![Video: Samantha Enjoying Snow Skating, Shares Cryptic Post Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/22/ssam.gif.webp?itok=3F2ruunP)
Samantha Shares New Pic And Says Still Alive Because Of These Two : నాగ చైతన్య- సమంత విడాకుల విషయం సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండింగ్ టాపిక్. ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి దాదాపు మూడు నెలలు కావోస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ వారిద్దరి గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఇక విడాకుల అనంతరం ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్లపై నెటిజన్ల ఫోకస్ మరింత పెరిగింది.
సాధారణంగానే చై సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. దీంతో సమంత ఎప్పుడు ఏ పోస్ట్ షేర్ చేసినా అది విడాకుల అంశానికి ముడిపెడుతూ క్షణాల్లో అది వైరల్ అవుతుంది. తాజాగా స్విట్జర్లాండ్ ట్రిప్‌లో ఉన్న సమంత ఓ ఫోటోను షేర్ చేస్తూ.. వీరిద్దరి వల్లే ఇంకా బతికున్నాను అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.
దీనికి #skiingisbelieving అనే ట్యాగ్‌ను జత చేసింది. ఫోటోలో ఉన్న వీరిద్దరూ సామ్ స్కై ఇన్‌స్ట్రక్టర్లు అని తెలుస్తుంది. ఇంతకుముందు కూడా అహం(ఈగో)ని మీ ఇంట్లో వదిలి వెళ్లండి అంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అయితే రీసెంట్‌గా విడాకుల విషయంపై నాగ చైతన్య కామెంట్స్ అనంతరం సామ్ ఈ విధమైన పోస్టులు చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment