
అర్జన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మార్షల్ ఆఫ్ ఎయిర్‌ఫోర్స్ అర్జన్ సింగ్ అంత్యక్రియలను సోమవారం జరిగాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్‌స్కేర్‌లో అధికార లాంఛనాల మధ్య ఆయనకు తుది వీడ్కోలు పలికారు. అంతకు ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిధ దళాల అధిపతులు...అర్జన్ సింగ్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.
కాగా అర్జన్ సింగ్ గుండెపోటుతో శనివారం సాయంత్రం 7.30గంటలకు అంతిమశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా.. మార్షల్ అర్జన్‌సింగ్ మృతికి నివాళిగా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న జాతీయ జెండాలను అవనతం చేయనున్నారు.