ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మార్చి 29) జరుగబోయే మ్యాచ్‌తో కేకేఆర్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించనున్నాడు. ఈ మ్యాచ్‌తో నరైన్ టీ20ల్లో 500 మ్యాచ్‌ల మైలురాయిని తాకబోతున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో కేవలం ముగ్గురు మాత్రమే నరైన్‌కు ముందు ఈ మైలురాయిని తాకారు.
వీరిలో కీరన్ పోలార్డ్ అందరికంటే ఎక్కువగా 660 మ్యాచ్‌లు ఆడగా.. డ్వేన్ బ్రావో 573, షోయబ్ మాలిక్ 542 మ్యాచ్‌లు ఆడారు. టీ20ల్లో అత్యంత అరుదైన క్లబ్‌లో చేరబోతున్న నరైన్.. ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకు 499 మ్యాచ్‌లు ఆడి 536 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 3736 పరుగులు చేశాడు. 2011లో టీ20 ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నరైన్ చాలా రికార్డుల్లో భాగంగా ఉన్నాడు.
- టీ20ల్లో అత్యధిక మెయిడిన్లు (30) వేసిన బౌలర్‌గా..
- టీ20ల్లో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా (536)..
- కనీసం 2000 బంతులు బౌల్ చేసిన వారిలో రెండో అత్యధిక ఎకానమీ రేట్ (6.10) కలిగిన బౌలర్‌గా..
- పవర్ ప్లేల్లో నాలుగో అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్ (155.05) కలిగిన బ్యాటర్‌గా..
- టీ20ల్లో అత్యధిక టైటిళ్లలో (10) భాగమైన నాలుగో ఆటగాడిగా పలు రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం కొదమ సింహాల్లా పోరాడనున్నాయి. కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించి జోష్‌లో ఉండగా.. ఆర్సీబీ తమ చివరి మ్యాచ్‌లో (రెండోది) పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చి నూతనోత్సాహంతో ఉరకలేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment