
మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఈరోజు పశ్చిమ బెంగాల్ నుంచి రాబోయితే లోక్‌సభ ఎన్నికలకు మొత్తం 42 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో బహరంపూర్ స్థానం నుండి మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్, అసన్సోల్ నుంచి శత్రుఘ్న సిన్హా, దుర్గాపూర్ నుంచి కీర్తి ఆజాద్ వంటి కొన్ని ప్రముఖ పేర్లు ఉన్నాయి.
టీఎంసీ పార్టీ 16 మంది సిట్టింగ్ ఎంపీల పేర్లతో పాటు, 12 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే కృష్ణానగర్ స్థానం నుంచి బహిష్కరణకు గురైన లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రాను పార్టీ వరుసగా రెండోసారి మళ్లీ నామినేట్ చేసింది.
సందేశ్‌ఖాలీ వివాదం కారణంగా 'నుస్రత్ జహాన్'ను బసిర్హాట్ స్థానం నుంచి తొలగించి.. ఆ స్థానంలో హాజీ నూరుల్ ఇస్లామ్‌ను బరిలోకి దింపారు. కాగా ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment