కేకేఆర్‌ విజయంతో బెంగాల్‌లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత | CM Mamata Banerjee Posts Special Message For KKR Wins IPL | Sakshi
Sakshi News home page

కేకేఆర్‌ విజయంతో బెంగాల్‌లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత

Published Mon, May 27 2024 7:40 AM | Last Updated on Mon, May 27 2024 10:44 AM

CM Mamata Banerjee Posts Special Message For KKR Wins IPL

కోల్‌కత్తా: ఐపీఎల్‌-17(2024)లో విజేతగా నిలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్‌ జట్టును పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రికార్డులు బద్దలు కొట్టినందుకు ప్లేయర్స్‌కు వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు.

కాగా, మమతా బెనర్జీ ట్విట్టర్‌ వేదికగా..‘కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంతో బెంగాల్ అంతటా సంబరాలు మిన్నంటాయి. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రికార్డు బద్దలు కొట్టినందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీని వ్యక్తిగతంగా అభినందించాలనుకుంటున్నాను. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు.

 

 

ఇక, ఐపీఎల్‌-17 సీజన్‌లో కేకేఆర్‌ అద్భుత ఆటతీరును కనబరిచింది. సీజన్‌ ప్రారంభం నాటి నుంచి దూకుడుగా ఆడుతూ టేబుట్‌ టాపర్‌గా నిలిచింది. చివరగా ఫైనల్‌గా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి 114 లక్ష్యాన్ని కేవలం పదో ఓవర్‌లోనే పూర్తి చేసింది. కాగా, ఈ సీజన్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ నిలిచాడు. 

 

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement