
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు దిబ్యేందు అధికారి, అర్జున్ సింగ్ నేడు (శుక్రవారం) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.
దిబ్యేందు అధికారి 2021లో బీజేపీ పార్టీలో చేరిన సీనియర్ బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడు. కాగా అర్జున్ సింగ్ కూడా గత కొన్ని రోజులుగా బీజేపీలో చేరనున్నట్లు చెబుతూనే ఉన్నారు. నేడు పార్టీ కండువా కప్పుకున్నారు.
ఇటీవల టీఎంసీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పుడు.. జాబితాలో తన పేరు లేదని అర్జున్ సింగ్ పేర్కొన్నారు. బరాక్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్ర మంత్రి పార్థ భౌమిక్‌ను నామినేట్ చేశారు. అర్జున్ సింగ్ 2019లో బీజేపీలో చేరి అప్పటి టీఎంసీ అభ్యర్థిని బరాక్‌పూర్‌లో ఓడించారు. కాగా ఇప్పుడు టీఎంసీ సీటు ఇవ్వకపోవడంతో సొంత గూటికే చేరనున్నట్లు ప్రకటించారు.
బీజేపీలో చేరిన తర్వాత దిబ్యేందు అధికారి సంతోషం వ్యక్తం చేస్తూ, సందేశ్‌ఖాలీ ఘటనలో బాధితులను ముందుగా ఆదుకున్నందుకు పార్టీని కొనియాడారు. అంతే కాకుండా బెంగాల్‌లో మహిళలకు ఉండాల్సిన గౌరవం లేదు, అక్కడ చట్టబద్ధమైన పాలన లేదని వెల్లడించారు.
#WATCH | Barrackpore MP Arjun Singh and TMC's Tamluk MP Dibyendu Adhikari join the BJP, in Delhi.
— ANI (@ANI) March 15, 2024
Arjun Singh quit the TMC and rejoined the BJP today. Dibyendu Adhikari, who is also the brother of West Bengal LoP Suvendu Adhikari, quit TMC today. pic.twitter.com/anU42p59u7