Couples Who Divorced In 2021: Here Are List Of Famous Celebrity Couples Divorced In 2021 - Sakshi
Sakshi News home page

Couples Divorced In 2021:ఈ ఏడాది విడిపోయిన ప్రముఖ సినీ ప్రముఖులు

Published Sun, Dec 19 2021 12:51 PM | Last Updated on Sun, Dec 19 2021 1:27 PM

List Of Famous Celebrity Couples Divorced In 2021 - Sakshi

List Of Famous Celebrity Couples Divorced In 2021: టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ దాకా ఇండస్ట్రీలో డైవోర్స్‌ కొత్తేం కాదు. ప్రేమను పెళ్లివరకు ఎంత వేగంగా తీసుకెళ్లారో...అంతేవేగంగా విడాకులు తీసుకున్నారు. అప్పటివరకు మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనిపించుకున్న క్యూట్‌ కపుల్‌ సైతం తమ దారులు వేరువేరు అని టాటా చెప్పేసుకున్నాయి. ఆఫ్‌ స్క్రీన్‌లోనూ హిట్‌ పెయిర్‌ అనిపించుకున్న జంటలు కలిసి ఉండలేమంటూ తమ వివాహ బంధాన్ని రద్దు చేసుకున్నాయి. అలా ఈ ఏడాది 20201లో విడిపోయిన సినీ ప్రముఖులపై ఓ లుక్కేద్దాం. 

Samantha-Naga Chaitanya
ఈ ఏడాది విడాకులు తీసుకున్న జంటల్లో నాగ చైతన్య- సమంతలు ఉండటం అభిమానులకు ఊహించని షాకిచ్చింది. అప్పటివరకు ఇండస్ట్రీలో క్యూటెస్ట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీరు ఇక భార్యభర్తలుగా కలిసి ఉండలేమంటూ విడాకుల ప్రకటన చేశారు. 2017లో ప్రేమ వివాహం చేసుకున్న చై-సామ్‌.. తమ 4వ  వివాహ వార్షికోత్సవానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు అక్టోబర్‌2న విడిపోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. 

Aamir Khan -Kiran Rao 
బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ పెళ్లి విషయంలో మాత్రం రెండుసార్లు విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచాడు. 2006లో కిరణ్‌ రావును ప్రేమ వివాహం చేసుకున్న ఆయన 15 ఏళ్ల అనంతరం 2 ఏడాది జులై3న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ జంట విడిపోవడానికి కారణం హీరోయిన్ ఫాతిమా సనా షేక్ అని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. 



Nisha Rawal -Karan Mehra
హిందీ పాపులర్‌ సీరియల్‌ నటుడు కరణ్‌ మెహ్రపై భార్య నిషా రావల్‌ గృహహిం ఆరోపణలు చేయడం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.  అంతేకాకుండా కరణ్‌ తనపై దాడికి దిగాడంటూ మీడియా ముందుకొచ్చింది. 2012లో ప్రేమవివాహం చేసుకున్న ఈ కపుల్‌ తొమ్మిదేళ్ల అనంతరం విడాకులు తీసుకున్నారు.

Yo Yo Honey Singh- shalini thalwar
ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ హనీ సింగ్‌పై భార్య షాలిని తల్వార్‌ గృహహింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. 2011లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఈ ఏడాది విడిపోయారు. 

Nusrat Jahan- Nikhil Jain
ప్రముఖ నటి, ఎంపీ నుస్రత్‌ జమాన్‌ పెళ్లి, విడాకులు తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. జూన్‌ 19, 2019లో నుస్రత్‌, వ్యాపారవేత్త నిఖిల్‌ జైన్‌ని టర్కీలో వివాహం చేసుకున్న నుస్రత్‌2021లో  జైన్‌తో తన వివాహం చెల్లదని ప్రకటించింది. ఆ సమయంలో  ఆ బ్యూటీ బెంగాలీ నటుడు యశ్వంత్‌ దాస్‌గుప్తా రిలేషన్‌షిప్‌లో ఉందని రూమర్స్‌ వినిపించాయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement