mamatha benerjee
-
దీదీ.. రాజీనామా చేయండి: నిర్భయ తల్లి డిమాండ్
ఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఈ ఘటనపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. ఈ సందర్బంగా హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారామె.ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. ఈ దారుణ ఘటనపై 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయ తల్లి ఆశాదేవి స్పందిస్తూ.. అఘాయిత్యాలను నిలువరించడంలో సీఎం మమతా బెనర్జీ విఫలమైనట్లు విమర్శించారు. నిందితులను శిక్షించడానికి బదులుగా.. నిరసన ప్రదర్శనలతో డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో ప్రజలను ఆమె తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆమె కూడా మహిళే అని, రాష్ట్ర సీఎంగా ఉన్న ఆమె నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.ఇదే సమయంలో అత్యాచారాలకు పాల్పడుతున్న వారి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన శిక్షను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు. కోల్‌కతా మెడికల్ కాలేజీలో అమ్మాయిలకు రక్షణ లేకుంటే, అప్పుడు దేశంలోని మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆమె ప్రశ్నించారు.మరోవైపు.. ఆగస్టు 9వ తేదీన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ రేప్, హత్యకు గురైంది. ఈ ఘటనకు నిరసనగా వైద్యులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. వైద్యసేవలను నిలిపివేశారు. ఇక, కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. -
ఎన్డీయే సర్కార్ త్వరలో పడిపోతుంది: అఖిలేష్ యాదవ్
కోల్కత్తా: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎక్కువ కాలం పాలన కొనసాగించలేదు.. త్వరలోనే పడిపోతుందని జోస్యం చెప్పారు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్. మతం పేరిట రాజకీయాలు ఎన్నో రోజులు నిలబడవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కాగా, అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం బెంగాల్లో ఉన్నాఉ. ఈ సందర్బంగా అఖిలేష్ ఆదివారం బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వం జరిగిన ‘ధర్మతల ర్యాలీ’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..‘మతం పేరిట దేశాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతున్న శక్తులు తాత్కిలికంగా విజయం సాధించవచ్చు. కానీ, అంతిమంగా ఓడిపోతాయి. పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీని ఓడించారు. అధికారంలోకి వచ్చిన వారు చుట్టం చూపుగానే ఉంటారు.ఇదే సమయంలో బెంగాల్ ప్రజలు బీజేపీతో పోరాడారని, ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా ఇదే జరిగిందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వంలో కూర్చున్న వ్యక్తులు కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉంటారని, వారిది నడిచే సర్కార్ కాదని, పడిపోయే సర్కార్’ అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. కేంద్రంపై అఖిలేష్ చేసిన వ్యాఖ్యలకు మమతా మద్దతు ఇచ్చారు. కేంద్రంలోని ప్రభుత్వం బెదిరింపుల ద్వారా ఏర్పడిందని, అది ఎక్కువ కాలం నిలవదని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ కనబరిచిన ఫలితాలను సీఎం మమతా బెనర్జీ ప్రశంసించారు. యూపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను, ఇతర మార్గాలను దుర్వినియోగం చేస్తూ అధికారంలో కొనసాగుతోందని మండిపడ్డారు. ర్యాలీకి హాజరైన అఖిలేష్ యాదవ్‌కు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఇంట్లో కూర్చుని రెడీ చేశారా?.. ఎగ్జిట్‌పోల్స్‌పై మమతా బెనర్జీ సెటైర్లు
కోల్కత్తా: దేశంలో ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. దేశవ్యాప్తంగా రేపు(మంగళవారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక, ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్ రిలీజ్ అయ్యాయి. కాగా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఎగ్జిట్‌పోల్స్‌ను రెండు నెలల క్రితమే ‘ఇంట్లో తయారు చేశారు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.కాగా, ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలపై మమతా బెనర్జీ ఆదివారం స్పందించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లేవు. వీటిని రెండు నెలల క్రితమే ఇంట్లో కూర్చుని తయారు చేసినట్టు అనిపిస్తోంది. బెంగాల్లో 2016, 2019, 2021లో ఎగ్జిట్ పోల్స్ ఎలా చేశారో అందరూ చూశారు. వారి అంచనాలేవీ నిజం కాలేదు. ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ప్రజా స్పందన ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ధ్రువీకరించడం లేదు అంటూ కామెంట్స్ చేశారు.అలాగే, ఇండియా కూటమికి సంబంధించి కూడా మమత కీలక వ్యాఖ్యలు చేశారు. అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, స్టాలిన్‌తో పాటు అన్నిచోట్లా ప్రాంతీయ పార్టీలు మెరుగైన పనితీరు కనబరుస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. "Exit polls were 'manufactured at home' two months ago", claims Mamata Banerjee"The way BJP tried to polarise and spread false information that Muslims were taking away quotas of SC, ST and OBCs, I don't think Muslims will vote for BJP And, I think the CPI(M) and Congress… pic.twitter.com/JiL76naHAI— Ashish Kumar (@BaapofOption) June 2, 2024 ఇదిలా ఉండగా.. ఎన్నికలకు సంబంధించి దాదాపు ఎగ్జిట్‌పోల్స్ అన్నీ ఎన్డీయే కూటమికి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. మోదీనే మరోసారి ప్రధాని అవుతారని ఫలితాలను వెల్లడించాయి. ఇండియా కూటమికి భారీ ఓటమి తప్పదని తేల్చేశాయి. అయితే, అటు కూటమి నేతలు కూడా ఎగ్జిట్‌పోల్స్ ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు. -
కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
కోల్కత్తా: ఐపీఎల్-17(2024)లో విజేతగా నిలిచిన కోల్కత్తా నైట్‌రైడర్ జట్టును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డులు బద్దలు కొట్టినందుకు ప్లేయర్స్‌కు వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు.కాగా, మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా..‘కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంతో బెంగాల్ అంతటా సంబరాలు మిన్నంటాయి. ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డు బద్దలు కొట్టినందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీని వ్యక్తిగతంగా అభినందించాలనుకుంటున్నాను. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. Kolkata Knight Riders' win has brought about an air of celebration all across Bengal.I would like to personally congratulate the players, the support staff and the franchise for their record breaking performance in this season of the IPL.Wishing for more such enchanting…— Mamata Banerjee (@MamataOfficial) May 26, 2024 ఇక, ఐపీఎల్-17 సీజన్లో కేకేఆర్ అద్భుత ఆటతీరును కనబరిచింది. సీజన్ ప్రారంభం నాటి నుంచి దూకుడుగా ఆడుతూ టేబుట్ టాపర్‌గా నిలిచింది. చివరగా ఫైనల్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి 114 లక్ష్యాన్ని కేవలం పదో ఓవర్లోనే పూర్తి చేసింది. కాగా, ఈ సీజన్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ నిలిచాడు. ICYMI! That special run to glory 💫💜Recap the #Final on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka— IndianPremierLeague (@IPL) May 26, 2024 📽️ 𝗥𝗔𝗪 𝗥𝗘𝗔𝗖𝗧𝗜𝗢𝗡𝗦Moments of pure joy, happiness, jubilation, and happy tears 🥹 What it feels to win the #TATAIPL Final 💜Scorecard ▶️ https://t.co/lCK6AJCdH9#KKRvSRH | #Final | #TheFinalCall | @KKRiders pic.twitter.com/987TCaksZz— IndianPremierLeague (@IPL) May 26, 2024 -
దిలీప్ ఘోష్‌పై కేసు నమోదు - కారణం ఇదే..
కలకత్తా: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ సీనియర్ నేత 'దిలీప్ ఘోష్' చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఘోష్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండి పడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 504, 509 సెక్షన్ల కింద దుర్గాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు (ఎఫ్ఐఆర్) నమోదైంది. ఘోష్ వ్యాఖ్యలు వైరల్ అయిన తరువాత ముఖ్యమంత్రి పట్ల తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదని క్షమాపణలు చెప్పారు. ''మమత బెనర్జీ గోవా వెళ్లి గోవా బిడ్డను అంటుంది, త్రిపుర వెళ్లి త్రిపుర బిడ్డనంటుంది, బెంగాల్లో బెంగాల్ బిడ్డను అంటుంది. అసలు తన తండ్రి ఎవరో ముందు మమత నిర్ణయించుకోవాలి'’ అని ఘోష్ వ్యాఖ్యానించడం వల్ల ఈ రోజు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతే కాకుండా టీఎంసీ ఫిర్యాదు మేరకు దిలీప్ ఘోష్‌కు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసి మార్చి 29 సాయంత్రం లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. Case registered against West Bengal BJP MP Dilip Ghosh in Durgapur PS under sections 504 and 509 of the Indian Penal Code over his remarks on CM Mamata Banerjee. — ANI (@ANI) March 28, 2024 -
సీఏఏ అమలుపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 'మమతా బెనర్జీ' తీవ్రంగా విమర్శించారు. ఇది బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన 'లూడో మూవ్' అని ఆరోపించారు. దేశంలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న చర్య అని మండిపడ్డారు. బెంగాల్‌లోని హబ్రాలో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పౌరసత్వ హక్కులను హరించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సీఏఏ చట్టబద్ధతపై తనకు అనుమానం ఉందని, దీనిపై ఎలాంటి క్లారిటీ లేదని, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రచారమని వ్యాఖ్యానించారు. సీఏఏ మీకు హక్కులు కల్పిస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ మీరు పౌరసత్వం కోసం అప్లై చేసుకున్న మరుక్షణం అక్రమ వలసదారులుగా మారి మీ హక్కులను కోల్పోతారు. దయచేసి దరఖాస్తు చేసే ముందు ఆలోచించండి అని మమతా బెనర్జీ అన్నారు. సీఏఏ బెంగాల్లో జరగడానికి నేను అనుమతించను. మతం ఆధారంగా పౌరసత్వం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? బెంగాల్‌ను విభజించడానికి ఇది బీజేపీ మరో గేమ్ అని మమతా వెల్లడించారు. మనమంతా భారత పౌరులమేనని నొక్కి చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టడానికే ఈ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు. -
కాంగ్రెస్ కంచుకోటలో యూసఫ్ పఠాన్.. టీఎంసీ గెలుపు సాధ్యమేనా?
తృణమూల్ కాంగ్రెస్ (TMC) పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ (Yusuf Pathan) బహరంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. నిజానికి బహరంపూర్ నియోజకవర్గం లోక్‌సభ నాయకుడు 'అధీర్ రంజన్ చౌదరి'కి కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటికి కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పటికీ.. చౌదరి లోక్‌సభలో ఐదుసార్లు గెలిచిన బహరంపూర్ నుంచి తిరిగి ఎన్నికవ్వాలని భావిస్తున్నారు. కాబట్టి చౌదరికే ఎంపీ సీటు ఖరారు చేసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీయేతర పార్టీలతో అధికారికంగా పొత్తు ఉండదని నిర్దారించుకున్న నేపథ్యంలో టీఎంసీ అభ్యర్థుల జాబితా వెల్లడించింది. కాంగ్రెస్, టీఎంసీ మధ్య సీట్ల నిర్ణయంలో సరైన పొత్తు కుదరకపోవడంతోనే మమతా బెనర్జీ స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఈ రోజు 42 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను కూడా అధికారికంగా ప్రకటించింది. -
అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ.. బరిలో మాజీ క్రికెటర్
కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మెగా ర్యాలీలో 'మమతా బెనర్జీ' రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం 42 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బహరంపూర్ నుంచి పార్టీ అభ్యర్థిగా టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ (Yusuf Pathan), కృష్ణానగర్ నుంచి మాజీ ఎంపీ మహువా మొయిత్రా బరిలో నిలిచారు. మమత బెనర్జీ మేనల్లుడు, వారసుడు 'అభిషేక్ బెనర్జీ' డైమండ్ హార్బర్ నుంచి పోటీ చేయనున్నారు. నటుడు శత్రుఘ్న సిన్హా అసన్సోల్ నుంచి పోటీ చేయనున్నారు. అయితే సందేశ్‌ఖాలీ వివాదం కారణంగా 'నుస్రత్ జహాన్'ను బసిర్హాట్ స్థానం నుంచి తొలగించి.. ఆ స్థానంలో హాజీ నూరుల్ ఇస్లామ్‌ను బరిలోకి దింపారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితా కూచ్‌బెహార్: జగదీష్ చంద్ర బసునియా అలీపుర్దువార్: ప్రకాష్ చిక్ బరైక్ జల్పాయ్గురి: నిర్మల్ చంద్ర రాయ్ డార్జిలింగ్: గోపాల్ లామా రాయ్‌గంజ్: కృష్ణ కళ్యాణి బాలూర్ఘాట్: బిప్లబ్ మిత్ర మాల్డా నార్త్: ప్రసూన్ బెనర్జీ మాల్డా సౌత్: షానవాజ్ అలీ రెహాన్ జంగీపూర్: ఖలుయిలుర్ రెహమాన్ బెర్హంపూర్: యూసుఫ్ పఠాన్ ముర్షిదాబాద్: అబూ తాహెర్ ఖాన్ కృష్ణానగర్: మహువా మోయిత్రా రణఘాట్: ముకుట్ మణి అధికారి బొంగావ్: బిస్వజిత్ దాస్ బర్రా క్పూర్: పార్థ భౌమిక్ దుండం: సౌగత రాయ్ బరాసత్: కకోలి ఘోష్ దస్తిదార్ బసిర్హత్: హాజీ నూరుల్ ఇస్లాం జాయ్నగర్: ప్రతిమ మండల్ మధురాపూర్: బాపి హల్దర్ డైమండ్ హార్బర్: అభిషేక్ బెనర్జీ జాదవ్‌పూర్: సయోని ఘోష్ కోల్‌కతా సౌత్: మాలా రాయ్ డబ్ల్యూ కోల్జాత నార్త్: సుదీప్ బంద్యోపాధ్య హౌరా: ప్రసూన్ బెనర్జీ ఉకుబెర్రా: సజ్దా అహ్మద్ సెరాంపూర్: కళ్యాణ్ బెనర్జీ హుగ్లీ: రచనా బెనర్జీ ఆరంబాగ్: మిటాలి బాగ్ తమ్లుక్: దేబాంగ్షు భట్టాచార్య కాంతి: ఉత్తమ్ బారిక్ ఘటల్: దేవ్ దీపక్ అధికారి ఝర్గ్రామ్: కలిపాడా సోరెన్ మిడ్నాపూర్: జూన్ మాలియా పురూలియా: శాంతిరామ్ మహతో బుర్ద్వాన్ వెస్ట్: అరూప్ చల్రనోర్తి బర్డ్వాన్ ఈస్ట్: డాక్టర్ షర్మిలా సర్కార్ దుర్గాపూర్ బుర్ద్వాన్: కీర్తి ఆజాద్ అసన్సోల్: శత్రుఘ్న సిన్హా బోల్పూర్: అసిత్ మాల్ బీర్భం: సతాబ్ది రాయ్ బిష్ణుపూర్: సుజాత మోండల్ ఖాన్ -
టీఎంసీ మెగా ర్యాలీ.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్న మమతా బెనర్జీ
తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి 'మమతా బెనర్జీ' పశ్చిమ బెంగాల్లో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు మొత్తం 42 మంది అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించనుంది. కోల్‌కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్లో జరగనున్న పార్టీ మెగా ర్యాలీ 'జన గర్జన్ సభ'లో అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ర్యాలీకి పార్టీ ప్రధాన కార్యదర్శి 'అభిషేక్ బెనర్జీ' నాయకత్వం వహిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ 22 సీట్లు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 18 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ 42 స్థానాలకు గాను 34 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాగా ఈ రోజు 42 సీట్లకు అభ్యర్థులను పార్టీ అధినేత అధికారికంగా ప్రకటించనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎన్నుకునేటప్పుడు అభ్యర్థుల పనితీరును పరిగణలోకి తీసుకోడంతో పాటు, కొత్త వారికి, ఎస్సీ, ఎస్టీ ఆదివాసీలు, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని సమాచారం. ఈ జాబితాలో పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) సహా చాలా మంది పాత పేర్లు ఉండే అవకాశం ఉంది. ఈసారి కొంతమంది యువ నేతలను రంగంలోకి దింపాలని కూడా పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో చాలా మంది రాజకీయ నేతలు పార్టీలు మారుతున్న తరుణంలో 'జన గర్జన్ సభ' ర్యాలీకి దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది మద్దతుదారులు హాజరవుతారని భావిస్తున్నారు. కాగా ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది. -
సందేశ్‌ఖాలీ ర్యాలీలో 'మమతా బెనర్జీ' ఘాటు వ్యాఖ్యలు
రగులుతున్న సందేశ్‌ఖాలీ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన తర్వాత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 'మమతా బెనర్జీ' ఈ రోజు కోల్‌కతాలో మహిళలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సందేశ్‌ఖాలీ ద్వీపానికి చెందిన కొందరు మహిళలు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. మహిలాడర్ అధికార్, అమదర్ అంగీకార్ (మహిళల హక్కులు, మా నిబద్ధత) అనే అంశంతో ర్యాలీ సాగింది. దీనికి సంబంధించిన ఓకే వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో మమతా బెనర్జీ ముందు నడుస్తుంటే.. ప్రముఖ మహిళా తృణమూల్ నాయకులలైన సుస్మితా దేవ్, శశి పంజా, కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీ & పాత్రికేయురాలు సాగరిక ఘోష్ వెనుక నడిచారు. ఈ ర్యాలీలో బీజేపీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీను కూడా మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్లో మహిళలను హింసిస్తున్నట్లు బీజేపీ నేతలు ఆరోపించడాన్ని ఖండించారు. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు, హత్రాస్‌లో మహిళపై అత్యాచారం చేసి, ఆమె మృతదేహాన్ని బలవంతంగా దహనం చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని బీజేపీని ఉద్దేశించి అన్నారు. బెంగాల్లోనే మహిళలు అత్యంత సురక్షితమని, దీనిని తాను నిరూపించగలనని సవాల్ చేశారు. కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ బీజేపీలో చేరడంపై కూడా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఒక బీజేపీ బాబు గద్దె మీద కూర్చున్నాడు, అతను ఇప్పుడు బీజేపీలో చేరాడు, అలాంటి వారి నుంచి మీరు న్యాయం ఎలా ఆశించగలరని అన్నారు. ప్రతి ఏడాది మమతా బెనర్జీ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల మార్చ్‌కు నాయకత్వం వహిస్తారు. అయితే ఈ సారి అంతకంటే ముందే ర్యాలీ నిర్వహించారు. మహిళా ఓటర్లు తృణమూల్ కాంగ్రెస్‌కు కీలకమైన మద్దతు. పార్టీ అధికారంలో కొనసాగిన 13 సంవత్సరాలుగా.. కన్యాశ్రీ, రూపశ్రీ, లక్ష్మీర్ భండార్ వంటి పథకాల ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం తప్పకుండా దోహదపడుతుందని అన్నారు. -
'హేమంత్ సొరెన్‌కు అండగా నేనున్నా'
కోల్‌కతా: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ అరెస్టును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. హేమంత్ సొరెన్ శక్తివంతమైన గిరిజన నాయకుడని అన్నారు. సొరెన్ తన సన్నిహిత మిత్రుడని చెప్పారు. సొరెన్‌కు మద్దతుగా నిలుస్తానని ట్వీట్ చేశారు. "శక్తివంతమైన ఆదివాసీ నాయకుడైన హేమంత్ సొరెన్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. బీజేపీ మద్దతు ఉన్న కేంద్ర ఏజెన్సీల ప్రతీకార చర్య. ప్రజాభిప్రాయంతో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అణగదొక్కడానికి కుట్ర జరుగుతోంది. ఈ క్లిష్ట సమయాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి సొరెన్ పక్షాన నిలబడతానని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఈ యుద్ధంలో ప్రజలు అద్భుతమైన స్పందన అందజేస్తారు. విజయం సాధిస్తారు." అని మమతా బెనర్జీ ట్వీట్టర్(ఎక్స్) లో పేర్కొన్నారు. హేమంత్ సొరెన్ అరెస్టుకు వ్యతిరేకంగా నేడు పార్లమెంట్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి నిరసన వ్యక్తం చేసింది. సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. టీఎంసీకి చెందిన ఎంపీలు కూడా పార్లమెంట్ రెండు సభల నుంచి వాకౌట్ చేశామని ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. రాష్ట్ర మాజీ హేమంత్ సోరెన్‌ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్‌ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. అలాగే సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును హేమంత్ సొరెన్ ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. ఇదీ చదవండి: హేమంత్ సొరెన్‌కు ఐదు రోజుల కస్టడీ -
ఒక్క సీటు కూడా ఇవ్వను.. కాంగ్రెస్‌పై మమత ఫైర్
కోల్‌కతా: ఇండియా కూటమిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. టీఎంసీతో పొత్తు కావాలంటే సీపీఎంతో తెగదెంపులు చేసుకోవాలని అన్నారు. సీట్ల పంపకాల్లో రెండు సీట్ల ప్రతిపాదనను కాంగ్రెస్ తీరస్కరించింది.. కానీ ఇప్పుడు ఒక్క సీటు కూడా ఇవ్వనని తెగేసి చెప్పారు. 'గతంలోనూ పలు సందర్భాల్లో సీపీఎం నాపై భౌతిక దాడి చేసింది. నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టారు. నా శ్రేయోభిలాషుల ఆశీస్సుల వల్లే బతికి ఉన్నాను. వామపక్షాలను ఎప్పటికీ క్షమించలేను. సీపీఎంను క్షమించలేను. కాబట్టి ఈరోజు సీపీఎంతో ఉన్నవాళ్లు బీజేపీతో కూడా ఉండొచ్చు. నేను వారిని క్షమించను.' అని మమతా బెనర్జీ మాల్డాలో ఏర్పాటు చేసిన సభలో అన్నారు. 'అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని కాంగ్రెస్‌కు చెప్పాను. రెండు పార్లమెంట్ స్థానాలు ఇస్తాం. మీ అభ్యర్థులను మేమే గెలిపించుకుంటాం అని చెప్పాం. కానీ వారికి ఎక్కువ సీట్లు కావాలి. నేను కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వను. మీరు వామపక్షాలను విడిచిపెట్టే వరకు మా వద్దకు రాకండి" అని మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్‌తో పొత్తు ఉండబోదని సీపీఎం గతంలోనే తేల్చి చెప్పింది. బెంగాల్లో బీజేపీ, టీఎంసీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీపీఎం ఉంటాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు. అటు.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధరి కూడా మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీఎంసీతో పొత్తు ఉండబోదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, టీఎంసీ మధ్య పొత్తు కుదిరే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇదీ చదవండి: భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కారు అద్దాలు ధ్వంసం -
‘వారంలోగా దేశవ్యాప్తంగా సీఏఏ అమలు’
కోల్‌కతా: వచ్చే ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించారు. 'రాబోయే ఏడు రోజుల్లో పశ్చిమ బెంగాల్లోనే కాదు, భారతదేశం అంతటా సీఏఏ అమలు చేస్తామని నేను హామీ ఇవ్వగలను' అని బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలోని కక్‌ద్వీప్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఠాకూర్ మాట్లాడారు. సీఏఏపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను శంతను ఠాకూర్ గుర్తుచేశారు. సీఏఏను అమలు చేయకుండా దేశంలో ఎవరూ ఆపలేరని అమిత్ షా గత డిసెంబర్లో అన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ చొరబాట్లు, అవినీతి, రాజకీయ హింస, బుజ్జగింపు అంశాలను ఉద్దేశిస్తూ మమతా బెనర్జీపై అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బెంగాల్ నుండి టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. 2026లో బీజేపీని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. పార్లమెంటు ఉభయ సభల్లో సీఏఏ బిల్లు 2019లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే ఈ చట్టంపై భారతదేశం అంతటా భారీ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. సీఏఏకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శులు చేశాయి. ఇదీ చదవండి: నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ -
కాంగ్రెస్‌తో పొత్తుకు టీఎంసీ చెల్లు.. అసలు కారణాలేంటి?
కోల్‌కతా: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. సీట్ల పంపకంలో ప్రతిపాదనలన్నింటినీ కాంగ్రెస్ తిరస్కరించిందని పేర్కొన్న దీది.. బెంగాల్‌లోని 42 స్థానాల్లో తృణమూల్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు ఈ ప్రకటన వచ్చింది. దీంతో కొద్దిరోజులుగా మమతా బెనర్జీ, కాంగ్రెస్ మధ్య స్నేహం బీటలు వారినట్లయింది. పరస్పర ఆరోపణలు.. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్, తృణమూల్ మధ్య విభేదం ఇదే మొదటిసారి కాదు. గత రెండు నెలలుగా జరుగుతున్న పరస్పర ఆరోపణల తర్వాత మమతా బెనర్జీ నుంచి నేడు ఈ ప్రకటన వచ్చింది. ఇండియా కూటమితో సీట్ల పంపకంపై విభేదాలు అప్పుడప్పుడు బహిరంగంగానే బయటకొచ్చాయి. మమతా బెనర్జీని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి తీవ్రంగా విమర్శించేవారు. ఆమెపై ఈ మధ్య విమర్శల స్థాయిని పెంచారు. ఒకానొక సందర్భంలో ఆమెను అవకాశవాది, దలాల్ అని దుయ్యబట్టారు. నిజానికి, జాతీయ స్థాయిలో మమతా బెనర్జీతో కాంగ్రెస్ పొత్తు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఎప్పుడూ కలవరపెడుతోంది. సోనియా గాంధీతో మమతా బెనర్జీ మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉండగా.. అధిర్ చౌదరి, అబ్దుల్ మన్నన్ నేతృత్వంలోని బెంగాల్ కాంగ్రెస్ వర్గం.. మమతపై విమర్శలకు దిగేది. తృణమూల్ తమ నాయకులను దూరం చేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వర్గం ఎప్పుడూ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి తృణమూల్ ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. నిజానికి తృణమూల్‌తో పొత్తు పెట్టుకోవడానికి అధిర్ రంజన్ చౌదరి మొదట్లో సానుకూలంగా లేరు, వామపక్షాలతో కలిసి వెళ్లాలని భావించారు. గతంలో చేతులు కలిపారు.. కానీ.. గతంలోనే కాంగ్రెస్, టీఎంసీ చేతులు కలిపారు. ఈ రెండు పార్టీలు గతంలో 2001 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, 2009 లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. ముఖ్యంగా 2011లో టీఎంసీ, కాంగ్రెస్ కూటమి.. బెంగాల్లో 34 సంవత్సరాల తర్వాత సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి దారితీసింది. అయితే, ఈసారి లోక్‌సభ ఎన్నికలకు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అసమ్మతికి మొదటి సంకేతం.. బెంగాల్‌లోని 42 సీట్లలో రెండింటిలో పోటీ చేయాలని కాంగ్రెస్‌ను తృణమూల్ కాంగ్రెస్ కోరింది. కనీసం 8-10 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడింది. తృణమూల్ అభ్యర్థనను తిరస్కరించడం రెండు పార్టీల మధ్య అసమ్మతికి మొదటి సంకేతం. ఈ రెండు స్థానాల్లో.. అధిర్ రంజన్ కంచుకోట బెర్హంపూర్, 2019లో కాంగ్రెస్ గెలిచిన మాల్దా సౌత్‌లు ఉన్నాయి. టీఎంసీ సీట్ల షేరింగ్ ఫార్ములా 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పార్టీల పనితీరు ఆధారంగా సీట్ల షేరింగ్ ఫార్ములా ఉండాలని మమతా బెనర్జీ కోరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు శాతం కంటే తక్కువ ఓట్లను సాధించిందని, ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని తృణమూల్ పేర్కొంది. కాంగ్రెస్ "పెద్దన్న" అధికారాన్ని విడనాడాలని, ప్రాంతీయ పార్టీలు తమ బలమైన స్థానాల్లో ఎన్నికలను ఎదుర్కోవాలని టీఎంసీ అధిష్టానం ప్రతిపాదించింది. మోగిన ప్రమాద ఘంటికలు.. అయితే.. గత వారం తృణమూల్ నేతలతో జరిగిన సమావేశం అనంతరం అధిర్ రంజన్ చౌదరి బెర్హంపూర్తో సహా మొత్తం 42 స్థానాల్లో పార్టీ పోటీ చేయాలని నిర్ణయించారు. ఇది కాంగ్రెస్‌లో ప్రమాద ఘంటికలు మోగించింది. మమతా బెనర్జీ సహాయం లేకుండానే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ పరిణామాల తర్వాత మమతా బెనర్జీని రాహుల్ గాంధీ శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కొన్ని సార్లు స్థానిక నాయకులు తెలియక ఏదో మాట్లాడుతారు.. అవన్ని పట్టించుకోవద్దు అని చెప్పారు. మమతా బెనర్జీ తనకు మంచి సన్నిహితురాలని చెప్పుకొచ్చారు. మళ్లీ చిగురించలేని స్థాయికి.. అయితే.. ఈ పరిణామాల అనంతరం ఇండియా కూటమికి మమతా బెనర్జీ స్వస్తి పలికారు. దీంతో జనవరి 25న పశ్చిమ బెంగాల్లో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో తృణమూల్ కాంగ్రెస్ చేరే అవకాశం లేదు. మమతా బెనర్జీ ప్రకటన తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ స్పందించారు. టీఎంసీ లేని ఇండియా కూటమిని ఊహించలేమని చెప్పారు. అయితే.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, తృణమూల్ స్నేహం మళ్లీ చిగురించలేని స్థితికి చేరిందని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇండియా కూటమికి డబుల్ షాక్! -
బెంగాల్‌పై అంబానీ వరాల జల్లు : వేల కోట్ల పెట్టుబడులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పశ్చిమ బెంగాల్‌పై వరాల జల్లు కురిపించారు. బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ఈవెంట్లో అంబానీ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ వృద్ధిని వేగవంతం చేయడంలో ఎంత మాత్రం వెనుకాడబోదని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు రూ. 45 వేల కోట్ల పెట్టుబడి పెట్టామని దీనికి అదనంగా రూ. 20వేల కోట్లు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నామని అంబానీ ప్రకటించారు. రానున్న మూడేళ్లలో ఈ పెట్టుబడులను రిలయన్స్ పెడుతుందని ప్రకటించారు. ముఖేష్ అంబానీ కోల్‌కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ప్రారంభ వేడుకలకు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంబానీకి స్వాగతం పలికారు. గొప్ప సంస్కృతి, విద్య, వారసత్వాల నెలవు బెంగాల్. ఐకమత్యమే బలం. ఇక్కడ అందరం కలిసే ఉంటాం.. అదే బెంగాల్‌కున్న మరో ప్లస్ పాయింట్. తమకు విభజించి పాలించు విధానం లేదంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్- 2023 7వ ఎడిషన్‌ను సీఎం మమత ప్రారంభించారు. #WATCH | At the Bengal Global Business Summit event, Reliance Industries chairman Mukesh Ambani says, "Reliance will leave no stone unturned to accelerate West Bengal's growth. Reliance has invested close to Rs 45,000 crores in West Bengal. We plan to invest an additional Rs… pic.twitter.com/fmNWCVfekF — ANI (@ANI) November 21, 2023 -
విపక్ష నేతలందరి అరెస్టుకు కుట్ర: మమతా బెనర్జీ
కోల్‌కతా: బీజేపీపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నాటికి ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు సీనియర్ ప్రతిపక్ష నాయకులను బీజేపీ అరెస్టు చేయడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు. ఆ తర్వాత ఖాళీ దేశంలో వాళ్లకు వాళ్లే ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కూడా బీజేపీ హ్యాక్ చేసిందని దీదీ ఆరోపించారు. “వచ్చే ఏడాది ఎన్నికలకు ముందే బీజేపీ ప్రతిపక్ష పార్టీల నోరు మూయడానికి ప్రయత్నిస్తోంది. బీజేపీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టు చేయాలని ప్రణాళిక చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నికల్లో లాభపడాలని చూస్తున్నారు" అని కోల్‌కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ ఆరోపించారు. దేశ రాజధానిలో మద్యం పాలసీ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత గురువారం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను, మంత్రి అతిషిని నవంబర్ 2న అరెస్టు చేయనున్నారని ఆప్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందించారు. అటు.. టీఎంసీ నాయకుల చుట్టూ కూడా ఈడీ ఉచ్చు బిగుస్తోంది. రేషన్ పంపిణీ కుంభకోణంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ గత వారం అరెస్టయ్యారు. ఇండియా కూటమి నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని దీదీ ఆరోపించారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్‌కు అనుకూలమే: ఏక్నాథ్ షిండే -
పట్నాలో ముగిసిన ప్రతిపక్షాల సమావేశం.. సిమ్లాలో మరోసారి భేటీకి నిర్ణయం..
Updates. ♦ పట్నా సమావేశంలో ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీలు సిమాల్లో జులైలో మరోమారు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. తన నేతృత్వంలోనే ఆ మీటింగ్ జరగనున్నట్లు స్పష్టం చేశారు. #WATCH | "We will meet again in July in Shimla to prepare an agenda on how to move ahead together while working in our respective states to fight BJP in 2024," says Congress President Mallikarjun Kharge on the Opposition meeting in Patna. pic.twitter.com/cruKD6W8x8 — ANI (@ANI) June 23, 2023 ♦ దేశ పునాదులపై బీజేపీ దాడి చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడితేనే దేశాన్ని రక్షించుకోవచ్చని అన్నారు. ♦ ప్రతిపక్షాలన్నీ ఐక్యమయ్యాయని బిహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. 2024 ఎన్నికల్లో కలిసి పోరాడతామని పేర్కొన్నారు. "We have decided to fight elections together": Nitish Kumar after opposition meeting Read @ANI Story | https://t.co/QgN1xeuDE3#oppositionpartymeeting #NitishKumar #Patna #PatnaOppositionMeeting pic.twitter.com/z8wxq6LXZi — ANI Digital (@ani_digital) June 23, 2023 ♦పట్నా సమావేశంతో ప్రజా ఉద్యమం మొదలవుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కేంద్రంపై పోరుకు ఐక్యంగా పోరాడతామని చెప్పారు. నేటి సమావేశం చరిత్రకు పునాది వేస్తుందని చెప్పారు. #WATCH | Patna, Bihar: Bengal CM Mamata Banerjee during the joint opposition meeting said "We are united, we will fight unitedly...The history started from here, BJP wants that history should be changed. And we want history should be saved from Bihar. Our objective is to speak… pic.twitter.com/BB2qLgbApP — ANI (@ANI) June 23, 2023 ♦ బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో ఎన్నికలే ఉండవని మమతా బెనర్జీ ఆరోపించారు. మొదట ఐక్యమయ్యాం. పట్నాతో కలిసి పోరాడతామనే నిర్ణయానికి వచ్చాం. మిగిలినది సిమ్లాలో నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు. ♦ పట్నా మీటింగ్ ఫలవంతంగా ముగిసినట్లు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారందరికీ తాము ప్రతిపక్షమేనని పేర్కొన్నారు. ♦ పట్నాలో విపక్ష పార్టీల నేతల భేటీ ప్రారంభమైంది. Bihar | Opposition leaders' meeting to chalk out a joint strategy to take on BJP in next year's Lok Sabha elections, begins in Patna More than 15 opposition parties are attending the meeting. pic.twitter.com/absFUpmARO — ANI (@ANI) June 23, 2023 ♦ పాట్నా చేరుకున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ #WATCH | Jharkhand CM and Jharkhand Mukti Morcha (JMM) leader Hemant Soren reaches Bihar's Patna to attend the Opposition leaders' meeting More than 15 opposition parties are meeting today to chalk out a joint strategy to take on the BJP in the 2024 Lok Sabha polls. pic.twitter.com/KrwrM91ZBA — ANI (@ANI) June 23, 2023 ♦ విపక్షాల భేటీకి హాజరైన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా. #WATCH | Aam Aadmi Party (AAP) MP Raghav Chadha reaches Bihar's Patna to attend the Opposition leaders' meeting More than 15 opposition parties are meeting today to chalk out a joint strategy to take on the BJP in the 2024 Lok Sabha polls. pic.twitter.com/r1qWibztFR — ANI (@ANI) June 23, 2023 ♦ సీఎం నితీశ్ కుమార్ ఇంటికి చేరుకున్న సీఎం మమతా బెనర్జీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. #WATCH | West Bengal CM Mamata Banerjee leaves from Patna Circuit House to attend the Opposition leaders' meeting More than 15 opposition parties are meeting today to chalk out a joint strategy to take on the BJP in the 2024 Lok Sabha polls. pic.twitter.com/wlrxWiQIul — ANI (@ANI) June 23, 2023 ♦ పాట్నా చేరుకున్న అఖిలేశ్ యాదవ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే. #WATCH | Former Maharashtra CM Uddhav Thackeray reaches Bihar's Patna to attend the Opposition leaders' meeting pic.twitter.com/nHzrUWxT2C — ANI (@ANI) June 23, 2023 #WATCH | Samajwadi Party (SP) president and former Uttar Pradesh CM Akhilesh Yadav reaches Bihar's Patna to attend the Opposition leaders' meeting More than 15 opposition parties are meeting today to chalk out a joint strategy to take on the BJP in the 2024 Lok Sabha polls. pic.twitter.com/l5YUS4LAOQ — ANI (@ANI) June 23, 2023 ♦ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ బీహార్‌లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. దేశంలోని పేదల కోసం కాంగ్రెస్ మాత్రమే పనిచేస్తుంది. బీజేపీ కొద్ది మందికి మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది. బీజేపీని ఓడించాలంటే ఐక్యత ఒక్కటే మార్గం. బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందని, విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేస్తోందని అన్నారు. ♦ పాట్నా చేరుకున్న సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి VIDEO | CPI(M) General Secretary Sitaram Yechury arrives at Patna airport to attend the opposition meeting later today.#OppositionMeet pic.twitter.com/wWWoCx1e7x — Press Trust of India (@PTI_News) June 23, 2023 ♦ పాట్నాలో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులతో సహా దేశాన్ని పీడిస్తున్న వివిధ ముఖ్యమైన అంశాలను చర్చిస్తాం- శరద్ పవార్ ♦ పాట్నా చేరుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. #WATCH | Congress president Mallikarjun Kharge and party leader Rahul Gandhi arrive in Bihar's Patna for the Opposition leaders' meeting pic.twitter.com/O51rWBsKaw — ANI (@ANI) June 23, 2023 #WATCH | Congress leaders welcome party president Mallikarjun Kharge and party leader Rahul Gandhi as they arrive in Bihar's Patna to attend the Opposition leaders' meeting pic.twitter.com/vuSA3oj304 — ANI (@ANI) June 23, 2023 ♦ పాట్నాకు బయలుదేరిన యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ♦ ఇది దేశంలోని ప్రతిపక్షాల సమావేశం కాదు, దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ప్రాణ భద్రత కోసమే ఈ సమావేశం. బీజేపీని ఓడించగల ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే, దేశంలో కాంగ్రెస్ తప్ప ఎవరూ బీజేపీని ఓడించలేరు- పప్పు యాదవ్. #WATCH ये देश के विपक्ष की बैठक नहीं है, ये बैठक देश को 140 करोड़ लोगों की जिंदगी और उनके हिफाजत के लिए है। बैठक बिहार को हमेशा अपमान की दृष्टि से देखने के खिलाफ है और अच्छी शुरुआत के लिए है...कांग्रेस भाजपा को हराने वाली अकेली पार्टी है, देश में कांग्रेस से अलग रहकर कोई भाजपा को… pic.twitter.com/nZ2isZG0Ha — ANI_HindiNews (@AHindinews) June 23, 2023 పాట్నా:వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 20 ప్రతిపక్ష పార్టీలతో పట్నాలో శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరు వంటి అంశాల జోలికి పోకుండా ప్రజాసమస్యలపై పోరుబాట పట్టేలా వ్యూహరచన చేయనున్నట్టుగా తెలుస్తోంది. ♦ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రివాల్, స్టాలిన్, హేమంత్ సోరెన్‌లతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వంటి అగ్ర నాయకులు హాజరుకానున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సమావేశానికి ఆతిథ్యం ఇస్తారు. -
ప్రముఖ బుల్లితెర నటి మృతి.. సీఎం సంతాపం
ప్రముఖ బెంగాలీ నటి సోనాలీ చక్రవర్తి(59) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె భర్త శంకర్ కూడా నటుడే కాగా.. వారికి ఓ కుమార్తె ఉన్నారు. బెంగాలీ అభిమానులకు సుపరిచితురాలైన సోనాలి కాలేయ సమస్యలతో బాధపడుతోందని ఆమె భర్త తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. (చదవండి: వాటిని నేను పట్టించుకోను.. కాంతార హీరో రిషబ్ శెట్టి) బెంగాలీకి చెందిన బుల్లితెర నటి సోనాలీ దాదర్ కీర్తి (1980), హర్ జీత్ (2002), చోఖేర్ బాలి (2003), బంధన్ (2004) వంటి చిత్రాలలో కూడా కనిపించారు. చివరగా ఆమె నటించిన మెగా సీరియల్ గాట్చోరలో కనిపించింది. ఆమె మృతి పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
బెంగాల్ సీఎం మమతకు ఊహించని షాక్.. భారీ విజయం అందుకున్న బీజేపీ
బెంగాల్ రాజకీయాల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు పార్టీల నేతల మధ్య మాటల వార్ ఇంకా నడుస్తూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలన్న బీజేపీకి చేదు అనుభవమే ఎదురైనప్పటికీ సీట్ల విషయం మాత్రం పుంజుకుంది. ఇదిలా ఉండగా, తాజాగా అధికార టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీకి బీజేపీ గట్టి షాకిచ్చింది. పూర్బా మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. గతంలో ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కాగా ఆదివారం భేకుటియా సమబే కృషి సమితికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నికల్లో 12 సీట్లకు గానూ 11 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇక, ఈ ఎన్నికల్లో అధికార టీఎంసీ ఒక్క సీటుకే పరిమితమైంది. మరోవైపు.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఓడించారు. ఇక, బీజేపీ విజయంపై సువేందు అధికారి స్పందిస్తూ.. బీజేపీని గెలిపించినందుకు నందిగ్రామ్ నియోజకవర్గం, భేకుటియా సమబే కృషి ఉన్నయన్ సమితి సహకార సంఘం ఓటర్లందరికీ ధన్యవాదాలు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో గొప్ప విజయానికి బాటలు వేస్తాయి అని కామెంట్స్ చేశారు. Big SETBACK for Mamata Banerjee, BJP wins 11 out of 12 seats in Nandigram co-operative body election Nandigram: Bhekutia Samabay Krishi Samity, which was held by Mamata Banerjee's Trinamool Congress (TMC) for a long time, took over by the Saffron camphttps://t.co/q55vSFd14i — Selvam 🚩 (@tisaiyan) September 19, 2022 -
బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీకి ఊహించని షాక్!
partha chatterjee.. బెంగాల్లో అధికార తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ)కి చెందిన విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ స్కామ్‌ల వ్యవహారం దేశంలోనే హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా, నటి అర్పితా ముఖర్జీ, పార్థా చటర్జీల ఈడీ విచారణలో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేత పార్థా ఛటర్జీకి షాకిచ్చారు. టీఎంసీ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే ఛటర్జీని మంత్రి వర్గం నుంచి, పార్టీ పదవుల నుంచి, టీఎంసీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తన వ్యాఖ్యలు తప్పు అయితే.. తనను అన్ని పదవులను నుంచి తొలగించే హక్కు పార్టీకి ఉందని చెప్పారు. తాను టీఎంసీ సైనికుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు కునాల్ ఘోష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతకుముందు కూడా కునాల్ ఘోష్.. పార్థా ఛటర్జీ అవినీతిపై ఇలాంటి సంఘటనలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు టీఎంసీ నేతల పరువును దిగజాచార్చాయి. పార్థా చటర్జీ తనకే కాకుండా రాష్ట్రానికి కూడా అప్రతిష్ట తీసుకువచ్చారని విమర్శలు చేశారు. Partha Chatterjee should be removed from ministry and all party posts immediately. He should be expelled. If this statement considered wrong, party has every right to remove me from all posts. I shall continue as a soldier of @AITCofficial. — Kunal Ghosh (@KunalGhoshAgain) July 28, 2022 ఇదిలా ఉండగా.. అర్పితా ముఖర్జీకి చెందిన మరో ఇంట్లో నుంచి కూడా నోట్ల కట్టలే బయటపడ్డాయి. బుధవారం నాడు బెల్గారియా ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో కోట్ల రూపాయలను గుర్తించారు ఈడీ అధికారులు. ఈ మేరకు బ్యాంక్ అధికారులకు సమాచారం అందించగా.. హుటాహుటిన చేరుకుని కౌంటింగ్ మెషీన్‌తో లెక్కించడం ప్రారంభించారు. దాదాపుగా 20 కోట్లకు పైగా డబ్బు.. బంగారు బిస్కెట్లు.. నగల్ని రికవరీ చేశారు. అంతేకాదు దర్యాప్తునకు ఉపయోగపడే.. కీలకమైన డాక్యుమెంట్లను సైతం సేకరించారు. మరోవైపు.. అర్పితా ముఖర్జీ నివాసాల్లో 18 గంటల పాటు సాగిన ఈడీ సోదాల్లో కీలక పత్రాలతో పాటు దాదాపు 50 కోట్ల రూపాయల నగదు.. ఐదు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పది ట్రంకు పెట్టెల్లో నగదుతో పాటు నగలు, డాక్యుమెంట్లను డీసీఎం వ్యానులో అధికారులు తరలించారు. ఇది కూడా చదవండి: అర్పిత మరో ఇంట్లోనూ నోట్ల కట్టలు.. మంత్రితో సంబంధం ఉన్న మరో మహిళ ఎవరు? -
డబ్బంతా మంత్రిదే.. నా ఇంటికి వారానికోసారి వచ్చేవారు: నటి అర్పిత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఉద్యోగ నియామకాల స్కామ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈడీ విచారణలో నటి అర్పితా ముఖర్జీ.. పార్థా ఛటర్జీ గురించి కీలక విషయాలు తెలిపారు. అయితే, విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ.. తనకు 2016 నుంచి పరిచయం ఉన్నట్టు అర్పిత తెలిపారు. ఓ బెంగాలీ నటుడు తనను మంత్రికి పరిచయం చేశారని చెప్పుకొచ్చారు. తన ఇంట్లో దొరికిన రూ. 21కోట్ల డబ్బు పార్థా ఛటర్జీదేనని తెలిపారు. ఈ క్రమంలోనే పార్ధా తన ఇంట్లో ఉన్న ఓ రూమ్‌లోనే డబ్బును దాచాడని పేర్కొంది. తన ఇంటితో పాటు మరో మహిళ ఇంటిని కూడా ఆయన మినీ బ్యాంక్‌లా వాడుకున్నట్లు ఆరోపించారు. తన ఇంట్లోని రూమ్‌కు ఫుల్ సెక్యూర్టీగా పార్థా మనుషులే ఉండేవారని చెప్పింది. వారు మాత్రమే రూమ్ లోపలి వెళ్లి వచ్చేవారని స్పష్టం చేసింది. కాగా, తన ఇంటికి పార్థా ఛటర్టీ.. వారంలో ఒక్కరోజు లేదా 10 రోజులకు ఒకసారి వచ్చి వెళ్లే వారని తెలిపారు. వచ్చిన తర్వాత రూమ్‌లోకి వెళ్లి డబ్బులు చెక్ చేసుకునే వారిని వెల్లడించింది. అయితే, ఆ డబ్బంతా.. కాలేజీల విషయంలోనే లంచాల రూపంలో వచ్చిందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. వీరిద్దరూ ఆగస్టు 3వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. దీంతో విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. #WATCH | Kolkata | West Bengal Min & former Education Min Partha Chatterjee and his close aide, Arpita Mukherjee brought to ESI Hospital for medical examination. As per court order, their Medical check-up should be done after every 48 hours. They are in… pic.twitter.com/pGpn7DXXII — Abhay Pandya (@abhaypndya) July 27, 2022 ఇది కూడా చదవండి: వాళ్లకు పూలు.. మాకు బుల్డోజర్లా?: యోగి సర్కార్‌పై ఒవైసీ కామెంట్లు -
సాక్షి కార్టూన్ 03-07-2022
...మనం కూడా మద్దతిస్తున్నామా! -
రాష్ట్రపతి అభ్యర్థిపై.. మమతా వర్సెస్ బీజేపీ!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిరాకరించారు. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశం ఇందుకు వేదికైంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, శివసేన, వామపక్షాలతో పాటు 17 విపక్షాలు భేటీలో పాల్గొన్నాయి. టీఆర్ఎస్, బిజూ జనతాదళ్, ఆప్, అకాలీదళ్, మజ్లిస్ దూరంగా ఉన్నాయి. మధ్యాహ్నం 3 నుంచి 5 దాకా రెండు గంటల పాటు సమావేశం జరిగింది. ‘‘స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ దేశ సామాజిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి మోదీ సర్కారు మరింత హాని చేయకుండా అడ్డుకునేందుకు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలి’’ అంటూ తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం విపక్షాల తరఫున పవార్ అభ్యర్థిత్వాన్ని పార్టీలన్నీ ముక్త కంఠంతో సమర్థించాయి. అయితే పోటీకి పవార్ సున్నితంగా నిరాకరించారు. భేటీ అనంతరం ఈ మేరకు ట్వీట్ చేశారు. తనపై నమ్మకముంచినందుకు పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. పవార్ అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని మమత మీడియాకు తెలిపారు. వ్యవస్థలన్నింటినీ పథకం ప్రకారం నాశనం చేస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు అందరూ ఒక్కతాటిపై రావాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ దృష్టిలో ఏ అభ్యర్థీ లేరని ఖర్గే చెప్పారు. అన్ని పార్టీలతో సంప్రదించి ఏకాభిప్రాయం సాధిస్తామన్నారు. ‘‘దేశ వైవిధ్యాన్ని కాపాడటంతో పాటు విద్వేష, విభజన శక్తులను ఎదిరించగల వ్యక్తే రాష్ట్రపతి వంటి పదవిని అధిష్టించాలి’’ అని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీయేతర పార్టీలతో సంప్రదింపులు జరిపే బాధ్యతను పవార్, మమత, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేలకు అప్పగించినట్టు డీఎంకే నేత టీఆర్ బాలు చెప్పారు. పోటీకి పవారే సరైన వ్యక్తని, ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని ఆర్జేడీ నేత మనోజ్ ఝా అన్నారు. పవార్ నిరాకరణ అనంతరం ఎన్సీపీ నేత ఫరూక్ అబ్దుల్లాతో పాటు గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేర్లను కూడా మమత సూచించినట్టు ఆరెస్పీ నేత ప్రేమ్‌చంద్రన్ తెలిపారు. గోపాలకృష్ణ గాంధీ 2017లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. కానీ అదే సమయంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓటేసిన జేడీ(యూ), బీజేడీ మద్దతు పొందగలిగారు. విపక్షాల భేటీలో ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ), ఖర్గే, జైరాం రమేశ్, రణ్‌దీప్ సుర్జేవాలా (కాంగ్రెస్), దేవెగౌడ, కుమార్‌స్వామి (జేడీఎస్), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్) పాల్గొన్నారు. జూన్ 20, లేదా 21న పవార్ సారథ్యంలో మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. బీజేపీలో జోష్ మమత భేటీకి టీఆర్ఎస్, బీజేడీ, ఆప్ వంటి కీలక ప్రాంతీయ పార్టీలు దూరంగా ఉండటం బీజేపీలో ఉత్సాహం నింపింది. బీజేడీ ఎప్పుడూ విపక్ష శిబిరానికి దూరం పాటిస్తూ వస్తోంది. పలు అంశాలపై ఎన్డీఏకే మద్దతివ్వడం తెలిసిందే. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయేకు 48 శాతానికి పైగా ఓట్లున్నాయి. బీజేడీ తదితరుల మద్దతుతో తమ గెలుపు సునాయాసమేనని బీజేపీ భావిస్తోంది. విపక్ష భేటీలో నేతలంతా తమదే పై చేయి అని నిరూపించుకోజూశారని పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు. ఈ భేటీలతో దేశానికి ఒరిగేదేమీ లేదంటూ పెదవి విరిచారు. మీ చాయిస్ చెప్పండి: బీజేపీ మరోవైపు రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసే ప్రయత్నాలను అధికార బీజేపీ ముమ్మరం చేసింది. ఈ బాధ్యతలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలపై పెట్టిన విషయం తెలిసిందే. బుధవారం రాజ్‌నాథ్ పలు విపక్షాల నేతలతో ఫోన్లో వరుస సంప్రదింపులు జరిపారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక ప్రయత్నాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న మమతకు కూడా ఆయన ఫోన్ చేయడం విశేషం. ఆమెతో పాటు విపక్షాల భేటీలో పాల్గొన్న పవార్, కాంగ్రెస్ నేత ఖర్గే, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌లతోనూ ఆయన మాట్లాడారు. అలాగే బీజేడీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, జేడీ(యూ) చీఫ్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తదితరులతోనూ రాజ్‌నాథ్ చర్చలు జరిపినట్టు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరైతే వారికి అంగీకారమో తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరిని అనుకుంటున్నారని నేతలు రాజ్‌నాథ్‌ను ప్రశ్నించినట్టు చెబుతున్నారు. నడ్డా కూడా ఫరూక్ అబ్దుల్లాతో ఫోన్లో చర్చలు జరిపారు. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్), ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ ((ఏజేఎస్‌యూ), స్వతంత్ర ఎంపీలతోనూ మాట్లాడారు. నోటిఫికేషన్ విడుదల సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. దాంతోపాటే నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. జూన్ 29 దాకా నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఉపసంహరణకు జూలై 2 తుది గడువు. జూలై 18న ఎన్నిక జరుగుతుంది. జూలై 21న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. తొలిరోజు 11 నామినేషన్లు దాఖలవగా ఒకటి తిరస్కరణకు గురైంది. చదవండి: విపక్ష నేతలకు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్.. మద్ధతు ఇవ్వాలని విజ్ఞప్తి -
న్యూఢిల్లీ: విపక్షాలతో దీదీ భేటీ.. ఆసక్తి రేపుతున్న రాష్ట్రపతి ఎన్నికలు!
కోల్‌కతా: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై కార్యాచరణకు పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ బుధవారం న్యూఢిల్లీలో విపక్షాలతో భేటీ కానున్నారు. ఇందులో పాల్గొనాలని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు 22 పార్టీలకు ఆమె లేఖ రాయడం తెలిసిందే. కాంగ్రెస్ తరఫున ఖర్గే, జైరాం రమేశ్ హాజరు కావచ్చంటున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా ఉండండి.. మమత మంగళవారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలవాలని అభ్యర్థించారు. అయితే అందుకాయన సుముఖంగా లేరని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. బీజేపీని ఓడించే సంఖ్యాబలాన్ని సమీకరించడంలో విపక్షాలు విఫలమవుతాయనే సంశయం పవార్‌కు ఉందని ఎన్సీపీ వర్గాల్లో వినవస్తోంది. ఉమ్మడి అభ్యర్థిగా నిలిచే ఉద్దేశ్యం పవార్‌కు లేదని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. 2017లోనూ ఆయన ఈ ఆఫర్‌ను కాదన్నారు. చదవండి: ఎయిర్ ఏషియా ఇకపై ఉండదు! కారణమిదే? -
బీజేపీ చేసిన తప్పులకు ప్రజలు ఇబ్బందిపడాలా..?
మహ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు దేశంలో పెను దుమారానికి దారితీశాయి. వారి వ్యాఖ్యలకు నిరసనగా ముస్లిం సంఘాలు శుక్రవారం మసీద్‌ల వద్ద ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. నిరసనల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇక, పశ్చిమ బెంగాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. బెంగాల్‌లోని హౌరా పట్టణంలో శనివారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తలెత్తడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీపై నిప్పులు చెరిగారు. మమతా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ చేసిన తప్పులకు ప్రజలు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కోవాలి. హౌరా ఘర్షణలకు దారి తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ హింస వెనుక కొన్ని రాజకీయ పార్టీల ప్రమేయం ఉంది. హింసాత్మక నిరసనలతో గత రెండు రోజులుగా హౌరాలో సాధారణ జనజీవన స్తంభించిపోయింది. కొన్ని రాజకీయ పార్టీలు వెనుక ఉండి అల్లర్లను ప్రేరేపిస్తున్నాయని మండిపడ్డారు. #WATCH | West Bengal: Fresh clash b/w Police & a group of protesters breaks out at Panchla Bazaar in Howrah. Police use tear gas shells to disperse them as protesters pelt stones Violent protests broke out here y'day over controversial remarks of suspended BJP spox Nupur Sharma. pic.twitter.com/8ZhZ2bNVMG — ANI (@ANI) June 11, 2022 ఇదిలా ఉండగా.. అల్లర్ల కారణంగా ఉలుబెరియ సబ్‌డివిజన్‌లో విధించిన 144 సెక్షన్‌ను జూన్ 15 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక, హౌరాలో శుక్రవారం చోటుచేసుకున్న హింసలో పోలీసులు 70 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మరోవైపు.. బెంగాల్లో అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర బలగాలను పంపాలని బీజేపీ ఎంపీ, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు సౌమిత్ర ఖాన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు.ఇక, నిన్న జరిగిన హింసాత్మక ఘటనల్లో నిరసరకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పంటించారు. #WATCH | West Bengal: A BJP office vandalised and torched in Uluberia, Howrah district today. Protests erupted in the district earlier today against the controversial remarks of suspended BJP spokesperson Nupur Sharma. pic.twitter.com/LY9wWFeXi6 — ANI (@ANI) June 10, 2022 ఇది కూడాచదవండి: హింసాత్మకంగా మారిన నిరసనలు.. కర్ఫ్యూ విధింపు -
బీజేపీకి బిగ్ షాక్
పశ్చిమ బెంగాల్లో బీజేపీ, అధికార టీఎంసీ మధ్య ఇప్పటికే ఘర్షణ వాతావరణమే కొనసాగుతోంది. ఈ క్రమంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన ఎంపీ అర్జున్ సింగ్ కమలం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తన సొంత పార్టీ అయిన అధికార తృణముల్ కాంగ్రెస్‌లో చేరారు. వివరాల ప్రకారం.. బైరక్‌పూర్ ఎంపీ అర్జున్ సింగ్ ఆదివారం టీఎంసీలో చేరారు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన తృణమూల్‌ను వీడి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీజేపీ ఆయనకు బైరక్‌పూర్ నుంచి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా ఆయన బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తితోనే బీజేపీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. తనకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడంలేదని, ఇమడనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, తీవ్ర అసంతృప్తితో ఆదివారం బీజేపీకి గుడ్ బై చెప్పి.. సొంత పార్టీ గూటికి చేరారు. మూడు సంవత్సరాల తర్వాత అర్జున్ సింగ్ టీఎంసీలో చేరారు. ఈ క్రమంలో తృణమూల్ అగ్రనేత అభిషేక్ బెనర్జీ ఎంపీ అర్జున్ సింగ్‌కి పార్టీ కండువా కప్పి, సాదరంగా టీఎంసీలోకి ఆహ్వానించారు. కాగా, అర్జున్ సింగ్ 2001లో టీఎంసీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. Warmly welcoming former Vice President of @BJP4Bengal and MP from Barrackpore, Shri @ArjunsinghWB into the All India Trinamool Congress family. He joins us today in the presence of our National General Secretary Shri @abhishekaitc. pic.twitter.com/UuOB9yp9Xo — All India Trinamool Congress (@AITCofficial) May 22, 2022 ఇది కూడా చదవండి: ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు -
పాలిటిక్స్‌లో మరో సంచలనం.. ముంబై వేదికగా సీఎంల మీటింగ్.!
సాక్షి, ముంబై: దేశంలో పాలిటిక్స్ మరోసారి వేడెక్కాయి. ప్రస్తుతం దేశం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు త్వరలో ముంబై వేదిక కానుంది. బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం ముంబైలో జరుగుతుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం తెలిపారు. ఈ సందర్బంగా సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతోపాటు ద్రవ్యోల్బణం, మత విద్వేషాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశానికి సంబంధించి బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసినట్టు తెలిపారు. మమతా బెనర్జీ లేఖపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవారు చర్చించారని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దేశంలో పలు చోట్ల జరుగుతున్న మత ఘర్షణలు, విద్వేష ప్రసంగాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి మాట్లాడాలని 13 విపక్ష పార్టీల నేతలు శనివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీయేతర రాష్ట్రాల సీఎం సమావేశం జరుగనుండటం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. హిందూ ఒవైసీ.. మరోవైపు.. మహారాష్ట్రలో పరిస్థితులపై సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేపై సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాజ్ ఠాక్రే ‘హిందూ ఒవైసీ’ అని, ఎంఎన్ఎస్ ‘హిందుత్వ మజ్లిస్ పార్టీ’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే రాజ్ థాక్రే.. బీజేపీ అండతోనే ఇలాంటి కొన్ని విషయాలను వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు. ఇది చదవండి: శ్రీరాముడి ఆలోచనకే అది వ్యతిరేకం.. -
హత్యా రాజకీయాలు చేయడం బీజేపీ సంస్కృతి కాదు..
న్యూఢిల్లీ: బీజేపీ ఎప్పుడూ హింసను నమ్ముకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ‘సిద్ధాంత ప్రాతిపదికగానే ఎన్నికల్లో గెలుస్తున్నా. నాయకత్వానికున్న జనాదరణ, ప్రభుత్వ పనితీరు, పథకాల ఆధారంగా ఓట్లు అడుగుతాం తప్ప ప్రత్యర్థులపై హింసకు దిగడం బీజేపీ విధానం కాదు’ అన్నారు. లోక్‌సభలో ఓ చర్చకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను చంపడం, భార్యాపిల్లలపై అత్యాచారాలకు ఒడిగట్టడం, హత్యా రాజకీయాలు చేయడం బీజేపీ సంస్కృతి కాదని తృణమూల్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల తరబడి అంతర్గత ఎన్నికల ఊసే ఎత్తకుండా కుటుంబ రాజకీయాలు చేయడం కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలకు అలవాటని ధ్వజమెత్తారు. ముందుగా వాళ్ల పార్టీలో ఎన్నికలు జరుపుకుని ఆ తర్వాత దేశం గురించి మాట్లాడాలంటూ ఎద్దేవా చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలన్నది బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. అంతకు ముందు.. బీర్భూం హత్యాకాండపై సీబీఐ చేస్తున్న దర్యాప్తులో నిజ నిర్ధారణ కమిటీ ముసుగులో బీజేపీ వేలు పెడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధశారం ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకించే వాళ్లందరినీ జైలుపాలు చేయాలన్న అజెండా దేశవ్యాప్తంగా నడుస్తోందని విమర్శించారు. తృణమూల్, పోలీసుల కుమ్మక్కుతో రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమర్పించిన నివేదికలో కమిటీ ఆరోపించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని సూచించింది. దీనిపై మమత మండిపడ్డారు. -
జీవించే హక్కుంది.. ప్రజలను బతకనివ్వండి.. కన్నీరుపెట్టిన ఎంపీ..
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న బీర్బమ్ కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనం అయ్యారు. తాజాగా ఈ ఘటన పార్లమెంట్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎంపీ రూపా గంగూలీ ఈ ఘటనపై రాజ్యసభలో మాట్లాడుతూ ఉద్వేగానికిలోనై ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. జీరో అవర్‌లో భాగంగా ఆమె శుక్రవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. బెంగాల్‌ను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బెంగాల్లో జరిగిన బీర్బమ్ హింస గురించి ప్రస్తావించారు. బెంగాల రాష్ట్రంలో దారుణ హత్యలు జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. అక్కడ కేవలం 8 మంది మాత్రమే మరణించారని, ఎక్కువ మంది చనిపోలేదని మమత సర్కార్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరోవైపు ఆమె ఈ విషయంపై మాట్లాడుతున్న సమయంలో తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ ఆమె మాట్లాడుతూనే అటాప్పీ రిపోర్ట్ ప్రకారం.. చనిపోయిన వారిని మొదట దారుణంగా కొట్టారని ఆ తర్వాత సామూహిక హత్యలు చోటుచేసుకున్నాయని రూపా గంగూలీ ఆరోపించారు. భారత్‌లో బెంగాల్ భాగమని, అక్కడ జీవించే హక్కు ఉందని, మేం బెంగాల్లో పుట్టామని, అక్కడ పుట్టడం తప్పుకాదు అని, మహాకాళి భూమి అని ఆమె ఆవేశంగా మాట్లాడుతూ భావోద్వేగంతో కన్నీరుపెట్టుకున్నారు. అయితే, గత సోమవారం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్ భాదు షేక్ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే బోగ్టూయి గ్రామంలో హింస చెలరేగింది. దాదాపు డజను ప్రత్యర్థుల ఇళ్లకు కొందరు వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 8మంది సజీవదహనం అయ్యారు. తృణమూల్ బ్లాక్ ప్రెసిడెంట్ అనరుల్ హుస్సేన్ సహా 23మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు.. బీర్బమ్ సజీవదహనాల కేసులో కోల్కత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. #WATCH | BJP MP Roopa Ganguly broke down in Rajya Sabha over Birbhum incident, demanded President's rule in West Bengal saying, "Mass killings are happening there, people are fleeing the state... it is no more liveable..." pic.twitter.com/EKQLed8But — ANI (@ANI) March 25, 2022 -
దీదీ పాలన హింసాత్మకమంటూ గవర్నర్ సీరియస్
కోల్‌కతా: బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బేనర్జీ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘బెంగాల్లో హింసాత్మకమైన పాలన సాగుతోంది. భయంకరమైన హింసాత్మక ఘటనలు, సజీవ దహనాలు చూస్తుంటే అదే సత్యమనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఓ నివేదికను అడిగాను. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నా’ అని గవర్నర్ జగదీప్ ధన్కర్ ట్విటర్లో విడుదుల చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని బొగ్తుయ్ గ్రామంలో సోమవారం బర్షల్ గ్రామ పంచాయితీ డిప్యూటీ చీఫ్ తృణమాల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత బాదు షేక్ బాంబు దాడిలో మరణించారు. అదేరోజు అర్ధరాత్రి చెలరేగిన హింసలో అల్లరి మూకలు 10 ఇళ్లకు నిప్పంటించారు. ఈ హింసాత్మక ఘటనలో 8 మంది మృతి సజీవ దహనమయ్యారు. టీఎంసీ నేత హత్యకు ప్రతీకారంగానే ఈ ఘాతుకానికి పాల్పపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Horrifying violence and arson orgy #Rampurhat #Birbhum indicates state is in grip of violence culture and lawlessness. Already eight lives lost. Have sought urgent update on the incident from Chief Secretary. My thoughts are with the families of the bereaved. pic.twitter.com/vtI6tRJcBX — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) March 22, 2022 -
ప్రధానికి పుల్ సపోర్ట్ ఇస్తానంటున్న మమతా బెనర్జీ.. అందరం ఒక్కటై..
కోల్‌కతా: రాజకీయంగా ఎప్పుడూ నువ్వా-నేనా అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్రమోదీ తలపడతారనేది అందరికీ తెలిసిన విషయమే. తాజగా ఫైర్ బ్రాండ్ దీదీ ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీకి పూర్తి మద్దతు తెలిపారు. ఉక్రెయిన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ మమతా ఓ లేఖను ప్రధానికి పంపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్రమైన సంక్షోభం ఏర్పడిందని, వాటి నుంచి బయటపడటం ఎంతైనా అవసరం ఉందన్న మమతా.. అందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని ఆమె కోరారు. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను త్వరితగతిన దేశానికి రప్పించాలిని కోరారు. సహకార సమాఖ్య వ్యవస్థలో ఉన్న ఓ సీనియర్ ముఖ్యమంత్రిగా ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో మన దేశ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు మమత ఆ లేఖలో తెలిపారు. సంక్షోభ సమయంలో దౌత్య వ్యవహారాలను సరైన రీతిలో అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు దీదీ తన లేఖలో తెలిపారు. తీవ్రమైన అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లో ఒక దేశంగా ఐక్యంగా నిలబడాల్సి అవసరం ఎంతైనా ఉందని అందుకు మన దేశీయ విబేధాలను పక్కనపెట్టి ఉండాలని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఉన్నందున, ప్రపంచానికి శాంతియుత పరిష్కారాన్ని అందించడానికి భారత్ నాయకత్వం వహించాలని ప్రధానికి సూచించారు. -
సాక్షి కార్టూన్ 11-02-2022
... మీరు ‘కాళీ’ అయినట్లు... -
సాక్షి కార్టూన్
ఈరోజు ట్విటర్లో ట్వీట్ చేయాల్సిన విషయాన్ని స్వయంగా వచ్చి ఇచ్చి వెళుతున్నారు మేడం! -
బెంగాల్లో బీజేపీకి మరో భారీ షాక్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ బాగ్డా ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్, పార్టీ కౌన్సిలర్ మనోతోష్ నాథ్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్ టీఎంసీకి పార్టీలో చేరిన 24 గంటల్లోనే మరో ఎమ్మెల్యే అదే బాట పట్టడం విశేషం. బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత కేంద్రంలో బీజేపీకి అధికారాన్ని దూరం చేయడమే లక్ష్యంగా బెంగాల్ టీఎంసీ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూసుకు పోతున్న తరుణంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్లు ముకుల్ రాయ్, తన్మయ్ ఘోష్ తరువాత, ఇప్పుడు మరో బీజేపీ ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్, పార్టీ కౌన్సిలర్ మనోతోష్ నాథ్ మంగళవారం కోల్‌కతాలో టీఎంసీ కండువా కప్పుకున్నారు. కొన్ని అపార్థాల కారణంగా గతంలో కొన్ని మార్పులు జరిగాయని కానీ ఇపుడు తిరిగి తన ఇంటికి చేరుకున్నానంటూ ఈ సందర్భంగా బిశ్వజిత్ సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు తన సేవలు కొనసాగుతాయన్నారు. కాగా పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అనూహ్యంగా విజయానన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో టీఎంసీకి ఓటమి తప్పదనే అంచనాలతో టీఎంసీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన పలువురు నేతలు తాజాగా టీఎంసీ బాటపడుతున్నారు. ఇప్పటికే ముకుల్ రాయ్ తోపాటు కొంతమంది సీనియర్ నేతలు టీఎంసీ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. చదవండి : Zomato: యాడ్ల దుమారం, మండిపడుతున్న నెటిజనులు -
ఈడీ సమన్లు: దీదీ తాజా సవాల్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. బొగ్గు స్మగ్లింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, అతని భార్య రుజీరా బెనర్జీకి ఈడీ సమన్లు జారీచేసిన నేపథ్యంలో ఆమె కేంద్రంపై మండిపడ్డారు. దేశాన్ని తెగనమ్మేసిన బీజేపీ బొగ్గు కుంభకోణంలో టీఎంసీని వేలెత్తి చూపినందువల్ల ప్రయోజనం లేదని, అది కేంద్ర పరిధిలోనిదన్నారు. దమ్ముంటే తమ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలని ఆమె సవాల్ విసిరారు. చదవండి : Coal scam: అభిషేక్, భార్య రుజీరాకు ఈడీ సమన్లు బొగ్గు స్కాం వ్యవహారంలో తమ పార్టీపై దాడిచేయడాన్ని ప్రశ్నించిన మమతా అది కేంద్రం పరిధిలోనిదని పేర్కొన్నారు. మరి బొగ్గు గనుల స్వాహాలో బీజేపీ మంత్రుల సంగతేంటి? బెంగాల్, అసన్సోల్ ప్రాంతంలోని కోల్ బెల్ట్‌ను దోచుకున్న బీజేపీ నాయకుల సంగతేంటని ప్రశ్నించారు. గుజరాత్ చర్రిత ఏంటో తెలుసు.. తమపై ఒక కేసు పెడితే, తాము మరిన్ని కేసులను వెలుగులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా దీదీ హెచ్చరించారు. దీనిపై తిరిగి ఎలా పోరాడాలో తమకు తెలుసని ఆమె పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా ఈడీని ఎందుకు వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు వంటి సహజ వనరుల హక్కుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని మమతా గుర్తు చేశారు. -
టీఎంసీ గూటికి కాంగ్రెస్ మాజీ ఎంపీ సుస్మితా దేవ్
కోలకతా: అంచనాలకనుగుణంగానే టీఎంసీ గూటికి మాజీ ఎంపీ సుస్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుస్మితా దేవ్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సుస్మితా దేవ్ టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఒబ్రెయిన్ సమక్షంలో సోమవారం టీఎంసీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు సుస్మితాతో పాటు, టీఎంసీ ట్విటర్ ఖాతాల ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. తన శక్తి సామర్థ్యాలను సంపూర్తిగా కేటాయిస్తానంటే ట్విట్ చేసిన సుస్మిత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు ఖేలా హోబ్ హ్యాష్ ట్యాగ్‌ను కూడా యాడ్ చేశారు. కాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి సుస్మితా దేవ్ లేఖ రాశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. పార్టీతో మూడు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆమె ఈ సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ నేతలు, సభ్యులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఎందుకు పార్టీని వీడుతున్నదీ ఆమె వెల్లడించలేదు. ప్రజా సేవలో మరో నూతన అధ్యాయం అని మాత్రమే వెల్లడించారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, ఈ వార్తలను కాంగ్రెస్ ఖండించింది. మరోవైపు ఇదే నిజమైతే చాలా దురదృష్టకరమంటూ కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ట్వీట్ చేశారు. Listen to @sushmitadevinc share her experience after meeting our National General Secretary @abhishekaitc & the Hon'ble Chief Minister of WB @MamataOfficial along with Parliamentary Party Leader RS @derekobrienmp. She will address the Media in Delhi, tomorrow. Stay tuned! pic.twitter.com/LOUPyF7Ez7 — All India Trinamool Congress (@AITCofficial) August 16, 2021 Will give it all I have got…. @MamataOfficial thank you🙏🏻#KhelaHobe https://t.co/aa0ijNrhOk — Sushmita Dev (@SushmitaDevAITC) August 16, 2021 If this is true it is most unfortunate Why @sushmitadevinc ? Your erstwhile colleagues & friends especially the person who was National President of @nsui when you contested your first @DUSUofficial elections back in 1991 deserve a better explanation than this laconic letter? pic.twitter.com/0thBTVFCmY — Manish Tewari (@ManishTewari) August 16, 2021 -
రెండు నెలలకొకసారి ఢిల్లీ వస్తా.. దీదీ సంచలన ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన పెగాసస్ వివాదం తరువాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన దూకుడును పెంచారు. ఐదు రోజుల ఢిల్లీ పర్యటనను విజయంతంగా ముగించుకున్న దీదీ సంచలన ప్రకటన చేశారు. ఇకపై తాను ప్రతి రెండు నెలలకోసారి తాను ఢిల్లీకి వస్తానని వెల్లడించారు. బీజేపీని అధికారం నుంచి కూలదోసేంత వరకు ''ఖేలా హాబ్' కొనసాగుతుందని గర్జించిన దీదీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యమని తాజాగా ప్రకటించారు. ప్రతిపక్ష నేతలతో విస్తృత భేటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన ఢిల్లీ పర్యటన ఫలవంతమైందని 'సేవ్ డెమోక్రసీ, సేవ్ కంట్రీ' తన నినాదమని టీఎంసీ అధినేత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా దేశీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పెట్రోల్, గ్యాస్ ధరలపై ఆమె మండిపడ్డారు. దేశం అభివృద్ధి చెందాలి, ప్రజల కోసం అభివృద్ధిని కోరుకుంటున్నామని చెప్పారు. అలాగే రానున్న కరోనా మూడో దశ ముప్పుపై కూడా ఆమె కేంద్రాన్ని హెచ్చరించారు. 2024 ఎన్నికల వ్యూహాలపై ప్రశ్నించినపుడు మాత్రం సమాధానాన్ని దాటవేసిన మమతా..ప్రతి ఒక్కరి నినాదం దేశాన్ని రక్షించడమే అని నొక్కి వక్కాణించారు. దేశ రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో చర్చించామని వెల్లడించారు. ప్రతిపక్ష ఐక్యత సమస్యపై కూడా చర్చించామని ఆమె చెప్పారు. తదుపరి టూర్లో శరద్ పవార్‌తో భేటీకానున్నట్టు వెల్లడించారు. కాగా తన ఢిల్లీ పర్యనటలో భాగంగా మమతా బెనర్జీకాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తదితర పలువురు ప్రతిపక్ష నాయకులతో సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ-షాలకు చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే హస్తిన పర్యటనపై మమతా తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా శరద్ పవార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ కావడం ఈ అంచనాలకు మరింత బలాన్నిస్తోంది. -
ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పెగాసస్
కోల్‌కతా/న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ దేశంలో సంక్షేమానికి బదులుగా నిఘా దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేయాలని, ఇందుకోసం విపక్షాలు అన్నీ ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అమరవీరుల స్మృత్యర్థం బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా పాల్గొన్న మమత రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు ఇలా అన్ని వర్గాలపైన కేంద్రం నిఘా పెట్టినందుకు సుప్రీంకోర్టు దీనిని సూమోటోగా తీసుకొని విచారించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, ఇతర వస్తువులపై వేసిన పన్నుల్ని ఇలాంటి ప్రమాదకరమైన సాఫ్ట్వేర్ల కొనుగోలుపై కేంద్రం ఖర్చు చేస్తోందని మమత ధ్వజమెత్తారు. ‘ విపక్ష నేతలందరి ఫోన్ల సంభాషణలు రికార్డు అయిపోతూ ఉంటాయి. అందుకే నేను ఫోన్లో ఎన్సీపీ నేత పవార్, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడలేకపోతున్నాను. మా అందరి మీద ఇలా నిఘా పెట్టినంత మాత్రాన 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎవరూ కాపాడలేరు’’ అని అన్నారు. స్వతంత్ర దర్యాప్తు జరపాలి: ఎడిటర్స్ గిల్డ్ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వెంటనే సమగ్ర, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) పేర్కొంది. ఈ మేరకు బుధవారం ట్విట్టర్లో ఒక ప్రకటన విడుదల చేసింది. సొంత పౌరుల ఫోన్లపై, వారి కదలికలపై భారత ప్రభుత్వ సంస్థలు దృష్టి పెట్టినట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొంది. పాత్రికేయులపై సైతం నిఘా పెట్టడం అంటే అది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుందని ఎడిటర్స్ గిల్డ్ స్పష్టం చేసింది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ, పత్రికా స్వేచ్ఛను హరించే యత్నాలు చేయడం దారుణమని విమర్శించింది. పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వమే కాపాడకపోతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాగించేదెలా? అని నిలదీసింది. ఎంక్వైరీ కమిటీలో జర్నలిస్టులకు, సామాజిక ఉద్యమకారులకు స్థానం కల్పించాలని సూచించింది. ఫోన్ ట్యాపింగ్‌పై 28న విచారణ..! పెగాసస్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సన్నద్ధమయ్యింది. ఈ నెల 28న కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతోనూ మాట్లాడనున్నట్లు సమాచారం. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీపై శశిథరూర్ నేతృత్వంలో ఏర్పాటైన 32 మంది సభ్యుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 28న సమావేశం కానుంది. ‘సిటిజెన్స్ డేటా సెక్యూరిటీ, ప్రైవసీ’ అజెండాతో భేటీ జరుగనుందని లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. ట్యాపింగ్‌పై విచారణకు రావాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, హోంశాఖల ఉన్నతాధికారులకు స్టాండింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. నా ఫోన్‌కి ప్లాస్టర్ వేశా పెగాసస్ ప్రమాదకరమైనదన్న మమత... అందుకే తన ఫోన్ కెమెరాకు ప్లాస్టర్ వేశానంటూ దానిని చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్లాస్టర్ వెయ్యాలి. లేదంటే దేశం సర్వనాశనమైపోతుంది’ అని మమత అన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, మీడియా అత్యంత ముఖ్యమైనవని, పెగాసస్ వలలో ఈ మూడే చిక్కుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ముందుకు వచ్చి సూమోటోగా విచారణ జరిపించాలని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మమత అన్నారు. -
మోదీజీ, ఇది పర్సనల్ కాదు,ప్లాస్టర్ వేయాల్సిందే: దీదీ ఎటాక్
సాక్షి, కోల్‌కతా: సంచలన పెగాసస్ స్పైవేర్ కుంభకోణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. విపక్ష నేతల ఫోన్లను కేంద్రం హ్యాక్ చేస్తోందనీ, సమాఖ్య నిర్మాణాన్ని బీజేపీ కూలదోసిందంటూ మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. "మిస్టర్ మోదీ...నేను మీపై వ్యక్తిగతంగా దాడి చేయటం లేదు. కానీ మీరు, హోంమంత్రి, ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారు, చివరికి బీజేపీ మంత్రులనే నమ్మలేదు’’ అంటూ ప్రధానిపై విరుచుకుపడ్డారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆన్లైన్లో బుధవారం ప్రజలనుద్దేశించి ప్రసంగించిన దీదీ, బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని ప్రతిక్షాలకు పిలుపు నిచ్చారు. ప్రజాస్వామ్య మూలస్థంభాలైన మూడు (మీడియా, న్యాయ, ఎన్నికల కమిషన్) వ్యవస్థలను పెగాసస్ ఆక్రమించుకుందని దీదీ మండిపడ్డారు. పేద ప్రజలకు తగినంత నగదును అందుబాటులో ఉంచమంటే, కోట్లాది రూపాయలను మోదీ స్పైయింగ్ గిరీకి వెచ్చిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాలకు నిధులివ్వరు కానీ స్పైవేర్లకు కోట్లు ఖర్చు చేస్తారన్నారు. పెగాసెస్‌పై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని కోరారు. అలాగే ఢిల్లీలో జులై 27 లేదా 28 తేదీల్లో ప్రతిపక్ష పార్టీల భేటీ ఏర్పాటు చేయాలని, తాను హాజరుకానున్నట్టు మమత చెప్పారు. ఇజ్రాయెల్ మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ అతి ప్రమాదకరం, భయంకరమైందని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ ప్రమాదంలో పడిపోయింది ఇపుడిక తాను ఇతర ప్రతిపక్ష నాయకులతో గానీ, ప్రజలతో స్వేచ్ఛగా మాట్లాడలేనంటూ మమతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో ఖేలా హోబె నినాదంతో మోదీ సవాల్‌కు విసిరిన దీదీ ఇపుడిక దేశంనుంచి బీజేపీని తరిమికొట్టే దాకా ఖేలాహోబె దివస్ జరపాలన్నారు. ఆగస్టు 16న అన్ని రాష్ట్రాల్లోను ఖేలా దివస్ నిర్వహించాలన్నారు. ఈ నేపథ్యంలో పేద పిల్లలకు ఫుట్‌బాల్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ట్యాపింగ్ కారణంగా ఫోన్‌కు ప్లాస్టర్ వేసా.. ఇక కేంద్రానికి ప్లాస్టర్ వేయాల్సిందే అని దీదీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మనీ, మజిల్, మాఫియాకు వ్యతిరేకంగా నిలబడిన బెంగాల్ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓగ్రూప్ రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ పలువురు ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేసిందన్న ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. ముఖ్యంగా జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతలే ప్రధాన లక్క్ష్యంగా గూఢచర్యానికి పాల్పడిన వైనం రోజు రోజుకు మరింత ముదురుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తదితరులతోపాటు మమతా మేనల్లుడు, పార్టీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ పేరు కూడా ఇందులో ఉండటం గమనార్హం. 'Khela' will happen in all states until BJP is removed from the country. We'll celebrate 'Khela Diwas' on Aug 16. We'll give footballs to poor children. Today, our freedom is at stake. BJP has endangered our liberty. They don't trust their own ministers & misuse agencies: WB CM pic.twitter.com/i720LQHfqK — ANI (@ANI) July 21, 2021 -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రూ.5 లక్షల జరిమానా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు బుధవారం రూ. 5 లక్షల జరిమానా విధించింది. బెంగాల్ ఎన్నికల సందర్భంగా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌషిక్ చందాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తూ మమత గతంలో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారంటూ కోర్టు మమతకు జరిమానా విధించింది. కాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి దాఖలు చేసిన దరఖాస్తును జస్టిస్ కౌషిక్ చందా స్వయంగా తిరస్కరించారు. ఈ కేసును తన వ్యక్తిగత అభీష్టానుసారం విచారించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ కేసును తన బెంచ్ నుంచి తొలగించారు. -
గవర్నర్‌పై సంచలన ఆరోపణలు
కోల్‌కతా: తమ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ పచ్చి అవినీతిపరుడని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికే ఆయన ఇటీవల ఉత్తర బెంగాల్లో పర్యటించారని మండిపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ‘గవర్నర్ ధన్కర్ అవినీతిపరుడు. 1996 నాటి జైన్ హవాలా కేసు చార్జీషీట్లో ఆయన పేరు ఉంది. అవినీతి మకిలి అంటిన ఇలాంటి గవర్నర్‌ను ఇంకా ఎందుకు పదవిలో కొనసాగిస్తున్నారో కేంద్రం సమాధానం చెప్పాలి’అని మమత డిమాండ్ చేశారు. గవర్నర్‌ను› తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశానని, అయినా స్పందించలేదని విమర్శించారు. ఆ ఆరోపణలు నిరాధారం: గవర్నర్ సీఎం మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారని, తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని గవర్నర్ ధన్కర్ దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రి తరహాలో మమత వ్యవహరించడం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తాను చేయాల్సిన ప్రసంగంలోని కొన్ని అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తానని, అందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జైన్ హవాలా కేసుకు సంబంధించిన ఏ చార్జిషీట్లోనూ తన పేరు లేదని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ ఆరోపణలు నిరాధారమని చెప్పారు. -
గవర్నర్‌గా ధన్కర్ వద్దంటూ ప్రధానికి మూడుసార్లు లేఖ రాశా
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ధన్కర్ను ఉపసంహరించుకోవాలంటూ ప్రధాని మోదీకి ఇప్పటి వరకు మూడుసార్లు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. ‘చిన్న పిల్లాడైతే బుజ్జగించవచ్చు కానీ, ఒక వృద్ధుడిని అలా చేయలేం కదా. ఈ విషయంలో మాట్లాడకుండా ఉండటమే మంచిది’అంటూ మమత వ్యాఖ్యానించారు. గవర్నర్ ధన్కర్ను తొలగిస్తారంటూ వార్తలు వస్తున్నాయి కదా? అని మీడియా ప్రశ్నించగా ఆ విషయాలేవీ తనకు తెలియవన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ధన్కర్ను కేంద్రం నియమించింది. ఆయన్ను వెనక్కి తీసుకోవాలని మోదీకి లేఖలు రాశా’అని తెలిపారు. రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వంతో గవర్నర్ ధన్కర్ మధ్య విభేదాలు మొదట్నుంచీ కొనసాగుతున్నాయి. అమిత్ షాను కలిసిన ధన్కర్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి చేరుకున్న ధన్కర్.. గురువారం హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై ధన్కర్ హోం మంత్రికి వివరించినట్లు హోం శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం కోల్‌కతాలో గవర్నర్‌కు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. -
విషాదం: ప్రముఖ కవి, డైరెక్టర్ కన్నుమూత
కోల్‌కతా: ప్రముఖ కవి, చిత్ర దర్శకుడు బుద్ధదేవ్ దాస్‌గుప్తా (77) కన్నుమూశారు. కిడ్నీ వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని తన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత బుద్ధదేబ్ దాస్‌గుప్తా మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి, సహచరులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇంకా పలువురు పరిశ్రమ పెద్దలు, అభిమానులతోపాటు, నిర్మాత, రాజ్ చక్రవర్తి తదితరులు దాస్‌గుప్తా మరణంపై సంతాపం తెలిపారు. మోండో మేయర్ ఉపఖ్యాన్, కాల్‌పురుష్ వంటి చిత్రాల్లో దాస్‌గుప్తాతో కలిసి పనిచేసిన నటి సుదీప్తా చక్రవర్తి కూడా దాస్‌గుప్తా మరణంపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రముఖ సమకాలీన బెంగాలీ చిత్రనిర్మాతలు సత్యజిత్ రే, ఘటక్ తర్వాత అంతర్జాతీయ సినిమా వేదికలపై ప్రముఖంగా నిలిచిన గొప్ప భారతీయ దర్శకుడంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. 1980,90 దశకాల్లో ప్రముఖ దర్శకులు గౌతమ్ ఘోష్, అపర్ణ సేన్లతో కలిసి బెంగాల్లో సమాంతర సినిమా ఉద్యమానికి నాంది పలికారు దాస్‌గుప్తా. దూరత్వా (1978), గ్రిహజుద్ధ (1982) ఆంధీ గాలి (1984) బెంగాల్‌లోని నక్సలైట్ ఉద్యమం, బెంగాలీల చైతన్యంపై దాని ప్రభావం ప్రధాన అంశాలుగావచ్చిన గొప్ప సినిమాలు. బాస్ బహదూర్, తహదర్ కథ, చారచార్, ఉత్తరా వంటి చిత్రాల ద్వారా దాస్‌గుప్తా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉత్తరా (2000), స్వాప్నర్ దిన్ (2005) చిత్రాలకు రెండుసార్లు ఉత్తమ దర్శకత్వానికి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నారు. గోవిర్ అరలే, కాఫిన్ కింబా సూట్‌కేస్, హిమ్జోగ్, చాటా కహిని, రోబోటర్ గాన్, శ్రేష్ట కబితలతో సహా పలు కవితా రచనలు చేశారు. 2019ay పశ్చిమ బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (డబ్ల్యుబిఎఫ్‌జెఎ) బుద్ధదేవ్ దాస్‌గుప్తాకు దివంగత సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. Saddened at the passing away of eminent filmmaker Buddhadeb Dasgupta. Through his works, he infused lyricism into the language of cinema. His death comes as a great loss for the film fraternity. Condolences to his family, colleagues and admirers — Mamata Banerjee (@MamataOfficial) June 10, 2021 Recipient of numerous National and International honours, legendary filmmaker and renowned poet, #BuddhadebDasgupta has passed away. Sincere condolences to his family and friends. pic.twitter.com/8F5N2yXGZT — Raj chakrabarty (@iamrajchoco) June 10, 2021 Poet and Filmmaker Buddhadeb Dasgupta is no more. In the post Ray-Ghatak era,he was one of the most celebrated and valued Indian(nd Bengali)Filmmaker in the International Diaspora.I've n fortunate enuf 2 hv wrkd in 2 of his films #MondoMeyerUpakhyan and #Kalpurush .... — Sudiptaa Chakraborty (@SudiptaaC) June 10, 2021 -
బెంగాల్లో కోవిడ్ టీకా సర్టిఫికెట్‌పై మమత ఫొటో
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కోవిడ్ టీకా సర్టిఫికెట్లపై సీఎం మమతా బెనర్జీ ఫొటో ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో 18–44 ఏళ్ల వయసు వారు కోవిడ్ టీకాలు తీసుకుంటే వారికి సీఎం ఫొటో ఉన్న కోవిడ్ టీకా సర్టిఫికెట్‌ను ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో ఉండగా, బెంగాల్లో మమత ఫొటో ఉండటంపై బీజేపీ వర్గాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈ అంశంపై బెంగాల్ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ వివరణ ఇచ్చారు. ‘ మా రాష్ట్రంలో 18–44 ఏళ్ల వయసు వారికి ఇస్తున్న టీకాలు.. కేంద్ర ప్రభుత్వం సరఫరాచేసినవి కాదు. బెంగాల్ ప్రభుత్వం సొంత ఖర్చుతో టీకా తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది. కేంద్రప్రభుత్వమేమీ 18–44 ఏళ్ల వయసు వారి టీకాలు ఇవ్వట్లేదు కదా? అయినా, మమత ప్రభుత్వం ఇస్తోందికాబట్టే ఆమె ఫొటోను టీకా సర్టిఫికెట్లపై ముద్రించాం. పంజాబ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాలూ తమ సీఎంల ఫొటోలున్న సర్టిఫికెట్లనే జారీచేస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. -
Yass Cyclone: ముందు పొగిడారు.. ఒక్క రోజులోనే మాట మార్చారు
కోల్‌కతా: అత్యంత తీవ్ర తుఫానుగా మారిన 'యాస్' పశ్చిమ బెంగాల్లో పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని దిఘాపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. శంకర్‌పుర్, మందర్మని, తేజ్పూర్‌ల్లోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. అయితే ముందు జాగ్రత్త చర్యలతో మమతా బెనర్జీ ప్రభుత్వం లక్షలాది మందిని సురక్షిత ప్రాంతానికి తరలించింది.ఈ నేపథ్యంలో బీజేపీ నేత.. ఎంపీ దిలీప్ ఘోష్ బుధవారం బెంగాలీ దినపత్రిక సంగబాద్ ప్రతిదిన్తో మాట్లాడుతూ మమతా ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. ''యాస్ తుఫాను విధ్వంసాన్ని ముందే ఊహించి ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకున్న ముందు చర్య నాకు నచ్చింది. గతంలో 'అంఫన్' తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుంచి పాఠాలు నేర్చుకున్న మమతా ప్రభుత్వం ఈసారి మంచి పని చేసింది. తీరప్రాంతాల్లోని ప్రజలకు తుఫాను గురించి ముందే అవగాహన కల్పించి వారని సురక్షిత ప్రాంతానికి తరలించి ప్రాణనష్టం జరగకుండా చూసుకున్నారు. ప్రస్తుతం తుఫాను ప్రభావంతో రాష్ట్రం అల్లకల్లోలంగా ఉందని.. పరిస్థితి మాములుకు వచ్చిన తరువాత నష్టం విలువ తెలుస్తుంది. అయితే మమతా ముందు చూపుతో నష్టం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది'' అని పేర్కొన్నారు. అయితే ఒక్క రోజు తేడాతోనే దిలీప్ ఘోష్ మాట మార్చారు. తుఫాను కట్టడిలో ముందస్తు చర్యలు బాగానే ఉన్నా ప్రభుత్వం సరైన లెక్కలు చెప్పడం లేదన్నారు. . '' రాష్ట్రంలో 134 నదీ తీరాలు తుఫాను కారణంగా కొట్టుకుపోయాయని ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుంది. వారు ఈ నంబర్ ఎక్కడ నుంచి పొందారో నాకు తెలియదు. రానున్న తుఫాను ముందే పసిగట్టిన మమత ప్రభుత్వం సంఖ్యలను ముందే నిర్థారించారించింది'' అని చురకలంటించారు కాగా అంతకముందు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తుఫాను ప్రభావంపై స్పందించారు. రాష్ట్రంలో దాదాపు కోటి మందిపై ఈ తుపాను ప్రభావం చూపిందని ఆమె తెలిపారు. 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 3 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు రూ. 10 కోట్ల విలువైన సహాయసామగ్రిని పంపిణీ చేశామని తెలిపారు. భీకర ఈదురుగాలులు, భారీ వర్షాలను తీసుకువస్తూ బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒడిశాలోని ధమ్ర పోర్ట్ సమీపంలో తుపాను తీరం దాటింది. మధ్యాహ్నానికి బలహీనపడి జార్ఖండ్ దిశగా వెళ్లింది. చదవండి: తుఫాన్ వస్తుంటే బయటకొచ్చావ్ ఏంటి.. రిప్లై ఏంటో తెలుసా! -
Mamata Banerjee: మోదీ సమావేశం సూపర్ ఫ్లాప్
కోల్‌కతా: దేశంలో కోవిడ్ పరిస్థితిపై గురువారం జరిగిన వర్చువల్ సమావేశంలో కొన్ని రాష్ట్రాల సీఎంల పట్ల మోదీ వ్యవహరించిన తీరుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన ఈ సమావేశం ఒక సర్వసాధారణమైన ‘సూపర్ ఫ్లాప్’ అని మమత అభివర్ణించారు. సమావేశం ముగిసిన తర్వాత మమత మీడియాతో మాట్లాడారు. మోదీతో వర్చువల్ సమావేశానికి రాష్ట్రాల ముఖ్యమంత్రు లను ఆహ్వానించారుగానీ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేద ని, ఆ సీఎంల ప్రతిష్టను మోదీ ఆటబొమ్మల స్థాయికి దిగజార్చారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంలను మాట్లాడనీయకుండా వారిని మోదీ అవమానించారని మమత ఆరోపిం చారు. మోదీ అభద్రతాభావంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని మమత వ్యాఖ్యానించారు. అయితే, మమత వ్యాఖ్యలపై మాజీ తృణమూల్ సీనియర్ నేత, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే సువేంధు అధికారి స్పందించారు. ‘మోదీ పూర్తిగా కోవిడ్ సంబంధ విషయాలు చర్చించిన సమావేశాన్ని మమత రాజకీయమయం చేశారు. గతంలో ఎన్నోసార్లు ప్రధానితో భేటీల నుంచి మమత ఉద్దేశపూర్వకంగా తప్పుకుని, ఇప్పుడేమో మోదీ–కలెక్టర్ల భేటీలో మాట్లాడే అవకాశం రాలేదంటున్నారు ’ అని సువేంధు వ్యాఖ్యానించారు. వారి కోసం 20 లక్షల డోస్‌లు ఇవ్వండి బెంగాల్‌లోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 20 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను కేటాయించాలని మోదీని మమత కోరారు. ఈ మేరకు మమత గురువారం మోదీకి ఒక లేఖ రాశారు. బ్యాంకింగ్, రైల్వే, బొగ్గు, ఎయిర్‌పోర్టులు తదితర ఫ్రంట్‌లైన్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా డోస్‌లు రాష్ట్రానికి పంపాలని మమత కోరారు. -
West Bengalలో కలవరం
-
బెంగాల్లో దీదీ గూండాగిరి ఇక చెల్లదు: పీఎం మోదీ
-
బెంగాల్లో దీదీ గూండాగిరి ఇక చెల్లదు: పీఎం మోదీ
కోలకతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నాలుగోదశ పోలింగ్ హింసకు దారి తీసింది. బీజేపీ, టీఎంసీ కార్యకర్తల ఘర్షణలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కూచ్ బెహార్, సీతాల్కుచిలో నియోజక వర్గంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. శనివారం కూచ్ బెహార్లో రెండు వేర్వేరు సంఘటనలలో ఐదుగురు మరణించినట్లు సమాచారం. మరో నలుగురు గాయపడ్డారు. ఈ హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మమతా బెనర్జీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఓటరును కాల్చి చంపి ఘటన చాలా దురదృష్టకరమంటూ విచారం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ సిలిగురిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ దీదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీదీ, టీఎంసీ ఉగ్రవాద వ్యూహాలు బెంగాల్లో చెల్లవని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న మద్దతు చూసి దీదీ ఆమె గూండాలకు వణికి పోతున్నారని వ్యాఖ్యానించారు. సిలిగురిలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రస్తుత ఎన్నికల్లో మమతా బెనర్జీని, ఆమె గుండా ముఠాను తిప్పి కొడతారంటూ మండిపడ్డారు. కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించడం, పోల్ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించడం టీఎంసీని కాపాడలేవంటూ దీదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూచ్ బెహార్ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరారు. బెంగాల్లో కొత్త ఏడాదిలో బీజేపీ నేతృత్వంలో బీజేపీ సర్కార్ కొలువు దీరనుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. మంచి చెడుపై విజయం సాధించబోతోందనీ, గత మూడు దశల పోలింగ్‌లో బీజేపీకి ప్రజలు భారీ మద్దతును అందించారని మోదీ పేర్కొన్నారు. (పీకే క్లబ్‌హౌస్ చాట్ కలకలం: దీదీకి ఓటమి తప్పదా?) నాలుగో విడత పోలింగ్ సందర్భంగా సీతాల్కుచిలో ఈ ఉదయం 18ఏళ్ల బీజేపీ కార్యకర్తను దుండగులు కాల్చి చంపిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. మరోవైపు కూచ్ బెహార్లో సీఆర్పీఎఫ్ బలగాలపై స్థానికులు దాడులు చేసేందుకు ప్రయత్నించగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల ఘటనపై ఈసీ అధికారులను వివరణ కోరింది. హుగ్లీలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ మహిళా ఎంపీ లాకెట్ చటర్జీ వాహనంపై తృణమూల్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో ఆమె కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆమె వ్యక్తిగత సిబ్బంది ఆమెను అక్కడినుంచి తప్పించారు. ఈ సందర్భంగా పలు మీడియా వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా మొత్తం 44 నియోజక వర్గాలకు నాలుగో దశపోలింగ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
ఇలాంటి సీఎంను జీవితంలో చూడలేదు
-
ఇలాంటి సీఎంను జీవితంలో చూడలేదు : అమిత్‌షా
సాక్షి న్యూఢిల్లీ : కేంద్ర బలగాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కోల్‌కతాలో శుక్రవారం మీడియాను ఉద్దేశించి షా మాట్లాడుతూ, ఓటమి భయం టీఎంసీని పీడిస్తోందని, ఈ ఫ్రస్ట్రేషన్లో వారి చర్యలు,వ్యాఖ్యలే దీనికి నిదర్శమని వ్యాఖ్యానించారు. పోల్ డ్యూటీలో సీఆర్పీఎఫ్ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదని, ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందనీ ఆయన పేర్కొన్నారు. ప్రజలను అరాచకం వైపు నెట్టివేస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. అసలు ఇలాంటి సీఎంను తన జీవితంలో చూడలేదంటూ హోంమంత్రి ఘాటుగా విమర్శించారు. (అది బీజేపీ సీఆర్పీఎఫ్) అటు మమత వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి నోటీసులు జారీ చేసింది. కేంద్ర బలగాలపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను వివరణ ఇవ్వాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మార్చి 28, ఏప్రిల్ 7న కేంద్ర భద్రతా దళాలను "ఘెరావ్" చేయమని ప్రజలకు చెబుతూ మమత అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై శనివారం ఉదయం 11 గంటల్లోగా స్పందించాలని పేర్కొంది. మమత వ్యాఖ్యలు, ఎన్నికల కోడ్‌తోపాటు చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని ఈసీ తెలిపింది. అయితే గత రెండు రోజుల్లో మమతకు ఈసీనుంచి నోటీసులు రావడం ఇది రెండవసారి. మరోవైపు ఈసీ పది నోటీసులిచ్చినా తన వైఖరి మారదని సీఎం మమతా తేల్చి చెప్పారు. మతాల ప్రాతిపదికన ఓటర్లను విడగొట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా తాను మాట్లాడుతూనే ఉంటానని దీదీ గురువారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఎనిమిది దశల ఎన్నికలలో భాగంగా నాలుగో రౌండ్లో శనివారం పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. -
బెంగాల్లో ఆడియో టేపుల కలకలం!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఒక ప్రముఖ చానెల్ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టింది. విచారణా సంస్థలకు సంబంధించిన వర్గాల నుంచి కొన్ని ఆడియో టేపులు సంపాదించినట్లు పేర్కొంది. ఈ టేపుల్లో సీఎం మమత మేనల్లుడు అభిషేక్ అక్రమంగా సొమ్ములు సేకరిస్తున్నట్లుంది. తొలి టేపులో కోల్ స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనూప్ మాంఝీ సహచరుడు గణేశ్ బగారియా మాటలున్నాయి. రాష్ట్రంలో అవినీతి రాకెట్ ఎలా విస్తరించింది గణేశ్ వివరించాడు. రెండో టేపులో మమత రాజకీయంగా ఎదుగుతుంటే, అభిషేక్ ఎలా కిందకు లాగుతున్నది మాట్లాడుకున్నారు. మూడో టేపులో దాదాపు రూ. 45 కోట్ల కట్‌మనీ అభిషేక్ వద్దకు ఎలా చేరిందో చర్చించుకున్నట్లుంది. 4వ టేపులో మమతా గుడ్డిగా అభిషేక్‌ను నమ్ముతున్నారని ఉంది. చివరిటేపులో ఎక్సైజ్ కమిషనర్‌ను అభిషేక్ మిత్రుడు వినయ్ మిశ్రా లంచం అడగడం, కోల్మైనర్లను అభిషేక్ లంచం అడిగిన అంశం ఉన్నాయి. బెంగాల్‌కే అవమానం! మమత మేనల్లుడిపై ఆరోపణలు గుప్పిస్తూ విడుదలైన ఆడియో టేపులపై బీజేపీ మండిపడింది. మమతా బెనర్జీ, ఆమె బంధువులు పశ్చిమబెంగాల్ ప్రజలకు తలవంపులు తెచ్చారని విమర్శించింది. ప్రజలను మోసం చేసినందుకు మమత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మమత ఇచ్చే రక్షణతో కొందరు చెలరేగిపోతున్నారని, బెంగాల్లో అవినీతి దందా నడుపుతున్నారని ఆరోపించింది. ఆడియో టేపుల వ్యవహారంపై టీఎంసీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మమత పాలనలో దోపిడీదారుల ధైర్యం ఇలాగుందని, ఒక సమావేశంలో అభిషేక్ బెనర్జీకి దగ్గరైన ఒక దోపిడీదారుడు కమిషనర్‌కు దగ్గరగా కూర్చుని అక్రమ డిమాండ్లు చేయడం ఎలాంటి సందేశమిస్తుందని బీజేపీ ప్రశ్నించింది. మమతకు తెలిసే రాష్ట్రంలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని ఆరోపించింది. -
బీజేపీ నియంతృత్వాన్ని ఎదిరిద్దాం
న్యూఢిల్లీ/నందిగ్రామ్: బీజేపీ, ఆ పార్టీ నేతృత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై, సమాఖ్య స్ఫూర్తిపై వరుస దాడులు చేస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. స్వాతంత్య్రం తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత దిగువకు దిగజారాయని పేర్కొన్నారు. బీజేపీ నియంతృత్వంపై కలసికట్టుగా పోరాడుదామని విపక్ష నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీల నేతలకు ఆమె రాసిన లేఖను బుధవారం టీఎంసీ విడుదల చేసింది. ‘ఈ లేఖను మీతో పాటు దేశంలోని బీజేపీయేతర పార్టీల నాయకులకు రాస్తున్నాను. ప్రజాస్వామ్యంపై, సమాఖ్య విధానంపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వం వరుస దాడులకు పాల్పడుతోంది. ఇది చాలా ఆందోళనకర అంశం. ఈ పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడాల్సిన, ఒక ప్రత్యామ్నాయ వేదికను ప్రజలకు అందించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సహా విపక్ష నాయకులకు రాసిన లేఖలో మమత పేర్కొన్నారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ)కి అపరిమిత అధికారం, ఢిల్లీ ప్రభుత్వమంటే ఎల్జీనే అని స్పష్టం చేసే చట్టంపై లేఖలో మమత మండిపడ్డారు. ‘ఆ చట్టంతో ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం అధికారాలను లాగేసుకుంది. ఆ అధికారాలను తన ప్రతినిధి అయిన ఎల్జీ చేతిలో పెట్టింది. ఎల్జీని అప్రకటిత ఢిల్లీ వైస్రాయ్గా మార్చింది’ అని మమత వివరించారు. ఢిల్లీలో 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ప్రజా తీర్పును బీజేపీ అంగీకరించడం లేదన్నారు. ఆ చట్టం భారతదేశ సమాఖ్య విధానంపై జరిపిన ప్రత్యక్ష దాడి అని ఆమె అభివర్ణించారు. సోనియాతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, బీజేడీ నాయకుడు నవీన్ పట్నాయక్, నేషనల్ కాన్ఫెరెన్స్‌కు చెందిన ఫారూఖ్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా, సీపీఐఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్యలకు మమత ఈ లేఖను పంపించారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని విమర్శించారు. తద్వారా ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల అమలును ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందన్నారు. రాష్ట్రాలు తమ డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకువచ్చే జాతీయ అభివృద్ధి మండలి, అంతర్రాష్ట్ర మండలి, ప్రణాళిక సంఘం... తదితర వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను మున్సిపాలిటీల స్థాయికి కుదించాలని, దేశంలో ఏకపార్టీ అధికార వ్యవస్థ కోసం కుట్ర పన్నుతోందని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. అక్రమ మార్గాల ద్వారా సేకరించిన నిధులను రాష్ట్రాల్లో విపక్ష పార్టీలను అధికారంలో నుంచి కూలదోయడానికి, బీజేపీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులని, వాటిని ప్రైవేటు పరం చేయాలన్న బీజేపీ ఆలోచన నిర్లక్ష్యపూరితమైందని విమర్శించారు. బీజేపీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసి రావాలని బీజేపీయేతర పార్టీల నాయకులను ఆమె కోరారు. కలిసికట్టుగా పోరాడితేనే విజయం సాధించగలమని, ఈ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ విషయంలో ఒక కార్యాచరణ రూపొందించే విషయమై చర్చిద్దామని ఆమె ప్రతిపాదించారు. మమత లేఖపై బీజేపీ స్పందించింది. మమత డిక్షనరీలో లేని పదమే ప్రజాస్వామ్యమని వ్యాఖ్యానించింది. మమత ప్రతిపాదనకు పీడీపీ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నుంచి మద్దతు లభించింది. కోట్లు కుమ్మరిస్తున్నారు ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ నేతలు కోట్ల రూపాయలను ఓటర్లకు పంచిపెడ్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఓటర్లను భయపెట్టేందుకు యూపీ, బిహార్ రాష్ట్రాల నుంచి గూండాలను దింపుతున్నారన్నారు. బీజేపీ నేతలు ఇదంతా బహిరంగంగా చేస్తోంటే.. ఈసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. నందిగ్రామ్‌లో తనపై దాడి చేసిన వారి వివరాలు తెలిశాయని, ఎన్నికల తరువాత ఆ విషయం చూస్తానని పేర్కొన్నారు. మరోవైపు, మమత బెనర్జీపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులను ఆమె బెదిరిస్తున్నారని ఆరోపించారు. -
బీజేపీ గూండాలను తరమండి
కోల్‌కతా/నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని, బయటి నుంచి గూండాలను దిగుమతి చేస్తోందని తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. గరిటెలు, అట్లకాడలు, వంట పాత్రలతో బీజేపీ గూండాలను తరిమికొట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని నారాయణగఢ్, పింగ్లాలో శనివారం ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. నందిగ్రామ్‌లో తనపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సువేందు అధికారిపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులు ద్రోహులని దుయ్యబట్టారు. సువేందు అధికారి కుటుంబ సభ్యుడొకరు శుక్రవారం రాత్రి ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయాడని అన్నారు. అతడిని మహిళలు పట్టుకొని పోలీసులకు అప్పగించారని చెప్పారు. బయటి నుంచి వచ్చిన మరో 30 మంది గూండాలను కూడా మహిళలు పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు. నందిగ్రామ్‌లో ద్రోహులపై కన్నేశా: అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. నందిగ్రామ్‌లో మీర్ జాఫర్లపై(ద్రోహులు) ఓ కన్నేసి ఉంచానని వ్యాఖ్యానించారు. సువేందు అధికారికి, అతడి సోదరులకు మంచి పదవులు కట్టబెట్టానని గుర్తుచేశారు. అయినప్పటికీ వారు తృణమూల్ కాంగ్రెస్‌ను దగా చేసి, బీజేపీలో చేరారని విమర్శించారు. డబ్బుకు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. బీజేపీ, తృణమూల్ కార్యకర్తల ఘర్షణ పూర్బ మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో శనివారం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ స్థానంలో ఏప్రిల్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ బయటి నుంచి తీసుకొచ్చిన రౌడీలు తమపై దాడి చేశారని మమతా బెనర్జీ ఎలక్షన్ ఏజెంట్ షేక్ సూఫియాన్ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ముగ్గురు గాయాలపాలయ్యారని అన్నారు. -
మీ అసహనం అర్థమైంది: మోదీ
సామాజిక మాధ్యమాలు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు దాదాపుగా ఒక గంట పనిచెయ్యకపోవడాన్ని పశ్చిమ బెంగాల్ అభివృద్ధితో పోలుస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. ఓటర్ల ఆశలకీ, నెటిజన్ల ఆందోళనలకీ ముడి పెడుతూ కామెంట్లు చేశారు. శుక్రవారం రాత్రి సోషల్ మీడియా 50–55 నిముషాలు ఆగిపోతేనే ప్రజలందరూ ఎంతో ఆందోళనకు లోనయ్యారని, అలాంటిది బెంగాల్లో అభివృద్ధి , ప్రజల కన్న కలలు 50–55 ఏళ్లు ఆగిపోతే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలు మార్పు కోసం ఎందుకంత అసహనంగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోగలనని చెప్పారు. ఈ సారి ఎన్నికలంటే ఎమ్మెల్యేలను, సీఎంను ఎన్నుకోవడం కాదు, పరివర్తన తీసుకురావడం, స్వర్ణ బెంగాల్ ఏర్పాటు కావడం, ఇందు కోసం బీజేపీకి ఓటు వెయ్యాలని అభ్యర్థించారు. అసోం టీ ఇమేజ్‌ని నాశనం చేసే వాళ్లకి మద్దతా? ఘుమఘుమలాడే అసోం టీ గుర్తింపుని నాశనం చేయాలనుకునే శక్తులకి కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే మద్దతు ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎగువ అసోంలోని చాబువాలో తేయాకు తోటల్లో పని చేసే కార్మికులతో సంభాషించిన మరుసటి రోజే అదే ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. రాష్ట్రంలోని అత్యంత పురాతన టీ పరిశ్రమకున్న గౌరవం, గుర్తింపుతో కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటోందని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో టూల్‌కిట్ సాయంతో అసోం టీ, భారతీయ యోగాని దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అలాంటి టూల్కిట్లు తయారు చేస్తున్న వారికి కాంగ్రెస్ మద్దతునిస్తోందని విమర్శించారు. తేయాకు తోటల్లో పని చేసే వారి కష్టాలు చాయ్ వాలా తప్ప మరెవరు అర్థం చేసుకుంటారని ప్రధాని అన్నారు. -
వీల్‌చైర్‌లోనే మమతా బెనర్జీ రోడ్‌షో
-
పిరికిపందలకు తలొగ్గేది లేదు: వీల్‌చైర్‌లోనే రోడ్‌షో
సాక్షి, కోలకతా: తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ (66) చెప్పినట్టుగానే వీల్ చెయిర్లో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆపేది లేదనీ వీల్ చైర్లోనే ప్రజలను కలుస్తానని ప్రకటించిన మమత ఆదివారం కోల్‌కతాలో భారీ రోడ్‌షోకు హాజరయ్యారు.నందిగ్రామ్‌లో ప్రచారం సందర్భంగా గాయపడిన మమతా నాలుగు రోజుల తరువాత, తొలి బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యి కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ధైర్యంగా పోరాటం కొనసాగిస్తామంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇంకా చాలా పెయిన్ ఉంది. కానీ ప్రజల బాధలు ఇంకా ఎక్కువగా భావిస్తున్నారు. తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో చాలా బాధలు పడ్డాం. ఇంకా పడతాం.. కానీ పిరికిపందలకు తలొగ్గేది లేదని దీదీ ప్రకటించారు. దాడి జరగలేదు : ఈసీ మరోవైపు సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగిందన్న వాదనను ఈసీ తోసిపుచ్చింది. ఆమె సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యంగా కారణంగానే ఆమె గాయపడ్డారని ఈసీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. -
భారీ అగ్నిప్రమాదం: తొమ్మిది మంది అధికారులు సజీవదహనం
-
భారీ అగ్ని ప్రమాదం: తొమ్మిది మంది అధికారులు దుర్మరణం
సాక్షి, కోల్‌కతా: కోల్‌కతాలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కోల్‌కతాలో తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈప్రమాదంలో తొమ్మిదిమంది అధికారులు అగ్నికి ఆహూతైపోయారు. వీరిలో ఒక పోలీసు ఉన్నతాధికారితో పాటు నలుగురు ఫైర్‌మేన్లు ఇద్దరు రైల్వే ఆఫీసర్లు, ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు. తొమ్మిది మృతదేహాలలో ఐదు మృతదేహాలను 12 వ అంతస్తులోని లిఫ్ట్‌లో కనుగొన్నారు. వారంతా లిఫ్ట్‌లోపల ఊపిరి ఆడక చనిపోయినట్టు తెలుస్తోంది. మరికొంతమంది కనిపించకుండా పోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన నెలకొంది. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరణించిన నలుగురు అగ్నిమాపక సిబ్బంది గిరీష్ డే, గౌరవ్ బెజ్, అనిరుద్ద జన, బీమన్ పుర్కాయత్‌గా గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతులకు సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అటు ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారుత్వరగా కోలుకోవాలంటూ ప్రధానిమోదీ ట్విట్ చేశారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు కేంద్రమంత్రి ఆదేశించారు. Saddened by the loss of lives due to the fire tragedy in Kolkata. In this hour of sadness, my thoughts are with the bereaved families. May the injured recover at the earliest. — Narendra Modi (@narendramodi) March 9, 2021 -
దీదీకి మరో షాక్.. ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో తృణమూల్ నేతలు వరుస పెట్టి కాషాయ కండువా కప్పుకుంటున్న విషయం విధితమే. తాజాగా సోమవారం ఐదుగురు తృణమూల్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఎమ్మెల్యేలు సోనాలి గుహ, సీతల్ సర్దార్, దీపేందు బిశ్వాస్, రవీంద్రనాథ్ భట్టాచార్య, జతు లహిరిలు కమల దళంలో చేరి దీదీకి గట్టి షాకిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు హబీబ్పూర్ అభ్యర్థి సరళా ముర్ము కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. పోటీపడి మరీ టికెట్ తెచ్చుకున్న అభ్యర్ధులు కూడా పార్టీని వీడుతుండంతో దీదీకి పాలుపోవడం లేదు. పార్టీ ఫిరాయించిన నేతలంతా రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్, అగ్ర నేతలు సువేందు అధికారి, ముకుల్ రాయ్‌ల సమక్షంలో బీజేపీలో చేరారు. ఎన్నికలకు ముందు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కాషాయ పార్టీలో చేరడంతో తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. గతవారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ల సమక్షంలో మాజీ కేంద్ర రైల్వే మంత్రి, టీఎంసీ నేత దినేష్ త్రివేది బీజేపీలో చేరగా, ఇటీవల కోబ్రా మిథున్ చక్రవర్తి కూడా కమలదళంలో చేరారు. కాగా, 291 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య ఎనిమిది విడతల్లో పోలింగ్ జరగనుంది. -
టీఎంసీలో చేరిన టీమిండియా ఆటగాడు
కోల్కత్తా : టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. తన స్వరాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో బుధవారం హుబ్లీలో నిర్వహించిన ర్యాలీ పాల్గొని టీఎంసీ గూటికి చేరాడు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో మనోజ్ రాజకీయ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గతకొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేంద్రంలోని మోదీ సర్కార్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రో ధరలను పెంచుతోందంటూ విమర్శలు కురిపించాడు. అంతేకాకుండా సామన్యుడి నడ్డివిరిచేలా పెరుగుతున్న ధరల్లో పెట్రోల్, డీజిల్ భారీ భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. కాగా బెంగాల్లో రాజకీయ కాక తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోరు ఉత్కంఠగా మారింది. అధికార టీఎంసీ నేతల్ని టార్గెట్‌గా చేసుకున్న బీజేపీ.. విజయమే లక్ష్యంగా దూసుకుడుగా వ్యవరిస్తోంది. మరోవైపు బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేలా మమత పావులు కదుపుతున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తుల్ని తనవైపుకు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులకు టికెట్లు కేటాయించి పార్లెమెంట్‌కు పంపిన విషయం తెలిసిందే. తాజాగా మనోజ్ తివారీని సైతం తన గూటికి చేర్చుకున్నారు. కాగా 35 ఏళ్ల మనోజ్ తివారీ టీమిండియా తరుఫున వన్డే, టీ-20లకు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో సొంత జట్టు కోల్కత్త తరఫున సుదీర్ఘంగా ఆడాడు. కొన్నాళ్ల పాటు పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రాష్ట్ర స్థాయిలో బెంగాల్ క్రికెట్‌కు సారథిగా వ్యవహరించాడు. 2008లో ఫిబ్రవరి 3న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అరంగేట్రం చేసిన తివారీ.. 12 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తరువాత ఫామ్ కోల్పోవడంతో జట్టుకి దూరమయ్యాడు. ఐపీఎల్లో రాణించినప్పటికీ జట్టులో మరోసారి చోటుదక్కలేదు. ఈ క్రమంలోనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నకావడంతో రాజకీయ రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే టీఎంసీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తారా లేక అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. -
కీలక సర్వే: దీదీ హ్యాట్రికా.. కమల వికాసమా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకిత్తిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. మరో రెండు నెలల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు గల బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్-వామపక్షాలతో కూడిన కూటమి పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గడిచిన రెండేళ్ల వరకు రాష్ట్రంలో ఏమాత్రం ఉనికి కూడా లేని బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేసి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సవాలు విసిరింది. ఎవరూ ఊహించిన విధంగా 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పటికే రెండుసార్లు సీఎంగా విజయం సాధించిన ముచ్చటగా మూడోసారి ఆశపడుతున్న మమతకు చెక్ పెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. ఉత్కంఠ పోరులో విజయం ఎవరిది.. ఇప్పటికే టీఎంసీకి చెందిన అనేకమంది కీలక నేతలను తనవైపుకు తిప్పుకుని ఎన్నికలకు ముందే పైచేయి సాధించింది. జంగల్‌మహాల్, నందిగ్రాం వంటి కీలకమైన ప్రాంతాల్లో పట్టున్న సువేందు అధికారి బీజేపీలో చేరడం మమతకు భారీ ఎదురుదెబ్బ లాంటిదే. ఆయనతో పాటు కెబినేట్ మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దీదీకి హ్యాండ్ ఇచ్చి కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారు. అయితే నేతలు పోతేనేం తమకు ప్రజా మద్దతు ఉందంటూ మమత ధీమా వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల కాలంలో ప్రవేశపెట్టినే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమను మరోసారి గెలిపిస్తామని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ సైతం విజయంపై సంచలన ప్రకటనలే చేస్తోంది. ఈ ఎన్నికల్లో టీఎంసీని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని, బెంగాల్ కోటపై కాషాయజెండా ఎగరేసి తీరుతామని కమళనాథులు స్పష్టం చేస్తున్నారు. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బెంగాల్ ఎన్నికలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రచారాన్ని ముగించారు. దేశ వ్యాప్తంగా బెంగాల్ ఎన్నికలపై పెద్ద చర్చేసాగుతోంది. ఉత్కంఠంగా సాగుతున్న పోరులో ఎవరు విజయం సాధిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. మమత హ్యాట్రిక్.. ఈ క్రమంలోనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ఓ సంస్థ నిర్వహించిన సర్వే ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. హోరాహోరీగా సాగిన పోరులో అధికార తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విజయం సాధిస్తుందని సీఎన్ఎక్స్, ఏబీపీ ఆనంద (ప్రైవేటు సంస్థలు) నిర్వహించిన పబ్లిక్ ఒపినియన్ సర్వేలు తెలిపాయి. టీఎంసీ 146 నుంచి 156 స్థానాల్లో విజయం సాధించి మమత మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని పేర్కొన్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ 113-121 సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పాయి. మేజిక్ ఫిగర్ 148 సీట్లు కాగా... కాంగ్రెస్-వామపక్షాల నేతృత్వంలోని కూటమికి 20-28 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేల్చాయి. అయితే మెజార్టీ సంఖ్యకు మమత కొంత దూరంలో నిలిచిపోతే లెఫ్ట్ కూటమి మద్దతుతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. కాగా బెంగాల్ వ్యాప్తంగా జనవరి 23 నుంచి ఫిబ్రవరి 7 వరకు 8,960 మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ సర్వేను వెల్లడించినట్లు సీఎన్ఎక్స్ నిర్వహకులు తెలిపారు. జయలలిత బాటలో మమత.. సీన్ రిపీటవుతుందా -
బీజేపీలోకి యంగ్ హీరో..!
కోల్కత్తా : బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. కాంగ్రెస్-వామపక్షాలు కూటమిగా ఏర్పడినప్పటికీ పోటీఅంతా అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండనుంది. వరుస రెండు ఎన్నికల్లో తిరుగలేని ఆధిపత్యం ప్రదర్శించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. మరోవైపు గత లోక్‌సభ ఎన్నికల్లో 18 ఎంపీ స్థానాలను గెలుచుకుని బుల్లెట్ వేగంతో దూసుకువచ్చిన కాషాయదళం తొలిసారి బెంగాల్ కోటపై జెండాఎగరేయాలని కలలు కంటుందో. పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తూ తిరుగులేని శక్తిగా ఎదిగిన దీదీకి ఇక చెక్‌పెట్టాలని భావిస్తోంది. దీనికి తగట్టుగానే వ్యూహరచన చేస్తోంది. దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున టీఎంసీ నుంచి కీలక నేతల్ని బీజేపీలో చేర్చుకుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల ప్రజలను ఆకర్శించే విధంగా ప్రముఖులపై గాలం వేస్తోంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ (బెంగాల్ చిత్రపరిశ్రమ) యంగ్ హీరో యాష్ దాస్‌గుప్తాను పార్టీలోకి ఆహ్వానించింది. బీజేపీ పిలుపుమేరకు గురు, శుక్రవారాలలో చేరే అవకాశం ఉన్నట్లు ఆయన సమీప వ్యక్తుల ద్వారా తెలుస్తోంది. కాగా 2016లో విడుదలైన గ్యాంగ్‌స్టర్ చిత్రంతో యాష్ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తరువాత పలు హిట్ చిత్రాల్లో నటింటి ఆయనకంటూ చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. టీఎంసీ ఎంపీ, నటి మిమి చక్రవర్తి, దాస్‌గుప్తా మధ్య ప్రేమాయణం నడిచినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున రూమర్లు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఆమె టీఎంసీలో చేరిన అనంతరం ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీలో చేరికపై దాస్‌గుప్తా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. జయలలిత బాటలో దీదీ: విజయం వరిస్తుందా? -
జయలలిత బాటలో దీదీ: విజయం వరిస్తుందా?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత దేశ రాజకీయాల్లో సెంటిమెంట్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కొందరు ప్రజాబలాన్ని నమ్మితే.. మరికొందరు సెంటిమెంట్‌నే నమ్ముతున్నారు. తొలిసారి విజయానికి దోహదం చేసిన అంశాలను గుర్తుపెట్టుకుని ప్రతిసారి అదే పంథాను ఎంచుకుంటారు. విజయం కోసం ఒక్కోసారి ఇతర నేతలు పాటించిన వ్యూహాలు, ఎత్తుగడలను సైతం అనురిస్తున్నారు. ఓటర్లు కరుణించినా.. అదృష్టం కలిసిరాకపోతే అధికారం అందదని భావించే నేతలు కూడా చాలామందే ఉన్నారు. ఎన్నికల సమీపిస్తున్నాయి అంటే చాలు ప్రచారానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. తమకు కలిసివచ్చే అంశాలకు సైతం అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సెంటిమెంటే ప్రధానంగా వినిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి బెంగాల్ కోటపై జెండా పాతాలని భావిస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఏ ఒక్క అవకాశాన్నీ వదలడంలేదు. విపక్షాల ఎత్తుకు పైఎత్తులు వేసేందుకు ప్రశాంత్ కిషోర్ రూపంలో వ్యూహకర్త ఉన్నప్పటికీ తన సొంత ఆలోచనలకు సైతం పదునుపెడుతున్నారు. గతంలో ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు ఎన్నికల్లో గెలిచిన నేతల వ్యూహాలను అమలు చేయాలని భావిస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనుసరించిన పథకాలను రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అమ్మా క్యాంటిన్స్‌ను బెంగాల్లోనూ ప్రారంభించారు. మా క్యాంటిన్ పేరుతో కేవలం రూ.5కే భోజన సదుపాయాన్ని బెంగాలీలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని కోసం 100 కోట్ల రూపాయాలను కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కాగా తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్న సయమంలో 2013లో అమ్మా క్యాంటిన్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే అమ్మా క్యాంటిన్ ఏర్పాటు అనంతరం జరిగిన 2016 ఎన్నికల్లో జయలలిత వరుసగా రెండోసారి విజయం సాధించి చరిత్రను తిరగరాశారు. 1980 తరువాత ఒకేపార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో అదే తొలిసారి. అయితే జయలలిత ప్రవేశపెట్టిన పథకాల్లో అమ్మా క్యాంటిన్ అత్యంత ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో జయ వ్యూహాన్నే తానూ అమలు చేసి రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని దీదీ కలలు కంటున్నారు. దీనిలో భాగంగానే ఎన్నికలకు రెండు నెలల ముందు మా క్యాంటిన్‌ను లాంఛ్ చేశారు. దీని ద్వారా నగరాల్లో ఉపాధి పొందుతున్న పేద, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి లబ్ధి పొందనున్నారు. కాగా జయలలిత అనంతరం దేశ వ్యాప్తంగా అనేక మంది ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే కర్ణాటలోలో సిద్ధరామయ్య ఇందిర క్యాంటిన్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటిన్ ప్రవేశపెట్టినప్పటికీ ఓటమిని చవిచూశారు. 2017లో జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రూ.5కే భోజనం హామీ ఇచ్చినప్పటికీ దారుణంగా ఓటమి పాలయ్యారు. అయితే తెలంగాణలో మాత్రం ఈ ఫార్మాలాతో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. తాజాగా మమత కూడా జయ దారినే ఎంచుకున్నారు. తమిళనాడులో మాదిరీగా విజయం సాధిస్తారా లేక ఇతర నేతల్లా ఒటమిని చవిచూస్తారా అనేది చూడాలి. బీజేపీ సవాల్: వ్యూహాలకు ప్రశాంత్ పదును -
బీజేపీ సవాల్: వ్యూహాలకు ప్రశాంత్ పదును
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రానున్న మూడు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించి బెంగాల్లో తిరుగులేని నాయకురాలిగా ఎదిగిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈ ఎన్నికలు అసలైన సవాలు విసురుతున్నాయి. మరోవైపు కేంద్రంలో బలమైన ప్రభుత్వం, నాయకత్వం కలిగిన అధికార బీజేపీ బెంగాల్ కోటాపై కాషాయ జెండా ఎగరేయాలని పట్టుదలతో ఉంది. దీనిలో భాగాంగానే ఏడాది ముందు నుంచే ఎన్నికల రణరంగంలోకి దిగింది. వ్యూహచతురత, ప్రత్యర్థిని దెబ్బతీయడంలో దిట్టగా పేరొందిన మమతను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని భావించిన కాషాయదళం.. దీదీకి ధీటుగా వ్యూహాలను అమలు చేస్తోంది. మమతకు ఎదరుదెబ్బ.. టీఎంసీలో బలమైన నేతలుగా ఉన్న సీనియర్లును తమవైపు తిప్పుకుని.. అసెంబ్లీ ఎన్నికల నాటికి పైచేయి సాధించింది. జంగల్‌మహాల్, నందిగ్రాం ఆదివాసీ ప్రాంతాల్లో పట్టుకలిగిన సుమేందు అధికారిని బీజేపీలో చేర్చుకోవడం ద్వారా మమతను మానసికంగా, రాజకీయంగా కమలదళం దెబ్బతీయగలికింది. అంతేకాకుండా దీదీ మంత్రివర్గంలో కీలకమైన శాఖలను నిర్వరిస్తున్న కేబినెట్ మంత్రులు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకోవడం టీఎంసీలో పెను కల్లోలాన్ని సృష్టిస్తోంది. గత లోక్‌సభల ఎన్నికల ముందు వరకు కనీస ప్రభావం లేని కాషాయదళం.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తన మార్కును స్పష్టంగా చూపించింది. ఎవరూ ఊహించిన రీతిలో ఏకంగా 18 ఎంపీ స్థానాలను గెలుచుకుని రాజకీయవేత్తలను సైతం ఆశ్చర్యంలో ముంచింది. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే విజయమంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. వ్యూహాలపైనే రాజకీయ భవిష్యత్ ఈ క్రమంలోనే సుదీర్ఘ రాజకీయ అనుభవం, బలమైన పార్టీ పునాదులు కలిగిన మమతా బెనర్జీ అనుసరించే వ్యూహాలు ఆమె రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్-వామపక్షాలతో కూడిన కూటమి ఓవైపు.. తుఫానులా ముంచుకువస్తున్న బీజేపీ మరోవైపు దీదీకి సవాలు విసురుతున్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీ నుంచి ప్రమాదం పొంచి ఉందని, వ్యూహాలకు మరింత పదును పెట్టకపోతే తీవ్ర నష్టం చేకూరే అవకాశం ఉందని ఆమె రాజకీయ సలహాదారులు ఇప్పటికే పసిగట్టారు. ఇప్పటికే పార్టీ సీనియర్లు వరుసపెట్టి రాజీనామా చేస్తుండటంతో.. మరోవైపు టీఎంసీకి మొన్నటి వరకు మద్దతుగా ఉన్న ఎస్సీ,ఎస్టీ, ఆదివాసీ ఓటర్లు క్రమంగా దూరమవ్వడం మమతను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, ఐపాక్ చీఫ్ ప్రశాంత్ కిశోర్‌పై మమత బోలెడు ఆశలు పెట్టుకున్నారు. టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్.. మమతను ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించాలని పాచికలు వేస్తున్నారు. వ్యక్తిగతంలో బీజేపీ వ్యతిరేక వైఖరి కలిగిన ఆయన.. బెంగాల్లో కాషాయ పార్టీని కట్టడి చేసేందుకు విలువైన సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి చవిచూసిన ప్రాంతాలపై దృష్టి సారించారు. జంగల్‌మహాల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ ప్రాంతాల్లో గత ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా దెబ్బతింది. బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. మరోవైపు సువేందు అధికారి ప్రాతినిథ్యం వహిస్తున్న నందిగ్రాంతో పాటు జంగల్‌మహాల్ ఏరియాల్లో కూడా ఆయన అనుచరులకు మంచి పట్టుంది. మమత విజయం కోసం ప్రశాంత్ శ్రమ ఈ నియోజవర్గల్లో ఈసారి టీఎంసీని గెలిపించే బాధ్యతను ఈసారి ప్రశాంత్‌కు అప్పగించారు దీదీ. దీంతో రంగంలోకి దిగిన ఆయన ఆయా నియోజకవర్గల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార కార్యక్రమాలను సైతం ఆయనే చూసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఆశావహులతో పాటు జిల్లా స్థాయి నేతలను నేరుగా మమత దగ్గరకు తీసుపోతూ.. పార్టీని పటిష్ట స్థితికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా ప్రచార వ్యవహారాలకు సైతం నిపుణులను సిద్ధం చేశారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో మమత విజయం కోసం ప్రశాంత్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీజేపీ దూకుడు ముందు మమత ఏ విధంగా నిలుస్తారు అనేది ఎన్నికల అనంతరం తెలియనుంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 209 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 27, కాంగ్రెస్ 23, సీపీఎం 19 స్థానాల్లో విజయం సాధించాయి. -
సీఎం అభ్యర్థిపై ప్రకటన.. బీజేపీలో కలకలం
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగరేయాలని కలలు కంటున్న బీజేపీకి ఆ పార్టీలోని నేతల మధ్య విభేదాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ఉన్న పాత లీడర్లతో పాటు అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున కాషాయతీర్థం పుచ్చుకున్న నేతల మధ్య సమన్వయం కొరవడింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తకుండా పార్టీ పెద్దలు చర్యలు చేపడుతున్నప్పటికీ ఏదో ఓమూలన అసంతృప్తి జ్వాలలు ఎసిపడుతూనే ఉన్నాయి. టీఎంసీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న మమతా బెనర్జీతో సరితూగే నేత బెంగాల్ బీజేపీలో లేకపోవడం ఆ పార్టీకి సమస్యగా మారింది. మరోవైపు ఎన్నికలకు నాలుగు నెలలు మాత్రమే ఉన్నా.. సీఎం అభ్యర్థిపై ఎటూ తేల్చుకోలేపోవడం స్థానిక నేతల్ని అయోమయానికి గురిచేస్తోంది. (బీజేపీ వ్యూహం.. మమతకు చెక్) తామంటే తామే సీఎం అభ్యర్థి అంటూ ఎవరికి వారే అనుచరుల వద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు సౌమిత్రా ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ బాంబు పేల్చారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనే సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని, ఆయన అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైందని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన ప్రకటనపై దిలీప్ అనుచరవర్గం సంబరాలు చేసుకోగా.. ఆయన వ్యతిరేక వర్గంతో పాటు ఇటీవల టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన నేతలంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సౌమిత్రా వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు సైతం గుర్రుగా ఉన్నారు. సీఎం అభ్యర్థిపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పక్కా బెంగాలీ వ్యక్తే సీఎంగా ఉంటారని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. పార్టీలో చర్చించకుండా బహిరంగ సభల్లో ఇలాంటి ప్రకటనలు చేయడం సరైనది కాదని సౌమిత్రాను సముదాయించారు. (ఆపరేషన్ బెంగాల్.. దీదీకి ఓటమి తప్పదా?) మరోవైపు టీఎంసీ సైతం మరింత దూకుడు పెంచింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై అనేక ప్రకటనలు చేస్తున్న అమిత్ షా.. ముందుగా బీజేపీ అభ్యర్థి ఎవరో తేల్చాలని ఆ పార్టీ నేతలు సవాలు విసురుతున్నారు. మమతా బెనర్జీకి సరితూగే నేత బీజేపీలో లేరని ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాకుండా బెంగాల్లో బీజేపీకి అధికారం అప్పగిస్తే ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తికి సీఎం బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాగా 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
బీజేపీ వ్యూహం.. మమతకు చెక్
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయంగా ఎంతో రసవత్తరంగా మారిన పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును దాదాపు పూర్తిచేసింది. ఈ ఏడాది మే 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సీబీఎస్ఈ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికలను అనుకున్న సమయాని కంటే ముందే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేగాక బెంగాల్ పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలు, కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికలు 8 దశల్లో జరిగే అవకాశాలున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం మే 30 తేదీతో ముగియనుంది. 2018లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినప్పటికీ హింస అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ప్రత్యర్థులపై రాళ్లు విసరడం వంటివి తరుచూ జరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మద్దతుదారులు రాళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు కూడా ఈసారి ఎన్నికల్లో భారీ హింస జరుగుతుందని అంచనా వేస్తున్నాయి. హింసకు తోడు, ఈసారి కరోనా మహమ్మారి ప్రభావం వల్ల కోవిడ్–19 ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికలను ఎనిమిది దశల్లో నిర్వహించే అవకాశం ఉంది. అదనపు పోలింగ్ బూత్‌లు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం సుమారు 28 వేల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాల్లోని పరిస్థితులపై ఎన్నికల సంఘం స్థానిక అధికారుల నుంచి నివేదిక తీసుకోనుంది. గతేడాది జరిగిన బిహార్ శాసనసభ ఎన్నికల సందర్భంగా కోవిడ్–19 ప్రోటోకాల్స్ అమలు చేశారు. ఓటర్ల మధ్య భౌతిక దూరం కొనసాగించడానికి పశ్చిమ బెంగాల్లోనూ అదనపు పోలింగ్ బూత్‌ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో హింసను కట్టడి చేసేందుకు కేంద్ర పోలీసు బలగాలను వెంటనే మోహరించాలని, వీలైనంత త్వరగా ఎన్నికల కోడ్‌ను అమల్లోకి తేవాలని గత డిసెంబర్లో బీజేపీ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కోరిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్! అంతకుముందు పశ్చిమ బెంగాల్లో 2016 అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 4న ప్రారంభమయ్యాయి. అప్పుడు మే 19 తేదీ వరకు ఏడు దశల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి లెక్కింపు వరకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి 45 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టింది. ఈసారి సీబీఎస్ఈ పరీక్షలు మే 4 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ మార్చి నెల రెండో వారం నుంచి ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఫిబ్రవరిలోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సైతం ప్రకటించవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరి 15న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోనుందని భావిస్తున్నారు. -
ఆపరేషన్ బెంగాల్.. దీదీకి ఓటమి తప్పదా?
సాక్షి ,న్యూఢిల్లీ : బెంగాల్ దంగల్‌లో దీదీని ఓడించడమే లక్ష్యంగా కమలదళం ఓ వైపు వ్యూహాలు రచిస్తుంటే, బిహార్ తరహాలో బెంగాల్లో బోణీ కొట్టేందుకు ముస్లిం ఓట్లను ఏకం చేసే పనిలో ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్–ఇ–ఇత్తెహద్– ఉల్–ముస్లిమీన్) అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారు. ఈ ఏడాది జరుగబోయే ఎన్నికల్లో దూకుడుగానే వ్యవహరించాలని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పార్టీ కీలక నేతలు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకొనే పనిలో బిజీగా ఉన్నారు. అందులోభాగంగానే టీఎంసీలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారి సహా ఇతర నేతలు కాషాయ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అధికారి బీజేపీలో చేరడంతో అతని కుటుంబ ప్రభావం కనీసం 60 నుంచి 65 నియోజకవర్గాల్లో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాల్లో టార్గెట్ 200గా బీజేపీ నిర్ణయించుకుంది. బిహార్ ఎన్నికల్లో ఒవైసీ పార్టీ ఐదు సీట్లు గెలుచుకున్నప్పుడు, ఎంఐఎం బీజేపీ బి–టీం అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఎంఐఎం కారణంగా బీజేపీకి మాత్రమే ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు అదిర్ రంజన్ చౌదరి అనేకసార్లు బాహాటంగా విమర్శించారు. ఇప్పుడు ఈ ఏడాది ఏప్రిల్–మే నెలల్లో జరుగబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుందనే ప్రకటన తర్వాత దాదాపు పది సంవత్సరాలు మైనారిటీ ఓటు బ్యాంకు మద్దతుతో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ పార్టీలో అలజడి మొదలైంది. బిహార్ ఎన్నికల ఫలితాల తరువాత, బీజేపీని ఓడించేందుకు ముందస్తు ఎన్నికల కూటమి ద్వారా మమతా బెనర్జీకి ఒవైసీ స్నేహ హస్తం అందించేందుకు చేసిన ప్రయత్నం కాస్తా టీఎంసీ తిరస్కరణతో ఆగిపోయింది. అయితే, బీజేపీ నుంచి డబ్బులు తీసుకొని ఒవైసీ బెంగాల్లో అడుగు పెట్టారని మమతా బెనర్జీ ఆరోపించిన విషయం తెలిసిందే. 2006 నాటికి బెంగాల్‌లోని ముస్లిం ఓటు బ్యాంకును లెఫ్ట్ ఫ్రంట్ పూర్తిగా ఆక్రమించింది. కానీ ఆ తరువాత మైనార్టీలు క్రమంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారు. దీంతో 2011, 2016 ఎన్నికల్లో మైనార్టీ ఓటు బ్యాంకు కారణంగా మమత అధికారంలోకి వచ్చారు. రానున్న ఎన్నికల్లో.. హిందుత్వ ఎజెండాతో బెంగాల్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న బీజేపీ సవాళ్లు ఒకవైపు.. కొత్తగా బెంగాల్ ఎన్నికల రాజకీయాల్లోకి ఒవైసీ సైతం మరోవైపు అడుగుపెడుతుండటంతో మమతా బెనర్జీకి కొత్త తలనొప్పి మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 31 శాతం ముస్లిం ఓటర్లు పశ్చిమ బెంగాల్లో ముస్లింలు అక్కడి జనాభాలో 31% ఉండగా, వారు 110 సీట్లలో ప్రభావవంతగా ఉన్నారు. దీంతో బిహార్ ఎన్నికల్లో 5 సీట్లు గెలిచిన విధంగా ఇప్పుడు బెంగాల్ ఎన్నికల్లో తన ముద్ర వేసేందుకు ఒవైసీ సిద్ధమయ్యారు. ఆదివారం çపశ్చిమబెంగాల్ పర్యటనకు వెళ్ళిన ఒవైసీ హుబ్లీలో, సింగూర్ – నందిగ్రామ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఫుర్ఫురా షరీఫ్ దర్గాకు చెందిన పిర్జాదా అబ్బాస్ సిద్దిఖీతో రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ఈ మధ్య కాలంలో అధికార పార్టీపై విమర్శలు చేస్తున్న అబ్బాసుద్దీన్ సిద్దిఖీ నాయకత్వం లో ఎంఐఎం ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఓవైసీ భేటీ తర్వాత మీడియాకు తెలిపారు. ఎన్నికల్లో ఎంఐఎం ఏవిధంగా పోటీ చేస్తుందనే విషయాన్ని సిద్దిఖీ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. దీంతో ముస్లిం ఓటు బ్యాంకు ఎన్నికల్లో గేమ్‌ఛేంజర్‌గా మారనుంది. తృణమూల్‌కు కష్టాలు తప్పవా ఒవైసీ కారణంగా బీజేపీ తన పూర్తి ప్రయోజనాన్ని పొందే అవకాశాలున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా బెంగాల్లో బీజేపీ ప్రయత్నిస్తున్న హిందూ ఓటు సంఘటితమైతే, తృణమూల్ కాంగ్రెస్‌కు సమస్యలు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముస్లిం జనాభా మాల్డాలో 51%, ముర్షిదాబాద్‌లో 66%, నాడియాలో 30%, బిర్భూమ్లో 40%, పురులియాలో 30%, తూర్పు– పశ్చిమ మిడ్నాపూర్‌లో 15% ఉంది. అటువంటి పరిస్థితిలో దూకుడుగా దూసుకెళ్ళేందుకు సిద్ధమైన బీజేపీ ప్రయత్నాలు విజయవంతమైతే హిందూ ఓట్లు ఏకీకృతం అవుతాయని, ముస్లిం ఓట్ల కారణంగా మిగతా సీట్లలో పార్టీల మధ్య ఓట్ల విభజన జరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బెంగాల్ రాజకీయాల్లో ఒవైసీకి స్థానం లేదు’ పశ్చిమ బెంగాల్లో 2011 నుంచి అధికారంలో ఉన్న మమతా మైనారిటీలకు నిరంతరం సహాయపడేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారు. మైనారిటీల మదర్సాలకు ప్రభుత్వ సహాయం, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, మౌల్వీలకు ఆర్థిక సహాయం వంటి పథకాలను మమత ప్రారంభించారు. ఇçప్పుడు ఎంఐఎం ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవ్వడంతో సమీకరణాలు మారే అవకాశం ఉందని రాష్ట్ర ముస్లిం నాయకులు భావిస్తున్నారు. అయితే, బెంగాల్ రాజకీయాల్లో ఒవైసీకి స్థానం లేదని టీఎంసీ ప్రభుత్వ మంత్రి, బెంగాల్‌కు చెందిన ప్రముఖ ముస్లిం సంస్థ జమియత్ ఉలామా ఎ హింద్ నాయకుడు సిద్దికుల్లా చౌదరి అన్నారు. ఎంఐఎం ముస్లింలలో విభజనను సృష్టించేందుకు చేస్తున్న వ్యూహం పనిచేయదని సిద్ధికుల్లా తెలిపారు. -
మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ
కోల్‌కతా : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మమతా బెనర్జీకి ఎదురుదెబ్బల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా పశ్చిమ బెంగాల్ యువజన సేవలు, క్రీడా శాఖ సహాయ మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మమత ప్రభుత్వం నుంచి ఇప్పటికి ముగ్గురు మంత్రులు రాజీనామా చేసినట్లయింది. మాజీ క్రికెటర్, బెంగాల్ రంజీ టీమ్ మాజీ కెప్టెనైన శుక్లా తాను రాజకీయాల నుంచి రిటైర్ కాదలచినట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను సీఎం మమతకు, గవర్నర్ జగ్దీప్కు పంపారు. హౌరా(నార్త్) నుంచి ఎంఎల్ఏగా ఎన్నికైన శుక్లా తన ఎంఎల్ఏ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. మంత్రి పదవికి రాజీనామా చేసిన లక్ష్మీరతన్ శుక్లాను తమతో చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. టీఎంసీ కుప్పకూలుతోందని, పార్టీపై మమతకు నియంత్రణ లేదని కాంగ్రెస్ విమర్శించింది. తమ పార్టీలో ఎవరు చేరాలనుకున్నా తలుపులు తెరిచేఉంటాయని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చెప్పారు. టీఎంసీ పతనం ఇంతటితో ఆగదని బీజేపీ ప్రతినిధి సమిక్ దుయ్యబట్టారు -
దాదా భేటీపై రాజకీయ దుమారం
కోల్కత్తా : మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్లో రాజకీయం మరింత వేడెక్కింది. రాజకీయ పార్టీల నేతల వరుస పర్యటనలతో కోల్కత్తా వీధుల్లో కోలాహాలం నెలకొంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం బెంగాల్లో పర్యటించి.. తొలి విడత ప్రచారాన్ని సైతం ముగించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు బీజేపీ సైతం ఈ ఎన్నికలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ఇరు పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అనుహ్య ఫలితాలను రాబట్టి.. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి షాకిచ్చిన కమలదళం అసెంబ్లీపై గురిపెట్టింది. టీఎంసీ కీలక నేతలకు గాలం వేస్తూ వ్యూహత్మకంగా వ్యవరిస్తోంది. మరోవైపు పార్టీలకు అతీతంగా ఓటర్లను ఆకర్శించే నాయకులు, వ్యక్తులపై దృష్టి కేంద్రీకరించింది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతూ ఒక్కొక్కరి మద్దతు కూడగడుతోంది. ఇక ఈ క్రమంలోనే టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు, బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. బెంగాల్ గవర్నర్ జగదీప్ దన్‌కర్‌తో ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో సమావేశం కావడంతో కలకలం రేపుతోంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ గవర్నర్‌తో దాదా భేటీ కావడంపై దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చసాగుతోంది. గంగూలీ రాజకీయ రంగ ప్రవేశంపై ఇది వరకే పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుఫున బెంగాల్ అసెంబ్లీకి దాదా పోటీ చేస్తారని, అతన్ని సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సైతం సాగింది. ఒకవేళ గంగూలీ బరిలో నిలవకపోతే అతని భార్యను పోటీలో నిలపుతారని వార్తలు సైతం వినిపించాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీని ఎంపిక చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ తరుణంలోనే గవర్నర్‌తో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాష్ట్రంలోని రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించారని వార్తలు రావడంతో ట్విటర్ వేదికగా గవర్నర్ స్పందించారు. తమ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని చెప్పారు. ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్ మైదానాన్ని సందర్శించాల్సిందిగా గంగూలీ కోరినట్లు గవర్నర్ వివరించారు. దాదా కోరిక మేరకు త్వరలోనే ఈడెన్‌ను సందర్శిస్తానని పేర్కొన్నారు. గవర్నర్ వివరణతో ‘బెంగాల్ టైగర్’ రాజకీయ రంగ ప్రవేశం వార్తలకు తాత్కాలికంగా పులిస్టాప్ పడింది. -
మాటల యుద్ధం.. ఆ దమ్ముందా: ప్రశాంత్
కోల్కత్తా : మరో ఆరు నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయ వేడి ఇప్పటి నుంచే మొదలైంది. తృణమూల్ కాంగ్రెస్ కోటను కూల్చిందుకు బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే బరిలోకి దిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మొదలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. వరుస ర్యాలీలతో తృణమూల్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎదుర్కొనేందుకు కమళదళమంతా బెంగాల్‌పై దృష్టిసారించగా.. దీదీ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మమతకు అండగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు. బీజేపీ నేతలను టార్గెట్‌గా చేసుకుని సవాలు విసురుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. అమిత్ షా ప్రచారం చేస్తున్నట్లు 200 సీట్లు సాధిస్తే తాను నిర్వర్తిస్తున్న విధుల నుంచి శాశ్వతంగా వైదులుతానని స్పష్టం చేశారు. (అమిత్ షా ఎత్తుగడ.. మమతకు మద్దతు!) ప్రశాంత్ సవాల్ అనంతరం బీజేపీ నేతలు ఎంట్రీ ఇవ్వడంతో ఇరు పక్షాల మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం ప్రారంభమైంది. ప్రశాంత్ కిషోర్ ట్వీట్‌కు స్పందించిన బీజేపీ నేత కైలాష్ విజయ వర్గీయ.. దేశం త్వరలోనే ఓ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సేవలను కోల్పోనుందని కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సృష్టించబోయే సునామీలో ఆ పార్టీ నేతలంతా కొట్టుకుపోడడం ఖాయమన్నారు. దీనికి బందులుగా స్పందించిన ప్రశాంత్.. 100 సీట్లు సాధించకపోతే మీరు (బీజేపీ నేతలు) అనుభవిస్తున్న పదవుల నుంచి తప్పుకునే దమ్ముందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీల్లో తృణమూల్ విజయమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎవరి ఊహలకు అందని విధంగా రంగ ప్రవేశం చేసిన అమిత్ షా... మమతకు అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారితో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుని దీదీ, ప్రశాంత్‌లకు గట్టి షాకే ఇచ్చారు. అనంతరం అప్రమత్తమైన మమత, పార్టీ నేతల్ని, ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. -
మమత మాత్రమే మిగులుతారు!
మిడ్నాపూర్: రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో ఎవరూ మిగలరని, కేవలం మమతా బెనర్జీ మాత్రమే పార్టీ్టలో ఉంటారని బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. శనివారం బెంగాల్లో ఆయన టీఎంసీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంసీ సీనియర్ నేత సువేందు అధికారి సహా పలు పార్టీల నేతలు బీజేపీలో చేరారు. టీఎంసీ నినాదమైన ‘‘మా, మాటి, మనుష్(తల్లి, జన్మభూమి, ప్రజ) కాస్తా ‘‘దోపిడీ, అవినీతి, బంధుప్రీతి’’గా మారిపోయిందని అమిత్ షా దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 200 పైగా సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలు మార్పు కోసం బీజేపీ వెనుక నడిస్తే మమతకు ఏమి సమస్యని ఆయన ప్రశ్నించారు. బంధుప్రీతి, బుజ్జగింపులే కారణం ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరడానికి టీఎంసీ అనుసరిస్తున్న బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలే కారణమని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీ నుంచి పలువురు నేతలు సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీలో మోదీ నాయకత్వంలో పనిచేయడానికి చేరారని చెప్పారు. టీఎంసీలో చీలికలను బీజేపీ ప్రోత్సహిస్తోందన్న విమర్శలపై స్పందిస్తూ 1998లో టీఎంసీ ఏర్పడిందే కాంగ్రెస్ నుంచి చీలిపోయాయని గుర్తు చేశారు. టీఎంసీ నుంచి నేతలు వీడడం ఆరంభమేనని, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఎంసీని వీడుతున్నారన్నారు. ఇదే విధంగా వలసల జోరు కొనసాగితే ఎన్నికల నాటికి టీఎంసీలో మమత మాత్రమే మిగులుతారన్నారు. 9 మంది ఎంఎల్ఏలు, ఒక ఎంపీ అధికార టీఎంసీకి చెందిన కీలక నేత సువేందు అధికారి సహా వివిధ పార్టీలకు చెందిన 9 మంది ఎంఎల్ఏలు, ఒక టీఎంసీ ఎంపీ అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇటీవలే టీఎంసీకి సువేందు రాజీనామా చేశారు. బర్ధమాన్ పుర్బాకు చెందిన ఎంపీ సునీల్ మండల్, టీఎంసీ ఎంఎల్ఏలు బన్సారీ మైటీ, శిలభద్ర దత్తా, బిస్వజిత్ కుందు, సుక్రా ముండా, సైకత్ పంజా, సీపీఎం నుంచి టీఎంసీలో చేరిన ఎంఎల్ఏ దిలీప్ బిస్వాస్, సీపీఎంకే చెందిన మరో ఎంఎల్ఏ తపసి మండల్, సీపీఐ ఎంఎల్ఏ అశోక్దిండా, కాంగ్రెస్ ఎంఎల్ఏ సుదీప్ ముఖర్జీ బీజేపీలో చేరారు. మాజీ ఎంపీ దశరధ్ టిర్కీ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు టీఎంసీ, లెఫ్ట్, పలువురు కాంగ్రెస్ జిల్లాస్థాయి నేతలు బీజేపీలో చేరారు. రైతు ఇంట భోజనం... పశ్చిమబెంగాల్లో పర్యటిస్తున్న హోంమత్రి అమిత్‌షా శనివారం ఒక రైతు ఇంట మధ్యాహ్న భోజనం చేశారు. బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని బలిజ్హరిలో నివాసముండే సనాతన్ సింగ్ నివాసానికి వెళ్లిన అమిత్‌షా అక్కడే నేలపై కూర్చొని భోజనం చేశారు. ఆయనతోపాటు బీజేపీ నేతలు కైలాస్ విజయ్వర్ఘీయ్, ముకుల్‌రాయ్, దిలీప్ ఘోష్ భోజనాలు చేశారు. అంతకుముందు స్థానిక ఆలయంలో అమిత్ పూజలు నిర్వహించారు. తన ఇంట్లో హోంమంత్రి విందారగించడంపై సనాతన్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. కేవలం పప్పు, రోటీలను మాత్రమే భోజనంలో ఇవ్వగలిగానన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు కదం తొక్కుతున్న వేళ రైతు ఇంట విందుకు అమిత్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చేఎన్నికల్లో రైతులను ఆకట్టుకునే వ్యూహంలో ఇది ఒక భాగమని భావిస్తున్నారు. ఎవరీ సువేందు? మమతా బెనర్జీ ప్రస్తుత ప్రభుత్వంలో సువేందు అధికారి రవాణా, నీటిపారుదల–జల వనరుల మంత్రిగా పనిచేశారు. నవంబర్ 27 న ఆయన మంత్రి పదవికి, డిసెంబర్ 16న ఎమ్మెల్యే పదవికిడిసెంబర్ 17న టీఎంసీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ తరువాత సువేందు అధికారికి జనాదరణ ఎక్కువగా ఉందంటారు. 2007నందిగ్రామ్ ఉద్యమంలో అధికారి కీలక పాత్ర పోషించారు. అనంతరం ‘జంగల్ మహల్’గా పేరుతెచ్చుకున్న పశ్చిమ మిడ్నాపూర్, పురూలియా, బంకురా జిల్లాల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. రెండు మార్లు లోక్‌సభ ఎంపీగా కూడా ఆయన ఎన్నికయ్యారు. వెస్ట్ మిడ్నాపూర్, బంకురా, పురులియా, ఝూర్గ్రామ్, బీర్భూమిలోని కొన్ని ప్రాంతాలతో కలిపి మొత్తం 60 నుంచి 65 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారి కుటుంబ ప్రభావం ఉంటుందని విశ్లేషకుల అంచనా. అతనే కారణమా? ఇటీవల తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగానే సీనియర్ నాయకులు పార్టీని వీడుతున్నారని బయటకు వినిపిస్తున్నా, అసలు కారణం వేరే ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలోని ఇతర సీనియర్ నాయకులకన్నా ప్రాధాన్యం పెరగడం, అభిషేక్‌ను తన వారసునిగా మమత సిద్ధం చేయడమే సువేందు అధికారి సహా అనేకమంది సీనియర్ల అసంతృప్తికి అసలు కారణమంటున్నారు. -
కేంద్రంతో మమత ఢీ
కోల్‌కతా: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటన కేంద్రం, పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య విభేదాలకు మరోసారి ఆజ్యం పోసింది. నడ్డా కాన్వాయ్‌పై అధికార టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ ధన్కర్ కేంద్రానికి నివేదిక పంపారు. ఈ నివేదిక అందుకున్న హోం శాఖ..రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఈ నెల 14వ తేదీన స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీలకు శుక్రవారం సమన్లు జారీ చేసింది. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మొదట్నుంచీ తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్న మమతా బెనర్జీ ప్రభుత్వం.. ఈ నోటీసులకు స్పందించరాదని నిర్ణయించింది. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ శుక్రవారం హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఈ మేరకు ఒక లేఖ రాశారు. శాంతిభద్రతలతోపాటు, జెడ్– కేటగిరీకి చెందిన కొందరిపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుని చర్చించేందుకు 14వ తేదీన సమావేశం ఏర్పాటు చేసినందున వివరణ ఇచ్చేందుకు ఢిల్లీకి రాలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ విధంగా ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు మాత్రమే లోబడి నడుచుకుంటానని పరోక్షంగా కేంద్రానికి తెలిపారు. డైమండ్ హార్బర్లో గురువారం జేపీ నడ్డా కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన రాళ్లదాడిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్గీయ, ఆయన వాహన డ్రైవ ర్కు గాయాలు కాగా, వారి వాహన అద్దాలు ధ్వంసమైన విషయం తెలిసిందే. నిప్పుతో చెలగాటం వద్దు.. బెంగాల్ గవర్నర్ ధన్కర్ మరోసారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రంగా మండిపడ్డారు. నిప్పుతో చెలగాటం వద్దంటూ హెచ్చరించారు. నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనపై కేంద్రానికి నివేదిక పంపినట్లు వెల్లడించారు. దాడి ఘటనపై సీఎం స్పందించిన తీరు చూస్తే రాజ్యాంగం పట్ల ఆమెకు ఏమాత్రం విశ్వాసం ఉందో తెలుస్తుం దన్నారు. కోల్‌కతాలో గురువారం జరిగిన ర్యాలీలో మ మత..నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనను బీజేపీ ఆడుతున్న నాటకంగా పేర్కొంటూ, నడ్డా పేరు ను పలు మార్లు వ్యంగ్యంగా ఉచ్చరించారు. ఈ విషయమై గవర్నర్ స్పందిస్తూ.. బెంగాలీ సంస్కృతి పట్ల గౌరవం ఉన్న వారెవరూ ఆమె మాదిరిగా మాట్లాడరని దుయ్యబట్టారు. -
ఎమ్మెల్యే హత్య.. వివాదంలో బీజేపీ కీలక నేత
కోల్కత్తా : తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ హత్య కేసులో బీజేపీ కీలక నేత, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌రాయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా సీఐడీ దాఖలు చేసిన అభియోపత్రాల్లో అతని పేరును చేర్చింది. సత్యజిత్ హత్య కేసులో ముకుల్ పాత్ర ఉన్నట్లు ఆనుమానిస్తున్నామని, దీనిపై మరింత లోతుగా విచారించాల్సి ఉందని పేర్కొంది. ఇతనితో పాటు మరికొందరు బీజేపీ స్థానిక నేతల పేర్లుకూడా సీఐడీ నమోదు చేయడం బెంగాల్లో కలకలం రేపింది. ఈ విషయంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర దుమారం చెలరేగుతోంది. టీఎంసీ ఎమ్మెల్యే హత్య కేసులో తనను తన పేరును ప్రస్తావించడాన్ని ముకుల్ తీవ్రంగా ఖండించారు. (హిందువులు చర్చికెళ్తే ఖబడ్దార్..) రాజకీయంగా కక్షసారింపులో భాగంగానే ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు తనపై అక్రమంగా 41 కేసులు నమోదు చేశారని, తానేంటో బెంగాల్ ప్రజలకు తెలుసిన స్పష్టం చేశారు. టీఎంసీలో ఉన్న వరకు తనపై ఎలాంటి కేసులు లేవని, బీజేపీలో చేరిన అనంతరమే ఇన్ని కేసులు బనాయించారని మండిపడ్డారు. కాగా ఇదే కేసులో బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ పేరును కూడా సీఐడీ నమోదు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరిలో సర్వసతి పూజ సందర్భంగా టీఎంసీ ఎమ్మెల్యే సత్యజిత్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బీజేపీ నేతల హస్తం ఉందని మమత తొలినుంచీ ఆరోపిస్తున్నారు. (10 లక్షల లంచం: బీజేపీ కౌన్సిలర్ సస్పెండ్) -
మమత సర్కార్‌పై గవర్నర్ విమర్శలు
కోల్కత్తా : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయకపోవడంపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైద్య అధికారులపై ఒత్తిడి చేశారని విమర్శించారు. కోవిడ్ నియంత్రకు దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ మూడోదశ ప్రయోగాన్ని బుధవారం ఐసీఎంఆర్ వద్ద గవర్నర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తృణమూల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అమలులో ఉన్న రాష్ట్రాల్లో వైద్య పరంగా వృద్ధిని సాధించామని, దురదృష్టవశాత్తు బెంగాల్ దీనిలో భాగస్వామ్యం కాలేకపోయిందని అన్నారు. వైద్య పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని, ఆరోగ్యమంత్రిత్వ శాఖలో చోటుచేసుకున్న అవినీతిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. రూ. 2,000 కోట్ల విలువైన నిధులు దారిమళ్లాయని ఆరోపించారు. గవర్నర్ వ్యాఖ్యలను మంత్రి ఫిర్హాద్ హకీమ్ తీవ్రంగా ఖండించారు. గవర్నర్ హోదాలో ఉండి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అవకతవకలపై దర్యాప్తు కోసం ఆగస్టులో ముఖ్యమంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 2019 జూలైలో బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధంఖర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. -
ఇంకెన్ని సార్లు అవమానిస్తారు..
కోల్కత్తా : రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న కేంద్రహోంమంత్రి అమిత్ షా అధికార పార్టీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. బెంగాలీ సంస్కృతిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాతాలానికి తొక్కేస్తున్నారని, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం రెండో రోజు పర్యటనలో భాగంగా అమిత్ షా బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్, స్వామీ వివేకానంద, రామకృష్ణ పరమహంస వంటి గొప్పగొప్ప మేధావులు జన్మించిన గడ్డ బెంగాల్ అని కొనియాడారు. సీఎం మమత బెంగాల్ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, బెంగాల్ వీరుల ఆశయాలకు వ్యతిరేకంగా పాలిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఘాటుగా స్పందించింది. బెంగాల్ సంస్కృతీ, సంప్రదాయాల గురించి ఇతరుల చేత చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని కౌంటరిచ్చింది. ఆ పార్టీ ఎంపీ నుస్రత్ జహాన్ సైతం ట్విటర్ వేదికగా అమిత్ షాకు బదులిచ్చారు. రాజకీయల లబ్ధి కోసం ఎన్నిసార్లు బెంగాల్ ప్రజల మనోభావాలను అవమానపరుస్తారని నిలదీశారు. తమ సంస్కృతిని అపహాస్యం చేసేలా ప్రచారం చేయడం సరికాదని హెచ్చరించారు. ఈశ్వర్ చంద్రవిద్యాసాగర్, బీర్సాముండాల చరిత్ర గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. మమత నాయకత్వంలోని బెంగాల్ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని స్పష్టం చేశారు. -
అమిత్ షా పర్యటన.. టార్గెట్ బెంగాల్
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్ రాజకీయం వేడెక్కుతుంది. త్వరలోనే అసెంభ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆలోగా పార్టీకి బలం చేకూర్చడాని ఇప్పటి నుంచే బీజేపీ ప్రయత్నాలు మొదలుపెటింది. దీనిలో భాగంగానే పార్టీ ముఖ్య నేతలు బెంగాల్లో పర్యటిస్తున్నారు. 2021 ఏఫిల్-మే మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్లో పర్యటించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. వాస్తవాని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా రావల్సి ఉండగా దాన్ని ఆపి మరీ అమిత్ షా పర్యటన ఖరారు చేశారు. లాక్ డౌన్ తర్వాత షా బెంగాల్ రావడం ఇదే తొలిసారి. చివరగా ఈ ఏడాది మార్చి 1న బెంగాలో పర్యటించారు. రాష్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని గవర్నర్ జగధీశ్ ధన్కర్ మమత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నఈ సమయంలో అమిత్ షా పర్యటించడం చర్చనీయాంశం అయింది. రాబోయే ఎన్నికలకు కార్యకర్తల్లో ఉత్సాహం నింపి, గెలుపుకు వ్యూహ రచన చేస్తూ ఎన్నికలు వచ్చే లోగా పార్టీని సంసిద్ధం చేయాలని షా భావిస్తున్నారు. వివిధ ప్రాంతాలల్లో పర్యటించే సందర్భంలో షా కార్యకర్తల ఇంట్లో భోజనం చేస్తుంటారు. ఈ పర్యటనలో కూడా గురువారం గిరిజన బీజేపీ కార్యకర్త ఇంట్లో భోజనం చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గియా, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, రాష్ట్ర పార్టీ చీఫ్ దిలీప్ ఘోష్‌లు షాతో పాటు పాల్గోన్నారు. బిభీషన్ ఇంట్లో నేలమీద కూర్చుని అరటి ఆకులో బెగాలీ సాంప్రదాయ శాఖాహార వంటకాలను హారగించారు. అమిత్ షా అన్నం, రోటీ, పప్పు,పొట్లకాయ వేపుడు, గసగసాలతో వండిన బంగాళదుంప, అప్పడాలతో భోజనం చేశారు. రసగుల్లా, మిష్తీ దోయ్ వంటి స్వీట్స ఉన్నప్పటికీ బీజేపీ నాయకులు వీటిని తినలేకపొయారు. భోజనం అనంతరం అమిత్ షా బిబీషన్ కుటుంబ సభ్యలతో, స్థానిక ప్రజతో కూలంకుశంగా చర్చించారు. అంతకు ముందు బిబీషన్ ఇంటికి చేరుకోడాకి అమిత్ షా బుడద దారి గుండా రావాల్సి వచ్చింది. షా కు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. శంఖం ఉదుతూ, టపాకాయలు పేల్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం అమిత్ షా పచ్చిమ బెంగాల్ వచ్చారు. గురువారం ఉదయం పార్టీ స్థితిగతులు తెలుసుకోడానికి బంకురా చేరుకునన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని సంస్థాగత సమావేశాలు నిర్వహించి, వివిధ వర్గాల, సామాజిక సమూహ ప్రతినిధులను కలుసుకోని మాట్లాడారు. కొన్ని దశాబ్ధాలు బెంగాల్లో ఎలాంటి గుర్తింపు లేని బీజేపీ, తృనమూల్ కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారింది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 42 లోక్‌సభ సీట్లలో 18 సీట్లను బీజేపీ గెలుచుకుంది. దశాబ్ధా కాలం నుంచి అధికారంలో ఉన్న మమత బెనర్జీని గద్దె దించాలని బీజేపీ వ్యూహ రచన చేస్తుంది. గిరిజనులు, వెనుకబడిన వర్గాల వారు అధికంగా ఉన్న బంకురా , 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బలం చేకూర్చిన అనేక జిల్లాల్లో ఒకటి. ఇక్కడి నుంచి రెండు లోక్‌సభ స్థానాలను దక్కించుకుంది. -
సరళ సుందర సునిశిత మమత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సాహిత్యం, చిత్రకళ, సంగీతం మీద అపారమైన ప్రేమ. స్వయంగా కవిత్వం రాస్తారు, చిత్రాలు గీస్తారు. 1995లో ఉపలబ్ధి శీర్షికన తొలి కవితా సంపుటి వెలువరించారు. మరో సంపుటి నదీమా బెంగాలీ కవితాలోకంలో ప్రఖ్యాతి చెందింది. ఈ ఏడాదే ఆమె బృహత్ కవితాసంపుటి కబితా బితాన్ వెలువడింది. మమతా బెనర్జీ కవిత్వంలోని ఎంపిక చేసిన కవితలను ‘సరళ సుందర సునిశిత మమత’ పేరుతో వంగభాష నుంచి నేరుగా తెలుగులోకి అనువదించారు డాక్టర్ సామాన్య. ప్రచురించింది పాలపిట్ట బుక్స్. తన అనువాదం గురించి సామాన్య ఇలా చెబుతున్నారు. ‘‘చైనా తత్వవేత్త జువాంగ్జి తనకు మంత్రిపదవి ఇస్తున్నామని చెప్పడానికి వచ్చిన రాజప్రతినిధులతో ఎంతో తృణీకారంగా ఇలా అంటాడు: ‘‘తాబేలుకు బురదలో ఉండటమే ఆనందం. చచ్చి, డిప్పగా మారి పూజా మందిరంలో ధూపదీప నైవేద్యాలు పొందడం కాదు. నేను తాబేలు లాంటివాడిని, నా బురదలో నన్నుండనివ్వండి’’ అని. దీదీ తాత్వికత కూడా అచ్చంగా అదే. ఇక్కడ అనువాదంలో రాలేదు కానీ, ఆమె రాసిన కుర్చీ అనే కవిత అణువణువూ అధికారం పట్ల ఆమెకున్న నిర్లిప్త, నిరాసక్త ధోరణిని తెలియపరుస్తుంది. ఆ తాత్వికత అంత ఉచ్ఛస్థాయిలో మరింకెవరిలోనూ నాకు కనిపించలేదు. అందుకని ఈ సుధీర మమత అంటే నాకు ఎంతో ప్రేమ. ఇక్కడ అనువదించిన దీదీ కవితలు ఆమె అనేక రచనల నుండి ఏరి కూర్చినవి. ఈ కొన్ని కవితల కోసం దీదీ ఎన్నో కవితలు చదివాను. కవితల అనువాదం పేరుతో ఆమె అంతరంగపు అణువణువులోకి ప్రయాణం చేశాను. అమ్మ కోసం ఇంకా వెదుక్కునే చిన్ని బాలికగా దీదీ ఒక చోట తటస్థ పడితే, మరో చోట ఆమె ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని ప్రశ్నించే మానవీయ. ఇంకోచోట దుఃఖం సముద్రంలా ముంచేస్తున్నా ముఖంపై కనిపించనీయకు అని బార్గబోధ చేసే సీనియర్ స్నేహిత. మేఘాలు, పావురాలు, గుంపునుండి తప్పిపోయిన కాకిపిల్ల, ఒంటరిగా వాహనంలో వెళ్లే శవం... ఇవన్నీ సూటిగా ఆమె సున్నిత హృదయంలోకి ప్రయాణం చేసి ఆమెను కదలించినపుడు రాలిన ఆనంద బాష్పాలు, దుఃఖాశ్రువులే ఆమె అనేక కవితలు. దీదీ నాలాగా, మా అమ్మలాగ, నా మంచి స్నేహితురాలిలాగా ఒక సాదాసీదా అమ్మాయి. అదే సమయంలో ఆమె ఏడేడు సముద్రాల అవతల మఱిచెట్టు తొర్రలో వున్న రాక్షసుడి ప్రాణపు చిలుకని పట్టి బంధించగల సరళ సుందర సుధీర. మరి ఆమెను ప్రేమించకుండా ఉండగలగటం ఎవరికయినా ఎలాసాధ్యం! అలా పీకల్లోతు ప్రేమలో మునిగి, మురిసి చేసిన అనువాదాలు ఈ కవితలు.’’ పుస్తకం: సరళ సుందర సునిశిత మమత మమతా బెనర్జీ బెంగాలీ కవితల అనువాదం తెలుగు: డాక్టర్ సామాన్య ప్రచురణ : పాలపిట్ట బుక్స్ ఫోన్: 9848787284 -
అమిత్ షా వర్సెస్ టీఎంసీ
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం అన్యాయమని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ మేరకు బెంగాల్ సీఎం మమతకు లేఖ రాశారు. ‘వేరే ప్రాంతాల్లో చిక్కుకున్న కూలీలను సొంతూళ్లకు తీసుకువచ్చేందుకు కేంద్రం రైళ్లను ఏర్పాటు చేసింది. కానీ, బెంగాల్ ప్రభుత్వం మాకు సహకరించడం లేదు. ఆ రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. దీంతో కార్మికులు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై అధికార టీఎంసీ నేత, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అయిన అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ‘లాక్డౌన్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన హోం మంత్రి.. బెంగాల్ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ఆయన.. చాలా వారాల మౌనం తర్వాత గొంతు విప్పారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. షా తన ఆరోపణలను రుజువు చేయాలి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి’ అని ట్విట్టర్లో డిమాండ్ చేశారు. కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, తెలంగాణల్లో ఉన్న రాష్ట్రానికి చెందిన వలస కూలీల తరలింపునకు ఇప్పటికే 8 రైళ్లను ఏర్పాటు చేశామనీ, ఇందులో మొదటిది త్వరలోనే హైదరాబాద్ నుంచి మాల్దాకు చేరుకోనుందని తెలిపారు. రాష్ట్రంలోకి వలస కార్మికులను రానివ్వడంలేదంటూ ఆరోపిస్తున్న అమిత్ షా..మహారాష్ట్రలో 16 మంది కూలీల మరణానికి రైల్వే మంత్రిని బాధ్యుణ్ని చేస్తారా అని టీఎంసీ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ ప్రశ్నించారు. -
కూతురికి కరోనా పేరు పెట్టిన ఎంపీ!
కోలకతా: కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం పోరాడుతోంది. అగ్రరాజ్యంతో సహా అన్ని దేశాలను ఒక చిన్న కరోనా వైరస్ వణికిస్తోంది. పోరాటం అంటే ఏంటో తెలిసేలా చేస్తోంది. చేతులు కడుక్కునే సంప్రదాయాన్ని, శుభ్రంగా ఉండే అలవాట్లను కూడా మరో వైపు ప్రపంచానికి తెలియజేస్తోంది. దీంతో చాలా మంది వారికి పుట్టిన నవ శిశువులకు కరోనా, కోవిడ్, లాక్డౌన్ అంటూ వివిధ రకాల పేర్లు పెడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి తృణమూల్ కాంగ్రెస్ ఆరమ్ బాగ్ ఎంపీ అపరూప పొద్దార్ కూడా చేరారు. కరోనా లాక్డౌన్ కాలంలోనే అపరూప ఒక పాపకి జన్మనిచ్చారు. అయితే కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం పోరాడుతోన్న ఈ క్లిష్ట సమయంలో తమ కూతురు జన్మించిందని అందుకే తనకి కరోనా అని ముద్దుపేరు పెట్టినట్లు అపరూప దంపతులు తెలిపారు. అయితే బెంగాలో నూతనంగా జన్మించిన శిశువుకు రెండు పేర్లు పెట్టే సంప్రదాయం ఉంది. ఒకటి తల్లిదండ్రులు తమకి నచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. రెండవది మాత్రం ఆ ఇంటి పెద్ద నిర్ణయిస్తారు. అయితే తమ పాపకి అధికారిక పేరును మాత్రం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెడతారని అపరూప తెలిపారు. ఇలా కరోనాకి సంబంధించిన పేర్లు తమ పిల్లలకి పెట్టడం ఇది మొదటిసారి ఏం కాదు. ఇది వరకే మధ్యప్రదేశ్‌లో ఒక జంట తమ కుమారుడికి లాక్డౌన్ అని పేరు పెట్టగా, ఉత్తరప్రదేశ్‌లో ఒక శిశువు శానిటైజర్ అని పేరు పెట్టారు. (దీదీ పంతం : కేంద్రం ఘాటు లేఖ) -
దీదీ పంతం : కేంద్రం ఘాటు లేఖ
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి మధ్య కరోనా కాలంలోనూ కోల్డ్ వార్ సాగుతోంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య విషయంలో ఇప్పటికే ఇరు ప్రభుత్వాలు మాటల యుద్ధానికి దిగగా.. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై కేంద్రం ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సరిహద్దు దేశం బంగ్లాదేశ్ నుంచి సరుకు రవాణకు కేంద్రం ఇటీవల అనుమతినిచ్చింది. అయితే దీనికి స్థానిక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విముకత వ్యక్తం చేసింది. తమ రాష్ట్రం నుంచి వాహనాలను పోనిచ్చేది లేదంటూ మమత తేల్చి చెప్పారు. దీంతో గత మూడు రోజులుగా సరుకు రవాణా నిలిచిపోయింది. (మద్యం ఇక హోం డెలివరీ..!) ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాహనాలు అడ్డుకోవడం సరైనది కాదని తెలిపారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌తో పాటు నేపాల్, భూటాన్ దేశాల నుంచి వచ్చే సరుకు వాహనాలకు అనుమతించాలని కోరారు. కాగా కరోనా కేసులపై ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులిటెన్‌లోని కేసుల సంఖ్యకు, కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్న సంఖ్యకు పొంతన లేదంటూ ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరణాల రేటు ఎక్కువగా ఉండటాన్ని బట్టి, రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నట్లు అర్థమవుతోందని అన్నారు. (31 మందికి పోలీసులకు కరోనా పాజిటివ్) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మందు బాబుల బారులు.. 30 శాతం ధరల పెంపు
కోల్కత్తా : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆంక్షల నుంచి మద్యం షాపులకు వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. దీంతో వైన్‌షాపుల ముందు మందుబాబులు బారులు తీరుతున్నారు. దాదాపు 45 రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మద్యం రేట్లను విపరీతంగా పెంచుతున్నాయి. తాజాగా మద్యం ధరలపై పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం ధరలను ఏకంగా 30శాతం పెంచుతూ మమత సర్కార్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వచ్చేలా జీవో జారీ చేసింది. షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు రేట్లు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. (మద్యం ధరలు మార్గదర్శకాలు) మద్యం ధరలపై బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేయాలని పలు రాష్ట్రాలు సైతం భావిస్తున్నాయి. కాగా ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించడం కోసం మద్యం దుకాణాలకు కేంద్రం షరతులతో కూడిన అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇక మద్యం షాపులు తెరవడంతో ఛత్తీస్గడ్, బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాల్లో కిలోమీటర్ల పొడవునా మద్యం ప్రియులు బారులు తీరారు. ఇక ఏపీలోనూ మద్యం ధరలు పెరిగాయి. మద్యం ధరలను 25% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు సర్‌ఛార్జి కింద ఈ ధరలను పెంచనున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచి దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. (వైన్‌షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర) -
పంజాబ్‌లో లాక్డౌన్ పొడిగింపు
చండీగఢ్/కోల్‌కతా: మే 3 తర్వాత లాక్ డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ బుధవారం ప్రకటించారు. ఇందులో కొంత మేర సడలింపులు ఉన్నప్పటికీ, రెడ్ జోన్లలో సడలింపులు ఉండబోవన్నారు. మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ వారిని వెనక్కు తీసుకొస్తామని, అయితే వారు 21 రోజుల లాక్ డౌన్ లో ఉండాల్సిందేనని చెప్పారు. కరోనాను అదుపులో ఉంచేందుకు మే చివరి వరకూ లాక్ డౌన్ విధించక తప్పదని, ఈ విషయాన్ని పలువురు నిపుణులు, వైద్యులు చెబుతున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. -
పలువురు నేతలకు ప్రధాని ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులతో ఫోన్లో మాట్లాడారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తలెత్తిన పరిస్థితులపై వారితో చర్చించారు. ఆదివారం ప్రధాని మోదీ.. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్‌ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవెగౌడలతో కూడా ఫోన్లో సంభాషించారు. ఇంకా.. సమాజ్‌వాదీ పార్టీ అగ్ర నేతలు అఖిలేశ్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్‌తోనూ మాట్లాడారు. పార్లమెంట్లో వివిధ పక్షాల నేతలతో ప్రధాని మోదీ ఈనెల 8వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
రాజ్యసభకు ప్రశాంత్ కిషోర్..!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆయన పెద్దల సభకు ఎన్నికవుతారనే ఊహాగానాలు ఢిల్లీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి ప్రశాంత్ కిషోర్‌ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలో టీఎంసీకి చెందిన నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అయితే బెంగాల్ అసెంబ్లీలో బలం ఆధారంగా ఆ నాలుగు స్థానాలకు తిరిగి టీఎంసీ కైవసం చేసుకోనుంది. (మరో పార్టీతో జట్టుకట్టిన ప్రశాంత్ కిషోర్) ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ నాయకత్వాన్ని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన నేతలను రాజ్యసభకు పంపాలని మమత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేకులుగా ప్రత్యేక గుర్తింపు సాధించిన ప్రశాంత్ కిషోర్ పెద్దల సభకు నామినేట్ చేయాలని దీదీ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద చట్టాలపై ప్రశాంత్ కిషోర్ బహిరంగానే విమర్శలకు దిగుతోన్న విషయం తెలిసిందే. దీని కారణంగానే జేడీయూ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. ఈ పరిణామాలన్నీ మమతకు అనుకూలంగా ఉండటంతో.. టీఎంసీ తరఫున పీకేను రాజ్యసభకు పంపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత కల్పించనుందని సమాచారం. (ఎన్నికల నగారా... షెడ్యూల్ విడుదల) కాగా ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే మమతకు రాజకీయ సలహాదారుడిగా సేవలందించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. రానున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయమే ధ్వేయంగా పీకే సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. దీంతో పీకేను పెద్దల సభకు పంపితే పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందని దీదీ భావిస్తున్నారు. మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ప్రశాంత్ రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తి నెలకొంది. ఈ వార్తలపై ఇరువురి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం. కాగా మార్చి 26న రాజ్యసభకు ఎన్నికలు నిర్వహించనున్నారు. (రాజ్యసభ బరిలో మాజీ ఎంపీ కవిత..!) -
మోత బరువుకు తాళం
కోల్కత్తా : చదివేది ఎల్కేజీ, యూకేజీ అయినా కేజీల కొద్దీ పుస్తకాలను మోయలేక చిన్నారులు పడే అవస్థలు వర్ణనాతీతం. ఈ మోత బరువుకు లేత వయసులోనే వారి నడుములు దెబ్బతింటున్నాయి. అనేక శారీరక సమస్యలకూ దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో లాకర్ సౌకర్యం కల్పించనుంది. దీంతో పిల్లలకు మోత బరువు నుంచి కాస్తయినా ఉపశమనం కలగనుంది. పశ్చిమబెంగాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు బండెడు బరువుతో కూడిన పుస్తకాల సంచులను మోసే రోజులు త్వరలో కనుమరుగవనున్నాయి. సర్కారు బడుల్లో పుస్తకాల కోసం లాకర్ సౌకర్యం కల్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమే దీనికి కారణం. దీనికోసం పాఠశాల ప్రాంగణాల్లో ప్రభుత్వం స్థలం కేటాయించనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ గురువారం వెల్లడించారు. ‘ఈ లాకర్లు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు సంచుల భారం నుంచి విముక్తి కలుగుతుంది. తమ పుస్తకాలు, ఇతర సామగ్రిని రోజూ వారు ఇంటికి తీసుకెళ్లి మళ్లీ మోసుకొచ్చే అవసరం ఉండదు. అవసరమైన పుస్తకాలను ఇంటికి తీసుకెళితే సరిపోతుంది’అని పార్థ చెప్పారు. నర్సరీ నుంచి పదో తరగతి పాఠశాలలకు ఈ వెసులుబాటు కల్పిస్తామన్నారు. అయితే ఎయిడెడ్ పాఠశాలలకు ఇది వర్తించబోదన్నారు. నిధుల కొరతే ఇందుకు కారణమన్నారు. నగరంలోని హిందు, హరే అండ్ బెథూన్ తదితర పాఠశాలల్లో ఇప్పటికే ఈ వసతి కల్పించినట్లు చెప్పారు. ఈ లాకర్ విధానం వల్ల పశ్చిమబెంగాల్లో కనీసం 1.5 కోట్ల మంది విద్యార్థులకు మోత బరువు నుంచి విముక్తి కలగనుంది. కాగా, ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాకర్లు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా, అమెరికా, జపాన్ లాంటి కొన్ని దేశాల్లో పిల్లల పుస్తకాల కోసం ఇలాంటి లాకర్ వసతి చాలా స్కూళ్లలో కొనసాగుతోంది. -
ఆయనను అలా చూడటం కష్టంగా ఉంది: స్టాలిన్
చెన్నై: జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని కేంద్రం గతేడాది ఆగస్టులో తొలగించడం తెల్సిందే. అప్పట్నుంచి కశ్మీర్ ముఖ్యనేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. వారిలో ఒమర్ కూడా ఉన్నారు. దాదాపు ఐదు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న ఆయన ఫొటో ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో యువకుడిలా ఉండే ఒమర్ అబ్దుల్లా బారు గడ్డంతో చిరునవ్వు చిందిస్తున్న ఓ ఫోటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. (ఆ ఫోటో చూసి షాకయ్యాను : మమత) రాజకీయ ప్రముఖులు ఎవరూ ఆ ఫొటోలో ఉన్నది ఒమర్ అంటే నమ్మలేకపోయారు. ఒమర్‌ను తాను గుర్తుపట్టలేకపోయానని ఈ మధ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ట్వీట్ చేశారు. తాజాగా.. డీఎంకే చీఫ్ స్టాలిన్ ఈ ఫొటోపై స్పందించారు. ఒమర్‌ను అలా చూడడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితర నేతల పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. Deeply troubled to see this picture of @OmarAbdullah Equally concerned about Farooq Abdullah, @MehboobaMufti & other Kashmiri leaders who are incarcerated without trial or due process. Union Govt must immediately release all political prisoners and restore normalcy in Valley. pic.twitter.com/JaPBf2EFJJ — M.K.Stalin (@mkstalin) January 27, 2020 -
ఆ ఫోటో చూసి షాకయ్యాను : మమత
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా ఫోటోపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో యువకుడిలా ఉండే ఒమర్ అబ్దుల్లా బారు గడ్డంతో చిరునవ్వు చిందిస్తున్న ఓ ఫోటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలుత చూడగానే తాను గుర్తుపట్టలేదని, ఒక్కసారిగా షాక్‌కి గురయ్యానని మమత అన్నారు. ఒమర్ తాజా ఫోటోపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటనలు (గృహ నిర్బంధం) జరగడం దురుదృష్టకరమని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఎప్పుడు ముగింపు పలకాలని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం రాత్రి మమత ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగూ ఒమర్ తాజా ఫోటోపై మెహాబూబా ముఫ్తితో పాటు పలువురు విపక్ష నేతలూ స్పదించారు. ఆయన్ని ఇలా చూసి నివ్వెరపోయారని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని కేంద్రం గతేడాది ఆగస్టులో తొలగించడం తెల్సిందే. అప్పట్నుంచి కశ్మీర్ ముఖ్యనేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. వారిలో ఒమర్ కూడా ఉన్నారు. అప్పట్నుంచి గడ్డం తీయకపోవడంతో ఒమర్ ఇలా కొత్త వేషంలో కనిపించారు. అయితే ఆరునెలల నుంచి కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను కేంద్ర ప్రభుత్వం తొలగించడంతో ఇన్ని రోజులు ఈ ఫోటో బయటకు రాలేదు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
సీఏఏ-ఎన్నార్సీ-ఎన్పీఆర్ వద్దు
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై పునరాలోచన చేయాలని, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకుగాను శనివారం కోల్‌కతా వచ్చిన మోదీతో రాజ్‌భవన్‌లో మమత సమావేశమయ్యారు. అనంతరం మమత నేరుగా టీఎంసీ చేపట్టిన సీఏఏ వ్యతిరేక ధర్నాలో పాల్గొన్నారు. ప్రధాని వచ్చిన సమయంలో కోల్‌కతా విమానాశ్రయం వెలుపల, మార్గమధ్యంలోని ఫ్లై ఓవర్ వద్ద జాతీయ పతాకాలు, నల్ల జెండాలతో ఆందోళనకారులు సీఏఏ వ్యతిరేక నినాదాలు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వామపక్ష సంఘాల కార్యకర్తలు ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనల నేపథ్యంలో నగరంలోని కీలకప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. సీఏఏ వెనక్కి తీసుకోవాలని కోరా ‘ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశం. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన రూ.28 వేల కోట్ల ఆర్థిక సాయం గురించి ప్రధానితో చర్చించాను. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల గురించి ఆయనకు తెలిపాను. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు మేం వ్యతిరేకమని చెప్పాను. ఈ విషయంలో కేంద్రం కూడా పునరాలోచన చేయాలని, సీఏఏను వెనక్కి తీసుకోవాలని కోరాను. సామాన్యులపై వివక్ష, వారిని వేరుగా చూడటం, వేధించ డం తగదని చెప్పా’ అని మమత అన్నారు. ‘ఢిల్లీకి వస్తే చర్చిద్దాం’ అని అన్నారని మమత చెప్పారు. బేలూరు మఠంలో ప్రధాని బస మోదీ శని, ఆదివారాల్లో జరిగే కోల్‌కతా పోర్ట్ 150వ వార్షికోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ప్రధానితోపాటు గవర్నర్ ధన్కర్, సీఎం మమత ఒకే వేదికపై కనిపించనున్నారు. శనివారం రాత్రి ఆయన హౌరా జిల్లాలో ఉన్న రామకృష్ణ మిషన్ ప్రధానకార్యాలయం బేలూర్ మఠంలో బస చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, తదితర ప్రముఖులు ఎందరో ఈ మఠాన్ని గతంలో పలుమార్లు సందర్శించినప్పటికీ ఎవరూ కూడా అక్కడ బస చేయలేదని మఠం అధికారులు తెలిపారు. మమతకు వ్యతిరేకంగా సీపీఎం ఆందోళన ప్రధాని మోదీతో సీఎం మమతా బెనర్జీ సమావేశం కావడంపై వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చూస్తూ టీఎంసీ విద్యార్థి విభాగం ధర్నా జరుగుతుండగా అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను విరగ్గొట్టారు. మోదీతో భేటీపై మమతా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోదీతో భేటీ.. ఆ వెంటనే ధర్నా.. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం మమత నేరుగా అక్కడికి సమీపంలోనే టీఎంసీ విద్యార్థి విభాగం చేపట్టిన సీఏఏ వ్యతిరేక ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లారు. సీఏఏ అమలుపై హోం శాఖ జారీ చేసిన గెజిట్‌పై ఆ ధర్నాలో ఆమె మాట్లాడారు. ‘రాష్ట్రంలో సీఏఏ చట్టం కాగితాలపైనే ఉంటుంది. దీనిని అమలు చేసే ప్రసక్తే లేదు. పార్లమెంట్లో మెజారిటీ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు చేయడం కుదరదు’అని తెలిపారు. -
జేఎన్‌యూ దాడి: ఫాసిస్ట్ సర్జికల్ స్రైక్స్..!
-
జేఎన్‌యూ దాడి: ఫాసిస్ట్ సర్జికల్ స్రైక్స్..!
కోల్కత్తా : దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింసను బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ఫాసిస్ట్ సర్జికల్ స్రైక్స్‌గా ఆమె అభివర్ణించారు. దాడికి వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనకు మమత మద్దతు తెలిపారు. విద్యార్థులంతా ఐక్యంగా ఉండాలని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆమె పేర్కొన్నారు. వర్సిటీ విద్యార్థులపై ప్రణాళికాబద్ధంగా జరిగిన దాడి అని అభిప్రాయపడ్డారు. ‘విద్యార్థులతో పాటు అధ్యాపకులపై సైతం దాడికి పాల్పడ్డారు. ఇది నాకు మాత్రమే కాదు అందరికీ బాధాకరం. వర్సిటీలోకి బీజేపీ కుట్రపూరితంగా గుండాలను పంపుతోంది. దీనిలో పోలీసులు ప్రమేయం కూడా ఉంది.’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. (జేఎన్‌యూలో దుండగుల వీరంగం) కాగా ప్రతిష్టాత్మక వర్సిటీలో చోటుచేసుకున్న ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. విద్యార్థులపై దాడిని పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని, ఇలాంటి చర్యలను ఏమాత్రం క్షమించేదిలేదని అభిప్రాయపడుతున్నారు. ముసుగు దుండుగులు పాల్పడిన దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘోష్ తల పగలడంతో ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తనపై దాడికి పాల్పడిన వారిని గుర్తుపడతానని ఘోష్ చెబుతున్నారు. (జేఎన్‌యూపై దాడి చేసింది వీరేనా!) -
జార్ఖండ్ 11వ సీఎంగా హేమంత్
రాంచీ: జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష నాయకులు, కేంద్రంలో అధికార బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల అధినేతలు ఎందరో తరలిరాగా అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. తెల్లరంగు కుర్తా పైజామా, ముదురు నీలం రంగు నెహ్రూ జాకెట్ ధరించి వచ్చిన 44 ఏళ్ల ఈ ఆదివాసీ నేత అందరినీ ఆకర్షించారు. గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఆరు నెలలు తిరక్కముందే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవడంతో విపక్షాల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి 47 స్థానాలతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ప్రమాణ స్వీకారానికి హాజరైన వారిలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లు ఉన్నారు. విపక్షాల బలం పెరుగుతూ ఉండడంతో వీరంతా చిరునవ్వుతో ఒకరినొకరు పలకరించుకున్నారు. సోరెన్‌తో పాటు కాంగ్రెస్ నాయకుడు అలంఘీర్ ఆలమ్, జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు రామేశ్వర్ ఒరాయన్, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద భోక్త కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రధాని అభినందనలు జార్ఖండ్ సీఎంగా పదవీ ప్రమాణం చేసిన సోరెన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తరఫు నుంచి వీలైనంత సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎంగా రెండోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన శిబూసోరెన్ వారసుడిగా హేమంత్ సోరెన్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఆయన రాష్ట్ర పగ్గాలను చేపట్టడం ఇది రెండోసారి. సోరెన్ గతంలో ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే సీఎంగా కేవలం 14 నెలలు మాత్రమే ఉన్నారు. బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి హేమంత్ పకడ్బందీ వ్యూహాలనే రచించారు. -
మాటల యుద్ధం
న్యూఢిల్లీ/రాయ్‌పూర్/కోల్‌కతా/ముంబై/సిమ్లా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్) దేశవ్యాప్త అమలు ప్రతిపాదనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. సీఏఏను జీవించి ఉండగా అమలు కానివ్వనంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతినబూనగా ఎన్పీఆర్, ఎన్నార్సీలను పేదల జేబులు గుల్లచేయడానికే ప్రభుత్వం తీసుకువచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ అనే మూడింటిని త్రిశూలంగా మార్చి బీజేపీ ప్రభుత్వం ప్రజలపై దాడికి పూనుకుందని సీపీఎం నేత బృందా కారత్ విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. కాగా, సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల అమలును వ్యతిరేకంగాదేశంలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు కొనసాగాయి. ఇవి పన్ను భారం వంటివే ‘దేశ ప్రజల హక్కులను ఎవరూ లాగేసుకోలేరు. నేను బతికి ఉన్నంత కాలం రాష్ట్రంలో సీఏఏను అమలు కానివ్వను. బెంగాల్లో ఎలాంటి నిర్బంధ కేంద్రాలు లేవు’ అని నైహటిలో జరిగిన ర్యాలీలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్పీఆర్, ఎన్నార్సీలు ప్రజలపై పన్ను భారం వంటివేనన్నారు. ‘నోట్ల రద్దు సమయంలో ప్రజల వద్ద డబ్బును బ్యాంకులు లాగేసుకున్నాయి. అదంతా మోదీకి సన్నిహితులైన 15, 20 మంది పారిశ్రామిక వేత్తల జేబుల్లోకి వెళ్లింది. తాజాగా ఎన్పీఆర్, ఎన్నార్సీలు అమలైతే పేద ప్రజలు వివిధ పత్రాల కోసం అధికారులకు లంచాల రూపంలో మరోసారి డబ్బు ముట్టజెప్పే పరిస్థితి రానుంది’ అని వ్యాఖ్యానించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సామూహిక కృషి, ఐక్యతతోనే దేశం ముందుకు వెళ్తుందన్నారు. రాహుల్ అబద్ధాలు మానలేదు రాహుల్ ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. ‘ఎన్పీఆర్ ధ్రువీకరణల కోసం ప్రజలు ఎవరికీ డబ్బు చెల్లించాల్సిన పనిలేదు. సర్వేలో సేకరించిన సమాచారంతో నిజమైన పేదలను గుర్తించి సంక్షేమ పథకాలను వారికే అందేలా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి కార్యక్రమం కాంగ్రెస్ హయాంలో 2010లో జరిగింది’ అని చెప్పారు. ‘కాంగ్రెస్ చీఫ్‌గా ఉండగా రాహుల్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఆ పదవి లేకున్నా ఆయన అబద్ధాలు ఆపట్లేరు. ‘ఈ ఏడాది అబద్ధాల కోరు ఎవరైనా ఉన్నారూ అంటే.. అతడు రాహుల్ గాంధీయే’ అని ఢిల్లీలో మీడియాతో అన్నారు. సీఏఏ విషయంలో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, పౌరసత్వం కోల్పోతారంటూ ముస్లింల్లో వదంతులు రేపుతున్నాయని సిమ్లాలో హోం మంత్రి అమిత్‌షాఆరోపించారు. ‘సీఏఏలో పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు సంబంధించి ఏవైనా నిబంధనలు ఉంటే చూపించాలని రాహుల్ బాబాకు సవాల్ చేస్తున్నా’ అని అన్నారు. ప్రతిపక్షాలవి ఓటు బ్యాంకు రాజకీయాలు ముంబై మహా నగరం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)లపై అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలకు శుక్రవారం వేదికగా మారింది. బీజేపీకి చెందిన సంవిధాన్ సమ్మాన్ మంచ్ నేతృత్వంలో చారిత్రక క్రాంతి మైదాన్‌లో చేపట్టిన ర్యాలీలో బీజేపీ నేత, మాజీ సీఎం ఫడ్నవీస్ పాల్గొని ప్రసంగించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఎన్నార్సీ, సీఏఏలపై వదంతులు, దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. భీమ్ ఆర్మీ ర్యాలీ అడ్డగింత భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేతులను బంధించుకుని ప్రధాని మోదీ నివాసం వైపు ర్యాలీగా తరలివస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. జోర్‌బాగ్‌లోని దర్గా షా–ఇ–మర్దన్ నుంచి శుక్రవారం ప్రార్థనల అనంతరం చేతులను బంధించుకుని కొందరు ప్రధాని నివాసం లోక్‌కల్యాణ్ మార్గ్ వైపుగా ర్యాలీగా కదలివచ్చారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. -
సోరెన్ ప్రమాణ స్వీకారానికి హేమాహేమీలు
రాంచీ : దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ, సీఏఏపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో విపక్ష నేతలంతా ఒకే వేదికను పంచుకోనున్నారు. జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ ఈనెల 29న రాంచీలో ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (ఎన్డీయేతర), పార్టీల అధినేతలు హాజరుకానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీలను స్వయంగా కలిసిన హేమంత్.. ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు. (29న సీఎంగా హేమంత్ ప్రమాణం) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అయితే సోనియా గాంధీ రాకపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి విపక్ష నేతలంతా పెద్ద ఎత్తు హాజరైన విషయం తెలిసిందే. -
పౌరసత్వ వివాదం: మమతపై నిర్మలా ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మమతపై కేంద్ర మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలాసీతారామన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని హితవుపలికారు. పౌరసత్వ చట్టంపై మమత మాట్లాడుతూ.. ‘బీజేపీకి దమ్ముంటే సీఏఏ, ఎన్నార్సీపై ఐకరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సవాలు విసిరారు. ఈ రెఫరండంలో బీజేపీ ఓటమి పాలైతే అధికారం నుంచి తప్పుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయిన తర్వాత.. ఇప్పుడు భారత పౌరులుగా నిరూపించుకోవాలా’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నిర్మలా తీవ్రంగా తప్పుబట్టారు. భారత అంతర్గత విషాయాల్లో ఇతరుల (థర్డ్‌పార్టీ) జోక్యాన్ని తాము ఏమాత్రం స్వాగతించేం లేదని ఘాటు సమాధానమిచ్చారు. కనీస అర్థంలేని విధంగా మమత మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు విపక్షాలు ఇలా ఆందోళనలు చేస్తున్నాయని మండిపడ్డారు. (సీఏఏపై కేంద్రానికి మమత సవాలు) -
ప్రశాంత్ కిషోర్‌కు మరో ప్రాజెక్టు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెంట రాజకీయ పార్టీలు లైన్ కడుతున్నాయి. తమ పార్టీకి సలహాదారుడిగా వ్యవహరించాలంటూ దేశంలోని ప్రముఖ నేతలంతా అభ్యర్థిస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ప్రశాంత్ అపాయింట్మెంట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని తొలిసారి పీఎం పీఠంపై కూర్చోబెట్టడంలో ప్రశాంత్ అద్భుతమైన విజయం సాధించారు. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆ తరువాత బిహార్‌లో నితీష్ కుమార్ కూటమి విజయం, పంజాబ్‌లో అమరిందర్ సింగ్ గెలుపుకోసం విశేషంగా కృషి చేసి విజయం సాధించారు. ఆ తరువాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో పశ్చిమ బెంగాల్లో తిరుగులేని శక్తిగా అవతరించిన తృణమూల్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ప్రశాంత్‌కు ఆశ్రయించకతప్పలేదు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడుతుండటంతో తనకు వ్యూహకర్తగా వ్యవహరించాలంటూ దీదీ కోరారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎదురులేదనుకున్న మమత బీజేపీ ధాటికి దారుణంగా దెబ్బతిన్నారు. మెజార్టీ సిట్టింగ్ స్థానాలకు కోల్పోవల్సి వచ్చింది. దీంతో పీకే అవసరం తప్పదని భావించిన మమత.. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే అతనితో కలిసి వ్యూహాలు రచిస్తున్నారు. ఇదిలావుండగా తాజాగా ప్రశాంత్ కిషోర్‌కు మరో ప్రాజెక్టు కూడా వచ్చినట్లు జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. తమిళనాడులో బలమైన నేతగా గుర్తింపుపొందిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా ప్రశాంత్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. తమిళనాట 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలపై అనుసరించాల్సి వ్యూహాలు, సలహాలు గురించి పీకేతో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే స్టాలిన్, కిషోర్ మధ్య సమావేశం జరుగనుందని చెన్నై వర్గాల సమాచారం. -
బెంగాల్ ఉప ఎన్నికల్లో తృణమూల్ హవా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతదీదీకి మళ్లీ జోష్ వచ్చింది. రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇన్నాళ్లూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రాతినిధ్యం వహించిన ఖరగ్‌పూర్ సదార్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అన్ని నియోజకవర్గాల్లోనూ రెండో స్థానానికే పరిమితమైంది. కళాయిగంజ్, ఖరగ్‌పూర్ సదార్, కరీంపూర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థులు వరసగా తపన్ దేబ్ సిన్హా, ప్రదీప్ సర్కార్, బిమలేందుసిన్హా రాయ్‌లు విజయం సాధించినట్టు గురువారం ఎన్నికల సంఘం ఫలితాలు విడుదల చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న బీజేపీ అహంకారానికి ఈ ఫలితాలు చెంపపెట్టు వంటివని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. జాతీయ పౌర రిజిస్టర్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలే బెంగాల్లో బీజేపీ ఓటమికి కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ అంగీకరించింది. -
సీఎం నన్ను అవమానించారు : గవర్నర్
కోల్‌కతా : దుర్గా పూజ వేడుకల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనను ఘోరంగా అవమానించారని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీఫ్ ధంఖర్ ఆరోపించారు. వేదికపై తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని మనస్తాపం చెందారు. ఇటీవల ప్రభుత్వ ఆధ్వర్యంలో దుర్గాపూజా వేడుకల్లో సీఎం మమతాతో పాటు గవర్నర్ ధంఖర్‌కూడా హాజరయ్యారు. వేదిక కార్నర్లో అతనికి సీటు కేటాయించారు. నాలుగు గంటల పాటు సాగిన ఈ వేడుకల్లో గవర్నర్ తనకు కేటాయించిన సీటులోనే కూర్చొని ఉన్నారు. ఈ విషయాన్ని మీడియా కూడా బయటపెట్టలేదు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై ఒక్కసారి కూడా గవర్నర్ ముఖాన్ని చూపించలేదు. ఈ ఘటనపై గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ దుర్గాపూజ వేడుకల్లో అవమానానికి గురయ్యాను. చాలా మనస్తాపం చెందాను. ఓ గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవాన్ని ముఖ్యమంత్రి నాకు ఇవ్వలేదు. వేదిక చివర్లో నాకు సీటు కేటాయించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్లలో నేను ఒక్కసారి కూడా కనిపించలేదు. అవమానం జరిగింది నాకు ఒక్కడికే కాదు. బెంగాల్ ప్రజలందరిని మమతా అవమానించారు. నేను ప్రజల సేవకుడిని.. రాజ్యాంగబద్దంగా నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. వేడుకలను ఘనంగా నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని అభినందిన్నాను. నాకు జరిగిన అవమానాన్ని ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకుంటుందని ఆశిస్తున్నా’ అని గవర్నర్ జగదీప్ ధంఖర్ పేర్కొన్నారు. -
మోదీ భార్యను కలుసుకున్న మమత
కోల్కత్తా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోదీ భార్య జశోదాబెన్‌ను కలిసి మాట్లాడారు. మోదీని కలుసుకునేందుకు ఢిల్లీ బయలుదేరిన మమత మంగళవారం రాత్రి కోల్కత్తా విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో జశోదాబెన్ కోల్కత్తా నుంచి ధన్‌బాద్ వెళ్లేందుకు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఎదురుపడిన వారిద్దరూ ఒకరినొకరు పలుకరించుకున్నారు. పరస్పరం యోగక్షేమాలు అగిడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జశోదాబెన్‌కు మమత చీర బహుకరించారు. కాగా నరేంద్ర మోదీతో మమతాబెనర్జీ బుధవారం సమావేశమైన విషయం తెలిసిందే. మమత తన తరఫున బహుమతిగా మోదీకి ప్రత్యేక కుర్తా, బెంగాలీ స్వీట్స్‌ను బహుకరించారు. చదవండి: మోదీకి కుర్తా బహుకరించిన దీదీ -
మోదీకి కుర్తా బహుకరించిన దీదీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ సమావేశమయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో బుధవారం ఇద్దరు సమావేశమయ్యారు. మోదీ మంగళవారం తన 69వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మమత తన తరఫున మోదీకి ప్రత్యేక కుర్తా, బెంగాలీ స్వీట్స్‌ను బహుకరించారు. మోదీకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భేటీ అనంతరం మమత మాట్లాడుతూ.. తమ మధ్య సమావేశం సంతోషకరంగా జరిగిందన్నారు. బెంగాల్ రాష్ట్ర పేరు మార్పులో ప్రధాని సానుకూలంగా స్పందించారని ఆమె పేర్కొన్నారు. అలాగే వీరిద్దరి భేటీ సందర్భంగా పలు అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు సమస్యలు, ఎన్ఆర్సీ గురించి మమత ప్రధాని దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. కాగా ప్రధానిగా మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత వీరిద్దరి మధ్య భేటీ జరగడం ఇదే తొలిసారి కావడంతో, వారి భేటీపై ఆసక్తినెలకొంది. బీజేపీని అన్ని విషయాల్లో విమర్శించే మమత అకస్మాత్‌గా మోదీతో భేటీతో రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి అలాగే జూన్‌లో జరిగిన నీతిఅయోగ్ సమావేశానికి కూడా మమత గైర్హాజరు అయిన విషయం తెలిసిందే. -
ఛీటింగ్ చేసి ఎన్నికల్లో గెలిచారు: దీదీ
కోల్కత్తా: అధికార దాహంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను కుట్రపూరితంగా కూల్చివేస్తోందని బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి నిదర్శనం కర్ణాటక రాజకీయ సంక్షోభమేనని అన్నారు. బెంగాల్లో కూడా టీఎంసీ నేతలను ప్రలోభాలకు గురిచేస్తూ.. బలవంతగా పార్టీలో చేర్చుకుంటున్నారని దీదీ ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న బెంగాల్లో మత సంఘర్షణ సృష్టించాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలను ఈవీఎంలతో ఛీటింగ్ చేసి బీజేపీ గెలిచిందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పద్దతిన ఎన్నుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మమత విమర్శించారు. కాగా ఆదివారం బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలో టీఎంసీ భారీ మెగా ర్యాలీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీకి హాజరయ్యారు. కాగా ప్రతి ఏడాది జాలై 21న కోల్‌కత్తాలో టీఎంసీ మెగా ర్యాలీని ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. -
ఇమ్రాన్ ఖాన్‌కు ఆమెకు తేడా ఏముంది?
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై బీజేపీ నేతలు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. కానీ బెంగాల్లో మమత సర్కార్ మాత్రం ఎలాంటి వేడుకలను నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో మమతను.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పోల్చూతూ.. స్థానిక బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ వ్యాఖ్యానించారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా యోగా డేను నిర్వహించారు. పాకిస్తాన్, బెంగాల్ మాత్రమే నిర్వహించలేదు. ఇమ్రాన్‌కు, మమతకు పెద్దగా తేడాఏం లేదని దీంతో అర్థమయింది’ అని అన్నారు. యోగాపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. ఆయన మానసిక స్థితి సరిగ్గాలేదని అన్నారు. ఆర్మీ డాగ్ యూనిట్ వెల్లడించిన రెండు ఫోటోలను శుక్రవారం ట్విటర్లో షేర్ చేసిన రాహుల్ దానికి ఇచ్చిన క్యాప్షన్‌తో విమర్శలకు తావిచ్చారు. ‘సైనిక సిబ్బందితో కలిసి కుక్కలు యోగాసనాలు వేస్తున్నాయి..ఇదే న్యూ ఇండియా’ అంటూ ఇచ్చిన క్యాప్షన్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. రాహుల్ యోగా డేపై చేసిన వ్యాఖ్యలతో దేశాన్ని, సైనిక పాటవాన్ని అవమానించారని నెటిజన్లు మండిపడ్డారు. -
ప్రతినిధి బృందం పర్యటన.. చెలరేగిన హింస
కోల్కత్తా: బీజేపీ ప్రతినిధి బృందం పర్యటనతో పశ్చిమబెంగాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం జరిగిన పోలీసు కాల్పుల్లో ఇద్దరు చనిపోయిన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భట్పరా ప్రాంతంలో పరిస్థితి సమీక్షించేందుకు కాషాయబృందం పర్యటించింది. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించడంతో పాటు స్థానికులతో మాట్లాడి ఘటన వివరాలు సేకరించేందుకు బీజేపీ ఎంపీ, కేంద్రమాజీ మంత్రి ఎస్ఎస్ అహ్లువాలియీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ శనివారం భట్పరా చేరుకుంది. ఈ నేపథ్యంలో కమలం కార్యకర్తలు, స్థానికులు అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. బెంగాల్ పోలీసులు, మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే 144వ సెక్షన్ అమల్లో ఉండడంతో పోలీసులు వారిని తరమికొట్టారు. బీజేపీ కార్యకర్తలు కొందరు 'బెంగాల్ పోలీస్ హే హే', 'మమతా బెనర్జీ హే హే' అంటూ నినాదాలకు దిగడంతో పోలీసులు వారిని నిలువరించేందుకు లాఠీలు ఝళిపించారు. దీంతో భట్పరాలో ఉద్రిక్తత పెరిగింది. ఏడుగురు అమాయకులపై పోలీసులు అన్యాయంగా కాల్పులు జరిపారని.. ఇది దారుణమైన విషయమని అహ్లువాలియా ఆవేదన వ్యక్తంచేశారు. బెంగాల్లో పెచ్చుమీరిన రాజకీయ హింస యావత్ దేశానికే ప్రమాదకరమన్నారు. న్నికలు పూర్తయ్యాక కూడా బెంగాల్లో హింస కొనసాగడం బాధాకరమన్నారు. దీనిపై అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారని... రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించారని తెలిపారు. ఇక్కడి పరిస్థితులపై బీజేపీ చీఫ్, కేంద్రహోంమంత్రి అమిత్ షాకు నివేదిక ఇవ్వనున్నట్టు అహ్లువాలియా తెలిపారు. కాగా సార్వత్రిక ఎన్నికల సమయంలో చెలరేగిన హింసా.. బెంగాల్ వ్యాప్తంగా తీవ్ర రూపందాల్చిన విషయం తెలిసిందే. దీంతో అనేక ప్రాంతాల్లో ఘర్షణల కారణంగా బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ప్రాణాలు కొల్పొతున్నారు. బెంగాల్ వరుస ఘటనలపై కేంద్ర హోంశాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరోవైపు బెంగాల్ ఘర్షణలకు బీజేపీయే కారణమంటూ దీదీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా చోటుచేసుకున్న ఘటనలపై అహ్లువాలియా కమిటీ అమిత్‌షాకి నివేదికను ఇవ్వనుంది. -
‘జమిలి’పై భేటీకి మమత డుమ్మా
న్యూఢిల్లీ/కోల్‌కతా: జమిలి ఎన్నికల నిర్వహణ అంశంపై జరిగే 19వ తేదీన జరిగే సమావేశానికి పంపిన ఆహ్వానాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తిరస్కరించగా కాంగ్రెస్, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఏక కాలంలో ఎన్నికలతోపాటు కీలకమైన అంశాలపై చర్చించేందుకు జరిగే ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభల్లో కనీసం ఒక సభ్యుడున్న అన్ని రాజకీయ పార్టీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. మహాత్మాగాంధీ 150వ వర్థంతి, 2022లో జరిగే 75వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.హడావుడిగా ఇలా సమావేశం జరపడం కంటే ఏకకాలంలో ఎన్నికలపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేసి, పార్టీలు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషికి మంగళవారం మమత లేఖ రాశారు. అలా చేసినప్పుడే చాలా కీలకమైన ఈ అంశంపై తాము నిర్దిష్టమైన సలహాలు ఇవ్వగలుగుతామన్నారు. సాధారణ ఎన్నికల అనంతరం అధికార టీఎంసీని వీడి బీజేపీలో చేరిన నేతలపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. పార్టీ మారిన వారంతా అత్యాశపరులు, అవినీతిపరులని, ఆ చెత్తను బీజేపీ ఏరుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇంకా ఎవరైనా వెళ్లాలనే ఆలోచనలో ఉంటే అలాంటి వారు తొందరగా వెళ్లిపోవాలని కోరారు.. కాగా, ఈ సమావేశంలో పాల్గొనే అంశంపై చర్చించేందుకు బుధవారం ఉదయం సమావేశం కావాలని కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్ణయించారు. ప్రజాధనం ఆదా చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించేందుకు లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఒకేసారి జరపడం మేలంటూ గత ఆగస్టులో లా కమిషన్ సిఫారసు చేసింది. కాగా, ఎన్నికల్లో బీజేపీ 303 ఎంపీలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా వరుసగా కాంగ్రెస్ (52), డీఎంకే (23), వైఎస్ఆర్ కాంగ్రెస్(22), టీఎంసీ(22) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
మెత్తబడ్డ ప్రభుత్వ వైద్యులు
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో గత 6 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వ వైద్యులు, జూనియర్ డాక్టర్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చల విషయంలో ఆదివారం కాస్త మెత్తబడ్డారు. చర్చలు ఎక్కడ నిర్వహించాలన్న విషయమై తుది నిర్ణయాన్ని మమతా బెనర్జీకే వదిలిపెట్టామని వైద్యులు తెలిపారు. అయితే ఈ చర్చావేదిక మీడియా సమక్షంలో బహిరంగంగా ఉండాలనీ, గదిలో ఉండకూడదని షరతు విధించారు. కోల్‌కతాలో ఆదివారం దాదాపు రెండున్నర గంటలపాటు సమావేశమైన వైద్యుల గవర్నింగ్ బాడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆందోళనను వీలైనంత త్వరగా ముగించాలని మేమెంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చించేందుకు వీలుగా సీఎం మమత చర్చావేదికను ఏర్పాటు చేయాలి’ అని సూచించారు. ఆందోళన చేస్తున్న వైద్యులతో సోమవారం సమావేశమయ్యేందుకు సీఎం అంగీకరించారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సచివాలయం పక్కనే ఉన్న ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఒక్కో ఆసుపత్రి నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున ఈ కార్యక్రమానికి ఆహ్వా నించామని పేర్కొన్నారు. ఈ చర్చకు మీడియాను ఆహ్వానించాలన్న డాక్టర్ల ప్రతిపాదనపై మమత సుముఖంగా లేరని స్పష్టం చేశారు. నేడు దేశవ్యాప్త సమ్మె.. బెంగాల్లో వైద్యులపై దాడికి నిరసనగా సోమవారం దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ప్రకటించింది. ఈ ఆందోళన నేపథ్యంలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు అన్నిరకాల వైద్యసేవలు(అత్యవసర సేవలు మినహా) నిలిచిపోతాయని తెలిపింది. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిపై దాడిచేసే వ్యక్తులను శిక్షించేందుకు కేంద్రం సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేసింది. శిక్షాస్మృతిని సవరించాలని కోరింది. గత సోమవారం ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో ఓ రోగి చనిపోవడంతో అతని బంధువులు ఇద్దరు డాక్టర్లను చితకబాదారు. ఈ దాడికి నిరసనగా బెంగాల్‌లోని వైద్యులంతా ఆందోళనకు దిగగా, దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు సంఘీభావం తెలిపారు. మరోవైపు, ఆందోళన కారణంగా బెంగాల్లో అత్యవసర సేవలకూ ఇబ్బంది కలుగుతోంది. ఈ ఆందోళనల కారణంగా కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఏం ప్రభుత్వ ఆసుపత్రిలో శామ్యూల్ అనే వ్యక్తి గుండె ఆపరేషన్ ఆగిపోయింది. తామంతా చాలా దూరప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వచ్చామనీ, ఇప్పుడు చికిత్స తీసుకోకుండా స్వస్థలాలకు తిరిగి వెళ్లలేమని రోగులు, వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మమత తీరుపై సిగ్గు పడుతున్నా..
సాక్షి, కోల్‌కతా : జూనియర్ డాక్టర్ల సమ్మె పట్ల మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ కూతురు షబ్బా హకీమ్ ఘాటైన విమర్శలు చేసింది. తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేస్తూ ‘ పనికి తగిన భద్రత కల్పించాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న వారి ఆందోళన’ సరైనదేనని, ఒక టీఎంసీ కార్యకర్తగా మా నాయకురాలి ప్రవర్తన పట్ల సిగ్గుపడుతున్నానని ఆమె పేర్కొన్నారు. జూనియర్ వైద్యుడిపై దాడికి నిరసనగా నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న డాక్టర్లను వెంటనే విధుల్లో చేరాలని మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్లకు, ప్రభుత్వానికి మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆరోగ్య, ప్రజా సంక్షేమ శాఖను నిర్వర్తించడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. జాతీయ ఎన్నికల సందర్భంగా ఆసుపత్రుల్లో ఉన్న భద్రతను మమతా బెనర్జీ తొలగించిందని, దీన్ని వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆమె పేర్కొన్నారు .బీజేపీ, సీపీఎంతో లోపాయికార ఒప్పందం చేసుకొని హిందూ-ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని షబానా ఆరోపించారు. దీనంతటికి పరోక్షంగా బీజేపీ చీఫ్ అమిత్ షా సహకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. -
‘ఆమె ఆడపులి.. రెచ్చగొట్టకండి’
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వానికి, మమతా బెనర్జీ సర్కారుకు మాటల యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే. బెంగాల్లో హింసపై కేంద్రహోంశాఖ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మమత వ్యతిరేకంగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం విధితమే. అయితే దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మమత,, జై శ్రీరాం అన్న వారందరినీ అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ శతృఘ్న సిన్హా మమతకు మద్దతుగా నిలిచారు. ఆమె బెంగాల్ ఆడపులని.. ఆమెను రెచ్చగొట్టవద్దని అన్నారు. ‘ఇప్పటిదాకా చేసింది చాలు. బెంగాల్ నేల నుంచి వచ్చిన గొప్ప నేత, ఆడపులి మమతాబెనర్జీ. ఆమెను రెచ్చగొట్టే విధంగా అనవసర ప్రయత్నాలు వద్దు. ఈ డ్రామాలు, పోస్టుకార్డు యుద్ధాలు ఇక ఆగాలి. మతం పేరుతో రాజకీయాలు చేయడం ఆమోదయోగ్యం కాదు. ఇప్పుడు ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారు. ఓ మహిళా నేత పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఈ దేశం మొత్తం చూస్తోంది. రాముడు, కృష్ణుడు, దుర్గా, కాళీమాత ఇలా దేవుళ్లందరికీ మనం భక్తులమే. పరిస్థితులను కావాలనే మరింత దిగజారాలే చేయడం ఎందుకు ? ’ అని శతృఘ్న సిన్హా వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ఇటీవల రెండు మూడుసార్లు మమతాబెనర్జీని అడ్డుకున్న కొందరు యువకులు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె కారు దిగి వారిని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తడంతో దీదీ సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జైశ్రీరామ్ నినాదంపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ భాజపా నేతలు కావాలనే ఆ నినాదంతో మత రాజకీయాలకు తెరలేపి బెంగాల్లో ఆందోళనలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. -
‘కళ్ల ముందే నా భర్తను కాల్చిచంపారు’
కోల్కత్తా: తన కళ్ల ముందే తన భర్తను తృణమూల్ కార్యకర్తలు కాల్చిచంపారని రెండురోజుల క్రితం హత్యకు గురైన బీజేపీ కార్యకర్త ప్రదీప్ భార్య పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి బెంగాల్‌లోని 24 పరగణా జిల్లాలో బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు బీజేపీ మద్దతుదారులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వీరిలో ప్రదీప్ మొండల్ అనే వ్యక్తిని తన ఇంట్లోనే భార్య ముందే దారణంగా కాల్చిచంపారని ఆయన భార్య పద్మ మొండల్ కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రదీప్‌తో పాటు శంకర్ మొండల్‌ను కూడా ఇదే విధంగా కాల్చి చంపారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇదిలావుడంగా.. పశ్చిమబెంగాల్లో (టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణల అనంతరం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర హోంశాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బెంగాల్లో శాంతిభద్రతలను పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హింసను అరికట్టడంలో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించింది. ఆందోళనలు, అల్లర్లను నియంత్రించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని హితవు పలికింది. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి జవాబు ఇచ్చింది. సంఘవిద్రోహక శక్తుల కారణంగా చెలరేగిన అల్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని స్పష్టం చేసింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో శనివారం రాత్రి టీఎంసీ, బీజేపీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బీజేపీ, టీఎంసీ నేతలు మాటలయుద్ధానికి దిగారు. టీఎంసీ శ్రేణుల దాడుల్లో బీజేపీ కార్యకర్తలు చనిపోయారని బీజేపీ ప్రధాన కార్యదర్శి సయతన్ బసూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఘర్షణల్లో కయూమ్ మొల్లాహ్ అనే టీఎంసీ కార్యకర్త చనిపోయినట్లు టీఎంసీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు బీజేపీ కార్యకర్తల మృతదేహాలతో కోల్‌కతాలోని పార్టీ కార్యాలయానికి కమలనాథులు ఊరేగింపుగా తీసుకురాగా, పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీ తన ప్రసంగాల ద్వారా రాజకీయ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని బీజేపీ నేత ముకుల్‌రాయ్ ఆరోపించారు. తమ కార్యకర్తల చావుకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో 11 మంది మహిళలు సహా 62 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘ప్రశాంత్ కిషోర్‌ను తప్పుపట్టలేం’
పట్నా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఇటీవల భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే జేడీయూకి ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య భేటీ చర్చనీయాంశంగా మారింది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ కేంద్రంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉంది. ఎన్డీయేకు వ్యతిరేకంగా మమత కోసం పీకే పనిచేస్తున్నారంటూ బిహార్ రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మమత-ప్రశాంత కిషోర్ భేటీపై నితీష్ కుమార్ తొలిసారి స్పందించారు. ‘‘దేశంలో వివిధ రాజకీయ పార్టీలకు వ్యహకర్తగా సలహాలు ఇవ్వడం ఆయన వృత్తి. ఇది పార్టీకి ఎలాంటి సంబంధంలేని అంశం.దీదీ, పీకే భేటీపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ప్రశాంత్ కిశోర్ మా పార్టీ ఉపాధ్యక్షుడే. దాంతో పాటు ఎన్నికల వ్యూహరచన చేసే ఓ సంస్థకు అధిపతి కూడా. వ్యాపార వ్యవహారాల్లో భాగంగా ఆయన బెంగాల్ సీఎం మమతాబెనర్జీని కలిసి ఉండొచ్చు. అంతేకానీ జేడీయూ కార్యకర్తగా పీకే అక్కడికి వెళ్లలేదు. కాబట్టి ఆయన్ను తప్పుపట్టలేం’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా మమతతో పీకే ఇటీవల దాదాపు రెండు గంటలపాటు భేటీ అయినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమతో కలిసి పని చేయాల్సిందిగా దీదీ.. పీకేను కోరినట్లు సమాచారం. ఇందుకు ప్రశాంత్ కిషోర్ కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. బెంగాల్లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలుండగా.. టీఎంసీ 22 స్థానాల్లో విజయం సాధిస్తే.. బీజేపీ దీదీకి గట్టి పోటీ ఇస్తూ.. ఏకంగా 18 స్థానాల్లో గెలుపొందింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ తనకు గట్టి పోటీ ఇస్తుందని భావించిన దీదీ.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యి.. తమ పార్టీ కోసం పని చేయాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరుగుతోంది. -
చెలరేగిన హింస.. నలుగురు బీజేపీ కార్యకర్తల హత్య
కోల్కత్తా: సార్వత్రిక ఎన్నికల సమరంతో బెంగాల్లో మొదలైన హింసా ఇప్పటికీ చల్లారలేదు. ఎన్నికల సందర్భరంగా ఆ రాష్ట్రంలో జరిగిన ఘర్షణలో అధికార, విపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా బెంగాల్‌లోని నజత్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో నలుగురు బీజేపీ కార్యకర్తలు హత్యకు గురైయ్యారు. శనివారం రాత్రి బీజేపీ-తృణమూల్ కార్యకర్తల మధ్య చెలరేగిన హింసలో వారు మృతి చెందారు. నజత్‌లో బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బెంగాల్ హింసపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హత్యారాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ముకుల్ రాయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ కార్యకర్తలు హత్యకు మమతనే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వరుస హత్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకి నివేధించినట్లు ఆయన తెలిపారు. కాగా తాజా ఘటనతో రాష్ట్ర పోలీస్ శాఖ భద్రతను కట్టుదిట్టంచేసింది. పలు సమస్యత్మాక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. -
మమతను కీమ్ జోంగ్ ఉన్‌తో పోల్చుతూ..
కోల్కత్తా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శల వర్షం కురిపించారు. ఉత్తర కొరియా నియంత పాలకుడు కీమ్ జోంగ్ ఉన్‌తో పోల్చుతూ.. వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతలు స్వికరించిన అనంతరం తొలిసారి బిహార్ పర్యటనకు వచ్చిన గిరిరాజ్‌సింగ్.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘మమతా బెనర్జీ చాలా ప్రమాదకరమైన నాయకురాలు. ఉత్తర కొరియా నియంత ఉన్‌లా ప్రత్యర్థి నేతలను హతమార్చుతున్నారు. ఆమె రాజకీయ భవిష్యత్తు ఇక ముగిసినట్లు. అందుకే హింసాత్మక ఘటనల ద్వారా భయాందోళనలు సృష్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సహకరించకుండా.. సమఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు’’అని విమర్శించారు. కాగా ప్రధాని మోదీ అధ్యక్షతన ఈనెల 15వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించిన విషయం తెలిసిందే. తమ రాష్ట్ర అవసరాలకు మద్దతుగా నిలిచే ఆర్థిక అధికారాలు లేని నీతి ఆయోగ్ వృథా అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ప్రధానికి లేఖ రాశారు. ‘రాష్ట్రాల ప్రణాళికలకు ఆర్థికంగా తోడ్పాటునందించే అధికారం లేని నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లడం దండగని, ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వరని లేఖలో పేర్కొన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల సమరంతో బీజేపీ నేతలకు, మమత సర్కారుకు పెద్ద పెత్తున విభేదాలు ఏర్పడిన విషయం తెలిసిందే. -
మాతో పెట్టుకుంటే మసే
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తమతో ఎవరైనా పెట్టుకుంటే నాశనమైపోతారని హెచ్చరించారు. రంజాన్(ఈద్–ఉల్–ఫితర్) సందర్భంగా కోల్‌కతాలోని రెడ్ రోడ్డులో ప్రార్థనలకు హాజరైన 25,000 మందికిపైగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..‘మాతో ఎవరైనా పెట్టుకుంటే నాశనమైపోతారు.. ఇకపై ఇదే మా నినాదం. బీజేపీ మతాన్ని రాజకీయం చేస్తోంది. హిందువులు త్యాగానికి ప్రతీకలు. ముస్లింలు ఇమాన్(సత్యప్రియత)కు, క్రైస్తవులు ప్రేమకు, సిక్కులు బలిదానానికి ప్రతీకలు. మనమంతా ప్రేమించే భారతదేశం ఇదే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించుకుంటాం’ అని మమత తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. ‘ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. కొన్నిసార్లు సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కిరణాల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ కొంతసేపటికే అది తగ్గిపోతుంది. ఈవీఎంల సాయంతో వాళ్లు(బీజేపీ) ఎంతత్వరగా అధికారంలోకి వచ్చారో, అంతేత్వరగా తెరమరుగైపోతారు’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముస్లింలకు బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి, సీఎం మమత రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. -
‘బెంగాల్‌ను పాక్‌లో కలిపేందుకు దీదీ ప్రయత్నం’
కోల్కత్తా: ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా మమతపై జార్ఖండ్ సీఎం రఘువర దాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్‌ను పాకిస్తాన్లో విలీనం చేయాలని ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే జై శ్రీరాం అనే వారందరిని అరెస్ట్ చేసి రాష్ట్రంలో నిర్బంధం విధిస్తున్నారని విమర్శించారు. జైశ్రీ రాం అంటే తప్పేంటని.. మనం భారతదేశంలో కాదా నివసించేదని దాస్ ప్రశ్నించారు. ఆమె వింత ప్రవర్తనతో ప్రజలు విసిగిపోయారని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. మోదీ నాయకత్వాన్ని ఆ రాష్ట్ర ప్రజలంతా విశ్వసిస్తున్నారని.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమన్నారు. జై శ్రీరాం నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినందుకు జై శ్రీరాం నినాదాలతో కూడిన పది లక్షల పోస్టు కార్డులను పంపాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు మమతా బెనర్జీ కాన్వాయ్ ఎదుట బీజేపీ కార్యకర్తలు జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించడం పట్ల దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఆరు నెలల్లో మమత సర్కారు కూలుతుంది’
కోల్కత్తా: బెంగాల్లో మరో ఆరు నెలల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ నేత రాహుల్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌పై పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నమ్మకం లేదని మమత సర్కార్ కూలిపోవడం ఖాయమని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ఆ తరువాత బెంగాల్లో పార్టీ ఫిరాయింపులకు తెరలేపిన విషయం తెలిసిందే. టీఎంసీ, సీపీఎంకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, 50 మంది కౌన్సిలర్లు బుధవారం బీజేపీ గూటికి చేరారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరమే చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ సిన్హా వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. కాగా బెంగాల్ అసెంబ్లీకి 2021 వరకు గడువున్న విషయం తెలిసిందే. బుధవారం ఓ సమావేశంలో రాహుల్ సిన్హా మాట్లాడుతూ.. ‘‘ఆరు నెలలు లేదా ఏడాది లోపు మమత సర్కార్ పడిపోనుంది. ఆ పార్టీలో చాలామంది ఆమెపై అసంతృప్తితో ఉన్నారు. పోలీసులు, సీఐడీ బలంతో మమత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కేంద్రంపై కోపంతో టీఎంసీ నేతలు రాష్ట్రంలో అల్లర్లను ప్రేరేపిస్తున్నారు’’ అని అన్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లో పర్యటించిన మోదీ 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా మాట్లాడారని విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో 42 స్థానాలకు గాను బీజేపీ అనుహ్యంగా 18 స్థానాల్లో గెలుపొంది తృణమూల్‌కు పెద్ద ఎత్తున గండికొట్టిన తెలిసిందే. టీఎంసీ 22 సీట్లతో సరిపెట్టుకుంది. -
మమతా బెనర్జీ రాజీనామా..!
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పశ్చిమబెంగాల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడంతో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఇరుకునపడ్డారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో శనివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన మమతా పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అయితే టీఎంసీ మమతా బెనర్జీ రాజీనామాను తిరస్కరించింది. ఈ సమావేశం అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఈవీఎంలను తారుమారు చేసిందనీ, ఈ ఫలితాల వెనుక విదేశీ శక్తుల హస్తముందని ఆరోపించారు. అందుకే రాజీనామా చేశా.. ‘లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పాలనను ఈసీ 5 నెలల పాటు ఆధీనంలోకి తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను సీఎంగా ఎలా ఉండగలను? అందుకే ముఖ్యమంత్రిగా తప్పుకుంటానని చెప్పాను. కానీ పార్టీ నా రాజీనామాను తిరస్కరించింది. ఈ సీఎం కుర్చీ నాకవసరం లేదు. ఆ కుర్చీకే నా అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీనీ నెరవేర్చాం. ఇప్పటివరకూ ప్రజల కోసం పనిచేశా. ఇప్పుడు పార్టీని పటిష్టం చేయడంపై కూడా దృష్టి సారిస్తా. లోక్‌సభ సీట్లలో బీజేపీ అభ్యర్థులకు లక్ష మెజారిటీ దాటేలా వాటిని రీప్రోగ్రామింగ్ చేశారు. దీనివెనుక విదేశీ శక్తులు కూడా ఉండొచ్చు. బీఎస్ఎఫ్ బలగాలు ప్రజలపై ఒత్తిడి తెచ్చి బీజేపీకి ఓట్లేసేలా చేశాయి’ అని మమత ఆరోపించారు. -
బీజేపీ ఫలితాలపై మమత జోస్యం
కోల్కత్తా: బెంగాల్లో బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈపోరులో విజయంపై ఎవరికివారే ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ఫలితాలపై బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ జ్యోస్యం చెప్పారు. గురువారం ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘దేశ వ్యాప్తంగా బీజేపీకి పరాభావం తప్పదు. ముఖ్యంగా దక్షిణాదిన దారుణమైన ఫలితాలను చవిచూస్తుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కనీసం ఖాతా కూడా తెరవదు. మహారాష్ట్రలో 20, దేశ వ్యాప్తంగా 200 స్థానాలను కొల్పోతుంది’’ అని తన సర్వే ఫలితాలను మమత వెల్లడించారు. బెంగాల్లో ఓట్ల కోసం బీజేపీ నేతలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేశారని, తమ పార్టీని కార్యకర్తలను బెదిరిస్తూ.. గుండాల్లా ప్రవర్తించారని దీదీ ఆరోపించారు. తన బీజేపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, వాటిని రుజువు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల తనపై తప్పుడు ఆరోపనలు చేసిన వారందరనీ జైలుకీడుస్తానని హెచ్చరించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గురువారమే ప్రచారాన్ని ముగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. బెంగాల్‌లోని 9 నియోజకవర్గాలకు ఆదివారం చివరి విడత పోలింగ్ జరగనుంది. ఏడో విడత ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రానికి ముగియాల్సి ఉండగా, హింసాత్మక ఘటనల నేపథ్యంలో దానిని పశ్చిమ బెంగాల్లో మాత్రం గురువారం రాత్రికి కుదిస్తూ ఈసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
బెంగాల్లో టెన్షన్.. టెన్షన్
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో రాజకీయం ఉత్కంఠంగా మారింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతల ధర్నాలు, ఆదోళనలు, ఆరోపణలతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. ఆరో విడత పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింస మరువక ముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లురువ్వడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారును భర్తరఫ్ చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. చివరి విడత ఎన్నికల ప్రచారంలో మమతను పాల్గొననకుండా ఆమెపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా బెంగాల్ పోలీసులు అమిత్ షాపై రెండు కేసులు నమోదు చేశారు. ఎన్నికల ర్యాలీ సందర్భంగా హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బీజేవైఎం కార్యకర్త ప్రియాంక శర్మ అరెస్ట్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మమత సర్కారుపై తీవ్ర ఆగ్రహం చేసిన విషయం తెలిసిందే. ఏకపక్షంగా ఆమెను అరెస్ట్ చేశారని.. వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ఈశ్వరీచంద్ర విద్యాసాగర్‌రావు విగ్రహాల కూల్చివేతతో బెంగాల్లో పలు చోట్ల హింస చేటుచేసుకుంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై బుధవారం ఎన్నికల సంఘం అత్యవసరంగా సమావేశమైంది. స్థానిక ఎన్నికల అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తోంది. దీంతో ఈసీ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠం నెలకొంది. మరోపైపు మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ, వామపక్షాలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టీఎంసీ రౌడీయీజం చేస్తోంది.. రాష్ట్రంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ బెంగాల్లో రౌడీయీజం చేస్తోందని ఆరోపించారు. ఆయన ర్యాలీపై రాళ్ల దాడి అనంతరం బుధవారం అమిత్ షా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మమతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్నటి హింసాత్మక ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎంసీ నేతల నిజస్వరూపం నిన్నటి ఘటనతో పూర్తిగా బయటపడిందని.. బెంగాల్లో కమలం వికసించడం ఖాయమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలో కోసం మమత హింసను ప్రేరేపిస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా మే 19న చివరి దశ పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో ఉత్కంఠంగా మారింది. -
మమతపై నిషేధం విధించండి..!
కోల్కత్తా: ఎన్నికల సమయంలో బెంగాల్లో హింసను ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రచారం చేయకుండా నిషేధించాలని బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ప్రశాతంగా జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతూ.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఈసీకి విజ్క్షప్తి చేశారు. బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని, రాజ్యాంగ వ్యవస్థలన్నీ మమత చేతిలో బంధీలుగా ఉన్నాయని వారు ఆరోపించారు. మే 19న జరిగే చివరి విడత ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనకుండా ఆదేశాలు జారీచేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆరోవిడత పోలింగ్‌లో భాగంగా జరిగన అల్లర్లలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పలువురు గాయపడగా.. పోలింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పూర్తిగా బెంగాల్లోనే మకాం వేశారు. వారిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజధాని కోల్‌కతాలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తల మధ్య తీవ్ర మంగళవారం ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అమిత్ షా ర్యాలీలో పాల్గొనగా, ఘర్షణలు జరగడంతో ర్యాలీని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. అమిత్ షా ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఈ గొడవ ప్రారంభమైందని అధికారులు చెప్పారు. కోపోద్రిక్తులైన బీజేపీ మద్దతుదారులు టీఎంసీ కార్యకర్తలతో గొడవకు దిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. అక్కడి మోటార్ సైకిళ్లకు నిప్పు పెట్టారు. ప్రముఖ తత్వవేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూడా బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటన తర్వాత కోల్‌కతాలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో చివరి విడత ఎన్నికల్లో టీఎంసీ నేతలను కట్టడి చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
దీదీ ప్రతిష్టకు అగ్ని పరీక్ష
పశ్చిమబెంగాల్లోని 9 లోక్‌సభ స్థానాలకు మే 19న చివరిదశలో పోలింగ్ జరుగుతుంది. కోల్‌కతా నగరం, దాని పరిసర ప్రాంతాల్లోని డైమండ్ హార్బర్, దక్షిణ కోల్‌కతా, ఉత్తర కోల్‌కతా, జాదవ్‌పూర్, బాసిర్‌హాట్, దమ్‌దమ్ ప్రధానమైనవి. పట్టణాల్లోని మురికివాడల ప్రజలు తృణమూల్‌కు, పట్టణ ధనిక, మధ్యతరగతి వర్గం సీపీఎంకి ఓటేసేవారు. ఈసారి నగరంలో వీరంతా బీజేపీకి గానీ కాంగ్రెస్‌కి గానీ ఓటు వేయొచ్చని రాజకీయ పండితుడు రణ్‌బీర్ సమందర్ అంచనా వేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో ఈ 9 సీట్లను తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సీఎం, తృణమూల్ నేత మమతా బెనర్జీ తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జాదవ్‌పూర్, సౌత్ కోల్‌కతా ఆఖరి దశ పోలింగ్ జరిగే సీట్లలో ముఖ్యమైనవి. మమతాబెనర్జీ 1984లో మార్క్సిస్టు దిగ్గజం, మాజీ లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీని జాదవ్‌పూర్‌లో ఓడించారు. 1989లో ఇక్కడ ఓడిపోయాక మమతా బెనర్జీ దక్షిణ కోల్‌కతా నుంచి పోటీచేయడం 1991లో మొదలైంది. మమతా బెనర్జీ దక్షిణ కోల్‌కతా నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1998లో మమతా బెనర్జీ దక్షిణ కోల్‌కతాలోనే తృణమూల్ కాంగ్రెస్‌ని ప్రారంభించారు. 2014లో దక్షిణ కోల్‌కతాలో తృణమూల్ నేత సుబ్రతా బక్షీ తన సమీప బీజేపీ అభ్యర్థి తథాగతరాయ్‌ను ఓడించారు. 1995 నుంచి కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ఉన్న మాలారాయ్‌ని ఈసారి తృణమూల్ బరిలోకి దింపింది. ఈసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్‌ని బీజేపీ పోటీకి దింపింది. కాంగ్రెస్ తరఫున మితా చక్రబర్తి, సీపీఎం టికెట్‌పై నందినీ ముఖర్జీ పోటీ చేస్తున్నారు. మేనల్లుడి సీటులో ‘హీటు’ మరో కీలక స్థానం డైమండ్ హార్బర్. ఇక్కడి తృణమూల్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 16 ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్ గెలిస్తే, 14 పర్యాయాలు సీపీఎం విజయఢంకా మోగించింది. 2009, 2014 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఈ సీటుని కైవసం చేసుకుంది. ఇక్కడ సీపీఎం తరఫున ఫౌద్ హలీం, బీజేపీ టికెట్‌పై నీలాంజన్ రాయ్, కాంగ్రెస్ నుంచి సౌమ్య రాయ్ పోటీ చేస్తున్నారు. డైమండ్ హార్బర్‌తో పాటు దమ్‌దమ్, బసీర్హాట్లో గెలుస్తామనే ధీమా బీజేపీలో కనిపిస్తోంది. దమ్‌దమ్ నియోజకవర్గంలో మొత్తం 11 సార్లు ఎన్నికలు జరిగితే ఐదు సార్లు సీపీఎం, కాంగ్రెస్ ఒకసారి, జనతాపార్టీ ఒకసారి, బీజేపీ రెండు సార్లు, తృణమూల్ రెండుసార్లు గెలుపొందాయి. కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన తపన్‌సిక్దర్ 1998లో దమ్‌దమ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి సీపీఐ సీనియర్ నాయకుడు ఇంద్రజిత్ గుప్తా ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఉత్తర కలకత్తా నుంచి తృణమూల్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో తృణమూల్ చేతిలో ఓడిపోయిన రాహుల్ సిన్హాని బీజేపీ తిరిగి బరిలోకి దింపింది. సీపీఎం అభ్యర్థిగా కనినికా బోస్, కాంగ్రెస్ నుంచి సయ్యద్ సాహిద్ ఇమామ్ పోటీ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక లోక్‌సభ స్థానం జాదవ్‌పూర్ నుంచి ఈసారి తృణమూల్ కాంగ్రెస్ మిమీ చక్రబర్తిని బరిలోకి దింపింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ తృణమూల్ అభ్యర్థి సుగతా బోస్ విజయం సాధించారు. రెండో స్థానంలో సీపీఐ , బీజేపీ మూడోస్థానంలో నిలిచాయి. ఈసారి పోటీ సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. బసీర్హాత్ నియోజకవర్గం మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. 14,90,596 మంది ఓటర్లున్న ఈ స్థానానికి ఇంద్రజిత్ గుప్తాలాంటి కాకలు తీరిన కమ్యూనిస్టు యోధులు ప్రాతినిధ్యం వహించారు. 2014లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి ఇద్రీస్ అలీ సీపీఐ అభ్యర్థి నురూల్ హుడాపై విజయం సాధించారు. 2009లో ఎస్కే నురూల్ ఇస్లాం తృణమూల్ టికెట్‌పై గెలుపొందారు. గత ఎన్నికల్లో తృణమూల్ కైవసం చేసుకున్న బారాసాత్, జయనగర్, మథురాపూర్‌లో కూడా చివరి దశలో పోలింగ్ జరుగుతుంది. 2014 ఎన్నికల్లో బారాసాత్‌లో తృణమూల్‌కి 41.39 శాతం ఓట్లు పోలయ్యాయి. జయ్‌నగర్‌లో సైతం తృణమూల్ 41.61 శాతం ఓట్లను సాధించింది. మథురాపూర్‌లో 49.59 శాతం ఓట్లు సాధించిన తృణమూల్ ఈ సారి కూడా గెలుపు తమదేనన్న ధీమాతో ఉంది. -
‘వారి గుండెల్లో బులెట్లు దింపాలి’
కోల్కత్తా: ఆరోవిడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బెంగాల్లో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఈ ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మే 19న జరిగే చివరి దశ పోలింగ్ ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే బీజేపీ సారథి అమిత్ షా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రచారంలో మునిగితేలుతున్నారు. మెజార్టీ సీట్లే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రచారంలో భాగంగా అమిత్ షా సోమవారం బెంగాల్లో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బసిర్హట్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సాయంతన్ బసు ఓ సమావేశంలో మాట్లాడుతూ.. చివరి దశ ఎన్నికల్లో తృణమూల్ కార్యకర్తలు ఆందోళలకు ప్రయత్నిస్తే భద్రతా సిబ్బంది వారికి తూటాలతో బదులివ్వాలని వ్యాఖ్యానించారు. దాడులకు పాల్పడుతున్న టీఎంసీ కార్యకర్తల గుండెల్లో బులెట్లు దింపి వారిని అణచివేయాలని పేర్కొన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త కూడా వారి దాడులను తిప్పకొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర బలగాలతో తాను మాట్లాడుతానని, వారు సక్రమంగా విధులు నిర్వర్తించపోతే బీజేపీ కార్యకర్తలే వారి పనిపట్టాలని అన్నారు. ప్రముఖ బెంగాలీ నటి, నస్రత్ జహాన్‌ను ఇక్కడి నుంచి టీఎంసీ బరిలో నిలిపింది. బీజేపీ నేత భారతిపై దాడి.. పశ్చిమబెంగాల్లోని 8 లోక్ సభ సీట్లకు పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఘటాల్ నియోజకవర్గంలోని కేశ్పూర్ ప్రాంతంలో పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారిణి భారతీ ఘోష్‌పై టీఎంసీకి చెందిన మహిళా కార్యకర్తలు దాడిచేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన భారతి రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో దొగాచియా పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ టీఎంసీ మద్దతుదారులు ఆమె కాన్వాయ్‌పై రాళ్లతో పాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలో భారతి భద్రతా సిబ్బంది ఒకరు గాయపడగా, కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా మనస్తాపానికి లోనైన ఆమె కన్నీరు పెట్టుకున్నారు. -
‘క్విట్ ఇండియాలా మరోసారి ఉద్యమించాలి’
కోల్కత్తా: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. దేశ వ్యాప్తంగా ఆరో విడత పోలింగ్ ఈనెల 12న జరుగనున్న విషయం తెలిసిందే. దీంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. కీలకమైన పశ్చిమ బెంగాల్లో మరో 17 స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మిద్నాపూర్‌లో పర్యటించిన మమత బీజేపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రిటీషర్ల కబంధ హస్తాల నుంచి భారతీయులను విముక్తి చేసిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. మోదీపై విమర్శల దాడి చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలంటే భారతీయులంతా మరోసారి క్విట్ ఇండియా తరహా ఉద్యమాన్ని చేపట్టాలని దీదీ పిలుపునిచ్చారు. గాంధీ స్ఫూర్తితో ఉద్యమించి మతతత్వ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని అన్నారు. దేశంలో అత్యయిక పరిస్థితి విధించినట్లు.. పౌరులపై నిర్బంధం విధిస్తున్నారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అంతకుముందు నుంచే మమత, మోదీ మధ్య మాటల యుద్ధం ముదురుతోన్న విషయం తెలిసిందే. రాజకీయ విమర్శలు దాటి.. వ్యక్తిగత ఆరోపణలు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ నేపథ్యంలో మోదీని ఉద్దేశించి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై.. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. దీదీ అన్ని హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘మమతా బెనర్జీ మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. కానీ మోదీ ఈ దేశానికి ప్రధాని. మెరుగైన పాలన అందించడం కోసం భవిష్యత్తులో మీరు, మేము కలిసి పని చేయాల్సి వస్తుంది. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదం’టూ సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. -
మోదీ x దీదీ
బెంగాల్ అంటే ఎన్నికల్లో హింస, బెంగాల్ అంటే నాటు బాంబుల పేలుళ్లు, బెంగాల్ అంటే తుపాకుల రాజ్యం. ఇన్నాళ్లూ ఇదే మాట. ఈ సారి లోక్‌సభ ఎన్నికల వేళ బెంగాల్ అంటే మోదీ వర్సెస్ దీదీ అనే మాటే వినిపిస్తోంది. ఒకరు కొదమ సింహమైతే, మరొకరు రాయల్ బెంగాల్ టైగర్. వీరిద్దరి మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తృణమూల్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ చేసిన కామెంట్స్ బెంగాల్ రాజకీయాల్ని కుదిపేశాయి. ఇద్దరు సమ ఉజ్జీల మధ్య జరుగుతున్న సమరం రసకందాయంలో పడింది. ఇప్పుడు ఇదే ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపించే అంశంగా మారింది. ఈ నెల 6న జరిగే అయిదో దశ పోలింగ్‌లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో రెండింట్లో మాత్రమే బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు అంచనా. స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే బెంగాల్ రాష్ట్రం గురించి చెప్పిన మాట ఒకటుంది. ‘‘ఇవాళ బెంగాల్ ఏం ఆలోచిస్తుందో, రేపు భారత్ కూడా అదే ఆలోచిస్తుంది‘‘ అంటే ఆ రాష్ట్ర ప్రజలు ఆలోచనల్లో ఎంత ముందు ఉంటారో అన్న అర్థంలో గోఖలే బెంగాల్‌ను ప్రశంసించారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 42 లోక్‌సభ స్థానాలతో కేంద్రంలో చక్రం తిప్పగలిగే ఈ రాష్ట్రంలో రాజకీయపరమైన హింస, ఎన్నికల వేళ హింస, వ్యక్తిగత దూషణలు, ధనబలం, కండబలం ఒక్కొక్కటిగా వచ్చి చేరాయి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడడం మొదలు పెట్టాక మతపరమైన విభజన కూడా మొదలైంది. కనీసం 22 లోక్‌సభ సీట్లలోనైనా నెగ్గాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న మోదీ, షా ద్వయం వ్యూహాలు అంత తేలిగ్గా అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయితే తనకు తిరుగులేదని, తన మాటే శాసనమన్న నియంతృత్వ ధోరణిలో పాలిస్తున్న మమతా బెనర్జీ(దీదీ)లో ఒక కలవరమైతే తెప్పించారు. ఈ సారి ఎన్నికల పోరు టీఎంసీ, బీజేపీ మధ్యే సాగుతోంది, సీపీఎం, కాంగ్రెస్ సైడ్ ప్లేయర్లుగా మారి బిత్తర చూపులు చూస్తున్నాయి. బన్‌గావ్‌లో మార్పు కోరుతున్నారా ? భారత్, బంగ్లాదేశ్‌లకు సరిహద్దుగా ఉన్న బన్గావ్ నియోజకవర్గం (ఎస్సీ నియోజకవర్గం)లో ఎస్సీల్లో విష్ణువుని పూజించే మతువా వర్గం ఓట్లు అత్యంత కీలకం. ఈ సారి ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నట్టు స్పష్టమవుతోంది. బంగ్లాదేశ్ నుంచి ఎగుమతులు, దిగుమతులు అత్యధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో పారిశ్రామిక పురోగతి జరగలేదు. అందుకే ఇక్కడ యువత మోదీ పట్ల ఆకర్షితులవుతున్నారు. ‘ఎప్పుడైనా మార్పు మంచికే జరుగుతుంది. కొత్త తరం మోదీపైనే ఆశలు పెట్టుకున్నారు’ అని స్థానిక వ్యాపారులు అంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చే వలసలు, వారిని అక్కున చేర్చుకోవడానికి తృణమూల్ అనుసరించే బుజ్జగింపు విధానాలు ఎంత మేర ప్రభావితం చూపిస్తాయో చూడాల్సిందే. తృణమూల్ తరపు నుంచి సిట్టింగ్ ఎంపీ మమతా బాల్ ఠాకూర్ పోటీ పడుతుంటే, అదే కుటుంబానికి చెందిన శాంతను ఠాకూర్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. బ్యారక్‌పూర్‌లో కమల వికాసం ? బ్యారక్‌పూర్‌లో ఇతర రాష్ట్రాలైన యూపీ, బీహార్ నుంచి వలస వచ్చిన ఓటర్లే ఎక్కువ. ఈ సారి ఎన్నికల్లో తృణమూల్ నుంచి పార్టీ ఫిరాయించి బీజేపీ గూటికి చేరిన అర్జున్ సింగ్ బరిలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఒకప్పుడు రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన దినేశ్ త్రివేది పోటీ పడుతున్నారు. రాష్ట్రేతరులు ఎక్కువగా ఉండడం, పరిశ్రమలు మూతపడి ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. ఇక మిగిలిన నియోజకవర్గాలైన హౌరా, ఉల్బేరియా, శ్రీరామ్‌పూర్, హుగ్లీ, ఆరంబాగ్‌లో మోదీపై దీదీ పైచేయి సాధించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఓట్ల శాతం పెరుగుతుంది కానీ... 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 17శాతం ఓటు షేరుతో 2 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ సారి ఓటింగ్ శాతం పెరగడం ఖాయం అన్న అంచనాలున్నాయి. అయిదు నుంచి ఏడు సీట్లు బీజేపీ గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో 15 సీట్లలో తృణమూల్‌కి గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. ఉత్తర బెంగాల్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఇక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పశ్చిమ ప్రాంతాలు, బెంగాల్‌కు సరిహద్దు ప్రాంతాల్లో బీజేపీ తన పట్టు ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మొత్తం 42 నియోజకవర్గాలకు గాను 40 శాతం ఓటుషేర్‌తో 34 సీట్లలో నెగ్గి తన పవరేంటో చూపించిన మమతపై బెంగాల్ ప్రజలు ఎంత మమత కురిపిస్తారో చూడాల్సిందే మరి. బెంగాలీలు త్వరగా మార్పుని ఆహ్వానించలేరు బెంగాల్ ఓటర్లు మార్పుని త్వరితగతిన కోరుకోరు. వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం జెండాలు, ఎజెండాలు మారుస్తారేమో కానీ, ఓటరు రాత్రికి రాత్రి పార్టీలను మార్చడు. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల కంచుకోట బద్దలవడానికే మూడు దశాబ్దాలకుపైగానే పట్టింది. ఇందుకు టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ రేయింబగళ్లు కష్టపడాల్సి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కమ్యూనిజంతోనే సమాజంలో మార్పు వస్తుందన్న నమ్మకం బెంగాల్ మధ్యతరగతి ప్రజల్లో బలంగా ఉండేది. 1977లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక రాజకీయ, ఆర్థిక, ఎన్నికల ప్రణాళికకు సంబంధించి ఒక మోడల్ని సృష్టించారు. బెంగాల్ గ్రామాల్లో దున్నేవాడికే భూమిపై హక్కుల్ని కట్టబెట్టడంతో వ్యవసాయ రంగం పరుగులు పెట్టింది. అయితే పారిశ్రామిక రంగంపై మాత్రం నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో అసంఘటిత రంగాలనే సీపీఎం ప్రోత్సహించింది. చిల్లర వ్యాపారులు, వీధి వ్యాపారులు, దుకాణదారులు, వారి సహాయకులు ఇలా కార్మిక శక్తినే కామ్రేడ్లు నమ్ముకున్నారు. 1990ల్లో అసంఘటిత రంగాల్లో ఉద్యోగాల రేటు ఏడాదికి 12 శాతం వరకు వెళ్లింది. కర్షక, కార్మిక శక్తులు బలపడినా ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆ రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించింది ఏమీ లేదు. పారిశ్రామిక రంగ పురోగతి సాధించకపోవడం, చిన్న కమతాలు కలిగిన రైతుల సంఖ్య పెరిగిపోవడం వల్ల పశ్చిమ బెంగాల్ మోడల్ ఒక విఫలప్రయోగంగానే మిగిలిపోయింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కూడా భారత్ జాతీయ సగటుకి చేరుకోలేకపోయింది. దీంతో సీపీఎం తన దారి మార్చుకొని పారిశ్రామికీకరణను బలవంతంగా అమలు చేయడం మొదలు పెట్టింది. అదే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత దీదీ ఒక అస్త్రంలా మార్చుకొని పోరు బాట పట్టారు. సింగూర్ ఆందోళనలు జనంలో ఆమె ఇమేజ్ను పెంచాయి. ఫలితం బెంగాల్లో ఎర్రకోట బీటలు వారింది. 2011లో తొలిసారిగా అధికారం చేపట్టిన దీదీ తనపైనున్న సింగూర్ ఇమేజ్‌ని చెరిపేసుకోలేక, కొత్త విధానాలు అమలు చెయ్యలేక కొంతకాలం సతమతమయ్యారు. ఆ తర్వాత మార్క్సిస్టుల బాటలో నడవక తప్పలేదు. బడా బడా పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచారు. ముఖేశ్ అంబానీ వంటి వారు ఆ రాష్ట్రాన్ని ‘వెస్ట్ బెంగాల్ ఈజ్ బెస్ట్ బెంగాల్’ అనేలా పారిశ్రామిక విధానాలు సరళతరం చేశారు. ఎన్నికల మోడల్ సూపర్ హిట్ పరిపాలనలో చతికిలపడినా ఎన్నికల ప్రణాళికలో సీపీఎం అనుసరించిన విధానాలు సక్సెస్ అయ్యాయి. 1990లలో సీపీఎంకి కార్యకర్తల బలం ఎంత ఉందంటే, అప్పట్లో బెంగాల్లో ఓటర్ల సంఖ్య 4 కోట్లు ఉంటే, దాదాపుగా 20 లక్షల మంది సీపీఎం కార్యకర్తలే ఎన్నికల్లో పనిచేసేవారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అంతకు అంత కార్యకర్తల అండదండ సంపాదించింది. అయితే ఇదంతా అధికార దర్పంతో, నియంతృత్వ విధానాలతోనే సాధించారు. రాష్ట్రంలో ఆరెస్సెస్ చాలా కాలంగా పనిచేస్తున్నప్పటికీ కమలనాథులు తృణమూల్ పార్టీ స్థాయిలో బలపడలేదు. కానీ మతపరమైన విభజన రేఖ గీయడంలో విజయం సాధించారు. అదే ఇప్పుడు ఎన్నికల్లో కీలక భూమిక పోషించబోతోంది. ముస్లిం ఓటర్లే కీలకం పశ్చిమ బెంగాల్ ఓటర్లలో 27శాతం ముస్లింలే. 28 లోక్‌సభ స్థానాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు. సీపీఎం ఓటు బ్యాంకు అటూ ఇటూ మళ్లిందేమో కానీ, ముస్లింలు మాత్రం దీదీ వైపే ఉన్నారు. ఆమె పాలనలోనే వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగారు ‘‘ముస్లింలు ఇప్పుడు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. టీఎంసీలో కూడా స్థానికంగా నాయకత్వం వహిస్తున్నారు’’ అని ప్రశాంత చటోపాధ్యాయ అనే జర్నలిస్టు వ్యాఖ్యానించారు. నదీ తీరంలో రాజకీయాలు ఏ మలుపు తిప్పుతాయి? ఈ నెల 6న జరగనున్న అయిదో దశ పోలింగ్‌లో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో అయిదు హుగ్లీ నదికి చెరోవైపున విస్తరించి ఉన్నాయి. బన్గావ్, బ్యారక్‌పూర్, హౌరా, ఉల్బేరియా, శ్రీరామ్‌పూర్, హుగ్లీ, ఆరంబాగ్‌లలో పోలింగ్ జరగనుంది. వీటిలో ఉత్తర 24 పరగణా జిల్లాలకు సరిహద్దుగా ఉన్న బన్గావ్, బ్యారక్పూర్లలో మతపరమైన హింస చెలరేగిన చోట బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నట్టుగా అంచనా. మమతఠాకూర్, శాంతను ఠాకూర్, అర్జున్ సింగ్, దినేశ్ త్రివేది -
మోదీపై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు
-
టచ్‌లో 40 ఎమ్మెల్యేలు
శ్రీరామ్‌పూర్/కొదెర్మా: బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని ప్రధాని మోదీ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాగానే టీఎంసీ నుంచి వీరంతా బయటకొస్తారన్నారు.బెంగాల్,జార్ఖండ్‌లో ప్రచారంలో పాల్గొన్న మోదీ, విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయొద్దు.. పశ్చిమబెంగాల్లో టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ పునాదులు కదలిపోతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రధాని పీఠంపై మమత కన్నేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘దీదీ.. కేవలం కొన్ని సీట్లతో మీరు ఢిల్లీని చేరుకోలేరు. ఢిల్లీ చాలాదూరంలో ఉంది. ఢిల్లీ పీఠంపై మమత దృష్టి పెట్టారన్నది ఎంతమాత్రం నిజం కాదు. వాస్తవం ఏంటంటే రాష్ట్రంలో తన మేనల్లుడు అభిషేక్‌ను సుస్థిరం చేసేందుకు మమత ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని మమతకు అర్థమైంది. అందుకే ఆమె తరచూ సహనాన్ని కోల్పోతున్నారు’ అని మోదీ తెలిపారు. అభిషేక్ ప్రస్తుతం డైమండ్ హార్బర్ లోక్ సభ సీటు నుంచి పోటీచేస్తున్నారు. అలాగే బెంగాల్లో ఎన్నికల హింసపై మోదీ స్పందిస్తూ.. ‘మమతా దీదీ.. మీ గూండాలు ప్రజలను ఓటేయకుండా అడ్డుకుంటున్నారు. మీరు ఇప్పుడు కూర్చుంటున్న సీఎం కుర్చీని ప్రజాస్వామ్యమే ఇచ్చింది. కాబట్టి ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయవద్దు. ఎవరికి ఓటేయాలో బెంగాల్ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు’ అని స్పష్టం చేశారు. బెంగాల్ ప్రజలు మోదీకి ఓటేయరనీ, అవసరమైతే రాళ్లు, మట్టితో చేసిన రసగుల్లాలు విసిరి పళ్లు విరగ్గొడతారని మమత విమర్శలపై మోదీ స్పందించారు. ‘అది(మట్టి–రాళ్లు) నాకు ప్రసాదం లాంటివి. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఠాకూర్ వంటి మహనీయులు పుట్టిన పవిత్రమైన బెంగాల్ నేల నుంచి వచ్చిన రాళ్లు, మట్టిని వినమ్రంగా స్వీకరిస్తా. మమత చెప్పిన మట్టి రసగుల్లాల్లో రాళ్లను కూడా నేను స్వాగతిస్తున్నా. నాపైకి ఎన్ని రాళ్లున్న రసగుల్లాలు వస్తాయో, టీఎంసీ గూండాల చేతిలో బెంగాల్ ప్రజలకు అన్ని దెబ్బలు తప్పుతాయి’ అని అన్నారు. కౌన్సిలర్ కూడా వెళ్లడు: టీఎంసీ 40 మంది తమ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న మోదీ వ్యాఖ్యలపై టీఎంసీ సీనియర్ నేత డెరెక్ ఒబ్రెయిన్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోదీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనీ, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ‘పదవీకాలం ముగిసిపోతున్న ప్రధాని బాబూ.. ఓ విషయం అర్థం చేసుకోండి. మీతో ఎవ్వరూ రావట్లేదు. ఎమ్మెల్యేలు తర్వాత సంగతి.. మా పార్టీ నుంచి ఒక్క కౌన్సిలర్ కూడా మీతో రాడు. మీ సమయం ముగిసిపోయింది. మీరు ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? లేక మా ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారా? ఈ విషయంలో మేం ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం’ అని తెలిపారు. -
దూడ గడ్డి
వెనకటికి వేళకాని వేళ ఒకాయన తాటిచెట్టు మీదకి ఎగబాకుతున్నాడట. పక్కనే రోడ్డుమీద నడిచి వెళ్తున్న మరొకాయన పలకరించాడట. ‘ఈ వేళప్పుడు తాటిచెట్టుమీదకి ఎందుకు ఎగబాకుతున్నావు బాబూ’ అని. వెంటనే ఆ ఆసామీ టక్కున సమాధానమిచ్చాడట– దూడగడ్డి కోసం అని. ఇది మనకి పాతబడిన సామెతే. సామెతకి పెట్టుబడి తాటిచెట్టుమీద దూడగడ్డి. బెంగాలులో ఎన్నికల కమిషన్ తరఫున నియమితులైన అజయ్ నాయక్ అనే ప్రత్యేక పర్యవేక్షకులు నిన్న ఒక మాట అన్నారు: ఇవాళ్టి బెంగాల్లో దాదాపు 15 ఏళ్ల కిందట బిహార్‌లో ఉన్న అరాచకత్వం, దౌర్జన్య తత్వం ప్రబలి ఉంది– అని. ఆయన లాకాయి లూకాయి మనిషి కాదు. ఆ రోజుల్లో బిహార్‌లో ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి. వెంటనే మమతా బెనర్జీ స్పందించింది. ఈయన ఆర్.ఎస్.ఎస్.– బీజేపీ మనిషి అనీ. ఆయన్ని వెంటనే రాష్ట్రం నుంచి బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ని డిమాండ్ చేసింది. గత ఎన్నికల తర్వాత చిత్తుగా ఓడిపోయిన సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు మాయావతిని ఎవరో అడిగారు. ‘ఏం? ఓడిపోయారేం?’ సమాధానానికి అలనాడు ఆవిడ తడువుకోలేదు. ‘నా శత్రువులందరూ ఏకమై నన్ను ఓడించారు’– అన్నారు. మరి ఎన్ని లక్షల మంది మిత్రులు ఏకమయి అంతకుముందు ఆమెని గెలిపించడంవల్ల లక్నో నిండా ఏనుగులు, ఆమె విగ్రహాలతో ఎన్ని పార్కులు వచ్చాయో మనకు తెలియదు. లోగడ– మనకు స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో ఉదాత్తమయిన నాయకులుండేవారు. అంతే ఉదాత్తమయిన ప్రతినాయకులూ ఉండేవారు. ఎన్నోసార్లు పండిట్జీ పార్లమెంటులో నిలబడి– కృపలానీ, జయప్రకాశ్ నారాయణ్ వంటివారు నిలదీయగా తన పొరపాట్లు ఒప్పుకున్న రోజులు నాకు తెలుసు. ప్రతినాయకులు వారి విచక్షణను గౌరవించి ఆ పొరపాటు సవరణకు ప్రభుత్వం తలపెట్టే చర్యను సమర్థించడమో, సలహా ఇవ్వడమో చేసేవారు. ఇది రాజకీయ పక్షాల మధ్య అమోఘమయిన సయోధ్య. మెజారిటీ జీవలక్షణం. కొన్ని కోట్లమంది ఈ ప్రభుత్వాన్ని ఎంపిక చేసి పదవిలో నిలిపారు. ఆ మెజారిటీని అందరూ గౌరవించాలి. నాయకుల తప్పటడుగునీ గమనించాలి. అర్థం చేసుకోవాలి. ప్రజాసేవలో పార్లమెంటులో కుర్చీ మారినంత మాత్రాన ఎవరూ దేవుళ్లు కాదు. కానీ ఇదేమిటి? ఈనాడు ప్రతిపక్షాలు పదవిలో ఉన్న నాయకుడిలో దేవుడిని ఆశిస్తాయి. అంతేకాదు. ఒక్క లోపాన్ని ఒప్పుకుంటే గద్దె దిగాలని డిమాండ్ చేస్తాయి. వారినక్కడ కూర్చోపెట్టింది ప్రజ. కొంతమంది సేవాతత్పరుల, మేధావుల, అనుభవజ్ఞుల సమష్టి కృషి దేశ పాలన. నిన్ను నేను తిట్టడం, నన్ను నువ్వు తిట్టడం. తీరా ఆ వ్యక్తిలో లోపం బయటపడితే– ఇక పాలనని అటకెక్కించి ఆ పార్టీని దించడానికి తైతక్కలు– ఇదీ ప్రస్తుత రాజకీయం. ఇక్కడ నిజాయితీ ఎవరికీ అందని తాయిలం. ఏ నాయకుడూ– పొరపాటున కూడా ఇంట్లో పెళ్లాంతో కూడా పంచుకోడేమో. పంచుకుంటే ఏమ వుతుంది. దాన్ని వదిలేసి, పాలనని అటకెక్కించి– ఆ నాయకుడిని గద్దెదింపే అతి భయంకరమైన ఘట్టం ప్రారంభమవుతుంది. అందుకనే ఈ దేశంలో ప్రతీ నాయకునికీ– తనదైన దూడగడ్డి ఉంటుంది. అవసరమైనప్పుడు దానిని వాడుతూంటారు. వారికి తెలుసు. పాలనలో నిజమైన నిజంకన్నా ‘రకరకాల దూడగడ్డి’ తమ కుర్చీని కాపాడుతుందని. మనలో మనమాట– బెంగాల్లో అరాచకత్వం – బిహార్‌లో లోగడ స్థాయిలో ఉందని గ్రహించడానికి ఓ ఐఏఎస్ ఆఫీసర్ నోరిప్పనవసరం లేదు. అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మమతా బెనర్జీ నోరిప్పి అవునంటే (అలాంటి బూతు మాటలు విని ఈ దేశంలో కనీసం 60 ఏళ్లు దాటింది) దూడగడ్డి అందరికీ ఆహారమవుతుంది. నిజం మాట దేవుడెరుగు, ఆమెని గద్దె దించే ఓ బృహత్తర కర్మకాండ ప్రారంభమవుతుంది. ఈ దేశంలో ‘రాజకీయ’మనే ముచ్చటకి నాంది పలుకుతుంది. మనలో మనమాట– మన దేశంలో అలనాటి సంప్రదాయం కొనసాగగలిగితే– మోదీగారు ఎన్ని సార్లు నోరిప్పాలి. ఎందుకు విప్పరు? విప్పరని రాజకీయ రంగంలో ఎవరికి తెలియదు. The function of democracy is not to create Utopia. But an attempt to strive towards it with objective realities. నిజాయితీని అటకెక్కించిన ఈనాటి నేపథ్యంలో– ఇటు పాత్రికేయులకీ, అటు నాయకులకీ కొన్ని మర్యాదలు కావాలి. ఆ ఎల్లల మధ్యే బంతి పరిగెత్తాలి. మధ్య మధ్య మమతా బెనర్జీ, మాయా వతి, అలనాటి జయలలిత, అప్పుడప్పుడు చంద్ర బాబు, ఎల్లకాలం– లాలూ ప్రసాద్ విసురుతూ ఉంటారు. మమత పళ్లు బిగించి ఐఏఎస్ ఆరెస్సెస్ మనిషి అన్నప్పుడు మనకి కితకితలు పెట్టినట్టుంటుంది. అసలు నిజమేమిటో అన్న మనిషికీ, ఎదిరించిన మనిషికీ తెలుసు, దీన్ని కాలమ్గా మలచిన నాకూ తెలుసు, నాకు తెలుసని మీకూ తెలుసు. మీకు తెలుసునని మా అందరికీ తెలుసు. గొల్లపూడి మారుతీరావు -
భగినికి విడుదల కష్టాలు
ఇది ఎన్నికల సీజనే కాదు. పొలిటికల్ బయోపిక్ సీజన్ కూడా. ఎన్ని అవాంతరాలెదురైనా, ఏ సినిమా ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా రాజకీయ నేతలు జీవిత చరిత్రలు తెరకెక్కుతూనే ఉన్నాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జీవితం స్ఫూర్తితో ‘భగిని–బెంగాల్ టైగ్రస్’ పేరుతో ఒక సినిమా తీశారు. ఈ సినిమాను మే 3న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ట్రైలర్ ఇలా బయటకు వచ్చిందో లేదో బీజేపీ, వామపక్షాలు ఈ మూవీపై భగ్గుమంటున్నాయి. వెంటనే ఈ సినిమా విడుదల నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌ను ఆపినప్పుడు ఈ సినిమా విడుదలకు ఎలా అంగీకరిస్తారంటూ బీజేపీ వాదిస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిణి ఇందిరా బందోపాధ్యాయ రూపురేఖలు, నడక నడత అచ్చంగా మమతనే తలపించేలా ఉన్నాయి. తెల్లచీర కట్టుకొని, జుట్టు ముడి వేసుకున్న ఆ పాత్ర మమతది కాదంటే ఎవరూ నమ్మేలా లేదు. అంతేకాదు ట్రైయలర్లో ఆమెను దీదీ అని సంబోధించడం కూడా కనిపించింది. ఈ పాత్రని అనన్య గుహ, అలోక్నంద గుహ, రుమా చక్రవర్తి ఆయా వయసులకి అనుగుణంగా పోషించారు. బయోపిక్ కాదు: దర్శకుడు సినిమా డైరెక్టర్ నేహల్ దత్తా ఇది మమతా బెనర్జీ బయోపిక్ కాదని వాదిస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మాత్రమే ఈ చిత్రాన్ని నిర్మించామని చెబుతున్నారు. ‘మోదీ సినిమా మాదిరి ఇది బయోపిక్ కాదు. అయితే మమత నుంచి స్ఫూర్తిని పొంది సినిమా తీశాం. ఆమెలాంటి వ్యక్తిత్వం ఉన్న మహిళ ఎక్కడా కనిపించరు. మహిళా సాధికారతను ఉద్విగ్నభరితంగా తెరకెక్కించాం’ అని చెప్పారు. ‘జీవితంలో తనకెదురైన సమస్యల్ని, అవరోధాలను ఒక మహిళ ఎంత దృఢంగా ఎదుర్కొందో చెప్పడమే మా ఉద్దేశం. మమత జీవితాన్ని తెరకెక్కిస్తే సినిమా టైటిల్ సీఎం మమత బెనర్జీ అని పెట్టేవాళ్లం కదా’ అని ఆయన ప్రశ్నించారు. ఈ సినిమా 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందే పూర్తయిందని కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, గ్రాఫిక్ వర్క్ మిగిలిపోవడంతో ఇన్నాళ్లు టైమ్ పట్టిందని నిర్మాత పింకీ పాల్ వెల్లడించారు. బీజేపీ పశ్చిమబెంగాల్ నేతలు ఎన్నికలు పూర్తయ్యే దాకా ఈ సినిమా విడుదల నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ బెంగాల్ శాఖ ఉపాధ్యక్షుడు జోయ్ ప్రకాశ్ మజందార్ ఎన్నికల సంఘానికి లేఖ రాస్తూ మోదీ బయోపిక్ తరహాలోనే ఈ సినిమా విడుదలకు ముందు ఒక్కసారి చూసి సమీక్షించాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ఈ సినీ దర్శక నిర్మాతలు మమతా బెనర్జీకి వీరాభిమానులు. అలాంటప్పుడు ఆ సినిమా ఎలా ఉంటుందో ఎవరూ చెప్పనక్కర్లేదు. ఎన్నికలయ్యాకే దీనిని విడుదల చేయాలి’ అని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. -
బీజేపీకి ‘రసగుల్లా’
బాలుర్ఘాట్/గంగరామ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ‘రసగుల్లా’నే (సున్నాను సూచిస్తూ) దక్కుతుందని, ఆ పార్టీ కనీసం ఒక్క స్థానం గెలవదని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బెంగాల్లో ఎక్కువ సీట్లు గెలవాలన్న ప్రధాని మోదీ ఆశ కలగానే మిగులుతుందన్నారు. దక్షిణ్ దినాజ్‌పూర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో కనీసం సగమైనా గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని, కానీ 2014 ఎన్నికల్లో వచ్చిన రెండు సీట్లలో కూడా ఈసారి గెలవదన్నారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి 100 సీట్లు కూడా రావన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిశాలో ఆ పార్టీ ఖాతా తెరవదన్నారు. బెంగాల్లో ఆశ్చర్యం కలిగించే ఫలితాలు వస్తాయన్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై స్పందించిన ఆమె... సున్నా స్థానాలు గెలుపొంది నిజంగానే ఆశ్చర్యానికి గురవుతారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఛాయ్‌వాలా ప్రధానికి, కేథీవాలా (ఛాయ్ ఉంచే పాత్ర) ఆర్థిక మంత్రి అని జైట్లీని విమర్శించారు. ఐదు సంవత్సరాల క్రితం తాను ఛాయ్‌వాలా అని, ఇప్పుడు చౌకీదార్ అని చెప్పుకుంటున్న మోదీకి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మిగిలేది చౌకీనే (మంచం) అన్నారు. 2014లో బీజేపీ గెలిచిన డార్జిలింగ్ సహా రాష్ట్రంలో మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న ఐదు స్థానాల్లో టీఎంసీ విజయం సాధిస్తుందని మమతా ధీమా వ్యక్తం చేశారు. -
‘ఆ విషయంలో కాంగ్రెస్ విఫలమైంది’
కోల్కత్తా: జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొవడంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. గడిచిన ఐదేళ్ల కాలంలో బీజేపీ వైఫల్యాలను కాంగ్రెస్ ప్రశ్నించలేకపోయిందని అన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ కాంగ్రెస్‌కు రాదని, విపక్షాల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని మమత అభిప్రాయపడ్డారు. ఎన్నికల అనంతరం జాతీయ స్థాయిలో తృణమూల్ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టంచేశారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో అంతా భూటకమని, రామమందిర అంశం కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందడం కొరకు మాత్రమే అని పేర్కొన్నారు. మమత ఆరోపణలపై బెంగాల్ కాంగ్రెస్ ఛీప్ సోమిన్ మిత్రా వెంటనే స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు మమత పరోక్షంగా సహకరిస్తున్నారని అన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికలల్లో బీజేపీ, తృణమూల్, కాంగ్రెస్ హోరాహోరీగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. తొలి విడత ఎన్నికల్లో భాగంగా రెండు లోక్‌సభ స్థానాలకు రేపు ఎన్నికల జరుగనున్నాయి. -
అధికార యంత్రాంగంతో విపక్షాల అణచివేత
జల్పాయిగురి/ఫలాకటా: ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం సంస్థలను, అధికార యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తమ కేబినెట్ కార్యదర్శిని గానీ, హోం శాఖ కార్యదర్శిని గానీ ఎందుకు తొలగించడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సంఘం(ఈసీ) బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆమె ‘రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటోంది? ఏపీ చీఫ్ సెక్రటరీని ఎందుకు తొలగించారు? అని నిలదీశారు. ‘మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కుటుంబంపై దాడులు చేయించారు. ఏపీ సీఎంపైనా దాడి చేయించారు. ఆదాయపన్ను శాఖ, సీబీఐ అధికారులను, సంస్థలను బీజేపీ ప్రభుత్వం స్వార్థం కోసం వాడుకుంటోంది’ అంటూ విమర్శించారు. రాష్ట్రంలో అధికారుల తొలగింపుపై ఆమె స్పందిస్తూ.. ‘ఓటమి భయంతోనే వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారు ఎంతగా అధికారులను మారిస్తే, అంతగా మాకు విజయావకాశాలు మెరుగవుతాయి’ అని అన్నారు. తనను చూసి మమతా భయపడుతున్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘నిజానికి నన్ను చూసి మోదీ భయపడుతున్నారు. నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టాలని చూస్తే, అంతగా ఎదురు తిరిగి గర్జిస్తాం. ఈ దీదీ ఎవరికీ, దేనికీ భయపడేది కాదు’ అని తీవ్ర స్వరంతో అన్నారు. ప్రధాని మోదీ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదనీ, కనీసం రాష్ట్రం పేరును కూడా మార్చేందుకు అనుమతివ్వలేదని ఆరోపించారు. మాకు పూర్తి అధికారాలున్నాయి: ఈసీ మమతా విమర్శలపై ఈసీ స్పందించింది. స్పెషల్ పోలీస్ పరిశీలకులు, ఇతర ఉన్నతాధికారుల నుంచి అందిన సమాచారం మేరకే అధికారులను మార్చినట్లు తెలిపింది. ఎన్నికల నిబంధనావళి మేరకు ఈ విషయంలో తమకు పూర్తి అధికారాలున్నాయని స్పష్టం చేసింది. తొలగించిన స్థానాల్లోనూ సమర్థులైన అధికారులను నియమిస్తున్నట్లు పేర్కొంది. -
విడగొట్టేవారితో దీదీ దోస్తీ
కూచ్‌బెహర్/ఉదయ్‌పూర్: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. భారత్‌ను విడగొట్టాలనీ, దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండాలని చెప్పేవారితో మమత చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలను స్పీడ్ బ్రేకర్లా మమతా బెనర్జీ ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనీ, అందువల్లే రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ విపక్షాల వ్యవహారశైలిని తప్పుపట్టారు. బెంగాల్ ప్రతిష్టను దిగజార్చారు.. బెంగాల్‌లోని కూచ్ బెహర్ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ కోట్లాది రూపాయల ప్రాజెక్టులను ఈ ప్రాంతానికి మంజూరు చేసినప్పటికీ మమత అడ్డుకున్నారని ఆరోపించారు. ‘శారదా, రోజ్ వ్యాలీ, నారదా చిట్‌ఫండ్ కుంభకోణాలతో దీదీ(మమత) బెంగాల్ ప్రతిష్టను దిగజార్చారు. దోపిడీ చేసిన ప్రతీ పైసాకు ఈ చౌకీదార్(కాపలాదారు) లెక్కలు అడుగుతాడు. మోదీ.. మోదీ అనే నినాదాలతో ఈ బెంగాల్ స్పీడ్ బ్రేకర్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎన్నికల సంఘంపై మమత కోప్పడటం పశ్చిమబెంగాల్లో ఆమె రాజకీయ పునాదులు కదిలిపోతున్నాయని చెప్పేందుకు నిదర్శనం’ అని మోదీ తెలిపారు. భారత్, కశ్మీర్‌కు వేర్వేరుగా ప్రధానులు ఉండాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఇటీవల చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. దేశాన్ని ముక్కలుముక్కలు చేయాలనుకునే ఇలాంటి వ్యక్తులతో మమత చేతులు కలుపుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి చర్యల ద్వారా మమత భారత్‌లో కశ్మీర్ విలీనానికి పాటుపడ్డ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ వంటి దిగ్గజ నేతల త్యాగాలను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొరబాటుదారులకు ఆశ్రయం.. విదేశీ చొరబాటుదారులకు ఆశ్రయమివ్వడం ద్వారా మమత కేంద్రాన్ని మోసం చేశారని మండిపడ్డారు. ‘ఇలాంటి అక్రమ చొరబాటుదారుల్ని దేశం నుంచి తరిమివేయడానికి ఈ చౌకీదార్ జాతీయ పౌర, పౌరసత్వ రిజిస్టర్ బిల్లును తీసుకొచ్చాడు. కానీ మమత తన మహాకల్తీకూటమి మిత్రపక్షాలతో కలిసి కేంద్రాన్ని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అత్తా–అల్లుడి ప్రభుత్వం(మమతా బెనర్జీ–అభిషేక్ బెనర్జీ) ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని చొరబాటుదారులకు స్వర్గంగా మార్చేసింది’ అని విమర్శించారు. 7వ వేతన సంఘం సిఫార్స్‌లను బెంగాల్లో ఎందుకు అమలు చేయడం లేదో మమత చెప్పారా? అని ప్రజలను మోదీ ప్రశ్నించారు ఏపీ నుంచి రాహుల్ పోటీచేయొచ్చు కదా! కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. త్రిపురలోని ఉదయ్‌పూర్ సభలో మాట్లాడుతూ..‘25 ఏళ్ల వామపక్షాల పాలనకు చరమగీతం పాడి త్రిపుర దేశానికి ఆదర్శంగా నిలిచింది. బీజేపీని నమ్మి గెలిపించినందుకు నేను త్రిపుర ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నా. విపక్షాలు నన్ను అధికారం నుంచి తప్పించేందుకు ఎంతకైనా తెగిస్తాయి. అవసరమైతే పాకిస్తాన్‌కు భజన చేసేందుకు కూడా వెనుకాడవు. త్రిపురలో అధికారం కోసం పోరాడుతున్న కాంగ్రెస్, వామపక్షాలు కేంద్రంలో మాత్రం ఏకమవుతున్నారు. వామపక్షాల సహకారం లేకుంటే రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు? దక్షిణాది నుంచే పోటీచేయాలనుకుంటే పాండిచ్చేరి, కర్ణాటకలు కూడా ఉన్నాయి కదా. మరీ అంతగా కావాలనుకుంటే ఏపీకి కూడా రాహుల్ వెళ్లొచ్చు. అక్కడ కాంగ్రెస్ ఇటీవల యూటర్న్ బాబు(చంద్రబాబు)తో చేతులు కలిపింది’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 2014 నుంచి ఎన్డీయే మిత్రపక్షంగా కొనసాగిన టీడీపీ గతేడాది మార్చిలో కూటమి నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే త్రిపురలో ఏడాది కాలంలోనే బిప్లవ్ దేబ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గణనీయమైన అభివృద్ధి పనులు చేపట్టిందనీ, మౌలిక సదుపాయాలు కల్పించిందని మోదీ కితాబిచ్చారు. త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాలకు ఈ నెల 11, 18 తేదీల్లో పోలింగ్ జరగనుంది. -
అక్కడి సేల్స్.. జనం పల్స్ చెబుతాయి!
సాక్షి, సెంట్రల్ డెస్క్ : కోల్‌కతాలో అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్ బుర్రా బజార్. అక్కడ అడుగుపెడితే.. ఎలక్షన్ ఫీవరే కాదు, జనం నాడిని కూడా పట్టుకోవచ్చు. ఈ మార్కెట్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన ఎన్నికల సామగ్రి ఎక్కువగా అమ్ముడుపోతుంది. జాతీయ జెండాలు, టీ షర్ట్లు, చీరలు, స్టోన్స్, గొడుగులు, బ్యాడ్జెట్స్, రిస్ట్ బ్యాండ్స్, బెలూన్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వాటి మీద మోదీ ఫొటోలు, లేదంటే ఆకట్టుకునే బీజేపీ ఎన్నికల నినాదాలు కనిపిస్తాయి. ఇక టీఎంసీ ఎన్నికల గుర్తు గడ్డి, రెండు పువ్వులు, ఆ పార్టీ ఎన్నికల నినాదాలు ముద్రించి ఉన్న వస్తువులకీ డిమాండ్ ఎక్కువుంది. గత రెండు నెలల అమ్మకాలు పరిశీలిస్తే టీఎంసీకి చెందినవి 10 వేల వస్తువులు అమ్ముడుపోతే, బీజేపీవి 2,500 అమ్ముడయ్యాయి. ‘కోల్‌కతాలో అతి పెద్ద మార్కెట్ ఇదే. బెంగాల్ నలుమూలల నుంచి ఎన్నికల సమయంలో పార్టీ మద్దతుదారులు వచ్చి రకరకాల వస్తువులు కొంటుంటారు. 50 ఏళ్లుగా నా దుకాణం ఇక్కడే ఉంది. తృణమూల్ పార్టీ వస్తువులకే డిమాండ్ ఎక్కువ. టీఎంసీ, బీజేపీ అమ్మకాలు 4ః1 నిష్పత్తిలో ఉంటాయి’ అని గంభీర్ అనే దుకాణదారుడు వివరించారు. ఈ అమ్మకాలే ఓ రకంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సరళిని కూడా తెలుపుతోందని ఆయన అన్నారు. ‘ఎన్నికలకు ఆరు నెలల ముందే పార్టీల వారీగా సామగ్రిని అమ్మకానికి పెడతాం. మొత్తమ్మీద అమ్మకాల ఆధారంగా జనం మూడ్‌ని పసిగట్టగలం’ అని మరో దుకాణదారుడు కిషన్ దాగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ మార్కెట్లో మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని సూరత్ నుంచి వచ్చిన వ్యాపారులే ఎక్కువున్నారు. కానీ ఈ మార్కెట్‌పై మమత పట్టు కొనసాగుతోంది. రాహుల్ టీ షర్టుల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. -
‘దమ్ముంటే నన్ను తొలగించండి.. ఈసీకి సవాల్’
కోల్కత్తా: ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహర తీరుపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నలుగురు ఉన్నతాధికారులను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మమత ఘాటుగా స్పందించారు. ఈసీ కేవలం అధికారులను మాత్రమే తొలగిస్తోందని, దమ్ముంటే తనను పదవి నుంచి తొలగించాలని సవాలు విసిరారు. పలువురు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేయడంపై మమత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిర్వహించిన ఓ బహిరంగ సభలో మమత మాట్లాడుతూ.. కేంద్రం, ఈసీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంచి అధికారులుగా గుర్తింపుపొందిన వారిని బదిలీ చేయడం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అదేశాలకు అనుగుణంగా ఈసీ పనిచేస్తోందని మమత ఆరోపించారు. యూపీలో ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల బదిలీలపై బీఎస్పీ అధినేత మాయావతి కూడా ఇదే విధంగా స్పందించిన విషయం తెలిసిందే. కాగా ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలువురు అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంటున్న విషయం విధితమే. కోల్కత్తా సిటీ పోలీస్ కమిషనర్‌గా అనూజ్ శర్మను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో రాజేష్ కుమార్‌ను నియమించింది. 1991 బ్యాచ్‌కు చెందిన అనూజ్ శర్మ ఇటీవల కోల్కత్తా పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అలాగే బిధాన్ నగర్ కమిషనర్, బిర్భం జిల్లా, డైమండ్ హార్భర్ ఎస్పీలను కూడా తొలగించింది. వీరి స్థానంలో నటరాజన్ రమేష్ బాబు, అవణ్ణు రవింద్రనాథ్, శ్రీహరి పాండేలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి తెలియజేస్తూ లేఖ రాసింది. -
విక్టోరియా కోటలో విక్టరీ ఎవరిదో
బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్– కాంగ్రెస్ మధ్య పొసగని పొత్తు తృణమూల్ కాంగ్రెస్‌కు, బీజేపీకి అనుకూలిస్తోందా? లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఈ రెండూ వేర్వేరుగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం రెండు అధికార పార్టీలకు కాలం కలిసివచ్చేట్టు కనిపిస్తోంది. గత ఏడాదిగా పశ్చిమబెంగాల్ రాజకీయాలు తృణమూల్, బీజేపీలకు అనుకూలంగా మారాయి. పశ్చిమబెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కి పట్టులభిస్తే, ఉప ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో నిలవగలిగింది. 2016 నుంచి మొదలుకొని ప్రతి ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ రెండూ విడివిడిగా పోటీచేసి, ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఈ రెండు పార్టీలూ ఈ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకొని ఉమ్మడిగా పోటీ చేయాలని చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఇది తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ఓట్ల శాతం పెరగడానికి దోహదపడబోతోంది. 1998 నుంచి 2004 ఎన్నిక వరకూ తృణమూల్‌తో పొత్తుతో బలపడిన బీజేపీ, ఇప్పుడు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విధానాల కారణంగా మళ్లీ పుంజుకుంటోంది. బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రతి స్థానంలోనూ బలమైన, సరికొత్త ముఖాలను పరిచయం చేయాలని భావించి, జాబితా తయారుచేసింది. లెఫ్ట్ ఫ్రంట్ – కాంగ్రెస్ మధ్య పొత్తులు పొసగలేదు. ఒకవేళ ఈ రెండు పక్షాల మధ్య పొత్తు కుదిరి ఉంటే పోటీ మరోలా ఉండేది. ఇవి విడివిడిగా పోటీ చేయనుండటం తృణమూల్, బీజేపీకే లాభించనుంది. కమ్యూనిస్టుల కోటలో ‘కాషాయం’ పాగా అధికారం కోల్పోయినప్పటి నుంచీ కమ్యూనిస్టులు ఊపిరాడని పరిస్థితుల్లో పడ్డారు. ప్రదర్శనలు, బహిరంగ సమావేశాల నిర్వహణకు అవకాశం లేకుండా తృణమూల్ సర్కారు వ్యవహరించింది. దీనికి తోడు ముస్లింలు పెద్దసంఖ్యలో నివసించే బంగ్లాదేశ్ సరిహద్దున ఉన్న జిల్లాలు, ఇతర ప్రాంతాల్లో మైనారిటీలను ఆకట్టుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజలు హిందువులు, ముస్లింలుగా విడివడి ఆలోచించేలా చేశాయి. ఈ క్రమంలో నెమ్మదిగా కమ్యూనిస్టుల స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే క్రమంలో ముందుకు సాగుతోంది. కిందటేడాది మేలో జరిగిన బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం కంటే నాలుగు రెట్లు ఎక్కువ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. తృణమూల్ ఒత్తిడికి తట్టుకోలేక గతిలేని స్థితిలో సీపీఎం కొన్నిచోట్ల బీజేపీకి ఈ స్థానిక ఎన్నికల్లో సహకరించింది. ఇటీవల మాల్దాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగ సభకు ప్రభుత్వ స్థలాలు అద్దెకివ్వకపోవడంతో ఓ సీపీఎం నేత తన ప్రైవేటు స్థలాన్ని బీజేపీకి ఇచ్చారంటే కమ్యూనిస్టుల దుస్థితి అర్థమవుతోంది. బీజేపీకి మూడోవంతు జనం మద్దతు ఉందా? మార్క్సిస్టులు బలహీనం కావడంతో ప్రస్తుతం బీజేపీయే తృణమూల్‌కు ప్రత్యామ్నాయంగా అవతరించే దిశగా సాగుతోందని రాజకీయ పండితుల అంచనా. ఇటీవల ఓ న్యూస్ చానల్ చేసిన సర్వేలో కూడా ఈ విషయమే స్పష్టమైంది. లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ 31, బీజేపీ 11 సీట్లు సాధిస్తాయని ఈ సర్వే జోస్యం చెప్పింది. కాషాయపక్షం 32 శాతం ఓట్లు సాధిస్తుందని కూడా వెల్లడించింది. ఈ లెక్కన బీజేపీ ఈ ఎనిమిదేళ్లలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగినట్టే భావించాలి. బెంగాల్లో 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కమ్యూనిస్టులు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెంగాల్‌కు చెందిన శ్యామాప్రసాద్ ముఖర్జీ బీజేపీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ (బీజేఎస్)ను స్థాపించారు. ఆచితూచి అభ్యర్థుల ఎంపిక ఇటు పాలన వ్యవహారాల్లోనూ, అటు పార్టీలోనూ పట్టున్న కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ మాలా రాయ్ కోసం ప్రతిష్టాత్మక కోల్‌కతా దక్షిణ సీటు నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సుబ్రతా భక్షిని తప్పించింది. పార్టీ సీనియర్ నాయకులు, పంచాయతీరాజ్ మాజీ మంత్రి అయిన సుబ్రతా భక్షీని బీజేపీకి గట్టిపోటీ ఇచ్చేందుకు బంకురా లోక్‌సభ స్థానానికి మార్చారు. 2018 పంచాయతీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి మొగ్గు ఉందని భావించిన బంకురా, ఝర్గ్రామ్, బోల్పూర్, మేదినీపూర్ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు అర్థమవుతోంది. అత్యధిక జనాభా కలిగిన మథువా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, ఇటీవల హత్యకు గురైన ఎంఎల్ఏ సత్యజిత్ బిస్వాస్ భార్యను రాణాఘాట్ నుంచి టీఎంసీ పోటీకి దింపింది. కృష్ణానగర్ సిట్టింగ్ ఎంపీ తపస్‌పాల్ స్థానంలో తరచూ టీవీల్లో కనిపించే కరీంపూర్ ఎమ్మెల్యే మహువా మోయిత్రాని తృణమూల్ అభ్యర్థిగా ప్రకటించారు. ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన మాజీ మంత్రి పరేష్ అధికారిని కూచ్ బెహార్ నుంచి పోటీకి దింపారు. గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) నేత, డార్జిలింగ్ ఎమ్మెల్యే అమర్‌సింగ్ రాయ్‌ని డార్జిలింగ్ లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. ఫలించిన మమత పోరాటం బెంగాల్ ‘అగ్ని కన్య’గా పేరొందిన మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో, తృణమూల్ కాంగ్రెస్‌లో దాదాపు 35 ఏళ్లకు పైగా మార్క్సిస్టులపై చేసిన పోరాటం ఫలించింది. భూసేకరణ విషయంలో జనం తరఫున ఆమె ఆమరణ దీక్షలు సహా వివిధ రకాల ఉద్యమాలు నడిపారు. పాలకపక్షంపై జనంలో వ్యతిరేకత బుద్ధదేవ్ పాలన చివరి ఐదేళ్లలో పెరిగి పాకాన పడింది. అయితే, పాలనలో, ప్రతిపక్షాలతో వ్యవహరించే తీరులో కమ్యూనిస్టులనే మమత అనుసరించారు. తృణమూల్ సర్కారు అనుసరించిన జనాకర్షక పథకాలు, జనాభాలో 30 శాతమున్న ముస్లింలను ఆకట్టుకోవడానికి అడ్డగోలుగా అనుసరిస్తున్న పద్ధతులు మమతను బలోపేతం చేశాయి. ఫలితంగా బెంగాల్లో కమ్యూనిస్టుల స్థానాన్ని తృణమూల్ ఆక్రమించింది. 2014 లోక్‌సభ ఎన్నికల తరువాత మోదీ ప్రభంజనంతో బీజేపీ పశ్చిమబెంగాల్లో బలమైన శక్తిగా అవతరించింది. ఇది గత అసెంబ్లీ ఎన్నికల్లోనే రుజువైంది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో బీజేపీ 11.66 శాతం ఓట్లను సాధించింది. 2014కి వచ్చేసరికి బీజేపీ ఓట్ల శాతం ఏకంగా 16.8 శాతానికి పెరిగింది. 2014లో తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా విడివిడిగా పోటీ చేసిన కాంగ్రెస్ నాలుగు సీట్లూ, సీపీఎం రెండు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. ఈ రెండు పార్టీల పరిస్థితిలో నాలుగేళ్లుగా పెద్ద మార్పేమీ లేదు. ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీచేసిన 2014 లోక్‌సభ, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తృణమూల్, బీజేపీలకు కలిసివచ్చాయి. గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాల్లో 211 తృణమూల్ కైవసం చేసుకొని విజయ సోపానానికి ఎగబాకింది. తృణమూల్ సర్కారు జనరంజకంగా పాలించే బాధ్యతతో పాటు, ప్రతి ఎన్నికల్లో పార్టీని గెలిపించే పని కూడా మమతా బెనర్జీదే. 64 ఏళ్ల మమత ఎనిమిదేళ్లుగా పదవిలో కొనసాగుతూ పాలనపై పట్టు సంపాదించారు. అధికారం మొత్తం పార్టీ నేత కూడా అయిన ఆమె చేతుల్లోనే కేంద్రీకృతమైంది. ఆమె ప్రతిపక్ష నేతగా లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాలపై ఉద్యమాలు నడిపిన రోజుల్లో మార్క్సిస్టుల ఎత్తుగడలను దగ్గర నుంచి చూశారు. దాదాపు అవే వ్యూహాలు, పద్ధతులతో తన పార్టీని బలోపేతం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తన కనుసన్నల్లో నడిచేలా చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఎన్నికల్లో విజయాలే సాధించిన తృణమూల్‌కు అదే స్థాయిలో లోక్‌సభ ఎన్నికల్లోనూ గెలుపు సాధ్యమా అనేది ప్రధాన సమస్యగా మారింది. బిమాన్ బోస్: గెలుపు సవాలే! సీపీఎం రాష్ట్ర శాఖ కార్యదర్శి బిమాన్ బోస్ ఇంత వరకూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాని, 2006 నుంచీ రాష్ట్రంలో పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉండగా పార్టీ కార్యదర్శిగా బోస్ ఎన్నికయ్యారు. అదే ఏడాది రెండు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని వామపక్షాలు ఇదివరకెన్నడూ లేనంత మెజారిటీ సాధించాయి. అయితే ఆయన హయాంలోనే గత రెండు అసెంబ్లీ, రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయాయి. రాష్ట్రంలో సీపీఎంను, లెఫ్ట్‌ఫ్రంట్‌ను తన వ్యూహాలు, ఎత్తుగడలతో అధికారంలోకి తెచ్చిన సీపీఎం అగ్రనేత ప్రమోద్ దాస్‌గుప్తా దగ్గర శిష్యరికంలో బోస్ నేతగా ఎదిగారు. అయితే, సీపీఎంను మళ్లీ ఆ స్థాయిలో బలోపేతం చేసే దిశగా బోస్ నడిపించలేకపోతున్నారు. దిలీప్ ఘోష్: సంచలనాల గోస బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడైన దిలీప్ ఘోష్ ఆరెస్సెస్ మూలాలున్న నాయకుడు. పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో 54 ఏళ్ల క్రితం జన్మించారు. ఇదే జిల్లాలోని ఖరగ్‌పూర్ నుంచి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1982 నుంచి వరుసగా ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన కాంగ్రెస్ నేత గ్యాన్సింగ్ సోహన్పాల్ను ఘోష్ ఓడించి చరిత్ర సృష్టించారు. కోల్‌కతాలోని టిప్పు సుల్తాన్ మసీదు ఇమాం మౌలానా బర్కాతీ వ్యాఖ్యలకు నిరసనగా 2016 డిసెంబర్లో జరిపిన ప్రదర్శనలో పోలీసుల చేతిలో ఘోష్ గాయపడ్డారు. సీఎం మమత ఢిల్లీలో ఉన్నప్పుడు ఆమెను జట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చే శక్తి బీజేపీకి ఉందని ఘోష్ చేసిన ప్రకటనపై మౌలానా చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి. ఘోష్‌ను రాళ్లతో కొట్టి బెంగాల్ నుంచి తరిమేయాలని మౌలానా అనడంతో ఈ గొడవ జరిగింది. సోమేంద్రనాథ్ మిత్రా: కీలకపాత్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సోమేన్ మిత్రా 2009లో లోక్‌సభ తృణమూల్ టికెట్‌పై ఎన్నికయ్యారు. 2014లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. మమతా బెనర్జీపై నిప్పులు చెరిగే బహరంపూర్ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌధరీని తొలగించి కిందటేడాది సెప్టెంబర్‌లో సోమేన్కు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగించారు. తృణమూల్‌కు దగ్గరవడానికి రాష్ట్ర కాంగ్రెస్‌కు సోమేన్ నాయకత్వం అవసరమని పార్టీ అధిష్టానం భావించింది. 1972లో మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాక యువజన కాంగ్రెస్‌లో క్రియాశీల పాత్ర పోషించారు. 2014 లోక్‌సభ: బలాబలాలు (42) తృణమూల్ (34), కాంగ్రెస్ (4), సీపీఎం, బీజేపీ (2), -
మమతపై రాహుల్ ఫైర్
మాల్దా: ప్రధాని∙మోదీతోపాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలకిచ్చిన హామీల అమల్లో విఫలమయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. శనివారం మాల్దా(ఉత్తర) లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్ మాట్లాడారు. ‘మమతా బెనర్జీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు. గత కమ్యూనిస్టుల పాలనకు టీఎంసీ పాలనకు తేడా లేదు. అప్పటికీ ఇప్పటికీ రాష్ట్రంలో మార్పేమీ లేదు. ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. మమత పాలన అధ్వానం. ఆమెకు మినహా మరొకరు బహిరంగంగా మాట్లాడేందుకు అవకాశం లేదు. ప్రజలకిచ్చిన హామీల అమలులో మమత విఫలమయ్యారు’ అంటూ విమర్శించారు. అనంతరం ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘ధనవంతుల ఇళ్లకే కాపలాదార్లు(చౌకీదార్లు) ఉంటారు. రైతులు, నిరుపేదలకు వారి అవసరం ఉండదు. ఆర్థిక నేరగాళ్లయిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్‌మాల్యా వంటి ఆర్థిక నేరగాళ్లకు ఈయన చౌకీదార్’ అంటూ ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడూ అబద్ధాలే చెబుతుంటారు. ఎక్కడికి వెళ్లినా అబద్ధాలే. దేశాన్ని ఐక్యంగా ఉంచాలనుకునే కాంగ్రెస్‌కు, కుల, మత, భాషా భేదాలతో దేశాన్ని విభజించాలనుకునే బీజేపీ–ఆర్ఎస్ఎస్కు మధ్యే ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ’ అని పేర్కొన్నారు. ‘దేశానికి కాపలాదారుగా ఉంటానంటూ 2014 ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన మోదీ.. ప్రజలకు అడ్డంగా దొరికిపోయేసరికి జాతీయవాదం గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ చౌకీదారేనంటూ మాట మారుస్తున్నారు’ అని ఆరోపించారు. -
దీదీని ఎదుర్కోవడానికి..
రాజకీయాలకు, సినీరంగానికి ఉన్న అనుబంధం విడదీయలేనిది.. సినీ గ్లామరే పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో నాలుగు ఓట్లు రాబట్టుకోవడం అన్ని పార్టీల్లోనూ మామూలే. ఎన్నికల ప్రచారానికి ఒక ఊపు రావాలన్నా, ఊరూవాడా ఈస్ట్‌మన్ కలర్లో ప్రచారం హోరెత్తిపోవాలన్నా సినీ తారల వల్లే సాధ్యమవుతుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ ఈ విషయంలో అందరికంటే ముందుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో కమలనాథులు పార్టీకి సినీ సొగసులు అద్దే పనిలో పడ్డారు. బీజేపీ అధిష్టానం ఎందరో తారల్ని పార్టీలోకి లాగడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. కేవలం సినీ గ్లామర్ మాత్రమే కాదు, క్రీడాకారులు, మేధావులు, కళాకారులు ఇలా జనాన్ని ఆకర్షించే సత్తా ఉన్నవాళ్లని తీసుకువచ్చి పార్టీకి కొత్త హంగుల్ని అద్దడానికి వ్యూహరచన చేస్తోంది. దీదీని ఎదుర్కోవడానికి పశ్చిమ బెంగాల్లో పార్టీని బలోపేతం చేసి వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలను దక్కించుకోవడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చాలా కాలంగా వ్యూహాలు రచిస్తున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని దీటుగా ఎదుర్కోవడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. మొత్తం 42 లోక్‌సభ స్థానాలున్న పశ్చిమబెంగాల్లో 22 స్థానాల్లోనైనా నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం బెంగాల్లో బాగా పేరున్న వారు, పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారని భావిస్తున్న ఎవరినైనా లాగేయడానికి సిద్ధంగా ఉన్నారు. మహాభారతంలో ద్రౌపది వేషంతో పాపులర్ అయిన రూపాగంగూలీని 2015లోనే పార్టీలో చేర్చుకున్నారు. ప్రముఖ బెంగాలీ గాయకుడు బాబూల్ సుప్రియో ఇప్పటికే అసనోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్‌లో తగిన ప్రాధాన్యం దక్కక అసంతృప్తితో ఉన్న హిందీ తార మౌసమీ ఛటర్జీ బెంగాల్ బీజేపీకి కొత్త హంగులు తెచ్చారు. సినీ తారలు, క్రికెటర్లపై గురి భారతీయ జనతా పార్టీ తన గూటిలోకి లాగాలనుకునే తారల జాబితా చాలా పెద్దదే. గత ఏడాది జూన్‌లో అమిత్ షా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ను ముంబైలో స్వయంగా కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఆమెకు వివరించారు. మాధురిని మహారాష్ట్రలోని పుణే నుంచి ఎన్నికల బరిలోకి దింపుతారనే వార్తలు అప్పట్లోనే హల్ చల్ చేశాయి. అయితే మాధురి నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మాధురీయే కాదు కంగనా రనౌత్, ప్రీతి జింటా, పల్లవి జోషీ, రవీనా టాండన్, అక్షయ్ కుమార్‌లను కూడా ఎన్నికల వేళ పార్టీ తీర్థం పుచ్చుకునేలా బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. క్రికెటర్లు కపిల్‌దేవ్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌లు పొలిటికల్ పిచ్‌లో తమ సత్తా చాటుతారన్న నమ్మకంతో ఉన్న బీజేపీ వారికి కూడా గాలం వేస్తోంది. ఇక కేరళ బీజేపీ ట్రంప్‌కార్డుగా మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ను తిరువనంతపురం బరి నుంచి దింపుతారని వార్తలు వచ్చాయి. గతంలో మోహన్‌లాల్ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకోవడంతో ఊహాగానాలు చెలరేగాయి. మోహన్లాల్కి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం కూడా ఈ ఊహాగానాలకు ఊతమిచ్చింది. అయితే మోహన్‌లాల్ అభిమానులే ఆయన బీజేపీలోకి వెళతారన్న వార్తలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మోహన్‌లాల్ వెనకడుగు వేశారు. రాజకీయాల్లో చేరాలనే ఉద్దేశం తనకు లేదని, నటుడిగా తన జీవితం సంతృప్తినిస్తోందని మోహన్‌లాల్ తేల్చి చెప్పేశారు.అయినా రాజకీయాల్లో ఏ నిమిషం ఏదైనా జరగవచ్చునన్న విశ్లేషణలైతేవినిపిస్తున్నాయి. సుమలత రూటు ఎటు ? సుమలత.. ఈ పేరు చెబితే చాలు.. తెరపై సంప్రదాయమైన చీరకట్టుతో హుందా పాత్రలే మన కళ్ల ముందు కదులుతాయి. తెలుగు ఆడపడుచు, కన్నడ కోడలు అయిన సుమలత భర్త, నటుడు, కాంగ్రెస్ ఎంపీ అంబరీష్ ఇటీవల ఆకస్మికంగా మరణించడంతో ఆయన అభిమానులు సుమలతను పోటీ చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. కర్ణాటకలో మండ్యా నియోజకవర్గానికి ఇన్నాళ్లూ ఆయన ప్రాతినిధ్యం వహించారు. భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ సుమలత అభిమానుల కోరిక మేరకు రాజకీయ అరంగేట్రం చేయాలని భావించారు. కాంగ్రెస్ పార్టీ మండ్యా టికెట్ ఇస్తే పోటీకి దిగుతానని మీడియా ముందే ప్రకటించారు. కానీ ఇక్కడే రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య పొత్తు ఉంది. ఈ పొత్తులో భాగంగా పాండ్యా సీటు జేడీ(ఎస్)కే ఇవ్వాలన్న నిర్ణయం కూడా జరిగిపోయింది. అందుకే అంబరీష్‌ను అప్పట్లోనే మంత్రి పదవి నుంచి తప్పించారన్న ప్రచారం కూడా జరిగింది. సుమలత మండ్యా నుంచి తప్ప మరో చోట నుంచి బరిలోకి దిగనని పట్టు పట్టడంతో కాంగ్రెస్ అధిష్టానం ఏమీ చేయలేని స్థితిలో పడిపోయింది.. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తన కుమారుడు నిఖిల్ గౌడను మండ్యా బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. మండ్యాలో వక్కళిగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ నియోజవవర్గంలో అరంగేట్రం చేస్తే వక్కళిగ సామాజిక వర్గానికి చెందిన తన కుమారుడు నిఖిల్ గెలుపు నల్లేరు మీద బండి నడకని కుమారస్వామి భావిస్తున్నారు. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టుగా కాంగ్రెస్, జేడీ(ఎస్)మధ్య అంతర్గత పోరుని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీజేపీ పడింది. సుమలతను పార్టీలోకి తీసుకురావాలని వ్యూహాలు కూడా పన్నుతోంది. కానీ సుమలత కాంగ్రెస్ టికెట్ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. అయినా సుమలతకున్న సినీ గ్లామర్‌ను వినియోగించుకోవడానికి కమలనాథులు ఆ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా, పరోక్షంగా సుమలతకు మద్దతు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో జేడీ(ఎస్)సుమలతపై రాజకీయ దాడి మొదలు పెట్టింది. ‘‘భర్త పోయి నెల తిరక్కుండానే రాజకీయాలు కావాల్సి వచ్చాయా‘‘అంటూ కుమారస్వామి సోదరుడు, కర్ణాటక మంత్రి హెచ్డీ రేవణ్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంబరీష్‌కు కన్నడనాట మంచి ఫాలోయింగ్ ఉంది. రెబెల్ స్టార్ అన్న ఇమేజ్ కూడా ఉంది. దీంతో రేవణ్ణ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది. భర్తను కోల్పోయిన ఒక మహిళపై ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేస్తారా అంటూ సుమలత, అంబరీష్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ తమ ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనని భావించిన కుమారస్వామి, నిఖిల్‌లు రేవణ్ణ తరఫున క్షమాపణలు కోరారు. ఇన్ని మలుపుల మధ్య సుమలత రాజకీయ భవితవ్యం ఎటు తిరుగుతుందో చూడాలి. 2014లో బీజేపీ సినీ ఫార్ములా సక్సెస్ 2014లోనూ బీజేపీ పెద్ద ఎత్తున సినీ తారల్ని ఆకర్షించి పొలిటికల్ బాక్సాఫీస్ వద్ద వారి గ్లామర్‌ని క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ కొట్టింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీపై టెలివిజన్ స్టార్, ఇంటింటి కోడలుగా అందరి మన్ననలు పొందిన స్మృతి ఇరానీని పోటీకి నిలిపింది. స్మృతి ఓడిపోయినప్పటికీ బీజేపీకి ఒక ఊపు తీసుకురావడంలో విజయం సాధించారు. ఇక చాలా మంది తారలు విజయం సాధించి పార్లమెంటుకి గ్లామర్ తళుకులు అద్దారు.హేమమాలిని (మథుర నియోజకవర్గం), మనోజ్‌తివారీ (ఈశాన్య ఢిల్లీ), పరేష్ రావల్ (తూర్పు అహ్మదాబాద్), కిరణ్‌ఖేర్ (చండీగఢ్), శత్రుఘ్నసిన్హా (పట్నా సాహిబ్) బాబూల్ సుప్రియో (అసనోల్)లు గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే శత్రుఘ్నసిన్హా ఇప్పుడు అధిష్టానంపై తిరుగుబాటు బావుటాఎగురవేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని వీలైనప్పుడల్లా విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో కమల వికాసానికి తారల తళుకుబెళుకులు ఎంతవరకు కలిసొస్తాయో మరి. పక్కాగా సర్వే చేసి మరీ.. సినీ గ్లామర్ అన్నివేళలా ఓట్లను రాలుస్తుందని చెప్పలేం. అందుకే సినీతారలు, క్రికెటర్లపై గాలం వేయడానికి ముందే బీజేపీ ఓ పక్కా సర్వే నిర్వహించినట్టు సమాచారం. ఏ నియోజకవర్గంలో ఏ తారని దింపితే ఫలితం ఉంటుందాఅన్న సర్వే చేయించినట్టు తెలుస్తోంది. ఈ సర్వేలో మాధురీ దీక్షిత్, క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌లు విజయం సాధించడానికి ఎక్కువగాఅవకాశాలు ఉన్నట్టు తేలింది. మహారాష్ట్రలో ముంబై లేదా పుణె నుంచిమాధురీ దీక్షిత్, హరియాణాలోని రోహ్తక్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్, న్యూఢిల్లీ నుంచి గౌతమ్ గంభీర్ గెలుపు గుర్రాలేనని ఆ సర్వేలో వెల్లడైంది. గౌతమ్ గంభీర్ ఎప్పుడూ జాతివ్యతిరేక శక్తుల్ని ఎండగడుతూ ఉంటారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో ట్విట్టర్ వేదికగా ఢీ అంటే ఢీ అంటూ గంభీర్ ఎందరో ఫాలోయర్లను పెంచుకున్నారు.ఇక పంజాబ్‌లో గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి చాలా ఏళ్లు బీజేపీ తరఫున గెలిచిన నటుడువినోద్ఖన్నా మృతితో ఆ నియోజకవర్గం నుంచి ఎవరిని నిలపాలా అన్నదికమలనాథులు ముందు సవాల్‌గానే ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రినరేంద్రమోదీతో అత్యంత సన్నిహితంగా ఉన్న అక్షయ్కుమార్నుగురుదాస్పూర్ నుంచి పోటీకి నిలిపితే బాగుంటుందని బీజేపీ అధిష్టానం భావించింది కానీ ఆయనకు పౌరసత్వమే పెద్ద అడ్డంకిగా ఉంది.కెనడా పౌరుడు అయిన అక్షయ్‌కుమార్ భారత్‌లో ఎన్నికల్లో పోటీచేయడానికి వీలులేదు. -
‘మోదీకి మాత్రమే వ్యతిరేకం.. దేశానికి కాదు’
కోల్కత్తా: ప్రధాని నరేంద్ర మోదీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. పుల్వామా ఉగ్రదాడిని, వైమానిక దాడులను ప్రచారంగా చేసుకుని ఎన్నికల్లో మోదీ గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రదాడికి అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ సమాచారం అందించినప్పటికీ సైనికుల రక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని ఆమె ప్రశ్నించారు. ఉగ్రవాదంపై పోరులో రక్తం చిందించిన భారత సైనికుల త్యాగాలపై మోదీ రాజకీయం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశానికి, సైన్యానికి తాము వ్యతిరేకం కాదని, కేవలం మోదీ, బీజేపీకి మాత్రమే వ్యతిరేకమని మమత వివరించారు. పాక్-భారత్ సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మోదీ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారని, అది దేశానికి సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సైనికుల త్యాగాలను రాజకీయంగా ప్రచారం చేసుకోవాడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మమత ప్రకటించారు. -
విపక్షాల ‘కామన్ మినిమమ్ ప్రొగ్రామ్’!
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో కలిసి పనిచేసేందుకు పలువిపక్ష పార్టీలు అంగీకరించాయి. ఎన్నికల ముందు పొత్తు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని(కామన్ మినిమమ్ ప్రొగ్రామ్–సీఎంపీ) ఖరారు చేసుకోవాలని నిర్ణయించాయి. ఆప్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోజరిగిన ర్యాలీ అనంతరం విపక్ష నేతలు ఎన్సీపీ నేత శరద్ పవార్ ఇంట్లో సమావేశమయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. పరిస్థితుల మేరకు రాష్ట్రాల్లో వేరువేరుగా పోటీ చేయాల్సి వచ్చినా.. జాతీయ స్థాయిలో కలసి పని చేయాలని ఆయా పార్టీలు అంగీకరించాయి. సమావేశంలో ముసాయిదా సీఎంపీని పార్టీల నేతలకు పంపిణీ చేశారు. విపక్ష కూటమిలో కీలకపాత్ర పోషించాల్సిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఈ భేటీకి హాజరుకాలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. -
బెంగాల్ ఎపిసోడ్‌తో ఎవరికి లాభం?
సాక్షి, నేషనల్ డెస్క్: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో ‘దీదీ వర్సెస్ మోదీ’ తాజా ఎపిసోడ్ ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయంగా లాభపడేది బీజేపీయేనని, బెంగాల్ రాజకీయాల్లో వేళ్లూనుకోవాలనే ఆ పార్టీ ఆకాంక్ష ఈ ‘ఘర్షణ’తో తీరనుందని విశ్లేషకుల అంచనా. శారద స్కామ్ విచారణ ఎలా జరగనుంది?, సుప్రీంకోర్టు తీర్పు పరిణామాలేంటి? అనే విషయాలను పక్కనబెట్టి.. కేవలం రాజకీయ కోణంలో ఈ ఘర్షణను విశ్లేషిస్తే.. అంతిమంగా ఇది బీజేపీకి జాక్‌పాట్ లాంటిదేనన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో జీరోతో ప్రారంభమైన బీజేపీ ఉనికికి దీనివల్ల వచ్చే ప్రమాదమేమీ లేదని, పెరిగే సానుకూల ఓటు.. సీట్ల సంఖ్యను పెంచుకునేలా బీజేపీకి లాభిస్తుందని వాదిస్తున్నారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్లు ఇంకా ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాయి. తృణమూల్‌కు బీజేపీ, ఆ పార్టీ అధినేత్రి మమత బెనర్జీకి మోదీ.. బలమైన ప్రత్యర్థులుగా అవతరించారు. ప్రజల్లోనూ ఆ భావన వ్యక్తమవుతోంది. మమతను, తృణమూల్‌ను ఎదుర్కొనే సత్తా మోదీ, షా నేతృత్వంలోని బీజేపీకే సాధ్యమనుకుంటున్నారు. శారద స్కామ్‌లో కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను సీబీఐ ప్రశ్నించడాన్ని మమత అడ్డుకోవడం.. అవినీతికి మద్దతివ్వడమేనన్న భావన కూడా బలంగా వ్యక్తమవుతోంది. ఇదంతా బీజేపీకే లాభిస్తుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కనీసం 10 నుంచి 15 సీట్లు గెలుచుకోగలదు’ అని బెంగాల్ రాజకీయాలపై అవగాహన ఉన్న ఒక విశ్లేషకుడు వివరించారు. బీజేపీని అడ్డుకునేందుకు మమత శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ జాతీయ నేతల సభలు రాష్ట్రంలో జరగనివ్వకుండా అధికారికంగా, రాజకీయంగా ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్లో బీజేపీ తలపెట్టిన రథయాత్రకు అనుమతి ఇవ్వలేదు. ఇటీవల ఒక బహిరంగ సభలో పాల్గొనేందుకు బీజేపీ చీఫ్ అమిత్ షా వచ్చిన చాపర్ ల్యాండింగ్‌ను, సోమవారం మరో రాష్ట్ర(యూపీ) ముఖ్యమంత్రి అయిన ఆదిత్యనాథ్ హెలికాప్టర్ ల్యాండింగ్‌ను అడ్డుకున్నారు. మరోవైపు, సీబీఐ అధికారుల విధులను అడ్డుకుని, వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇవన్నీ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడాన్ని తట్టుకోలేక, మమత నిరాశ, నిస్పృహలతో చేస్తున్న చర్యలుగా భావిస్తున్నారు. మరోవైపు, లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్‌ల నిస్తేజం నేపథ్యంలో.. రాష్ట్రంలోని మమత వ్యతిరేక వర్గాలు బీజేపీకి అనుకూలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. వేలాది రాష్ట్ర ప్రజలు బాధితులుగా ఉన్న ఒక కుంభకోణానికి సంబంధించిన విచారణను ఆమె అడ్డుకోవడం సరికాదనే అభిప్రాయం ఉంది. ఆ విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక పోలీసు అధికారికి మద్దతుగా నిలవడం.. రాజకీయంగా తటస్థులైన వారి లోనూ మమత పట్ల వ్యతిరేకత పెంచుతోందని భావిస్తున్నారు. తెరపైకి ఫైర్ బ్రాండ్.. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో మమతలో కనిపించిన ఫైర్, ఉద్యమ వైఖరి, ప్రజా పోరాటాలు నిర్వహించిన నాటి ఆవేశం.. మళ్లీ ఈ ధర్నాతో మరోసారి వెలుగులోకి వచ్చాయని మరి కొందరి భావన. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఈ ఫైర్ బ్రాండ్ వ్యక్తిత్వం.. ఎన్నికల ముందు.. ఒక్కసారిగా తెరపైకి రావడం తృణమూల్‌కు లాభిస్తుందని, కార్యకర్తల్లో మనోస్థైర్యం పెరుగుతుందనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి ధర్నా వేదికపై మమత చూపిన ఆవేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తెచ్చింది. టాటా నానో ప్లాంట్‌కు వ్యతిరేకంగా సింగూరు రైతుల కోసం 12 ఏళ్ల క్రితం ఇదే వేదికపై 25 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిననాటి ఉద్యమ నేత మమత ఇప్పుడు ఈ దీక్షతో మళ్లీ ప్రత్యక్షమైందని కార్యకర్తలు అంటున్నారు. -
గెలిచిందెవరు?
-
ఎన్డీఏ బీటీమ్ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ : వీహెచ్
సాక్షి, హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అక్కడి పోలీసులను అభినందిస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. సీఎస్‌కు గానీ, సీఎంకు గానీ సమాచారం ఇవ్వకుండా సీబీఐ అధికారులు ఒక ఐపీఎస్ అధికారి అరెస్ట్‌కు ప్రయత్నం చేయటం దారుణమని మండిపడ్డారు. ప్రజల ఓట్లతో రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన మమత ప్రభుత్వంపై నరేంద్ర మోదీ, అమిత్ షా దాడి చేయబోయారని ధ్వజమెత్తారు. మమత ఓ శక్తిలా అడ్డుకుని రాజ్యాంగాన్నీ కాపాడిందని కొనియాడారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిప్పులు చెరిగారు. ఎన్డీఏ బీటీమ్ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అని వీహెచ్ ఆరోపించారు. -
‘ప్రధాని అభ్యర్థిగా మాయావతి లేదా మమత’
కోల్కత్తా: లోక్‌సభ ఎన్నికల ముందు సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశ ప్రధానిగా బీఎస్పీ అధినేత్రి మాయావతి లేదా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే బాగుంటుంది’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బెంగాల్లో శనివారం మమత నిర్వహించిన ర్యాలీకి అఖిలేష్ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అఖిలేష్ ఈ విధంగా సమాధానమిచ్చారు. దేశంలో మాయావతి, మమత బెనర్జీ ఇద్దరూ బలమైన నేతలేననీ, మహాకూటమిని నడిపించగల శక్తి వారిలో ఉందని అన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది సమస్య కాదని, ప్రస్తుతం తమ ముందన్న లక్ష్యం బీజేపీని ఓడించడమేనని వ్యాఖ్యానించారు. దేశంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశానికి కొత్త ప్రధాని కావాలని, సరికొత్త నాయకత్వానికి తమ కూటమి నాందిపలుకుతుందని అఖిలేష్ పేర్కొన్నారు. యూపీ కూటమిలో కాంగ్రెస్‌ను దూరంగా పెట్టిన అఖిలేష్, మాయావతిలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటిస్తున్న విషయం తెలిసిందే. -
ఎస్పీ, బీఎస్పీ కూటమిపై మమత..
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్పీ, బీఎస్పీల మధ్య కుదిరిన సీట్లు ఒప్పందంపై ఎన్డీయేతర పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాయవతి, అఖిలేష్ యాదవ్‌ల చారిత్రక ప్రకటనను స్వాగతిస్తున్నట్లు బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా వారికి అభినందనలు తెలిపారు. అలాగే ఆర్జేడీ నేత, బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ కూడా మాయా,యాదవ్ కూటమిపై స్పందించారు. యూపీలో ఏర్పడిన కూటమితోనే బీజేపీ పథనం ప్రారంభమవుతుందంటూ తేజస్వీ వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓటమే లక్ష్యంగా దశాబ్ధాల వైరుధ్యాన్ని పక్కన్న పెట్టి ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపిన విషయం తెలిసిందే. దీనిపై వారు వివరణ ఇస్తూ చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు శనివారం ఉమ్మడి ప్రకటన ద్వారా ప్రకటించారు. ముందునుంచి అనుకున్న విధంగానే కాంగ్రెస్‌కు కూటమిలో స్థానం కల్పించలేదు. కానీ ప్రస్తుతం రాహుల్, సోనియా ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి, రాయబరేలి స్థానాలను వారికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కాగా 26ఏళ్ల అనంతరం ఎస్పీ,బీఎస్పీలు చేతులుకపడం విశేషం. ఎస్పీ- బీఎస్పీ పొత్తు ఖరారు I welcome the alliance of the SP and the BSP for the forthcoming Lok Sabha elections — Mamata Banerjee (@MamataOfficial) January 12, 2019 -
దీదీపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్‌తో పోల్చారు. బీజేపీ తలపెట్టిన రథయాత్రకు మమతా సర్కార్ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశంలో ప్రజాస్వామ్యానికి తావు లేని రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఒక్కటేనని, మమతా బెనర్జీ ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ తరహాలో వ్యవహరిస్తున్నారని గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. కిమ్ తరహాలోనే తనకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిని ఆమె అణగదొక్కుతున్నారని ఆరోపించారు. బెంగాల్లో బీజేపీ రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కలకత్తా హైకోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వెంటనే కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లోని పార్లమెంట్ నియోజకవర్గాలన్నింటి మీదుగా సాగేలా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో బీజేపీ ఈనెల 6 నుంచి రథయాత్రను తలపెట్టిన సంగతి తెలిసిందే. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ ఈ యాత్రకు బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. -
‘ప్రధాని లక్షణాలు ఆమెకే ఉన్నాయి’
కోల్కత్తా : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోగల శక్తి బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మాత్రమే ఉందని మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా అభిప్రాయపడ్డారు. ఆదివారం కోల్‌కత్తాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మమత నాయకత్వ లక్షణాలను కొనియాడారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయగల సత్తా ఉన్న నాయకురాలు మమత బెనర్జీ అని సిన్హా అన్నారు. రాజకీయ చతురత, ధైర్యం ఉన్న నాయకురాలనీ, దేశ ప్రధాని కావడానికి ఆమెకు మంచి నాయకత్వ లక్షణాలున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటని, జాతీయ స్థాయి రాజకీయాల్లో తృణమూల్ ప్రభావం చూపగలదని సిన్హా పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఎంతో కీలకమైన మంత్రిమండలిని మోదీ పక్కన పెట్టారని, మంత్రులకు కూడా తెలియకుండా కొన్ని నిర్ణయాలు ఆయన సొంతగా తీసుకుంటున్నారని ఆరోపించారు. కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో మమత కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గతంలో అనేకపార్టీల జాతీయ నేతలతో చర్చలు జరిపిన మమత, జనవరిలో బెంగాల్లో జరిగే భారీ ర్యాలీకి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. -
ఏదేమైనా రథయాత్ర తథ్యం
న్యూఢిల్లీ: బెంగాల్లో ఎట్టి పరిస్థితులలోనూ రథయాత్ర చేపట్టే తీరతామని, తమని ఎవరూ ఆపలేరని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. యాత్ర ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా పడిందని.. రద్దు కాలేదన్నారు. రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకెళ్తామన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీని చూసి భయపడుతున్నారని, అందుకే తాము చేపట్టే రథయాత్రను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో మార్పు వస్తుందనే భయంతోనే మమత ప్రభుత్వం ఇదంతా చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే తీరుగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. బీజేపీని ఎంత అణగదొక్కాలని చూస్తే అంతకంతకూ ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తాము కచ్చితంగా మార్పు తీసుకొస్తామని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ మెజారిటీ సీట్లను గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి 100 రాజకీయ హత్యలకు 26 రాష్ట్రంలోనే జరుగుతున్నాయని ఓ సర్వేలో తేలిందని అమిత్‌షా ప్రస్తావించారు. -
ప్లీజ్.. నన్ను పిలవొద్దు!
కోల్‌కతా: 24వ కోల్‌కతా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమంలో శనివారం సరదా సన్నివేశం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలాసార్లు అతిథిగా హాజరయ్యానని, ఇకపై తనని ఆహ్వానించొద్దని మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ విజ్ఞప్తి చేయగా, అలా కుదరదంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలూపారు. అమితాబ్ మాట్లాడుతూ పదేపదే ఈ కార్యక్రమానికి రావడం వల్ల తాను కొత్తగా చెప్పేదేమీ లేదని, ఇకపై తనని ఆహ్వానించొద్దని పలుమార్లు వేడుకున్నా సీఎం వినడంలేదని అన్నారు. అందుకే బెంగాలీలో ’మేడం దయచేసి నా మాటలు వినండి. ఇకపైనైనా నాకు ఈ కార్యక్రమం నుంచి మినహాయింపు ఇవ్వండి’ అని విజ్ఞప్తిచేశారు. వచ్చే ఏడాది జరగబోయేది 25వ వేడుక కాబట్టి అప్పుడు కూడా అమితాబ్ రావాల్సిందేనని మమతా చెప్పారు. -
దీదీ నిర్ణయంపై స్టేకు సుప్రీం నిరాకరణ
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని 28,000 దుర్గా పూజ కమిటీలకు రూ 28 కోట్ల నిధులు మంజూరు చేయాలన్న మమతా బెనర్జీ సర్కార్ నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. ఒక్కో కమిటీకి రూ 10,000 చొప్పున 28,000 దుర్గా పూజా కమిటీలకు నిధులు మంజూరు చేయాలన్న మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించేందుకు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన సుప్రీం బెంచ్ నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ పూజా కమిటీలకు నేరుగా డబ్బు ఇవ్వడం లేదని, రాష్ట్ర పోలీసుల ద్వారా పూజా కమిటీలకు ప్రభుత్వం ఈ నిధులు సమకూర్చుతుందని కోర్టుకు తెలిపారు. దుర్గా పూజా వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం రూ 28 కోట్ల నిధులను ఆయా కమిటీలకు అందించాలనే నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది సౌరవ్ దత్తా పిటిషన్‌ను దాఖలు చేశారు. దుర్గా పూజ కమిటీలకు రూ 10,000 చొప్పున రూ 28 కోట్లు ఇస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెప్టెంబర్ పదిన ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు కోల్‌కతా హైకోర్టు ఈనెల 10న నిరాకరించింది. -
దీదీ సృష్టించిన భూకంపం
బ్రిటిష్ మాజీ ప్రధాని హెరాల్డ్ విల్సన్ 55 ఏళ్ల క్రితం చెప్పినట్లుగా రాజకీయాల్లో ఒక వారం రోజులు సుదీర్ఘ కాలమైనట్లయితే, భారత్‌లో ప్రతి రోజూ సుదీర్ఘకాలంగానే కనబడుతుంది. అత్యంత జాగ్రత్తతో కూడిన వ్యూహంతో, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి పట్ల తిరస్కరణతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గొప్ప రాజకీయ కుట్రను నడిపారు. ఆ దెబ్బకు రాహుల్‌ని ప్రధాని పదవికి అభ్యర్థిగా ప్రకటించడం ఆగిపోయింది. సాధారణంగా పాకిస్తాన్ వంటి దేశాల్లో కుట్రలు హింసాత్మకంగా సాగుతుంటాయి. కానీ మమత కాంగ్రెస్ పార్టీపై అహింసాత్మకంగా సాగించిన భీకర కుట్రకు రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వమే పక్కకు పోయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ 2018 జూలై 31 వరకు ప్రతిపక్షం తరపున పీఎం పదవికి అభ్యర్థిని తానే అని ప్రకటించుకుంటూ వచ్చారు. కానీ ఆగస్టు 2 నాటికి అంటే రెండురోజుల వ్యవధిలో మమతా బెనర్జీ ప్రతిపక్షాల తరపున ప్రధాని పదవికి అభ్యర్థిగా ఆవిర్భవించారు. 2019 జనవరిలో తాను జరపనున్న భారీ ర్యాలీకి హాజరు కావలిసిందిగా ఆహ్వానించడానికి సోనియా, రాహుల్‌లను జనపథ్ 10లో మమత కలిసినప్పుడు మీడియా మొత్తంగా మమతే ప్రధాని పదవికి అభ్యర్థి అని అభిప్రాయపడింది. నేరుగా ఇదే ప్రశ్నను మీడియా సంధించినప్పుడు ‘ఈ నేలపై ఎవరైనా రాజు కావచ్చు’ అనే రవీంద్రనాథ్ ఠాగూర్ సూక్తిని ఆమె వల్లించారు. ఆగస్టు 2న మమత తమను కలిసినప్పుడు సోనియా, రాహుల్‌ల మొహాల్లోని భావరహిత చిరునవ్వుల ద్వారా స్పష్టమైంది ఏమిటంటే మమత తమను రాజకీయ పోటీలో అధిమించేశారన్నదే. రాహుల్ అభ్యర్థిత్వాన్ని మమత అంగీకరిస్తుందని కాంగ్రెస్ భావించింది కానీ ఇన్నాళ్లుగా తాను సాగించిన కఠోరమైన ప్రయత్నాలను, 35 ఏళ్లపాటు తాను అవలంభించిన గాంధియన్ జీవిత శైలిని త్యాగం చేయడానికి మమత సంసిద్ధం కాలేదు. ప్రధాని పదవి ఎట్టకేలకు తనకు సమీపంలోనికి వచ్చిందని మమత స్పష్టంగా గుర్తించారు. మోదీ, మమత దిగువ మధ్యతరగతి నేపథ్యం లోంచి రాజకీయాల్లోకి వచ్చారు. పెద్దగా చదువుకోని, గాడ్ ఫాదర్లు, కుటుంబ నేపథ్యం లేని వీరిద్దరూ అత్యంత కష్టసాధ్యమైన పరిస్థితులను తట్టుకుంటూ విజేతలై నిలిచారు. వీరిద్దరూ రాజకీయాలు మినహా మరే జీవితం లేనివారే. కుటుంబాలు లేవు, ఎస్టేట్లు లేవు, కంపెనీలు లేవు, రాజవంశాలు లేవు. వీరికున్న పోలికలు దిగ్భ్రాంతి గొలుపుతాయి. రాహుల్ గాంధీ ప్రతిపక్షాల తరపున ప్రధాని అభ్యర్థిని తానే అవుతానని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉంటున్న సమయంలో బలమైన ప్రతిపక్షాలను కూడగట్టిన మమత ఉన్నట్లుండి రాహుల్‌ను తోసిరాజంది. ప్రతి పక్షాల్లో చాలావరకు అటు కాంగ్రెస్‌ని, ఇటు బీజేపీని తిరస్కరిస్తున్నాయి. ఈ వ్యతిరేకతను అనువుగా మల్చుకున్న మమత తన అభ్యర్థిత్వాన్ని ముందుపీఠికి తెచ్చారు. జయలలిత తర్వాత అత్యధిక ఎంపీలను గెల్చుకున్న ప్రతిపక్ష సీఎంగా మమత అవతరించారు. ప్రాంతీయ పార్టీలు రాహుల్‌ని కోరుకోనందున మమత ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చారు. ఇలా ఒక్క దెబ్బకు అటు గాంధీలను, ఇటు కాంగ్రెస్ పార్టీని అధిగమించేశారు. ఒకరకంగా మమత సాధించిన విజయం భారత రాజకీయాల్లో ఒక పెను భూకంపం లాంటిది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ప్రధాని అభ్యర్థి పదవి ప్రతిపాదన నుంచి వెనుకంజ వేయడం పెను సమస్యే. రాహుల్ పరువు ఏ కాస్తయినా మిగలాలంటే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో త్వరలో జరుగనున్న ఎన్నికల ఫలి తాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడమే. అప్పుడు మాత్రమే రాహుల్ తన అభ్యర్థిత్వాన్ని బలంగా ముందుకు తీసుకురాగలరు. కాంగ్రెస్ ముందు పొంచి ఉన్న అవమానం ఏదైనా ఉందా అంటే పై మూడు రాష్ట్రాల్లో ఏ రెండింట్లోనైనా అది అధికారంలోకి రాలేకపోవడమే. ప్రతిపక్షాలు కోరుకునేది సరిగ్గా దీన్నే. భారతప్రధాని కావాలంటే అన్ని కారణాలతోపాటు కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. యుద్ధాల్లో మీకు ఎలాంటి సైనిక జనరల్స్ కావాలని అడిగితే అదృష్టం తోడుగా ఉన్న జనరల్స్ కావాలని నెపోలియన్ టపీమని సమాధానమిచ్చాడట. అంటే ఏ విజయానికైనా అదృష్టం చాలా ముఖ్యమే మరి. సుభాష్ చంద్రబోస్‌కు సాధ్యం కాని అవకాశం తన ముందు నిలబడిందని మమత ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అయితే బెంగాలీల చిరకాల స్వప్నం ఫలించాలంటే మోదీ వరుసగా తీవ్ర తప్పిదాలు చేస్తూ పోవాలి. మమత భవిష్యత్తు మొత్తంగా మోదీ దురదృష్టంపైనే ఆధారపడి ఉంది. మానవ ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. సాధారణంగా మనం విజయం కోసం ఇతరుల తప్పిదాలపైనే ఆధారపడుతుంటాం. ఇప్పటికి మాత్రం మమత రాహుల్‌ని తోసిరాజనడమే పెనువాస్తవం. పెంటపాటి పుల్లారావు, వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ఈ–మెయిల్ : drppullarao@yahoo.co.in -
మమతకు మద్దతు
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతిచ్చేందుకు తమకు అభ్యంతరమేమీ లేదని మాజీ ప్రధాన మంత్రి, జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ స్పష్టం చేశారు. ఢిల్లీలో పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ‘ప్రధాని అభ్యర్థిగా విపక్షాలు మమతా బెనర్జీని ఎన్నుకోవడాన్ని మేం పూర్తిగా స్వాగతిస్తాం. ఇందిరాగాంధీ 17 ఏళ్ల పాటు దేశాన్ని పాలించారు. ఎప్పుడూ మగవాళ్లే ప్రధానులుగా ఉండాలా? మమత లేదా మాయావతి (బీఎస్పీ అధ్యక్షురాలు) ఎందుకు కాకూడదు?’ అని దేవెగౌడ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మైనారిటీలు అభద్రతా భావంతో ఉన్నారనీ, దేశంలో భయానక వాతావరణం ఉందని ఆరోపించారు. 2019లో బీజేపీని ఓడించాలంటే ఓ బలమైన కూటమి ఉండాల్సిందేనన్నారు. సాధారణ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలిసే తమ పార్టీ పోటీ చేస్తుందని దేవెగౌడ చెప్పారు. జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా విశ్వనాథ్ జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కుమారస్వామి స్థానంలో హెచ్.విశ్వనాథ్‌ను దేవెగౌడ ఆదివారం నియమించారు. -
అస్సాంలో దీదీకి ఊహించని షాక్
కోల్‌కతా/డిస్పూర్ : అస్సాంలో అక్రమ వలసదారులను గుర్తించేందుకు విడుదల చేసిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) ముసాయిదా జాబితా అస్సాం, పశ్చిమ బెంగాల్‌లతో పాటు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలో చిచ్చురేపుతోంది. ఇదివరకే అస్సాంలో ఎన్ఆర్సీ ముసాయిదా కారణంగా 40 లక్షల మంది పౌరసత్వం కోల్పోయారు. తదుపరి బెంగాల్లోనే ఎన్ఆర్సీ ప్రక్రియను కేంద్రం చేపట్టనుందన్న వాదన తెరపైకి వచ్చింది. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. మా రాష్ట్రంలో ఎన్ఆర్సీ ప్రక్రియ ఎలా చేపడతారో వారి సంగతి చూస్తామన్నారు. అసలు బెంగాల్లో పౌరసత్వాల గురించి తనిఖీ చేయాలన్న సందేహాలు ఎందుకు తలెత్తుతున్నాయో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎన్ఆర్సీలో చోటు దక్కని వారు నిజంగానే విదేశీ అక్రమ వలసదారులు కాదని, భారతీయులే వీటి వల్ల అధికంగా నష్టపోతున్నారని మమత అభిప్రాయపడ్డారు. అస్సాం నుంచి బెంగాళీయులను తరిమి కొట్టేందుకు ఇలాంటి ముసాయిదాలను కేంద్ర చేపట్టిందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అస్సాం నుంచి బెంగాలీలను పంపిచేందుకు ఎన్ఆర్సీ ముసాయిదా అని పేర్కొన్న మమత వ్యాఖ్యలను అస్సాం టీఎంసీ చీఫ్ ద్విపెన్ పాఠక్ ఖండించారు. మమత చేస్తున్న విమర్శలు అర్థరహితమని, ఆమె వ్యాఖ్యల వల్ల అస్సాంలో అల్లర్లు జరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మమత వ్యాఖ్యలను నిరసిస్తూ అస్సాం టీఎంసీ చీఫ్ పదవికి ఆయన గురువారం రాజీనామా చేశారు. టీఎంసీ అధినేత్రి చేసిన వ్యాఖ్యల దుష్ప్రభావం, దుష్పరిణామాలను పరోక్షంగా అస్సాంలో తాను ఎదుర్కోవాల్సి వస్తుందన్న నేపథ్యంలో ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.