offiecers
-
2023లో ఢిల్లీ మెట్రోలో ఏం జరిగింది? వీడియోలు ఎందుకు వైరల్ అయ్యాయి?
ఢిల్లీ మెట్రో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేసిన తరువాత కూడా కొందరు ప్రయాణికులు తమ తీరు మార్చుకోలేదు. మెట్రోలో ముద్దులు పెట్టుకోవడం, సరసాలు ఆడటం, కొట్టుకోవడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం లాంటి పనులు 2023లో తరచూ కనిపించాయి. ఇటువంటి ఉందంతాలకు సంబంధించిన వీడియోలు ఏడాది సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఒక వీడియోలో ఒక యువతి బ్రా, షార్ట్ స్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించింది. ఈ వీడియో వైరల్ కావడంతో, ఆ అమ్మాయిని ఢిల్లీ మెట్రోలో ‘ఉర్ఫీ జావేద్’ అనే పేరు పెట్టారు. మరో వీడియోలో ఢిల్లీ మెట్రోలో ఒక బాలుడు హస్తప్రయోగం చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను చూసిన వారంతా తెగ అసహ్యించుకున్నారు. ఇంకొక వీడియోలో ఢిల్లీ మెట్రోలో ఓరల్ సెక్స్ చేస్తున్న జంట కనిపించింది. దీనిని ప్రయాణికులెవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోలో ఒక బాయ్‌ఫ్రెండ్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి శీతల పానీయం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ ప్రియురాలు శీతల పానీయాన్ని తన నోటితో స్ప్రే చేసి.. ప్రియుడి నోట్లో పోస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా ఈ జంటను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీ మెట్రో కోచ్‌లో ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. అయితే దీనిని ఎవరో అడ్డుకోవడంతో అతను సిగ్గుపడకుండా సీసాలో మూత్ర విసర్జనను కొనసాగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఢిల్లీ మెట్రోలో సీట్ల కోసం జరిగిన గొడవలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. వాటిలోని ఒక వీడియోలో సీటు విషయంలో ఓ మహిళ, పురుషుడి మధ్య గొడవ జరిగింది. ఆ మహిళ అతని ముఖంపై బలంగా కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ‘మెట్రో’ వీడియోలో కొంతమంది మహిళలు చప్పట్లు కొడుతూ భజనలు చేయడం కనిపిస్తుంది. మరో వీడియోలో ఒక అంధ జంట తమ ముగ్గురు పిల్లలతో మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీనిని చూసిన యూజర్స్ భావోద్వేగానికి లోనయ్యారు. మరో వైరల్ వీడియోలో ఒక జంట ప్రేమలో మునిగి తేలుతూ.. ముద్దులు పెట్టుకోవడం కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలన్నీ ఢిల్లీలో మెట్రోలో 2023లో చోటుచేసుకున్నాయి. ఇది కూడా చదవండి: 10 ఒళ్లు గగుర్పొడిచే దారుణాలు.. 2023 మిగిల్చిన చేదు గురుతులు! -
పాములు పట్టడంలో ఎవరైనా అతని తర్వాతే.. ‘స్నేక్ మ్యాన్’ స్టోరీ!
ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ అటవీ విభాగంలో 21 ఏళ్లుగా పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన కెరియర్లో ఏకంగా 400 పాములను పట్టుకున్నాడు. ఈ ప్రాంతంలో ఎక్కడ పాము కనిపించినా అతనికి వెంటనే ఫోన్ వస్తుంది. ఇంత భారీస్థాయిలో పాములను పట్టుకున్న ఆయనకు కొత్త గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 1,800 రకాల పాములు.. పామును చూడగానే ఎవరైనా భయంతో వణికిపోతారు. అది విషపూరితమైనా, ప్రమాదకారికాకపోయిన భయం అనేది అందరిలో కామన్. ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1,800 రకాల పాములు ఉన్నాయి. వీటిలో 60 జాతుల పాములు అంత్యంత విషపూరితమైనవి. ఆ పాముకు సంబంధించిన ఒక్క చుక్క విషమైనా మనిషిని ఇట్టే బలిగొంటుంది. అయితే పాముల రక్షణ కోసం పాటుపడుతున్న కొందరిని మనం చూసేవుంటాం. వీరు పాములు ఎక్కడ కనిపించినా.. వాటిని జాగ్రత్తగా పట్టుకుని అడవులలో సురక్షితంగా విడిచిపెడుతుంటారు. 400 విషపూరిత పాములను పట్టుకుని.. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ అటవీ విభాగంలో పనిచేస్తున్న బేచూ సింగ్ గత రెండు దశాబ్ధాలలో పాములను పట్టుకోవడంతో విశేష అనుభవం సంపాదించాడు. ఇప్పటివరకూ 400 విషపూరిత పాములను పట్టుకుని, వాటిని సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టాడు. జైన్పూర్కు చెందిన ఆయన 2002 నుంచి రామ్‌పూర్ అటవీ విభాగంలో పనిచేస్తున్నాడు. అతను పాములను పట్టుకునే తీరును చూసిన అధికారులు, గ్రామస్తులు అతనిని ‘స్నేక్ మ్యాన్’ అని పిలుస్తుంటారు. నదుల నుంచి విషపూరిత పాములు.. రామ్‌పూర్ ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో ఉంది. నదుల నుంచి ఇక్కడకు పాములు వస్తుంటాయి. స్థానికంగా ఎవరికి పాము కనిపించినా వారు ఈ విషయాన్ని అటవీశాఖకు తెలియజేస్తారు. ఈ సమాచారం అందుకోగానే అక్కడి అధికారులు పామును పట్టుకునేందుకు ఆ ప్రాంతానికి బేచూ సింగ్‌ను పంపిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు.. రామ్‌పూర్ అటవీశాఖ డీఎఫ్ఓ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ బేచూసింగ్ స్నేక్ మ్యాన్ ఆఫ్ రామ్పూర్గా పేరొందాడని తెలిపారు. అతను 400 పాములను పట్టుకున్నప్పటికీ వాటికి ఎటువంటి హాని చేయకుండా అడవుల్లో విడిచిపెట్టారన్నారు. తమకు ఎక్కడి నుంచి అయినా పాముల గురించి సమాచారం వస్తే వెంటనే అక్కడకు బేచూసింగ్ను పంపిస్తామన్నారు. -
ఉల్లం‘ఘనులు’
గనుల బాబులదే అసలు పాపం కుంటిసాకులతో కాలయాపన ఉన్నతాధికారుల ఉత్తర్వులనూ తొక్కిపెట్టిన ఘనులు కళ్లు మూసుకొని.. అక్రమ తవ్వకాలకు సహకారం ఏటా రూ.30కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి లోకల్ బాబు రుబాబు సరే.. అంత అడ్డగోలుగా ఖనిజాన్ని తవ్వేసి, తరలించేస్తుంటే గనుల శాఖ బాబులు ఏం చేస్తున్నట్టు?.. పిల్లి కళ్లు మూసుకొని తననెవరూ చూడటం లేదు. తానెవరినీ చూడలేదు.. అన్నట్లుంది వారి నిర్వాకం. అధికార పార్టీ ప్రజాప్రతినిధి కుమారుడు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నామని నిస్సహాయ రాగం ఆలపిస్తున్న సదరు మైనింగ్ బాబులు.. మరి రెవెన్యూ అధికారుల ఆదేశాలను ఎందుకు తొక్కిపెట్టినట్టు?.. ప్రభుత్వ కార్యదర్శి మొదలు జిల్లా కలెక్టర్ వరకు ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు బేఖాతరు చేసినట్టు??.. అంటే.. కంచే చేను మేసిన చందంగా గనుల శాఖ అధికారులే లేటరైట్ అక్రమ తవ్వకాలకు పరోక్షంగా సహకరించినట్లే కదా!.. ఖనిజ తవ్వకాల లెక్కలు చూసినా.. దీనికి అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే తీసుకున్న అనుమతుల ప్రకారం లక్షన్నర క్యూబిక్ మీటర్లే తవ్వాల్సి ఉంది. కానీ దానికి రెట్టింపు అంటే మూడు లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా లేటరైట్ ఖనిజాన్ని దోచేసుకున్నా గనుల అధికారులు కనులు మూసేసుకున్నారు. అక్రమాలన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టే నిద్ర నటిస్తున్నారన్నమాట సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తాళం వేసి ఉన్న ఇల్లు కంటే.. తలుపులు బార్లా తెరచుకున్న ఇంటివైపే దొంగల దష్టి ఉంటుంది. సరిగ్గా ఇదే తరహాలో లేటరైట్ గనుల దోపిడీ జరుగుతోంది. అక్రమాలు జరిగితే కట్టడి చేయాల్సిన గనుల శాఖ అధికారులే కళ్లు మూసుకోవడంతో లేటరైట్ గనులను అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వేసి తరలించుకుపోతున్నారు. నిబంధనల ప్రకారం.. నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలో ఏడాదికి లక్షన్నర టన్నుల మేరకే లైటరేట్ను తరలించేందుకు అనుమతులు ఉన్నాయి. తవ్విన ఖనిజాన్ని గనులశాఖ అధికారులు పరిశీలించి, సెస్ నిర్ణయించాలి. వాటిని చెల్లించిన తర్వాతే ఖనిజాన్ని తరలించాల్సి ఉంది. టన్నుకు రూ.150 సెస్ చెల్లించాలి. అయితే ఇక్కడ ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. ఏడాది కాలంలోనే 3 లక్షల క్యూబిక్ మీటర్ల మేర లేటరైట్ తవ్వకాలు, తరలింపు జరిగినట్టు తెలుస్తోంది. లీజుకు తీసుకున్న భూమికి మించి తవ్వకాలు జరిగిపోతున్నాయి. ఏటా ఇలా అక్రమంగా తవ్వి తరలిస్తున్న ఖనిజం విలువ రూ. 30 కోట్లు వరకు ఉంటుందని అంచనా. అక్కడ నో... ఇక్కడ ఓకే వాస్తవానికి పరిమితికి మించి తవ్వకాలు చేపట్టిన కారణంగా గత ఏడాది తూర్పుగోదావరి జిల్లా వంతాడలో లేటరైట్ మైనింగ్‌ను అధికారులు నిలిపివేశారు. కానీ విశాఖ జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి కుమారుడి హవా నడవడంతో అడ్డూ అదుపూ లేకుండా మైనింగ్ జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని లేటరైట్ మైనింగ్‌పై వేటు పడటంతో ముడిసరుకు అవసరమైన కంపెనీలన్నీ సరుగుడు ప్రాంతంలోని తవ్వకాలపై కన్నేశాయి. దీంతో ఇక్కడ తవ్వకందారుడు ఎంత ధర చెప్పినా వెనుకాడకుండా కొనుగోలు చేసి తరలించుకుపోతున్నారు. ఎన్వోసీ పేరిట కాలయాపన సరుడుగు పరిధిలో లైటరైట్ గనుల తవ్వకాలకు అనుమతులిస్తూ పంచాయతీ చేసిన తీర్మానాలు రద్దయి ఏడాది దాటింది. అప్పట్లో మైనింగ్ అనుమతిపై పంచాయతీ తప్పుడు తీర్మానాలు చేసిందని పంచాయతీరాజ్ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విచారణ చేపట్టిన జిల్లా పంచాయతీ అధికారి అనుమతులు సరికాదంటూ నివేదిక ఇచ్చారు. దాన్ని ఆధారంగా చేసుకుని కూడా గనులశాఖ అధికారులు అప్పట్లోనే ఈ అనుమతులను రద్దు చేయాల్సి ఉంది. కానీ పట్టించుకోలేదు. నిరభ్యంతర పత్రం( ఎన్వోసీ) రద్దు కాలేదంటూ తాత్సారం చేస్తూ వచ్చారు. ముఖ్యకార్యదర్శి మొదలు జిల్లా కలెక్టర్ వరకు రెవెన్యూ ఉన్నతాధికారులు, పంచాయతీ రాజ్ అధికారులు ఆదేశాలిచ్చినా లీజు రద్దు చేయకుండా పెడచెవిన పెట్టిన గనుల శాఖ అధికారులు ఇప్పుడు కూడా ఎన్వోసీ నెపం చూపించే కాలయాపన చేస్తున్నారు. విలువైన సంపద, ప్రభుత్వానికి ఆదాయం పోతున్నా గనులశాఖ బాబులు పట్టించుకోకపోవడానికి అసలు కారణం లోకల్ బాబు భయం ఒక్కటే కాదు.. అందిన కాడికి మామూళ్లు దండుకోవాలన్న యావే కారణమని రెవెన్యూ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.