న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్‌లో కూటమి, సీఎం మమతా బెనర్జీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ఇండియా కూటమి బీజేపీపై పోరాడుతుందని తెలిపారు. బిహార్‌లో ఇండియా కూటమిలో భాగంగా బీజేపీపై పోటీ చేస్తామని అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో కీలకమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్లు తెలిపారు.
భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా మంగళవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు గమనిస్తే.. ఆమె ఇండియా కుటమిలో కీలకమైన భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తుందని తెలిపారు. మమతా బెనర్జీ ఇండియా కూటమికి కీలకమైన మిత్రపక్షమని తెలిపారు. ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలిగినప్పటికీ తాము బిహార్‌లో మిగిలిన పార్టీలతో ఇండియా కూటమిలో భాగంగానే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ దిగుతామని వెల్లడించారు. తమ భాగస్వామ్య పార్టీలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగం కాదంటే.. తాను ఎప్పటికీ అంగీకరించలేనని రాహుల్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీని ఒంటరిగా ఎదుర్కొంటామని.. లోక్‌సభ ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకుంటామని మమతా బెనర్జీ చెప్పటమే రాహుల్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది. బెంగాల్ మమతా కాంగ్రెస్‌కు ఐదు లోక్ సభ స్థానాలు కేటాయించడానికి సిద్ధపడినా సీపీఎంతో పొత్తు కారణం ఇది సాధ్యం పడదని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలిగిప్పటికీ.. ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల భాగస్వామ్యంతో బలంగానే ఉంది. 40 లోక్‌సభ స్థానాలు ఉన్న బిహార్‌లో ఇండియా కూటమి సాధ్యమైనన్ని సీట్లు గెలవడానికి కాంగ్రెస్ ప్రణళికలు రచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment