మొదలైన యూసఫ్ పఠాన్ ప్రచారం: అధీర్ చౌదరి కీలక వ్యాఖ్యలు | TMC Yusuf Pathan Begins Lok Sabha Poll Campaign In Bengal's Berhampore, Details Inside - Sakshi
Sakshi News home page

మొదలైన యూసఫ్ పఠాన్ ప్రచారం: అధీర్ చౌదరి కీలక వ్యాఖ్యలు

Published Thu, Mar 21 2024 9:33 PM | Last Updated on Fri, Mar 22 2024 12:37 PM

TMC Yusuf Pathan Lok Sabha Poll Campaign - Sakshi

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రకటించిన 42 మంది అభ్యర్థులలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ 'యూసఫ్ పఠాన్' (Yusuf Pathan) పేరు కూడా ఉంది. ఈయన బహరంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు.

'అధీర్ రంజన్ చౌదరి'కి కాంగ్రెస్ కంచుకోట అయిన బహరంపూర్ నియోజకవర్గంలో యూసఫ్ పఠాన్ నిలబడటం సర్వత్రా చర్చలకు దారి తీసింది. నిజానికి ఇప్పటికే చౌదరి బహరంపూర్ నుంచి ఐదుసార్లు గెలిచారు. అలాంటి చోట నుంచి ఇప్పుడు యూసఫ్ పఠాన్ పోటీ చేయనున్నారు. 

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి యూసఫ్ పఠాన్  కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారాన్ని ప్రారంభించిన సమయంలో యూసుఫ్ పఠాన్ మాట్లాడుతూ.. తాను క్రికెట్ ఆడేటప్పుడు ప్రజల ప్రేమను పొందానని, ఇప్పుడు లోక్‌సభ పోటీదారుగా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

'అధీర్ రంజన్ చౌదరి' యూసుఫ్ పఠాన్ బెర్హంపూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంపై వ్యాఖ్యానిస్తూ.. రాజకీయాలు & క్రికెట్ ఒకేలా ఉండవని అన్నారు. అయితే చౌదరిని బెర్హంపూర్ స్థానం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా కాంగ్రెస్ అధికారికంగా నామినేట్ చేయలేదు. బెర్హంపూర్ లోక్‌సభ స్థానానికి మే 13న నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement