కాంగ్రెస్ కంచుకోటలో యూసఫ్ పఠాన్.. టీఎంసీ గెలుపు సాధ్యమేనా? | Yusuf Pathan vs Adhir Ranjan Chowdhury In Baharampur Lok Sabha Ticket, See Details Inside - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ కంచుకోటలో యూసఫ్ పఠాన్.. టీఎంసీ గెలుపు సాధ్యమేనా?

Published Sun, Mar 10 2024 7:05 PM | Last Updated on Mon, Mar 11 2024 10:01 AM

Yusuf Pathan vs Adhir Ranjan Chowdhury - Sakshi

తృణమూల్ కాంగ్రెస్ (TMC) పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ (Yusuf Pathan) బహరంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు.

నిజానికి బహరంపూర్ నియోజకవర్గం లోక్‌సభ నాయకుడు 'అధీర్ రంజన్ చౌదరి'కి కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటికి కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పటికీ.. చౌదరి లోక్‌సభలో ఐదుసార్లు గెలిచిన బహరంపూర్ నుంచి తిరిగి ఎన్నికవ్వాలని భావిస్తున్నారు. కాబట్టి చౌదరికే ఎంపీ సీటు ఖరారు చేసే అవకాశం ఉంది.

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో బీజేపీయేతర పార్టీలతో అధికారికంగా పొత్తు ఉండదని నిర్దారించుకున్న నేపథ్యంలో టీఎంసీ అభ్యర్థుల జాబితా వెల్లడించింది. కాంగ్రెస్, టీఎంసీ మధ్య సీట్ల నిర్ణయంలో సరైన పొత్తు కుదరకపోవడంతోనే మమతా బెనర్జీ స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఈ రోజు 42 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను కూడా అధికారికంగా ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement