Year End Roundup Stories 2021
-
2023లో ఢిల్లీ మెట్రోలో ఏం జరిగింది? వీడియోలు ఎందుకు వైరల్ అయ్యాయి?
ఢిల్లీ మెట్రో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేసిన తరువాత కూడా కొందరు ప్రయాణికులు తమ తీరు మార్చుకోలేదు. మెట్రోలో ముద్దులు పెట్టుకోవడం, సరసాలు ఆడటం, కొట్టుకోవడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం లాంటి పనులు 2023లో తరచూ కనిపించాయి. ఇటువంటి ఉందంతాలకు సంబంధించిన వీడియోలు ఏడాది సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఒక వీడియోలో ఒక యువతి బ్రా, షార్ట్ స్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించింది. ఈ వీడియో వైరల్ కావడంతో, ఆ అమ్మాయిని ఢిల్లీ మెట్రోలో ‘ఉర్ఫీ జావేద్’ అనే పేరు పెట్టారు. మరో వీడియోలో ఢిల్లీ మెట్రోలో ఒక బాలుడు హస్తప్రయోగం చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను చూసిన వారంతా తెగ అసహ్యించుకున్నారు. ఇంకొక వీడియోలో ఢిల్లీ మెట్రోలో ఓరల్ సెక్స్ చేస్తున్న జంట కనిపించింది. దీనిని ప్రయాణికులెవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోలో ఒక బాయ్‌ఫ్రెండ్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి శీతల పానీయం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ ప్రియురాలు శీతల పానీయాన్ని తన నోటితో స్ప్రే చేసి.. ప్రియుడి నోట్లో పోస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా ఈ జంటను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీ మెట్రో కోచ్‌లో ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. అయితే దీనిని ఎవరో అడ్డుకోవడంతో అతను సిగ్గుపడకుండా సీసాలో మూత్ర విసర్జనను కొనసాగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఢిల్లీ మెట్రోలో సీట్ల కోసం జరిగిన గొడవలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. వాటిలోని ఒక వీడియోలో సీటు విషయంలో ఓ మహిళ, పురుషుడి మధ్య గొడవ జరిగింది. ఆ మహిళ అతని ముఖంపై బలంగా కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ‘మెట్రో’ వీడియోలో కొంతమంది మహిళలు చప్పట్లు కొడుతూ భజనలు చేయడం కనిపిస్తుంది. మరో వీడియోలో ఒక అంధ జంట తమ ముగ్గురు పిల్లలతో మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీనిని చూసిన యూజర్స్ భావోద్వేగానికి లోనయ్యారు. మరో వైరల్ వీడియోలో ఒక జంట ప్రేమలో మునిగి తేలుతూ.. ముద్దులు పెట్టుకోవడం కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలన్నీ ఢిల్లీలో మెట్రోలో 2023లో చోటుచేసుకున్నాయి. ఇది కూడా చదవండి: 10 ఒళ్లు గగుర్పొడిచే దారుణాలు.. 2023 మిగిల్చిన చేదు గురుతులు! -
10 ఒళ్లు గగుర్పొడిచే దారుణాలు.. 2023 మిగిల్చిన చేదు గురుతులు!
కొంతమందికి 2023వ సంవత్సరం ఆనందంగా గడిస్తే, మరికొందరికి వారి జీవితంలో అత్యంత భయంకరమైన అనుభవాలను మిగిల్చింది. 2023వ సంవత్సరంలో దేశంలో చోటుచేసుకున్న 10 అత్యంత దారుణాల గురించి ఇప్పుడు చూద్దాం. 1. ఉమేష్ పాల్ హత్య దేశంలో అత్యంత చర్చనీయాంశమైన హత్య కేసుల్లో ఉమేష్ పాల్ హత్య ఒకటి. యూపీలోని ప్రయాగ్‌రాజ్ పరిధిలోని ధుమన్‌గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకు ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్ తుపాకీ తూటాలకు హతమయ్యాడు. ఇది యూపీలో గ్యాంగ్ వార్‌ను మరోమారు గుర్తుచేసింది. ఉమేష్ పాల్‌పై బుల్లెట్లు, బాంబులతో దాడి చేసినట్లు సీసీటీవీలో స్పష్టంగా కనిపించింది. ఈ కేసు దర్యాప్తులో ఉంది. 2. అతిక్, అష్రాఫ్ హత్యలు పూర్వాంచల్ మాఫియా లీడర్లుగా పేరొందిన అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌లు ప్రయాగ్‌రాజ్ మెడికల్ కాలేజీ సమీపంలో హత్యకు గురయ్యారు. పోలీసుల సంరక్షణలో ఉన్న అతిక్, అష్రఫ్ అహ్మద్‌లపై దుండగులు అనేక రౌండ్లు కాల్పులు జరిపి హత్యచేశారు. పోలీసు కస్టడీలో ఉన్న అతిక్ అహ్మద్‌తో ఒక జర్నలిస్టు మాట్లాడుతుండగా నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులు పోలీసులకు పట్టబడ్డారు. 3. నిక్కీ యాదవ్ దారుణ హత్య ఢిల్లీలో నిక్కీ యాదవ్ హత్య.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ఫిబ్రవరి 10న నిక్కీ యాదవ్‌ను ఆమె ప్రియుడు సాహిల్ గొంతుకోసి హత్య చేశాడు. సాహిల్ ఫిబ్రవరి 10న ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకున్న నిక్కీ అతనితో గొడవ పడింది. సాహిల్ కోపంతో నిక్కీని గొంతుకోసి హత్య చేశాడు. తరువాత నిక్కీ మృతదేహాన్ని తన దాబాలోని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. అనంతరం రెండవ వివాహం చేసుకున్నాడు. ఈ కేసు దర్యాప్తులో ఉంది. 4. రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుని హత్య రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. సుఖ్‌దేవ్ సింగ్‌ను అంతమొందించే ప్లాన్‌తో వచ్చిన ఇద్దరు ముష్కరులు అతని ఇంటిలో కాసేపు కూర్చుని మాట్లాడారు. తరువాత వారిద్దరూ తమ తుపాకీలను తీసి సుఖ్‌దేవ్ సింగ్‌పై కాల్పులు జరిపారు. దీంతో సుఖ్‌దేవ్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంతలో నిందితులు అక్కడి నుండి పారిపోయారు. అయితే నిందితులను చండీగఢ్‌లోని సెక్టార్ -22లో ఉన్న హోటల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. 5. మైనర్ బాలిక దారుణ హత్య ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో ఓ మైనర్ బాలిక దారుణ హత్య దేశాన్ని కుదిపేసింది. ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. దానిలో నిందితుడు మైనర్ బాలికపై కత్తితో దాడి చేస్తున్నా అక్కడున్న ఎవరూ పట్టించుకోకపోవడం కనిపిస్తుంది. నిందితుడు సాహిల్ ఈ 16 ఏళ్ల మైనర్‌పై 20 సార్లు కత్తులతో దాడి చేశాడు. తరువాత ఆ బాలికను రాయితో మోది హత్య చేశాడు. 6. డియోరియా ఊచకోత యూపీలోని డియోరియా జిల్లా రుద్రాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సహా మొత్తం ఆరుగురి హత్య దేశాన్ని కుదిపేసింది. భూ వివాదాల కారణంగానే ఈ హత్య జరిగింది. ఇందులో ఒక పార్టీకి చెందిన సత్య ప్రకాష్ దూబే, ఆయన భార్య కిరణ్, కుమార్తె సలోని, నందిని, కుమారుడు గాంధీ హత్యకు గురయ్యారు. జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు ప్రేమ్ యాదవ్ కూడా హత్యకు గురయ్యారు. 7. కానిస్టేబుల్ కాల్పులు జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో ఆర్పిఎఫ్ జవాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంఘటన ఈ సంవత్సరం కలకలం రేపింది. జూలై 31 ఉదయం, జైపూర్-ముంబై రైలులో ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన సీనియర్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన వాపి, బోరివాలి మీరా రోడ్ స్టేషన్ల మధ్య జరిగింది. 8. లక్నో కోర్టులో బుల్లెట్ల శబ్దం యూపీలోని లక్నోలోని కోర్టులో గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవాను కాల్చి చంపారు. జూన్ 7న విచారణ కోసం గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవాను లక్నో కోర్టుకు తీసుకువచ్చారు. ఇంతలో లాయర్ల వేషంలో వచ్చిన దుండగులు కోర్టు ఆవరణలోనే సంజీవ్ జీవాపై కాల్పులు జరిపారు. సంజీవ్ జీవా అక్కడికక్కడే మృతిచెందాడు. సంజీవ్ జీవా ముజఫర్‌నగర్ నివాసి. లక్నో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 9. రూ.350 కోసం దారుణ హత్య కేవలం రూ.350 కోసం 16 ఏళ్ల యువకుడు మరో టీనేజర్‌ను అత్యంత దారుణంగా అంతమొందించాడు. ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. టీనేజర్ తల, మెడపై నిందితుడు 60 సార్లు కత్తితో పొడిచాడు. ప్రాణాలు కోల్పోయిన టీనేజర్‌ను చూసి ఆ యువకుడు డ్యాన్స్ చేయటం సీసీటీవీ వీడియోలో కనపడింది. ఈ దారుణ హత్యకు పాల్పడిన 16 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 10. పట్టపగలు దుకాణదారుని హత్య పంజాబ్‌లోని భటిండాలో పట్టపగలు ఓ దుకాణదారుని కాల్చి చంపిన ఉదంతం దేశాన్ని కుదిపేసింది. ఈ హత్య ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో దుకాణదారుడు హర్జిందర్ సింగ్ అలియాస్ మేలా తన దుకాణం ముందు కుర్చీలో కూర్చున్నట్లు ఈ సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తుంది. ఇంతలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దుండగులు వచ్చి పిస్టల్స్‌తో హర్జిందర్‌పై కాల్పులు జరిపారు. దుండగులిద్దరూ ముఖాలకు మాస్క్‌లు కప్పుకున్నారు. ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం దుండగులిద్దరూ బైక్‌పై పారిపోయారు. బాధితుడు హర్జిందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇది కూడా చదవండి: 2023 సామాన్యునికి ఏమిచ్చింది? -
2023 సామాన్యునికి ఏమిచ్చింది?
గడచిన 2020, 2021 సంవత్సరాల్లో కరోనా మహమ్మారి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. దేశవ్యాప్తంగా అమలైన లాక్డౌన్, కరోనా ఆంక్షలు సామాన్యుల వెన్ను విరిచాయి. వ్యాపారాలు నిలిచిపోవడంతో చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అయితే 2022లో పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. వ్యాపారాలు తిరిగి ట్రాక్‌లో పడ్డాయి. ఆ దశ దాటాక వచ్చిన 2023 సామాన్యులకు ఉపశమనం కలిగించింది. మాల్స్‌లో జనం బారులు దేశంలో జీడీపీ వృద్ధి కూడా ఊహించిన దాని కంటే అధికంగానే ఉంది. 2023లో మార్కెట్లలో మంచి ఆర్థికవృద్ధి కనిపించింది. రెస్టారెంట్లు జనాలతో నిండిపోయాయి. మార్కెట్లు, మాల్స్‌లో జనం గుంపులు గుంపులుగా కనిపించారు. ఇది జీడీపీ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మించి 7.6 శాతంగా నమోదైంది. తయారీ, మైనింగ్, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల అద్భుతమైన పనితీరు కారణంగా రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఊహించిన దాని కంటే అధికంగా ఉంది ఉంది. రూ. 200 దాటిన టమాటా వ్యవసాయం పరంగా కూడా ఈ ఏడాది బాగానే ఫలితాలు వచ్చాయి. బియ్యం, ఇతర ధాన్యాల ఉత్పత్తి వృద్ధి చెందింది. ద్రవ్యోల్బణం విషయానికి వస్తే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువగానే ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. జూలై-ఆగస్టులో టమాటా ధరలు కిలో రూ.200 దాటాయి. దీంతో ప్రభుత్వం టమాటాను రాయితీ ధరలకు విక్రయించాల్సి వచ్చింది. టమోటా తర్వాత ఉల్లి ధరలు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. అయితే ఇప్పుడు ఉల్లి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. తగ్గిన నిరుద్యోగిత రేటు 2023 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు తగ్గింది. కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు తగ్గింది. జూలై-సెప్టెంబర్ 2023లో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 7.2 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.6 శాతంగా ఉంది. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు 6.6 శాతంగా నమోదైంది. అదే సమయంలో మహిళా కార్మికుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. 2023 సంవత్సరం ఉపాధి రంగంలో మిశ్రమ సంవత్సరంగా నిలిచింది. ఇది కూడా చదవండి: జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
డెస్టినేషన్ దుబాయ్..! 2021లో యూఏఈ తీసుకున్న సంచలన నిర్ణయాలు..!
కోవిడ్ 19 దెబ్బతో ప్రపంచ దేశాలు కుదేలైన క్రమంలో దుబాయ్ మాత్రం.. ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడింది. పటిష్ట కోవిడ్ నియంత్రణ చర్యలతో అటు ప్రజారోగ్యాన్ని కాపాడుతూనే ఇతర దేశాలకు డెస్టినేషన్ సిటీగా నిలుస్తోంది..! అగ్రదేశాలకు అతిథ్యం ఇవ్వడంలో, టూరిస్టులను ఆకర్షించడంలో...ధనిక వర్గాల నుంచి వలస కార్మికుల వరకు అక్కున చేర్చుకోవడంలో ఈ గల్ఫ్ నగరం విజయం సాధించింది. ఈ నగరం యునైటేడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఒక బంగారు బాతులాగా నిలుస్తోంది. ప్రపంచదేశాలను మరింత ఆకర్షించేందుకు 2021లో తెచ్చిన అనేక సంస్కరణలు దుబాయ్ మరో అడుగు ముందుండేలా చేసింది. వరల్డ్ టాలెంట్‌ను ఒడిసిపట్టుకోవడంలో ఇతరదేశాల కోసం స్నేహాపూర్వక నిర్ణయాలను దుబాయ్ తీసుకుంది. వ్యూహత్మకమైన నిర్ణయాలతో... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఆర్థిక కేంద్రమైన దుబాయ్ చరిత్రలో 2021 ఒక కీలక మలుపుగా నిలుస్తోంది. విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో, కోవిడ్-19పై యుద్ధంలో భాగంగా రికార్డు సమయంలో 100 శాతం అత్యంత వేగవంతమైన వ్యాక్సినేషన్‌తో పలు కీలక సమావేశాలను చేపట్టేందుకు ప్రపంచదేశాలకు దుబాయ్ తొలి స్థానంగా నిలిచింది. అతిథ్య, పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలుస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్ ఎక్స్పో 2020కు దుబాయ్ కేంద్రంగా మారింది. కోవిడ్-ప్రేరిత మందగమనాన్ని అధిగమించడానికి 2021 సంవత్సరం ఎంతగానో కలిసివచ్చింది. కోవిడ్-19తో 2020లో యూఎఈ ఆర్థిక వ్యవస్థ 10.9 శాతానికి తగ్గిపోయింది. 2021 ఆర్థిక సంవత్సరానికిగాను యూఎఈ సుమారు 3.1 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2022లో సుమారు 3.4 శాతం వృద్ధిని నమోదు చేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021లో దుబాయ్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలే దేశ ఆర్థిక వృద్ధికి ఇంధనంగా నిలిచాయి. 100 శాతం విదేశీ యాజమాన్యం పోటీతత్వాన్ని పెంపొందించడానికి, పెట్టుబడిని, విదేశీయులను తన గడ్డపైకి ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా.. 2021 జూన్ 1న వాణిజ్య కంపెనీల చట్టానికి కీలక సవరణను యూఎఈ చేసింది. ఈ సవరణతో యూఎఈలో విదేశీయులు తమ కంపెనీలను ఎమిరాటీ (ఆ దేశ) వాటాదారు లేదా ఏజెంట్ అవసరం లేకుండానే స్థాపించేందుకు అనుమతించింది. ఈ సవరణపై ప్రపంచ దిగ్గజ ఆర్థిక నిపుణులు ప్రశంసించారు. గోల్డెన్ వీసా యూఎఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నవంబర్ 15న గోల్డెన్ వీసాను మంజూరు చేయడానికి ఆమోదించారు. 'గోల్డెన్ రెసిడెన్సీ'గా పిలువబడే ఈ వీసాను చాలా మంది వ్యక్తులకు మంజూరు చేశారు. అందులో భారత్‌కు చెందిన ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , బిగ్ డేటా, ఎపిడెమియాలజీ డిగ్రీ పట్టాలను కల్గిన వారికి కూడా గోల్డెన్ వీసాను అందించనుంది. ఈ సందర్భంగా గోల్డెన్ వీసాపై...కొత్త మైలురాళ్లను సాధించడంలో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు వారు మాతో ఉండాలని కోరుకుంటున్నామని అల్ మక్తూమ్ అభిప్రాయపడ్డారు. గ్రీన్ వీసా 2021లో యూఎఈ ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం గ్రీన్ వీసా. అక్కడి ప్రభుత్వం సెప్టెంబరు 6న గ్రీన్ వీసాను విడుదల చేసింది. దీంతో యూఏఈలో పనిచేయాలనుకున్న విదేశీయులు వారి యజమాని ద్వారా స్పాన్సర్ చేయకుండానే పనిచేసే వెసులుబాటును కల్పించింది. ఎకానమీ అండ్ టూరిజం సంస్థల వీలినం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి , ఎగుమతులను పెంచడానికి మరో వ్యూహాత్మక చర్యలో భాగంగా యూఎఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ అల్ రషీద్ మక్తూమ్ నవంబర్ 6న దుబాయ్ ఆర్థిక వ్యవస్థ, పర్యాటక సంస్థల విలీనాన్ని ప్రకటించారు. ఈ విలీనంతో ప్రధాన ఆర్థిక సూచికలలో టాప్ ఐదు ప్రపంచ నగరాల్లో దుబాయ్‌ని ఉంచడం, రాబోయే మూడేళ్లలో 100,000 కంపెనీలనుపైగా ఆకర్షించడం దీని ముఖ్య ఉద్ధేశ్యం. ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా పనిదినాలు..! ప్రపంచ మార్కెట్లతో తన ఆర్థిక వ్యవస్థను సమం చేయడానికి, పోటీతత్వాన్ని, ఆర్థిక పనితీరును మెరుగుపరచడానికి, ఆ దేశ ఉద్యోగుల పనిలో జీవిత సమతుల్యతను, సామాజిక శ్రేయస్సును పెంచేందుకు గాను యూఎఈ 2021 డిసెంబర్ 7న తీసుకున్న నిర్ణయంతో 2022 జనవరి 1 నుంచి నాలుగున్నర రోజుల పని దినాలకు మారుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో వారానికి ఐదు రోజుల కంటే తక్కువ పని దినాలు ఉన్న మొదటి దేశంగా యూఎఈ అవతరించింది. పేపర్‌లెస్ గవర్నమెంట్ ప్రపంచంలోనే 100 శాతం పేపర్ రహితంగా మారిన మొట్టమొదటి ప్రభుత్వంగా దుబాయ్ అవతరించింది. దీంతో దుబాయ్‌లోని ప్రభుత్వ బాహ్య, అంతర్గత లావాదేవీలు చాలావరకు డిజిటల్ విధానంలోనే కొనసాగుతున్నాయి. 100 శాతం డిజిటలైజేషన్ దిశగా దుబాయ్ అడుగులేస్తోంది. చదవండి: కొత్త ఏడాదిలో ‘స్మార్ట్’గా ఫోన్ల అమ్మకాలు -
జస్ట్ ఆ పది మంది సంపాదనే 400 బిలియన్ డాలర్లు!
సంపాదించడం ఎంత కష్టమో.. ఖర్చు పెట్టడం అంత సులువు. ఈ సూత్రం అందిరికీ వర్తించదు. అలాగే క్షణాల్లో కోట్లు సంపాదించి.. అంతే వేగంగా కోటాను కోట్లు పొగొట్టుకున్న వ్యాపార దిగ్గజాలను మన కళ్ల ముందే చూస్తున్నాం. 2021 ముగింపు సందర్భంగా ఈ ఏడాది అత్యధికంగా సంపాదించిన అపర కుబేరుల జాబితాను ఓసారి పరిశీలిద్దాం. ర్యాంకింగ్‌లను పక్కనపెట్టి.. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే వాళ్ల సంపాదనను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఇక ఈ సంపాదనలో సింహభాగం ఒక్కడిదే కావడం.. ఆ ఒక్కడు ఎలన్ మస్క్ కావడం మరో విశేషం. ఎలన్ మస్క్.. ఆయన సంపాదన 277 బిలియన్ డాలర్లు. ఇందులో ఈ ఏడాది సంపాదించింది అక్షరాల 121 బిలియన్ డాలర్లు. 60 శాతం పెరిగిన టెస్లా షేర్లు, సొంత కంపెనీ స్పేస్ఎక్స్ ఒప్పందాలతో ఈ ఏడాది విపరీతంగా సంపాదించాడీయన. తద్వారా కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. బెర్నార్డ్ ఆర్నాల్ట్.. ఫ్రెంచ్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొత్తం సంపద 176 బిలియన్ డాలర్లు. ఇందులో ఈ ఏడాది సంపాదన 61 బిలియన్ డాలర్లు. యూరప్ దేశాల అత్యంత ధనికుడిగా పేరున్న ఈ 72 ఏళ్ల వ్యాపార దిగ్గజం.. ప్రపంచంలోనే లగ్జరీ గూడ్స్ కంపెనీ పేరున్న ఎల్వీఎంహెచ్కు చైర్మన్‌గా, సీఈవోగా కొనసాగుతున్నారు. లారీ పేజ్.. ఈయన కంప్యూటర్ సైంటిస్ట్, గూగుల్ కో-ఫౌండర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆల్ఫాబెట్ కంపెనీ(గూగుల్ మాతృక సంస్థ)ను ఈ ఏడాది కూడా విజయవంతంగా నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు లారీ పేజ్. ఈ గూగుల్ మాజీ సీఈవో మొత్తం సంపద 130 బిలియన్ డాలర్లు కాగా, కేవలం ఈ ఏడాదిలో 47 బిలియన్ డాలర్ల ఆదాయం(షేర్ల రూపేనా) వెనకేసుకున్నాడు. సెర్గె బ్రిన్.. గూగుల్ మరో సహ వ్యవస్థాపకుడు. ఈ ఏడాది 45 బిలియన్ డాలర్ల సంపాదనతో ఏకంగా 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేశాడు. సెర్గె బ్రిన్(48) మొత్తం సంపాదన 125 బిలియన్ డాలర్లు. ఈయనకు ఆల్ఫాబెట్ కంపెనీలో 38 మిలియన్ షేర్లు ఉన్నాయి. స్టీవ్ బాల్మర్ మైక్రోసాఫ్ట్ కంపెనీ మాజీ సీఈవో. ఎన్బీఏ లాస్ ఏంజెల్స్ క్లిపర్స్ టీం యాజమాని కూడా. తన వ్యాపారంతో పాటు మైక్రో సాప్ట్ కంపెనీ(కంపెనీ లాభాల వల్ల)లో ఉన్న షేర్ల ద్వారా ఈ ఏడాది 41 బిలియన్ డాలర్లు సంపాదించాడు స్టీవ్ బాల్మర్(65). ల్యారీ ఎల్లిసన్ ఒరాకిల్ చైర్మన్, వ్యవస్థాపకుడు ఈయన. సుమారు ఇరవై ఏళ్ల తర్వాత ఈ నెలలో భారీ ఆదాయం వెనకేసుకుంది ఒరాకిల్ కంపెనీ. దీంతో ఈ 77 ఏళ్ల వ్యాపార దిగ్గజం 29 బిలియన్ డాలర్లు సంపాదించడంతో పాటు 109 బిలియన్ డాలర్ల మొత్తం సంపదతో సెంచరీ బిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మార్క్ జుకర్‌బర్గ్ మెటా కంపెనీ(ఫేస్బుక్) సీఈవోగా ఈ ఏడాది 24 బిలియన్ డాలర్ల సంపాదన వెనకేసుకున్నాడు మార్క్ జుకర్‌బర్గ్. కంపెనీ పేరు మారినా, వివాదాలు వెంటాడినా.. లాభాల పంట మాత్రం ఆగలేదు. మెటాలో ఇతనికి 13 శాతం వాటా ఉంది. ఈ ఏడాది 20 శాతం పెరిగింది జుకర్‌బర్గ్ సంపద. ఇదిలా ఉంటే ఈ టాప్ 10 లిస్ట్‌లో అత్యంత చిన్నవయస్కుడిగా నిలిచాడు మార్క్ జుకర్‌బర్గ్(37). వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే సీఈవో. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తన సంపదలో సగం సేవా కార్యక్రమాలకు ఇస్తానని ప్రకటించాడు. కానీ, ఈసారి ఈ ప్రకటన వర్కవుట్ కాలేదు. కంపెనీ షేర్ల తీరు ఆశాజనకంగా సాగలేదు. దీంతో కేవలం 21 బిలియన్ డాలర్ల ఆదాయం మాత్రమే వెనకేసుకున్నాడు. 91 ఏళ్ల ఈ వ్యాపార దిగ్గజం మొత్తం సంపద విలువ 109 బిలియన్ డాలర్లుగా ఉంది. బిల్‌గేట్స్ దానాలు చేసుకుంటూ పోతున్నా.. బిల్‌గేట్స్ ఆదాయంపై ఎలాంటి ప్రభావం పడడం లేదు. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్ల రూపంలో బాగానే గిట్టుబాటు అయ్యింది. ఏడు బిలియన్ల డాలర్లు సంపాదనతో.. సంపదను 139 బిలియన్ డాలర్లకు పెంచుకున్నాడు 66 ఏళ్ల గేట్స్. జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండర్. ఎలన్ మస్క్‌తో పోటాపోటీగా వార్తల్లో నిలిచిన పర్సనాలిటీ. ప్రపంచంలోనే రెండో అత్యంత ధనికుడిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది ఆయన మొత్తం వెనకేసుకుంది కేవలం 5 బిలియన్ డాలర్లు మాత్రమే. 57 ఏళ్ల బెజోస్.. ఈ ఏడాది అమెజాన్ సీఈవో పగ్గాల నుంచి దిగిపోవడంతో పాటు స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ గడిపాడు. ఈ ఏడాది అపర కుబేరుల్లో గట్టి దెబ్బ పడింది ఎవరికంటే.. ఈయనకే!. -సాక్షి, వెబ్ స్పెషల్ -
2021లో వచ్చిన సేఫెస్ట్ కార్స్ ఇవేనండోయ్..!
2021లో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు పదుల సంఖ్యలో కొత్త కార్లను రిలీజ్ చేశాయి. వాటిలో కొన్ని మాత్రమే అత్యంత భద్రత కల్గిన కార్లుగా నిలిచాయి. ఒక కారు ఆయా వాహనదారుడుకి ఇచ్చే భద్రతను గ్లోబల్ ఎన్సీఏపీ (న్యూకార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్) నిర్ణయిస్తోంది. పలు కార్లను రకరకాల పరీక్షలను నిర్వహించి, ప్రమాద సమయంలో ఆయా కారులో ప్రయాణించే వ్యక్తుల భద్రతను గురించి ఎన్‌సీఎపీ రేటింగ్స్‌ను ఇస్తోంది. 2014 నుంచి ఫోక్స్‌వ్యాగన్ పోలో, మారుతి సుజుకీ బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యూవీ300, టయోటా ఎటియోస్, టాటా నెక్సాన్ వంటి కార్లు ఎన్‌సీఎపీ రేటింగ్‌లో 4-5 రేటింగ్ స్టార్లను పొందాయి. ఈ ఏడాదిలో వచ్చిన కార్లలో కొన్ని మాత్రమే ఎక్కువ ఎన్సీఏపీ రేటింగ్‌ను పొందాయి. 1. టాటా పంచ్-మైక్రో ఎస్యూవీ భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ లాంచ్ చేసిన ‘టాటా పంచ్-మైక్రో ఎస్యూవీ’ ఎన్‌సీఎపీ టెస్ట్‌లో ఎక్కువ రేటింగ్‌ను సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో టాటా పంచ్ 17.00గాను 16.45 స్కోర్‌ను; చిల్డ్రన్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49.00 గాను 40.89 స్కోర్‌ను సాధించింది. ఈ ఎస్యూవీను సుమారు 64km/hr వేగంతో పరీక్షించారు. ఓవరాల్ చూసుకుంటే 5 స్టార్స్ అడల్ట్ ప్రోటెక్షన్లో, 4 స్టార్ చిల్డ్రన్ ప్రొటెక్షన్‌లో రేటింగ్‌ను సాధించింది. 2. మహీంద్రా ఎక్స్‌యూవీ700 స్వల్ప తేడాతో టాటా పంచ్ తరువాత మహీంద్రా ఎక్స్‌యూవీ 700 సేఫెస్ట్ కారుగా నిలిచింది. చిల్డ్రన్ అక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49.00గాను 41.66 స్కోర్‌ను, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 17.00 గాను 16.03 సాధించింది. ఓవరాల్ చూసుకుంటే 5 స్టార్స్‌కు సుమారుగా 5 స్టార్ రేటింగ్‌ను ఇది సాధించింది. 3. టాటా టిగోర్ ఈవీ ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే, టాటా టిగోర్ ఈవీ గ్లోబల్ ఎన్‌సీఎపీ ఎక్కువ స్కోర్‌ను సాధించింది. అడల్ట్ అక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో17.00 గాను 12.00 స్కోర్‌ను పొందగా, పిల్లల భద్రత విషయంలో 49.00 గాను 37.24 సాధించింది. ఓవరాల్ చూసుకుంటే 5 స్టార్స్‌కు 4 స్టార్ రేటింగ్‌ను ఇది సాధించింది. ఇక్కడ హై ఎండ్ లగ్జరీ కార్ల గురించి చర్చించలేదు. ఎందుకంటే #SaferCarsForIndia ప్రచారంలో భాగంగా గ్లోబల్ ఎన్సీఏపీ ఆయా లగ్జరీ కార్లను పరీక్షించలేదు. చదవండి: పేరుకు సెకండ్ హ్యాండ్ కార్లే..! హాట్‌కేకుల్లా అమ్ముడైన బ్రాండ్స్ ఇవే..! -
Year End 2021: గ్రేటర్లో హై.. ఫ్లై!
సాక్షి, హైదరాబాద్: ఎవరేమనుకున్నా.. ఎవరేం చెప్పినా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్లు నగర రూపురేఖల్నే మార్చివేశాయి. ముఖ్యంగా ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం) కింద చేపట్టిన పనులు ఎలాంటి నిధుల కొరత లేకుండా జరగడమే అందుకు కారణం. నిధుల లేమితో పనులు కుంటుపడవద్దనే తలంపుతో ప్రభుత్వం ఎస్సార్డీపీని ఏర్పాటుచేసి.. బాండ్లతో నిధులు సమకూరేలా చేయడమే కాక బ్యాంకు లోన్లకు అనుమతిచ్చింది. దీంతో జరిగే పనుల కనుగుణంగా బిల్లుల చెల్లింపులు జరుగుతుండటంతో పనులు వడివడిగా సాగుతున్నాయి. దీనివల్ల జీహెచ్ఎంసీకి ఎంతో ఆర్థిక భారం పెరిగినా.. కళ్లముందరి ఫ్లై ఓవర్ల వల్ల ప్రజల ట్రాఫిక్ చిక్కులు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో అవసరం లేకున్నా నిర్మించారనే ఆరోపణలున్నా రోజురోజుకూ పెరుగుతున్న వాహన రద్దీతో మున్ముందు వాటి ఉపయోగం తెలుస్తుదంటున్న వారూ ఉన్నారు. దశల వారీగా చేపట్టిన పనుల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని రూ. 4500 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇతర విభాగాలవి కూడా కలిపితే వాటి విలువ రూ.6 వేల కోట్లు. అన్ని విభాగాలవీ వెరసి దాదాపు రూ. 2 వేల కోట్ల పనులు పూర్తయ్యాయి. పురోగతిలో ఉన్నవి.. ► బొటానికల్ గార్డెన్,కొత్తగూడ– కొండాపూర్ జంక్షన్ వద్ద: సెప్టెంబర్ 2022 ► శిల్పా లేఔట్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్‌తో సహ 120 అడుగుల వెడల్పుతో రోడ్డు: సెప్టెంబర్ 2022, ఫేజ్ 1 పూర్తవుతుందని అంచనా. ► ఖైతలాపూర్ ఆర్ఓబీ(హైటెక్‌సిటీ– బోరబండ రైల్వేస్టేషన్ల మధ్య): కోర్టు వివాదం పరిష్కారమైతే మార్చి 2022లో పూర్తి. ► ఎల్బీనగర్ కుడివైపు ఫ్లై ఓవర్: మార్చి 2022 ► బైరామల్ గూడ ఎడమవైపు ఫ్లై ఓవర్: డిసెంబర్ 2022 ► బైరామల్‌గూడ కుడి, ఎడమ వైపులా రెండు లూప్‌లు, రెండో వరుసలో ఫ్లై ఓవర్: డిసెంబర్ 2022. ► నాగోల్ ఫ్లై ఓవర్ : జూన్ 2022 ► ఎల్బీనగర్ కుడివైపు అండర్‌పాస్: ఫిబ్రవరి 2022 ► పంజగుట్ట శ్మశానవాటిక వద్ద స్టీల్‌బ్రిడ్జి: జనవరి 2022 ► తుకారాంగేట్ వద్ద ఆర్యూబీ: ఫిబ్రవరి 2022 ► ఇందిరాపార్కు–వీఎస్టీ, రామ్‌నగర్–బాగ్‌లింగంపల్లి ఫ్లై ఓవర్లు: డిసెంబర్ 2022, 1వ ఫేజ్ ► ఉప్పల్ జంక్షన్ ఫ్లై ఓవర్: డిసెంబర్ 2023 ► బహదూర్‌పురా జంక్షన్ ఫ్లైఓవర్: మార్చి 2022 ► చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ పొడిగింపు: జూన్ 2022 ► నల్గొండ క్రాస్‌రోడ్స్– ఒవైసీ హాస్పిటల్ జంక్షన్ ఫ్లైఓవర్: అక్టోబర్ 2022 ► ఫలక్‌నుమా ఫ్లైఓవర్‌కు సమాంతర ఫ్లైఓవర్: సెప్టెంబర్ 2022 ► శాస్త్రిపురం వద్ద ఆర్ఓబీ: జూలై 2023 ► ఆరాంఘర్నుంచి జూపార్క్ వరకు ఫ్లైఓవర్ మార్చి 2023లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ► ఇవి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని పనులు కాగా, గ్రేటర్ పరిధిలో ఇతర విభాగాల ఆధ్వర్యంలో పూర్తయిన, జరగుతున్న పనులిలా ఉన్నాయి. ► పూర్తయిన పనులు: ఓఆర్ఆర్–మెదక్ సెక్షన్ వరకు రహదారుల విస్తరణ.. అప్‌గ్రేడేషన్ పనులు, బాలానగర్ క్రాస్‌రోడ్స్ ఫ్లైఓవర్, ఆనంద్‌బాగ్ ఆర్యూబీ. పూర్తి కావాల్సిన పనులు: అంబర్‌పేట చేనెంబర్ క్రాస్‌రోడ్స్ ఫ్లైఓవర్(రూ.369.19 కోట్లు),ఆరాంఘర్– శంషాబాద్ సెక్షన్ ఫ్లైఓవర్(రూ.488 కోట్లు), ఉప్పల్– సీపీఆర్ఐ (రూ.821కోట్లు). ► అన్ని విభాగాల్లో వెరసి పురోగతిలో ఉన్న పనుల అంచనా వ్యయం దాదాపు రూ. 6 వేల కోట్లు. పూర్తయిన పనులివీ.. ఫ్లైఓవర్లు మైండ్‌స్పేస్, రాజీవ్‌గాంధీ విగ్రహం(కూకట్పల్లి), బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద రెండు, రోడ్‌నెంబర్ 45–దుర్గంచెరువు కేబుల్‌బ్రిడ్జిని కలుపుతూ, కామినేని హాస్పిటల్ వద్ద రెండు వైపులా రెండు, ఎల్బీనగర్ వద్ద ఎడమవైపు, బైరామల్‌గూడ వద్ద కుడివైపు, పంజగుట్ట శ్మశానవాటిక వద్ద స్టీల్‌బ్రిడ్జితో, ఒవైసీ జంక్షన్లో అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్ పూర్తయ్యాయి. ఇక షేక్పేటఫ్లై ఓవర్ నిర్మాణం కూడా పూర్తయింది. కొత్త సంవత్సర కానుకగా అందుబాటులోకి రానుంది. ► దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నగరానికే తలమానికంగా నిలుస్తోంది. అండర్‌పాస్‌లు.. అయ్యప్పసొసైటీ జంక్షన్, మైండ్‌స్పేస్,చింతల్‌కుంట చెక్‌పోస్ట్ జంక్షన్,ఎల్బీనగర్ జంక్షన్ వద్ద ఎడమవైపు. ఆర్యూబీ/ఆర్ఓబీలు.. హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్, ఉత్తమ్‌నగర్, ఉప్పుగూడల వద్ద ఆర్‌యూబీలు, లాలాపేట ఆర్ఓబీ పునరుద్ధరణ. -
వెరైటీ క్రైమ్: అనేక చిత్రాలు వెలుగులోకి తెచ్చిన ‘21’
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో హత్యలు, హత్యాయత్నాలు, బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, భారీ చోరీలు వంటి సంచలనాత్మక నేరాలు నమోదవుతూనే ఉంటాయి. వీటిని నిత్యం చూస్తూనే ఉంటాం. వీటితో పాటు అంతగా ప్రాచుర్యానికి నోచుకోని వెరైటీ నేరాలు కూడా నమోదవుతూ ఉంటాయి. కొన్ని కేసులను తమ విధుల్లో భాగమనుకుంటూ పోలీసులు ఇష్టంతో చేసినా.. ఇదెక్కడి గోలరా బాబూ అనుకుంటూ కష్టంగా భావించినా ఈ తరహా కేసుల్నీ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. వీటిలో అత్యధికం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఠాణాల పరిధిలో చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది చోటు చేసుకున్న వాటిలో ఈ కోవలోకి వచ్చే కేసుల్లో కొన్ని... తనది పోయిందని మరొకరిది.. సాధారణంగా ఎవరైనా తమ వస్తువు పోతే వీలున్నంత వరకు వెతికి విలువైనది అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. లేని పక్షంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని వదిలేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మూల సునీల్ కుమార్ తన బ్యాగ్ పోయినందుకు మరోటి చోరీ చేసి చిక్కాడు. ఇతగాడు రైల్లో వస్తూ తన బ్యాగ్ పోగొట్టుకున్నాడు. ఈ నష్టం పూడ్చుకునేందుకు విజయనగరం నుంచి వచ్చిన శివశంకర్ అనే వ్యక్తిది చోరీ చేశాడు. బాధితుడు రైల్వే పోలీసులను ఆశ్రయించడంతో సీసీ కెమెరాల ఆధారంగా చిక్కి జైలుకు వెళ్లాడు. నేరం చేస్తుండగా నిద్రొచ్చేసింది.. ఓ టార్గెట్‌ను ఎంచుకుని అక్కడ చోరీ చేయాలని భావించిన దొంగలు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తారు. రెక్కీ తర్వాత ‘పని’లోకి దిగి చడీచప్పుడు కాకుండా పూర్తి చేస్తారు. ఆపై ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా ఉడాయించేస్తారు. అయితే చాంద్రాయణగుట్ట పరిధిలోని ఆలయంలో చోరీ చేసిన బాలుడు మాత్రం అందులోనే బజ్జుని చిక్కాడు. ఓ బాలుడు శ్రీశైలం రహదారిపై ఉన్న శ్రీరామాలయంలో చోరీకి వచ్చాడు. అర్థరాత్రి శ్లాబ్ నుంచి మెట్ల మార్గంలో లోపలకు ప్రవేశించాడు. అక్కడి హుండీ, అల్మారా తాళాలు పగులకొట్టి సొత్తును సంచిలో వేసుకున్నాడు. ఇంత వరకు అంతా అతడు అనుకు న్నట్లే జరిగినా... ఈ పనితో అలసిపోయాడో ఏమో అక్కడే నిద్రపోయాడు. ఉదయం వచ్చిన పూజారి బాలుడిని, అతడితో ఉన్న సంచిలో సొత్తును చూసి పోలీసులకు అప్పగించాడు. మూత్రం తెచ్చిన తంటా.. దేవరకొండ బస్తీలో మూత్ర విసర్జన రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. ఆ బస్తీకి చెందిన ఓ యువకుడు ఓ రోజు రాత్రి ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన చేస్తున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఇతడిని మందలించాడు. ఇరువురి మధ్యా మాటామాటా పెరిగి వాగ్వాదం మొదలైంది. కొద్దిసేపటికే ఇద్దరి స్నేహితులూ అక్కడకు చేరుకుని రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఇది పరస్పర దాడుల వరకు వెళ్లింది. విషయం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరడంతో రెండు వర్గాలకు చెందిన 17 మందిపై కేసు నమోదైంది. కాస్త అడ్వాన్స్ అయ్యాడు.. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత నుంచో భార్యలకు భర్తలు, అత్తింటి వారి నుంచి వరకట్న వే«ధింపులు ఎదురైన కేసులు ఎన్నో చూస్తుంటాం. అయితే కర్నూలు జిల్లాకు చెందిన మనోజ్‌కుమార్‌రెడ్డి మాత్రం ‘అడ్వాన్స్’ అయిపోయాడు. మాట్రిమోనియల్ సైట్ ద్వారా కేపీహెచ్‌బీ రెండో ఫేజ్‌కు చెందిన యువతితో వివాహం కుదిరింది. ఐదెకరాల భూమి, మరో రూ.25 లక్షల విలువైన స్థలం కట్నంగా ఇచ్చేలా ఒప్పందం తర్వాత నిశ్చితార్థం కూడా జరిగింది. కర్ణాటకలోని బేలూరులో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న ఇతడి మనస్సు పెళ్లికి ముందే మారిపోయింది. అదనంగా ఐదెకరాలు ఇస్తేనే తాళి కడతానంటూ యువతితో పాటు ఆమె తల్లిదండ్రులనూ ఫోన్ ద్వారా వేధిస్తూ బెదిరింపులకు దిగాడు. ఫిర్యాదుతో చివరకు జైలు గడప తొక్కాడు. భయపడి బాత్రూమ్లో పడేశాడు.. నగదు, సొత్తు చోరీ చేసిన దొంగలు దాన్ని తమతో పట్టుకుపోతారు. ఆనక జల్సాలు, అవసరాలకు ఖర్చు చేసుకుంటారు. అయితే జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి ప్రకాష్ ఇంట్లో చోరీ చేసిన క్యాటరింగ్ బాయ్ మాత్రం ఆ మొత్తాన్ని కమోడ్‌లో వేసి ఫ్లష్ చేసేశాడు. దీపావళి సందర్భంగా ప్రకాష్ రూ.3.5 లక్షలు అమ్మవారి ఎదుట ఉంచి పూజించాడు. ఆ ఫంక్షన్‌కు క్యాటరింగ్ బాయ్‌గా వచ్చిన షేక్ చాంద్ రజాక్ ఆ మొత్తాన్ని జేబులో పెట్టుకున్నాడు. కొద్దిసేపటికి డబ్బు పోయిన విషయం గుర్తించిన యజమాని తనిఖీలు మొదలెట్టారు. దీంతో తాను చిక్కుతానని భయపడిన రజాక్ బాత్రూమ్లోకి వెళ్లాడు. రూ.75 వేలు జేబులో ఉంచుకుని మిగతా మొత్తం కమోడ్‌లో వేసి ఫ్లష్ చేసేశాడు. జేబులో ఉన్న డబ్బుతోనే చిక్కిన అత గాడు ఆరా తీస్తే అసలు విషయం చెప్పాడు. అదృశ్యాలు తట్టుకోలేక ‘ఆమె’గా మార్చారు.. యువతిగా మారాలన్న తన కోరికను కుటుంబీకులు అంగీకరించట్లేదనే ఉద్దేశంలో షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదేపదే ‘అదృశ్యం’ అవుతున్నాడు. ఎట్టకేలకు ఈ అంశం సైబరాబాద్ ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్‌డెస్క్ వద్దకు వచ్చింది. అతడి ఆచూకీ కనిపెట్టిన అధికారులు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అంతటితో ఆగకుండా కుటుంబీకులకు కౌన్సెలింగ్ చేసి అతడి కోరిక తీరేలా చేశారు. షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదో తరగతిలో ఉండగానే యువతిగా మారాలని భావించాడు. తన కోరికను తల్లిదండ్రులకు చెప్పగా వాళ్లు ససేమిరా అన్నారు. దీంతో రెండుమూడుసార్లు ఇల్లు విడిచి పారిపోయిన అతగాడు ట్రాన్స్‌జెండర్స్ గ్రూపుల్లో చేరుతున్నాడు. విషయం గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్ డెస్క్‌కు చేరింది. సిద్ధిపేటలో అతడిని గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. యువతిగా మారాలన్న కోరిక తీరకపోతే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం కావడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని పరిణామాలకు దారితీసే ఆస్కారం ఉందని గుర్తించారు. తల్లిదండ్రులకు హెల్ప్ డెస్క్ కౌన్సెలింగ్ చేసి వారి కుమారుడి కోరికను మన్నించేలా చేశారు. రాజీ కోసం చోరీ.. గ్రామీణ ప్రాంతాల్లో చోటు చేసుకున్న కొన్ని నేరాలు పోలీసుల వరకు రావు. పెద్దల సమక్షంలో జరిగే పంచాయితీల్లోనే సెటిల్ అవుతుంటాయి. చోరీ కేసులో ఇలాంటి ఓ సెటిల్మెంట్కు సంబంధించిన సొమ్ము చెల్లించడానికి నగరానికి వచ్చి చోరీ చేసి చిక్కాడో ప్రబుద్ధుడు. సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలం, సత్యగామకు చెందిన నాగరాజు ఆ గ్రామంలో ఓ చోరీ చేశాడు. పెద్ద మనుషుల సమక్షంలో ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తానంటూ అంగీకరించాడు. ఆ డబ్బుతో పాటు తనకూ కొంత మిగలాలనే ఉద్దేశంతో సిటీకి వచ్చి చోరీ చేయాలని భావించాడు. నగరానికి వచ్చి బంజారాహిల్స్‌లోని ఓ దేవాలయంలో పూజారిగా చేరాడు. అక్కడికి వచ్చిన ఓ బాధితురాలి ఇబ్బందులు తొలగిస్తానని నమ్మబలికాడు. అందుకు అవసరమైన పూజ కోసం బంగారం ఇస్తే పూర్తయిన తర్వాత మరో తు లం కలిపి ఇస్తానంటూ నమ్మించాడు. ఇలా ఆమె నుంచి బంగారం, వెండి తీసుకుని పారి పోయాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. -
TSRTC: కథ ముగిసిపోయిందన్నారు.. కానీ పడిలేచిన కెరటంలా..
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా నాలుగు నెలల క్రితం.. ఆర్టీసీ ఉద్యోగులకు 23 రోజులు ఆలస్యంగా జీతాలు అందాయి. ఆర్టీసీ చరిత్రలో ఇంత ఆలస్యంగా జీతాలు చెల్లించటం అదే తొలిసారి. ఇది ఆర్టీసీ పతనావస్థలో ఉందని చెప్పే ఉదంతం. అప్పటి వరకు ప్రభుత్వం ప్రతినెలా నిధులు కేటాయిస్తే తప్ప జీతాలు చెల్లించలేని దుస్థితి. కానీ ఇప్పుడు ఠంఛన్‌గా ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నారు. గతంలో మాదిరి ప్రతినెలా జీతాలపై ప్రభుత్వంపై ఆధారపడటం లేదు. ఇప్పుడు రోజువారీ టికెట్ ఆదాయం రూ.13 కోట్లకు చేరింది. ఇది రెండున్నర ఏళ్ల తర్వాత నమోదవుతున్న గరిష్ట మొత్తం. దశాబ్దాలపాటు ప్రజలకు సేవలందించి.. ‘ఎర్రబస్సు’గా ఆప్యాయతను చూరగొన్న ఆర్టీసీ కథ దాదాపు ముగిసిపోయిందని, దాన్ని నడిపే పరిస్థితి లేక ప్రభుత్వం మూసేయబోతోందన్న వ్యాఖ్యలు సైతం వినిపించాయి. అలాంటి స్థితి నుంచి ఆర్టీసీ పడిలేచిన కెరటం మాదిరి శక్తిని కూడగట్టుకుంటోంది. ప్రగతి రథ చక్రాలు మళ్లీ సొంత శక్తితో పరుగు మొదలుపెట్టాయి. ఈ సంవత్సరం ముగింపులో ప్రజారవాణా సంస్థకు ప్రాణం పోస్తూ సంస్కరణలు ప్రారంభమయ్యాయి. చదవండి: ఈ ఏడాది యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ ఏంటో తెలుసా? బకాయిలు.. నష్టాలు.. రూ.మూడు వేల కోట్ల అప్పులు.. రూ.రెండు వేల కోట్ల నష్టాలు.. చమురు సంస్థలకు బకాయిలు.. గత వేతన సవరణ తాలూకు బకాయిలు.. ఇలాంటి తరుణంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్‌ను ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా నియమించింది. ఆర్టీసీ తిరిగి పుంజుకునేందుకు ఈ నియామకం దోహదపడుతుందన్న అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ► తొలుత సిబ్బందికి ఒకటో తేదీనే జీతాలు ఇస్తామన్న నిర్ణయాన్ని వెల్లడించి దానికి కట్టుబడటం ద్వారా వారిలో సంస్థ పట్ల విశ్వాశాన్ని పాదుగొల్పే ప్రయత్నం చేశారు. ► ఈ ఉద్యోగం చేయలేం వీఆర్ఎస్ ఇవ్వండి అంటూ కొంతకాలంగా వేడుకుంటూ వస్తున్న సిబ్బందిలో ఇప్పుడు ఆ ఆవేదన కొంతమేర తగ్గింది. సంక్షోభానికి ముందులాగా ఉత్సాహంగానే డ్యూటీలకు వస్తున్నారు. పాత బకాయిల విషయంలో మాత్రం ఆగ్రహం అలాగే ఉంది. చదవండి: TS: పబ్స్, హోటళ్లు, క్లబ్‌లు న్యూఇయర్ గైడ్ లైన్స్ పాటించాలి ► ఒకప్పుడు ఆసియాలోనే మంచి సహకార సంఘాల్లో ఒకటిగా వెలుగొందిన ఆర్టీసీ సహకార పరపతి సంఘం నాలుగేళ్లుగా చిక్కుల్లో పడింది. దాదాపు రెండేళ్లుగా సరిగా రుణాలు రావటం లేదు. ఏడాది కాలంగా పూర్తిగా కుంటుపడింది. 10 వేలకుపైగా దరఖాస్తులు పేరుకుపోయి ఉన్న తరుణంలో ఇప్పుడిప్పుడు మళ్లీ రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ► ప్రస్తుతం బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 66 శాతానికి చేరుకుంది. ఇది రెండేళ్లలో గరిష్టం. ఇక రోజుకు 35 లక్షల కి.మీ. గరిష్ట స్థాయిలో బస్సులు తిరుగుతున్నాయి. గతంతో పోలిస్తే వేయి బస్సులు తగ్గినా దాన్ని అందుకోవడం విశేషం. ► కొత్త బస్సులు కొనే ప్రసక్తే లేదని కొంతకాలం క్రితం తేల్చి చెప్పిన ఆర్టీసీ.. ఇప్పుడు తీరు మార్చుకుంటోంది. కొత్త బస్సుల అవసరాన్ని గుర్తించి కొనేందుకు సిద్ధమైంది. ► ఆదాయం కోసం బస్సులపై అడ్డదిడ్డంగా ప్రకటనలు వేయించుకుని అందవిహీనంగా మారిన బస్సులు ఇప్పుడు మళ్లీ ఆర్టీసీ బస్సుల్లాగా మారాయి. ఆదాయం కూడా వదులుకుని ప్రకటనలను నిషేధించి బస్సులకు కొత్తగా రంగులద్దడం విశేషం. ► మందులకు, సాధారణ వైద్యానికి కూడా కొరగాకుండా పోయిన హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీస్థాయికి చేరుకుంటోంది. ఇప్పుడు అక్కడ డయాలసిస్‌తోపాటు చాలా రకాల వైద్యం అందుతోంది. -
ఈ ఏడాది యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ ఏంటో తెలుసా?
►నిన్న మొన్నటివరకూ ఇంటర్నెట్ సామ్రాజ్యంలో యూట్యూబ్ అంటే కేవలం కాలక్షేపం కోసం నెటిజన్లు వీక్షించే ఓ వినోద సాధనమే. ► మరి నేడు... వీక్షకులకు వినోదం, విజ్ఞానాన్ని అందిస్తూనే యూట్యూబర్లకు కోట్లాది మంది సబ్స్క్రైబర్లను, అంతకన్నా మించి భారీగా ఆదాయాన్ని సంపాదించిపెట్టే కల్పతరువు! ప్రతి నిమిషం ఈ ప్రసార మాధ్యమంలో ఏకంగా 30 లక్షల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయంటే యూట్యూబ్ స్థాయి ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరి... ►ఈ ఏడాది యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ ఏమిటి? ►భారత్‌లో నాలుగు రాళ్లు వెనకేసుకున్నదెవరు? చార్ట్‌లు బద్దలు కొట్టిన పాటలేమిటి? ►వినోదం పంచిన వెబ్‌సిరీస్, గేమ్‌లు ఏవి? ఓసారి పరిశీలిద్దాం.. సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది యూట్యూబ్‌లో వినూత్నమైన ఆలోచనలతో సృష్టించిన వీడియోలు మంచి ఆదరణ పొందాయి. ‘ఏ2మోటివేషన్స్’, ‘మిస్టర్ గ్యానీ ఫ్యాక్ట్స్’ వంటి చానళ్లు.. అద్భుతం, వినూత్నం, విచిత్రం అనిపించే విషయాలను నిమిషం, రెండు నిమిషాల వీడియోలైన ‘షార్ట్స్’లో బంధించాయి. అలాగే ‘క్రేజీ ఎక్స్‌వైజెడ్’, ‘మిస్టర్ ఇండియన్హ్యాకర్’ వంటి చానళ్ల నిర్వాహకులు విచిత్రమైన పనులు చేసి పాపులారిటీ, సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు. తెలుగు యూట్యూబ్ చానళ్లు ఫిల్మీమోజీ, ఫన్మోజీలు అనిమోజీ పేరుతో అవతార్ ఆధారిత కంటెంట్ సృష్టించి ట్రెండింగ్ చార్టుల్లో పైకి చేరితే.. భువన్ బామ్ (బీబీ కి వైన్స్) తన కామెడీ వీడియోలను ‘ధిండోరా’ పేరుతో వెబ్ సిరీస్‌గా మార్చి 2.49 కోట్ల అభిమానులను సంపాదించుకున్నాడు. గేమింగ్ విషయానికొస్తే ఇందులోనూ మూసపోకడలకు స్వస్తిపలికి కామెడీ, ప్రాంక్స్, సవాళ్లు వంటి అనేక అంశాల ఆధారంగా కొత్త గేమ్‌లు సిద్ధమయ్యాయి. గేమింగ్ అంటే ఇష్టపడే వాళ్లు ఇప్పుడు నగర ప్రాంతాలను దాటిపోవడం ఇంకో విశేషం. కోవిడ్ కారణంగా సినిమాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ ఏడాది వీడియో పాటలు కొంచెం ఎక్కువ సంఖ్యలోనే విడుదలయ్యాయి. అంకుశ్ రజా, శిల్పి రాజ్ వంటివారు తమ భోజ్‌పురి సంగీతంతో ఈ ఏడాది టాప్ స్థానాల్లో నిలిచారు. మహిళల మ్యూజిక్ వీడియోల్లో తమిళ సింగర్లు అరివు, ఢీల వీడియో ‘ఎంజాయ్ ఎంజామీ’ చార్ట్‌లలో టాప్‌గా నిలిచింది. చదవండి: Top Apps In 2021: ఈ ఏడాది క్రేజీ యాప్స్ ఇవే.. ‘ఈ తరం’ వెబ్ సిరీస్‌లు.. తెలుగు విషయానికి వస్తే... షణ్ముక్ జశ్వంత్ హీరోగా నటిస్తున్న యూట్యూబ్ సిరీస్ ‘సూర్యా’తోపాటు ‘గర్ల్ ఫార్ములా’ రూపొందించిన ‘30 వెడ్స్ 21’ ఆకట్టుకోగా.. దేశంలో యువతరం సమస్యలను, అనుభవాలను వినూత్నమైన పద్ధతుల్లో అందుబాటులోకి తెచ్చిన కొన్ని వెబ్ సిరీస్‌లు ఈ ఏడాది బాగా ప్రేక్షకాదరణ పొందాయి. ‘ద వైరల్ ఫీవర్’ నిర్మించిన కొత్త సిరీస్ ఆస్పిరెంట్స్.... యూపీఎస్సీకి సిద్ధమవుతున్న విద్యార్థుల కష్టాలు, సమస్యలు ఆశనిరాశలను ప్రతిబంబించింది. అలాగే డైస్ మీడియా వైద్యవిద్యార్థుల జీవితానుభవాల ఆధారంగా నిర్మించిన ‘ఆపరేషన్ ఎంబీబీఎస్’, గేమింగ్‌నే వృత్తిగా ఎంచుకున్న వారిపై రూపొందించిన ‘క్లచ్’ ప్రేక్షకుల మన్ననలు పొందాయి. బుల్లి వీడియోలు భలేభలే... యూట్యూబ్ ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన చిన్న వీడియో విభాగం ‘షార్ట్స్’కూ దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. నిమిషం కంటే తక్కువ నిడివి ఉండే ‘షార్ట్స్’ వీడియోలను ఇప్పుడు చాలా మాంది వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. 2021లో సృష్టించిన కొత్త, వినూత్న వీడియోల్లో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులు మొదలుకొని కుటుంబ సంబంధాలు, స్ఫూర్తిదాయకమైనవి, పురుషుల సౌందర్య పరిరక్షణకు ఉపయోగపడేవి కూడా బోలెడు ఉన్నాయి. ‘ఏ2మోటివేషన్’ తొలిస్థానంలో నిలివగా ‘మిస్టర్ గ్యానీ ఫ్యాక్ట్స్’, ‘శివమ్ మాలిక్’, ‘లిటిల్గ్లవ్’, ‘ఇంగ్లిష్ కనెక్షన్’, ‘బసీర్ గేమింగ్’, ‘అజయ్ శర్మ’, ‘దుష్యంత్ కుక్రేజా’ వంటివి టాప్–10లో ఉన్నాయి. -
Rewind 2021: వాళ్లను కలిపింది.. వీళ్లను దూరం చేసింది
2021 కొందరిని ఒక ఇంటివారిని చేసింది. కొందరిని ఈ లోకానికి దూరం చేసింది. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటలు, హఠాన్మరణంతో షాక్‌కి గురి చేసిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం. పెళ్లి సందడి 2021లో పెళ్లి సందడి కనిపించింది. హీరోలు కార్తికేయ, సుమంత్ అశ్విన్, హీరోయిన్ ప్రణీత, సింగర్ సునీత వంటి సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. ♦ ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. నవంబరు 21న తన ప్రేయసి లోహితతో ఏడడుగులు వేశారు. వరంగల్ నిట్‌లో బీటెక్ చేస్తున్నప్పుడు తొలిసారి (2010) లోహితను కలిశారు కార్తికేయ. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. ♦ ప్రముఖ దర్శక–నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఫిబ్రవరి 13న దీపిక మెడలో మూడు ముడులు వేశారు. అమెరికాలోని డల్లాలో రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు దీపిక. సుమంత్, దీపికలది పెద్దలు కుదిర్చిన వివాహం. ♦ ‘అత్తారింటికి దారేది’ ఫేమ్ ప్రణీత కూడా ఈ ఏడాది అత్తారింటిలోకి అడుగుపెట్టారు. మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. బెంగళూరులో నితిన్ రాజు వ్యవసాయ క్షేత్రంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ‘మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్’ అన్నారు ప్రణీత. ♦ ప్రముఖ గాయని సునీత ఈ ఏడాది ప్రారంభంలో రామ్ వీరపనేనితో ఏడడుగులు వేశారు. జనవరి 9న వీరి పెళ్లి శంషాబాద్ సమీపంలోని రామాలయంలో జరిగింది. ♦ హాస్య నటి విద్యాల్లేఖా రామన్ పెళ్లి సెప్టెంబర్ 9న సంజయ్‌తో జరిగింది. ఫిట్నెస్, న్యూట్రషనిస్ట్ ఎక్స్‌పర్ట్‌గా చేస్తున్నారు సంజయ్. వీరిది ప్రేమ వివాహం. కాగా, పెళ్లి జరిగిన విషయాన్ని కొన్ని రోజులకు ‘మా పెళ్లయింది’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫొటోలు షేర్ చేశారు విద్యుల్లేఖా రామన్. ఇక సెలవు తెలుగు పరిశ్రమలో ఈ ఏడాది బోలెడు విషాదాలు నెలకొన్నాయి. కొందరు కరోనాతో, మరికొందరు అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి ‘ఇక సెలవు’ అంటూ షాకిచ్చారు. ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి నవంబర్ 30న ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్యదర్శకులు శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ నవంబర్ 28న మృతి చెందారు. అదే విధంగా గాయకుడు జి. ఆనంద్ మే 7న, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్ మే 7న, రచయిత నంద్యాల రవి మే 14న, నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ మే 10న, డైరెక్టర్ అక్కినేని వినయ్ కుమార్ మే 12న, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు వి. కాంచన్ బాబు వంటి వారిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ మే 12న, నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ బీఏ రాజు మే 21న, నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ మే 26న, యువ నిర్మాత మహేశ్ కోనేరు అక్టోబర్ 12న గుండెపోటుతో మృతి చెందారు. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ సెప్టెంబరు 27న కిడ్నీ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. అదే విధంగా డైరెక్టర్ గిరిధర్ (శుభ ముహూర్తం) ఆగస్టు 2న, నటుడు రాజాబాబు అక్టోబర్ 25న అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు. నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. -
2021లో ఎగబడి సందర్శించిన వెబ్సైట్ ఇదే..! గూగుల్ మాత్రం కాదండోయ్..!
Top 10 Most Visited Websites In The World 2021: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సందర్శించిన వెబ్సైట్ ఏదంటే ఠక్కున ఏది చెప్తాం..సింపుల్ గూగుల్ అనేస్తాం. ఎందుకంటే మనకు ఏదైనా తెలియని విషయాన్ని తెలుసుకోవడం కోసం సింపుల్‌గా ఒకే గూగుల్...! అంటూ గూగుల్.కామ్‌ను తలుపుతడతాం. ఇలా మనలో అందరూ చేసే వాళ్లమే. అయితే 2021 ఏడాదిగాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సందర్శించిన వెబ్సైట్ మాత్రం గూగుల్ కాదండోయ్..అవును మీరు విన్నది నిజమే. 2021లో అత్యధికంగా సందర్శించిన వెబ్సైట్ల మొదటి స్ధానంలో టిక్‌టాక్ నిలిచింది. తరువాతి స్థానంలో గూగుల్ నిలవడం గమనర్హం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సందర్శించిన టాప్ 10 వెబ్సైట్ లిస్ట్ మీకోసం...! 1. టిక్‌టాక్. కామ్ ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ ప్రపంచంలోనే ఎక్కువ మంది సందర్శించిన వెబ్‌సైట్‌గా నిలిచింది. భారత్‌లో నిషేధం ఉన్నప్పటికీ టిక్‌టాక్ అదరగొట్టింది. సుమారు 1 బిలియన్ వరకు క్రియాశీల వినియోగదారులను టిక్‌టాక్ కలిగి ఉంది. బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక మొత్తంలో ట్రాఫిక్‌ను సొంతం చేసుకున్నది 2.గూగుల్.కామ్ మనకు ఏదైనా చిన్న సమస్య వచ్చిదంటే చాలు వెంటనే చేసేది గూగుల్ సెర్చ్. కాగా 2021లో రెండవ స్థానంలో ఉండడం. ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే రెండవ వెబ్‌సైట్‌గా తన స్థానాన్ని దక్కించుకున్నది. 3. ఫేస్బుక్.కామ్ టిక్‌టాక్, గూగుల్ తరువాత మూడోస్థానంలో ఫేస్బుక్ నిలిచింది. 2021లో ఫేస్బుక్ తన పేరును మెటాగా మార్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫేస్‌బుక్‌కు అంతగా కలిసి రాలేదు. వీపరితమైన ఆరోపణలు మార్క్ జుకమ్‌బర్గ్ వెన్నులో వణుకు తెచ్చేలా చేశాయి. ఫేస్బుక్ 0.8 బిలియన్ క్రియాశీల యూజర్లు ఉన్నారు. 4. మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ నాలుగో స్ధానంలో నిలిచింది. మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన వన్‌డ్రైవ్, ఎక్స్బాక్స్లన భారీగా సందర్శించారు. 5. యాపిల్ యాపిల్ సంస్థ 5వ స్థానంలో కొనసాగడం అనేది కూడా కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఐక్లౌడ్, యాప్‌స్టోర్ వంటి ఇతర సేవలను సందర్శించే వ్యక్తులు అధికంగా ఉన్నప్పటికీ ఈ స్థానాన్ని కలిగి ఉంది. 6. అమెజాన్ కరోనా సమయంలో చాలా మంది వ్యక్తులు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎక్కువగా సందర్శించారు. ఆన్లైన్ షాపింగ్ మార్కెట్ గణనీయంగా పెరిగింది. 2021లో అత్యధికంగా సందర్శించిన వెబ్సైట్ ల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. 7. నెట్‌ఫ్లిక్స్ కరోనా-19 రాక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కాసుల వర్షాని కురిపించింది. థియేటర్లు మూతపడటంతో సినీ లవర్స్ ఓటీటీలకు ఎగబడ్డారు. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఏడవ స్థానంలో నిలిచింది. 8. యూట్యూబ్ ప్రముఖ ఓటీటీ సంస్థలు, అమెజాన్, డిస్నీ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ రాకతో యూట్యూబ్‌కు భారీ పోటీనిచ్చాయి. 2021లో అధిక మంది సందర్శించిన ప్లాట్‌ఫారమ్స్‌లో యూట్యూబ్ 8వ స్థానంలో ఉంది. 9. ట్విటర్ 2021లో ఫేస్బుక్ ఒక్కసారిగా డౌన్ అవ్వడంతో ఠక్కున యూజర్లు ట్విటర్ తలుపులను తట్టారు. ఈ ఏడాదిలో అత్యధిక సందర్శించిన వెబ్సైట్లో ట్విటర్ 9 స్ధానంలో నిలిచింది. 10. వాట్సాప్ చివరగా పదో స్థానంలో మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ నిలిచింది. టాప్ 10 జాబితాలో మెటా యాజమాన్యంలోని రెండు యాప్ లు ఉండడం విశేషం. చదవండి: 200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..! -
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న లవ్ బర్డ్స్ వీళ్లే..
Top Celebrities Weddings In 2021: See Which Stars Tied The Knot: అప్పటి వరకు సోలో లైఫే సో బెటర్ అన్నవాళ్లు సైతం ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కారు. కొంతమంది డెస్టినేషన్ వివాహం చేసుకుంటే, మరికొందరేమో ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది 2021లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలపై మీరూ ఓ లుక్కేయండి. ప్రముఖ గాయని, డబ్బింగ్ అర్టిస్ట్ సునీత ఈ ఏడాది జనవరి9న వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లాడింది. అప్పట్లో వీరిద్దరి పెళ్లి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. హీరోయిన్ ప్రణీత సుభాష్ వివాహం మే31న బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో జరిగింది. . ‘అత్తారింటికి దారేదీ’సినిమాతో గుర్తింపు పొందిన ప్రణీత అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్ ఈ ఏడాది జూన్4న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధర్‌తో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఈ ఏడాది జనవరి14న ఓ ఇంటి వాడయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌తో ముంబైలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరిగింది. దాదాపు 11సంవత్సరాల రిలేషన్ అనంతరం బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ తన ప్రియురాలు పత్రలేఖను నవంబర్15న పెళ్లాడాడు. తెలుగమ్మాయి ఆనంది కోలీవుడ్‌కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్‌ను పెళ్లాడింది. ‘బస్టాప్, ప్రియతమా నీవచట కుశలమా, గ్రీన్ సిగ్నల్’ వంటి చిత్రాలలో టాలీవుడ్లో గుర్తింపు పొందిన ఈ భామ తమిళంలో బిజీ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ ఏడాది తెలుగులో ‘జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా వివాహం వివాహం ఫిబ్రవరి 15న వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో జరిగింది. ‘చెలి’ హిందీ రీమేక్ ‘రెహనా హై తేరే దిల్ మే’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దియా మీర్జా గతంలో సహిల్ సంఘా ను వివాహం చేసుకుంది. 11 సంవత్సరాల తర్వాత వారు 2019లో విడాకులు తీసుకున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్‌ను హైదరాబాద్‌లో ఏప్రిల్ 22న వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటి వాడయ్యాడు. ప్రియురాలు లోహిత రెడ్డితో నవంబర్ 21న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. బాలీవుడ్ కత్రినా కైఫ్, వీక్కీ కౌశల్ ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 9న మూడుమూళ్ల సాక్షిగా ఏడడుగులు వేసి అధికారికంగా భార్యభర్తలు అయిపోయారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని విలాసవంతమైన హోటల్లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. -
2021 రౌండప్: అత్యంత చెత్త కంపెనీ ఏదంటే..
2021 Best And Worst Companies Of The Year: ఎప్పటిలాగే ఈ ఏడాది వ్యాపార రంగంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అదే టైంలో ఘోరమైన పతనాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ ట్రేడింగ్‌లో ఊహించని పరిణామాలే ఎదురయ్యాయి.. ఒమిక్రాన్ ప్రభావంతో ఇంకా ఎదురవుతున్నాయి కూడా. చైనా లాంటి అతిపెద్ద(రెండో) ఆర్థిక వ్యవస్థను.. గ్లోబల్ రియల్టి రంగాన్ని కుదిపేసిన ‘ఎవర్‌గ్రాండ్’ డిఫాల్ట్ పరిణామం ఇదే ఏడాదిలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో కంపెనీల పని తీరును, ఇతరత్ర కారణాలను బట్టి జనాల వోటింగ్ ద్వారా బెస్ట్, వరెస్ట్ కంపెనీల లిస్ట్‌ను ప్రకటించింది యాహూ ఫైనాన్స్ వెబ్సైట్. 2021 ఏడాదిగానూ ప్రపంచంలోకెల్లా చెత్త కంపెనీగా నిలిచింది మెటా (ఇంతకు ముందు ఫేస్బుక్). ఒపీనియన్ పోల్‌లో ఎక్కువ మంద పట్టం కట్టడం ద్వారా ‘వరెస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్’ గా నిలిచింది. ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా నిలిచింది. అలీబాబా కంటే 50 శాతం అత్యధిక ఓట్లు మెటా దక్కించుకోవడం విశేషం. ఇక ఇలా ప్రతీ ఏడాది బెస్ట్-వరెస్ట్ కంపెనీల జాబితాను యాహూ ఫైనాన్స్ వెబ్సైట్ విడుదల చేయడం సహజం. యాహూ ఫైనాన్స్ హోం పేజీ నుంచి సర్వే మంకీ ద్వారా డిసెంబర్ 4, 5 తేదీల్లో ఈ సర్వేను నిర్వహించారు. వివాదాలు, విమర్శల నేపథ్యంలో.. మెటా కంపెనీకి వరెస్ట్ కంపెనీ హోదాను కట్ట బెట్టడం విశేషం. ఇక యూజర్ల అభిప్రాయంలో ఎక్కువగా ఫేస్బుక్ మాజీ ఉద్యోగిణి ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపణల గురించి కనిపించింది. ఫేస్బుక్ తీరు, ఇన్స్టాగ్రామ్ యువత మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపడం, పిల్లల మీదా చెడు ప్రభావం కారణాలు.. ఫేస్బుక్ Meta గా మారినా కూడా వరెస్ట్ హోదాను కట్టబెట్టాయి. ఇక ఈ సర్వేలో పాల్గొన్న పదిలో ముగ్గురు మాత్రమే ఫేస్బుక్ తన తప్పులు సరిదిద్దుకోగలదన్న అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. ఇక యాహూ ఫైనాన్స్ లిస్ట్‌లో బెస్ట్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. కిందటి ఏడాదితో పోలిస్తే.. వాటా 53 శాతానికి పెంచుకోవడంతో పాటు 2 ట్రిలియన్ మైలురాయి దాటడం, మైక్రోసాఫ్ట్‌కి కలిసొచ్చాయి. చదవండి: చైనీస్ ఆపరేషన్.. మెటా దర్యాప్తులో సంచలన విషయాలు -
2021లో నాకు సాయం చేసినవి ఇవే!: ముకేష్ అంబానీ
Mukesh Ambani.. Most Helped Five Books In 2021: ఒక చిన్నటేబుల్, ఒక కుర్చీ సెటప్‌తో చిన్న స్టార్టప్‌గా మొదలైంది రిలయన్స్. మైక్రో-ఎంటర్‌ప్రైజ్‌గా ఎదిగి.. ఇప్పుడు ఏకంగా ఇప్పుడు ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎంటర్ప్రైజ్లలో ఒకటిగా పేరు దక్కించుకుంది. గ్లోబల్ ట్రేడ్‌లో ఏదో ఒక మైలు రాయిని అధిగమించినప్పుడల్లా తన తండ్రి ధీరుభాయ్ అంబానీ పడ్డ కష్టమే తనకు స్ఫూర్తి అంటూ రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ చెప్తుండడం చూస్తున్నాం. అయితే కరోనా కాలంలో తనలో కొత్త ఉత్సహాన్ని నింపింది తద్వారా రిలయన్స్ ఎదుగుదలకు సాయం చేసింది కొందరి రచనలే అని ఆయన అంటున్నాడాయన. బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ డిగ్రీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ చేసిన ముకేష్.. వ్యాపార దిగ్గజాలు, మేధావులు రాసే పుస్తకాలను క్రమం తప్పకుండా చదువుతుంటారు. అంతేకాదు వాటి రివ్యూలను సైతం ఇస్తూ.. వర్తమాన వ్యాపారులకు చదవమని సూచిస్తుంటారు కూడా. 2021 బిజినెస్ ఇయర్‌ని అర్థం చేసుకోవడానికి.. 2022కి సన్నద్ధం కావడానికి ముకేష్ అంబానీకి ఐదు పుస్తకాలు సాయపడ్డాయట. అవేంటో చూద్దాం ఇప్పుడు.. టెన్ లెస్సన్స్ ఫర్ ఏ పోస్ట్-ప్యాండెమిక్ వరల్డ్ ఇండో-అమెరికన్ జర్నలిస్ట్ ఫరీద్ జకారియా రాసిన పుస్తకం ఇది. కోవిడ్-19 మహమ్మారి, ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని అత్యంత వినాశకరమైన సంఘటనల మధ్య కొన్ని స్పష్టమైన సారూప్యతలను సంగ్రహించి ఫరీద్ ఈ పుస్తకం రాశారు. ప్రపంచ సంక్షోభాలనేవి తరచుగా నిలకడలేని జీవనశైలి పద్ధతులు.. బలహీనమైన పాలనా నిర్మాణాల నుండి ఉద్భవించాయని చెప్తుంది ఈ పుస్తకం. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంటుందని, సమర్థవంతమైన నాయకత్వం, జీవనశైలి మార్పు, సమర్థవంతమైన అంతర్జాతీయ సహకారం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుందని ఈ పుస్తకం చెబుతుంది. ‘‘వ్యాప్తి అనివార్యం, కానీ మహమ్మారి ఐచ్ఛికం’’ పుస్తకంలో ముకేష్కి బాగా నచ్చిన కొటేషన్ అంట!. ప్రిన్సిపుల్స్ ఫర్ డీలింగ్ విత్ ది ఛేంజింగ్ వరల్డ్ ఆర్డర్: వై నేషన్స్ సక్సీడ్ అండ్ ఫెయిల్ అమెరికన్ బిలియనీర్ ఇన్వెస్టర్ రే దాలియో రాసిన పుస్తకం ఇది. ప్రధాన దేశాలకు సంబంధించిన చరిత్రలో ఐదు వందల ఏళ్ల విజయాలను, వైఫల్యాలను స్థిరంగా పరిశీలించి.. అన్ని కోణాల్లోనూ అంశాలను స్పృశించిన ఆసక్తికరమైన పుస్తకం. ప్రస్తుతం, రాబోయే కాలాల మార్పుల మీద సమగ్రంగా చర్చ జరిపిన పుస్తకం ఇది. పాలసీ మేకర్లు, వ్యవస్థాపకులు(ఎంట్రప్రెన్యూర్లు), కార్యనిర్వాహకులు(ఎగ్జిక్యూటివ్స్) మరీముఖ్యంగా యువత తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది. ది రాగింగ్ 2020s: కంపెనీస్, కంట్రీస్, పీపుల్ అండ్ ది ఫైట్ ఫర్ అవర్ ఫ్యూఛర్ అమెరికన్ ఆథర్ అలెక్ రాస్ రాసిన పుస్తకం ఇది. ఆధునిక నాగరికతలో అనేక దశాబ్దాలు కొనసాగిన సామాజిక ఒప్పందం, ప్రభుత్వాలు, వ్యాపారాలు, ప్రజల మధ్య అనధికార ఒప్పందాలనేవి.. డిజిటల్ యుగపు ప్రాథమిక మార్పునకు ఎలా లోనయ్యాయో ఇది లోతుగా పరిశోధించింది. ఈ మార్పునకు దోహదపడ్డ రాజకీయ- ఆర్థిక శక్తులపై, నాగరికతకు ముందున్న విషయాలపై ఈ కాలపు మేధావుల అభిప్రాయాలతో ఇంటర్వ్యూలు ఉన్నాయి ఈ పుస్తకంలో. 2030: హౌ టుడేస్ బిగ్గెస్ట్ ట్రెండ్స్ విల్ కొలిడే అండ్ రీషేప్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్ స్పానిష్ సోషియాలజిస్ట్ మౌరో గుయిల్లెన్ రాసిన పుస్తకం ఇది. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ బుక్. 2030లో ప్రపంచ స్థితి గురించి, ముఖ్యంగా జనాభాలో సంభావ్య మార్పులు, దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక అవకాశాలపై ఎలా ఉంటుంది అనే విషయాలతో నిండి ఉంటుంది. కోవిడ్ అనంతర ప్రపంచాన్ని రూపొందించడానికి కట్టుబడి ఉన్న పట్టణీకరణ, సాంకేతికత, గిగ్ ఎకానమీ, ఆటోమేషన్లోని పోకడలను కూడా అన్వేషించింది. బిగ్ లిటిల్ బ్రేక్త్రోస్: హౌ స్మాల్, ఎవ్రీడే ఇన్నొవేషన్స్ డ్రైవ్ ఓవర్సైజ్డ్ రిజల్ట్స్ అమెరికన్ ఎంట్రెప్రెన్యూర్ జోష్ లింక్నర్ రాసిన బుక్ ఇది. వ్యాపారవేత్తలంతా తప్పక చదవాల్సిన బుక్ ఇది. వ్యాపారంలో భారీ లాభాలకు మూలకారణం.. సృజనాత్మకంగా చేపట్టే చిన్న చిన్న చర్యలు, నిర్ణయాలే అని ఈ బుక్ సారాంశం. రోజువారీ సూక్ష్మ-ఆవిష్కరణలను పెంపొందించడం ద్వారా, వ్యక్తులు మరియు సంస్థలు కఠినమైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. తద్వారా కోవిడ్ అనంతర ప్రపంచంలో పరివర్తన అవకాశాలను స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు. చదవండి: క్రిప్టో కరెన్సీ బిల్లుపై ముఖేష్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు -
2021లో విడాకులతో వార్తలో నిలిచిన సినీ ప్రముఖులు వీళ్లే..
List Of Famous Celebrity Couples Divorced In 2021: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఇండస్ట్రీలో డైవోర్స్ కొత్తేం కాదు. ప్రేమను పెళ్లివరకు ఎంత వేగంగా తీసుకెళ్లారో...అంతేవేగంగా విడాకులు తీసుకున్నారు. అప్పటివరకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్న క్యూట్ కపుల్ సైతం తమ దారులు వేరువేరు అని టాటా చెప్పేసుకున్నాయి. ఆఫ్ స్క్రీన్‌లోనూ హిట్ పెయిర్ అనిపించుకున్న జంటలు కలిసి ఉండలేమంటూ తమ వివాహ బంధాన్ని రద్దు చేసుకున్నాయి. అలా ఈ ఏడాది 20201లో విడిపోయిన సినీ ప్రముఖులపై ఓ లుక్కేద్దాం. Samantha-Naga Chaitanya ఈ ఏడాది విడాకులు తీసుకున్న జంటల్లో నాగ చైతన్య- సమంతలు ఉండటం అభిమానులకు ఊహించని షాకిచ్చింది. అప్పటివరకు ఇండస్ట్రీలో క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీరు ఇక భార్యభర్తలుగా కలిసి ఉండలేమంటూ విడాకుల ప్రకటన చేశారు. 2017లో ప్రేమ వివాహం చేసుకున్న చై-సామ్.. తమ 4వ వివాహ వార్షికోత్సవానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు అక్టోబర్2న విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. Aamir Khan -Kiran Rao బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ పెళ్లి విషయంలో మాత్రం రెండుసార్లు విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచాడు. 2006లో కిరణ్ రావును ప్రేమ వివాహం చేసుకున్న ఆయన 15 ఏళ్ల అనంతరం 2 ఏడాది జులై3న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ జంట విడిపోవడానికి కారణం హీరోయిన్ ఫాతిమా సనా షేక్ అని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. Nisha Rawal -Karan Mehra హిందీ పాపులర్ సీరియల్ నటుడు కరణ్ మెహ్రపై భార్య నిషా రావల్ గృహహిం ఆరోపణలు చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కరణ్ తనపై దాడికి దిగాడంటూ మీడియా ముందుకొచ్చింది. 2012లో ప్రేమవివాహం చేసుకున్న ఈ కపుల్ తొమ్మిదేళ్ల అనంతరం విడాకులు తీసుకున్నారు. Yo Yo Honey Singh- shalini thalwar ప్రముఖ బాలీవుడ్ సింగర్ హనీ సింగ్‌పై భార్య షాలిని తల్వార్ గృహహింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. 2011లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఈ ఏడాది విడిపోయారు. Nusrat Jahan- Nikhil Jain ప్రముఖ నటి, ఎంపీ నుస్రత్ జమాన్ పెళ్లి, విడాకులు తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. జూన్ 19, 2019లో నుస్రత్, వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ని టర్కీలో వివాహం చేసుకున్న నుస్రత్2021లో జైన్‌తో తన వివాహం చెల్లదని ప్రకటించింది. ఆ సమయంలో ఆ బ్యూటీ బెంగాలీ నటుడు యశ్వంత్ దాస్‌గుప్తా రిలేషన్షిప్లో ఉందని రూమర్స్ వినిపించాయి -
2021 రౌండప్: అస్తమించిన టెక్ మేధావులు వీళ్లే..
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కొత్త సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేసింది. వీటిలో వాడుకలోకి వచ్చినవి కొన్నైతే.. మెటావర్స్ లాంటి సంచలనానికి బీజం పడింది కూడా 2021లోనే!. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో టెక్ రంగానికి విశిష్ట సేవలు అందించిన దిగ్గజాలు కొందరు తనువు చాలించారు. ఏడాది ముగింపు సందర్భంగా వాళ్లను, వాళ్ల సేవలను ఓసారి గుర్తు చేసుకుంటూ.. పర్సనల్ కంప్యూటర్ సృష్టికర్త బ్రిటిష్ ఇన్వెంటర్ సర్ క్లయివ్ సిన్‌క్లెయిర్. జీఎక్స్(ZX) స్పెక్ట్రమ్ కంప్యూటర్ సృష్టికర్త. ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్‌గా దీనికంటూ ఓ పేరుంది. అంతేకాదు కంప్యూటర్ వీడియో గేమ్‌లు, కోడింగ్ లాంటి విషయాల్ని జనాలకు దగ్గర చేసింది కూడా ఇదే. ఒకరకంగా ఇళ్లలో కంప్యూటర్ల వాడకానికి మూలకారకుడు ఈయనే. 1983లో సిన్క్లెయిర్కు నైట్‌హుడ్ గౌరవం దక్కింది. 1985లోనే బ్యాటరీతో నడిచే సింగిల్ సీటర్ వెహికిల్ C5ను ఈయన రూపొందించినప్పటికీ.. సేఫ్టీ కోణంలో ఆ వెహికిల్ ఆటోమొబైల్ మార్కెట్ దృష్టిని ఆకర్షించలేకపోయింది. 2021 సెప్టెంబర్‌లో 81 ఏళ్ల వయసులో సుదీర్ఘ అనారోగ్యంతో సర్ క్లైవ్ సింక్లెయిర్ కన్నుమూశారు. వీడియో గేమ్ రారాజు మసయుకి యుయిమురా.. ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్‌లకు ఊపు తెచ్చిన మేధావి. జపాన్‌కు చెందిన ఈ గేమింగ్ ఇంజినీర్.. ప్రఖ్యాత గేమింగ్ కంపెనీలైన నిన్టెండో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, సూపర్ నిన్టెండో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్‌లో పాపులర్ గేమ్స్ రూపకర్తగా పేరుగాంచాడు. విశేషం ఏంటంటే.. 1981లో అప్పటి నిన్టెండో అధ్యక్షుడు యమౌచీ కోరిక మేరకు క్యాట్రిడ్జ్‌లలో సైతం గేమ్‌లు ఆడేలా వీడియో గేమింగ్ వ్యవస్థను డిజైన్ చేశాడు మసయుకి. అంతేకాదు 80వ దశకంలో నిన్టెండ్ను అమెరికాలో టాప్ గేమింగ్ కంపెనీల్లో ఒకటిగా నిలిపాడు. మూడు దశాబ్దాలపాటు నిన్టెండ్తో సాగిన ఆయన అనుబంధం.. 2004తో ముగిసింది. అప్పటి నుంచి ఆయన రిట్సుమెయికన్ యూనివర్సిటీలో గేమ్ స్టడీస్ పాఠాలు చెప్తూ వచ్చారు. చివరికి.. ఈ డిసెంబర్లోనే 78 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. అడోబ్, పీడీఎఎఫ్ రూపకర్త ప్రపంచంలో అతిపెద్ద సాప్ట్వేర్ కంపెనీల లిస్ట్‌లో(300 బిలియన్ డాలర్ల) ఉంది అడోబ్. టెక్ దిగ్గజం జాన్ వార్నోక్‌తో కలిసి అడోబ్‌ను స్థాపించాడు ఛార్లెస్ మాథ్యూ గెస్చ్‌క్లె. అంతేకాదు ఈయన పోర్టబుల్ డాక్యుమెంట్ ఫైండర్ (PDF) సహ రూపకర్త కూడా. చక్ అని ముద్దుగా పిల్చుకునే ఈ అమెరికన్ టెక్ దిగ్గజం.. వార్నోక్‌తో కలిసి 1982లో అడోబ్ PostScript(ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్) ఉత్పత్తి ద్వారా డెస్క్‌టాప్ పబ్లిషింగ్ పరిశ్రమలో సంచలనానికి తెరలేపారు. ఆ తర్వాత అడోబ్ ప్రొడక్టులు సృష్టించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. 1992లో ఇద్దరు దుండగులు ఆయన్ని కిడ్నాప్ చేయగా.. ఆయన సురక్షితంగా బయటపడి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో 81 ఏళ్ల వయసులో చక్ అనారోగ్యంతో కన్నుమూశారు. టేప్ రికార్డ్.. ఆడియో క్యాసెట్ లొయు ఒటెన్స్.. డచ్ ఇంజినీర్. కానీ, పుట్టింది బెర్లిన్‌లో. క్యాసెట్ టేప్ తయారు చేసిన మహా మేధావి. అంతేకాదు సుదీర్ఘ కాలం పిలిప్స్ కంపెనీలో పని చేసిన ప్రొడక్ట్ ఇంజినీర్‌గా కూడా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది. ఈ కాలంలోనే ఆయన ఎన్నో సంచలన ఆవిష్కరణలకు మూలం అయ్యాడు. పిలిప్స్ కంపెనీ నుంచి పోర్టబుల్ టేప్ రికార్డ్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది ఈయన హయాంలోనే. అయితే ఒట్టెన్ కెరీర్లో సంచలనం మాత్రం.. 1963(ఆగష్టు) బెర్లిన్ ఎలక్ట్రానిక్ ఫెయిర్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆడియో క్యాసెట్ రిలీజ్ కావడం. ఆ తర్వాతే ఈ ఐడియాను జపాన్ కంపెనీలు కాపీ కొట్టాయి. అయితే ఒట్టెన్ చొరవతో ప్రపంచ మార్కెట్లో సోనీ, పిలిప్స్ క్యాసెట్లు స్టాండర్డ్ మోడల్స్‌గా నిలవగలిగాయి. డెబ్భై దశకంలో కాంపాక్ట్ డిస్క్(CD) టెక్నాలజీ డెవలప్ చేయించింది ఈయనే. ఈ ఏడాది మార్చ్‌లో ఆయన నెదర్లాండ్స్‌లోని తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. విలాసం టు విషాదం మెక్అఫీ యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ సృష్టికర్తగా జాన్ మెక్అఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండ్‌లో పుట్టి, అమెరికాలో పెరిగిన మెక్అఫీ.. ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ యాంటీ వైరస్‌ను(1987)లో రూపొందించాడు. తద్వారా సాఫ్ట్వేర్ ప్రపంచంలోనే ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. అయితే ఈ లెగసీని ఆయన ఎంతో కాలం కొనసాగించలేకపోయాడు. 2011లో ఇంటెల్ కంపెనీ ఏకంగా 7.68 బిలియన్ డాలర్లు చెల్లించి.. మెక్అఫీ యాంటీ వైరస్ హక్కుల్ని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఆయన పతనం మొదలైంది. రాసలీలలు, డ్రగ్స్, తుపాకులు.. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్‌గా పేరున్న మెక్అఫీ.. టెన్నెస్సెలో పన్నుల ఎగవేత, న్యూయార్క్‌లో క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు(అదనంగా ఓ హత్య కేసు విచారణ తప్పించుకునే క్రమంలో అరెస్టయ్యి).. బార్సిలోనా(స్పెయిన్) జైల్లో శిక్ష అనుభవించాడు. అయితే పన్నుల ఎగవేత నేరంపై ఆయన్ని తిరిగి అమెరికాకు అప్పగించాలని ఈ ఏడాది జూన్‌లో స్పెయిన్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జైల్లో మగ్గిపోవడం ఇష్టం లేక అదేరోజు మెక్అఫీ (75) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -సాక్షి, వెబ్‌స్పెషల్