరితేది. ఈ పదవికి భారత్ నుంచి ఎవరైనా పోటీ చేయాలనుకుంటే బీసీసీఐ వాళ్ల పేరును సిఫారసు చేయాల్సి ఉంటుంది. మరోవైపు బీసీసీఐ, ఐసీసీలో ఎలాంటి పదవి దక్కే సూచనలు లేకపోవడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తానని గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన స్థానంలో రోజర్ బిన్నీ పేరు దాదాపు ఖరారైంది. చదవండి: సింగిల్ బ్రాండ్ భారత్‌తో అన్ని సబ్సిడి ఎరువులు: మోదీ కొత్త స్కీం -
మమతకు మరో షాక్.. స్కూల్ జాబ్ స్కాంలో ఎమ్మెల్యే అరెస్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో టీఎంసీ ఎమ్మెల్యే మానిక్ భట్టాచర్యను మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. టీచర్స్ జాబ్ స్కాంలో భాగంగా సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన ఈడీ.. ఉదయం అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసింది. ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో భారీగా నగదు దొరికిన క్రమంలో ఆయనను అరెస్ట్ చేసింది. పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు చేపట్టింది ఈడీ. ఇప్పటికే అరెస్టైన మాజీ మంత్రి పార్థా ఛటర్జీ వాట్సాప్ చాట్‌ను పరిశీలించగా ఈ కేసులో లంచాలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే భట్టాచార్యపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ తర్వాత భట్టాచార్యను వైద్య పరీక్షల నిమిత్తం తరలించి.. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. పార్థా ఛటర్జీ అరెస్ట్ తర్వాత మానిక్ భట్టాచార్య పేరు బయటకు రావటంతో.. ఆయనను బెంగాల్ ప్రాథమిక విద్యా బోర్డు అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఇదీ చదవండి: Bengal Schools Scam: పార్థా చటర్జీకి చెందిన రూ.46 కోట్ల ఆస్తులు అటాచ్ -
అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శునకాలకున్న గౌరవం కూడా ముస్లింలకు లేదని అన్నారు. ముస్లింలను బూచిగ చూపెట్టి ఆర్ఎస్ఎస్ విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. దేశంలో ముస్లింలు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన అవసరం లేదన్నారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన అధికారాలు ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు నన్ను బీజేపీ బీ-టీమ్‌గా పిలిచిన మమతా బెనర్జీ ఇప్పుడు ఆర్ఆర్ఎస్, మోదీలను పొగుడుతున్నారని ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. చదవండి: (ఈయనగారిని ఇలాగే వదిలెయ్యకండిరా.. బీజేపీ బాబులూ!) -
కష్టం మేడం! అందరూ ప్రధాని అభ్యర్థిగా ఊహించుకుంటున్నారు!!
కష్టం మేడం! అందరూ ప్రధాని అభ్యర్థిగా ఊహించుకుంటున్నారు!! -
ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యాటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, రాష్ట్ర మాజీ మంత్రి పార్థ చటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మోదీతో భేటీ అవటంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు నాలుగు రోజుల ఢిల్లీ పర్యాటనకు వెళ్లారు మమతా బెనర్జీ. శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మూతో సైతం సమావేశం కానున్నారు. మమతా బెనర్జీ ఢిల్లీ టూర్లో ప్రధాని, రాష్ట్రపతితో భేటీ.. బెంగాల్ బీజేపీ, టీఎంసీల మధ్య కీలక అంశంగా మారింది. మమతా బెనర్జీ, ఆమె కుటుంబంపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది టీఎంసీ. ఆగస్టు 7న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవనున్నారు మమతా బెనర్జీ. నీతి ఆయోగ్ కౌన్సిల్ మీటింగ్‌కు ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయం, ఆరోగ్యం, ఆర్థిక అంశాలపై చర్చించనున్నారని సమాచారం. ఇదీ చదవండి: హస్తినలో తీవ్ర ఉద్రిక్తతలు.. పోలీసుల అదుపులో ప్రియాంక, రాహుల్ -
మమత మార్క్ రాజకీయం.. బీజేపీ మాజీ ఎంపీకి మంత్రివర్గంలో చోటు!
కోల్‌కతా: పాఠశాల నియామకాల కుంభకోణంలో అరెస్టయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బుధవారం మధ్యాహ్నం ఐదుగురు కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేశారు. అందులో బీజేపీ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియోకు చోటు కల్పించారు దీదీ. గత ఏడాదే బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు బాబుల్ సుప్రియో. బాబుల్ సుప్రియోతో పాటు స్నేహాశిష్ చక్రబర్తి, పార్థా బౌమిక్, ఉదయాన్ గుహా, ప్రదిప్ మజందెర్లు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారికి కీలక శాఖలు కేటాయించనున్నారని సమాచారం. స్నేహాశిష్ చక్రబర్తి ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. హూగ్లీ జిల్లాలో ఇంఛార్జ్‌గా సేవలందిస్తున్నారు. పార్థా బౌమిక్ మూడు సార్లు నైహాతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉదయాన్ గుహా ఫార్వర్డ్ బ్లాక్ నేత, 2016లో టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. పార్థా ఛటర్జీ అరెస్ట్ నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు మమతా బెనర్జీ. ఆయన నిర్వహించిన పారిశ్రామిక, వాణిజ్య, పార్లమెంటరీ వ్యవహారాల వంటి ఐదు కీలక శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణపై మంగళవారం ప్రకటన చేసిన దీదీ.. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 23 నుంచి 30కి పెంచుతున్నట్లు తెలిపారు. సుబ్రతా ముఖర్జీ, సధన్ పాండేలను కోల్పోయామని, పార్థా చటర్జీ జైలుకు వెళ్లిన క్రమంలో వారికి సంబంధించిన శాఖలను తాను మోయలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Gujarat Elections 2022: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి ఇద్దరు కీలక నేతలు! -
విపక్షాలకు మమత షాక్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు టీఎంసీ దూరం
కోల్‌కతా: ఉపరాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో విపక్షాలకు షాక్ ఇచ్చారు పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌కు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండనుందని బాంబు పేల్చారు. ఈ ఓటింగ్‌కు తమ పార్టీ సభ్యులు గైర్హాజరవుతారని ప్రకటించింది టీఎంసీ. ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయటంలో ఇతర విపక్షాల వైఖరే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. అదే సమయంలో.. టీఎంసీతో సంబంధం లేకుండా విపక్షాలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించిన తీరు అభ్యంతరకరం. విపక్షాల అభ్యర్థికీ మేము మద్దతు ఇవ్వం. అందుకే ఓటింగ్‌కు మా పార్టీ సభ్యులు దూరంగా ఉంటారు.’ అని స్పష్టం చేశారు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున జగదీప్ ధన్‌ఖడ్ పోటీ చేస్తున్నారు. బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన ఆయన.. అనేక విషయాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో తీవ్రంగా విభేదించారు. మరోవైపు.. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వాను బరిలోకి దింపాయి కాంగ్రెస్, ఎన్సీపీ సహా ఇతర పార్టీలు. శివసేన, జేఎంఎం వంటి పార్టీలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు మద్దతు తెలపటమూ టీఎంసీ ఓటింగ్‌కు దూరంగా ఉండేందుకు కారణంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. ఇటీవలే గవర్నర్ దగదీప్ ధన్‌ఖడ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలతో మమతా బెనర్జీ భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆగస్టు 6న ఓటింగ్.. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ఆగస్టు 6న జరగనుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేసేందుకు అర్హులే. ఇదీ చదవండి: Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి -
'ముఖ్యమంత్రిని ఆహ్వానించేది ఇలాగేనా?'.. బీజేపీపై టీఎంసీ ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం చేశారు. ప్రారంభానికి ఒక రోజు ముందుగా బెంగాల్ ముఖ్యమంత్రి, గవర్నర్, మేయర్లకు ఆహ్వానాలు పంపారు. అయితే.. మెట్రో స్టేషన్ ఆహ్వానంపై అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ).. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించే విధానం ఇదేనా అంటూ ప్రశ్నించింది. "ఆదివారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి ఇంట్లో ఆహ్వానం పడేసి వెళ్లారు. ముఖ్యమంత్రిని ఆహ్వానించే విధానం ఇలాగేనా?. రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ ఈ మెట్రో ప్రాజెక్టును మంజూరు చేశారు. దీని కోసం రూ.2 లక్షల కోట్లు కేటాయించారు. అలాంటి వ్యక్తిని మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు." అని ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్. మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవటంపై కోల్‌కతా రైల్ కార్పోరేషన్లో వివాదం చెలరేగింది. అది జరిగిన రెండో రోజు ఆహ్వానాన్ని సీఎం ఇంటికి పంపించినట్లు తెలిసింది. జులై 11న కేంద్ర మంత్రి స్మృతి ఇరాని మెట్రో స్టేషన్‌ను ప్రారంభిస్తారని కోల్‌కతా రైల్ కార్పోరేషన్ గత శనివారం ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత మమతా బెనర్జీని ఆహ్వానించకుండా కేంద్రం రాజకీయలు చేస్తోందని ఆరోపించింది టీఎంసీ. సీల్దా మెట్రో స్టేషన్ ఎదుట సోమవారం నిరసనలు చేపట్టాలని ముందుగా నిర్ణయించినా.. ఆ తర్వాత వెనక్కి తీసుకుంది టీఎంసీ. ఇదీ చదవండి: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలోమీటర్లు నడిచి 'హజ్' యాత్ర -
తృణమూల్‌లో కాంగ్రెస్ విలీనం కావాల్సిందే: మమతా బెనర్జీ
-
భారత ఫుట్ బాల్ దిగ్గజం సురజిత్ కన్నుమూత
భారత దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు సురజిత్ సేన్ గుప్తా(71) కన్నుమూశారు. కోల్‌కతా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందూతూ ఆయన గురువారం తుది శ్వాస విడిచారు. కాగా కరోనా బారిన పడిన సురజిత్ జనవరి 23న ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్ సాయంతో గత కొన్ని రోజులుగా ఆయనకు చికిత్స అందించారు. కాగా సురజిత్ సేన్ గుప్తా భారత ఫుట్ బాల్ జట్టు కు మిడ్ ఫిల్డర్ గా సేవలు అందించారు. 1970 ఆసియా గేమ్స్ లో భారత్ కాస్య పతకం సాధించడంలో సురజిత్ సేన్ గుప్తా కీలక పాత్ర పోషించారు. సురజిత్ సేన్ గుప్తా మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: 13 బంతుల్లో సునామీ ఇన్నింగ్స్... బంతితోను బ్యాటర్లకు చుక్కలు.. సీఎస్కే ఫ్యాన్స్‌కు ఇక..! -
జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన మమతా బెనర్జీ
-
పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు కీలకనేతలు కీర్తి ఆజాద్, అశోక్ తన్వార్లు .. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. కాగా, అశోక్ తన్వార్ గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా సేవలందించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా, కీర్తి ఆజాద్.. 1983లో జరిగిన ప్రపంచకప్ క్రికెట్లో ఆజాద్ ఒక సభ్యుడు. కీర్తి ఆజాద్ 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో కీర్తి ఆజాద్.. అరుణ్‌జైట్లీపై చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా, ఆజాద్ బిహార్‌లోని దర్భంగా నియోజక వర్గం నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. అదే విధంగా.. మాజీ జెడీయూ నేత పవన్ వర్మా.. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో టీఎంసీలో చేరారు. -
మూడు రోజుల పర్యటనలో ఒకే కోరిక కోరిన మమతా
-
బెంగాల్: మండలి ఏర్పాటు తీర్మానానికి శాసనసభ ఆమోదం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ శాసనసభ కీలక తీర్మానం చేసింది. రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు తీర్మానానికి బెంగాల్ శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. శాసన సభ సమావేశంలో భాగంగా మండలి ఏర్పాటు తీర్మానానికి 196 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. 69 మంది ఎమ్మెల్యేలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఇక బెంగాల్లో 1952లో శాసన మండలిని ఏర్పాటు చేశారు. అయితే 1969లో లెఫ్ట్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేసింది. ఇక ఇటీవల జరిగిన రాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తృణముళ్ కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే.. శాసన మండలి ఏర్పాటు చేస్తామని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో ఆరు రాష్ట్రాల్లో( బిహార్, యూపీ, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, కర్ణాటక) శాసన మండలి అమలులో ఉంది. ఇక మండలి ఏర్పాటు తీర్మానానికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. శాసన మండలి ఏర్పాటు తీర్మానాన్ని ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారీ తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలో 23 రాష్ట్రాల్లో విధాన పరిషత్ లేదని, కొంతమంది టీఎంసీ నాయకులు మండలిలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అందుకోసమే మండలి ఏర్పాటుకు తీర్మానం చేశారని తెలిపారు. -
విద్యార్ధులకు క్రెడిట్ కార్డులు.. రూ.10 లక్షల వరకు పరిమితి
కోల్‌కతా: విద్యార్థులకు రుణసాదుపాయం కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్టూడెంట్ క్రెడిట్ కార్డ్’ పథకాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రారంభించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దీదీ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇదొక అద్భుత పథకమని ఈ సందర్భంగా మమత తెలిపారు. స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా 4 శాతం వార్షిక సాధారణ వడ్డీతో 10 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చునని చెప్పారు. పదేళ్లుగా బెంగాల్ లో నివసించే విద్యార్థులు (గరిష్ఠ వయసు 40 ఏళ్లు) ఈ కార్డు పొందేందుకు అర్హులని మమత తెలిపారు. అండర్ గ్రాడ్యేయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, వైద్య విద్య చదివేవారికి ఈ కార్డు ద్వారా రుణం లభిస్తుందని చెప్పారు. దేశ, విదేశాల్లో చదువుకునేందుకు విద్యార్థులకు ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్, మెడికల్, లా, ఐఎఎస్, ఐపిఎస్, ఇతరు పోటీ పరీక్షలకు కోచింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు కూడా ఈ పథకం కింద రుణం పొందవచ్చన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ లేదా రాష్ట్ర సహకార బ్యాంకుల నుంచి ఈ ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చన్నారు. తీసుకున్న రుణాన్ని 15 సంవత్సరాల్లోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సకాలంలో వడ్డీని పూర్తిగా చెల్లిస్తే రుణగ్రహీతలకు ఒక శాతం వడ్డీ రాయితీ ఇస్తామని ఆమె తెలిపారు. కాగా, దేశంలో స్టూడెంట్ క్రెడిట్ కార్డులు తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. చదవండి: శశికళపై మరో కేసు నమోదు.. -
థర్డ్ ఫ్రంట్ బీజేపీని ఓడించలేదు: ప్రశాంత్ కిషోర్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే దిశగా అడుగులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పక్షాలను ఏకం చేసేందుకు కసరత్తు జరుగుతోందన్న వాదనలకు ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రోద్బలంతో 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు వ్యూహ రచన జరుగుతోందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ను దూరంగా పెడుతూ... మిగతా విపక్షాలతో మూడోకూటమిని ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. టార్గెట్ 2024! ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో 10 రోజుల వ్యవధిలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండోసారి భేటీ అయ్యారు. దీంతో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో జోరందుకున్నాయి. అయితే సోమవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం రొటీన్‌గానే జరిగిందని ప్రశాంత్ కిషోర్ భేటీ అనంతరం తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇతర రాజకీయ పక్షాలను ఏకం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. 15 రాజకీయ పక్షాలకు ఆహ్వానాలు ప్రశాంత్ కిషోర్‌తో భేటీ తర్వాత శరద్ పవార్ మంగళవారం పలువురు విపక్ష పార్టీల నేతలు, ప్రముఖ వ్యక్తులతో సమావేశం కానున్నారు. ఢిల్లీలోని పవార్ నివాసంలో మంగళవారం కీలక భేటీ జరుగనుంది. కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా ఆధ్వర్యంలోని రాష్ట్రీయ మంచ్ తరపున 15 రాజకీయ పక్షాలకు, సమాజంలోని కీలక వ్యక్తులకు ఈ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆర్థిక అంశాలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై పోరుతో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన ప్రణాళికలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో శరద్ పవార్‌తో పాటు ఫరూక్ అబ్లుల్లా, యశ్వంత్ సిన్హా, పవన్ వర్మ, సంజయ్ సింగ్, డి.రాజా, జస్టిస్ ఏపీ సింగ్, జావేద్ అక్తర్, కేటీఎస్ తులసి, కరణ్ థాపర్, అశుతోష్, న్యాయవాది మజీద్ మెమొన్, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌వై ఖురేషీ, కేసీ సింగ్, సంజయ్ ఝా, సుదీంధ్ర కులకర్ణి, ఆర్థికవేత్త అరుణ్ కుమార్, ఘన్‌శ్యామ్ తివారీ, సహా పలువురు పాల్గొంటారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. నాకు సంబంధం లేదు: ప్రశాంత్ కిశోర్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమి ఏర్పాటుతో తనకెలాంటి సంబంధం లేదని ప్రశాంత్ కిషోర్ ఎన్డీటీవీతో అన్నారు. ‘మూడో ఫ్రంట్... నాలుగో ఫ్రంట్లను నేను విశ్వసించను. థర్డ్ ఫ్రంట్ బీజేపీ ఓడిస్తుందనే నమ్మకం నాకు లేదు’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఇంతకుమించి మాట్లాడలేదు. చదవండి: పీకేతో పవార్ భేటీ.. మిషన్ 2024 -
West Bengal: మమతా బెనర్జీ అల్లుడికి అందలం
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో కీలక పదవి లభించింది. టీఎంసీ పార్టీ జాతీయ కార్యదర్శిగా అభిషేక్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు పార్టీ అధినేత్రి మమత బెనర్జీ. టీఎంసీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ ప్రకటించింది. ఒకరికి ఒకే పదవి ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని వర్కింగ్ కమిటీ సమావేశంలో మమత నిర్ణయించినట్టు ఆ పార్టీ నేత పార్థ చటర్జీ తెలిపారు. దీని ప్రకారం అభిషేక్ బెనర్జీని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను సుబ్రతా బక్షి నిర్వహిస్తున్నారు. పార్టీ యువజన విభాగం బాధ్యతలను సయోని ఘోష్‌కి అప్పగించారు. విమర్శలకు వెరవక విమర్శలకు ఘాటైన సమాధానం చెప్పడంలో మమత బెనర్జీతి ప్రత్యేక శైలి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు అభిషేక్ బెనర్జీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ముఖ్యంగా సువేందు అధికారి అభిషేక్‌ను అవినీతికి అడ్రస్‌గా పేర్కొన్నారు. అయితే ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మమత తన అల్లుడికి కీలక బాధ్యతలు అప్పగించింది. -
మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం
-
నందిగ్రామ్ ఫలితంపై కోర్టును ఆశ్రయిస్తా: దీదీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం మమతా బెనర్జీ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. విజయం అనంతరం దీదీ హింసాత్మక చర్యలకు దిగారంటూ.. బీజేపీ చేస్తోన్న ఆరోపణలని ఆమె ఖండించారు. కాషాయపార్టీ ప్రచారం చేస్తోన్న ఫోటోలు పాతవన్నారు. నందిగ్రామ్ ఫలితంపై దీదీ స్పందించారు. కౌంటింగ్‌లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించిన దీదీ.. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. జర్నలిస్ట్‌లను కోవిడ్ వారియర్స్‌గా ప్రకటించారు దీదీ. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. ‘‘మనం విజయం సాధించాం. ఇది బెంగాల్ ప్రజల విజయం. అయితే జనాలకు నాదొక విన్నపం. మనం శాంతియుతంగా ఉందాం. ఎన్నికల వేళ బీజేపీ, కేంద్ర బలగాలు మనలను చాలా ఇబ్బందులకు గురి చేశాయి. కానీ ఇప్పటికి కూడా మనం హింసకు పాల్పడవద్దు. మీరు ప్రశాంతంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే, పోలీసులకు నివేదించండి. వారిలో కొందరు బీజేపీ కోసం పనిచేసి ఉండవచ్చు. దాని గురించి తర్వాత ఆలోచిస్తాను. ఈ రోజు రాత్రి 7 గంటలకు గవర్నర్‌ను కలవనున్నాను’’ అన్నారు దీదీ. నందిగ్రామ్ ఓట్ల లెక్కింపుపై దీదీ సందేహాలు వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘4 గంటలపాటు సర్వర్‌లో సమస్య ఉందని ఈసీ చెప్పింది. నేను గెలిచినట్లు తెలిసి గవర్నర్ అభినందనలు కూడా తెలిపారు.రీకౌంటింగ్‌కు అనుమతి ఇవ్వొద్దని ఆర్వోను బెదిరించారు. రీ కౌంటింగ్ నిర్వహిస్తే ప్రాణాపాయం ఉందని ఆర్వో అన్నట్లు తెలిసింది.ఆర్వో రాసిన లేఖ విషయం ఒకరు నాకు ఎస్ఎంఎస్ పంపారు. అండతోనే సువేంద్ గెలిచారు’’ అని మమత ఆరోపించారు. చదవండి: గెలవలేదుకానీ.. గణనీయంగా పుంజుకున్న బీజేపీ -
దీదీకి అభినందనలు తెలిపిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం దిశగా పయనిస్తోంది. ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్‌లో మమతా బెనర్జీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక బెంగాల్లో టీఎంసీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ దీదీకి అభినంధనలు తెలిపారు. బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహాయ, సహకారాలు ఉంటాయన్నారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ బాగా బలం పుంజుకుంది అన్నారు మోదీ. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తదితరులు దీదీకి అభినందనలు తెలిపారు. చదవండి: దీదీ నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్: మోదీ -
బెంగాల్ ప్రజలు ఆదేశిస్తే రాజీనామాకు సై: అమిత్ షా
బసీర్హట్/శాంతిపూర్: పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆదేశిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని, మే 2న సీఎం మమతా బెనర్జీ గద్దె దిగడం తథ్యమని పునరుద్ఘాటించారు. కూచ్‌బెహార్ జిల్లాలో సీఐఎస్ఎఫ్ కాల్పులకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అమిత్ షా ప్రతిస్పందించారు. ఆయన ఆదివారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసీర్‌హట్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘‘నేను రాజీనామా చేయాలని దీదీ అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆదేశిస్తే రాజీనామా పత్రాలు వెంటనే సమర్పిస్తా. శిరస్సు వంచి పదవి నుంచి తప్పుకుంటా. మే 2న మమతా బెనర్జీ కచ్చితంగా గద్దె దిగాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. బెంగాల్లోకి అక్రమంగా వలస వచ్చిన వారిని బుజ్జగించేందుకు దీదీ ప్రయత్నిస్తున్నారని, అందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. అక్రమ వలసదారులు ఒకవైపు ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం పొందుతూ మరోవైపు సమాజంలో అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులకు వత్తాసు పలుకుతున్నవారికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే అక్రమ వలసలను అరికడతామన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్ అసెంబ్లీలో గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటామన్నారు. ‘ముఖ్యమంత్రి కాందీశీకుల సంక్షేమ నిధి’ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాందీశీకులకు ఒక్కొక్కరికి ప్రతిఏటా రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు. మమత రెచ్చగొట్టడం వల్లే కాల్పులు కేంద్ర భద్రతా బలగాలపై తిరగబడాలని మమతా బెనర్జీ ప్రజలను రెచ్చగొట్టారని, అందుకే కూచ్‌బెహార్ జిల్లాలో కాల్పులు జరిగాయని అమిత్ షా ఆరోపించారు. మరణాల విషయంలోనూ ఆమె బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన ఆదివారం నాడియా జిల్లాలోని శాంతిపూర్‌లో రోడ్ షోలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. మమతా బెనర్జీ రెచ్చగొట్టడం వల్ల ప్రజలు సీఐఎస్ఎఫ్ జవాన్లపై దాడికి దిగారని, ఆత్మరక్షణ కోసం జవాన్లు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. కూచ్‌బెహార్ జిల్లాలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో ఆనంద బర్మన్ అనే బీజేపీ కార్యకర్త చనిపోయాడని అన్నారు. అతడి మృతి పట్ల మమత సంతాపం తెలపడం లేదని తప్పుపట్టారు. అతడు తృణమూల్ కాంగ్రెస్‌ను వ్యతిరేకించే రాజ్బోంగ్శీ వర్గానికి చెందినవాడు కావడమే ఇందుకు కారణమని అమిత్ షా పేర్కొన్నారు. చదవండి: దీదీ ఆటలు సాగవు.. గద్దె దిగక తప్పదు -
గ్రేట్ ఇండియన్ ‘దేజా వూ’
పరిణామాలు కొన్ని వింతగొలుపుతున్నవి. చరిత్ర పునరావృత మవుతున్నట్టుగా తోస్తున్నది. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ గతంలోనే చూసినట్టు తోచే మానసిక స్థితిని దేజా వూ అంటారు. ఇప్పుడు మస్తిష్కం నిండా దేజా వూ! అమెరికా సప్తమ నౌకా దళానికి (సెవెంత్ ఫ్లీట్) చెందిన యుద్ధనౌక ఒకటి శుక్రవారం నాడు భారత పొలిమేరల్లోకి వచ్చింది. అది కూడా స్నేహపూర్వ కంగా కాదు. ఆ నౌకాదళం విడుదల చేసిన ప్రకటన చూస్తుంటే దాని ధోరణి భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తున్నట్టు గానే ఉన్నది. ఏ దేశానికైనా తీరం నుంచి రెండొందల నాటికల్ మైళ్ల దూరం వరకు ప్రత్యేక వాణిజ్య హక్కులుంటాయి. ఆ పరిధి దాటి లోపలికి రావాలంటే అనుమతి అవసరం. ఇది 1976 నాటి మారిటైమ్ చట్టం ప్రకారం దేశాలకు దఖలుపడ్డ ప్రత్యేక హక్కు. ఇప్పుడా హక్కును అమెరికా సెవెంత్ ఫ్లీట్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించింది. మార్కెట్లో వ్యాపారుల దగ్గర మామూళ్లకోసం ముందుగా ఓ ఆకు రౌడీ వస్తాడు. మాట వినకపోతే ఆ వెనుక చాకురౌడీ వస్తాడు. గడిచిన ఏడున్నర దశాబ్దాలుగా సెవెంత్ ఫ్లీట్ ఈ చాకు రౌడీ పాత్రను పోషిస్తున్నది. ఫిలిప్పీన్స్, కొరియా, వియత్నాంల నుంచి పడమట పర్షియన్ గల్ఫ్ వరకు పలుచోట్ల సప్తమ నౌకాదళం యుద్ధనౌకలు గతంలో లంగరేశాయి. ఎక్కడ లంగరు వేసినా సరే, అక్కడ ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టుగా ఎర్ర బారుతుంది. సూర్యుడు నెత్తురు కక్కుతున్నట్టుగా కనిపిస్తాడు. ఒక్క మాటలో సెవెంత్ ఫ్లీట్ వృత్తాంతం మొత్తం ఇదే. భారత్‌పై సెవెంత్ ఫ్లీట్ తాజా కవ్వింపు యాభయ్యేళ్ల కిందటి సంగతిని గుర్తు చేస్తున్నది. భారత్–పాక్‌ల మధ్య బంగ్లా యుద్ధంలో జరుగుతున్న రోజుల్లో కూడా సెవెంత్ ఫ్లీట్ బంగాళాఖాతంలోకి ప్రవేశించి, బెదిరించే ప్రయత్నం చేసింది. కానీ, అప్పటికే భారత్–రష్యాల మధ్య సైనిక సహకార ఒప్పందం ఉన్న కారణంగా అమెరికా ప్రయత్నం ఫలించలేదు. అప్పుడు పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్) ప్రజలను పాక్ సైనిక పాలకులు రెండోశ్రేణి పౌరులుగా చులకన చూసేవారు. బెంగాలీ సంస్కృతిని చిన్న చూపు చూసేవారు. ఈ వైఖరిపై బెంగాలీ ప్రజల నిరసన జాతీ యోద్యమం రూపుదాల్చింది. ఉద్యమంపై పాక్ పాలకులు ఉక్కుపాదం మోపారు. లక్షల సంఖ్యలో తూర్పు బెంగాలీలు పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లోకి ప్రవేశించారు. అంది వచ్చిన అవకాశాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ చాకచక్యంగా ఉపయోగించుకున్నారు. పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారకులయ్యారు. అప్పటినుంచి ఆమె ప్రభ మధ్యందిన మార్తాండ తేజంతో వెలిగిపోయింది. నాటి జన సంఘ్ నాయకుడు వాజ్‌పేయి సైతం ఆమెను అపర కాళికా దేవిగా కొనియాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత బారువా ఒకడుగు ముందుకువేసి ఇందిర ఈజ్ ఇండియా–ఇండియా ఈజ్ ఇందిర’ అనే నినాదాన్ని ప్రచారంలో పెట్టాడు. బంగ్లా యుద్ధం భారత రాజకీయాలను మలుపు తిప్పింది. ఏకధ్రువ రాజకీయ వ్యవస్థకు తోడుగా, ఏకవ్యక్తి నియంతృత్వ పాలన కాంక్ష కూడా ఇందిరలో ప్రబలింది. ఇది ఎమర్జెన్సీకి దారి తీసింది. చివరకు ఇందిరమ్మ సర్కార్ ఎన్నికల్లో కుప్పకూలింది. ఇప్పుడు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్ని కలకూ భారత పొలిమేరల్లోకి వచ్చిన అమెరికా సెవెంత్ ఫ్లీట్ యుద్ధ నౌకకూ ఎటువంటి సంబంధం లేదు. ఆ నౌక బంగాళా ఖాతంలోకి కూడా రాలేదు. అరేబియా సముద్రంలో లక్షద్వీప సముదాయానికి చేరువగా వచ్చింది. కాకపోతే బెంగాల్ ఎన్నికల ఫలితాలకు మాత్రం భారత రాజకీయాలను మలుపుతిప్పే సామర్థ్యం ఉన్నది. ఒకవేళ నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ బెంగాల్లో గెలిస్తే అశోకుడు కళింగ యుద్ధం గెలిచినట్టే. ఆర్యావర్తమంతటా కాషాయ ధ్వజారోహణం జరిగినట్టే. మిగిలి పోయే కొన్ని దక్షిణాది రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీల పొత్తులతో నెట్టుకురావల్సిందేనన్న అవగాహన ఆ పార్టీకి ఉన్నది. యుద్ధాల అవసరం పూర్తయిన తర్వాత అశోకుడు శేషజీవితాన్ని ధర్మ ప్రచారానికి వెచ్చించాడు. బెంగాల్ సవాల్‌ను బీజేపీ విజయ వంతంగా అధిగమించగలిగితే ఇక దేశంలో ఏకధ్రువ రాజకీ యాలు పునరావృతమవుతాయి. ఆరెస్సెస్ భావజాల వ్యాప్తికి మార్గం సుగమమవుతుంది. 1952 నుంచి 89 వరకు కాంగ్రెస్ నాయకత్వంలో ఏకధ్రువ రాజకీయ వ్యవస్థ కొనసాగింది. 1967లో తొమ్మిది రాష్ట్రాల్లో, 1977లో కేంద్ర స్థాయిలో కంగు తిన్నప్పటికీ 89 వరకు ఈ వ్యవస్థ నిలబడగలిగింది. అప్పటి నుంచీ పదేళ్లపాటు దేశ రాజకీయాలది ప్రయోగశీల దశ. 1999 నుంచి 2019 వరకు రెండు కూటముల ద్వయీ ధ్రువ రాజకీయాలు నడిచాయి. బెంగాల్లో గెలిస్తే మరోసారి ఏకధ్రువ వ్యవస్థకు పునాది పడుతుంది. ఈ పరిస్థితి మరోసారి నియంతృత్వ పోకడలకు దారితీసే అవకాశాలు లేకపోలేదు. ఇందిరాగాంధీలో పొడసూపిన నియంతృత్వ పోక డలు ఆమె వ్యక్తిగత స్థాయికే పరిమితం. కానీ ఇప్పుడు నడిచేది నరేంద్రమోదీ అయినా, నడిపించేది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీని నియంత్రించేది సుసంఘటితమైన ఆర్ఎస్ఎస్. ఎదురు లేని అధికారం ఒకవేళ ఇప్పుడు నియంతృత్వ పోకడలకు బాటలు వేస్తే ఆ నియంతృత్వం వ్యవస్థీకృతంగా ఉంటుంది తప్ప వ్యక్తిగతం కాబోదు. సిద్ధాంతాలు, విధానాలు, ఆలోచనలు, ఆశయాలు, రాజకీ యాలన్నింటిలోనూ కాంగ్రెస్‌కు బీజేపీ భిన్నమైన పార్టీ. కానీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయ వలసిన అవసరం ఉంటుంది కనుక సంఘ్ భావజాలాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసే అవకాశం బీజేపీ ప్రభుత్వానికి కుదరడం లేదు. ఏకధ్రువ రాజకీయ వ్యవస్థ కుదురుకుంటే రాజ్యాంగంలో అవసరమైన సవరణలకు బీజేపీ వెనుకాడక పోవచ్చు. బలమైన కేంద్రం దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తుంది. అందుకోసం రాష్ట్రాల అధికారాలను కత్తిరించే ప్రయత్నం చేస్తుంది. జాతీయ స్థాయిలో ప్రతిపక్షం నిర్వీర్యమైన నేపథ్యంలో పార్టీకి ముప్పు ముంచుకొచ్చే అవకాశం ప్రాంతీయ పార్టీల నుంచే గనక బలమైన రాష్ట్రాల ఉనికి రాజకీయంగా కూడా బీజేపీకి సమ్మతం కాదు. బెంగాల్ ఎన్నికల్లో గెలిస్తే ఈ దిశలో బీజేపీ ప్రయాణం వేగం పుంజుకుంటుంది. ఓడితే వేగం తగ్గుతుంది. మమతా బెనర్జీకి మాత్రం బెంగాల్ ఎన్నికలు జీవన్మరణ సమస్య. గెలిస్తే ఆమెకు జాతీయస్థాయిలో ప్రముఖ పాత్ర లభిస్తుంది. ఓడిపోతే పార్టీ మనుగడే కష్టం. ప్రభుత్వం, పోలీ సుల తోడ్పాటుతో చెలరేగడం తప్ప సంస్థాగతంగా తృణమూల్ కాంగ్రెస్‌కు అంత బలమైన పునాదులేమీ లేవు. పైగా ప్రతి పక్షాలపై విరుచుకుపడటం, దాడులు, దౌర్జన్యాలు చేయడం పశ్చిమ బెంగాల్ రాజకీయ సంస్కృతిలో భాగంగా మారాయి. నిర్మాణపరంగా బలమైన సీపీఎం, కాంగ్రెస్ పార్టీలే హింసా రాజకీయాల ధాటికి అల్లాడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ప్రతిపక్షంగా నిలదొక్కుకోవడం మమతకు శక్తికి మించిన కార్యంగా మారుతుంది. ఇప్పుడు గెలవడమే ఆమె పార్టీ మనుగడకు ఏకైక మార్గం. బెంగాల్లో ఏ ప్రాంతానికి వెళ్లినా ‘పరివర్తన్’ (మార్పు) అనే మాట బాగా వినపడుతున్నదని రాష్ట్రంలో పర్యటిస్తున్న వారు చెబుతున్నారు. పదేళ్ల కిందటి ఎన్నికలప్పుడు మొదటిసారిగా మమతా బెనర్జీయే ఈ మాటను ఉపయోగిం చారు. అప్పుడు జనంలో ఈ మాట మంత్రంలా మార్మోగింది. ఎన్నికల్లో నిజంగానే పరివర్తన జరిగింది. 34 ఏళ్లపాటు ఏకధాటిగా పాలించిన సీపీఎం కూటమి సర్కార్ కుప్పకూలింది. ఈసారి ఈ మాటను మోదీ ఉపయోగిస్తున్నారు. అసలు పరివ ర్తన్ (నిజమైన మార్పు) కావాలని ఆయన జనానికి చెబుతు న్నారు. జనంలోకి ఈసారి కూడా ఈ మాట బాగానే వెళ్లినట్టు కనిపిస్తున్నది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా బెనర్జీ చుట్టూ ఉన్న కోటరీలో అవినీతి ప్రబలిందనీ, వారు చేసే అరాచకాలు పెచ్చరిల్లాయని జనంలో ఒక అభి ప్రాయం ఏర్పడింది. దీనికితోడు బీజేపీ అమలుచేసిన సోషల్ ఇంజనీరింగ్ కూడా ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంపాటు బెంగాల్ రాజకీయాలపై ఆధిపత్యం చలాయించిన కమ్యూనిస్టులు కులం సమస్యను గుర్తించలేదు. వెనుకబడిన కులాల అస్తిత్వ సమస్యలను, వాటి ఆకాంక్షలను అంచనావేయలేకపోయారు. మండల్ ఆందోళన దేశాన్ని కుది పేస్తున్న రోజుల్లో కొందరు జాతీయ మీడియా ప్రతినిధులు అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసును ఈ అంశంపై ప్రశ్నించారు. అందుకాయన బదులిస్తూ ‘మా రాష్ట్రంలో రెండే కులాలున్నాయి. ఒకటి పేదల కులం, రెండు ధనికుల కులం’ అన్నారు. అదీ, కుల సమస్యపై కమ్యూనిస్టుల అవగాహన. సమాజంలో క్రీమీలేయర్‌గా చలామణి అయ్యే చదువుకున్న వారు, ఉన్నత–మధ్యతరగతి వర్గం ప్రజలను బెంగాల్లో భద్ర లోక్ అంటారు. కమ్యూనిస్టుల నాయకత్వ శ్రేణుల్లో కూడా ఈ భద్రలోక్ బృందమే ఎక్కువగా ఉండేది. వాళ్లలో అత్యధికులు సహజంగానే ఉన్నత కులాలకు చెందినవాళ్లే ఉండేవారు. రైతులు, వ్యవసాయ – పారిశ్రామిక కార్మికులుగా ఉండే తక్కువ కులాలవారు భద్రలోక్ నాయకత్వంలో కమ్యూనిస్టు అనుబంధ సంఘాల్లో సంఘటితమై ఉండేవారు. కానీ, నాయకత్వ శ్రేణు ల్లోకి పెద్దసంఖ్యలో చేరుకోలేకపోయేవారు. జ్యోతిబసు ముఖ్య మంత్రిగా 1978లో ప్రారంభించిన ఆపరేషన్ బర్గా (భూసంస్క రణలు) దేశంలో ఎక్కడా లేనంత పటిష్టంగా అమలైన కార ణంగా పదిహేను లక్షలమందికి కొత్తగా సేద్యపు భూమి దక్కింది. ఈ రైతులందరూ వారి జీవితకాలం పాటు ఎర్రజెండా నీడలోనే ఉండిపోయారు. కానీ తరువాతి తరం ఆకాంక్షలను గుర్తించడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. అలాగే పారిశ్రా మిక కార్మికులందరూ వామపక్ష కార్మిక సంఘాల్లో సభ్యులుగా ఉండేవాళ్లు. కనుక బెంగాల్ రాజకీయాల్లో కులం అనేది నిన్నమొన్నటివరకు ఒక సమస్యగా ముందుకు రాలేదు. కమ్యూ నిస్టుల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ రాజకీయ– సామాజిక పొందికపై పెద్దగా దృష్టిపెట్టలేదు. గడిచిన రెండు మూడేళ్లుగా భారతీయ జనతా పార్టీ బెంగాల్ సామాజిక సమీకరణాలపై బాగా దృష్టిపెట్టింది. వెనుకబడిన శూద్ర కులాల్లో, దళితుల్లో గిరిజనుల్లో ఉండే అస్తిత్వ ఆరాటాన్ని పసిగట్టి వాళ్లను నాయకత్వ శ్రేణుల్లోకి తీసుకొచ్చింది. మరోపక్క భద్రలోక్ వర్గాన్ని కూడా జాతీయవాద భావ జాలంతో ఆకర్షించగలిగింది. బీజేపీ చాపకింద నీరులా చేపట్టిన ఈ సోషల్ ఇంజనీరింగ్‌ను తృణమూల్ కాంగ్రెస్ ఆలస్యంగా గుర్తించింది. దాంతో బెంగాల్ సంస్కృతిని హుటాహుటిన రంగంలోకి దించారు. బెంగాల్ సంస్కృతిపై మోదీ యుద్ధం చేస్తున్నారని మమత ప్రచారాన్ని ఎత్తుకున్నారు. అయితే బెంగాల్ సంస్కృతిగా మనం పరిగణించేది ప్రధానంగా అక్కడి భద్రలోక్ సంస్కృతి. ఈ సంస్కృతి వలయానికి ఆవల వున్న విశాల శ్రామిక ప్రజానీకం ఎంతమేరకు మమత పిలుపునకు స్పందిస్తారో వేచి చూడాలి. ప్రీపోల్ సర్వేలన్నీ మమతా బెనర్జీ విజయాన్ని ఘోషిస్తున్నాయి. గాలి చూస్తే ‘పరివర్తన్’ కోరు తున్నది. మమతా బెనర్జీని బెంగాలీలు దీదీ అని పిలుచుకుంటారని తెలిసిందే. బీజేపీ వాళ్లు మాత్రం ప్రచారంలో వెటకారం చేస్తున్నారు. అరవయ్యారేళ్ల వయసులో దీదీ ఏమిటి? ‘పీషీ’ (అత్త) అనాలంటూ ప్రచారం చేస్తున్నారు. వయసు పెరిగితే మాత్రం వరస మారుతుందా? కాకపోతే బడా దీదీ (పెద్దక్క) అనొచ్చు. బడా దీదీ అనే మాట కూడా చాలా పాపులర్. సుప్ర సిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ నవలల్లో బడా దీదీ కూడా ఒకటి. శరత్ సాహిత్యం తెలుగులో ఎంత ప్రాచుర్యం పొందిందో చెప్పనక్కరలేదు. బడాదీదీ తెలుగు నవలతోపాటు ‘బాటసారి’ పేరుతో సినిమాగా కూడా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు అద్భుతంగా నటించిన సినిమాల్లో ఒకటి. ఇందులో హీరో అందుబాటులోనే ఉన్నంత కాలం భానుమతి (సినిమాలో బడా దీదీ) ఏదో చెప్పాలను కుంటూనే చెప్పలేకపోతుంది. అతడు దూరమైన తర్వాత దుఃఖిస్తూ ‘ఓ బాటసారీ... ననూ మరవకోయీ’ అని పాడు కుంటుంది. ఇప్పుడు మన బెంగాల్ బడా దీదీ ఇప్పటికే ఆ పరిస్థి తికి చేరుకున్నదా... ఆమెకు ఇంకా సమయం మిగిలే ఉన్నదా అనేది ఫలితాలతోనే తేలాల్సి ఉంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ముగిసిన నందిగ్రామ్ పోరు
మొత్తానికి కొన్ని చెదురుమదురు ఘటనలతో పశ్చిమబెంగాల్లోని రెండో దశ పోలింగ్ గురువారం ముగిసింది. ఇతర నియోజకవర్గాల మాటెలావున్నా రెండో దశలో అందరి కళ్లూ నందిగ్రామ్‌పైనే వున్నాయి. మూడు దశాబ్దాలక్రితమే ఫైర్‌బ్రాండ్ ఇమేజ్‌తో దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందరి ఊహలకూ భిన్నంగా ఆ ఒక్క స్థానాన్నే ఎంచుకుని పోటీ చేస్తుండటం ఇందుకు కారణం. అక్కడ పోలైన ఓట్ల శాతం 80 శాతం పైగా వుందంటే పోరాటం ఎంత హోరాహోరీగా సాగిందో అర్థమవుతుంది. ఎనిమిది దశల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో గత నెల 27న 30 స్థానాలకు తొలి దశ పూర్తయింది. రెండో దశలో గురువారం నందిగ్రామ్తోసహా 30 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. నందిగ్రామ్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలన్నిటినీ మమత చక్రాల కుర్చీలో స్వయంగా సందర్శించటం, తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను అనుమతించటంలేదని ఆరోపణలొచ్చినచోట ఎన్నికల అధికారులను కదిలించి పరిస్థితి చక్కదిద్దటం మాత్రమే కాదు... సాధారణ ఓటర్లను బీజేపీ అడ్డగిస్తున్నదని ఆరోపణలొచ్చిన బోయల్ పోలింగ్ కేంద్రం దగ్గర రెండు గంటలపాటు వుండి పర్యవేక్షించటం గమనిస్తే ఆమె పట్టుదలేమిటో అర్థమవుతుంది. ఈ ఎన్నికల్లో మమత అంతా తానై పోరాడారు. రాష్ట్రంలో ఆమెతో సరితూగగలిగినవారు ఎవరూ లేరనే చెప్పాలి. అందుకే బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతోసహా అతిరథ మహారథులను బీజేపీ మోహరించింది. నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి సొంత నియోజకవర్గం కావటం, ఆయన నిన్న మొన్నటివరకూ తృణమూల్‌లో కీలక నేతగా వుండటం కారణంగా అక్కడి ఓటర్లు ఎటు మొగ్గాలో తేల్చుకోవటానికి చాలానే కష్టపడివుంటారు. పంట భూములను అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం భూసేకరణ ద్వారా స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు 2007లో సాగించిన పోరులో సువేందు కీలకపాత్ర పోషిం చారు. అప్పట్లో రైతులకు సన్నిహితుడయ్యారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన బాగా పాటుబడ్డారని చెబుతారు. అందుకే ఆయన్ను పార్టీలో వుంచటానికి మమత శత విధాల ప్రయత్నించారు. ఆయన తమ వైపు మొగ్గు చూపకపోతే బీజేపీ బహుశా ఇంత హోరాహోరీ పోరాటానికి సిద్ధపడేది కాదు. అధికారానికి రాబోయేది తామే అన్నంత హడావుడి చేసేది కాదు. ఆ స్థాయిలో బీజేపీ హడావుడి చేయకుంటే మమత సైతం అంత పట్టుదలగా తన సొంత నియో జకవర్గాన్ని వదిలి నందిగ్రామ్‌కు కదిలివచ్చేవారు కాదు. ఏమైతేనేం అగ్నికి వాయువు తోడైనట్టు బీజేపీ–సువేందుల కాంబినేషన్ బెంగాల్ ఎన్నికలపై ఉత్కంఠను అనేక రెట్లు పెంచితే... సువేందుతో తాడో పేడో తేల్చకోవటానికి మమత రావటం నందిగ్రామ్‌కు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చింది. మమత రాకపోయివుంటే ఆ స్థానం నిస్సందేహంగా సువేందు సొంతమే. ఆ సంగతలావుంచి రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి మమత మొదటగా తనను తాను నిందించుకోవాలి. సీపీఎం శ్రేణులు తమ పార్టీవారిని బతకనీయటం లేదని, వారు తమిళనాడు వంటి దూరప్రాంతాలకు పోయి జీవనం సాగించవలసివస్తోందని లెఫ్ట్ ఫ్రంట్ హయాంలో మమత ఆరోపించేవారు. కానీ అధికార పీఠం అందుకున్నాక తమ పార్టీ శ్రేణులపైనా అలాంటి ఆరోపణలే వస్తున్నాయని గుర్తించలేకపోయారు. అవి ఏ స్థాయికి చేరాయంటే ఒకప్పటి వామపక్షాల కార్యకర్తలు తమకెదురవుతున్న వేధింపులు భరించలేక బీజేపీని ఆశ్రయించాల్సివచ్చింది. తమకు మినహా వేరెవరికీ పునాదులు లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే తృణమూల్ ఈ పని చేస్తోందని ప్రత్యర్థి పార్టీలు చాన్నాళ్లుగా ఆరోపిస్తు న్నాయి. సంక్షేమంతో, అభివృద్ధితో ప్రజానీకం ఆదరాభిమానాలు పొంది ప్రత్యర్థుల్ని అధిగమిం చటం వేరు... ఫిరాయింపులతో, బెదిరింపులతో దాన్ని సాధించాలనుకోవటం వేరు. ప్రత్యర్థి పార్టీ లకు పునాది లేకుండా చేయటానికి రెండో మార్గాన్ని ఎంచుకుంటే, ఆ ఖాళీ నింపేందుకు మరొక పార్టీ రంగం మీదికొస్తుంది. తృణమూల్ అధికారంలోకి రావటంలో కీలకపాత్ర పోషించిన నందిగ్రామ్ ఉద్యమంలో పాల్గొన్నవారికీ, అప్పట్లో జాడతెలియకుండా పోయినవారి కుటుంబాలకూ 14 ఏళ్ల తర్వాతగానీ ఆర్థిక ఆసరా కల్పించలేకపోవటం తృణమూల్ పాలన తీరుకు అద్దం పడుతుంది. కనుక రాష్ట్రంలో బీజేపీ బలపడటం వెనకున్న కారణాలేమిటో మమత ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంటుంది. సాగుతున్న పాలనపై తమ మనోభీష్టాన్ని వ్యక్తం చేయటానికీ, సమర్థవంతులైన ప్రతినిధులను ఎంచుకోవటానికీ ఎన్నికలను ప్రజలు ఒక సందర్భంగా భావిస్తారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో ఆ ఎన్నికలు కాస్తా వైరి వర్గాల బలప్రదర్శనలుగా మారుతున్నాయి. పరస్పర దూష ణలకు వేదికలవుతున్నాయి. మద్యం, డబ్బు ప్రవహించటం... డాబూ దర్పం చూపటం, సవాళ్లు, ప్రతి సవాళ్లతో సాధారణ ప్రజానీకంలో అనవసర ఉద్రిక్తతలు సృష్టించటం మినహా ఎన్నికలు సాధి స్తున్నదేమీ వుండటం లేదు. పార్టీల మేనిఫెస్టోల్లో సాగు సంస్కరణలు, పెట్రో ధరల పెంపు వంటివి కనబడవు. ఇతరేతర అంశాల ఆసరాతో గద్దెనెక్కాక అవన్నీ జనంమీద స్వారీ చేస్తాయి. ఈ పరిస్థితి మారితేనే ఎన్నికలు అర్ధవంతమవుతాయి. అందులో అసలైన ప్రజాభీష్టం వ్యక్తమవుతుంది. -
మమతకు గుడ్‌న్యూస్: అండగా కాంగ్రెస్ సీఎం
జైపూర్: ‘ఎన్నికల తర్వాత పోరాటానికి ఏకమవుదాం’ అని పిలుపునిచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఓ ముఖ్యమంత్రి అండగా నిలిచారు. ఈ సందర్భంగా మమత పోరాటానికి అండగా ఉంటానని ప్రకటించారు. మమత ప్రకటనపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయనే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (కాంగ్రెస్). కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరుస్తోందని మమత చేసిన వ్యాఖ్యలకు తాను మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం రెండు ట్వీట్లు చేశారు. ‘ప్రధానమంత్రి ఒకచేత్తో ప్రజాస్వామ్యం, మరో చేత్తో రాష్ట్రాలను బలహీనం చేస్తున్నారు’ అని అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్రాల పథకాల అమలులో కేంద్రం వాటా తగ్గించుకుని రాష్ట్రాల వాటా పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీఎస్టీ చెల్లింపులు మొత్తం చేయడం లేదని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కూడా కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. ప్రత్యేక పన్ను, అదనపు పన్నులు వేస్తూ దండుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో కేంద్రం తన పాత్ర తగ్గించుకుంటోందని తెలిపారు. అంతకుముందు రోజు అస్సాంలో కాంగ్రెస్ మద్దతుదారులకు చేపట్టిన ప్రచారంలో అశోక్ గెహ్లాట్ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని, సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తోందని మమత ఆరోపిస్తూ బీజేపీయేతర పార్టీల నాయకులకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖకు అశోక్ గెహ్లాట్ స్పందించారు. అయితే ఇతర పార్టీల నాయకులు ఇంకా స్పందించలేదు. వారి వైఖరి ప్రకటిస్తే జాతీయ రాజకీయాల్లో కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. చదవండి: ‘కూల్.. కూల్ దీదీ.. మేం 200 సీట్లు గెలుస్తాం’ చదవండి: ‘మీ భార్యకు ఎలా ఉంది ఉద్దవ్‌జీ? -
నందిగ్రామ్‌లో దీదీ ఓటమి తథ్యం: సర్వే
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మొదటి దశ పూర్తైన సంగతి తెలిసిందే. రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 1న జరగనున్నాయి. ఈ ఎన్నిక పట్ల బెంగాల్ వాసులతో పాటు దేశప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రెండో దశ పోలింగ్‌లో మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో కూడా ఓటింగ్ జరగనుంది. పార్టీ నుంచి బయటకు వెళ్లి బీజేపీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్‌లో మమతతో తలపడనున్నారు. దాంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆ సంగతి పక్కకు పెడితే గత రెండు మూడు రోజులుగా నందిగ్రామ్ ఫలితాలకు సంబంధించి రెండు, మూడు సర్వేలు బెంగాల్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వీటి సారాంశం ఏంటంటే మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఘోర పరాజయం చవి చూడబోతున్నారు. సువేందు దీదీని దారుణంగా ఓడించబోతున్నాడని సర్వేలు తెలిపాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సర్వేలన్నింటిని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐ పాక్ నిర్వహించిందనే వార్తలు జనాలను మరింత ఆశ్చర్యచకితులను చేశాయి. ఈ క్రమంలో ఐ పాక్ సంచలన ప్రకటన చేసింది. తమ సంస్థ నిర్వహించినట్లు చెప్పుకుంటున్న సదరు సర్వే ఫేక్ అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఐపాక్ ‘‘గత కొద్ది రోజులుగా నందిగ్రామ్ ఓటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సర్వే ఫేక్. బీజేపీ నాయకులు, వారి హామీల్లానే ఈ సర్వే కూడా అవాస్తవం. ఇలాంటి ఫేక్ రిపోర్ట్స్‌ను ప్రచారం చేసి జనాలను ప్రభావితం చేయాలని భావిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించవు. అసలు ఐ పాక్ డెస్క్ టాప్‌లను వినియోగించదు.. మరింత స్మార్ట్‌గా ఆలోచించండి’’ అంటూ ట్వీట్ చేసింది. Facing imminent defeat, @BJP4Bengal has now gone down to the level of using FAKE surveys in the name of I-PAC to keep the morale of their workers up!! P.S: In I-PAC, no one uses desktops so at-least be smart in your effort to create fake survey / reports! 😉🤣 pic.twitter.com/lFaOo0DshU — I-PAC (@IndianPAC) March 31, 2021 చదవండి: నేను పులి: ‘నందిగ్రామ్’లో మమతా బెనర్జీ గర్జన -
దీదీకి షాకిచ్చిన నటి!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీదీ మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ సినీ నటి, రేడిఘి నియోజకవర్గ ఎమ్మెల్యే దేబశ్రీ రాయ్ చేరారు. టీఎంసీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆమె పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి పంపారు. ‘నేటితో తృణమూల్‌తో నాకు ఉన్న అన్ని బంధాలు తెగిపోయాయి. పార్టీలో ఏ కీలక పదివి లేదు కనుకే రాజీనామా చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. పదేళ్లుగా రేడిఘి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించాను. ప్రస్తుతం అన్ని బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాను. ఈ విషయాన్ని అధిష్టానానికి కూడా తెలియజేశాను. సుధీర్ఘ కాలం ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన పార్టీకి కృతజ్ఞతలు’ అంటూ లేఖలో పేర్కొన్నారు దేబశ్రీ. రేడిఘి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు దేబశ్రీ రాయ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ప్రస్తుతం ఆమెకు పార్టీ టికెట్ నిరాకరించింది. ఇక భవిష్యత్ ప్రణాళికల గురించి ప్రశ్నించగా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు దేబశ్రీ. అయితే నటి బీజేపీలో చేరుతారనే ప్రచారం బలంగా వినిపిస్తుంది. 2019లోనే ఆమె బీజేపీలో చేరాలని భావించారు. కానీ కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ చటర్జీ ఆమెను బుజ్జగించి టీఎంసీలోనే కొనసాగేలా చేయగలిగారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల బరిలో బెంగాలీ తారలు -
టీఎంసీలో చేరిన బీజేపీ సీనియర్ నేత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాజీ బీజేపీ నేత యశ్వంత్ సిన్హా తృణముల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) తీర్థం పుచ్చుకున్నారు. కోల్‌కతాలోని టీఎంసీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు సుదీప్ బందోపాధ్యాయ, డెరెక్ ఓబ్రెయిన్ల సమక్షంలో యశ్వంత్‌సిన్హా టీఎంసీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కాలంలో బీజేపీ ఏకాభిప్రాయంపై నమ్మకం కలిగి ఉండేదని తెలిపారు. కానీ, నేడు బీజేపీలో అటువంటి పరిస్థితులు లేవని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం అణిచివేతను మాత్రమే నమ్ముతోందని ఆయన బీజేపీపై మండిపడ్డారు. అందుకే శిరోమణి అకాలీదళ్, బీజేడీ పార్టీలు బీజేపీని విడిచిపెట్టాయని తెలిపారు. బీజేపీతో ఇప్పడు ఎవరు స్థిరంగా నిలబడ్డారో చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వ సంస్థలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని తెలిపారు. కానీ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలు బలహీనంగా మారాయని మండిపడ్డారు. రైతుల ఆందోళనలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇక యశ్వంత్ సిన్హా మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. చదవండి: TN Assembly Polls: డీఎంకే మేనిఫెస్టో విడుదల -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన దీదీ.. వీల్ చైర్లో ఇంటికి
కోల్‌కతా: రెండు రోజుల క్రితం నందిగ్రామ్ ర్యాలీలో భాగంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దీదీ శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. వీల్‌చైర్ సాయంతో తన నివాసానికి చేరుకున్నారు. దాదాపు 48 గంటల పాటు దీదీని అబ్జర్వేషన్లో ఉంచారు వైద్యులు. ఈ క్రమంలో ఆమెని డిశ్చార్జ్ చేయాల్సిందిగా పార్టీ నాయకులు పదే పదే కోరడంతో ఆస్పత్రి వర్గాలు దీదీని డిశ్చార్జ్ చేశాయి. ప్రస్తుతం దీదీ ఆరోగ్యంగానే ఉన్నారని.. మరి కొన్ని రోజుల పాటు ఆమెకు విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. నందిగ్రామ్‌లో నామినేషన్ వేసి వస్తుండగా.. మమత ప్రమాదానికి గురయ్యారు. తనపై నలుగురైదురు వ్యక్తులు దాడి చేశారని.. కుట్ర ప్రకారమే ఇలా జరిగిందని మమత ఆరోపించగా.. ప్రత్యక్ష సాక్షులు మాత్రం దీదీని చూడ్డానికి జనాలు భారీ ఎత్తున రావడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. చదవండి: ఎన్నికల ప్రచారానికి వీల్ చెయిర్లో వస్తా..! -
మమతా బెనర్జీపై దాడి: ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరగడం కలకలం రేపుతోంది. నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తనపై పథకం ప్రకారం దాడి జరిగిందని, నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని మమత ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఘటన గురించి టీఎంసీ నాయకులు బీజేపీపై అనుమానం వ్యక్తం చేస్తుండగా.. ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒకరు దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీదీపై ఎలాంటి దాడి జరగలేదని.. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపాడు. నిమై మైతి అనే వ్యక్తికి ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే స్వీట్ షాప్ ఉంది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటన నా షాప్ ఎదురుగానే జరిగింది. సాయంత్రం 6.15 గంటలకు మమతా బెనర్జీ ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఒక యూటర్న్ దగ్గర సంఘటన జరిగింది. మమత వాహనంలో నుంచి కొద్దిగా బయటకు వచ్చి.. జనాలకు అభివాదం తెలుపుతున్నారు. ఈ క్రమంలో దీదీని చూడటానికి జనాలు ఒక్కసారిగా పరిగెత్తుకురావడంతో.. కారు డోరు ఆమె కాలికి తగిలి గాయం అయ్యింది. అంతే తప్ప.. ఆమె మీద ఎవరు దాడి చేయలేదు’’ అన్నారు. ఏఎన్ఐ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. దీదీని ఎవరు నెట్టలేదని.. ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని వెల్లడించింది. ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఏఎన్ఐ ఈ ప్రకటన చేసింది. అంతేకాక ఈ ఇద్దరు వ్యక్తులు తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పేర్కొన్నారు. "సీఎంను చూడటానికి జనం గుమిగూడారు. ఈ గందరగోళంలో ఆమె కాళ్లకి కారు డోర్ తగిలి కింద పడ్డారు. దాంతో దీదీ మెడ, కాలికి గాయాలయ్యాయి. అంతే తప్ప ఆమెను ఎవరు నెట్టలేదు’’అని సుమన్ మైటీ అనే విద్యార్థి ఏఎన్ఐకి తెలిపాడు. మరో ప్రత్యక్ష సాక్షి చిత్రంజన్ దాస్ ఏఎన్ఐతో మాట్లాడుతూ "మమతా బెనర్జీ దేవాలయాల సందర్శన నుంచి తిరిగి వచ్చేటప్పడు కారు తలుపు తెరిచి కూర్చుని ఉన్నారు. దాంతో అది ఆమె కాలికి తగిలి గాయలయ్యాయి’’ అన్నారు. ఇక సీఎం ఆరోగ్య పరిస్థితిపై నేడు టీఎంసీ నాయకులు ఈసీని కలవనున్నారు. మమతా బెనర్జీపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. రేపటిలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీకి ఆదేశించారు. తనపై జరిగిన దాడిని మమత కుట్రగా వర్ణించారు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఒక్క పోలీసు కూడా లేడని ఆమె ఆరోపించారు. చదవండి: మమతకు ఛాతినొప్పి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు -
సీఎం మమతా బెనర్జీపై దాడి: కాలికి గాయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నందిగ్రామ్‌లో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగింది. దీంతో నందిగ్రామ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తనపై దాడి జరిగిందని సీఎం మమతా మీడియాకు వెల్లడించారు. నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తనపై పథకం ప్రకారం దాడి జరిగిందని, నలుగురు వ్యక్తులు దాడి చేశారని ఆమె తెలిపారు. ఆ వ్యక్తుల దాడి వల్ల తన కాలికి గాయమైనట్లు పేర్కొన్నారు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఒక్క పోలీసు కూడా లేడని, తనపై కుట్ర జరగుతోందని అన్నారు. ప్రచారాన్ని వాయిదా వేసుకుని చికిత్స కోసం మమతా కోల్‌కతాకు వెళ్లారు. ఎస్ఎస్కేఎమ్ ఆస్పత్రిలో సీఎం మమత చేరారు. సీఎం మమతాపై జరిగిన దాడిని టీఎంసీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మమతా వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఖండించారు. మమతా దాడి పేరుతో సానుభూతి పొందాలని భావిస్తున్నట్లు విమర్శించారు. చదవండి: రసవత్తరంగా బెంగాల్ రాజకీయం -
ఎన్నికల షెడ్యూల్: కేంద్రంపై సీఎం ఫైర్
కోల్‌కతా: కేంద్ర సర్కారుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడలో భాగంగానే 8 విడతల్లో ఎన్నికల నిర్వహణ అంటూ ధ్వజమెత్తారు. కాగా బెంగాల్‌తో పాటు తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 దశల్లో బెంగాల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ విషయంపై స్పందించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 294 శాసన సభ స్థానాలున్న బెంగాలో పాటు షెడ్యూల్ ప్రకటించిన తమిళనాడు(234), కేరళ(140)లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తూ తమ రాష్ట్రంలో మాత్రం ఎందుకిలా అని ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘బీజేపీ వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. వారి సలహాలకు అనుగుణంగానే ఈ తేదీలు ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. ఒకరోజు ఓ జిల్లాలోని సగం నియోజకవర్గాలకే ఎన్నికలు నిర్వహిస్తారా? ఇది ప్రధాని మోదీ ఐడియానా లేదంటే అమిత్ షా చెప్పారా? అసోంలో ప్రచారం ముగిసిన అనంతరం తాపీగా బెంగాల్లో ప్రచారం చేసుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారా? ఈ సారి ఆటలో మిమ్మల్ని మరోసారి చిత్తుగా ఓడిస్తాను. దెబ్బకు దెయ్యం వదిలిస్తాను. నేను బెంగాల్ పుత్రికను. బీజేపీ కంటే నాకే ఈ రాష్ట్రం గురించి ఎక్కువగా తెలుసు. ఎనిమిది విడతలు అయినా గెలుపు మాదే. మీ కుట్రలన్నీ ఛేదిస్తాను. మీరు చేసిన అవమానానికి బెంగాల్ ప్రజలు కచ్చితంగా బదులు తీర్చుకుంటారు. మీకు వాయింపులు తప్పవు. దేశంలో ఉన్న ఒకే ఒక్క మహిళా ముఖ్యమంత్రి మీద మీ కక్షసాధింపు చర్యలు అందరూ గమనిస్తున్నారు’’ అంటూ బీజేపీ అధినాయకత్వంపై నిప్పులు చెరిగారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో(2016) 294 స్థానాలకు గానూ టీఎంసీ 211, వామపక్షాలు 79 గెలుచుకోగా బీజేపీ కేవలం 3 స్థానాల్లోనే గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని మమతకు షాకిచ్చింది. అదే జోరులో టీఎంసీ ప్రధాన నేతలను పార్టీలో చేర్చుకుంటూ అసెంబ్లీ ఎన్నికలకు సై అంటోంది. చదవండి: బెంగాల్, తమిళనాడు కీలక ప్రకటన -
అధికారం కాదు.. అభివృద్ధే మా ధ్యేయం: అమిత్ షా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రజల ఆకాంక్షల మేరకు ‘బంగారు బెంగాల్’ను అందివ్వడమే తమ లక్ష్యమన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అధికారం కాదు అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రారంభించిన పరివర్తన యాత్ర చివరి దశ ర్యాలీని గురువారం దక్షిణ 24 పరగణ జిల్లా కాక్‌ద్వీప్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎంసీని అధికారం నుంచి దూరం చేయడం తమ ఉద్దేశం కాదని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘మమతా బెనర్జీని అధికారం నుంచి పడగొట్టి.. పదవి చేపట్టడం బీజేపీ ధ్యేయం కాదు. రాష్ట్రంలో మార్పు తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని పేదలు, మహిళల జీవన స్థితి గతులను మార్చడం.. వారిని అభివృద్ధి పథంలోకి నడపడమే మా ధ్యేయం. ఇవి బీజేపీ కార్యకర్తలు, టీఎంసీ సిండికేట్ నాయకులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. వీటిల్లో మేం గెలిస్తే ప్రజలు కోరుకుంటున్న బంగారు బెంగాల్‌ను వారికి అందిస్తాం’’ అన్నారు అమిత్ షా. ‘‘ప్రజల ఆశీర్వాదం వల్ల రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. మహిళలకు రిజర్వేషన్లను 33 శాతం కంటే అధికంగానే అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రయోజనాలు అందేలా చూస్తాం. అమ్ఫాన్ రిలీఫ్ ఫండ్ల పంపిణీలో అవినీతిపై దర్యాప్తు చేస్తాం’’ అని అమిత్ షా తెలిపారు. చదవండి: కీలక సర్వే: దీదీ హ్యాట్రికా.. కమల వికాసమా? -
2024లో ప్రధాని పదవి చేపట్టేది ‘ఆమెనే’!
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలన్ని నరేంద్ర మోదీని ఢీకొట్టే బలమైన ప్రధాని అభ్యర్థి కోసం గాలించాయి. చాలా మంది నాయకులు తాము ఆ రేసులో ఉన్నట్లు ప్రకటించారు. అయితే మోదీతో తలపడటం అంటే ప్రకటనలు చేసినంత సులభం కాదు. ఆ విషయం విపక్షాలకు, జనాలకు బాగానే అర్థం అయ్యింది. ఈ క్రమంలో ప్రస్తుతం బెంగాల్లో ఎన్నికల దంగల్ నడుస్తోది. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో బెంగాల్లో 18 సీట్లు సాధించిన బీజేపి ఈ సారి మరింత బలపడాలని భావిస్తోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మతకంగా తీసుకుంది బీజేపీ. ఇక టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఎక్కడా తగ్గటం లేదు. ఢీ అంటే ఢీ అంటూ బీజేపీతో తలపడుతున్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీ-టీఎంసీ మధ్య నడుస్తోన్న వార్ చూస్తే.. మోదీని సమర్థవంతంగా ఎదుర్కొగల నాయకురాలు దీదీనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక తాజాగా టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తూర్పు భారతదేశ మహిళ 2024లో ప్రధాని పీఠం అధిరోహించవచ్చన్నారు. ఇండియా టూడే కాన్క్లేవ్ ఈస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై స్పందిచారు. ఈ సందర్భంగా డెరెక్ మాట్లాడుతూ.. ‘‘దేశ ప్రజలు తమ కోసం పని చేసే ఓ పురుషుడు, మహిళ ప్రధానిగా రావాలని ఎదరుచూస్తున్నారు. తూర్పు భారతదేశానికి చెందిన మహిళ 2024లో ప్రధాని పదవి చేపడతారని అని నా నమ్మకం’’ అంటూ పరోక్షంగా దీదీనే 2024 ప్రధాని అభ్యర్థి అని వెల్లడించారు. మోదీ, మమతల మధ్య అదే తేడా ఇక మోదీ, మమతల మధ్య అసలు ఎలాంటి పోలిక లేదన్నారు డెరెక్. ‘‘అసలు వారిద్దరిని ఎలా పోలుస్తాం. రాజకీయ వాతావరణంలో గౌరవనీయులైన ప్రధానిని ఇలా పోల్చడం కరెక్ట్ కాదు. అయితే వారిద్దరి మధ్య ఉన్న ప్రధాన తేడా ఏంటంటే ఒకరు హామీలను నేరవేర్చే వారు.. మరొకరేమో కేవలం ప్రచారానికే పరిమితం అవుతారు’’ అంటూ పరోక్షంగా దీదీపై ప్రశంసలు, మోదీపై విమర్శలు చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను కూడా విమర్శించారు. పార్లమెంట్లో టీఎంసీ లేవనెత్తిన పలు అంశాలపై బీజేపీ ఇంత వరకు సమాధానం చెప్పలేదని డెరెక్ ఓ బ్రెయిన్ మండిపడ్డారు. ‘‘బీజేపీ.. బెంగాల్లో కూడా మత రాజకీయాలు చేయాలని చేయాలని ప్రయత్నిస్తోంది. అందుకే అభివృద్ధి గురించి ప్రచారం చేయకుండా.. కేవలం మతపరమైన అంశాలనే ప్రచారం చేస్తోంది. అరుణ్ జైట్లీ ఉంటే ఇలా జరగనిచ్చేవారు కారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది గుజరాత్ జింఖానా బ్యాచ్. మతం తప్ప వారికి మరో అంశం తెలీదు’’ అంటూ డెరెక్ ఓ బ్రెయిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఎంపీ రాజీనామా.. బీజేపీలో చేరికకు సిద్ధం బెంగాల్ అసెంబ్లీలో ‘జై శ్రీరాం’..! -
‘దీదీ భయపడింది.. అందుకే ఆ నిర్ణయం’
కోల్‌కతా: మరి కొద్ది రోజుల్లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ, టీఎంసీ ఢీ అంటే ఢీ అన్నట్లు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ వేడి రాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ కుచ్‌బిహార్‌లో ‘‘పరివర్తన్ యాత్ర’’ ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా అమిత్ షా బెంగాల్లో త్వరలోనే హింసా కాండను అంతం చేసి.. అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. బెంగాల్లో జై శ్రీ రామ్ అంటే నేరం చేసినట్లు చూస్తారేందుకు అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘బెంగాల్లో ప్రస్తుతం ఎలాంటి వాతావరణం ఉందంటే.. జై శ్రీ రామ్ అంటే ఇక్కడ నేరం చేసినట్లు భావిస్తారు. మమత దీదీని ఒక్కటే అడుగుతున్నాను.. జై శ్రీరాం నినాదాలు భారత్‌లో కాక పాక్‌లో ప్రతిధ్వనిస్తాయా’’ అని అమిత్ షా ప్రశ్నించారు. దీదీ భయపడింది.. అందుకే రెండు చోట్ల పోటీ ‘‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ.. మమత, ఆమె మేనల్లుడి హింసా కాండకు చరమగీతం పాడనుంది. ప్రారంభంలో మాకు బెంగాల్లో గుడ్డి సున్నా వచ్చింది.. కానీ మేం భయపడలేదు.. పోరాడాం. ఇప్పుడు 18 స్థానాల్లో విజయం సాధించాం. ఈ సారి ఎన్నికల్లో దీదీకి సున్నా అనుభవం ఎదురుకానుంది. ప్రస్తుతం దీదీ చాలా భయపడుతున్నారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలో ఆమెకు అర్థం కావడం లేదు. ఓటమి భయంతో రెండు చోట్ల బరిలో నిల్చున్నారు’’ అని అమిత్ షా ఎద్దేవా చేశారు. చదవండి: మమత మాత్రమే మిగులుతారు! ఇప్పుడు చెప్పండి..ఎవరు అగౌరపరిచారో : అమిత్ షా -
బెంగాల్: ఆగని వలసల పర్వం..
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పశ్చిమబెంగాల్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మమతా బెనర్జీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సువేందు అధికారి నుంచి బీజేపీలోకి మొదలైన వలసల పర్వ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా టీఎంసీ పార్టీకి చెందిన ఐదుగురు నేతలు బీజేపీలో చేరనున్నారు. వాస్తవానికి వీరంతా రేపు హౌరాలో అమిత్ షా నిర్వహించనున్న ర్యాలీలో బీజేపీలో చేరాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల వీరంతా శనివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. వీరంతా ఇప్పటికే టీఎంసీకి గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరనున్న వారిలో ఎమ్మల్యేలు వైశాలి దాల్మియా, ప్రబిర్ ఘోషల్, హౌరా మేయర్ రతిన్ చక్రవర్తితో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే, పౌర సంబంధిత శాఖకు ఐదు సార్లు చీఫ్‌గా పని చేసిన రంగనాథ్ పార్థసారథి ఛటర్జీ ఉన్నారు. (చదవండి: బెంగాల్‌పై కాషాయం కన్ను ) హౌరాలోని డుముర్జోలాలో ఆదివారం బీజేపీ తల పెట్టిన మెగా ర్యాలీ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని సమాచారం. ఈ ర్యాలీలో అమిత్ షా వర్చువల్‌గా పాల్గొంటారు. ఇక ఆయనతో పాటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్ర బీజేపీ నాయకులు పాల్గొననున్నారు. శుక్రవారం పోల్ స్ట్రాటజీ మీటింగ్ నిర్వహించిన తృణమూల్, పార్టీ నుంచి వెళ్లే వారిపై దృష్టి పెట్టకుండా.. ప్రచారంపై ఫోకస్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాక పార్టీ విడిచి వెళ్లిన వారి గురించి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయకూడదని.. దాని వల్ల ఓటరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. -
నేతాజీ జయంతి.. వేడెక్కిన రాజకీయం
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రాబోయే శాసనసభ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో బలాన్ని మరింత పెంచుకొనేందుకు, ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటివరకు వివిధ అంశాల్లో పార్టీల మధ్య మాటల యుద్ధం జరగ్గా, తాజాగా స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా విమర్శలు, ప్రతి విమర్శలు జోరందుకున్నాయి. నేతాజీ పుట్టిన రోజును పరాక్రమ్ దివస్‌గా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రకటించగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ్ నాయక్ దివస్‌గా ఖరారు చేశారు. ఈ మేరకు వేడుకలు సైతం ప్రారంభించారు. అయితే, నెహ్రూ–గాంధీ కుటుంబానికి ప్రయోజనం చేకూర్చడానికి నేతాజీ వారసత్వం విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే నేతాజీ పేరును బీజేపీ వాడుకుంటోందని టీఎంసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసత్వ అంశమే ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతున్నట్లు స్పష్టమవుతోంది. నేతాజీ వారసత్వం కోసం పోటీ బీజేపీకి సంబంధించి సుభాష్ చంద్రబోస్ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిషర్లపై పోరాడేందుకు ఇండియన్ నేషనల్ ఆర్మీని(ఐఎన్ఏ) ఏర్పాటు చేసిన ఒక యోధుడు. అయితే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు మాత్రం నేతాజీ బెంగాల్‌కు చెందిన ఒక గొప్ప హీరో, తమ ప్రాంతానికి పేరుతెచ్చిన నాయకుడు. అందుకే సుభాష్ చంద్రబోస్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నేతాజీ వారసత్వం విషయంలో రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను మొదటిసారిగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోదీ డీక్లాసిఫై చేయించారని బీజేపీ ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. రాబోయే ఎన్నికల్లో లబ్ధి కోసమే నేతాజీ జన్మదినాన్ని ఆర్భాటంగా నిర్వహించేందుకు బీజేపీ ముందుకొచ్చిందని టీఎంసీ నాయకులు ఆరోపిస్తున్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేతాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నామని గుర్తుచేస్తున్నారు. -
నిరూపిస్తే బహిరంగంగా ఉరి వేసుకుంటా; ఎంపీ సవాల్
కోల్కత్తా: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హర్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించి బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బెంగాల్లో కుటుంబపాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నబీజేపీకి అభిషేక్ ఒక సంచలన సవాల్ విసిరారు. ‘‘ఒక కుటుంబం నుంచి ఒకరే రాజకీయాల్లోకి రావాలనే చట్టాన్ని తీసుకొచ్చే ధైర్యం బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. అలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను’’ అని సంచలన ప్రకటన చేశారు. ‘‘తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు నిరూపిస్తే బహిరంగంగా తనకు తానే ఉరేసుకుంటా’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అభిషేక్ బెనర్జీ మాట్లాడారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడే బీజేపీలో కైలాష్ విజయ్‌వర్గీయ నుంచి సువేందు అధికారి, ముకుల్ రాయ్ నుంచి రంజిత్‌సింగ్ వరకు ఈ నేతల కుటుంబసభ్యులంతా బీజేపీలోని ముఖ్యమైన పదవులను అనుభవించడం లేదా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఒక కుటుంబం నుంచి ఒక్కరే క్రియాశీల రాజకీయాల్లో ఉండాలని చట్టం తీసుకొస్తే.. మా కుటుంబం నుంచి సీఎం మమతా బెనర్జీ మాత్రమే టీఎంసీలోఉంటారని.. తాను వాగ్దానం చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి కొద్ది నెలల్లో ఎన్నికలు రాబోతుండడంతో రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని మమతాబెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. ఎలాగైనా బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
బెంగాల్ ఫైట్: బీజేపీ నేత సువేందు అధికారికి నోటీసులు
కోల్‌కతా: బీజేపీ నేత సువేందు అధికారి తనపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ మండిపడ్డారు. జనవరి 19న ఖేజూరిలో జరిగిన బహిరంగ సభలో తన పరువుకు భంగం కలిగే విధంగా అసత్యమైన ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ సువేందు అధికారికి లీగల్ నోటీసులు పంపారు. 36 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే, అతనిపై చట్టపరమైన చర్యలను ప్రారంభిస్తామని అభిషేక్ బెనర్జీ తరపున లాయర్ పేర్కొన్నారు. క్రిమినల్ కేసుల్లో నిందితుడైన సువేందు.. తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఏంటని అభిషేక్ ప్రశ్నించారు. అహంకారంతో విర్రవీగుతున్న సువేందు.. ప్రజలకు వ్యతిరేకంగా చేసిన నేరాలను మరిచిపోయారని ధ్వజమెత్తారు. శారదా చిట్ ఫండ్ స్కాం, నారద లంచం కేసుల్లో సువేందు ప్రమేయాన్ని నోటీసుల్లో ప్రస్థావించారు. అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి స్వయానా మేనల్లుడు. కాగా, గతంలో టీఎంసీ కీలక నేతల్లో ఒకరైన సువేందు.. మమతా బెనర్జీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించారు. ఆయన ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. సువేందుతో పాటు పలువురు టీఎంసీ నేతలు కమల తీర్ధం పుచ్చుకున్నారు. త్వరలో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. అధికార టీఎంసీ, భాజపాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మమతను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. -
రాళ్లదాడి.. బీజేపీకి చేదు అనుభవం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి మరో సారి చేదు అనుభవం ఎదురయ్యింది. గతంలో టీఎంసీ కార్యకర్తలు బీజేపీ జాతీయాధ్యక్షడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి చేయగా.. ప్రస్తుతం బీజేపీ నాయకుడు సువేందు అధికారి పాల్గొన్న ర్యాలీలో ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ర్యాలీలో కేంద్రమంత్రి దేవశ్రీ చౌధురి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, మాజీ మంత్రి సువేందు అధికారి పాల్గొన్నారు. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ.. ‘ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఓటమి భయంతోనే టీఎంసీ నాయకులు మాపై దాడి చేశారు. వారంతా మిని పాకిస్తాన్‌కు చెందిన వారు’ అన్నారు. (చదవండి: వ్యూహాత్మక ఎత్తుగడ: బీజేపీకి దీదీ సవాల్) వచ్చే ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానంటూ మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ హింస చోటుచేసుకోవడం గమనార్హం. 2019 ఎన్నికల్లో 42 లోక్‌సభ స్థానాల్లో 18 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. ఏప్రిల్- మే నెలల్లో జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో పాగా వేయాలనే పట్టుదలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఈ రోజు పరివర్తన్ ర్యాలీ నిర్వహించింది. అయితే, ఈ ర్యాలీపై కొందరు వ్యక్తులు వాటర్ బాటిళ్లు విసిరారు. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ జెండాలను పట్టుకొన్న కొందరు వ్యక్తులు ‘గో బ్యాక్’ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో దక్షిణ కోల్‌కతాలోని ముదియాలి ప్రాంతంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. గతేడాది జేపీ నడ్డా పర్యటన సందర్భంగా కూడా కోల్‌కతాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానంటూ చేసిన ప్రకటనపై సువేందు స్పందించారు. ఆమెని 50 వేల ఓట్ల మెజారిటీతో ఓడిస్తానని తెలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఆమెని(దీదీ) నందిగ్రామ్‌లో అర లక్ష ఓట్ల తేడాతో ఓడిస్తాను. లేదంటే రాకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు. -
దీదీకి షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నేత సువేందు అధికారి టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మంత్రి పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి లక్ష్మి రతన్ శుక్లా తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ నేతలు ఒక్కొక్కరు టీఎంసీ వీడుతూ దీదీకి షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలో రతన్ శుక్లా తన రాజీనామా లెటర్ ఒక కాపీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, మరో దాన్ని గవర్నర్ జగదీప్ ధంకర్‌కు అందజేశారు. గతంలో బెంగాల్ రంజీ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రతన్ శుక్లా హౌరా(ఉత్తర) నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రతన్ శుక్లా రాజీనామాపై స్పందిస్తూ.. ‘పార్టీకి, నాకు మధ్య ఎలాంటి విబేధాలు లేవు. రాజకీయాల నుంచి రిటైర్ అవుదామనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అన్నారు. (చదవండి: మమతకు వరుస షాక్‌లు.. స్పీకర్ ట్విస్టు!) ఇక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. మమతకు కంటికి మీద కునుకు లేకుండా చేస్తోంది. సువేంధు అధికారి పార్టీ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి టీఎంసీలో చీలికలు మొదలయ్యాయి. ఇక కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా ఎన్నికల నాటికి టీఎంసీలో దీదీ మాత్రమే మిగులుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెబెల్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సువేందు అధికారి తమ్ముడు కూడా బీజేపీలో చేరారు. సౌమేందు అధికారి తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని మునిసిపాలిటీకి కౌన్సిలర్, చైర్‌పర్సన్‌గా ఉన్నారు. గత వారం ఆయనతో కలిసి మరో డజను మంది ఇతర పార్టీ కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. అయితే అధికారి కుటుంబానికి చెందిన మరో ఇద్దరు సభ్యులు సువేందు అధికారి తండ్రి సిసిర్, సోదరుడు దిబ్యేండుల్‌లు మాత్రం టీఎంసీలో కొనసాగుతున్నారు. -
నన్ను కొనే మనిషి ఇంకా పుట్టలేదు: ఒవైసీ
కోల్‌కతా: ముస్లింలను విభజించడానికి కోట్లు ఖర్చు పెట్టి బీజేపీ హైదరాబాద్ నుంచి ఒక పార్టీని తీసుకువచ్చింది అంటూ ఎంఐఎంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండి పడ్డారు. డబ్బుతో అసద్‌ని కొనే మనిషి ఇంకా పుట్టలేదని స్పష్టం చేశారు. అంతేకాక ముస్లిం ఓట్లు మమత జాగిరు, ఆస్తులు కాదని మండిపడ్డారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ.. ‘డబ్బుతో నన్ను కొనే మనిషి ఇంతవరకు పుట్టలేదు. ఆమె(మమతా బెనర్జీ) ఆరోపణలు అవాస్తవాలు. ఆమె ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఆమె పార్టీ నాయకులు బీజేపీలో చేరుతున్నారు. సొంత రాష్ట్రంలోనే ఆమె భయపడుతున్నారు. బిహార్ ఓటర్లును, మాకు ఓటు వేసిన ప్రజలను ఆమె అవమానించారు. గతంలో పార్టీలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఓటు కట్టర్లు అని ఆరోపిస్తే.. ఎలాంటి ఫలితాలు వచ్చాయో గుర్తు పెట్టుకొండి. ముస్లిం ఓట్లు ఏమైనా మీ జాగీరా’ అంటూ ఒవైసీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. (చదవండి: మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ) "ఇప్పటివరకు మీరు మీకు విధేయులైన మీర్ జాఫర్స్, సాదిక్లతో మాత్రమే వ్యవహరించారు. తమ గురించి ఆలోచించే, మాట్లాడే ముస్లింలను మీరు ఇష్టపడరు. బిహార్‌లోని మా ఓటర్లను మీరు అవమానించారు. ముస్లిం ఓటర్లు మీ జాగీర్ కాదు'' అని తృణమూల్ చీఫ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒవైసీ ట్వీట్ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయం సాధించడంతో.. వచ్చే ఏడాది బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడులో కూడా ఎంఐంఎం పోటీ చేయాలని భావిస్తోన్నట్లు సమాచారం. -
ముగ్గురు ఐపీఎస్‌లపై కేంద్రం బదిలీ వేటు
న్యూఢిలీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడి ఇరు పక్షాల మధ్య మరింత అగ్గి రాజేసింది. తమ విధుల్ని నిర్వర్తించడంలో విఫలమయ్యారంటూ బెంగాల్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకి డిప్యుటేషన్‌పై రావాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఏకపక్షంగా సమన్లు జారీ చేసింది. ఐపీఎస్ అధికారులైన భోలనాథ్ పాండే (డైమండ్ హార్బర్ ఎస్పీ), ప్రవీణ్ త్రిపాఠి (డీఐజీ, ప్రెసిడెన్సీ రేంజ్), రాజీవ్ మిశ్రా (ఏడీజీ, సౌత్ బెంగాల్) నడ్డా బెంగాల్ పర్యటనకి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తమ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించనందుకు వారిని కేంద్రానికి డిప్యుటేషన్ రావాల్సిందిగా హోంశాఖ ఆదేశించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా పోలీసు అధికారుల్ని కేంద్ర సర్వీసులకి డిప్యుటేషన్‌కి రమ్మంటే ముందస్తుగా ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ కేంద్రం ఏకపక్షంగా ఈ సమన్లు జారీ చేసింది. శాంతి భద్రతలు రాష్ట్ర అంశం: మమతా సర్కార్ ఎదురు దాడి నడ్డా పర్యటనలో భద్రతా వైఫల్యాలపై చర్చించడానికి పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీ రావాల్సిందిగా సమన్లు జారీ చేయడంపై మమతా సర్కార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశమని, కేంద్రం అందులో తలదూర్చాల్సిన అవసరం లేదంటూ ఎదురు దాడికి దిగింది. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ కళ్యాణ్ బెనర్జీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకి లేఖ రాశారు. నిబంధనలేమంటున్నాయి? కేంద్ర డిప్యుటేషన్‌కు రమ్మని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను ఐపీఎస్ అధికారులు తప్పక పాటించాలని, వేరే ఆప్షన్ ఉండదని నిబంధనలు చెబుతున్నాయి. అలాంటి ఉత్తర్వులు పొందిన ఐపీఎస్ ఆఫీసర్లను సదరు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రిలీవ్ చేయాల్సిఉంటుంది. ఐపీఎస్ రూల్స్– 1954 ప్రకారం ఐపీఎస్‌ల విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య విభేదాలు వస్తే, రాష్ట్రాలు కేంద్ర ఆదేశాన్ని అనుసరించక తప్పదు. సమాధానం ఇవ్వకపోతే: మరోవైపు పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 267 ఫిర్యాదుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తప్పు పట్టింది. మరో 15 రోజుల్లో మమతా సర్కార్ ఏమీ మాట్లాడకపోతే ఆ ఫిర్యాదుల్ని కేంద్ర హోంశాఖకు పంపిస్తామని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖ శర్మ హెచ్చరించారు. -
‘తల్లికి నమ్మకద్రోహం చేస్తే.. అధోగతే’
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నాయకుడు, రవాణా శాఖ మంత్రి సువేందు అధికారి శుక్రవారం మమతా బెనర్జీ మంత్రి వర్గం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తాను పైకి ఎదగడానికి లిఫ్ట్ ఉపయోగించలేదని, పార్టీ కార్యకర్తలే తన బలమని, పారాచూట్ ఉపయోగించి కిందికి రాలేను’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ యూత్ వింగ్ చీఫ్, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ తన నియోజకవర్గమైన సత్గాచియాలో జరిగిన బహిరంగ ర్యాలీలో స్పందిస్తూ.. టీఎంసీ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పార్టీ సభ్యులకు తల్లిలాంటిదన్నారు. పార్టీ సభ్యులు అంచెలంచెలుగా ఎదగడానికి, ప్రజల కోసం పని చేయడానికి ఆమె అవకాశం ఇచ్చారన్నారు. వ్యక్తిగత లాభాల కోసం ఎవరైనా తల్లి నమ్మకాన్ని వమ్ము చేస్తే, పార్టీకి నష్టం కలిగిస్తే అతను తల్లికి నమ్మకదోహం చేసినట్లా? కాదా? అని ప్రశ్నించారు. నమ్మకద్రోహం చేస్తే అది అతని పతనానికి నాందని ఆయన అన్నారు. (చదవండి: షాకింగ్‌గా ఉంది.. ఇలా జరగాల్సింది కాదు!) టీఎంసీ నిర్వహించిన రిజర్వేషన్ సమస్యల సమావేశంలో పశ్చిమ బెంగాల్‌లోని అనేక జిల్లాల్లో పట్టున్న నాయకుడు, ప్రముఖ ఎంపీ సౌగతా రాయ్‌తో సుబేందు రిజర్వేషన్లపై తన అభిప్రాయం పంచుకున్నారు. ఆయన వామపక్ష ఫ్రంట్‌ను ఓడించి మమతా బెనర్జీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. నందిగ్రామ్ భూస్వామ్య వ్యతిరేక ఉద్యమానికి ఆయన వెన్నుముకగా నిలిచారు. అయితే కొంత కాలంగా టీఎంసీ పార్టీ కార్యకలాపాలకు సువేందు దూరంగా ఉంటున్నారు. -
బీజేపీ కార్యకర్తలపై దాడి.. దీదీపై నడ్డా ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సచివాలయం ‘నబన్నా’ ముట్టడికి వచ్చిన వందలాది మంది బీజేపీ నిరసకారులకు, పోలీసులకు మధ్య గురువారం ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై టియర్‌గ్యాస్, నీటి ఫిరంగులు ప్రయోగించి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. ఇక ఆమె పదవిలో ఉండే రోజులు లెక్కబెట్టుకోవాల్సిన తరుణం అసన్నమయ్యింది అన్నారు. ఈ మేరకు నడ్డా వరుస ట్వీట్లు చేశారు. ‘శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై నీటి ఫిరంగులను, టియర్ గ్యాస్‌ని ఉపయోగించారు. ఇవన్నీ దీదీలోని నిరాశను తెలియజేస్తున్నాయి. ఆమె పదవి కోల్పోయే సమయం దగ్గర పడింది. బెంగాల్ ప్రజలు ఆమె నిరంకుశ ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి సిద్ధమయ్యారు. బీజేపీ కార్యకర్తలు బెంగాల్ కోల్పోయిన కీర్తి, ప్రతిష్టలను పునరుద్ధరించడానికి గాను అవినీతి, నిరంకుశ, హింసాత్మక ప్రభుత్వంపై శాంతియుతంగా పోరాటడానికి సంకల్పించారు. కానీ వారిపై అమానుషంగా దాడి చేశారు. బెంగాల్ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు ఆమె ఓటమి కోసం కృషి చేస్తారు’ అన్నారు నడ్డా. (చదవండి: ‘నబన్నా’ ముట్టడి, కోల్‌కతాలో ఉద్రిక్తత) ‘వామపక్షాల పాలనలో కంటే మమతా బెనర్జీ పాలనలో రాజకీయ ప్రత్యర్థులపై హింస, దాడులు పెరిగాయి. దీదీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కానీ మేం బెంగాల్ ప్రజలతో నిలబడతాం. మా ధైర్యవంతులైన బీజేపీ కార్యకర్తలు సచివాలయ ముట్టడికి ప్రయత్నం చేశారు. దీదీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది అనడానికి ఇదే నిదర్శనం. దౌర్జన్యం, రక్తపాత దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిరసనలు చేయకుండా నిరోధించడానికి మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ యంత్రాంగం బీజేపీ కార్యకర్తలపై దారుణమైన హింసకు పాల్పడ్డారు. ఈ అధికార దుర్వినియోగం ఆమోదయోగ్యం కాదు’ అంటూ నడ్డా వరుస ట్వీట్లు చేశారు. పెద్ద పెద్ద సమూహాలుగా ఏర్పడి సమావేశాలను నిర్వహించడంపై మమతా బెనర్జీ ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికి నిరసనగా బీజేపీ ‘ఛలో నబన్నా’ పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర బీజేపీ యువజన విభాగం చీఫ్ తేజస్వి సూర్య ఈ నిరసనలో పాల్గొన్నారు. -
కోవిడ్-19 : దీదీ కీలక నిర్ణయం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 20 వరకూ రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతాయని ప్రకటించారు. సెప్టెంబర్ 7, 11, 12 తేదీల్లో బెంగాల్ అంతటా సంపూర్ణ లాక్డౌన్ అమలవుతుందని వెల్లడించారు. ఇక భౌతిక దూరం, ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తూ మెట్రో రైలు సేవలను పునరుద్ధరిస్తామని చెప్పారు. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ సెప్టెంబర్ 20 వరకూ రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థల మూసివేత కొనసాగుతుందని చెప్పారు. ఆరు కోవిడ్-19 హాట్‌స్పాట్ రాష్ట్రాల నుంచి విమాన సర్వీసుల పునరుద్ధరణను అనుమతించారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ రాష్ట్రాల నుంచి వారానికి మూడు రోజుల పాటు విమాన రాకపోకలను పునరుద్ధరిస్తామని చెప్పారు. కరోనా కట్టడికి ఆగస్ట్ 31 వరకూ ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణే, నాగపూర్, అహ్మదాబాద్ నుంచి కోల్‌కతాకు ప్రయాణీకుల విమానాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. కోవిడ్-19 మహమ్మారిని నిరోధించేందుకు పీఎం కేర్స్ ఫండ్ నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జీఎస్టీ బకాయిలను సైతం కేంద్రం చెల్లించడం లేదని అంతకుముందు సోనియా గాంధీతో జరిగిన బీజేపీయేతర సీఎంల సమావేశంలో మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి : ఇప్పుడు కుక్కర్ ఖాళీగా ఉండదు! -
‘టిక్‌టాక్ నిషేధం నోట్ల రద్దు వంటిదే’
కోల్‌కతా: భారత్‌లో టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్ యాప్‌లపై కేంద్రం ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో టిక్‌టాక్‌తో పాటు మిగిలిన కొన్నియాప్‌లను కూడా తొలగించారు. భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి కొంత మంది మద్దతు పలకగా.. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మాత్రం తీవ్రంగా మండిపడ్డారు. ఆమె బుధవారం కోల్‌కతాలోని ఇస్కాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టిక్‌టాక్ ఒక వినోదకరమైన యాప్ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం టాక్‌టాన్‌పై విధించిన నిషేధం ఒక హఠాత్తు పరిణామం అని మండిపడ్డారు. (టిక్‌టాక్ భారత ఉద్యోగులకు సీఈఓ లేఖ) ఈ నిషేధం వెనక ఉన్న వ్యూహాత్మక ప్రణాళిక ఏంటని నుస్రత్ జహాన్ సూటిగా ప్రశ్నించారు. మూకుమ్మడిగా చైనా కంపెనీలకు చెందిన యాప్స్‌ను నిషేధించడం వల్ల దేశంలోని యువత నిరుద్యోగులుగా మారితే పరిస్థితి ఎంటో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో విధించిన పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఎంతో నష్టపోయారని విమర్శించారు. ఇప్పడు టిక్‌టాక్‌ను నిషేధించటం వల్ల కూడా అంతే స్థాయిలో ప్రజలు నష్టపోతారని నుస్రత్ జహాన్ దుయ్యబట్టారు. ఇక టిక్‌టాక్ సీఈఓ భారతదేశంలోని తమ ఉద్యోగులకు లేఖ రాస్తూ.. టిక్‌టాక్ సంస్థ ఉద్యోగులు గర్వించదగిన సానుకూల అనుభవాలు, అవకాశాలను పునరుద్ధరించడానికి తమ శక్తి మేరకు పని చేస్తామని తెలిపిన విషయం తెలిసిందే. (ఇక టిక్‌టాక్ యాప్ పనిచేయదు) -
‘గెలిచిన వాటిలో ఆ 18 ఎంతో ప్రత్యేకం’
కోల్‌కతా: వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం బెంగాల్లో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ‘బంగ్లార్ జన్‌సంభాష్’ వర్చువల్ ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘నా వరకు 303 లోక్‌సభ స్థానాలు గెలవడం ముఖ్యం కాదు.. బెంగాల్లో 18 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడం ఎంతో సంతోషాన్నిచ్చే అంశం. కేవలం ఈ రాష్ట్రంలో మాత్రమే హింసా రాజకీయాలు నడుస్తాయి. 2014 నుంచి బెంగాల్లో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో 100 మంది బీజేపీ కార్యకర్తలు మరణించారు. వారి కుటుంబాలకు నా వందనం. వారు బంగారు బంగ్లా అభివృద్ధికి దోహదపడ్డారు’ అన్నారు. అలానే లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోదీకి, బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. అంతేకాక బీజేపీ ఇక్కడికి రాజకీయ యుద్ధం చేయడానికి రాలేదని.. బెంగాల్ సంస్కృతిని బలోపేతం చేసేందుకు వచ్చిందని అమిత్ షా పేర్కొన్నారు. (ఇది అన్యాయం: అమిత్ షా) ఆయుష్మాన్ భారత్ పథకం వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రం ప్రయోజనం పొందడం ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదంటూ అమిత్ షా మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. మమతా దీదీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని బెంగాల్లో అనుమతించనందున ఈ రాష్ట్ర పేదలకు ఎటువంటి ప్రయోజనాలు లభించడం లేదన్నారు. వారికి చికిత్స పొందే హక్కు లేదా అని అమిత్ షా ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ పేదల కోసం ఉద్దేశించబడింది.. వారి హక్కులను మీరు ఈ విధంగా కాలరాయడం సరికాదన్నారు అమిత్ షా. మమతా బెనర్జీ బెంగాల్ లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అనుమతించకపోవడాన్ని గుర్తు చేస్తూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. -
నెటిజన్లు ఫైర్.. ఫర్వాలేదు అంటున్న ఎంపీ
కోల్కత్తా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం డాన్స్ చేస్తున్న వీడియోను నుస్రత్ తన టిక్‌టాక్ అకౌంట్లో షేర్ చేశారు. సేవేజ్ ఛాలెంజ్ హాష్ ట్యాగ్‌తో వీడియోని పోస్ట్ చేసిన దానిని పార్లమెంటేరియన్ మిమిచక్రవర్తికి ట్యాగ్ చేశారు. ఆ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి నెటిజన్లు నుస్రత్‌పై ఫైర్ అవుతున్నారు. తన నియోజకవర్గమైన బషీర్‌హత్‌లో పేదలకు రేషన్ గురించి పట్టించుకోవడం మానేసి టిక్‌టాక్ చేయడంలో నస్రత్ బిజీగా ఉంది అంటూ ఒక యూజర్ ఆ వీడియోని షేర్ చేస్తూ కామెంట్ చేశాడు. మరో యూజర్ ట్వీటర్ యాక్టివిస్ట్ ఎంపీ తన నియోజకవర్గంలో ప్రజలు రేషన్ కోసం పోలీసుల చేతుల్లో దెబ్బలు తింటూ ఉంటే తను టిక్‌టాక్ వీడియోలు చేయడంలో బీజీగా ఉంది అన్నారు. (కొట్టుకున్న పోలీసులు, స్థానికులు) Instead of providing rations to the people of her Bashirhat Constituency,Nur Jahan is busy in TikTok.@TheUntamedFire,@IvanaPoddar,@iSanjuktaP,@promzzz,@warrior_bengal pic.twitter.com/YuYLlUO74R — #Jayanta Bhattacharya (@Jb21bh) April 24, 2020 మరి కొంత మంది ఈ వీడియో విషయంలో నస్రత్పై కాకుండా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై ఫైర్ అయ్యారు. మమతా బెనర్జీకి బెంగాల్ ప్రజల కన్నా అధికారమే ముఖ్యమని అందుకే ముస్లిం ప్రాంతమైన బషీర్‌హత్‌లో ఓట్ల కోసమే నస్రత్ని ఎంపీని చేశారని ఆరోపించారు. ఓటర్లు ఈ ఫ్రీ షో కోసమే ఆమెకు ఓట్లు వేసి గెలిపించారు అంటూ కామెంట్ మరొకరు చేశారు. మరో నెటిజన్ నస్రత్కి సపోర్ట్ చేస్తూ క్రిమినల్ ఎంపీ కంటే డాన్సింగ్ ఎంపీ బెటర్ అంటూ కామెంట్ చేశారు. ఇలాంటి కామెంట్లు వస్తున్నప్పటికి నస్రత్ మరో వీడియోని తన టిక్‌టాక్‌తో పాటు ట్విటర్లో కూడా పోస్ట్ చేశారు. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు అంటూ ఆ వీడియోకి క్యాప్షన్‌ని జోడించిన నస్రత్ హ్యాపీ ట్రోలింగ్, ట్రోలర్స్ అని కూడా జత చేశారు. (‘మీరు నామినేట్ అయ్యారని మరిచిపోకండి’) Oh and BTW, Sharing another fun post from my @TikTok_IN feed. An Artist always entertains 🙂 Happy Trolling, Trollers! #BePositive #SpreadLove #SpreadHappiness ❤️ pic.twitter.com/Rutf7Vli77 — Nusrat (@nusratchirps) April 24, 2020 -
‘బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎం’ వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అతికొద్ది మంది ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు వరుసలో నిలిచారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అనేక ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సీఎంగా ఖ్యాతి గడించారు. ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహించిన పోల్ సర్వేలో వైఎస్ జగన్ ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎం’ల జాబితాలో నాలుగో స్థానాన్ని సాధించారు. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ (బీజేపీ), రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (ఏఏపీ), పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), మూడో స్థానంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నిలిచారు. అనతి కాలంలో అనేక పథకాలు జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిన వైఎస్ జగన్ పరిపాలనా తీరుకు పలువురు మద్దతు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను ఆరు నెలల్లోనే నెరవేర్చేలా అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమ్మఒడి, నాడు–నేడు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం, వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన (పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్), జగనన్న వసతి దీవెన (హాస్టల్ ఖర్చులకు ఏటా రూ.20 వేలు), ఆరోగ్యశ్రీ, తదితర అనేక పథకాలతో పాటు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇన్ని పథకాలు, కార్యక్రమాలను అమలు చేసిన సీఎం ఒక్క వైఎస్ జగన్ తప్ప దేశంలో మరొకరు కనిపించరు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తర్వాత బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎంల జాబితాలో అయిదో స్థానంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఆరో స్థానంలో గుజరాత్ సీఎం విజయ్‌రూపాని, ఏడో స్థానంలో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌లు నిలిచారు. ఈ ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎం’ సర్వేలో 2016 నుంచి ఉన్న ట్రెండ్స్ కూడా పొందుపరిచారు. యోగి ఆదిత్యనాథ్ దాస్‌కు సంబంధించి 2017 ఆగస్టు నుంచి, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీష్‌కుమార్, నవీన్ పట్నాయక్‌లకు సంబంధించి 2016 ఫిబ్రవరి నుంచి వారి పెర్ఫార్మెన్స్ను చూపించారు. -
మమతా బెనర్జీకి అమిత్ షా సవాల్..
జబల్పూర్ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లో ఏ ఒక్క భారతీయుడి పౌరసత్వాన్ని అయినా తొలగించే నిబంధన ఎక్కడ ఉందో చెప్పాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సవాల్ విసిరారు. జబల్పూర్లో ఆదివారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ పార్లమెంట్లో ఆమోదం పొంది చట్టరూపు దాల్చిన సీఏఏను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. పౌర చట్టంపై ప్రజలను తప్పుదారి పట్టించేలా కాంగ్రెస్ సహా విపక్షాలు దుష్ర్పచారం సాగిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అణిచివేతకు గురైన పాకిస్తానీ శరణార్ధులందరికీ భారత పౌరసత్వం ఇచ్చే వరకూ నరేంద్ర మోదీ ప్రభుత్వం విశ్రమించదని తేల్చిచెప్పారు. దేశ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించిందని, పాక్ నుంచి వచ్చే మైనారిటీ శరణార్ధులకు భారత పౌరసత్వం కల్పిస్తామని నాటి నేతలు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తూర్పు, పశ్చిమ పాకిస్తాన్లో నివసించే హిందువులు, సిక్కులు, పార్శీలు, జైన్లు భారత్‌కు తిరిగి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్లో 30 శాతంగా ఉన్న హిందువుల జనాభా నేడు 3 శాతానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
రండి.. బీజేపీని ఏకాకి చేద్దాం
న్యూఢిల్లీ/చెన్నై/పురులియా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు తెలుపుతున్న వారు జాతి వ్యతిరేకులంటూ ముద్ర వేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని బెంగాల్ సీఎం మమత ఆరోపించారు. కాషాయ పార్టీని ఏకాకిని చేసేందుకు కలిసి రావాలని రాజకీయ పార్టీలు, పౌర సంఘాలకు ఆమె పిలుపునిచ్చారు. సీఏఏకి వ్యతిరేకంగా సోమవారం పురులియాలో చేపట్టిన 5 కిలోమీటర్ల నిరసన ర్యాలీలో మమత ప్రసంగించారు. సీఏఏతోపాటు జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను కూడా రాష్ట్రంలో అమలు కానివ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ కేంద్రాన్ని హెచ్చరించారు. సీఏఏపై నిరసన తెలుపుతున్న విద్యార్థులకు ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘ఓటరు జాబితాలో మీరంతా పేర్లు నమోదు చేయించుకోండి. ఆ తర్వాత వ్యవహారం నేను చూసుకుంటా’అని మమత అభయమిచ్చారు. సీఏఏ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తూ ముగ్గులు వేసి, అరెస్టయిన వారికి సంఘీభావం తెలుపుతూ డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఇల్లు, దివంగత కరుణానిధి ఇంటి వద్ద సంప్రదాయ ముగ్గులు వేశారు. సీఏఏ వద్దంటూ శనివారం చెన్నైలోని బీసెంట్ నగర్లో ముగ్గులు వేసినందుకు గాను ఐదుగురు మహిళలు సహా 8 మందిని పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ డీఎంకే నేతల నివాసాల వద్ద సోమవారం సీఏఏ వ్యతిరేక నినాదాలతో ముగ్గులు వేశారు. బాధిత కుటుంబాలకు సాయపడండి సీఏఏ వ్యతిరేక అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని పరామర్శించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను కోరారు. శనివారం అస్సాం పర్యటన సందర్భంగా ఇద్దరు మృతుల కుటుంబాలను పరామర్శించినట్లు ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో బాధిత కుటుంబాలను కలిసి, పరామర్శించిన విషయం తెలిసిందే. -
‘ఇది అప్రకటిత ఎమర్జెన్సీ’
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని భగ్గుమంటున్నక్రమంలో ఢిల్లీలో నెలకొన్న పరిస్థితి అప్రకటిత ఎమర్జెన్సీయేనని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనలు హోరెత్తడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో పలుచోట్ల 144 సెక్షన్ విధించడం, 18 మెట్రో స్టేషన్లను మూసివేసిన నేపథ్యంలో దేశంలో బీజేపీ పాలన సాగడం లేదని అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ‘దేశ రాజధానిలో ఎర్రకోట చుట్టూ 144 సెక్షన్ విధించారు, నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నారు. 18 మెట్రో స్టేషన్లు మూసివేశారు..ఇంటర్నెట్ను నిలిపివేశారు..కర్ణాటకలోనూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు..యూపీ, అసోంలో ఇదే తరహా దమనకాండ కొనసాగుతోంద’ని సింఘ్వి అన్నారు. డీ రాజా, సీతారాం ఏచూరి, అజయ్ మాకేన్, సందీప్ దీక్షిత్, యోగేంద్ర యాదవ్,ఉమర్ ఖలీద్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఇది బీజేపీ పాలన కాదు అప్రకటిత ఎమర్జెన్సీ అని దుయ్యబట్టారు. మనుషులను పీక్కుతినేలా బీజేపీ పాలన సాగుతోందని మండిపడ్డారు. బీజేపీపై దీదీ ఫైర్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటడంతో బీజేపీ శాంతిని భగ్నం చేసేందుకు కుట్ర పన్నుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ముస్లింలు ప్రార్థనలు నిర్వహించే శుక్రవారం రోజు అల్లర్లకు పాల్పడేందుకు బీజేపీ కార్యకర్తలు ముస్లింలు ధరించే టోపీలు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఓ వర్గాన్ని అప్రతిష్టకు గురిచేసేందుకు ఈ టోపీలు ధరించి బీజేపీ కార్యకర్తలు ఆస్తులను ధ్వంసం చేసే ఆలోచన చేస్తున్నారని హెచ్చరించారు. పౌర చట్టాన్ని హిందువులు, ముస్లింల మధ్య పోరాటంగా బీజేపీ చిత్రీకరిస్తోందని దీనిపై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో రిఫరెండం నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. తన సవాల్‌ను స్వీకరించాలని ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం..మీరు ఓడిపోతే రాజీనామా చేయాలని అన్నారు. 1980లో పుట్టిన బీజేపీ 1970 నాటి మన పౌరసత్వ పత్రాలను అడుగుతోందని మమతా బెనర్జీ దుయ్యబట్టారు.