IPL 2024, DC VS KKR: సునీల్‌ నరైన్‌ ఊచకోత | IPL 2024: Sunil Narine Smashed 21 Ball Fifty Which Includes 6 Fours And 4 Sixes | Sakshi
Sakshi News home page

IPL 2024, DC VS KKR: సునీల్‌ నరైన్‌ ఊచకోత

Published Wed, Apr 3 2024 8:20 PM | Last Updated on Wed, Apr 3 2024 8:32 PM

IPL 2024: Sunil Narine Smashed 21 Ball Fifty Which Includes 6 Fours And 4 Sixes - Sakshi

ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 3) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ శివాలెత్తిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. నరైన్‌ విధ్వంసం ధాటికి కేకేఆర్‌ 9 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 126 పరుగులు చేసింది. నరైన్‌కు జతగా యువ ఆటగాడు రఘువంశీ (14  బంతుల్లో 31; 4 ఫోర్లు, సిక్స్‌) క్రీజ్‌లో ఉన్నాడు. రఘువంశీ కూడా చెలరేగి ఆడుతున్నాడు. హాఫ్‌ సెంచరీ తర్వాత కూడా నరైన్‌ దూకుడు కొనసాగుతుంది.

నరైన్‌ 28 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. నరైన్‌ ఇషాంత్‌ శర్మ, రసిక్‌ సలామ్‌ అక్షర్‌ పటేల్‌లకు చుక్కలు చూపించాడు. ఇషాంత్‌ వేసిన నాలుగో ఓవర్‌లో మూడు సిక్సర్లు సహా 26 పరుగులు పిండుకున్న నరైన్‌.. రసిర్‌ వేసిన 6వ ఓవర్‌లో మూడు ఫోర్ల సాయంతో 18, అక్షర్‌ వేసిన 8వ ఓవర్‌లో 2 సిక్సర్ల సాయంతో 19 పరుగులు రాబట్టాడు.

ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఐదో ఓవర్‌లో ఫిలిప్‌ సాల్ట్‌ (18) ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్‌ స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి సాల్ట్‌ పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుత సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కేకేఆర్‌ మరో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement