సోనియాను ఆహ్వానిస్తున్న హేమంత్ సోరేన్
రాంచీ : దేశ వ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో విపక్ష నేతలంతా ఒకే వేదికను పంచుకోనున్నారు. జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ ఈనెల 29న రాంచీలో ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (ఎన్డీయేతర), పార్టీల అధినేతలు హాజరుకానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీలను స్వయంగా కలిసిన హేమంత్.. ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు. (29న సీఎంగా హేమంత్ ప్రమాణం)
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అయితే సోనియా గాంధీ రాకపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి విపక్ష నేతలంతా పెద్ద ఎత్తు హాజరైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment