కోల్‌కత్తా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం డాన్స్ చేస్తున్న వీడియోను నుస్రత్ తన టిక్‌టాక్ అకౌంట్‌లో షేర్ చేశారు. సేవేజ్ ఛాలెంజ్ హాష్ ట్యాగ్‌తో వీడియోని పోస్ట్ చేసిన దానిని పార్లమెంటేరియన్ మిమిచక్రవర్తికి ట్యాగ్ చేశారు. ఆ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి నెటిజన్లు నుస్రత్‌పై ఫైర్ అవుతున్నారు. తన నియోజకవర్గమైన బషీర్‌హత్‌లో పేదలకు రేషన్ గురించి పట్టించుకోవడం మానేసి టిక్‌టాక్ చేయడంలో నస్రత్ బిజీగా ఉంది అంటూ ఒక యూజర్ ఆ వీడియోని షేర్ చేస్తూ కామెంట్ చేశాడు. మరో యూజర్ ట్వీటర్ యాక్టివిస్ట్ ఎంపీ తన నియోజకవర్గంలో ప్రజలు రేషన్ కోసం పోలీసుల చేతుల్లో దెబ్బలు తింటూ ఉంటే తను టిక్‌టాక్ వీడియోలు చేయడంలో బీజీగా ఉంది అన్నారు. (కొట్టుకున్న పోలీసులు, స్థానికులు)
Instead of providing rations to the people of her Bashirhat Constituency,Nur Jahan is busy in TikTok.@TheUntamedFire,@IvanaPoddar,@iSanjuktaP,@promzzz,@warrior_bengal pic.twitter.com/YuYLlUO74R
— #Jayanta Bhattacharya (@Jb21bh) April 24, 2020
మరి కొంత మంది ఈ వీడియో విషయంలో నస్రత్‌పై కాకుండా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై ఫైర్ అయ్యారు. మమతా బెనర్జీకి బెంగాల్ ప్రజల కన్నా అధికారమే ముఖ్యమని అందుకే ముస్లిం ప్రాంతమైన బషీర్‌హత్‌లో ఓట్ల కోసమే నస్రత్‌ని ఎంపీని చేశారని ఆరోపించారు. ఓటర్లు ఈ ఫ్రీ షో కోసమే ఆమెకు ఓట్లు వేసి గెలిపించారు అంటూ కామెంట్ మరొకరు చేశారు. మరో నెటిజన్ నస్రత్‌కి సపోర్ట్ చేస్తూ క్రిమినల్ ఎంపీ కంటే డాన్సింగ్ ఎంపీ బెటర్ అంటూ కామెంట్ చేశారు. ఇలాంటి కామెంట్లు వస్తున్నప్పటికి నస్రత్ మరో వీడియోని తన టిక్‌టాక్‌తో పాటు ట్విటర్‌లో కూడా పోస్ట్ చేశారు. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడూ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటారు అంటూ ఆ వీడియోకి క్యాప్షన్‌ని జోడించిన నస్రత్ హ్యాపీ ట్రోలింగ్, ట్రోలర్స్ అని కూడా జత చేశారు. (‘మీరు నామినేట్ అయ్యారని మరిచిపోకండి’)
Oh and BTW, Sharing another fun post from my @TikTok_IN feed.
— Nusrat (@nusratchirps) April 24, 2020
An Artist always entertains 🙂
Happy Trolling, Trollers! #BePositive #SpreadLove #SpreadHappiness ❤️ pic.twitter.com/Rutf7Vli77
Comments
Please login to add a commentAdd a comment