ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచిన విషయం విధితమే. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కేకేఆర్.. టోర్నీ అసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను ముద్దాడింది.
అయితే కేకేఆర్ విజేతగా నిలవడంలో ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్ ది కీలక పాత్ర. కేకేఆర్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన గౌతీ.. ఈసారి మెంటార్‌గా ట్రోఫీని అందించాడు. అయితే ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్ విజేతగా కేకేఆర్ నిలిచిన అనంతరం గంభీర్ ఇంటర్వ్యూలతో బీజీబీజీగా ఉన్నాడు.
తాజాగా ఎన్డీటీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్.. కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నరైన్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, తను ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడడని గంభీర్ చెప్పుకొచ్చాడు.
కాగా సునీల్ నరైన్ తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి కేకేఆర్ ఫ్రాంచైజీలోనే కొనసాగుతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో నరైన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఓపెనర్‌గా వచ్చి ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఓవరాల్‌గా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సునీల్.. కేకేఆర్ మూడోసారి ఛాంపియన్‌గా నిలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. అయితే నరైన్‌ను ఓపెనర్‌గా పరిచయం చేసింది గౌతం గంభీర్‌నే. 2012 సీజన్‌లో నరైన్‌ను ఓపెనర్‌గా పరిచియం చేసి విజయవంతమైన గంభీర్.. సారథిగా కేకేఆర్‌కు తొలి టైటిల్‌ను అందించాడు.
నా గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావచ్చా?
"నాది, సునీల్ నరైన్ మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది. అదే విధంగా మేము ఇద్దరం కూడా పెద్దగా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వము. ఐపీఎల్-2012 సీజన్‌లో తొలిసారి నరైన్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో జై పూర్‌లో మా ప్రాక్టీస్‌ను ముగించుకుని లంచ్ చేసేందుకు సిద్దమయ్యాం.. ఈ క్రమంలో నరైన్‌కు లంచ్‌కు పిలిచాను. నాకు ఇప్పటికి బాగా గుర్తు ఉంది. నేను పిలవగానే అతను చాలా సిగ్గుపడ్డాడు. లంచ్ సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఆ తర్వాత ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. నా గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావచ్చా? అని అడిగాడు. నరైన్ తన మొదటి సీజన్‌లో చాలా సైలెంట్‌గా ఉన్నాడు. కానీ నరైన్ ఇప్పుడు ఒకప్పుడులా లేడు. అతడితో నేను ఎదైనా మాట్లాడవచ్చు.
సునీల్ కూడా నాతో స్వేఛ్చగానే మాట్లాడుతాడు. నేను ఎప్పుడు అతడిని సహచరుడిగా, స్నేహితుడిగా చూడలేదు. సునీల్ నా సొంత సోదరుడిలా భావించాను. తనకు ఏ అవసరమోచ్చినా నేను ముందుంటాను.
అదే విధంగా నాకు ఏ సమస్య ఉన్నా తను కూడా ముందుంటాడు. మేము ఆడంబరంగా ఉండం. కానీ మా బాధ్యతను 100 శాతం నిర్వర్తించేందుకు అన్ని విధాలగా ప్రయత్నిస్తామని" ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment