
కొల్‌కత్తా: సవరించిన పౌరసత్వ చట్టంపై అస్సాం, పశ్చిమబెంగాల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం బెంగాల్‌లో ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌కు, బస్సులకు నిప్పుపెట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకొని నిరసనకారులు దాడులకు దిగుతున్నారు. శనివారం బర్రక్పూర్‌కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్సింగ్ కారుపై గుర్తు తెలియని నిరసనకారులు దాడి చేశారు. కారుపై రాళ్లు రువ్వుతూ దాడికి తెగపడ్డారు. వారి దాడి నుంచి తప్పించుకున్న ఎంపీకి ఎటువంటి గాయాలు కాలేదు. దీనిపై స్పందించిన ఎంపీ మాట్లాడుతూ.. ‘ఖాక్కినారా నుంచి వస్తున్న నా కారుపై ఆందోళనకారులు రాళ్లు విసురుతూ దాడికి తెగపడ్డారు. పశ్చిమబెగాల్‌లో శాంతి భద్రతలు అదుపులో లేవు. ఇలాగే ఆందోళనకారుల అల్లర్లు కొనసాగితే సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. నిరసనకారల అల్లర్లు ఆగకపోతే కేంద్రం రాష్ట్రపతి పాలన విధించాలి’అని ఎంపీ అర్జున్‌సింగ్ అభిప్రాయపడ్డారు.
ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ.. ఆందోళనకారలు తీవ్రంగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో పలు ప్రభుత్వ కార్యాలయాలు దగ్ధం అయ్యాయి. నిరసనకారులు ముఖ్యంగా ముర్షిదాబాద్, మాల్డా, హౌరా జిల్లాల్లోని రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకొని వాటికి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విధంగా హింసాత్మంగా మారిన నిరసనల వల్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి.
కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ శాంతిని కాపాడలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆస్తులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె నిరసనకారులను హెచ్చరించారు. హింసను ఆశ్రయించకూడదని ప్రజలకు మమతా విజ్ఞప్తి చేశారు. కాగా బంగ్లాదేశ్ ముస్లిం చొరబాటుదారుల అల్లరి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించటం తప్ప కేంద్రానికి మారో మార్గం లేదని ఎంపీ అర్జున్సింగ్ పేర్కొన్నారు.