arjun singh
-
బీజేపీలో చేరిన ఇద్దరు టీఎంసీ ఎంపీలు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు దిబ్యేందు అధికారి, అర్జున్ సింగ్ నేడు (శుక్రవారం) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. దిబ్యేందు అధికారి 2021లో బీజేపీ పార్టీలో చేరిన సీనియర్ బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడు. కాగా అర్జున్ సింగ్ కూడా గత కొన్ని రోజులుగా బీజేపీలో చేరనున్నట్లు చెబుతూనే ఉన్నారు. నేడు పార్టీ కండువా కప్పుకున్నారు. ఇటీవల టీఎంసీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పుడు.. జాబితాలో తన పేరు లేదని అర్జున్ సింగ్ పేర్కొన్నారు. బరాక్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్ర మంత్రి పార్థ భౌమిక్‌ను నామినేట్ చేశారు. అర్జున్ సింగ్ 2019లో బీజేపీలో చేరి అప్పటి టీఎంసీ అభ్యర్థిని బరాక్‌పూర్‌లో ఓడించారు. కాగా ఇప్పుడు టీఎంసీ సీటు ఇవ్వకపోవడంతో సొంత గూటికే చేరనున్నట్లు ప్రకటించారు. బీజేపీలో చేరిన తర్వాత దిబ్యేందు అధికారి సంతోషం వ్యక్తం చేస్తూ, సందేశ్‌ఖాలీ ఘటనలో బాధితులను ముందుగా ఆదుకున్నందుకు పార్టీని కొనియాడారు. అంతే కాకుండా బెంగాల్లో మహిళలకు ఉండాల్సిన గౌరవం లేదు, అక్కడ చట్టబద్ధమైన పాలన లేదని వెల్లడించారు. #WATCH | Barrackpore MP Arjun Singh and TMC's Tamluk MP Dibyendu Adhikari join the BJP, in Delhi. Arjun Singh quit the TMC and rejoined the BJP today. Dibyendu Adhikari, who is also the brother of West Bengal LoP Suvendu Adhikari, quit TMC today. pic.twitter.com/anU42p59u7 — ANI (@ANI) March 15, 2024 -
టీఎంసీ నాకు ద్రోహం చేసింది.. బీజేపీలో చేరుతా : అర్జున్ సింగ్
లోక్‌సభ ఎన్నికల జరగటానికి ముందే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బరాక్‌పూర్ నియోజకవర్గానికి చెందిన నుంచి ఎంపీ అర్జున్ సింగ్.. బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే ఎప్పుడు చేరుతారనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. 'ఇది ఫిక్స్.. నేను బీజేపీలో చేరతాను' నేను ఇక్కడ లేదా ఢిల్లీలో ఎక్కడైనా బీజేపీ పార్టీలో చేరవచ్చు. పార్టీ నాకు ఏ పని ఇస్తే అది చేస్తానని విలేకర్ల సమావేశంలో అర్జున్ సింగ్ అన్నారు. 2022లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినప్పుడు, నన్ను బరాక్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా నామినేట్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పార్టీ ఇప్పుడు తమ హామీని నిలబెట్టుకోలేదు, నాకు ద్రోహం చేసిందని అన్నారు. ఆదివారం టీఎంసీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పుడు.. జాబితాలో తన పేరు లేదని అర్జున్ సింగ్ పేర్కొన్నారు. బరాక్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్ర మంత్రి పార్థ భౌమిక్‌ను నామినేట్ చేశారు. అర్జున్ సింగ్ 2019లో బీజేపీలో చేరి అప్పటి టీఎంసీ అభ్యర్థిని బరాక్‌పూర్‌లో ఓడించారు. కాగా ఇప్పుడు టీఎంసీ సీటు ఇవ్వకపోవడంతో సొంత గూటికే చేరనున్నట్లు ప్రకటించారు. -
‘న్యాయశాఖ’ నుంచి రిజిజుకు ఉద్వాసన
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియంలో మరింత పారదర్శకత కోరుతూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజును ఆ శాఖ బాధ్యతల నుంచి మోదీ సర్కార్ తప్పించింది. న్యాయవ్యవస్థతో ఎలాంటి బేధాభిప్రాయాలు పొడచూపకూడదనే ఉద్దేశంతోనే ఈయన శాఖను మార్చారని తెలుస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖల స్వతంత్ర మంత్రి అర్జున్‌సింగ్ మేఘ్వాల్కు న్యాయశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. కేబినెట్ ర్యాంక్‌లేని ఒక స్వతంత్ర హోదా మంత్రికి కీలకమైన న్యాయశాఖను అప్పగించడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి. ఎందుకు మార్చారు ? సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీలను సొంతంగా సుప్రీంకోర్టే కొలీజియం పేరిట నియమించుకోవడం ఎక్కడా లేదని, ఇదొక ఏలియన్ విధానం అని, మాజీ జడ్జీలు దేశవ్యతిరేక గ్యాంగ్‌లుగా తయారయ్యారని రిజిజు గతంలో ఆరోపించారు. దీంతో తమ బాధ్యతలు, విధుల్లో ప్రభుత్వ జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు కొలీజియం ఘాటుగా బదులిచ్చింది. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న ఈ తరుణంలో రిజిజు వ్యాఖ్యలు విపక్షాలకు ఎన్నికల అస్త్రంగా మారకూడదనే ఉద్దేశంతోనే ఆయనను తప్పించినట్లు వార్తలొచ్చాయి. ఇన్నాళ్లూ మరో మంత్రి జితేంద్ర సింగ్ నిర్వహించిన భూ విజ్ఞానశాస్త్ర శాఖను రిజిజుకు అప్పగించారు. ప్రధాని మోదీ సలహా మేరకు రిజిజు, మేఘ్వాల్ శాఖలను మార్చుతున్నట్లు గురువారం రాష్ట్రపతిభవన్ ఒక నోటిఫికేషన్ విడుదలచేసింది. కాగా, బాధ్యతలు మారడంపై రిజిజు స్పందించారు. ‘ భూ విజ్ఞాన శాఖలో ప్రధాని మోదీ దార్శనికతను సుసాధ్యం చేసేందుకు శాయశక్తుల కృషిచేస్తా. ఇంతకాలం న్యాయశాఖ మంత్రిగా కొనసాగడం గౌరవంగా భావిస్తున్నా. ఇందుకు మద్దతు పలికిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్సహా మొత్తం న్యాయవ్యవస్థకు నా కృతజ్ఞతలు’ అని రిజిజు ట్వీట్ చేశారు. -
బీజేపీకి బిగ్ షాక్
పశ్చిమ బెంగాల్లో బీజేపీ, అధికార టీఎంసీ మధ్య ఇప్పటికే ఘర్షణ వాతావరణమే కొనసాగుతోంది. ఈ క్రమంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన ఎంపీ అర్జున్ సింగ్ కమలం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తన సొంత పార్టీ అయిన అధికార తృణముల్ కాంగ్రెస్‌లో చేరారు. వివరాల ప్రకారం.. బైరక్‌పూర్ ఎంపీ అర్జున్ సింగ్ ఆదివారం టీఎంసీలో చేరారు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన తృణమూల్‌ను వీడి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీజేపీ ఆయనకు బైరక్‌పూర్ నుంచి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా ఆయన బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తితోనే బీజేపీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. తనకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడంలేదని, ఇమడనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, తీవ్ర అసంతృప్తితో ఆదివారం బీజేపీకి గుడ్ బై చెప్పి.. సొంత పార్టీ గూటికి చేరారు. మూడు సంవత్సరాల తర్వాత అర్జున్ సింగ్ టీఎంసీలో చేరారు. ఈ క్రమంలో తృణమూల్ అగ్రనేత అభిషేక్ బెనర్జీ ఎంపీ అర్జున్ సింగ్‌కి పార్టీ కండువా కప్పి, సాదరంగా టీఎంసీలోకి ఆహ్వానించారు. కాగా, అర్జున్ సింగ్ 2001లో టీఎంసీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. Warmly welcoming former Vice President of @BJP4Bengal and MP from Barrackpore, Shri @ArjunsinghWB into the All India Trinamool Congress family. He joins us today in the presence of our National General Secretary Shri @abhishekaitc. pic.twitter.com/UuOB9yp9Xo — All India Trinamool Congress (@AITCofficial) May 22, 2022 ఇది కూడా చదవండి: ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు -
టీఎంసీ నన్ను చంపాలని చూస్తోంది: బీజేపీ ఎంపీ
సాక్షి, కోల్‌కతా: టీఎంసీ నేతలు తనను చంపాలని చూస్తున్నారంటూ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపణలు చేశారు. ఆయన ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో మంగళవారం ఉదయం 9.10 గంటలకు బాంబు పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 8న కూడా బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్‌లో ఉన్న ఆయన ఇంటి వెలుపల ఓ పేలుడు సంభవించింది. కొందరు వ్యక్తులు ఆయన ఇంటి గేటుపై బాంబులు విసిరారు.ఈ కేసు విచారణను ప్రస్తుతం ఎన్ఐఏ చూస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఘటన చోటు చేసుకుంది. పేలుడు అనంతరం ఆయ మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ దాడులు వెనుక ఉందని ఆరోపించారు. తనను, తన సన్నిహితులను చంపేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. బెంగాల్లో ప్రస్తుతం గూండారాజ్యం నడుస్తోందని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను నార్త్ 24 పరగణాస్ అధ్యక్షుడు పార్థ భౌమిక్ ఖండించారు. ఆయా పేలుళ్లకు బీజేపీ ఎంపీనే ఏదో ఒక రకంగా కారణమైఉంటారని అన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోందని, అధికారులు ఘటనా స్థలంలో ఉన్నారని పోలీసులు తెలిపారు. చదవండి: బ్లాక్‌మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ -
బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వద్ద బాంబు పేలుడు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసం సమీపంలో బాలు పేలుడు సంభవించింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని అర్జున్ సింగ్ నివాసం సమీపంలో బుధవారం ఉదయం మూడు బాంబాలు విసిరినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అలాగే ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ బాంబు దాడి వెనక టీఎంసీకి చెందిన వారున్నారని బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. కాగా ఈ పేలుడు ఘటన జరిగిన సమయంలో ఎంపీ అర్జున్ సింగ్ ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం దాడి జరిగిన ఇంటి లోపలే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వారికి ఎలాంటి గాయాలైనట్లు సమాచారం లేదు. మరోవైపు బాంబు పేలుడు ఘటనను బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్‌కఢ్ ఖండించారు. బెంగాల్లో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన అన్నారు. -
‘ఆ ఐదుగురు ఎంపీలు రాజీనామా చేస్తారు’
కోల్‌కతా: మంత్రి సుభేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్‌ను వీడినట్లయితే మమత సర్కారు కుప్పకూలూతుందంటూ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీలో చేరినట్లయితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని జగద్దల్ ఘాట్ వద్ద శనివారం ఆయన ఛట్ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘తృణముల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎంపీలు కాషాయం కండువా కప్పుకోవడం ఖాయం. సుభేంధుని టీఎంసీ పార్టీ చాలా అవమానించింది. తన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టి వేధించింది. కానీ ప్రజా నాయకులను అలాంటి చర్యలు ఏమీచేయలేవు. (చదవండి: సవాళ్లను స్వీకరించాలి, పోరాడాలి, ఓడించాలి) సుభేందు వంటి ఎంతో మంది నేతల ప్రోద్బలంతో మమతా బెనర్జీ నాయకురాలిగా ఎదిగారు. కానీ ఇప్పుడు గతాన్ని, ఎంతో మంది నేతల త్యాగాన్ని మర్చిపోయి తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సీఎం కుర్చీపై కూర్చొబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాన్ని ఏ నాయకులు ఒప్పుకోరు’’అంటూ విమర్శలు గుప్పించారు. అదే విధంగా టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ త్వరలోనే ఆ పార్టీకి రాజీనామా చేస్తారని అర్జున్ సింగ్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఆయన కేవలం టీఎంసీ నాయకుడిలా మీడియా ముందు నటిస్తున్నారని, ఏ క్షణమైనా బీజేపీలో చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. సుభేందుతో సౌగతా రాయ్ చర్చలు జరుపుతున్నారని, ఒక్కసారి కెమెరా కళ్లు వారిని దాటిపోయినట్లయితే వారు కాషాయ కండువా కప్పుకోవడం తథ్యమని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలను సౌగతా రాయ్ వట్టి పుకార్లేనంటూ కొట్టివేయడం గమనార్హం. -
‘అల్లర్లు ఆగకపోతే రాష్ట్రపతి పాలనే’
కొల్కత్తా: సవరించిన పౌరసత్వ చట్టంపై అస్సాం, పశ్చిమబెంగాల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం బెంగాల్లో ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌కు, బస్సులకు నిప్పుపెట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకొని నిరసనకారులు దాడులకు దిగుతున్నారు. శనివారం బర్రక్పూర్కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్‌సింగ్ కారుపై గుర్తు తెలియని నిరసనకారులు దాడి చేశారు. కారుపై రాళ్లు రువ్వుతూ దాడికి తెగపడ్డారు. వారి దాడి నుంచి తప్పించుకున్న ఎంపీకి ఎటువంటి గాయాలు కాలేదు. దీనిపై స్పందించిన ఎంపీ మాట్లాడుతూ.. ‘ఖాక్కినారా నుంచి వస్తున్న నా కారుపై ఆందోళనకారులు రాళ్లు విసురుతూ దాడికి తెగపడ్డారు. పశ్చిమబెగాల్లో శాంతి భద్రతలు అదుపులో లేవు. ఇలాగే ఆందోళనకారుల అల్లర్లు కొనసాగితే సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. నిరసనకారల అల్లర్లు ఆగకపోతే కేంద్రం రాష్ట్రపతి పాలన విధించాలి’అని ఎంపీ అర్జున్‌సింగ్ అభిప్రాయపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ.. ఆందోళనకారలు తీవ్రంగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో పలు ప్రభుత్వ కార్యాలయాలు దగ్ధం అయ్యాయి. నిరసనకారులు ముఖ్యంగా ముర్షిదాబాద్, మాల్డా, హౌరా జిల్లాల్లోని రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకొని వాటికి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విధంగా హింసాత్మంగా మారిన నిరసనల వల్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ శాంతిని కాపాడలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆస్తులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె నిరసనకారులను హెచ్చరించారు. హింసను ఆశ్రయించకూడదని ప్రజలకు మమతా విజ్ఞప్తి చేశారు. కాగా బంగ్లాదేశ్ ముస్లిం చొరబాటుదారుల అల్లరి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించటం తప్ప కేంద్రానికి మారో మార్గం లేదని ఎంపీ అర్జున్‌సింగ్ పేర్కొన్నారు. -
అయోధ్య తీర్పు; విగ్రహావిష్కరణ వాయిదా
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దివంగత మాజీ కేంద్రమంత్రి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అర్జున్ సింగ్ విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది. భోపాల్ లోని రద్దీగా ఉండే ఓ రోడ్డు జంక్షన్లో అర్జున్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు నిర్ణయించారు. అయితే గతంలో అక్కడ స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ అజాద్ విగ్రహం ఉండేది. ఆ ప్రదేశంలోనే అర్జున్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని స్థానిక బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘అజాద్ విగ్రహం గతంలో ఎక్కడ ఉండేదో తిరిగి అక్కడే ప్రతిష్టించాల’ని ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘దేశమాత ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ అజాద్ విగ్రహం తొలగించడం ఆయనను అవమానించడమే. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. అజాద్ విగ్రహాన్ని తొలగించిన చోటనే పునః ప్రతిష్టించాలి. లేదంటే దేశం వారిని ఎన్నటికీ క్షమించదు’ అని చౌహన్ అన్నారు. ‘ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్డు విస్తరణ చేసే పనుల్లో భాగంగా మూడేళ్ల క్రితమే అజాద్ విగ్రహాన్ని తీసి మరో ప్రదేశంలో నెలకొల్పార’ని బీఎంసీ అధికారులు చెబుతున్నారు. అర్జున్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గురించి కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పౌరసంఘాల అధికారులు తనను ఎప్పుడూ సంప్రదించలేదని బీజేపీ నేత, భోపాల్ మేయర్ అలోక్ శర్మ స్పష్టం చేశారు. దీనిపై బీఎంసీ కమిషనర్ బి.విజయ్ దత్తా వాదన మరోలా ఉంది. అర్జున్ సింగ్ విగ్రహం ఏర్పాటు గురించి కాంగ్రెస్‌నేతలు, బీఎంసీ అధికారులు మేయర్‌ను కలిశామని, అయితే ఆ విషయాన్ని మాత్రం మేయర్ వెల్లడించడం లేదని చెబుతున్నారు. వాస్తవానికి ఈనెల 11న అర్జున్‌సింగ్ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉండగా అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆ కార్యక్రమం వాయిదా పడింది. -
‘మా కుటుంబ విషయాల్లో సీఎం జోక్యం చేసుకుంటున్నారు’
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ కుమారుడు అజయ్ సింగ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై పలు ఆరోపణలు చేశారు. తమ కుటుంబ వ్యహహారాల్లో సీఎం జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. తన కుమారులు వేధిస్తున్నారని, ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు గెంటేస్తున్నారని అర్జున్ సింగ్ భార్య సరోజ్ కుమారి(83) అజయ్ సింగ్, తన భార్య సునీతపై ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గృహ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్టం 2005 ప్రకారం తన కుమారులు, కోడలుపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తల్లి కేసు పెట్టడం వెనుక సీఎం శివరాజ్ సింగ్ హస్తం ఉందని, రాజకీయంగా తనను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తన కుటుంబ వ్యహహారాల్లో సీఎం జోక్యం చేసుకుంటున్నారని అజయ్ విమర్శించారు. తన మీద వచ్చిన విమర్శిలపై శివరాజ్‌సింగ్ తీవ్రంగా స్పందించారు. అజయ్‌వి చౌకబారు ఆరోపణలని, వారి కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని సీఎం స్పష్టంచేశారు. -
అర్జన్ సింగ్‌కు కన్నీటి వీడ్కోలు
► యుద్ధ విమానాలతో ‘ఫ్లై పాస్ట్’ ► అధికార లాంఛనాలతో అంత్యక్రియలు న్యూఢిల్లీ: యుద్ధ వీరుడు, మార్షల్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అర్జన్ సింగ్(98)కు జాతి కన్నీటి వీడ్కోలు పలికింది. కంటోన్మెంట్ ప్రాంతంలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో సోమవారం సిక్కు సంప్రదాయం ప్రకారం, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు జరిగాయి. అర్జన్ సింగ్ కుమారుడు అరవింద్ ఆయన భౌతికకాయానికి తలకొరివి పెట్టారు. ఈ సందర్భంగా దేశ రాజధానిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను అవనతం చేశారు. రాజకీయ ప్రముఖులు, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గుండెపోటుతో శనివారం తుది శ్వాస విడిచిన అర్జన్‌సింగ్ భౌతిక కాయానికి తొలుత 17 తుపాకులతో సైనికులు గౌరవ వందనం సమర్పించారు. యుద్ధ వీరుడికి గౌరవ సూచకంగా ‘మిస్సింగ్ మ్యాన్ ఫార్మేషన్’లో ఐఏఎఫ్ సుఖోయ్ ఎస్‌యూ–30 యుద్ధ విమానాలు గగనతలంలో సైనిక విన్యాసాలు (ఫ్లై పాస్ట్)నిర్వహించాయి. ఐఏఎఫ్ ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లు కూడా అర్జన్ సింగ్‌కు నివాళిగా వీఐసీ ఆకారంలో విన్యాసాలు నిర్వహించాయి. అమరుడైన సైనికాధికారి గౌరవార్థం ఆకాశంలో యుద్ధ విమానాలతో నిర్వహించేదే ‘మిస్సింగ్ మ్యాన్ ఫార్మేషన్’. అంతకుముందు జాతీయ పతాకం కప్పిన సింగ్ పార్థివ దేహాన్ని ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి మిలిటరీ వాహనంలో బ్రార్ స్క్వేర్‌కు తరలించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ తదితరులతో పాటు త్రివిధ దళాల ప్రస్తుత, మాజీ అధిపతులు, సింగ్ కుటుంబ సభ్యులు సైనిక వీరుడికి కడసారి నివాళులర్పించారు. ధీశాలి.. తిరుగులేని పైలట్... వాయుసేనలో ఫైవ్‌స్టార్ ర్యాంక్ పొందిన ఏకైక అధికారి అర్జన్‌సింగ్ 1965 భారత్–పాక్ యుద్ధంలో వీరోచిత పాత్ర పోషించారు. చిన్న వయసులోనే యుద్ధంలో వైమానిక దళాన్ని ముందుండి నడిపించిన ఆయన సేవలను పలువురు కీర్తించారు. నాడు అమెరికా మద్దతు కలిగిన వైమానిక దళాలున్న పాక్‌ను సింగ్ నేతృత్వంలోని ఐఏఎఫ్ తరిమికొట్టిందని మాజీ ఎయిర్ వైస్ మార్షల్ కపిల్ కాక్ కొనియాడారు. ధైర్యవంతుడు, తిరుగులేని పైలట్ అని ఆయన మాజీ సహచరుడొకరు ప్రశంసించారు. -
అర్జన్ సింగ్ కు తుది వీడ్కోలు
-
అర్జన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి
-
అర్జన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మార్షల్ ఆఫ్ ఎయిర్‌ఫోర్స్ అర్జన్ సింగ్ అంత్యక్రియలను సోమవారం జరిగాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్‌స్కేర్‌లో అధికార లాంఛనాల మధ్య ఆయనకు తుది వీడ్కోలు పలికారు. అంతకు ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిధ దళాల అధిపతులు...అర్జన్ సింగ్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. కాగా అర్జన్ సింగ్ గుండెపోటుతో శనివారం సాయంత్రం 7.30గంటలకు అంతిమశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా.. మార్షల్ అర్జన్‌సింగ్ మృతికి నివాళిగా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న జాతీయ జెండాలను అవనతం చేయనున్నారు. -
అమెరికాలో కేటీఆర్‌కు ఘనస్వాగతం
హైదరాబాద్ సిటీ: తెలంగాణ సాధనకోసం అమెరికా వదిలిపెట్టి వచ్చిన పదేళ్ల తర్వాత తిరిగి ఆ గడ్డపై అడుగుపెట్టడంతో ఐటీ మంత్రి కె. తారకరామారావుకు ఘనస్వాగతం లభించింది. ఆయన బుధవారం ఉదయం అట్లాంటాలోని జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి అమెరికాలోని ప్రవాస టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు పుష్పగుచ్చాలు ఇచ్చి సాధరంగా ఆహ్వనించారు. ఆయన గురువారం ఉదయం వాషింగ్టన్ డీసీలో పర్యటించనున్నారు. అక్కడ భారత రాయబారి అర్జున్ సింగ్‌తో కలిసి ప్రత్యేక సమావేశంలో పాల్గొని.. విందుకు హజరవుతారు. సుమారు పదేళ్ల తర్వాత అమెరికా వచ్చానని, రెండువారాల పాటు పలు సమావేశాల్లో బిజీగా గడపనున్నానని మంత్రి ఈ సందర్భంగా ట్విట్టర్లో పేర్కొన్నారు.