2023లో ఢిల్లీ మెట్రోలో ఏం జరిగింది? వీడియోలు ఎందుకు వైరల్‌ అయ్యాయి? | Delhi Metro Viral Incidents Year End RoundUp 2023: Couple Kiss, Romance And Fight Videos In Delhi Metro 2023- Sakshi
Sakshi News home page

Delhi Metro Viral Videos In 2023: ఢిల్లీ మెట్రోలో ఏం జరిగింది?

Published Sun, Dec 24 2023 11:16 AM | Last Updated on Tue, Dec 26 2023 12:16 PM

Couple Kiss Romance and Fight in Delhi Metro 2023 - Sakshi

ఢిల్లీ మెట్రో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేసిన తరువాత కూడా కొందరు ప్రయాణికులు తమ తీరు మార్చుకోలేదు. మెట్రోలో ముద్దులు పెట్టుకోవడం, సరసాలు ఆడటం, కొట్టుకోవడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం లాంటి పనులు 2023లో తరచూ కనిపించాయి.

ఇటువంటి ఉందంతాలకు సంబంధించిన వీడియోలు ఏడాది సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఒక వీడియోలో ఒక యువతి బ్రా, షార్ట్ స్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించింది. ఈ వీడియో వైరల్ కావడంతో, ఆ అమ్మాయిని ఢిల్లీ మెట్రోలో ‘ఉర్ఫీ జావేద్’ అనే పేరు పెట్టారు. మరో వీడియోలో ఢిల్లీ మెట్రోలో ఒక బాలుడు హస్తప్రయోగం చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను చూసిన వారంతా తెగ అసహ్యించుకున్నారు. 
 

ఇంకొక వీడియోలో ఢిల్లీ మెట్రోలో ఓరల్ సెక్స్ చేస్తున్న జంట కనిపించింది. దీనిని ప్రయాణికులెవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోలో ఒక బాయ్‌ఫ్రెండ్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి శీతల పానీయం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ ప్రియురాలు శీతల పానీయాన్ని తన నోటితో స్ప్రే చేసి.. ప్రియుడి నోట్లో పోస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా ఈ జంటను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. 

 

ఢిల్లీ మెట్రో కోచ్‌లో ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. అయితే దీనిని ఎవరో అడ్డుకోవడంతో అతను సిగ్గుపడకుండా సీసాలో మూత్ర విసర్జనను కొనసాగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఢిల్లీ మెట్రోలో సీట్ల కోసం జరిగిన గొడవలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. వాటిలోని ఒక  వీడియోలో సీటు విషయంలో ఓ మహిళ, పురుషుడి మధ్య గొడవ జరిగింది. ఆ మహిళ అతని ముఖంపై బలంగా కొట్టడం వీడియోలో కనిపిస్తుంది.  
 

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ‘మెట్రో’ వీడియోలో కొంతమంది మహిళలు చప్పట్లు కొడుతూ భజనలు చేయడం కనిపిస్తుంది. మరో వీడియోలో ఒక అంధ జంట తమ ముగ్గురు పిల్లలతో మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీనిని చూసిన యూజర్స్‌ భావోద్వేగానికి లోనయ్యారు. మరో వైరల్ వీడియోలో ఒక జంట ప్రేమలో మునిగి తేలుతూ.. ముద్దులు  పెట్టుకోవడం కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలన్నీ ఢిల్లీలో మెట్రోలో 2023లో చోటుచేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: 10 ఒళ్లు గగుర్పొడిచే దారుణాలు.. 2023 మిగిల్చిన చేదు గురుతులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement