Nusrat Jahan
-
టీఎంసీ అభ్యర్థులను జాబితాలో కనిపించని 'నుస్రత్ జహాన్' పేరు
మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఈరోజు పశ్చిమ బెంగాల్ నుంచి రాబోయితే లోక్‌సభ ఎన్నికలకు మొత్తం 42 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో బహరంపూర్ స్థానం నుండి మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్, అసన్సోల్ నుంచి శత్రుఘ్న సిన్హా, దుర్గాపూర్ నుంచి కీర్తి ఆజాద్ వంటి కొన్ని ప్రముఖ పేర్లు ఉన్నాయి. టీఎంసీ పార్టీ 16 మంది సిట్టింగ్ ఎంపీల పేర్లతో పాటు, 12 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే కృష్ణానగర్ స్థానం నుంచి బహిష్కరణకు గురైన లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రాను పార్టీ వరుసగా రెండోసారి మళ్లీ నామినేట్ చేసింది. సందేశ్‌ఖాలీ వివాదం కారణంగా 'నుస్రత్ జహాన్'ను బసిర్హాట్ స్థానం నుంచి తొలగించి.. ఆ స్థానంలో హాజీ నూరుల్ ఇస్లామ్‌ను బరిలోకి దింపారు. కాగా ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది. -
ఇంతింతై ట్రెండింతై...
అనగనగా ఒక జాస్మిన్ కౌర్. దిల్లీలో వస్త్ర దుకాణం నడుపుతోంది. క్లాత్స్టోర్లోకి కొత్తగా వచ్చిన పీస్‌లను ప్రమోట్ చేయడానికి వాటి ముందు కెమెరా పెట్టి ‘జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’ అన్నది. ఈ మాట కాస్తా సోషల్ మీడియా ట్రెండై పోయింది. ‘ఇంతింతై ట్రెండింతై’ అన్నట్లు బాలీవుడ్ వరకు వెళ్లింది. బెంగాలీ నటి, పార్లమెంట్ సభ్యురాలు నుస్రత్ జహాన్ ఈ ట్రెండ్‌కు హాయ్ చెప్పింది. ఇంతకుముందు బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకోన్, సన్యా మల్హోత్రాలు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ వీడియోలు చేసి ‘వావ్’ అనిపించారు. ఫేమస్ డైలాగ్ ‘సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’ను లిప్–సింకింగ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది దీపిక. దీపిక భర్త రణ్‌వీర్‌సింగ్, డైరెక్టర్–ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్ పెట్టారు. -
వివాదంలో సినీ నటి.. ఈడీకి ఫిర్యాదు!
తృణమూల్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ తాజాగా వివాదంలో చిక్కుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలు జిల్లాలో ఆమె మోసానికి పాల్పడిందంటూ ఈడీకి ఫిర్యాదు చేశారు. గతంలో ఆమె కేవలం రూ.6 లక్షలకే త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తామని డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. అయితే ఆమె ప్రకటించిన ఐదేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. (ఇది చదవండి: అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా) తమకు త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ తక్కువ ధరకే అందిస్తామని మోసం చేశారంటూ సాల్ట్ లేక్ ఈడీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. సెవెన్ సెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మోసాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న నుస్రత్ జహాన్ దాదాపు రూ.24 కోట్ల మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే ఈ వ్యవహారంపై గతంలో కోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ కోర్టుకు హాజరు కాలేదని బాధితులు తెలిపారు. దీంతో చివరికీ ఈడీని ఆశ్రయించామని తెలిపారు. అయితే ఈ విషయంలో జహాన్ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా.. నుస్రత్ జహాన్ బెంగాలీ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి. ఆమె 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున బసిర్హాట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచింది. కాగా.. గతంలో ఫిబ్రవరి 2012లో పార్క్ స్ట్రీట్‌లో ఆంగ్లో-ఇండియన్ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం తర్వాత జహాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఖాదర్ ఖాన్‌కు ఆశ్రయం కల్పించినట్లు జహాన్‌పై ఆరోపణలు ఉన్నాయి. మార్చి 2015లో అత్యాచార బాధితురాలు మరణించింది. నిందితుడు ఖాదర్ ఖాన్ ఇంకా పరారీలో ఉన్నాడు. (ఇది చదవండి: 'మేడ్ ఇన్ హెవెన్' లో ట్రాన్స్ వుమెన్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?) -
2021లో విడాకులతో వార్తలో నిలిచిన సినీ ప్రముఖులు వీళ్లే..
List Of Famous Celebrity Couples Divorced In 2021: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఇండస్ట్రీలో డైవోర్స్ కొత్తేం కాదు. ప్రేమను పెళ్లివరకు ఎంత వేగంగా తీసుకెళ్లారో...అంతేవేగంగా విడాకులు తీసుకున్నారు. అప్పటివరకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్న క్యూట్ కపుల్ సైతం తమ దారులు వేరువేరు అని టాటా చెప్పేసుకున్నాయి. ఆఫ్ స్క్రీన్‌లోనూ హిట్ పెయిర్ అనిపించుకున్న జంటలు కలిసి ఉండలేమంటూ తమ వివాహ బంధాన్ని రద్దు చేసుకున్నాయి. అలా ఈ ఏడాది 20201లో విడిపోయిన సినీ ప్రముఖులపై ఓ లుక్కేద్దాం. Samantha-Naga Chaitanya ఈ ఏడాది విడాకులు తీసుకున్న జంటల్లో నాగ చైతన్య- సమంతలు ఉండటం అభిమానులకు ఊహించని షాకిచ్చింది. అప్పటివరకు ఇండస్ట్రీలో క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీరు ఇక భార్యభర్తలుగా కలిసి ఉండలేమంటూ విడాకుల ప్రకటన చేశారు. 2017లో ప్రేమ వివాహం చేసుకున్న చై-సామ్.. తమ 4వ వివాహ వార్షికోత్సవానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు అక్టోబర్2న విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. Aamir Khan -Kiran Rao బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ పెళ్లి విషయంలో మాత్రం రెండుసార్లు విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచాడు. 2006లో కిరణ్ రావును ప్రేమ వివాహం చేసుకున్న ఆయన 15 ఏళ్ల అనంతరం 2 ఏడాది జులై3న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ జంట విడిపోవడానికి కారణం హీరోయిన్ ఫాతిమా సనా షేక్ అని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. Nisha Rawal -Karan Mehra హిందీ పాపులర్ సీరియల్ నటుడు కరణ్ మెహ్రపై భార్య నిషా రావల్ గృహహిం ఆరోపణలు చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కరణ్ తనపై దాడికి దిగాడంటూ మీడియా ముందుకొచ్చింది. 2012లో ప్రేమవివాహం చేసుకున్న ఈ కపుల్ తొమ్మిదేళ్ల అనంతరం విడాకులు తీసుకున్నారు. Yo Yo Honey Singh- shalini thalwar ప్రముఖ బాలీవుడ్ సింగర్ హనీ సింగ్‌పై భార్య షాలిని తల్వార్ గృహహింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. 2011లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఈ ఏడాది విడిపోయారు. Nusrat Jahan- Nikhil Jain ప్రముఖ నటి, ఎంపీ నుస్రత్ జమాన్ పెళ్లి, విడాకులు తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. జూన్ 19, 2019లో నుస్రత్, వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ని టర్కీలో వివాహం చేసుకున్న నుస్రత్2021లో జైన్‌తో తన వివాహం చెల్లదని ప్రకటించింది. ఆ సమయంలో ఆ బ్యూటీ బెంగాలీ నటుడు యశ్వంత్ దాస్‌గుప్తా రిలేషన్షిప్లో ఉందని రూమర్స్ వినిపించాయి -
నిఖిల్‌తో పెళ్లిపై నుస్రత్ సంచలన వ్యాఖ్యలు
Nusrat Jahan on Marriage Controversy: ప్రముఖ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తన వైవాహిక స్థితిపై పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంపై పలువురు లేవనెత్తుతున్న ప్రశ్నల గురించి గురువారం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. భారత పార్లమెంటులో తన వివాహ స్థితిపై తన వైఖరిని స్పష్టం చేసినట్లు ఈ సందర్భంగా ఆమె పేర్కొంది. వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌తో తన వివాహం గురించి నుస్రత్ నోరువిప్పారు. 'టర్కీలో జరిగిన నా పెళ్లికి వారు హోటల్ బిల్లులు, ఖర్చులు కూడా చెల్లించలేదు. వారికి నేను ఏమీ చెప్పనవసరం లేదు. నేను నిజాయితీపరురాలిని. నన్ను తప్పుగా చిత్రీకరించారు. ఇప్పుడు నేను ఇదే విషయాన్ని స్పష్టం చేయదలచుకున్నాను. ఎవరి పేరూ చెప్పకుండా, ఇతరులను బాధ్యులను చేయడం, తప్పుగా చూపించడం చాలా సులభం అని' నుస్రత్ పేర్కొన్నారు. చదవండి: (ఆ హీరో నాపై పలుమార్లు అత్యాచారం చేశాడు : నటి) నుస్రత్ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. నవంబర్‌లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరవుతానని ఆమె వెల్లడించారు. ఇటీవల తన స్నేహితురాలైన సినీనటి స్రబంతి ఛటర్జీ కుంకుమ శిబిరం నుంచి నిష్క్రమించడం గురించి అడిగినప్పుడు.. తాను ఎప్పుడూ ఎవరికీ రాజకీయ సలహా ఇవ్వనని చెప్పింది. యష్‌కు కూడా తాను ఎలాంటి రాజకీయ సలహా ఇవ్వనని, అది వారి ఇష్టమని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ అన్నారు. చదవండి: (మెగాస్టార్‌తో స్టెప్పులేయనున్న సల్మాన్‌ఖాన్) కాగా, నుస్రత్ జహాన్.. నిఖిల్ జైన్‌ని 2019 జూన్ 19న టర్కీలో పెళ్లి చేసుకున్నారు. అయితే నవంబర్ 2020 నుంచి విభేదాల కారణంగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు. ఆగస్ట్ 26, 2021న నుస్రత్.. ఇషాన్ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. జనన ధృవీకరణ పత్రంలో యష్ దాస్‌గుప్తా పేరును ఇషాన్ తండ్రిగా చేర్చింది. అయితే, భారతీయ చట్టాల ప్రకారం నిఖిల్ జైన్‌తో వివాహం చెల్లదని, కేవలం లివింగ్ రిలేషన్‌షిప్‌గా మాత్రమే పరిగణించబడుతుందని నుస్రత్ వెల్లడించింది. -
తన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పిన నటి
ఎట్టకేలకు తన బిడ్డ విషయంలో బెంగాలి నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ స్పందించారు. ఆమె ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అనే వార్తలు గుప్పుమన్నాయి. దానికి కారణం ఆమె భర్త నిఖిల్ జైన్‌తో విడిగా ఉండటమే. నిఖిల్ ఇంటి నుంచి బయటకు వచ్చాక తాను గర్భవతినని ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో.. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరనే అంశంపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ఇక బిడ్డ పుట్టాక సైతం నుస్రత్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. అయినా ఆమె నోరు విప్పలేదు. కానీ తాజాగా తన కుమారుడి జనన ధృవీకరణ పత్రంలో తన భాగస్వామి పేరుగా నటుడు యష్ దాస్ గుప్తా పేరును చేర్చడంతో విమర్శలకు తెరపడినట్లైంది. కాగా గతేడాది లాక్డౌన్ టైమ్‌లో `ఎస్ఓఎస్ కోల్‌కతా` సినిమా షూటింగ్ టైమ్‌లో నుస్రత్, యష్ దాస్ గుప్తా ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారు. అయితే యష్ దాస్ గుప్తాకు ఆల్రెడీ పెళ్లి అయింది. ముంబైకి చెందిన ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్న శ్వేత సింగ్‌ను యష్ పెళ్లి చేసుకున్నాడని, వీరికి పదేళ్ల బాలుడు కూడా ఉన్నాడని సమాచారం. కాగా, జూన్ 19, 2019లో నుస్రత్, వ్యాపారవేత్త నిఖిల్ జైన్ టర్కీలో అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నవంబర్ 2020 నుంచి విభేదాల కారణంగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు. అనంతరం 2021లో భారతీయ చట్టాల ప్రకారం జైన్‌తో తన వివాహం చెల్లదని నటి వెల్లడించారు. -
మీ బిడ్డ తండ్రి ఎవరో చెప్పండి?!.. నటి ఘాటు జవాబు
సెలబ్రీటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికి ఉంటుంది. కొందరైతే ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వారి కోపానికి కారణమవుతుంటారు. అలాంటి ప్రశ్నే బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. నుస్రత్ జహాన్ ఈ మధ్యే ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తల్లైన దాదాపు నెల తర్వాత మొదటిసారి ఆమె పబ్లిక్‌లోకి వచ్చింది. బుధవారం కోల్‌కతాలో ఓ సెలూన్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యింది. ఈ సందర్భంగా బిడ్డ తండ్రెవరు అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా బిడ్డ తండ్రి ఎవరో ఆ తండ్రికి తెలుసు అంటూ ఘాటు సమాధానం ఇచ్చింది. (చదవండి: నా మొదటి ప్రేమ అలా.. ఎమోషనల్ అయిన షమితా శెట్టి) కాగా, జూన్ 19, 2019లో నుస్రత్, వ్యాపారవేత్త నిఖిల్ జైన్ టర్కీలోని ప్రైవేటు వెడ్డింగ్ సెరెమనీలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నవంబర్ 2020 నుంచి విభేదాల కారణంగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు. అనంతరం 2021లో భారతీయ చట్టాల ప్రకారం జైన్‌తో తన వివాహం చెల్లదని నటి వెల్లడించింది. ఆ సమయంలో ఆ బ్యూటీ బెంగాలీ నటుడు యశ్వంత్ దాస్‌గుప్తా రిలేషన్షిప్లో ఉందని రూమర్స్ వినిపించాయి. ఈ తరుణంలో గతనెల ఆమె ఓ మగబిడ్డకి జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. -
తల్లి అయిన టీఎంసీ ఎంపీ, విషెస్ చెప్పిన మాజీ భర్త
కోల్‌కతా: బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రసవం కోసం బుధవారం రాత్రి కోల్‌కతా పార్క్ స్ట్రీట్‌లోని భగీరథి నియోతియా ఆమె చేరారు. సిజేరియన్ ద్వారా కాన్పు అయిందనీ, తల్లీ బిడ్డ ఇద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉన్నారని బెంగాలీ నటుడు, నుస్రత్ స్నేహితుడు యష్ దాస్‌గుప్తా ప్రకటించారు. దీంతో నుస్రత్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. అభిమానులు, రాజకీయ మిత్రులు ఆమెకు అభినందనలు అందజేస్తున్నారు. Congratulations @nusratchirps wish could hug in personal. Love and hugs — Mimssi (@mimichakraborty) August 26, 2021 జూన్‌లో తన బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను, స్నేహితుల శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన నుస్రత్ గురువారం ఉదయం కూడా హాస్పిటల్ నుంచి తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బాయ్ ఫ్రెండ్‌గా భావిస్తున్న దాస్గుప్తానే స్వయంగా దగ్గరుండి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు తమ మధ్య విభేదాలు ఉండవచ్చు కానీ అంటూ తల్లీ బిడ్డలిద్దరికీ శుభాకాంక్షలు తెలిపిన మాజీ భర్త నిఖిల్ బాబుకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. నిఖిల్ జైన్‌తో రెండేళ్ల పాటు డేటింగ్లో ఉన్న నుస్రత్ 2019, జులై 19న టర్కీలో పెళ్లి చేసుకున్నారు. అయితే విభేదాల కారణంగా గతేడాది నవంబర్ నుంచి నుస్రత్, నిఖిల్ విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nusrat (@nusratchirps) -
బేబీ బంప్‌తో నుస్రత్ జహాన్.. ఫొటోలు వైరల్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తున్నారు. బిడ్డకు జన్మనివ్వబోయే ఆనంద క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘తప్పిపోయిన పక్షికి ఇంటికి వెళ్లే దారి గురించి మార్గదర్శనం చేద్దాం’’ అంటూ క్యాప్షన్ జతచేశారు. మిక్కీ మౌజ్ బొమ్మలతో కూడిన డిజైన్ గల డ్రెస్ ధరించిన కాబోయే అమ్మ నుస్రత్‌కు ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘ఎంతో అందంగా ఉన్నారు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దీదీ. పుట్టబోయే బిడ్డ గురించి మీరు కనే కలలు నిజమవ్వాలి’’ అంటూ ఫ్యాన్స్ నుస్రత్ జహాన్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. కాగా బెంగాల్ సినీ నటి అయిన నుస్రత్ జహాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2019లో లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. అదే ఏడాది జూన్ 19న నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన ఆమె ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. అయితే, కొంతకాలం సఖ్యతగా మెలిగిన దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు ఇటీవల వదంతులు వ్యాపించాయి. ఈ విషయంపై స్పందించిన నుస్రత్ జహాన్.. నిఖిల్‌తో జరిగిన తన వివాహం భారత చట్టాల ప్రకారం చెల్లదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా భర్త, అత్తింటి వారు తన నగలు, విలువైన వస్తువులను తనకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంపై కూడా పలు రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో నుస్రత్ జహాన్.. వరుసగా ఫొటోలు షేర్ చేస్తూ వాటన్నింటికీ ఫుల్‌స్టాఫ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: అవును మేము గతేడాది నుంచి విడిగా ఉంటున్నాం: నిఖిల్ జైన్ View this post on Instagram A post shared by Nusrat (@nusratchirps) -
‘పెళ్లి కాలేదంటున్నావ్.. గర్భవతివి ఎలా అయ్యావ్?’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ పెళ్లిపై రేగిన వివాదం ఇప్పట్లో సద్దు మణిగేలా లేదు. ఈ క్రమంలో నుస్రత్ వ్యవహారంపై బెంగాల్ బీజేపీ నాయకులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్ బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్.. నుస్రత్ జహాన్ పెద్ద మోసగత్తె.. పెళ్లి కాలేదని చెప్తున్న ఆమె.. నుదుటన సింధూరం ఎందుకు ధరిస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. ‘‘ఎంత మోసం.. టీఎంసీ టికెట్ ఇచ్చింది ఆమెకు.. పార్లమెంట్ సాక్షిగా ఆమె తనకు వివాహం అయ్యిందని ప్రమాణ స్వీకారం చేసింది. కానీ ఇప్పుడు ఆమె తనకు వివాహామే కాలేదంటుంది. అయినప్పటికి ఈమె గతంలో సింధూరం ధరించింది.. రథ యాత్రలో పాల్గొంది.. పూజలు చేసింది... ఎన్నికల్లో గెలిచింది. జనాలను ఎంత మోసం చేసింది’’ అంటూ విమర్శించారు. 2019 లో కోల్‌కతాలో ఇస్కాన్ నిర్వహించిన రథయాత్రలో నుస్రత్ జహాన్, నిఖిల్ జైన్ దంపతులుగా పాల్గొన్నారు. ఈ క్రమంలో దిలీప్ ఘోష్ రథయాత్ర గురించి ప్రస్తావిస్తూ.. నుస్రత్ జహాన్‌ను నిందించడమే కాక, 2019 లో నుస్రత్, నిఖిల్ రిసెప్షన్‌కు హాజరైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా నిందించారు. "వివాహామే చేసుకోలేదని ప్రకటించిన ఓ వ్యక్తి పెళ్లికి మమతా బెనర్జీ ఎలా హాజరయ్యారు. ఆమె తనకు పెళ్లి కాలేదని అంటుంది.. కానీ నుదుటున సింధూరం ధరిస్తుంది.. జనాలు ఆమె గర్భవతి అయ్యిందంటున్నారు. అసలు ఏంటి ఈ మోసం’’ అని ఆయన ప్రశ్నించారు. నుస్రత్ జహాన్ బుధవారం వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌తో తన వివాహం చట్టబద్ధమైనది కాదని, టర్కీలో జరిగిన వారి వివాహానికి భారత చట్టంలో గుర్తింపు లేనందున లైవ్-ఇన్ రిలేషన్ మాత్రమే అని తెలిపారు. కొంతకాలంగా నుస్రత్ జహాన్ నటుడు యష్ దాస్‌గుప్తాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిసిస్తున్నాయి. చదవండి: భర్తతో విడిపోవడంపై టీఎంసీ ఎంపీ నుస్రత్ కీలక వ్యాఖ్యలు వైరల్: పి. మమతా బెనర్జీ వెడ్స్ ఏఎం సోషలిజం... -
‘పెళ్లి గురించి పార్లమెంట్ సాక్షిగా నుస్రత్ అబద్ధం చెప్పారా?’
కోల్‌కతా: టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ తన వివాహంపై చేసిన ప్రకటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిఖిల్ జైన్‌తో తన వివాహం టర్కిష్ చట్టం ప్రకారం జరిగిందని, ఈ వివాహం భారత్‌లో చెల్లదన్నారు. అసలు తమది వివాహమే కాదని.. సహజీవనం కిందకు వస్తుందని ప్రకటనలో తెలిపారు. దీనిపై బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తుంది. వివాహం విషయంలో నుస్రత్ పార్లమెంట్ సాక్షిగా అబద్ధం చెప్పారని విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా ‘‘నుస్రత్ జహాన్ వ్యక్తిగత జీవితం గురించి, ఆమె ఎవరిని వివాహం చేసుకున్నారు.. ఎవరితో కలిసి ఉంటున్నారనే దాని గురించి మేం మాట్లాడటం లేదు. కానీ ఆమె ప్రజలు ఎన్నుకొన్న ఓ ప్రజాప్రతినిధి. పార్లమెంట్ రికార్డుల్లో ఆమె నిఖిల్ జైన్‌ను వివాహం చేసుకున్నట్లు ఉంది. అంటే ఆమె పార్లమెంట్ సాక్షిగా అబద్ధం చెప్పారా’’ అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి వీడియోను ట్వీట్ చేశారు. TMC MP Nusrat Jahan Ruhi Jain’s personal life, who she is married to or who she is living in with, should not be anyone’s concern. But she is an elected representative and is on record in the Parliament that she is married to Nikhil Jain. Did she lie on the floor of the House? pic.twitter.com/RtJc6250rp — Amit Malviya (@amitmalviya) June 10, 2021 భారత చట్టాల ప్రకారం తనకు జరిగిన వివాహం ఇండియాలో చెల్లుబాటు కాదన్నారు నుస్రత్ జహాన్. నిఖిల్ జైన్‌తో జరిగిన మతాంతర వివాహానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన ధ్రువీకరణ ఉండాలన్నారు. ఇక పోతే నిఖిల్ నుంచి చాలా కాలం క్రితమే విడిపోయినా, భారత చట్టాల ప్రకారం విడాకులు తీసుకునే ప్రశ్న తలెత్తదు అన్నారు. తనకు సంబంధించిన ఆభరణాలు, ఇతర వస్తువులు అక్రమంగా నిఖిల్ జైన్ కుటుంబ సభ్యులు లాగేసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తనకు చెందిన ఆస్తుల విషయంలో తన అభిప్రాయం తీసుకోకుండా తరలించారని వెల్లడించారు. చదవండి: భర్తతో విడిపోవడంపై టీఎంసీ ఎంపీ నుస్రత్ కీలక వ్యాఖ్యలు -
తల్లి కాబోతున్న టీఎంసీ ఎంపీ నుస్రత్? భర్త సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆ మధ్య తన ఫొటోలు డేటింగ్ యాప్‌లో ఉన్నాయంటు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఇక పెళ్లి అనంతరం భర్తతో విభేదాలు, విడాకులు అంటు మరోసారి ఆమె వార్తల్లోకెక్కారు. ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, పెళ్లయిన కొంతకాలానికే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై నుస్రత్ కూడా నిఖిల్ జైన్‌తో తన వివాహం టర్కిష్ చట్టం ప్రకారం జరిగిందని, ఈ వివాహం భారత్‌లో చెల్లదంటూ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భర్త నిఖీల్ జైన్ సైతం స్పందించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఆడియో ఇంటర్వ్యూలో... తాను, నుస్రత్ విడిగా ఉంటున్నట్లు స్ఫష్టం చేశాడు. అతడు మాట్లాడుతూ.. తమ పెళ్లిని రద్దు చేయాలని కోల్‌కతా కోర్టులో సివిల్ దావా వేసినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందున ఈ విషయంపై తానేమి మాట్లాడలేనని కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో 2020 నవంబర్ నుంచి నుస్రత్ తాను విడివిడిగా ఉంటున్నట్లు నిఖిల్ వెల్లడించాడు. ఇదిలా ఉండగా నుస్రత్ తల్లి కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో ఇది కాస్తా భర్త నిఖిల్ జైన్ చెవిన పడిందని, అది తెలిసి అతడు షాక్ అయ్యాడని, తను తల్లి కావడానికి తాను కారణం కాదని, ఆ బిడ్డ తన బిడ్డ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. చదవండి: భర్తతో విడిపోవడంపై టీఎంసీ ఎంపీ నుస్రత్ కీలక వ్యాఖ్యలు -
భర్తతో విడిపోవడంపై టీఎంసీ ఎంపీ నుస్రత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, కోల్కత్తా: ప్రముఖ నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ తన భర్త నిఖిల్ జైన్ నుంచి విడిపోవడంపై వస్తోన్న వార్తలపై తన మౌనానికి స్వస్తి పలికారు. నిఖిల్ జైన్‌తో తన వివాహం టర్కిష్ చట్టం ప్రకారం జరిగిందని, ఈ వివాహం భారత్‌లో చెల్లదని తన ప్రకటనలో తెలిపారు. తనకు సంబంధించిన ఆభరణాలు, ఇతర వస్తువులు అక్రమంగా నిఖిల్ జైన్ కుటుంబ సభ్యులు లాగేసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తనకు చెందిన ఆస్తుల విషయంలో తన అభిప్రాయం తీసుకోకుండా తరలించారని వెల్లడించారు. ‘భారత చట్టాల ప్రకారం నాకు జరిగిన వివాహం ఇండియాలో చెల్లుబాటు కాదు. నిఖిల్ జైన్‌తో జరిగిన మతాంతర వివాహానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన ధ్రువీకరణ ఉండాలి. నిఖిల్ నుంచి చాలా కాలం క్రితమే విడిపోయినా, భారత చట్టాల ప్రకారం విడాకులు తీసుకునే ప్రశ్న తలెత్తదు’ అని నుస్రత్ పేర్కొన్నారు. ఎవరి డబ్బుపై వ్యామోహం లేదని, తన సొంత ఖర్చులతోనే కుటుంబ పోషణ చేస్తున్నానని నుస్రత్ తెలిపారు. వారి అవసరాల కోసం తన పేరును, డబ్బును వాడుకున్నారని ఆరోపించారు. తన వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించే అవసరం ఎవరికి లేదని నుస్రత్ జహాన్ స్పష్టం చేశారు. చదవండి: టీఎంసీ ఎంపీ అసహనం.. వీడియో షేర్ చేసిన బీజేపీ -
టీఎంసీ ఎంపీ అసహనం.. వీడియో షేర్ చేసిన బీజేపీ
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ నేతలు పరస్పర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్ కు సంబంధించిన వీడియో చర్చనీయాంశమైంది. పార్టీకి గంట కంటే ప్రచారం చేయలేనని, సీఎం కోసం కూడా అంత సమయం కేటాయించలేను అన్నట్లుగా నుస్రత్ వ్యాఖ్యానించినట్లుగా ఉన్న వీడియోను బీజేపీ బెంగాల్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా, సొంత పార్టీకి ఎన్నికల్లో సరైన ప్రచారం చేయలేని స్థితిలో టీఎంసీ పార్టీ ఎంపీలు ఉన్నారని విమర్శించింది. అంతేకాకుండా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఓడిపోతున్నారని బీజేపీ జోస్యం చెప్పింది. కాగా, ఇరు పార్టీల నుంచి నందిగ్రామ్ నియోజకవర్గంలో స్టార్ క్యాంపెయినర్లను దించారు. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల అసెంబ్లీ ఎన్నికలలో మొదటి విడత పోలింగ్ శనివారం ముగిసింది, 84 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 1 న జరగనుంది. ఓట్ల లెక్కింపు మే 2 న జరుగనుంది. TMC MP Nusrat Jahan " I can't do rally for more than 1 hour, I don't even do it for CM"😆 #MamataLosingNandigram pic.twitter.com/p0jOm4iy03 — BJP Bengal (@BJP4Bengal) March 28, 2021 చదవండి: హత్రాస్ కంటే బెంగాల్ ఎన్నికలే ముఖ్యమా? -
అక్కడ ప్రజా రక్షణ లేదు కానీ ఇక్కడకొచ్చి మాట్లాడతారా?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలవ్వడంతో అధికార తృణముల్ కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం బెంగాల్‌లోని మల్దాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీపై ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్లో గోవధ, లవ్ జిహాద్‌లను దీదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. బెంగాల్లో దుర్గా పూజను నిషేధించారని, ఈద్ సందర్భంగా గోవుల వధ జరుగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో జైశ్రీరామ్ నినాదాన్ని అనుమతించడం లేదన్న సీఎం యోగి.. ప్రజల మనోభావాలతో మమతా ప్రభుత్వం ఆడుకుంటుందని దుయ్యబట్టారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యానాథ్ పర్యటనపై తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ ఎంపీ నుస్రత్ జహాన్ ఘాటుగా స్పందించారు. తమ సొంత రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టలేని వ్యక్తి పక్క రాష్ట్రాల గురించి మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. ఈ మేరకు ట్విటర్లో ‘బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర ఘటనను మాటల్లో వర్ణించలేకపోతున్నాను. హత్రాస్ ఘటనలోని బాధిత కుటుంబ సభ్యులకు ఆ ప్రభుత్వం రక్షణ ఇవ్వలేకపోయింది. ఆ కుటుంబ ప్రాధాన్యత కంటే బీజేపీకి బెంగాల్ ఎన్నికలు ముఖ్యమా.’ అంటూ కౌంటర్ ఇచ్చారు. చదవండి: దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్ SHOCKING! Cannot find the words to describe the horror that @BJP4India ruled Uttar Pradesh has turned into! WHY couldn't @myogiadityanath prioritize the safety & security of this family? Is Bengal elections more important to BJP?#BJPHataoBetiBachaohttps://t.co/WPvi5GHzP4 — Nusrat Jahan Ruhi (@nusratchirps) March 2, 2021 కాగా ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన హత్రాస్ అత్యాచార ఘటనలో బాధితురాలి తండ్రిని నిందితుడు, అతని స్నేహితుడు కాల్చి చంపిన విషయం తెలిసిందే. రెండేళ్ల కిందట యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడు గౌరవ్ శర్మని పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో జైలుకెళ్లిన నిందితుడు ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్‌పై విడుదలైన నిందితుడు తనపై ఫిర్యాదు చేసారన్న కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే తండ్రి కోసం విలపించిన బాధితురాలు తనకు న్యాయం జరగాలని, తనపట్ల కిరాతకంగా ప్రవర్తించిన వ్యక్తికి కఠిన శిక్ష పడాలని కోరింది. -
అక్షయ్- ట్వింకిల్ భార్యాభర్తలు.. మేంకాదు
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీఎంసీని ఢీ కొట్టేందుకు అన్ని విధాల ప్రయత్నాలు మొదలుపెట్టిన బీజేపీ.. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ (బెంగాల్ చిత్రపరిశ్రమ)కు చెందిన యాశ్ దాస్ గుప్తా, ఇంకా దేవ్ అధికారి, సంధ్యా రాయ్ సహా పలువురు నటులు బీజేపీలో చేరారు. అయితే యశ్ దాస్ బీజేపీలోకి చేరడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఇందుకు ఆయన గతంలో టీఎంసీ ఎంపీ నుస్రత్ జహన్‌తో డేటింగ్ చేసినట్లు వార్తలు రావడమే కారణం. 2019లో నిఖిల్ అనే వ్యాపారవేత్తని పెళ్లాడిన నుస్రత్ కొన్నాళ్ల క్రితం హీరో యశ్‌తో కలిసి రాజస్తాన్ పర్యటనకు వెళ్లొచ్చింది. దీంతో వీరిద్దరి మధ్యా ప్రేమాయణం నడిచినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున రూమర్లు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఆమె టీఎంసీలో చేరిన అనంతరం ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే యశ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యశ్ దాస్ బీజేపీ చేరికపై అయన్ని ప్రశ్నించగా...తనకు ప్రధాని నరేంద్రమోదీపై ఎంతో నమ్మకం ఉందని, భారత్‌పై ఆయనకున్న విజన్ వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చనట్లు తెలిపాడు. బెంగాల్లో ఉద్యోగవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన అవసరం ఉందని, అది బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ఎంపీ సుస్రత్ గురించి ప్రశ్నించగా..ఒకే కుటుంబంలో భిన్నాబిప్రాయాలు ఉండటం సహజమే కదా..అది కూడా రాజకీయాల పరంగానూ ఉండొచ్చు అని పేర్కొన్నారు. అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా లాగానే అని అడగ్గా..వారిద్దరు భార్యాభర్తలు..నేను, నుస్రత్ కాదు అని బదులిచ్చారు. చదవండి : (జయలలిత బాటలో దీదీ: విజయం వరిస్తుందా?) (బీజేపీలోకి యంగ్ హీరో..!) -
పర్సనల్స్ అడగకండి: నటి అసహనం
నుస్రత్ జహాన్ రూహీ.. రెండేళ్ల క్రితం రాజకీయాల్లోకి రాకముందు దాదాపు ఇరవై సినిమాల్లో నటించారామె. ఆ సమయంలోనే నిఖిల్ జైన్‌ను పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ జంట బంధం బీటలు వారిందనే వార్త నెట్టింట వీర విహారం చేస్తోంది. అంతేకాదు, నుస్రత్ తన సహనటుడు యశ్దాస్గుప్తాతో అత్యంత సన్నిహితంగా మెలుగుతోందని, త్వరలోనే భర్తకు విడాకులు ఇచ్చేయనుందని గుసగుసలు పెడుతున్నారు. పైగా ఆమె యశ్‌తో కలిసి రాజస్తాన్‌కు వెళ్లి రావడంతో ఈ పుకార్లకు మరింత ఊతమిచ్చినట్లైంది. ఈ క్రమంలో నుస్రత్, యశ్ వీటిపై స్పందించారు. (చదవండి: డేటింగ్ యాప్‌లో నా ఫొటో యాక్షన్ తీస్కోండి) మొదట నుస్రత్ మాట్లాడుతూ.. "నా వ్యక్తిగత విషయాలన్నీ అందరికీ చెప్పలేను. ఎప్పుడూ నన్ను తప్పు పట్టేందుకు రెడీగా ఉంటారు. కానీ ఈసారి మాత్రం మీ ప్రశ్నలకు, సందేహాలకు జవాబివ్వను. నటిగా నేను చేసిన తప్పొప్పుల గురించి నన్ను నిలదీయండి, సహిస్తాను. అంతే కానీ ఇతర విషయాల్లో నన్ను జడ్జ్ చేయకండి. ఇకపై నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా మీతో పంచుకోను" అని కుండ బద్ధలు కొట్టినట్లు తేల్చి చెప్పారు. "ప్రతి ఒక్కరూ విహార యాత్రలకు వెళ్తారు కదా! అలాగే నేను కూడా ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రాజస్తాన్ వెళ్లొచ్చాను. ఇక నుస్రత్ పెళ్లి విషయం అంటారా? ఆమెకు ఏం సమస్యలున్నాయో నన్నడిగితే నాకేం తెలుస్తుంది? వాటి గురించి నేరుగా ఆమెనే అడగండి" అని యశ్‌దాస్ గుప్తా అసలు సమాధానం చెప్పకుండా దాటవేశారు. కాగా సినీ గ్లామర్, పొలిటికల్ గ్లామర్ రెండూ ఉన్న యువ పార్లమెంటేరియన్ నుస్రత్ ఫొటో ఆ మధ్య డేటింగ్ యాప్‌లో ప్రత్యక్షమైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ లోక్‌సభ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే ఆమెకు మమతాబెనర్జీ పిలిచి మరీ సీటిస్తే బసిర్హాట్ లోక్‌సభ నియోజవర్గానికి పోటీ చేసి బీజేపీ ప్రత్యర్థి మీద మూడున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. (చదవండి: అమ్మతోడు... ఆమె అలా చేస్తుందనుకొలేదు!) -
ఇంకెన్ని సార్లు అవమానిస్తారు..
కోల్కత్తా : రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న కేంద్రహోంమంత్రి అమిత్ షా అధికార పార్టీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. బెంగాలీ సంస్కృతిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాతాలానికి తొక్కేస్తున్నారని, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం రెండో రోజు పర్యటనలో భాగంగా అమిత్ షా బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్, స్వామీ వివేకానంద, రామకృష్ణ పరమహంస వంటి గొప్పగొప్ప మేధావులు జన్మించిన గడ్డ బెంగాల్ అని కొనియాడారు. సీఎం మమత బెంగాల్ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, బెంగాల్ వీరుల ఆశయాలకు వ్యతిరేకంగా పాలిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఘాటుగా స్పందించింది. బెంగాల్ సంస్కృతీ, సంప్రదాయాల గురించి ఇతరుల చేత చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని కౌంటరిచ్చింది. ఆ పార్టీ ఎంపీ నుస్రత్ జహాన్ సైతం ట్విటర్ వేదికగా అమిత్ షాకు బదులిచ్చారు. రాజకీయల లబ్ధి కోసం ఎన్నిసార్లు బెంగాల్ ప్రజల మనోభావాలను అవమానపరుస్తారని నిలదీశారు. తమ సంస్కృతిని అపహాస్యం చేసేలా ప్రచారం చేయడం సరికాదని హెచ్చరించారు. ఈశ్వర్ చంద్రవిద్యాసాగర్, బీర్సాముండాల చరిత్ర గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. మమత నాయకత్వంలోని బెంగాల్ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని స్పష్టం చేశారు. -
ఎంపీ నుస్రత్‌పై కోర్టు ధిక్కార ఆరోపణలు
కోల్‌కతా : కరోనా కారణంగా విధించిన ఆంక్షలను ఉల్లంఘించినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాల సందర్భంగా బెంగాల్లో పెద్ద ఎత్తున దేదీప్యమానమైన అలంకరణలతో పాండల్స్ (దేవీ మండపాలు) దర్శనమిస్తాయి. అయితే కోవిడ్ కారణంగా ఈ ఏడాది పాండల్స్ ఏర్పాటుచేయడంపై కలకత్తా హైకోర్టు ఆంక్షలు విధించింది. అయినప్పటికీ ఎంపీ నుస్రత్ జహాన్ పాండల్స్‌లో దుర్గామాత పూజా కార్యక్రమాలకు హజరయ్యారని పిటిషనర్ కోర్టుకు వివరించారు. పాండల్స్‌ను నో ఎంట్రీ జోన్లుగా ప్రకటించినప్పటికీ ప్రజా ప్రతినిధులు నుస్రత్ జహాన్, దేవీ మండపాలను దర్శించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా కోర్టు ఆంక్షలను బేఖాతరు చేయడం కోర్టు దిక్కారానికి పాల్పడినట్లే అని పేర్కొన్నారు. కాగా దసరా సందర్భంగా ఈనెల 24న ఎంపీ నుస్రత్ జహాన్ ఆమె భర్తతో కలిసి కోల్‌కతాలోని ప్రముఖ పాండల్‌ని సందర్శించారు. (నవంబర్ 30 వరకూ లాక్డౌన్ పొడిగింపు ) #Exclusive: Contempt of Court charge leveled against actor #NusratJahan over her visit to a #DurgaPuja pandal despite the High Court ban. Watch this #ReporterDiary by Indrajit Kundu for more. @iindrojit More videos https://t.co/FAHzdk9TO8 pic.twitter.com/wMXnDAjGaB — IndiaToday (@IndiaToday) October 29, 2020 -
దుర్గామాత పూజ; హారతిచ్చిన ఎంపీ నుస్రత్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నుస్రత్ జహాన్ దుర్గాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణతో భర్త నిఖిల్ జైన్‌తో కలిసి కోల్‌కతాలోని సురుచి సంఘ మంటపం వద్ద సందడి చేశారు. దుర్గామాతకు హారతి ఇచ్చిన ఎంపీ దంపతులు, పూజారుల ఆశీస్సులు తీసుకుని అమ్మవారి అనుగ్రహం పొందారు. ఆ తర్వాత నిఖిల్ డోలు వాయిస్తుండగా, నుస్రత్ అక్కడున్న మహిళలతో కలిసి కాలుకదిపారు. అనంతరం తాను సైతం డోలు వాయిస్తూ మంటపంలో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా గతేడాది సైతం నుస్రత్ ఇదే విధంగా దుర్గామాత పూజలో పాల్గొనగా కొంతమంది ఓ వర్గం ఆమెపై ట్రోలింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. ఇస్లాం మతాచారాలను అగౌరవపరిచి, తమ మనోభావాలు దెబ్బతీశారంటూ మండిపడ్డారు. (చదవండి: చంపుతామంటున్నారు..) ఇక బెంగాలీ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నుస్రత్ జహాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. టర్కీకు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. బసిర్హాట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నుస్రత్, తనకు సంబంధించిన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటారు. -
ఒక ఫొటో ఎంపీకి నిద్ర లేకుండా చేస్తోంది!
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యువ ఎంపీ నుస్రత్ జహాన్ బొట్టు పెట్టుకుంటే హిందూ మహిళలా ఉంటారు. నుస్రత్ సినీ నటి. రాజకీయాల్లోకి వచ్చి ఏడాదే అయింది. కులమతాలు పట్టించుకునే అమ్మాయి కాదని చెప్పి, బీజేపీ క్యాండిడేట్ని ఘోరంగా ఓడించి మరీ ఆమెను గెలిపించుకున్నారు బసిర్హాట్ నియోజకవర్గ ప్రజలు. ప్రస్తుతం ఆమె ఓ బెంగాలీ చిత్రం షూటింగ్ కోసం లండన్‌లో ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక సెప్టెంబర్ 27న లండన్ వెళ్లారు. అక్టోబర్ 15 వరకు అక్కడే షూటింగ్ లో ఉంటారు. ఇండియా నుంచి వెళ్లే ముందే సెప్టెంబర్ 17 న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. (ప్రజాప్రతినిధులపై భారీగా క్రిమినల్ కేసులు) ఆ ఫొటోల్లోని ఒక ఫొటో ఇప్పుడు లండన్‌లో ఆమెకు నిద్ర లేకుండా చేస్తోంది! దుర్గామాతలా నుస్రత్ జహాన్ బొట్టు పెట్టుకుని, త్రిశూలం పట్టుకున్న ఫొటో అది. వెయ్యికి పైగా కామెంట్లు వచ్చాయి. ఎక్కువగా బంగ్లాదేశ్‌వి. అందులో ఒక కామెంట్ ఇలా ఉంది: ‘నీ అంతము సమీపించినది. మరణించిన పిదప మాత్రమే నువ్వు నీ తప్పిదము తెలుసుకొనెదవు’. ఇలాంటివే మిగతావి. నుస్రత్ వెంటనే ఈ హెచ్చరికలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. బెంగాల్ ప్రభుత్వం లండన్‌లో ఆమెకు అదనపు భద్రతను కల్పించే ఏర్పాట్లు చేస్తోంది. మనోభావాల మధ్య మనుగడ సాగిస్తున్నప్పుడు కొన్ని ఫొటోలను పర్సనల్ ఆల్బమ్ నుంచి బయటికి తియ్యక పోవడమే మంచిదని నుస్రత్ ఇప్పటికైనా గ్రహించి ఉండాలి. ఈ లౌకికవాది.. గాఢ విశ్వాసాలకు భంగం కలిగించి విమర్శల పాలవడం ఇది మొదటిసారేమీ కాదు. -
చంపుతామంటున్నారు..
కోల్‌కతా: సోషల్ మీడియా ద్వారా తనకు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని, అందువల్ల రక్షణ కల్పించాలంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, నటి నుస్రాత్ జహాన్ భారత హై కమిషన్ కు లేఖ రాశారు. ప్రస్తుతం ఆమె బెంగాలీ సినిమా షూటింగ్ లో భాగంగా లండన్‌లో ఉన్నారు. దుర్గా అమ్మవారి రూపంతో మహిషాసురమర్థినిలా త్రిశూలం పట్టుకొని తీసిన ఓ వీడియోను పోస్ట్ చేశాక బెదిరింపులు వస్తున్నట్లు తెలిపారు. ఎంపీగా సాధారణంగానే ఆమెకు భద్రత ఉంటుంది. అయితే బెదిరింపుల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, విదేశాంగ శాఖల ద్వారాఅదనపు భద్రత కూడా ఏర్పాటైనట్లు సమాచారం అందింది. తనకు రక్షణ కావాలంటూ భారత హైకమిషన్ కు రాసిన లేఖలో ఆమెకు వచ్చిన బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఉంచినట్లు తెలిపారు. సింధూరం ధరించడం వంటి చర్యల కారణంగా గతంలో ఆమెను కొందరు ముస్లింలు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: యూపీ నిర్భయ పట్ల అమానవీయం) -
చూసీ చూడనట్లు వదిలేయొద్దు..
కూర్చోవచ్చా? కుర్చీని అడగం. ఆన్ చేయొచ్చా? టీవీని అడగం. వేస్కోవచ్చా? బట్టల్ని అడగం. చూస్కోవచ్చా? అద్దాన్ని అడగం. వస్తువుల్ని అడిగేదేముంటుంది? నాన్–లింగ్ థింగ్స్ కదా! రైట్, అడగక్కర్లేదు చెప్పక్కర్లేదు. మరి.. ఆడవాళ్లని?! వాళ్ల పర్మిషన్ ఎందుకు తీస్కోం? అడిగేందుకైనా, చెప్పేందుకైనా! గుండె గుభేల్మనే వయసులో ఏమీ లేరు నుస్రత్ జహాన్ రూహీ. ముప్పై ఏళ్లు ఉన్నాయి. వయసును పక్కన పెట్టినా, ఆమె ఉన్న స్థాయికి దేనికీ కంగారు పడక్కర్లేదు. లోక్‌సభ ఎంపీ తను. పీఏలు ఉంటారు. పార్టీ పరివారం ఉంటుంది. ఒక్క ఫోన్ కొట్టి, ‘అదేంటో చూడు’ అని చెబితే అంతటితో అయిపోతుంది ఎంతటి ఇష్యూ అయినా! కానీ నుస్రత్ కలవరపడ్డారు. ఆందోళన చెందారు. ఒక మామూలు ఆడపిల్లలా కలతకు, కోపానికీ గురయ్యారు. డేటింగ్ యాప్‌లో తన ఫొటో కనిపించడం అందుకు కారణం. మొదట స్త్రీ. ఆ తర్వాతే ఆమె శక్తిమంతమైన ఒక రాజకీయ నాయకురాలు. నుస్రత్‌కు పెళ్లయింది. భర్తకు ఆ సంగతి తెలిస్తే తన కాపురం కూలిపోతుందని కాదు. పెద్ద బంధుగణం ఉంది. వారికి తెలిస్తే పరువు పోతుందని కాదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన లీడర్‌గా పేరుంది. ఆ పేరు పోతుందని కాదు. యువతీయువకుల్లో పెద్ద ఫాలోయింగ్ ఉంది. వాళ్లలో ఇమేజ్ తగ్గుతుందని కాదు. ఒకానొక డేటింగ్ యాప్‌లో ఆమె ఫొటో రావడంలో వింత కూడా ఏమీ లేదు. ముక్కూమొహం లేని వ్యాపారులు ఇలా చక్కటి ముక్కూమొహం కలిగిన ప్రముఖుల ఫొటోలతో నలుగురి కంట్లో పడేందుకు ప్రయత్నించడం సాధారణమైన విషయమే. పైగా నుస్రత్ సినీతార. గత ఏడాది రాజకీయాల్లోకి రాకముందు వరకు దాదాపు ఇరవై సినిమాల్లో నటించారు. బెంగాలీ. సామాజిక స్పృహ ఉన్న అమ్మాయి. మమతాబెనర్జీ పిలిచి మరీ సీటిస్తే బసిర్హాట్ లోక్‌సభ నియోజవర్గానికి పోటీ చేసి బీజేపీ ప్రత్యర్థి మీద మూడున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. (నా ఫొటో వాడారు: పోలీసులకు నటి ఫిర్యాదు) సినీ గ్లామర్, పొలిటికల్ గ్లామర్ రెండూ ఉన్న యువ పార్లమెంటేరియన్ నుస్రత్. కనుక ఆమె ఫొటోను వాడుకోవడంలో ప్రయోజనమే తప్ప ప్రమాదం ఏమీ ఉండదని ఆ డేటింగ్ యాప్ భావించినట్లుంది. కానీ అనుమతి తీసుకోకుండా ఫొటోను వాడటం.. అది ఆగ్రహం తెప్పించింది నుస్రత్‌కు. ఫొటో వాడుకుంటున్నాం అని చెప్పాలి. లేదా వాడుకుంటాం అని అడగాలి. రెండూ చేయలేదు! ‘ఫ్యాన్సీ యు’ అనేది వీడియో చాట్ యాప్. ‘లాక్డౌన్లో ఇంట్లో కూర్చునే కొత్త ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అవండి’ అనే స్లోగన్‌కు నుస్రత్ ఫొటోను వాడింది ఆ యాప్. అలా చేసినందుకు వల్ల యాప్‌కి రెండు విధాలైన ప్రయోజనం ఉంటుంది. కొత్తఫ్రెండ్స్ని కలుసుకోండి అని స్వయంగా నుస్రత్ చెప్పినట్లుగా ఉంటుంది. నుస్రత్ వంటి ఆహ్లాదకరమైన యువతులు పరిచయం అవుతారు అని యాప్ చెప్పినట్లుగానూ ఉంటుంది. మొత్తానికైతే నుస్రత్ కనిపించగానే కళ్లు కాసేపు అక్కడ ఆగిపోతాయి. అయితే, యాప్ ఆశించే ఆ ప్రయోజనాలపై నుస్రత్ కంప్లయింట్ చెయ్యడంలేదు. తన అనుమతి తీసుకోకుండా ఫొటోను వాడినందుకు చర్య తీసుకోవాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ సెల్‌కు కూడా ఒక కంప్లయింట్ ఇచ్చారు. దీనికి ఇంత చెయ్యాలా.. అంత స్థాయిలోని మనిషి అని అప్పుడే రాగాలు కూడా మొదలయ్యాయి. కానీ నుస్రత్ చేసింది కేవలం ఫిర్యాదు కాదు. ‘చిన్న అభ్యంతరాన్నయినా చూసీ చూడనట్లు వదిలేయొద్దు..’’ అని ఆడపిల్లలకు, మహిళలకు చెప్పడం కూడా! కాలేజ్‌లలో కనిపించే దృశ్యమే. అమ్మాయి చేతిలోంచి అబ్బాయి చొరవగా ఫోన్ లాగేసుకుంటాడు. ‘టేకెన్ ఫర్ గ్రాంటెడ్’ అన్నట్లు. ఆమె అనుమతి లేకుండానే ఆమె తరఫున నిర్ణయాలు కూడా తీసేసుకుంటాడు. ఆమెకు మాటైనా చెప్పకుండానే సినిమా టికెట్స్ తెచ్చేస్తాడు. రావడం వీలవదు అంటే అలుగుతాడు. మళ్లీ అదో టార్చర్. ఆడపిల్లను నాన్–లివింగ్ థింగ్‌గా చూడటమే అది! ఆఫీస్‌లలో కూడా ఈ ధోరణి ఉంటుంది. పర్సనల్ విషయాలలో అడగకుండానే సలహాలు ఇస్తుంటారు. జాగ్రత్తలు చెబుతుంటారు. ‘డూ ఇట్’ అని ఆజ్ఞాపిస్తుంటారు. అడగడం, చెప్పడం లేకుండా కొందరైతే ఫుడ్ కూడా ఆర్డర్ చేసేస్తుంటారు. అమ్మాయిలైనా, ఉద్యోగినులైనా.. వారిని అడగకనే, వారికి చెప్పకనే జరిగేవన్నీ స్నేహం కారణంగానే, సహోద్యోగి అయిన కారణంగానే జరిగేవి అయినా.. అనుమతించదగినవి మాత్రమైతే కాదని నుస్రత్ ఫిర్యాదు మేల్కొలుపుతోంది. -
నా ఫొటో వాడారు: పోలీసులకు నటి ఫిర్యాదు
కలకత్తా: అనుమతి లేకుండా తన ఫొటో ఉపయోగించిన వీడియో చాట్ యాప్‌పై నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మంగళవారం కలకత్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ ప్రమోషన్ కోసం తన ఫొటో వాడటంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు యాప్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె పోలీసులను కోరారు. అంతేగాక ప్రకటనకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విటర్లో షేర్ చేస్తూ పోలీసు కమిషనర్ అనుప్ శర్మను ట్యాగ్ చేశారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ.. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం సైబర్ సెల్‌తో దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. చదవండి: ‘టిక్‌టాక్ నిషేధం నోట్ల రద్దు వంటిదే’ -
‘టిక్‌టాక్ నిషేధం నోట్ల రద్దు వంటిదే’
కోల్‌కతా: భారత్‌లో టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్ యాప్‌లపై కేంద్రం ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో టిక్‌టాక్‌తో పాటు మిగిలిన కొన్నియాప్‌లను కూడా తొలగించారు. భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి కొంత మంది మద్దతు పలకగా.. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మాత్రం తీవ్రంగా మండిపడ్డారు. ఆమె బుధవారం కోల్‌కతాలోని ఇస్కాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టిక్‌టాక్ ఒక వినోదకరమైన యాప్ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం టాక్‌టాన్‌పై విధించిన నిషేధం ఒక హఠాత్తు పరిణామం అని మండిపడ్డారు. (టిక్‌టాక్ భారత ఉద్యోగులకు సీఈఓ లేఖ) ఈ నిషేధం వెనక ఉన్న వ్యూహాత్మక ప్రణాళిక ఏంటని నుస్రత్ జహాన్ సూటిగా ప్రశ్నించారు. మూకుమ్మడిగా చైనా కంపెనీలకు చెందిన యాప్స్‌ను నిషేధించడం వల్ల దేశంలోని యువత నిరుద్యోగులుగా మారితే పరిస్థితి ఎంటో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో విధించిన పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఎంతో నష్టపోయారని విమర్శించారు. ఇప్పడు టిక్‌టాక్‌ను నిషేధించటం వల్ల కూడా అంతే స్థాయిలో ప్రజలు నష్టపోతారని నుస్రత్ జహాన్ దుయ్యబట్టారు. ఇక టిక్‌టాక్ సీఈఓ భారతదేశంలోని తమ ఉద్యోగులకు లేఖ రాస్తూ.. టిక్‌టాక్ సంస్థ ఉద్యోగులు గర్వించదగిన సానుకూల అనుభవాలు, అవకాశాలను పునరుద్ధరించడానికి తమ శక్తి మేరకు పని చేస్తామని తెలిపిన విషయం తెలిసిందే. (ఇక టిక్‌టాక్ యాప్ పనిచేయదు) -
నెటిజన్లు ఫైర్.. ఫర్వాలేదు అంటున్న ఎంపీ
కోల్కత్తా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం డాన్స్ చేస్తున్న వీడియోను నుస్రత్ తన టిక్‌టాక్ అకౌంట్లో షేర్ చేశారు. సేవేజ్ ఛాలెంజ్ హాష్ ట్యాగ్‌తో వీడియోని పోస్ట్ చేసిన దానిని పార్లమెంటేరియన్ మిమిచక్రవర్తికి ట్యాగ్ చేశారు. ఆ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి నెటిజన్లు నుస్రత్‌పై ఫైర్ అవుతున్నారు. తన నియోజకవర్గమైన బషీర్‌హత్‌లో పేదలకు రేషన్ గురించి పట్టించుకోవడం మానేసి టిక్‌టాక్ చేయడంలో నస్రత్ బిజీగా ఉంది అంటూ ఒక యూజర్ ఆ వీడియోని షేర్ చేస్తూ కామెంట్ చేశాడు. మరో యూజర్ ట్వీటర్ యాక్టివిస్ట్ ఎంపీ తన నియోజకవర్గంలో ప్రజలు రేషన్ కోసం పోలీసుల చేతుల్లో దెబ్బలు తింటూ ఉంటే తను టిక్‌టాక్ వీడియోలు చేయడంలో బీజీగా ఉంది అన్నారు. (కొట్టుకున్న పోలీసులు, స్థానికులు) Instead of providing rations to the people of her Bashirhat Constituency,Nur Jahan is busy in TikTok.@TheUntamedFire,@IvanaPoddar,@iSanjuktaP,@promzzz,@warrior_bengal pic.twitter.com/YuYLlUO74R — #Jayanta Bhattacharya (@Jb21bh) April 24, 2020 మరి కొంత మంది ఈ వీడియో విషయంలో నస్రత్పై కాకుండా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై ఫైర్ అయ్యారు. మమతా బెనర్జీకి బెంగాల్ ప్రజల కన్నా అధికారమే ముఖ్యమని అందుకే ముస్లిం ప్రాంతమైన బషీర్‌హత్‌లో ఓట్ల కోసమే నస్రత్ని ఎంపీని చేశారని ఆరోపించారు. ఓటర్లు ఈ ఫ్రీ షో కోసమే ఆమెకు ఓట్లు వేసి గెలిపించారు అంటూ కామెంట్ మరొకరు చేశారు. మరో నెటిజన్ నస్రత్కి సపోర్ట్ చేస్తూ క్రిమినల్ ఎంపీ కంటే డాన్సింగ్ ఎంపీ బెటర్ అంటూ కామెంట్ చేశారు. ఇలాంటి కామెంట్లు వస్తున్నప్పటికి నస్రత్ మరో వీడియోని తన టిక్‌టాక్‌తో పాటు ట్విటర్లో కూడా పోస్ట్ చేశారు. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు అంటూ ఆ వీడియోకి క్యాప్షన్‌ని జోడించిన నస్రత్ హ్యాపీ ట్రోలింగ్, ట్రోలర్స్ అని కూడా జత చేశారు. (‘మీరు నామినేట్ అయ్యారని మరిచిపోకండి’) Oh and BTW, Sharing another fun post from my @TikTok_IN feed. An Artist always entertains 🙂 Happy Trolling, Trollers! #BePositive #SpreadLove #SpreadHappiness ❤️ pic.twitter.com/Rutf7Vli77 — Nusrat (@nusratchirps) April 24, 2020 -
తనెంతో కలర్‌ఫుల్: నుస్రత్ జహాన్
‘ఈ వీకెండ్ ఓ ప్రత్యేకమైన వ్యక్తితో.. బెలూన్ల కంటే తనే ఎంతో కలర్ఫుల్గా ఉన్నాడు’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ పోస్ట్ చేసిన ఫొటోలు నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. బెలూన్లు అమ్ముకునే పిల్లాడిని హత్తుకుని.. అతడిని ముద్దాడుతున్న నుస్రత్ వ్యక్తిత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘మీరు చాలా గొప్పవాళ్లు మేడమ్.. మీ మనసు విశాలమైంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. నుస్రత్ సదరు బాలుడితో ఉన్న ఫొటోలపై ప్రశంసలు కురిపిస్తూ వేలల్లో లైకులు కొడుతున్నారు. కాగా బెంగాలీ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నుస్రత్ జహాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. టర్కీకు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను వివాహం చేసుకున్న ఆమె.. పెళ్లి తర్వాతే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. బసిర్హాట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న నుస్రత్.. అస్తమాతో బాధపడుతూ ఇటీవల ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం కోలుకున్న ఆమె వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. View this post on Instagram Made my weekend special.. with the special one.. a 1 year and a half baby selling balloons 🎈.... was way more cuter and colourful than the balloons.. #loveforall #loveistheonlylanguage A post shared by Nusrat (@nusratchirps) on Dec 9, 2019 at 5:44am PST -
నాకంటే ముఖ్యమా!
ఆయన ఏదైనా బిజినెస్ ట్రిప్‌కి వెళుతుంటే.. ‘నాకంటే ముఖ్యమా?’ అని నుస్రత్ అని ఉండొచ్చు. ఆమె పార్లమెంట్ సమావేశాలకు సిద్ధమౌతుంటే.. ‘నాకంటే ముఖ్యమా?’ అని అతడు అని ఉండొచ్చు. అది ఒక విధమైన ప్రేమ వ్యక్తీకరణే తప్ప, ఒకరి విధులకు ఒకరు విఘాతం కలిగించే, దంపతుల మధ్య అగాధం సృష్టించే మాటైతే కాదు. ఈ సంగతిని వదంతులు సృష్టించేవారు గ్రహించాలి. నిండా చేపలున్న చెరువులా ఉంది కొత్త లోక్‌సభ! పాత చేపలు, కొత్త చేపలు, ఫస్ట్ టైమ్ చేపలు. సభ శోభాయమానంగా ఉంది. సభా ప్రాంగణం కళకళలాడుతోంది. మోదీ, రాహుల్ వంటి నాయకులతో ప్రమాణ స్వీకారాలు ప్రారంభం అయ్యాయి. ఒక రోజు గడిచింది. రెండో రోజులో సగం గడిచింది. స్వీకారాలు సాగుతూనే ఉన్నాయి. తొలిసారి ఎంపీలు అయినవారు ప్రమాణ స్వీకారానికి ఉబలాటపడటం సహజమే. అయితే తొలిసారి ఎంపీలు అయిన ఒకరిద్దరు యువ మహిళా ఎంపీల ప్రమాణ స్వీకారాన్ని చూడ్డానికి దేశం ఉబలాటపడుతోంది! ఆ ఎంపీలలో ఒకరు నుస్రత్ జహాన్. బెంగాల్ నటి. తృణమూల్ కాంగ్రెస్ లీడర్. మూడు లక్షలకు పైగా మెజారిటీతో బీజేపీ అభ్యర్థిపై గెలిచిన బసిర్హాట్ ఎంపీ. పాలిటిక్స్ కొత్త. ఎంపీగా కొత్త. ఎంత ముందుండాలి ప్రమాణ స్వీకారానికి! నుస్రత్ వంతు వచ్చింది. కానీ నుస్రత్ రాలేదు. టైమ్‌కి రాలేకపోవడం కాదు. అసలు లోక్‌సభకే రాలేదు. అభిమానుల ప్రాణం ఉసూరుమంది. అగ్రనేతల కోపం తారస్థాయికి చేరుకుంది. కొత్తగా ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధి.. స్కూల్‌కి డుమ్మా కొట్టినట్లు సభకు ఆబ్సెంట్ అవడం ఏమిటి? ఎవరికీ సమాచారం లేదు. తర్వాతొచ్చింది సమాధానం. అదీ నుస్రత్ ట్విట్టర్ నుంచి. ‘టువర్డ్స్ ఎ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ విత్ నిఖిల్జైన్’ అని! నిఖిల్‌ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండబోతున్నారట!! ఈ ఏడాది జూన్ 19న నుస్రత్ ప్రమాణ స్వీకారం రోజే నుస్రత్ పెళ్లి మహోత్సవం. ఆ టైమ్‌కి టర్కీలో ఉన్నారు ఆవిడ, ఆమె దీర్ఘకాల ప్రియ సఖుడు నిఖిల్ జైన్! ఇద్దరూ దండలు మార్చుకుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటున్న ఫొటోని కూడా ట్విట్టర్లో పెట్టారు నుస్రత్. పార్లమెంటులో పెద్ద తలకాయలు ముఖాలు చూసుకున్నాయి. టర్కీలోని ‘సిక్స్ సెన్సెస్ కప్లాన్కయా’ అనే కొండ ప్రాంతపు రిసార్ట్‌లో నుస్రత్ వివాహం అతి గోప్యంగా జరిగింది. ‘‘ఈ పిల్లలకు సెన్స్ లేదు’ అనుకున్నారు కొందరు పార్లమెంటేరియన్లు. పిచ్చి పిచ్చి డ్రెస్‌లు వేసుకుంటుంది. కాలేజ్‌కి వచ్చినట్లు పార్లమెంటు ప్రాంగణంలో సెల్ఫీలు దిగుతుంటుంది. ప్రజలతో కూడా ఇలానే ఉంటుందా.. నాన్ సీరియస్‌గా.. అనుకున్నారు. వారం తర్వాతొచ్చి.. ‘‘నుస్రత్ అను నేను..’’ అంటూ ప్రమాణం చేశారు. పార్లమెంటు ప్రమాణం కన్నా, పెళ్లి ప్రమాణం ఎక్కువైందా నుస్రత్‌కు అని అప్పుడంతా బీజేపీ వాళ్లు సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. ‘‘నా కన్నా ముఖ్యమా?!’’ అని ఆమె భర్త ఆమెను ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేశాడని కూడా అప్పుడొక రూమర్ వచ్చింది. పార్లమెంటు సభ్యురాలిగా.. నుస్రత్ జహాన్ 2019 నవంబర్ 18 సోమవారం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. సభలో నుస్రత్ జహాన్ లేరు. వర్షాకాల సమావేశాల తొలిరోజు నుస్రత్ లేరు, ఇప్పుడీ శీతాకాల సమావేశాల తొలిరోజూ నుస్రత్ లేరు. ఏమైందీ అమ్మాయికి!! హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని వార్త. ఐసీయులో ఉన్నారని ఇంకో వార్త. అంతకుమించి వివరాలేమీ లేవు. సోషల్ మీడియా కామ్‌గా ఉంటుందా? తవ్వడం మొదలు పెట్టింది. ఆదివారం ఆమె భర్త పుట్టినరోజు. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. తెల్లారే నుస్రత్ ఢిల్లీలో ఉండాలి. లోక్‌సభలో ఉండాలి. కానీ హాస్పిటల్లో ఉన్నారు! కోల్‌కతాకు ఢిల్లీకి మధ్య దూరం దాదాపు వెయ్యీ ఐదొందల కిలోమీటర్లు. విమానంలో రెండుగంటల జర్నీ. ఎంతో అవసరం అయితే తప్ప తెల్లవారుజామునే ఢిల్లీ బయల్దేరి హడావుడిగా పార్లమెంటుకు వెళ్లాలని అనుకోరు ఎవరైనా. ఒకరోజు ముందు వెళ్తారు. ఒకరోజు ముందే నుస్రత్ ఎందుకు ఢిల్లీ వెళ్లలేదు అనే ప్రశ్నకు సమాధానం ఉంది. భర్త పుట్టినరోజు. రెండో రోజైనా తెల్లవారు జామునే ఎందుకు బయల్దేర లేదు అనే ప్రశ్నకూ సమాధానం ఉంది. ఆమె హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనే దానికి మాత్రం ఉండీ లేనట్లుంది!! వేసుకుంటున్న మందుల మోతాదు మించిపోయి నుస్రత్‌కు ఊపిరి ఆడటం ఇబ్బందయిందని, అందుకే ఆసుపత్రిలో చేర్చారని సమాధానం. నుస్రత్ ఆస్త్మా పేషెంట్. అందుకే ఇన్హేలర్ వాడుతుంటారు. ఇన్హేలర్ కూడా పని చేయనంతగా అకస్మాత్తుగా ఆమెను ఆస్త్మా ఎటాక్ చేసిందా! సమాధానం లేదు. సోషల్ మీడియాలో రూమర్లు. ‘‘నా కన్నా ముఖ్యమా?!’’ అని మళ్లీ ఆమె భర్త ఆమె ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేశాడా.. అనుమానం. నుస్రత్ డైనమిక్ లేడీ. ముస్లిం అయి ఉండీ, హిందూ సంప్రదాయాలను పాటిస్తున్నందుకు తనపై తరచూ వస్తుండే విమర్శల్ని ఆమె ఏనాడూ ఖాతరు చేయలేదు. ‘‘నేను భారతీయురాలిని. నేను పాటిస్తున్నది భారతీయ సంప్రదాయం’’ అనేదే ఆమె ఎప్పుడూ ఇచ్చే సమాధానం. ఆమె భర్త బిజినెస్ మ్యాన్. ఇద్దరిదీ లవ్ మ్యారేజ్. లవ్‌లో, మ్యారేజ్‌లో ఎమోషనల్ బ్లాక్‌మెయిల్స్ ఉంటే ఉండొచ్చు. ఆయన ఏదైనా బిజినెస్ ట్రిప్‌కి వెళుతుంటే.. ‘నాకంటే ముఖ్యమా?’ అని నుస్రత్ అనొచ్చు. ఆమె పార్లమెంట్ సమావేశాలకు సిద్ధమౌతుంటే.. ‘నాకంటే ముఖ్యమా?’ అని అతడు అనొచ్చు. అది ఒక విధమైన ప్రేమ వ్యక్తీకరణే తప్ప, విధులకు విఘాతం కలిగించే, దంపతుల మధ్య అగా«థం సృష్టించే మాటైతే కాదు. అభిమానంతో కానీ, అనుమానంతో కానీ వదంతులు వ్యాపింపజేసేవారు.. ఒకటి గుర్తుంచుకోవాలి. వాళ్లలో వాళ్లు ఎన్ని అనుకున్నా, అనుకోకున్నా.. మనం అన్న మాటలే వాళ్లను ఎక్కువ హర్ట్ చేస్తాయి. మనమేమీ వాళ్లింట్లోని వాళ్లం కాదు కదా. కాస్త దూరం పాటించాలి. కనీసం వాళ్ల ఇంటి లోపలికి వెళ్లనంత దూరమైనా! వదంతులు తల్లి డింపుల్‌తో ట్వింకిల్ (జూన్ 8న డింపుల్ పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వింకిల్ పెట్టిన ఫొటో) నుస్రత్ జహాన్‌ను ఆసుపత్రిలో చేర్పించారన్న వార్త రావడానికి ముందు రోజు డింపుల్ కపాడియా (62) ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారనే ఒక వార్త వదంతులకు కారణం అయ్యింది. మీడియా ప్రతినిధి ఒకరు నేరుగా డింపుల్కే ఫోన్ చేసి అడిగినప్పుడు మొదట ఆమె నిర్ఘాంతపోయారు. ఆ వెంటనే నవ్వేస్తూ.. ‘‘నేను కాదు. మా మదర్ హాస్పిటల్లో ఉన్నారు. ఆవిడ కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు’’ అని చెప్పారు. అంతకు ముందు అమితాబ్ బచ్చన్ సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లడం చూసి సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై వదంతులు రేగాయి. ‘‘నేను బాగున్నాను’’ అని ఆయనకై ఆయన వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. -
ఆస్పత్రిలో చేరిన ఎంపీ నుస్రత్ జహాన్!
కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతూ.. కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నుస్రత్ అస్తమాతో బాధ పడుతోందని.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురైన కారణంగా.. ఆమెను ఆదివారం ఉదయం ఆస్పత్రితో చేరారని ఈ మేరకు నుస్రత్ జహాన్ కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం నుస్రత్ ఐసీయూలో ఉన్నారని.. ఆరోగ్యం నిలకడగానే ఉందని సోమవారం ఆమె కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. బసిర్హాట్ నియోజకవర్గానికి తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ తరపున పోటీచేసిన నుస్రత్ జహాన్ తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను ఆమె వివాహమాడి సంచలనాలకు, వివాదాలకు మారు పేరుగా నిలిచారు. -
‘దేవుని ప్రత్యేక బిడ్డను.. అలాంటివి పట్టించుకోను’
కోల్‌కతా : తాను దేవుని ప్రత్యేక బిడ్డనని, అన్ని మతాల పండగలను జరుపుకొంటానని పశ్చిమ బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తెలిపారు. శుక్రవారం తన భర్త నిఖిల్ జైన్‌తో కలిసి నుస్రత్ చల్తాబాగన్లో బెంగాలీ హిందు సంప్రదాయమైన దుర్గా పూజలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సింధూర్ ఖేలా వేడుకలో సింధూరం ధరించారు. బెంగాల్లో నవరాత్రుల అనంతరం అక్కడి మహిళలు ఈ దుర్గా పూజలో పాల్గొంటారు. అందరికి మంచి జరగాలని దుర్గాదేవి కాలికి ఉన్న కుంకుమను నుదట ధరిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా నుస్రత్ కూడా నుదుటన కుంకుమ ధరించి పూర్తి హిందూ సంప్రదాయంలో కనిపించారు. అయితే ముస్లిం మహిళ ఇలా చేయడమేంటంటూ ఇప్పటికే అనేకమార్లు నుస్రత్ చర్యలను సంప్రదాయవాదుల తప్పుబట్టిన విషయం తెలిసిందే. మత సంప్రదాయాలకు విరుద్ధంగా నుస్రత్ ప్రవర్తిస్తుందని ఇస్లాంను కించపరచడానికే ఇలా చేస్తుందంటూ ఓ మతాధికారి విమర్శించారు. అంతేగాకుండా ఇకపై ముస్లిం పేరును కొనసాగించవద్దని, వెంటనే తన పేరును మార్చుకోవాలని సూచించారు. కాగా పూజా కార్యక్రమం అనంతరం నుస్రత్ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రేమ, మానవత్వానికే అన్నింటికంటే ఎక్కువ గౌరవం ఇస్తానని ఇప్పటికే ఈ విషయాన్ని ప్రజలకు చెప్పానని స్పష్టం చేశారు. తను దేవుని బిడ్డనని, తనపై వచ్చిన విమర్శల గురించి ఎప్పటికీ పట్టించుకోనని కొట్టిపారేశారు. ముస్లిం మహిళ అయినప్పటికీ.. హిందూ మతానికి చెందని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల అన్ని మతాలను, వారి సంప్రదాయాలను గౌరవిస్తానని ఎంపీ తెలిపారు. అదే విధంగా దుర్గ పూజలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. బెంగాల్లో పుట్టి పెరిగిన తను సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిస్తానని, అన్ని మతాల ఉత్సవాలను జరుపుకొంటానని అన్నారు. కాగా నటిగా కెరీర్ ప్రారంభించిన నుస్రత్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో అధికార టీఎంసీ తరఫున గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. -
ఎంపీ సుస్రత్ జహాన్ సింధూర్ కేలా
-
మరోసారి వార్తల్లో నూస్రత్..ధాక్‌తో సందడి
ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ ఎంపీ నూస్రత్ జహన్ మరో సారి వార్తల్లో నిలిచారు. కోల్‌కతాకు చెందిన పారిశ్రామిక వేత్త, భర్త నిఖిల్ జైన్‌తో కలిసి దుర్గా పూజలో సందడి చేశారు. ఎంపీ అయిన తరువాత తొలిసారి బెంగాల్లో జరుగుతున్న దసరా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాంప్రదాయ దుస్తుల్లో ఈ జంట దుర్గాదేవికి సోమవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతేకాదు దుర్గాష్టమి వేడుకల్లో సంగీత వాయిద్యమైన ధాక్ కూడా వాయించి అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను నిఖిల్ జైన్‌లో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి ప్రజలు సుఖసంతోషాలతో ప్రశాంతంగా జీవించాలని తాను అమ్మవారిని ప్రార్థించారని నూస్రత్ తెలిపారు. మనమంతా బెంగాల్ కుటుంబంలో భాగమని ఆమె వ్యాఖ్యానించారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందిన వెంటనే కోల్‌కతాకు చెందిన పారిశ్రామిక వేత్త నిఖిల్ జైన్‌ను పెళ్లాడి, కొత్త పెళ్లి కూతురుగా లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేసి వార్తల్లోనిలిచిన సంగతి తెలిసిందే. ఎంపీ నూస్రత్ జహన్, నిఖిల్ జైన్ దంపతులు View this post on Instagram Playing dhaak for the first time with my wonderful wifastic @nusratchirps @suruchisangha #aroopbiswas A post shared by Nikhil Jain (@nikhiljain09) on Oct 6, 2019 at 1:21am PDT -
డాన్స్‌తో అదరగొట్టిన మహిళా ఎంపీలు
కోల్‌కతా: సంచలనాలకు, వివాదాలకు మారు పేరుగా నిలిచారు తృణమూల్ కాంగ్రెస్ యువ ఎంపీలు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి. సినిమా రంగం నుంచి అది కూడా అతి చిన్న వయసులోనే పార్లమెంటుకు ఎన్నికయ్యి రికార్డు సృష్టించిన వీరు.. ప్రతి నిత్యం ఏదో ఓ వార్తతో మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. వీరిలో నుస్రత్ జహాన్ ముస్లిం అనే సంగతి తెలిసిందే. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆమె హిందూ సంప్రదాయ పద్దతిలో నుదుట సింధూరం, చీర ధరించి హాజరయ్యి విమర్శల పాలయ్యారు. అయితే తనను విమర్శించే వారిని పెద్దగా పట్టించుకోరు నుస్రత్. ఈ క్రమంలో తాజాగా ఈ యువ ఎంపీలు మరోసారి వార్తాల్లో నిలిచారు. పశ్చిమ బెంగాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బెంగాల్ ప్రజలు దుర్గా పూజ కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో దుర్గా పూజ ఉత్సవాల ప్రధాన్యతను తెలిపే థీమ్ సాంగ్‌ను ఒకదాన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్‌లో టీఎంసీ ఎంపీలు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి నటిచడం విశేషం. టీఎంటీ బార్ కంపెనీ రిలీజ్ చేసిన ఈ సాంగ్‌లో ఇద్దరు ఎంపీలు దుర్గా మాతను పూజిస్తూ.. డాన్స్ చేశారు. వీరితో పాటు మరో ప్రసిద్ధ బెంగాలీ నటి శుభశ్రీ గంగూలి కూడా ఈ ఆడిపాడారు. ‘ఆషే మా దుర్గా షే’ టైటిల్‌తో ఉన్న ఈ పాటకు ఇంద్రదీప్ దాస్ గుప్తా సంగీతం అందించారు. బాబా యాదవ్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ పాట ఇంటర్నెట్లో దుమ్ము రేపుతోంది. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ పాట ఇప్పటికే 1.5 మిలియన్ వ్యూస్ సంపాదించింది. -
హనీమూన్: భర్తతో విహరిస్తున్న ఎంపీ!
నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్, భర్త నిఖిల్ జైన్‌తో కలిసి మాల్దీవుల్లో ప్రణయయాత్ర చేస్తున్నారు. పార్లమెంటుకు తొలిరోజు వెస్టర్న్ దుస్తులు ధరించి వచ్చినందుకు తృణమూల్ ఎంపీలైన నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నూతన దంపతులైన నుస్రత్, నిఖిల్ ప్రస్తుతం మాల్దీవుల్లో హానీమూన్ జరుపుకొంటున్నారు. ఈ హనీమూన్‌కు సంబంధించి పలు ఫొటోలను నుస్రత్ జహాన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. యెల్లో ప్యాంట్, కలర్‌ఫుల్ ప్రింటెడ్ టాప్ ధరించి.. స్టైలిష్ హ్యాట్ పెట్టుకొని.. భర్తతో దిగిన ఓ ఫొటోను ఆమె పోస్టు చేశారు. మరోవైపు ఈ ప్రయణయాత్రలోనే ఆమె హిందూ మహిళల తరహాలో సంప్రదాయబద్ధంగా సింధూర దూజ్‌ను జరుపుకున్నారు. హిందూ వైవాహిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ.. చీరను ధరించి.. నుదుట కుంకమ పెట్టుకొని.. ఆమె భర్తతో కలిసి ఈ వేడుకను జరిపారు. ఇక, స్ట్రిప్డ్ బ్లూ టాప్ ధరించి ఒంటరిగా దిగిన ఫొటోను కూడా ఆమె పోస్టు చేయగా.. ‘హనీ.. హనీమూన్ ఎలా ఉంది’ అంటూ తోటి తృణమూల్ ఎంపీ మిమి చక్కవర్తి సరదాగా కామెంట్ చేశారు. ‘దీనికి ఇక్కడ హానీ బాగుంది. మూన్ బావున్నాడు. సూర్యుడే కొంచెం ఎక్కువ ఎండ కాస్తున్నాడు’ అంటూ నుస్రత్ తెలివిగా చమత్కరించారు. -
పరమత సహనంతో జీవించాలి
కోల్‌కతా: పరమత సహనంతో మెలగాలని చాటిచెబుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం కోల్‌కతాలో ఇస్కాన్ రథయాత్ర ప్రారంభ వేడుకలకు తమ పార్టీలోని ముస్లిం మహిళా ఎంపీ నుస్రత్ జహాన్‌తో కలిసి హాజరయ్యారు. హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకున్న నటి, బసిర్హత్ నియోజకవర్గ ఎంపీ నుస్రత్ ఇటీవల పార్లమెంటులో ప్రమాణం సందర్భంగా నుదుటన కుంకుమ, మంగళసూత్రం ధరించి హాజరయ్యారు. దీంతో ముస్లిం మతపెద్దలు ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేయడం తెల్సిందే. రథయాత్ర వేడుకలకు నుస్రత్ కుంకుమ, మంగళసూత్రంతో వచ్చారు. పూజలో పాల్గొని సీఎంతో కలిసి రథాన్ని లాగారు. ‘నేను ఇస్లాంను నమ్ముతాను. అలాగే అన్ని మతాలనూ గౌరవిస్తాను. మత పిచ్చితో వ్యాఖ్యలు చేసే వారిని నేను పట్టించుకోను. నా మతం ఏంటో, నేను ఏ దేవుణ్ని నమ్మాలో నాకు తెలుసు. నేను పుట్టుకతోనే ముస్లింని. ఇప్పటికీ ముస్లింనే. మతం అనేది మనిషి లోపల ఉండాలి. తలపై కాదు’ అని అన్నారు. -
‘ఆ ముగ్గురు’ ముచ్చెమటలు పట్టిస్తున్నారు
నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తి, మహువా మొయ్‌త్రా. ముగ్గురూ ఫస్ట్ టైమ్ ఎంపీలు. ముగ్గురూ పశ్చిమ బెంగాల్ ఎంపీలు. ముగ్గురూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు. ముగ్గురూ వేర్వేరే అయినా ఒక్కొక్కరూ ఒక్కో మమతా బెనర్జీ! ఇప్పుడా ముగ్గురూ ఢిల్లీలో ఉన్నారు. రోజూ పార్లమెంటు సమావేశాలకు వెళ్లొస్తున్నారు. ఊరికే వెళ్లిరావడం కాదు. ‘ఫస్ట్ టైమ్ కదా’ అని మౌనంగా కూర్చొని రావడం లేదు. వర్షాకాల సమావేశాలకే ముచ్చెమటలు పోయిస్తున్నారు! మాటల్తో ఒకరు.. ట్వీట్లతో ఒకరు.. యాటిట్యూడ్‌తో ఒకరు. మాటలు మొయ్త్రావి. ట్వీట్లు నుస్రత్వి. యాటిట్యూడ్ మిమీది. లక్ష్మి, పార్వతి, సరస్వతి.. త్రిశక్తులు. నేటి రాజకీయాల్లో కావలసింది. అలాంటి శక్తిమణులే. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఈ ముగ్గురు ఎంపీలూ త్రిమణులేనని అంటున్నారు బెంగాల్ ప్రజలు. పాలిటిక్స్‌లోకి రాకముందు మొయ్‌త్రా జేపీ మోర్గాన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. కంపెనీ ఉన్న న్యూయార్క్‌లో, కంపెనీ బ్రాంచ్ ఉన్న లండన్‌లో పని చేశారు. కెరీర్ బాగా పీక్‌లో ఉన్నప్పుడు పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. ‘పిచ్చా!’ అన్నారు తెలిసివాళ్లు. మొయ్‌త్రా పట్టించుకోలేదు. 2009లో విదేశాల నుంచి వచ్చీ రావడంతోనే బీజేపీ సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తోందనీ, కత్తెర వేస్తోందని విరుచుకుపడ్డారు. అప్పుడు మాత్రమే ఆమె ఎవరో బెంగాల్ ప్రజలకు తెలిసింది. ఇప్పుడీ సమావేశాల్లో దేశం మొత్తానికీ తెలిసింది. ఎన్డీయే నియంతృత్వ పోకడలపై ఆమె ప్రారంభ ప్రసంగం పార్లమెంట్‌ను ఊపి పడేసింది. సభలో ఆమె ఆవేశం, ఆగ్రహం, మాటల ప్రవాహం, ఆమె తీసిన పాయింట్లు, రూలింగ్ పార్టీని ఆమె పొడుతున్న పోట్లు ఇంటర్నెట్ను జామ్ చేశాయి. 543 మంది సభ్యులున్న లోక్‌సభ.. ఆమె మాట్లాడుతున్నంత సేపూ కళ్లింత చేసి చూస్తూనే ఉంది. ఒకరిద్దరు సీనియర్స్ ‘ఇక చాలు కూర్చోమ్మా’ అన్నారు. వాళ్ల మాటలు మొయ్‌త్రా ప్రసంగ ధ్వనిలో కొట్టుకుని పోయాయి. అపోజిషన్‌కు వేలు పెట్టడానికైనా పట్టు లేని సభలో ఆమె ఆ ఒక్క ప్రసంగంతో ‘ఉమన్ హీరో ఆఫ్ ది నేషన్’ అయ్యారు. మిగతా ఇద్దరు.. నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తి! ఇద్దరూ ముప్పైలలో ఉన్నవారు. బెంగాల్ గ్లామర్ ఇండస్ట్రీ నుంచి వచ్చినవారు. ఇప్పటికే పార్లమెంటు బయట నుస్రత్ జహాన్ తనేమిటో చూపించారు. పేరును బట్టి ఆమె ముస్లిం అని తెలుస్తూనే ఉంది. ముస్లిం అయి ఉండి, హిందూ సంప్రదాయం ప్రకారం నుదుటిపై సిందూరాన్ని పెట్టుకుని, చీర ధరించి పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసినందుకు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. వాటికి నుస్రత్ గట్టి సమాధానమే ఇచ్చారు. ‘సిందూరం భారతదేశానికి సంకేతం తప్ప ఒక కులానికో, మతానికో కాదు. హింసను, పగను ప్రేరేపించే ఉన్మాదుల కామెంట్లను నేను పట్టించుకోను. నేనేం ధరించాలన్నది పూర్తిగా నా ఇష్టం. ముస్లింగానే ఉంటూ అన్ని మతాలను గౌరవిస్తాను’’ అని నుస్రత్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలను మొదట సమర్థించినవారు సాటి ఫస్ట్ టైమ్ ఎంపీ మిమీ చక్రవర్తి. ‘‘నుస్రత్ నిజమైన భారతీయ స్త్రీని ప్రతిబింబించింది’’ అన్నారు మిమీ. భారతీయ ఇస్లాం ప్రపంచంలో మాత్రం నుస్రత్ మాటలకు పెద్ద దుమారమే చెలరేగింది. యూపీలోని ప్రసిద్ధ ‘జమీమా షేక్ ఉల్ హింద్’ మత పెద్ద అసద్ క్వాస్మీ మరికొంచెం వెనక్కు వెళ్లి నుస్రత్‌ను విమర్శించారు. ‘‘ఇస్లాంలో ఇతర మతస్థుల వారిని పెళ్లి చేసుకోవడం నిషిద్ధం. కానీ నుస్రత్ జైనమతానికి చెందిన వ్యక్తిని వివాహమాడారు. సిందూరం ధరించడం ఇస్లాంకు వ్యతిరేకం. అయినా ఆమె ధరించారు. నుస్రత్ సినిమా రంగం నుంచి వచ్చినట్లు నాకు తెలియదు. సినిమా వాళ్లు సంప్రదాయాలు పాటించరు’’అని అసద్ అన్నారు. ఆయన అలా అంటే.. బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోలా అన్నారు. నుస్రత్‌ను హిందూ మతంలోకి ఆహ్వానించారు. అక్కడితో ఆగకుండా.. ‘‘భవిష్యత్తు హిందూమతంలోనే సురక్షితంగా ఉంటుందని, హిందూమతం స్త్రీలను గౌరవిస్తుందని నుస్రత్ గుర్తించారు’’ అని అన్నారు. ఎవరికి కావలసిన విధంగా వారు నుస్రత్ వ్యాఖ్యలకు అన్వయం చెప్పుకున్నప్పటికీ ఆమె ఉద్దేశం మాత్రం ఒకటే. తను భారతీయురాలినని చెప్పడం. అసలు నుస్రత్, మిమీ ఢిల్లీలో తొలిసారిగా దేశ ప్రజలకు సాక్షాత్కరించినప్పుడే పార్లమెంటు ప్రాంగణం ఒక విధమైన యవ్వనశోభతో అలరారింది. ‘‘ఎవరీ అమ్మాయిలు?’’ అనుకున్నారు. ‘‘అమ్మాయిలు కాదు. ఎంపీలు’’ అనే సమాధానం వచ్చింది. ‘‘ఎంపీలేంటి ఇంత అందంగా!’’ అని మరో ప్రశ్న. ‘‘సినిమావాళ్లు కదా’’ అని సమాధానం. ‘‘ఎంత సినిమావాళ్లు అయితే మాత్రం పార్లమెంటుకు ఇలాగా రావడం.. ఇంత మోడర్న్‌గా, ఫస్ట్‌డే కాలేజీకి వచ్చినట్లుగా’’ అని విమర్శ. ఆ రోజేం జరిగిందో చూడండి. ఇద్దరూ స్మార్ట్ క్యాజువల్స్లో ఉన్నారు. క్యాజువల్‌గా పార్లమెంటుకు వచ్చినట్లు వచ్చారు. దెబ్బకు ఇంటర్నెట్ ‘టిజ్జీ’ అయిపోయింది. టిజ్జీ అంటే యాంగ్జయిటీ, కన్ఫ్యూజన్. ‘‘వీళ్లేంట్రా బాబూ.. ఇంతందంగా ఉన్నారు’’ యూత్ ఆశ్చర్యపోయింది. నిజమే. రాజకీయాల్ని కొత్తగా నిర్వచించడానికి పనిగట్టుకుని ఎంపీలుగా ఎన్నికై పార్లమెంటుకు వచ్చినట్లుగా అనిపించారు నుస్రత్, మిమీ. అక్కడ గోల్గప్పా, పానీపూరీ తిన్నారు. యంగ్ గర్ల్స్ అండ్ ఉమెన్‌తో సెల్ఫీలు దిగారు. తర్వాత నుస్రుత్ టర్కీ వెళ్లిపోయి తన ఫ్యాషన్ బిజినెస్ పార్టనర్ నిఖిల్ జైన్‌ను పెళ్లి చేసుకుని వచ్చారు. అందుకే తొలి విడత ప్రమాణ స్వీకారాలలో ఆమె పార్లమెంటులో లేరు. ఒక ఇంగ్లిష్ చానెల్ అయితే ఇరవై నాలుగ్గంటలూ నుస్రుత్ చుట్టూతానే తిరిగింది. ఆమె హోమ్‌లో ఉంటే హోమ్‌కి. జిమ్‌లో ఉంటే జిమ్‌కి. బసిర్హాట్లో ఉంటే బసిర్హాట్కి. అది ఆమె ఎన్నికైన పార్లమెంటు నియోజకవర్గం. ముస్లిం అభ్యర్థిగా ఎన్నికై, ‘నుస్రత్ జహాన్ రూహీ జై అనే నేను’ అని ప్రమాణ స్వీకారం చేశారామె! ‘జై హింద్’, ‘వందేమాతరం’, ‘జై బంగ్లా’ అన్నారు చివర్లో. ఒక్కరు మాట్లాడితే ఒట్టు.. ‘దేశమంతా నాకొక్కటే’ అని ఆమె ఆ టైప్‌లో చెప్పేశాక. ఇక దక్షిణ కోల్‌కతాలోని జాదవ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎంపికైన మిమీ చక్రవర్తి.. సభలో గానీ, బయటగానీ ఎలా ఉండబోతారో ఇప్పటికైతే పూర్తిగా తెలియనప్పటికీ.. సొంత వ్యక్తిత్వం, సొంత అభిప్రాయాలు గల వ్యక్తిగా ఆమె ఇప్పటికే తనని తను రుజువు చేసుకున్నారు. ఓటు వేసి గెలిపించిన సొంత నియోజకవర్గం ప్రజలే.. ‘ఏమిటమ్మాయ్.. ఆ దుస్తులు! పార్లమెంటుకు వచ్చేశావ్ కదా.. కాస్త ఒద్దికైనవి వేసుకో’’ అన్నప్పటికీ చిరునవ్వు నవ్వారే తప్ప కొంచెం కూడా తన డ్రెసింగ్ స్టెయిల్‌ని మార్చుకోలేదు. ‘నా బట్టలదేముందిలెండి అత్తయ్యగారూ.. మీకేం కావాలో చెప్పండి.. చేసిపెడతాను’ అని కొత్త కోడలి లౌక్యంతో వాళ్ల అభీష్టాన్ని సున్నితంగా తిరస్కరించారు. చెప్పినట్లు చెయ్యకపోవచ్చు కానీ, అడిగింది చేసిపెట్టగల పిల్లే అనుకున్నారు కాబట్టే జాదవ్‌పూర్ ఓటర్లు ఆమెను గెలిపించారు. మిమీ చక్రవర్తిపై పోటీచేసి ఓడిపోయిన వ్యక్తులు సామాన్యులేమీ కాదు. బీజేపీ ప్రత్యర్థి అనుపమ్హజ్రా టీచర్. సామాజిక కార్యకర్త. గ్రామీణ పారిశుధ్యంలో డాక్టరేట్ ఉంది. గ్రామీణాభి వృద్ధి మీద ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. అంతర్జాతీయ పత్రికల్లో ఆయన వ్యాసాలు వస్తుంటాయి. అన్నిటినీ మించి బీజేపీ కార్డు ఉంది. అయినప్పటికీ మిమీపై ఓడిపోయారు. సీపీఎం ప్రత్యర్థి వికాస్ రంజన్ భట్టాచార్య మాజీ మేయర్. ‘లా’ తెలిసినవారు. చిన్నవయసులోనే రాజకీయాలలోకి వచ్చిన వారు. ఆయనా ఓడిపోయారు. వాళ్లిద్దర్నీ వదిలేసి ‘అందమైన ముఖం’గా మాత్రమే సుపరిచితురాలైన మిమీని గెలిపించుకుంది జాదవ్‌పూర్. మళ్లొకసారి మహువా మొయ్‌త్రా దగ్గరికి వద్దాం. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ లోపు సెంటర్‌కి, బెంగాల్‌కీ; మోదీకి, మమతకు మధ్య ఫైర్ అండ్ వార్ ఎలాగున్నా.. వచ్చే ఐదేళ్లూ పార్లమెంట్లో మొయ్‌త్రా ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అనే గమనింపు దేశవ్యాప్తంగా ఉంటుంది. ప్రధానీ ఉంటారు. అలాంటి ఒక ఎంపీ బీజేపీలో ఉంటే బాగుంటుందన్న ఆలోచన ఆయనకు వచ్చినా రావచ్చు! అంత గట్టి షాక్ ఇచ్చారు మొయ్‌త్రా తన స్పీచ్‌తో.. బీజేపీ పాలనలో దేశం నియంతృత్వంలోకి వెళుతోంది అనడానికి ఇవిగో.. ప్రాథమిక సంకేతాలు అని ఆమె ఒక్కో పాయింట్నీ సభలో ఎత్తి చూపారు. ఎవరైనా అడ్డు తగిలినప్పుడు ‘దయచేసి వాళ్లను అదుపు చేయండి’ అని మొయ్‌త్రా విజ్ఞప్తి చేస్తున్న ప్రతిసారీ ఆమె దేశంలోని లక్షలాది మంది వర్కింగ్ ఉమన్ తరఫున మాట్లాడినట్లే ఉంది. అధికారపక్షంలో పెద్ద తలకాయలు ఉంటాయి. అవి ప్రతిపక్షంలోని ‘పిల్లల్ని’ మాట్లాడనివ్వవు. విమర్శించనివ్వవు. ఆరోపణలు చేయనివ్వవు. ఆ పెద్ద తలకాయల్ని సైతం.. తను మాట్లాడుతున్నంత సేపూ ఒక ఆర్డర్లో పెట్టగలిగారు ఈ కృష్ణానగర్ ఎంపీ మొయ్‌త్రా. బీజేపీని తట్టుకుని తృణమూల్ కాంగ్రెస్ నిలబడగలిగితే కనుక మెయ్త్రా వచ్చే ఎన్నికల నాటికి పశ్చిమబెంగాల్ సీఎం అభ్యర్థిగా ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. నుస్రత్ జహాన్ (29) బెంగాలీ నటి. బసిర్ మాట్ ఎంపీ ∙ఈ ఏడాది మార్చిలో రాజకీయాల్లోకి వచ్చారు ∙చదువంతా కోల్‌కతాలోనే. డిగ్రీ చదివారు ∙‘ఫెయిర్ వన్ మిస్ కోల్‌కతా’ టైటిల్ (2010) విజేత. బీజేపీ ప్రత్యర్థి శాయంతన్ బసుపై 3.5 లక్షల మెజారిటీతో గెలిచారు ∙సెవన్ (2020 రిలీజ్) అనే సినిమాకు సంతకం చేశారు. మిమి చక్రవర్తి (30) సినిమా, టీవీ నటి. జాదవ్‌పూర్ ఎంపీ∙ ఈ ఏడాదే పాలిటిక్స్‌లోకి వచ్చారు∙ ‘మోస్ట్ డిజైరబుల్ ఉమన్’ (2016 టైమ్స్ లిస్ట్). ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ. చేతిలో ఇంకా రెండు మూడు సినిమాలు ఉన్నాయి∙ నిర్మొహమాటంగా మాట్లాడతారని పేరు. మహువా మొయ్‌త్రా (44) 2019 మే 23 వరకు కరీంపూర్ ఎమ్మెల్యే ∙ప్రస్తుతం కృష్ణానగర్ ఎంపీ. కోల్‌కతాలో ఎకనమిక్స్, యు.ఎస్.లో మ్యాథ్స్ చదివారు ∙జాబ్ వదులుకుని 2009లో పాలిటిక్స్‌లోకి వచ్చారు∙ మొదట కాంగ్రెస్‌లో, తర్వాత తృణమూల్‌లో చేరారు. మోర్గాన్‌లో అనే కొలీగ్‌నే పెళ్లాడారు. -
వాటిని రాజకీయాలతో పోల్చొద్దు: జహాన్
కోల్‌కతా: పార్లమెంట్లో తృణముల్ కాంగ్రెస్ ఎంపీగా నుస్రత్ జహాన్ సింధూరం, మంగళసూత్రంతోనే ప్రమాణం చేయడం ముస్లిం మత వర్గానికి ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా పశ్చిమబెంగాల్లో ఇస్కాన్ సంస్థ నిర్వహించిన వార్షిక రథయాత్రకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి నుస్రత్ జహాన్ అదే వస్త్రధారణతో హాజరవడం చర్చనీయాంశమైంది. ఇదే విషయమై నుస్రత్ మీడియాతో మాట్లాడుతూ.. 'నేను పుట్టుకతోనే ముస్లింనని, నాకు నా మతమేంటో తెలుసని, ఇలాంటి చిన్న చిన్న విషయాలను నేను పట్టించుకోనని' ఘాటుగానే స్పందించారు. తాను ఒక ఎంపీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యానని, మతాన్ని రాజకీయంతో పోల్చడం తగదని ఆమె పేర్కొన్నారు. మరోవైపు నుస్రత్ జహాన్ చేసిన వాఖ్యలపై ఇస్కాన్ ప్రతినిధి రాధా రామ్‌దాస్ ట్విటర్లో స్పందించారు. 'రథయాత్ర వేడుకకు వచ్చినందుకు ముందుగా అభినందనలు. మీరు చేసిన వాఖ్యలు మాకు ఆనందాన్ని కలిగించాయి. మీ మతాన్ని గౌరవిస్తూనే ఇతర వేడుకలకు హాజరవడం మత సామరస్యాన్ని పెంపొందించింది. దీన్ని మీరు ఇలాగే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం' అని ట్వీట్ చేశారు. ఇంతకుముందు సీఎన్ఎన్-న్యూస్ 18 చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నుస్రత్ జహాన్ తన పెళ్లి విషయమై మాట్లాడుతూ... ‘నేను ఒక హిందువును పెళ్లాడిన సంగతి మీకు తెలిసిందే. నా నుదుటి మీద బొట్టును చూసి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ సంప్రదాయానికి అణుగుణంగానే నడుచుకుంటున్నా. ప్రతి వ్యక్తికి సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. నేను ముస్లిం మతాన్ని, మావారు హిందూ మతాలను గౌరవిస్తాం. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికుంటాయ’ని ఆమె పేర్కొన్నారు. -
‘రథయాత్ర’కుఎంపీ నుస్రత్ జహాన్!
కోల్‌కతా : ఇటీవల వరుస వివాదాలతో సంచలనంగా మారిన నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. కోల్‌కతాలోని ప్రముఖ ఇస్కాన్ దేవాలయంలో గురువారం వైభవంగా జరిగే రథయాత్ర ప్రారంభోత్సవాలకు ఆమె హాజరుకానున్నారు. దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు భర్తతో సహా అక్కడికి వెళ్లనున్నారు. కాగా తమ అభ్యర్థనను మన్నించినందుకు ఇస్కాస్ దేవాలయ అధికార ప్రతినిధి రాధరామన్ దాస్.. నుస్రత్ జహాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ఇటువంటి ఉత్సవాలకు హాజరవుతూ.. సమ్మిళిత భారతం వైపు అడుగులు వేయటం గొప్ప పరిణామమని ప్రశంసించారు. నుస్రత్ వ్యవహరించే తీరు మెరుగైన సమాజం వైపు దారి చూపుతోందన్నారు. కాగా ముస్లిం మతస్తురాలైన నుస్రత్ జహాన్ ఇటీవలే ఓ వ్యాపారవేత్తను పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. వివాహానంతరం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె.. నుదుట సింధూరం, చీర ధరించి హిందూ సంప్రదాయ పద్ధతిలో పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెపై ట్రోలింగ్ జరిగింది. వాటికి అంతే దీటుగా ఆమె కూడా ట్విటర్ ద్వారా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను సమ్మిళిత భారత్‌ను సూచించేలా సింధూరాన్ని ధరించానని జవాబిచ్చారు. సింధూరం కుల, మత, వివక్షలకు అతీతమైనదని అన్నారు. హింసను, పగను రెచ్చగొట్టే ఉన్మాదుల కామెంట్లను తాను పట్టించుకోన్నారు. తాను ముస్లింగానే ఉంటానని, కానీ అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టంచేశారు. తానేం ధరించాలో తన ఇష్టమని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో ఇస్కాన్ రథయాత్ర ప్రారంభోత్సవాలకు నుస్రత్ హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
ట్రోల్స్‌కు బదులిచ్చిన ఎంపీ నుస్రత్ జహాన్
న్యూఢిల్లీ: హిందువులు ధరించే సిందూరాన్ని పెట్టుకొని, చీర ధరించి ఇటీవల పార్లమెంట్లో గత నెల ప్రమాణస్వీకారం చేసినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్‌ను నెటిజన్లు ట్రోల్ చేయగా ఆమె వాటికి ట్విటర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. తాను సమ్మిళిత భారత్‌ను సూచించేలా సిందూరాన్ని ధరించానని ధీటుగా జవాబిచ్చారు. అది మతం, కులం, వివక్షలకు అతీతమైనదని అన్నారు. హింసను, పగను రెచ్చగొట్టే ఉన్మాదుల కామెంట్లను తాను పట్టించుకోన్నారు. తాను ముస్లింగానే ఉంటానని, కానీ అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టంచేశారు. తానేం ధరించాలో తన ఇష్టమని తెలిపారు. ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి, నుస్రత్ నిజమైన భారతీయ స్త్రీని ప్రతిబింబించిందని అన్నారు. సహారాన్పూర్లోని జమీమా షేక్ ఉల్ హింద్‌కు చెందిన మత పెద్ద అసద్ క్వాస్మి మాట్లాడుతూ ఇస్లాంలో ఇతర మతాల వారిని పెళ్లి చేసుకోవడం నిషిద్ధమన్నారు. అయిప్పటికీ ఆమె జైన్ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని అన్నారు. సిందూరం ధరించడం ఇస్లాంకు వ్యతిరేకమన్నారు. ఆమె సినిమా రంగానికి చెందిన వ్యక్తి అని తనకు తెలిసిందని, సినిమా రంగంవారు మత సంప్రదాయాలను పాటించరన్నారు. ఆమెను తమ మతంలోకి ఆహ్వానిస్తున్నామని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అన్నారు. భవిష్యత్తు తమ మతంతోనే సురక్షితంగా ఉందని, హిందూ మతం స్త్రీలను గౌరవిస్తుందని నుస్రత్ గుర్తించిందన్నారు. -
‘అరే.. మమ్మల్ని కింద పడేస్తారా ఏంటి’
కోల్‌కతా : తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయిన నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తీలు లోక్‌సభ సభ్యులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం బయటకు వచ్చిన మహిళా ఎంపీల చుట్టూ విలేకరుల గుమిగూడారు. వారిని కదలనీయకుండా చుట్టుముట్టి.. ప్రశ్నలు అడుగుతూ.. ఫోటోలు తీస్తూ ఇబ్బంది పెట్టారు. ముందుకు వెళ్లడానికి దారి లేకుండా చుట్టూ చేరారు. ఒకానొక సమయంలో ఈ మహిళా ఎంపీలు తిరిగి పార్లమెంట్‌లోకి వెళ్దామనుకున్నారు. కానీ అది కూడా వీలు పడలేదు. దాంతో తమకు దారి ఇవ్వాల్సిందిగా విలేకరులను కోరారు. అయితే వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు. దాంతో సహనం కోల్పోయిన ఈ యువ ఎంపీలు విలేకరుల మీద మండి పడ్డారు. ‘మీరంతా ఇలా చుట్టుముట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని పడేస్తారా ఏంటి.. అర్థం చేసుకోండి.. మమ్మల్ని వెళ్లనివ్వండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఇబ్బంది గమనించిన భద్రతా సిబ్బంది అక్కడకు వచ్చి.. ఎంపీలు వారి వాహనం వద్దకు వెళ్లేందుకు సాయం చేశారు. కారు దగ్గరకి వచ్చాక కూడా విలేకరులు వీరిని వదిలిపెట్టలేదు. ఒక్క ఫోటో అంటూ ఇబ్బంది పెట్టారు. దాంతో ఈ మహిళా ఎంపీలు క్యూలైన్లో తమకు దూరంగా నిలబడితే ఫోటో దిగుతామని కండిషన్ పెట్టి.. ఫోటోలు దిగి అక్కడ నుంచి బయటపడ్డారు. -
పెళ్లి తర్వాత ప్రమాణ స్వీకారం
-
పెళ్లి తర్వాత ప్రమాణ స్వీకారం
తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయిన నుస్రత్ జహాన్, మిమి చక్రబర్తీలు లోక్‌సభ సభ్యులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. తమ ప్రమాణ స్వీకారం ’బంగ్లా’లో చేసిన వీరు, తమ ప్రసంగం చివరలో ’వందేమాతరం’, ’జై హిందీ’, ’జై బంగ్లా’ వంటి పదాలు ఉపయోగించారు. తర్వాత వెంటనే లోక్‌సభ స్పీకర్ ’ఓం బిర్లా’కు పాదాభివందనం చేశారు. నుస్రత్ జహాన్ ఇటీవలే టర్కీకు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను వివాహం చేసుకోగా, మిమి చక్రబర్తీ ఆ వేడుకకు హాజరయ్యారు. దీంతో మంగళవారం సభకు వచ్చిన ఈ ఇద్దరు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నుస్రత్ జహాన్ బసిర్హాట్, మిమి జాదవ్‌పూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
వ్యాపారవేత్తను పెళ్లాడిన నటి
కోల్‌కతా: బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ పెళ్లి చేసుకున్నారు. వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను ఆమె వివాహమాడారు. టర్కీలోని బొడ్రమ్ నగరంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో బుధవారం వీరి పెళ్లి జరిగింది. నిఖిల్‌ను పెళ్లాడినట్టు ట్విటర్ ద్వారా జహాన్ వెల్లడించారు. తమ పెళ్లి ఫొటోను షేర్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన పెళ్లి దుస్తుల్లో వధూవరులు మెరిశారు. నూతన దంపతులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బాసిర్హాత్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నుస్రత్ జహాన్ 3,50,369 మెజార్టీతో ఘన విజయం సాధించారు. పెళ్లి చేసుకునేందుకు టర్కీ వెళ్లడంతో లోక్‌సభ సభ్యురాలిగా ఆమె ఇంకా ప్రమాణం స్వీకారం చేయలేదు. స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత ఎంపీగా ఆమె ప్రమాణం చేయనున్నారు. (చదవండి: ‘ఇరుకు’ మాటలు) -
‘ఇరుకు’ మాటలు
‘హవ్వా! పాశ్చాత్య దుస్తులు ధరించి పవిత్రమైన పార్లమెంట్ ముందు ఫొటోలు దిగుతారా? ఇదేమైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నారా? ఎప్పుడు ఎలాంటి వస్త్రధారణ ఉండాలో మీకు తెలియదా? ఇదేమి షూటింగ్ స్పాట్ కాదు, హాలిడే డెస్టినేషన్ కాదు. పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. టిక్‌టాక్‌ల స్థలం కాదు. పేజ్‌త్రీ పార్టీకి వెళ్లినట్టుగా ఆ డ్రెస్ ఏంటి? ఫొటోలు తీసుకోవడం మానేసి పని మీద దృష్టిపెట్టండి’ ఇలా అనేక రకాల కామెంట్లు చేశారు. ఆధునిక దుస్తులు ధరించి పార్లమెంట్ ముందు ఫొటోలు తీసుకున్నందుకు మిమి చక్రవర్తి, నుస్రత్ జహ్రాన్‌కు సోషల్ మీడియాలో ఎదురైన స్పందన ఇది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బెంగాలీ యువ నటీమణులు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ రూహి భారీ విజయాలు అందుకున్నారు. జాదవపూర్ నుంచి మిమి చక్రవర్తి 2,95,239 ఆధిక్యంతో విజయం సాధించగా, బాసిర్హాత్లో నుస్రత్ జహాన్ 3,50,369 మెజార్టీతో విజయదుందుభి మోగించారు. గెలిచిన ఆనందంలో ఉత్సాహంతో తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టి పరవశించారు. తమ అదృష్టానికి మురిసిపోతూ ఆనంద క్షణాలను కెమెరాలో బంధించి సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఇక అక్కడి నుంచి మొదలైంది ఇరుకు మనస్కుల దాడి. ట్విటర్లో ట్రోలింగ్ మొదలెట్టేశారు. ఇంతకీ వారు ధరించిన డ్రెస్ ఏంటి? మిమి చక్రవర్తి తెల్లని చొక్కా, డెనిమ్ జీన్స్ ప్యాంట్ వేసుకోగా.. జహ్రాన్ వైన్ కలర్ పెప్పలప్ జిప్డ్ టాప్, ప్యాంట్ ధరించారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, బాలీవుడ్ నటుడు సన్నిడియోల్ కూడా జీన్స్, టీషర్టులు ధరించి తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టినా ఛాందసులకు చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. లోక్‌సభకు ఎన్నికైన యువతులు హుందాగా ఉన్న ఆధునిక వస్త్రాలు ధరించి పార్లమెంట్‌కు రావడం మాత్రం నేరంగా తోస్తుంది.ప్రజాప్రతినిధులు హుందాగా ఉండే దుస్తులు ధరించాలనే వాదనలో ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ ఫలానా దుస్తులు వేసుకుంటేనే హుందాతనం వస్తుందని వాదించడంలో అర్థం లేదు. ఆధునిక తరానికి ప్రతినిధులుగా చట్టసభలో అడుగుపెట్టబోతున్న యువతుల వస్త్రధారణపై వివాదం చేయడం శోచనీయం. మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ వివాదంతో మరోసారి మహిళ వస్త్రధారణ చర్చనీయాంశంగా మారింది. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వీరికి మద్దతుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎటువంటి దుస్తులు ధరించారనే దాని ఆధారంగా వీరి సామర్థ్యాలను అంచనా వేయడం సరికాదని పేర్కొన్నారు. పార్లమెంట్ చర్చల్లో వీరు ఎంత సమర్థవంతంగా పాల్గొంటారనే దానిపై దృష్టి పెట్టాలిగానీ వస్త్రధారణపై కాదని పేర్కొన్నారు. – పోడూరి నాగ శ్రీనివాసరావు, సాక్షి వెబ్ డెస్క్ ఈ వివాదాలు మాకు కొత్తేమి కాదు. గతంలోనూ ఇలాంటివి ఎదుర్కొన్నాం. ఎంపీలు అభ్యర్థులుగా ఎంపికైన నాటి నుంచే మా మీద బురద చల్లడం మొదలుపెట్టారు. మేమేంటో మా పని తీరు ద్వారానే నిరూపించుకున్నాం. ఇప్పుడు మరింత కష్టపడి పనిచేసి విమర్శలకు సమాధానం చెబుతాను. అసంబద్ధ వ్యాఖ్యలను పట్టించుకోకుండా నా నియోజకవర్గ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తాను. – నుస్రత్ జహాన్ ఏ రకంగా చూసినా నేను, నుస్రత్ జహాన్ ధరించిన దస్తులు అమర్యాదకరంగా లేవు. మగాళ్లు జీన్స్, టీషర్ట్ ధరించి పార్లమెంట్‌కు వచ్చినా ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయరు. మా విషయంలోనే ఎందుకు భిన్నంగా స్పందిస్తున్నారు? వస్త్రధారణ విషయంలో మమ్మల్ని ఎంతగా విమర్శించినా, దూషించినా పట్టించుకోము. పార్లమెంట్ మర్యాదను మంటగలిపామని మేము అనుకోవడం లేదు. సహజత్వం నాకు ఇష్టం. నాకు మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదాలు. – మిమి చక్రవర్తి