soniya gandhi
-
ఇలాంటి పాలకులు అవసరమా?
వికారాబాద్: ‘అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే.. డిసెంబర్ 9న లాల్‌బహదూర్ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణం స్వీకారం చేయటం ఖాయం. ఆ రోజే ఆరు గ్యారంటీ స్కీంలపై తొలి సంతకం చేసి, తెలంగాణ ప్రజ లకు సోనియమ్మ, మల్లికార్జున ఖర్గే ఇచ్చిన హామీలను నేరవేరుస్తాం..’అని పీసీసీ అధ్య క్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగం కోసం చదివి చదివి వేసారిపోయిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే.. అసలు ఆమె దరఖాస్తే చేసుకోలేదని నిందలు వేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఆడబిడ్డపైన నిందలేయటానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పాలకులు అవసరమా? మనకు అని ప్రజలను ప్రశ్నించారు. సోమవారం రాత్రి వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నిండా ముంచారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని రేవంత్ గుర్తుచేశారు.. అందుకే తాము కూడా ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచార శంఖారావం పూరిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ప్రచారం ప్రారంభిస్తే.. మనం వికారాబాద్ నుంచి విజయోత్సవ సభలు మొదలు పెడుతున్నామని అన్నారు. కేసీఆర్‌కు హుస్నాబాద్ కలిసొస్తదో.. కాంగ్రెస్‌కు వికారాబాద్ కలిసొస్తదో తేల్చుకుందాం అని సవాలు విసిరారు. అమరుల త్యాగాలకు చలించిపోయిన సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్ ప్రజలను నిండా ముంచారని ఆరోపించారు. నాడు వైఎస్సార్ ప్రాణహిత ప్రాజెక్టును డిజైన్ చేసి ప్రారంభించడంతో పాటు రూ.11 వేల కోట్లు ఖర్చు చేశారని, కేసీఆర్ మాత్రం ప్రాజెక్టు డిజైన్ మార్చేసి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా నీళ్లిస్తామని కల్లబోల్లి మాటలతో కాలయాపన చేయడం తప్ప ఈ ప్రాంతానికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతానికి ఏమైనా ఆంధ్రోడు సీఎంగా ఉన్నా డా? లేక పక్క రాష్ట్రపోడు సీఎంగా ఉన్నాడా? అని ధ్వజమెత్తారు. తొలుత ఎన్నెపల్లిలోని సయ్యద్ యాసిన్, మాణెమ్మ, యాదయ్య ఇళ్లకు వెళ్లిన రేవంత్ ఆరు గ్యారంటీ పథకాల గురించి వివరించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేదలందరికీ వీటిని వర్తింపజేస్తామని తెలిపారు. మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌కుమార్, ఎ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
తొలిసారి హైదరాబాద్ గడ్డపై సీడబ్ల్యుసీ సమావేశం
-
హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక..
-
మహానేత వైఎస్సార్ సేవలుపై సోనియా గాంధీ ప్రశంసలు
-
అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా..!
సాక్షి, హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో వరుస ఓటములు మూటగట్టుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూలేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ సీనియర్ల ఒత్తిడి మేరకు పగ్గాలు చేపట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో అంతర్గత సంక్షోభం ముదిరింది. నాయకత్వలో మార్పులు తీసుకురావల్సిన సమయం ఆసన్నమైందన్న చర్చ తెరపైకి వచ్చింది. అయితే గత వారం రోజులుగా జరుగుతున్న అనేక ఉత్కంఠ పరిణామాల అనంతరం.. సోనియా తాత్కాలిక అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసినట్లు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. (కాంగ్రెస్ నాయకత్వంపై సీనియర్లు లేఖ) అయితే దీనిపై ఇప్పటి వరకు పార్టీ పెద్దల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు పార్టీలో నాయకత్వ మార్పులు తీసుకురావాలని 23 మంది సీనియర్లు ఆదివారం కాంగ్రెస్ అధినేత్రికి లేఖరాశారు. అంతేకాకుండా పార్టీలోని జూనియర్లు సైతం నాయకత్వ మార్పును కోరుకూండా స్వరాన్ని వినిపించారు. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియా వైదొలిగినట్లు తెలుస్తోంది. అయితే సోమవారం జరుగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె రాజీనామాను అధికారికంగా ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా చేస్తే మరోసారి రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేక కొత్త నేతను ఎన్నుకుంటారా అనేది జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. -
వలస కార్మికులు: సోనియా కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కూలీలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు వారి స్వస్థలాలకు చేరేలా లాక్డౌన్ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం సడలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు స్వస్థలాలకు వెళ్లేందుకు కనీస ప్రయాణ ఖర్చులు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కూలీల ప్రయాణ ఖర్చులపై కేంద్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ క్రమంలో వలస కూలీల ఇబ్బందులపై స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం వారికి అండగా ఉంటామని ప్రకటించింది. వలసకార్మికుల ప్రయాణ ఖర్చు కాంగ్రెస్ పార్టీనే భరిస్తుందని, స్థానిక పార్టీ నేతలు వలస కార్మికులకు భరోసా నివ్వాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. (ఇడిసిపెడితే నేను పోత సారు..) రైళ్ల ఖర్చులు కూడా పార్టీ భరిస్తుందని సోనియా తెలిపారు. ఈ మేరకు కార్మికుల కష్టాలపై కేంద్రానికి సోమవారం ఆమె లేఖ రాశారు. స్థానిక పీసీసీ నేతలు వలస కార్మికుల అండగా నిలవాలని సోనియా పిలుపునిచ్చారు. వలస కార్మికులే దేశానికి వెన్నెముకగా అభివర్ణించిన సోనియా వారి కష్టం, త్యాగం మన దేశానికి పునాది అని వర్ణించారు. విదేశాల్లో ఉన్న వారిని ప్రత్యేక విమానాల్లో దేశానికి తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వల సకార్మికుల్ని సొంతూళ్లకు పంపాలేదా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. వలస కూలీలు ఇళ్లకు వెళ్లకుండా చిక్కుకుపోవడానికి ప్రభుత్వమే కారణమని ఘాటు విమర్శలు చేశారు. కేవలం 4 గంటల సమయం ఇచ్చి లాక్డౌన్ విధించారని మండిపడ్డారు. (అర్నాబ్ గోస్వామిపై కేసు నమోదు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సోనియా గాంధీకి అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చిక్సిత అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. అయిత పార్టీ వర్గాల మాత్రం సాధారణ చెకప్‌గా చెబుతున్నారు. కాగా ఉదరకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె గతంలో కూడా చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజా ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు హుటాహుటినా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. -
సోరెన్ ప్రమాణ స్వీకారానికి హేమాహేమీలు
రాంచీ : దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ, సీఏఏపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో విపక్ష నేతలంతా ఒకే వేదికను పంచుకోనున్నారు. జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ ఈనెల 29న రాంచీలో ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (ఎన్డీయేతర), పార్టీల అధినేతలు హాజరుకానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీలను స్వయంగా కలిసిన హేమంత్.. ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు. (29న సీఎంగా హేమంత్ ప్రమాణం) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అయితే సోనియా గాంధీ రాకపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి విపక్ష నేతలంతా పెద్ద ఎత్తు హాజరైన విషయం తెలిసిందే. -
శివసేనకు ఎన్సీపీ షాక్..!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన వీడినట్లు కనిపించట్లేదు. రోజుకో మలుపు తిరుగుతూ.. ఉత్కఠ పరిణామాలకు దారి తీస్తోంది. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన ప్రకటించినా.. మూడు పార్టీలు కలిసి ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకటన మాత్రం చేయలేదు. ఇదిలావుండగా మహారాష్ట్ర రాజకీయాలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై సోనియా గాంధీతో చర్చించేందుకు పవార్ సోమవారం ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి భేటీకి ముందు జరిగిన మీడియా సమావేశంలో విలేకరులు ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. వాటికి పవార్ సమాధానం చెబుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కలిసి పోటీచేశాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేశాయి. వాళ్ల రాజకీయాలు వాళ్లు చూసుకుంటారు. శివసేన దారి ఎటు వైపో వారే తేల్చుకోవాలి’ అంటూ ఆశ్చర్యకరమైన రీతిలో వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా.. తాము ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పవార్ స్పందిస్తూ.. ఆ వార్తలు నిజమేనంటూ బదులిచ్చారు. దీంతో ఆయన మాటల్లో అర్థమేంటనేది అంతుపట్టలేదు. కాగా శివసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని, పూర్తి కాలంపాటు తాము అధికారంలో ఉంటామని పవార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పలు సందేహాలను కల్పిస్తున్నాయి. ఢిల్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా ప్రభుత్వ ఏర్పాటుపై సోనియాతో చర్చించిన అనంతరం ఇరు పార్టీలు ఓ ప్రకటన విడుదల చేస్తాయని తెలుస్తోంది. -
గాంధీ కుటుంబానికి షాకిచ్చిన కేంద్రం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న గాంధీ కుటుంబానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలకు ప్రస్తుతం కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ)ను ఉపసంహరించుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి భద్రతకు ఎలాంటి ముప్పు లేదని భావిస్తోన్న కేంద్రం.. ఎస్పీజీని తొలగించి జెడ్‌ప్లస్ భద్రతను కల్పించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఎస్పీజీ భద్రతను కేవలం రాష్ట్రపతి, దేశ ప్రధానికి మాత్రమే కేటాయిస్తారని, ఇతర నేతలకు అవసరం లేదని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న ఎస్పీజీ చట్టానికి సవరణ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని, దాని కొరకు త్వరలోనే పార్లమెంట్లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా వార్తల నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. విపక్షాలపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా మాజీ ప్రధాని ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కూడా ఇటీవల ఎస్పీజీ భద్రతను కేంద్రం ఉపసంహరించుకున్న విషయ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు జెడ్‌ప్లస్ భద్రతను కల్పిస్తున్నారు. -
ఈనెల 4న విపక్షనేతలతో సోనియా భేటీ
-
‘మోదీ-షా బతికుండటం సోనియాకు ఇష్టం లేదు’
లక్నో: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీపై ప్రముఖ యోగా గరువు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు బతికిఉండటం వారిద్దరికీ ఇష్టం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అమిత్ షాను చట్టవిరుద్ధంగా జైల్లో పెట్టించారని, ఆయన జైల్లోనే చనిపోవాలని వారు కోరుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా అమిత్ షాను జైలుపాలు చేసిన నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరంకు కూడా అదేగతి పట్టిందని అన్నారు. తాను జైలుకు పోతానని చిదంబరం కలలో కూడా ఊహించి ఉండరని రామ్‌దేవ్ అభిప్రాయపడ్డారు. నోయిడాలో మంగళవారం రాత్రి ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌దేవ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. -
కాంగ్రెస్ కీలక భేటీ.. రాహుల్ డుమ్మా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థాయి సమావేశానికి ఆ పార్టీ ప్రధాన నేత రాహుల్ గాంధీ డుమ్మా కొట్టారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన గురువారం ఈ భేటీ జరిగింది. దేశ ఆర్థిక సంక్షోభం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, వందరోజుల పాలన, జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ ఎంపీలు, అన్ని రాష్ట్రాల పీసీసీలు దీనికి హాజరయ్యారు. కానీ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ గైర్హాజరు కావడం పలువురి నేతల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దేని కారణంగా రాహుల్ హాజరుకాలేదని నేతలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాహుల్ రాజీనామా అనంతరం.. పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారని నేతల సమాచారం. కాగా గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పార్టీ నేతకు సోనియా దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంపై ఆవేదన వ్యక్తం చేసిన సోనియా.. నేతలంతా ప్రజలకు చేరువకావాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా పోస్టులకు ముగింపు పలికి ప్రత్యక్ష రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించాలని ఆమె సూచించారు. జాతిపిత మహాత్మాగాంధీ, సర్థార్ వల్లబాయ్‌పటేల్, నెహ్రూ ఆశయాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం దేశాన్ని పాలిస్తోందని వాటిన్నింటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. -
‘ఇది సరిపోదు.. దూకుడు పెంచండి’
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నాయకత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొవాలంటే పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత దూకుడుగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశించారు. కేవలం సోషల్ మీడియా ద్వారా స్పందిస్తే సరిపోదని.. నేరుగా ప్రజల వద్దకు వెళ్లాలంటూ నేతలకు సూచించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో గురువారం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేవలం ట్విటర్లు, సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ప్రజలను చైతన్య పరచలేమని, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆమె వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మాగాంధీ, సర్థార్ వల్లబాయ్‌పటేల్, నెహ్రూ ఆశయాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం దేశాన్ని పాలిస్తోందని వాటిన్నింటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు ట్విటర్ ఖాతా లేని వారిని ఆమె మందలించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్పీకరించిన అనంతరం.. సోషల్ మీడియాపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు పార్టీ నేతలంతా ప్రచార మాధ్యమాల్లో యాక్టీవ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా సొంత ట్విటర్ ఖాతాను ప్రారంభించి.. ప్రభుత్వ వైఫల్యాలపై తనదైన శైలీలో స్పందిస్తున్నారు. కానీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఆ పార్టీకి ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో తన బాధ్యతల నుంచి రాహుల్ తప్పుకున్నారు. సోషల్ మీడియానే నమ్ముకున్న కాంగ్రెస్‌కు కనీసం సీట్లు కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో నేతలంతా ప్రజలకు చేరువకావాలంటూ పార్టీ అధినేత్రి సోనియా ఆదేశాలు జారీచేశారు. -
జైట్లీ భార్యకు సోనియా భావోద్వేగ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చివరి వరకు ధైర్యం కోల్పోకుండా మృత్యువుతో పోరాడి అరుణ్ జైట్లీ పోరాట పటిమను ప్రదర్శించారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆమె జైట్లీ భార్య సంగీతా జైట్లీకి సంతాప లేఖ రాశారు. ఈ కష్టకాలంలో మీ బాధను పంచుకోవడానికి నేను ఉన్నాననే భరోసా మాత్రం ఇవ్వగలను అని పేర్కొన్నారు. ‘జైట్లీ మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన స్వభావంతో పార్టీలకతీతంగా మిత్రులు, అభిమానుల్ని సంపాదించుకున్నారు. కేంద్ర మంత్రి, సుప్రీం కోర్టు న్యాయవాది, ప్రతిపక్ష నేత ఇలా ఏ పదవిలో ఉన్నా.. ఆయన గొప్ప వాగ్ధాటి, విజ్ఞతను ప్రదర్శించారు. ఇంకా దేశానికి ఎంతో చేయాల్సి ఉన్న తరుణంలో, చిన్న వయసులో మరణించడం జీర్ణించుకోలేని విషయం. ఈ సమయంలో మాటలు ఓదార్పును చేకూర్చలేవని తెలుసు. ఈ కష్టకాలంలో మీ బాధను పంచుకోవడానికి నేను ఉన్నాననే భరోసా మాత్రం ఇవ్వగలను. దేశం గొప్ప ప్రజానాయకుణ్ని కోల్పోయింది. పార్టీలకతీతంగా అందరూ అభిమానించే గొప్ప నేతని కోల్పోయాం. అరుణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని సోనియా గాంధీ తన సంతాప సందేశాన్ని సంగీతాకు పంపారు. తీవ్ర అనారోగ్యంతో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ కీలక నేత అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
రాజీవ్‌కు ప్రధాని మోదీ, సోనియా నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని రాజీవ్ సమాధి వీర్‌భూమిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నివాళి అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విటర్ వేదికగా ఆయనను స్మరించుకున్నారు. దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో రాజీవ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ జయంతిని ఘనంగా నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు గాంధీ భవన్లో రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమజిగూడలో ఆయన విగ్రహానికి పూలవేసి నివాళులు అర్పిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు -
కశ్మీర్ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షం
లక్నో: జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35–ఏ అధికరణాలను రద్దు చేస్తూ.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. దీనికి భిన్నంగా విపక్ష కాంగ్రెస్ ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ ఆ పార్టీ పార్లమెంట్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. రాయ్‌బరేలీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అధితి సింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించిన ఆమె ‘దేశ సమైఖ్యతకు తామంతా కట్టుబడి ఉంటాం. జైహింద్’ అంటూ ట్వీట్ చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా అధితి పోస్ట్ చేయడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. అధితి సింగ్ పోస్ట్‌పై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి యూపీయే చైర్పర్సన్ ఎంపీగా గెలుపొందిన విషయం గమన్హారం. ఆమెతో పాటు యూపీ కాంగ్రెస్ సీనియర్ నేత జనార్థన్ ద్వివేది కూడా కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించారు. వీరితో పాటు మరికొంత మంది హస్తం నేతలు కూడా ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై తమ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ విప్ భువనేశ్వర్ కలిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఆత్మహత్యాసదృశ్యంగా ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశమంతా కశ్మీర్ అంశంపై చర్చిస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక గాంధీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. -
కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. తెరపైకి వారిద్దరు
సాక్షి, న్యూఢిల్లీ: వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన గ్రాండ్ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఎప్పూడు లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేసింది. కాంగ్రెస్ ఆశాకిరణంగా భావించిన రాహుల్.. తొలి ఎన్నికల్లోనే పూర్తిగా తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే రాహుల్ రాజీనామాతో ఆ పార్టీలో నాయకత్వ సమస్య స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితాల అనంతరం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనే రాహుల్ రాజీనామా సమర్పించినప్పటికీ దానిపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాజీనామాను ఉపసంహరించుకోవాలని పార్టీ సీనియర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు బుజ్జగించిన్నప్పటికీ ఆయన ససేమిరా అంటున్నారు. దీంతో రాహుల్ స్థానంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానితోనే అసలు సమస్య ప్రారంభమైంది. మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్లు.. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో ఆ పార్టీ చావు దెబ్బతిన్నది. దీంతో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారగా.. సీనియర్లు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చి, కాంగ్రెస్ కోటలో పాగా వేసిన బీజేపీని ఎదుర్కోగల సమర్థవంతమైన నేత ఎవరన్నది ఆ పార్టీ అధిష్టానం ఇంకా తేల్చలేకపోతోంది. ఒకవేళ నూతన సారథిని నియమించిన్నప్పటికీ.. గాంధీ కుటుంబ కనుసన్నల్లో మెలిగే వ్యక్తికే ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇదిలా వుండగా.. నూతన అధ్యక్షుడి నియామకం కోసం అన్వేషిస్తున్న ఆ పార్టీకి అదే సమయంలో ఊహించని పరిణామాలు ఎదురువుతున్నాయి. దక్షిణాదిలో ఎంతోకొంత బలంగా ఉన్న కర్ణాటకలో ఆ పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఎప్పడు కూలిపోతుందోనన్న భయం హస్తం నేతలను వెంటాడుతోంది. కన్నడ సంక్షోభం పూర్తికాక ముందే గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామాలు ఆ పార్టీకి ఊహించని షాకిచ్చాయి. దీంతో మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్లు అయింది కాంగ్రెస్ పని. ఇదిలావుండగా.. రాహుల్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో సమర్థవంతమైన నేత కోసం చర్చిస్తున్నట్లు ఆపార్టీ నేత జ్యోతిరాధిత్య సింథియా తెలిపారు. పార్టీలో సంక్షోభం అంటూ ఏమీలేదని.. అధ్యక్ష స్థానాన్ని స్వీకరించేందుకు అనేక మంది నేతలు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. వారిలో సమర్థవంతమైన నేతను ఎన్నుకుంటామని తెలిపారు. అయితే మరో వారంలో ఈ ప్రక్రియనంతా పూర్తి చేస్తామని సింథియా వెల్లడించారు. తెరపైకి ప్రియాంక.. సోనియా! మరోవైపు కాంగ్రెస్ నూతన అధ్యక్ష పదవికి పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సరైన వారంటూ మధ్యప్రదేశ్ మంత్రి సజ్జన్‌సింగ్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత సమయంలో పార్టీని నడిపించగల సామర్థ్యం ప్రియాంకకు తప్ప మరెవ్వరికీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి కొంతమంది నేతలు కూడా మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక బీజేపీని విమర్శించడంలో దిట్టగా హస్తం నేతలు భావిస్తున్నారు. యూపీతో పాటు ఉత్తారాది రాష్ట్రాల్లో పార్టీపై ఇప్పటికే పార్టీపై కొంత పట్టు సాధించినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా పార్టీ అధ్యక్ష పదవిని యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీనే మరోసారి చేపట్టాలని ఆ పార్టీ నేతలు సూచించినట్టు సమాచారం. అయితే అనారోగ్య కారణాల రీత్యా తాను స్వీకరించబోనని సోనియా తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్లలోనే ఎవరికోఒకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని సోనియా సూచించినట్లు తెలిసింది. దీంతో మరో వారం రోజుల్లో నూతన సారథి ఎవరో తేలనుందని పార్టీ నేతలు చెబుతున్నారు. -
అధినేతల అడుగులు
సాక్షి, వికారాబాద్ : చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఈక్రమంలో ఈనెల 7న యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ జిల్లాకు రానున్నారు. పూడూరు మండలం మిర్జాపూర్‌లో భారీ బహి రంగ సభ ఏర్పాటు చేసేందుకు హస్తం శ్రేణులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు చేవెళ్ల గడ్డపై మరోమారు గులాబీ జెండాను రెపరెపలాడించాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి గెలుపుకోసం ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించారు. తాజాగా గులాబీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. 8వ తేదీన వికారాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆయన హాజరై ప్రసంగించనున్నారు. రెండుపార్టీల అధినేతలు జిల్లాకు రానుండటంతో ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోనియా,కేసీఆర్ రాకతో రాజకీయం మరింత వేడెక్కనుంది. మిర్జాపూర్‌లో ఏర్పాట్లు ఈనెల 7న పూడూరు మండలంలోని మిర్జాపూర్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్షనేత బట్టి విక్రమార్కతోపాటు రాష్ట్రంలోని ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఇప్పటికే సభావేదిక వద్ద పనులు పూర్తయ్యాయి. చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి గడ్డం ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిరుపేదలకు రూ.72 వేలు, సంక్షేమ పథకాలపై ఆమె ప్రసంగించనున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్, కేసీఆర్‌పైనా విమర్శల బాణాలు ఎక్కుపెట్టే అవకాశాలు లేకపోలేదు. 2 లక్షల మందితో సీఎం సభ సీఎం కేసీఆర్ సభ జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈనెల 8న కేసీఆర్ వికారాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఏర్పాట్లపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. సుమారు 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేలా ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రచించారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని గులాబీ దళపతి గట్టి పట్టుదలతో ఉన్నారు. అదేవిధంగా వికారాబాద్, పరిగి, తాండూరుతోపాటు ఉమ్మడి రంగారెడ్డిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీ జన సమీకరణ చేసే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో భారీ బహిరంగ సభల్లో తన ప్రసంగంతో కేసీఆర్ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ సభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనేపథ్యంలో ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజకీయ భవితవ్యంపై కేసీఆర్ ఎలాంటి భరోసా ఇస్తారోనని ఆందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీల ప్రధాన ఎజెండా చేవెళ్ల పార్లమెంట్ పట్టణ, పల్లె ఓటర్ల కలబోత. రెండు ప్రాంతాల్లోని ఓటర్లను ఆకట్టుకనేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి రానుందని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, మిషన్ భగీరథ తదితర పథకాలు తమ అభ్యర్థిని గెలిపిస్తాయనే భరోసాలో టీఆర్ఎస్ ఉంది. జిల్లాలోని ప్రధాన సమస్యలను ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకొని ముందుకు సాగుతున్నారు. సాగు, తాగునీరు, నిరుద్యోగ సమస్యలతోపాటు అభివృద్ధి విషయమై హామీలు ఇవ్వనున్నారు. జోన్ అంశం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అధినేతల ప్రసంగంలో ప్రధానంగా ఉండబోతుంది. ఇక్కడి ప్రధాన సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి ఓట్లను దండిగా రాబట్టుకోవాలని నేతలు భావిస్తున్నారు. -
అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ
-
బీజేపీపై ఉమ్మడి పోరాటం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా కూటమి కట్టాలని 21 విపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఎన్డీఏయేతర పార్టీలకు చెందిన అగ్ర నాయకులు సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో సమావేశమై ఉమ్మడి వ్యూహ రచనపై మంతనాలు జరిపారు. రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, సీబీఐ, న్యాయ వ్యవస్థలో వెలుగుచూసిన అసాధారణ పరిణామాలు, నోట్లరద్దు ప్రభావాలు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. బీఎస్పీ, ఎస్పీ మినహా దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. బీజేపీ హయాంలో ఆర్బీఐ, సీబీఐ లాంటి సంస్థలపై దాడి జరుగుతోందని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఆరోపించాయి. రాష్ట్రాల వారీ పొత్తులే నయం.. బీజేపీ వ్యతిరేక ఓట్లను కూటగట్టడానికి రాష్ట్రాల వారీగా పొత్తులు పెట్టుకోవడం మేలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కూడా ఈ ఆలోచనకు మద్దతు పలికినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏ క్షణమైనా తమ వైఖరిని మార్చుకునే బీఎస్పీ, ఎస్పీలు ఈ సమావేశానికి హాజరుకాకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. 80 సీట్లున్న యూపీకి చెందిన ఈ పార్టీలు లేకుండా ఎన్డీయేకు ధీటుగా కూటమి ఏర్పాటుచేయడం అసాధ్యం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని దేవెగౌడ, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. వినాశన యత్నాల్ని అడ్డుకుంటాం ఆర్బీఐ లాంటి సంస్థలను నాశనం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్ని నిలువరించా లని విపక్షాలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో దేశంలో ఆర్థి క అత్యవసర పరిస్థితి ప్రారంభమైందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఆర్బీఐ గవర్నర్ ఇలా ఉన్నపళంగా ఎప్పుడూ రాజీనామా చేయలేదని, తాజా పరిణామం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థల్ని పరిరక్షించడానికే విపక్షాలన్నీ చేతులు కలిపాయని, ఈ సమావేశం చారిత్రకమని చంద్రబాబు చెప్పారు. -
మరో పోరాటానికి ఈ గడ్డ వేదిక : సోనియా గాంధీ
-
ఆస్పత్రికి సోనియా; బీజేపీకి రాహుల్ చురక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఈసారి అమ్మ సెంటిమెంట్‌తో కొట్టారు. విమర్శించడానికి అంతలా కష్టపడొద్దంటూ బీజేపీకి చురక అంటించారు. గతంలో సర్జరీ చేయించుకున్న సోనియా గాంధీ.. వార్షిక వైద్యపరీక్షల కోసం మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు. ఈ సారి ఆమెను తనయుడే తోడ్కొనిపోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధీనే వెల్లడించారు. ‘‘వార్షిక వైద్యపరీక్షల కోసం అమ్మను ఆస్పత్రికి తీసుకెళుతున్నాను. కాబట్టి కొన్ని రోజులు అందుబాటులో ఉండను. ఈ సందర్భంగా.. బీజేపీ ట్రోలింగ్ ఆర్మీకి నాదొక సూచన. నన్ను విమర్శించడానికి అంతగా కసరత్తు చేయాల్సిన అవసరంలేదు. అతి త్వరలోనే తిరిగొస్తాను’’ అని రాహుల్ రాసుకొచ్చారు. గతంలో చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్లిపోవడం, ఎక్కడున్నారో కనీస సమాచారం ఇవ్వకుండా రోజులకు రోజులు గడపడం లాంటివి రాహుల్ అలవాట్లుగా ఉండటం, ఆయా సందర్భాల్లో బీజేపీ పెద్ద ఎత్తున విమర్శల దాడి చేయడం తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి రాహుల్ తన విదేశీ పర్యటన వివరాలను ముందే వెల్లడించారు. మాందసౌర్ కాల్పులకు ఏడాది: తల్లి సోనియాను తీసుకుని రాహుల్ ఒకటి రెండు రోజుల్లోనే విదేశాలకు బయలుదేరి వెళతారని, వారం రోజుల తర్వాత ఢిల్లీకి తిరిగొస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కర్ణాటకలో కేబినెట్ విస్తరణకు సంబంధించి రాహుల్ ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారని, విదేశాల నుంచి వచ్చిన వెంటనే రాహుల్ మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారని, మాంద్సౌర్ రైతులపై కాల్పుల ఘటన జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జూన్6న రైతు కుటుంబాలను రాహుల్ కలవనున్నారు. Will be out of India for a few days, accompanying Sonia ji to her annual medical check up. To my friends in the BJP social media troll army: don’t get too worked up...I'll be back soon! — Rahul Gandhi (@RahulGandhi) 27 May 2018 -
డిసెంబర్లో రాహుల్‌కు ప్రమోషన్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా యువరాజు రాహుల్ గాంధీ(47) పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 5న తన తల్లి సోనియా గాంధీ నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని రాహుల్ గాంధీ అనధికారికంగా చేపట్టనున్నారు. ఆ మేరకు ఏఐసీసీ అధ్యక్ష పీఠాన్ని చేపట్టేందుకు రాహుల్‌కు వీలు కల్పిస్తూ.. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్‌ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఆమోదించింది. కీలకమైన గుజరాత్ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన సీడబ్ల్యూసీ సోమవారం నిర్ణయం తీసుకుంది. పార్టీ తరఫున రాహుల్ ఒక్కరే నామినేషన్ వేస్తారని, అందువల్ల నామినేషన్ల పరిశీలన అనంతరం డిసెంబర్ 5 నాటికే రాహుల్ ఎన్నిక ఖాయమవుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే డిసెంబర్ 19న రాహుల్ అధికారికంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్‌కు రికార్డు స్థాయిలో 1998 నుంచి 19 సంవత్సరాలుగా సోనియా గాంధీనే అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. డిసెంబర్ 1న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. సీడబ్ల్యూసీ భేటీ అనంతరం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ ముల్లపల్లి రామచంద్రన్ షెడ్యూల్ వివరాలు వెల్లడిస్తూ ‘డిసెంబర్ 1 నుంచి నామినేషన్లు స్వీకరిస్తాం. డిసెంబర్ 4 మధ్యాహ్నం మూడు గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. డిసెంబర్ 5న నామినేషన్లు పరిశీలించి మధ్యాహ్నం 3.30 గంటలకు పోటీలో నిలిచిన అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉంటే.. డిసెంబర్ 11 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువునిస్తాం. డిసెంబర్ 16న ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 19న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల్ని ప్రకటిస్తాం’ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం మేరకు.. రాహుల్ గాంధీ ఒక్కరే నామినేషన్ వేయనున్నారు. గుజరాత్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. డిసెంబర్ 5వ తేదీనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఎన్నిక ఖాయమవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్లో డిసెంబర్ 9, 14 తేదీల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో రాష్ట్ర పీసీసీ విభాగాల ప్రతినిధులు ఓటు వేస్తారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, ఇతర ఆఫీసు బేరర్స్‌తో కూడిన సీడబ్ల్యూసీ టీంను ఎంపికచేస్తారు. సోనియా మార్గనిర్దేశకత్వం ఉంటుంది 2013లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టారు. గత కొంతకాలంగా సోనియా గాంధీ అనారోగ్యం నేపథ్యంలో రాహుల్‌కు పార్టీ బాధ్యతల అప్పగింతపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘సోనియా గాంధీ మా నేత, మార్గదర్శకురాలు. ఇన్నాళ్లు నిరంతరంగా కాంగ్రెస్ పార్టీని నడిపించారు. రాహుల్ గాంధీకే కాకుండా కోట్లాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆమె సమర్ధ నాయకత్వం, మార్గనిర్దేశకత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది’ అని చెప్పారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల అనంతరం సోనియా గాంధీ ఎలాంటి పాత్ర పోషిస్తారు? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ముందు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానివ్వండి’ అని అన్నారు. ఇదే సరైన సమయం సీడబ్యూసీ నిర్ణయాన్ని పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం పార్టీకి పునరుజ్జీవమని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ ఎన్నిక పార్టీపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఎంపీ రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఒక కుటుంబానికే పరిమితమా? కింది స్థాయి కార్యకర్త ఆ పదవిని ఎన్నటికీ ఆశించలేడా?అని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్‌ప్రసాద్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య ఆలయానికి తాళం: సోనియా న్యూఢిల్లీ/రాజ్‌కోట్: మోదీ ప్రభుత్వం అహంకారంతో ప్రవర్తిస్తోందని, పార్లమెంట్ శీతాకాల సమావేశాల జాప్యం పేరుతో ప్రజాస్వామ్య దేవాలయానికి తాళం వేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వల్ప కారణాలతో శీతాకాల సమావేశాలకు విఘాతం కలిగిస్తున్నారని సీడబ్ల్యూసీ భేటీలో ఆమె ఆరోపించారు. సోనియా ఆరోపణల్ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చుతూ.. గతంలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కూడా సమావేశాల్ని వాయిదా వేసిందని సమాధానమిచ్చారు. నిజానికి శీతాకాల సమావేశాలు నవంబర్ మూడో వారంలో ప్రారంభమై.. డిసెంబర్ మూడో వారంలో ముగియాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఈసారి డిసెంబర్ రెండో వారంలో ప్రారంభించి 10 రోజుల పాటు కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాల వాయిదాను సీడబ్ల్యూసీ భేటీలో సోనియా ప్రస్తావిస్తూ.. ‘మోదీ ప్రభుత్వం అహకారంతో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నీరుగారుస్తోంది. ఎన్నికల వేళ ప్రజాస్వామ్య దేవాలయానికి తాళం వేసి రాజ్యాంగ జవాబుదారీతనం నుంచి తప్పించుకోవాలనుకుంటే పొరబడినట్లే’ అని ఆమె పేర్కొన్నారు. సోనియా ఆరోపణల్ని జైట్లీ తిరస్కరిస్తూ.. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2011వ సంవత్సరంతో పాటు అంతకుముందు కూడా ఎన్నికల కారణంతో పార్లమెంట్ సమావేశాలు ఆలస్యమయ్యాయి. ఇలా మార్పులు చేయడం సంప్రదాయంగా వస్తోంది’ అని జైట్లీ పేర్కొన్నారు. శీతాకాల సమావేశాల్ని తప్పకుండా నిర్వహిస్తామని, ఒక నిజాన్ని అబద్ధమని ఎంత గట్టిగా చెప్పినా అది అబద్ధం కాదన్నారు. -
లాలూ ర్యాలీకి సోనియాగాంధీ దూరం
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం బిహార్ రాజధాని పట్నాలో నిర్వహిస్తున్న విపక్షాల ర్యాలీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దూరంగా ఉండనున్నారు. అవినీతి కేసులున్న లాలూ చేపడుతున్న ఈ ర్యాలీకి సోనియా, రాహుల్ హాజరైతే తమ పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని బిహార్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, సీపీ జోషీ ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి లాలూకు వర్తమానం అందింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జేడీయూ తిరుగుబాటు నేత శరద్ యాదవ్ హాజరు కానున్నారు. కాగా బీఎస్పీ అధినేత్ర మాయావతి కూడా లాలూ ర్యాలీకి దూరంగా ఉండనున్నారు. ఆ పార్టీ తరపు నుంచి సీనియర్ నేత సతీష్ మిశ్రా హాజరు అవుతారు. మరోవైపు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమై పోరాడాలన్న లాలూ పిలుపుకు చివరి నిమిషంలో కీలక నేతలంతా ఒక్కోక్కరుగా హ్యాండిస్తూ వస్తుండటం లాలూను కంగారు పెడుతోంది. 2019 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వినిపిస్తున్న ‘బీజేపీ హఠావో.. దేశ్ బచావో’. అన్న నినాదం వర్కవుట్ అవుతుందా? అన్నది తెలియాలంటే ఆదివారం జరిగే లాలూ ర్యాలీ కార్యక్రమం వరకూ వేచి చూడాల్సిందే. -
తెలంగాణ స్వప్నం నెరవేరింది
తాండూరు, న్యూస్‌లైన్: సోనియాగాంధీ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మాజీ హోంమంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు చేపట్టిన తెలంగాణ నవ నిర్మాణ యాత్ర ముగింపు సభ ఆదివారం రాత్రి తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగింది. ఈసభకు హాజరైన ఎంపీ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నవ నిర్మాణ యాత్రతో కార్తీక్‌రెడ్డి తండ్రి ఇంద్రారెడ్డికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. సీమాంధ్రులు తెలంగాణాను అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేసినా ఆగదని ఆయన స్పష్టం చేశారు. అయితే పార్లమెంట్లో బిల్లు పాసయ్యే వరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తెలంగాణ కోసం ఉద్యమించడం ఆపలేదన్నారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో సబితారెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర పునఃనిర్మాణానికి పాటుపడతామన్నారు. తెలంగాణ కోసం పోరాడిన పార్టీలను తాము గౌరవిస్తామని, అయితే తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టేనని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీని, శ్రేణులను ఉత్తేజపరుస్తూ యాత్ర చేపట్టిన కార్తీక్‌రెడ్డికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందన్నారు. మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో జిల్లాకు చెందిన విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియాగాంధీ పాదాలకు మొక్కినా తప్పులేదన్నారు. మాజీ హోంమంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెర దించుతూ సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారన్నారు. జిల్లాలో తన కొడుకు కార్తీక్‌రెడ్డి ఐదు రోజుల పాదయాత్రకు అండగా నిలబడిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఉద్విగ్నతకు లోనైన కార్తీక్‌రెడ్డి ఐదు రోజులపాటు జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన కార్తీక్‌రెడ్డి వేదికపై ఉద్విగ్నానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన అమ్మమ్మగారి ఊరైన తాండూరులో తన పాదయాత్రకు ఘన స్వాగతం లభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఐదు రోజుల పాదయాత్రకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలన్నారు. తెలంగాణ ప్రజల కలను నెరవేర్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినందున సోనియాకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు పాదయాత్ర చేశానన్నారు. కొత్త రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఆర్థిక వనరుల విషయంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇంద్రారెడ్డి కొడుకుగా, పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పని చేస్తానన్నారు. కాగా జై తెలంగాణ నినాదాలతో సభ మారుమోగింది. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రావణ్‌కుమార్, చేవెళ్ల, పరిగి, వికారాబాద్,తాండూరు కాంగ్రెస్ నాయకులు కాలె యాదయ్య, రాంమోహన్‌రెడ్డి, యాదయ్య,రమేష్, విశ్వనాథ్‌గౌడ్, సిటీ కేబుల్ ఎండీ నర్సింహ్మారెడ్డి(బాబు), దారాసింగ్, రాకేష్, అపూ, మల్లిఖార్జున్, ప్రభాకర్‌గౌడ్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు. అంతకుముందు కార్తీక్‌రెడ్డిని కార్తకర్తలు గజమాలతో సన్మానించారు. -
సోనియాకు రుణపడి ఉంటాం
చేవెళ్ల, న్యూస్‌లైన్: తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఇక్కడి ప్రజలంతా రుణపడి ఉన్నారని, వారి పట్ల మనం కృతజ్ఞతగా ఉండాల ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. గురువారం రెండో రోజు ‘తెలంగాణ నవ నిర్మాణ పాదయాత్ర’ చేవెళ్ల మండల కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సారయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను సోనియా గాంధీ నెరవేర్చారని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. ఉద్యమం నడుస్తున్న కాలంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నా.. తెలంగాణ ఏర్పడలేదని, ఇప్పుడు సోనియాగాంధీ వల్ల సాధ్యమవుతోందని అన్నారు. కార్తీక్‌రెడ్డి పాదయాత్రకు తెలంగాణ ఫోరం మద్దతు ప్రకటిస్తున్నదన్నారు. పది జిల్లాల్లోనూ యువకులు ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అందరూ ఆశీర్వదించాలి.. తెలంగాణ ప్రజల సాగు, తాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రారంభించిన ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును ప్రత్యేక రాష్ట్రంలో పూర్తి చేసుకుందామని మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి పేర్కొన్నారు. హోంమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం ఎవరు ఉద్యమం చేసినా పూర్తిగా సహకరించానని తెలిపారు. కార్తీక్‌రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని, పాదయాత్ర విజయవంతానికి కృషిచేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని అన్నారు. పునర్నిర్మాణం కాంగ్రెస్ బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయాలనే ఉద్దేశంతోనే పాదయా త్ర చేపట్టానని కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. బలిదానాల సాక్షిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సమస్యా తీరుతుందన్నారు. పశ్చిమ రంగారెడ్డి జిల్లాను హార్టికల్చర్ జోన్‌గా ఏర్పాటుచేయడానికి తనవంతు కృషిచేస్తానని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, గచ్చిబౌలిలో 300 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. కృష్ణా జలాల తరలింపునకు ప్రయత్నిస్తా: చంద్రశేఖర్ జిల్లా ప్రజల సాగునీరు, తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రకటనతో పది జిల్లాలకు స్వాతంత్య్రం వచ్చినట్లయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ పి.వెంకటస్వామి, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు కాలె యాదయ్య, డీసీసీబీ డెరైక్టర్, మండల పార్టీ అధ్యక్షుడు ఎస్.బల్వంత్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎం.బాల్‌రాజ్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో చేవెళ్ల సర్పంచ్ ఎం.నాగమ్మబాల్‌రాజ్, డీసీసీబీ వైస్‌చైర్మన్ పి.కృష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎం.వెంకటేశంగుప్త, వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, ఇంద్రన్న యువసేన అధ్యక్షుడు జి.రవికాంత్‌రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎం.యాదగిరి, ఎండీ.అలీ, శివానందం, ఎం.రమణారెడ్డి, వనం మహేందర్‌రెడ్డి, నర్సింహులు, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. -
బయటపెట్టండి!
ముంబై: ఆదర్శ్ కుంభకోణంపై జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీలో శనివారం చేసిన వ్యాఖ్యలతో ఈ డిమాండ్లు మరింత ఊపందుకున్నాయి. దిసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టును ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టాలని సమాచార హక్కు కార్యకర్త అనిల్ గల్గాలీ ఆదివారం డిమాండ్ చేశారు. అప్పుడే కుంభకోణంలో నిందితులుగా ఉన్నవారి ముఖాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. నివేదిక సిద్ధమై నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దానిని మరాఠీలోకి మార్చుకోలేకపోవడంపై గల్గాలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం నివేదికను మరాఠీలోకి మార్చుకోవాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో నిర్లక్ష్యం చేసిందన్నారు. ఆదర్శ్ కుంభకోణంలో నిందితులెవరో నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను వేసి, రూ. 7.04 కోట్లు ఖర్చుచేసిందని, దానిని అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చి చర్చ జరిపేందుకు నిరాకరించడమెందుకని ప్రశ్నించారు. కుంభకోణానికి పాల్పడిన రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వమే కవచంలా ఉండి కాపాడుతోందని ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చవాన్ కార్యదర్శి భగవాన్ సాహేకు లేఖ రాశారు. ‘రాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం ప్రతి నివేదికను ఆంగ్లంతోపాటు మరాఠీలోకి అనువదించుకోవాలి. ముంబై ఉగ్రదాడిపై నియమించిన రామ్‌ప్రధాన్ కమిటీ నివేదికను రెండు భాషల్లో సిద్ధం చేసుకున్నారు. అయితే ఆదర్శ్ కుంభకోణం నివేదిక విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను తుంగ లో తొక్కుతోంద’ని లేఖలో పేర్కొన్నారు. -
రామన్న బలిదానం
నిజాంసాగర్, న్యూస్‌లైన్: ‘‘ఎలాంటి ఆంక్షలు లేకుండా హైదరాబాద్ రాజధానిగా పదిజిల్లాలతో కూడిన తెలంగాణను ఇవ్వాలని, భద్రాచలాన్ని మా నుంచి విడదీయొద్దని సోనియాగాంధీ అమ్మను కోరుతున్నా..’’ అంటూ లేఖ రాసి ప్రాణం విడిచాడు రాములు. ఈప్రాంత ప్రజల దశాబ్దాల ఆకాం క్షను పక్కనపెట్టి ఎవరూ కోరుకోని రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడాన్ని జీర్ణించుకోలేని నిజాంసాగర్ మండలం హసన్‌పల్లికి చెందిన మొకిరె రాములు(23) బుధవారం వేకువజామున ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ఏర్పాటుపై తర్జనభర్జనలతో కలత చెంది క్రిమిసంహారక మందు సేవించి ప్రాణం తీసుకున్నాడు. . మొకిరె దుర్గయ్య, దేవవ్వ దంపతుల కుమారుడైన రాములు ఎంఎస్సీ బీఎడ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం బాన్సువాడలో పీజీడీసీఏ చేస్తున్నాడు. హోరెత్తిన నిరసనలు విద్యార్థి రాములు ఆత్మహత్యతో జిల్లావ్యాప్తంగా తెలంగాణ వాదులు, ఉద్యోగులు, రాజకీ య ఐకాస నాయకులు ఆందోళనకు దిగారు. రాములు ఆత్మకు శాంతి చేకూరాలంటే పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వారంతా హసన్‌పల్లి గ్రామానికి చేరుకొని తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతత్వంలో నిర్వహించిన ధర్నా, రాస్తారోకోలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే పాల్గొన్నారు. రెండు గంటల పాటు బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద హైదరాబాద్-బోధన్-నిజాంసాగర్-ఎల్లారెడ్డి ప్ర ధాన రహదారులపై ఆందోళనలు నిర్వహించా రు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థి మృతితో తెలంగాణవాదులు, నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాస్తారోకో, ధర్నాలు చేపట్టడంతో పోలీసులు చాకచక్యంగా మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వా స్పత్రికి తరలించారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లె రవీందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బాణాల లక్ష్మారెడ్డి తదితరులు రాములు తల్లిదండ్రులను పరామర్శించారు. ఆందోళనలో స్థానిక నాయకులతో పాటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు. హసన్‌పల్లిలో అంత్యక్రియలు.. రాములు మృతదేహాన్ని పోలీసులు ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిం చారు. అనంతరం కుటుంబసభ్యులకు అందించారు. హసన్‌పల్లిలో నిర్వహించిన అంత్యక్రియల్లో గ్రామస్తులు, అధికసంఖ్యలో తెలంగాణవాదులు పాల్గొన్నారు. జెతైలంగాణ, రాములు అమర్ రహే అంటూ నినదించారు. -
కిరణ్ పక్కా విభజన వాది: గట్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడిన జాలి మాటలన్నీ బూటకమని, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఆయన నటిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. సమైక్యం ముసుగులో ఉన్న విభజనవాది కిరణ్ అని తూర్పారబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు విలేకరులతో మాట్లాడారు. సమైక్య ఉద్యమాన్ని సీఎం కిరణ్ నీరుగారుస్తూ, విభజనకు తీవ్రంగా కృషి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య రాష్ట్రంలో దోబూచులాట జరుగుతోందని, ఆ రెండు పార్టీలు తమ వైఖరితో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. వరదల వల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని పరామర్శించడానికి వెళ్లిన తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు ప్రజల నుంచి ఆదరణ లభించే సరికి పోలీసుల చేత అడ్డుకున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబును మాత్రం 300 మంది పోలీసులతో ప్రత్యేకమైన భద్రత మధ్య రెడ్‌కార్పెట్ వేసి తీసుకెళ్లారని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. చంద్రబాబు మీద కాంగ్రెస్‌కు ఎందుకింత ప్రేమో ప్రజలందరికీ తెలుసన్నారు. సమైక్య రాష్ట్రంలో జీతాలు తీసుకుంటున్న మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన తీరుపట్ల తాను వేసిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం చెప్పలేదన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ, పౌరహక్కులను కాలరాసిన ఇద్దరు మంత్రులను సీఎం ఎందుకు భర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. దీన్ని చూస్తే కిరణ్ ఎంత విభజన వాదో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. -
అమరుల త్యాగాలు వృధా కానివ్వం
మెదక్‌టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ అమరవీరుల తల్లుల గోస ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పట్టడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో స్థానిక క్రిస్టల్ గార్డెన్లో తెలంగాణ అమర వీరుల తల్లుల కడుపుకోత పేరుతో మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ కోసం 1200 మంది యువకులు, విద్యార్థులు తమ విలువైన ప్రాణాలను బలిపెట్టుకున్నారన్నారు. అయినప్పటికీ వారి తల్లుల ఘోస ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రలను టీవీల్లో చూసి తీవ్ర మనోవేదనకు గురైన యువకులు ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారన్నారు. 2014 వరకు తెలంగాణ రాదని స్వయంగా సీఎం కిరణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ఆయనను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు ఆగాలంటే తక్షణమే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభించి తెలంగాణ బిల్లును ఆమోదించాలన్నారు. తాము సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామన్నారు. యువకులు, విద్యార్థులు బలిదానాలకు పాల్పడకుండా బతికి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చేనెల 10న తెలంగాణ తల్లుల ఘోసను హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నిజాం కళాశాల మైదానంలో భారీ ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన అమరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మాసాయిపేట యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లారం రత్నయ్య, జిల్లా కార్యదర్శి చింతల రాములు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్, సిద్దిరాంలు, నాయకులు బాల్‌రాజ్, మహిపాల్, రవి, విఠల్, అబ్రహం, శ్యామ్యూల్ పాల్గొన్నారు. -
తెలంగాణ ఇచ్చినందునే కాంగ్రెస్‌లో చేరా!
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యవాద కబంధ హస్తాలనుంచి సంకెళ్లు తెంపుకుని బయటకు వచ్చే రోజులు దగ్గరకు వచ్చాయని మెదక్ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. ఆదివారం మెదక్ మండల పరిధిలోని గ్రామాల్లో అమె పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఖాజిపల్లి, కూచన్‌పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అమె మాట్లాడుతూ 60 ఏళ్లుగా వేచిఉన్న తెలంగాణ ప్రజల నిరీక్షణ ఫలించనుందన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చొరవతో తెలంగాణ బిల్లు కేబినె ట్ ఆమోదం పొంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. గతంలో తెలంగాణ కోసం కాంగ్రెస్‌ను విమర్శించిన తాను ప్రస్తుతం ఆ పార్టీని సమర్ధించక తప్పదన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటును ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీలో చేరతానని తాను చెప్పానని, తెలంగాణ ప్రకటించగానే మొదటి సారిగా తానే సోనియాగాంధీకి కృతజ్ఞలు తెలిపానన్నారు. కొందరు చిన్నాచితక పార్టీల నాయకుల మాటలకు చేతలకు పొంతన ఉండడంలేదని ఆమె పరోక్షంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం మరో ఏడాదిలో ఏర్పడనున్నందున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే అధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. సమైక్య రాష్ర్టం కోసం కృషి చేస్తున్న సీఎం కిరణ్కుమార్డ్డ్రి తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులను పట్టించుకోవడంలేదన్నారు. సమైక్యవాదులు తెలంగాణకు అడ్డుపడి తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. తన పదవీ కాలంలో మెదక్-అక్కన్నపేట రైల్వే లైన్ మంజూరీతోపాటు పల్లెపల్లెకు హైమాస్టు లైట్లు, తాగునీరు, రోడ్లు తదితర అభివృద్ధి పనులను చేపట్టానన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని తెలంగాణ ప్రాంతానికి కొత్తసీఎం వచ్చాక మనం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం 62 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు కడుపుకాలి పోరాటం చేస్తుంటే సీమాంధ్రులు 62రోజులుగా కృత్రిమ ఉద్యమం చేస్తూ తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆరునూరైనా తెలంగాణ వస్తుందని, ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకోవడం ఎవరి తరంకాదన్నారు. ఆంధ్రుల పాలనలో తెలంగాణలో ఉద్యోగాలు లేవని, అభివృద్ధి కుంటుపడిందని ఆయన ధ్వజమెత్తారు. కార్యక్రమంలో గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, నాయకులు మామిళ్ల అంజనేయులు, కిషన్‌గౌడ్, దేవాగౌడ్, సర్పంచులు వివిధ గ్రామాల సర్పంచులు హైమావతి నాగరాజు, మహేందర్‌రెడ్డి, ఫయాజ్ పాల్గొన్నారు. అంతకు ముందు ఖాజిపల్లి సర్పంచ్ సాద లక్ష్మితోపాటుమరో 100 మంది కార్యకర్తలు విజయశాంతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు మండల పరిధిలోని ఖాజిపల్లి గ్రామంలో హైమాస్టు లైట్ల ప్రారంభం, కోంటూర్‌లో బోరుమోటారుకు ప్రారంభోత్సవం, హవేళిఘణపూర్, మంబోజిపల్లి, ముత్తాయికోట గ్రామాల్లో హైమాస్టు లైట్లు, కూచన్‌పల్లి, గ్రామంలో హైమాస్టు లైట్లతో పాటు రూ. 5 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ విజయశాంతి శంకుస్థాపన చేశారు. రాములమ్మను అడ్డుకున్న చిన్నశంకరంపేట గ్రామస్థులు చిన్నశంకరంపేట: మెదక్ ఎంపీ విజయశాంతిని ఆదివారం చిన్నశంకరంపేట ఎస్సీకాలనీ ప్రజలు అడ్డుకున్నారు. స్థానిక బీసీ కాలనీలో బోరు మోటారును ప్రారంభించిన అనంతరం ఎంపీ తిరిగి వస్తుండగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ సంఘటన జరిగింది. తాము మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేటోల్లే లేరంటూ కొందరు దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీ వాహనాన్ని అడ్డుకుని తమ సమస్యను పరిష్క రించాలని డిమాండ్ చేశారు. వారిని సముదాయించేందుకు చిన్నశంకరంపేట ఎస్ఐ ప్రశాంత్ ప్రయత్నించగా తాము ఎంపీతోనే మాట్లాడుతామని చెప్పడంతో ఎంపీ విజయశాంతి వాహనం దిగి వారి సమస్యను పరిష్కరిస్తానని, నిధులు కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
డిసెంబర్‌లోపే తెలంగాణ
పాపన్నపేట, న్యూస్‌లైన్: డిసెంబర్‌లోపేప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఏడుపాయల దుర్గా భవానీ శరన్నవరాత్రోత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. సకలజనుల ఉద్యమం, యువకుల పోరాటం, తెలంగాణ ప్రక్రియకు తోడ్పడ్డాయన్నారు. 2009 డిసెంబర్ 9న ఇచ్చిన హామీ మేరకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నోట్ తయారు చేసి కేంద్ర కేబినెట్ చేత ఆమోదింపజేసిందన్నారు. ఇక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరింత వేగవంతమవుతుందన్నారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ డిసెంబర్‌లోగా ఏర్పడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన యూపీఏ చైర్పర్సన్ సోనియా, ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ చూపిన చొరవ మరువలేనిదన్నారు. సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించేందుకు మంత్రుల బృందం కృషి చేస్తోందని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రజలు 60 ఏళ్లుగా చేస్తున్న పోరాటాన్ని గుర్తించి సీమాంధ్రులు కూడా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అన్నదమ్ముల్లా వీడిపోయి,అత్మీయులుగా కలిసి ఉందామని పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి, ఏడుపాయల దేవాలయ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ చైర్మన్లు వెంకటేశ్వర్‌రెడ్డి, నర్సింలుగౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లప్ప, కాంగ్రెస్ నాయకులు రమేష్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణను ఆపే శక్తి ఎవ్వరికీ లేదు
ధర్పల్లి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపే శక్తి ఎవ్వరికీ లేదని పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా దయ, ఆశీస్సులే తన బలం అని అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బంజార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో జరిగే పరిణామాలతో పాటు, యువకుల ఆత్మబలిదానాలపై సోనియా కు వివరిస్తే స్పందించి రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వచ్చిం దన్నారు. తాను తెలంగాణ రాష్ట్రం కోసం సోనియా చుట్టూ ప్రదక్షిణలు చేశానని చెప్పారు. కో ట్లు సంపాదించే నాయకుడు ప్రజా నాయకుడు కా లేడన్నారు. సీమాం ధ్రులు రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరారు. వారి ప్రాంతానికి నిధుల కోసం డి మాండ్ చేసుకోవచ్చని సూచించారు. ప్రేమ పూర్వకంగా విడిపోవటమే మంచి పరిణామన్నారు. 2000లోనే అసెంబ్లీ లో తెలంగాణ కోసం మూడు గంటలు మాట్లాడాన ని గుర్తు చేశారు. సోనియాగాంధీ తనను ఎక్కడి నుంచి పోటీ చే యమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని అన్నారు. -
సోనియా కృషితోనే తెలంగాణ
బోధన్,న్యూస్‌లైన్ : ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ కృషితోనే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం కాబోతోందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం, యుపీఏ ప్రభుత్వం తెలంగాణకు కట్టుబడి ఉన్నాయన్నారు. మంగళవారం బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తా, తట్టికోట కాలనీలో మంత్రి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక పథకాలు అమలు చేస్తోం దన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాం లో వృద్ధాప్య పింఛన్ నెలకు 75 రూపా యలు ఉండగా, తమ ప్రభుత్వం దానిని రెండు వందల రూపాయలకు పెంచినట్లు చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. పట్టణ వాసుల సాగు, తాగు నీటికి ఆధారమైన బెల్లాల్ చెరువుకు మరమ్మతులు చేయించి నీటి సమస్యను పరిష్కరించానని తెలిపారు. రబీకి నిజాంసాగర్ నీళ్లు అందిస్తామని వెల్లడించారు . సాగర్ నీటిని రైతులు వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచిం చారు. ఈ సందర్భంగా ఇదే కాలనీకి చెంది న సూర లింగారెడ్డి మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు . కార్యక్రమంలో ఎఎంసీ చైర్మన్ గంగాశంకర్, సీడీసీ చైర్మన్ పోతారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ పాషామోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
త్యాగాల ఫలితమే తెలంగాణ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు, త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతోందని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎ మ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి అధ్యక్షతన సంగారెడ్డిలో జరిగిన ‘సోనియా అభినందన’ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగిం చారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లుగా, వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లుగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులను సన్మానించారు. ఎన్నికల ప్రణాళిక అ మల్లో భాగంగానే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆత్మస్థైర్యం, దార్శనికత ఉన్న నాయకురాలిగా సోని యాను అభివర్ణించారు. సమైక్య రాష్ట్రంలో 46 ఏళ్లపాటు ముఖ్యమంత్రులుగా కొనసాగిన ప్రాంతం వారే నష్టపోయామని అనడాన్ని డిప్యూటీ సీఎం ఆక్షేపిం చారు. ఆత్మగౌరవం, అస్తిత్వం, స్వయం పాలన కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రాంతాలుగా విడిపోయినా ఒక్కటిగా కలిసుందామని ఆయన సూచించారు. హామీని నిలబెట్టుకున్న ఘనత సోనియాదే.. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి అన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత సోనియాకే దక్కుతుందన్నారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం జరుగుతున్నా సోనియా సూచన మేరకే తాము వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నామని మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్ని శక్తులు అడ్డుకున్నా సోనియా శక్తి ముందు ఎవరూ నిలవరన్నారు.రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగుతుందనే అపోహలు వద్దని రాజ్యసభ ఎంపీ నంది ఎల్లయ్య అన్నారు. కోర్ కమిటీ ఎదుట తెలంగాణపై డిప్యూటీ సీఎం సమర్థవంతంగా వాదనలు వినిపించారని ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వాలని మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ శ్రేణులు ముందుండేలా పనిచేద్దామని గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పిలుపునిచ్చారు. ‘వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు పది జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే ప్రవేశ పెట్టాలని’ కోరుతూ డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి తీర్మానం ప్రతిపాదించారు. సర్పంచ్‌లు, సొసైటీ చైర్మన్లకు సన్మానం ఇటీవలి ఎన్నికల్లో సర్పంచ్‌లుగా, సహకార సంఘాల సొసైటీ చైర్మన్లుగా ఎన్నికైన వారిని డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు సన్మానించారు. చెక్ పవర్ ఇవ్వాలని సమావేశంలో ప్రసంగించిన సర్పంచ్‌లు కోరారు. ఎంపీ, ఎమ్మెల్యేల నిధులపై ఆశతో కొందరు ఇతర పార్టీలకు చెందిన సర్పంచ్‌లు కాంగ్రెస్‌లో చేరేందుకు వస్తున్నారని, అలాంటి వారిని చే ర్చుకోవద్దంటూ సర్పంచ్‌లు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీసీసీ ఇన్చార్జి నర్సిం హారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి జెట్టి కుసుం కుమార్, డీసీసీబీ ైవె స్ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సిద్దన్నపాటిల్, ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప, పార్టీ నాయకులు జె.శ్రీనివాస్‌రావు, శ్యాం మోహన్, రఘునందన్‌రావు, కసిని విజయ్‌కుమార్, రామకృష్ణారెడ్డి, సురేందర్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు నగేశ్ యాదవ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సాబేర్, జగన్మోహన్రెడ్డి, మద్దుల సోమేశ్వర్‌రెడ్డి, డోకూరు రామ్మోహన్‌రెడ్డి, బాలయ్య, ముక్తార్, అవినాశ్, ఆదర్శ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘ఇందిర భవన్’కు శంకుస్థాపన సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్:జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ‘ఇందిర భవన్’కు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ శనివారం శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డులో రూ.1.35 కోట్లతో పార్టీ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు వి.భూపాల్‌రెడ్డి వెల్లడించారు. డీసీసీ, అనుబంధ సంఘాల కార్యవర్గాలకు వసతి కల్పించే రీతిలో భవన నిర్మాణం జరుగుతుందన్నారు. వచ్చే ఏడాది జనవరి 26 నాటికి నిర్మాణం పూర్తి చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభి స్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సునీ తా లక్ష్మారెడ్డి, ఎంపీలు నంది ఎల్లయ్య, సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు పి.కిష్టారెడ్డి, సీహెచ్ ముత్యంరెడ్డి, నందీశ్వర్‌గౌడ్, టి.నర్సారెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి జెట్టి కుసుం కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సాబేర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన ‘సోనియా అభినందన సభ’లో భవన నిర్మాణానికి చొరవ చూపి న భూపాల్‌రెడ్డిని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సహా పార్టీ నేతలు అభినందించారు. -
సోనియాగాంధీ మనసు మారాలి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేందుకు సిద్ధమైన యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ మనసు మార్చాలని రెవెన్యూ ఉద్యోగులు వల్లూరమ్మను వేడుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా రెవెన్యూ కాన్ ఫెడరేషన్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలు నుంచి టంగుటూరు మండలం వల్లూరులోని వల్లూరమ్మ దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద డీఆర్డీఏ పీడీ పద్మజ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్రలోని అన్నిశాఖల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారని, తాజాగా విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెలోకి రావడంతో రాష్ట్రం అంధకారంలోకి నెట్టివేయబడిందని పేర్కొన్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. సీమాంధ్రలోని ప్రజాప్రతినిధులు వారి పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు మాట్లాడుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా సీమాంధ్రలోని ఉద్యోగులంతా 45 రోజులుగా రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో 13 జిల్లాల్లో సమ్మె చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు మూడమంచు వెంకటేశ్వర్లు, టీ శ్రీనివాసులు, ఎం.సుధాకర్, ఏవీ రవిశంకర్, ఆర్.వాసుదేవరావు, శెట్టి గోపి, తోటకూర ప్రభాకర్, కొండపి వెంకటేశ్వరరావు, ఊతకోలు శ్రీనివాసులు, బండారు రవి, ఆర్వీఎస్ కృష్ణమోహన్, కే వెంకటేశ్వరరావు, టీ ఏడుకొండలు, కేవీ సత్యనారాయణ, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ నాయకులు కందిమళ్ల వీరాంజనేయులు, పీ రాము, వైపీ రంగయ్య, సురేష్‌బాబు, గ్రామ సేవకుల సంఘ నాయకుడు దార్ల బాలరంగయ్య, పలు మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. వల్లూరమ్మకు అర్జీ అందజేత... వల్లూరు (టంగుటూరు), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను నిలిపివేసి తెలుగు బిడ్డలను కాపాడాలని కోరుతూ రెవెన్యూ కాన్ ఫెడరేషన్ జిల్లాశాఖ నాయకులు వల్లూరులోని వల్లూరమ్మ ఆలయంలో అమ్మవారికి అర్జీ అందజేశారు. ఒంగోలు నుంచి ప్రారంభించిన పాదయాత్ర వల్లూరమ్మ ఆలయం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా నాయకులంతా కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
జిల్లావ్యాప్తంగా జోరుగా సమైక్య ఉద్యమం
సాక్షి, రాజమండ్రి : ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అని నిర్విరామంగా నినదిస్తూనే ఉన్నారు జిల్లావా సులు. రాష్ట్ర విభజన నిర్ణయంతో రగులుకున్న ఆగ్రహం ఆ నిర్ణయం రద్దుతోనే చల్లారుతుం దంటూ సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం నానాటికీ బలోపేతమవుతోంది. పిల్లలు, పెద్దలు, మహిళలు, ఉద్యోగులు, రైతులు ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. బుధవారం ఏలేశ్వరంలో మహిళా శక్తి సంఘాలకు చెందిన సుమా రు 5000 మంది మహిళలు విభజనవాదులారా ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. తొలుత ర్యాలీ జరిపి, అనంతరం బాలాజీ చౌక్‌కు చేరుకుని మానవహారంగా ఏర్పడ్డారు. సమైక్యరాష్ట్ర పరిరక్షణ ధ్యేయంగా ఉద్యమిస్తామని, విభజనవాదుల కుయుక్తులను తిప్పి కొడతామని ముక్త కంఠంతో నినదించారు. రాజమండ్రిలో వివిధ ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, సిబ్బంది ర్యాలీ చేశారు. కంబాలచెరువు సెంటర్లో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. కాకినాడలో సీబీఎం పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేసి, కలెక్టరేట్ వద్ద మోకాళ్లపై నిలబడి సమైక్య నినాదాలు చేశారు. సోనియాకు మంచి బుద్ధి కలగాలని సీబీఎం విద్యాసంస్థ చైర్మన్ ఎం.రత్నకుమార్ ప్రార్థన చేశారు. జగన్నాథపురం వద్ద విద్యార్థినులు సైకిల్ ర్యాలీ చేశారు. కాకినాడలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్వంలో ఉద్యోగులు ర్యాలీ చేశారు. ప్రభుత్వాస్పత్రి ఎదుట వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు వంటావార్పూ చేపట్టారు. డీఈఓ కార్యాలయం వద్ద విద్యాశాఖ ఉద్యోగులు దీక్షలు ప్రారంభించారు. రాజమండ్రిలో ఐసీడీఎస్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. యూటీఎఫ్ నేతృత్వంలో ఉపాధ్యాయులు రాజమండ్రి మోరంపూడి సెంటర్లో రిలే దీక్షలు ప్రారంభించారు. తొలుత జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ధవళేశ్వరంలో ఎన్జీఓలు మోటారు సైకిల్ ర్యాలీ చేశారు. అమలాపురంలో కోనసీమ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అనంతరం గడియారస్తంభం సెంటర్లో సమైక్య నినాదాలు చేస్తూ వివిధ ఆటలు ఆడారు. వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు పప్పుల శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో కోనసీమ సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ వి.ఎస్.దివాకర్, కన్వీనర్లు నక్కా చిట్టిబాబు, బండారు రామ్మోహన్రావు, తాతాజీ, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ పాల్గొన్నారు. అల్లవరం మండలం లో అంగన్ వాడీ వర్కర్లు రిలే దీక్షలు ప్రారంభించారు. అమలాపురం గడియారస్తంభం సెంటర్లో కొనసాగుతున్న రిలే దీక్షల్లో చల్లపల్లి పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు. ఈనెల 13న తలపెట్టిన ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్ ముట్టడిపై జేఏసీ నేతలు సమీక్ష చేశారు. డప్పు వాయించిన ఎమ్మెల్యే ముమ్మిడివరం తహశీల్దారు కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు చేపట్టిన 72 గంటల దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లి తిరిగి వస్తూ తెలంగాణ వాదుల దాడులకు గురైన ఉద్యోగులను రావులపాలెంలో జేఏసీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆత్రేయపురంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. టీడీపీకి చెందిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే టి.వి.రామారావు అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ఎమ్మార్పీస్ నేతల దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని విమర్శిస్తున్న వారు ఆ ధోరణి మానుకోక పోతే నాలుక తెగ్గోస్తానని హెచ్చరించారు. ఆయన అదే గ్రామంలో మిఠాయి దుకాణంలో స్వీట్లు తయారు చేసి, డప్పు వాయించి నిరసన తెలిపారు. వెయ్యిమీటర్ల జాతీయ జెండా.. సమైక్యాంధ్రకు మద్దతుగా మలికిపురంలో ఆక్వారైతులు వెయ్యిమీటర్ల సమైక్య జెండాతో ర్యాలీ నిర్వహించారు. రాజోలులో న్యాయవాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. పిఠాపురంలో కొనసాగుతున్న దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు మద్దతు తెలిపా రు. సామర్లకోటలో రజకులు రోడ్డుపై దుస్తులు ఉతికారు. రోడ్డు పైనే బండ్లు పెట్టి, ఇస్త్రీ చేసి నిరసన తెలిపారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్, పట్టణ, రూరల్ మండలాల కు చెందిన 300 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సామర్లకోట తహశీల్దారు కార్యాలయం ఎదుట మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. పెద్దాపురంలో చాచా విద్యానికేతన్, బ్యాంకు కాలనీ మహిళలు, జేఏసీ ప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు మానవహారంగా ఏర్పడ్డారు. సోనియా భజన మానండి.. ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెపుతున్న కేంద్ర మంత్రులు సోనియా భజనతో కాలం వెళ్లబుచ్చుతున్నారని, ప్రజల గోడు పట్టించుకోవడం లేదని చాటుతూ రామచంద్రపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. కొందరు కేంద్ర మంత్రుల మాస్కులు ధరించి సోనియా మాస్క్ ధరించిన వ్యక్తి చుట్టూ కూర్చుని భజనలు చేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో వంటా వార్పూ జరిగింది. కె.గంగవరం మండలం బాలాంతరంలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కాజులూరు మండలం గొల్లపాలెంలో విద్యార్థులు ర్యాలీ చేసి ప్రధాన రహదారి వద్ద మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. విడిపోతే రాష్ట్రం ఎడారే.. పచ్చని చేలతో కళకళలాడే రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారిపోతుందని తాను రూపొందించిన కళాకృతి ద్వారా చాటారు అయినవిల్లి మండలం వెలవలపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కాకర శ్రీనివాస్. విభజనకు ముందు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నట్టుగా ఒక చిత్రం, విభజన తర్వాత సీమాంధ్ర ఎడారిగా మారినట్టు మరో చిత్రం థర్మోకోల్‌తో రూపొందించి అందరినీ ఆలోచింపజేశారు. కాగా పచ్చగా కళకళలాడే రాష్ట్రంలో సోనియా గాంధీ, కేసీఆర్ కలుపు మొక్కల్లా తయారయ్యారని, వారిని ఏరివేయాలని నినాదాలు చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మామిడికుదురులో పొలాల్లో కలుపుమొక్కలు తొలగించారు. అనంతరం బస్టాండు కూడలిలో జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. పాశర్లపూడి కొండాలమ్మచింత సెంటర్లో ట్రాక్టర్ల నిర్వాహకుల సంఘం ఆధ్వర్వంలో సమైక్య వాదులు వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉంచి అర్ధనగ్నంగా ధర్నా చేశారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో గ్రామస్తులు వంటావార్పూ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. తెలంగాణ అధికారులపై తమకు మమకారం తప్ప ద్వేషం లేదని చాటి చెప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ 50వ డివిజన్ నాయకుడు గుత్తుల మురళీధర్ ఆధ్వర్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జైళ్లశాఖ డీఐజీ నరసింహ, సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ న్యూటన్, ఆరుగురు జైలర్లను పూలమాలలతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ‘తెలంగాణ , సీమాంధ్రవాసుల ఐక్యత వర్థిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు సోదరభావంతో మెలగాలని విజయలక్ష్మి పిలుపు నిచ్చారు. ఉద్యోగులు, ప్రజలు కలిసి మెలసి ఉండాలని డీఐజీ ఆకాంక్షించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్లో జరుగుతున్న నిరాహార దీక్షల్లో ఏపీ పేపరు మిల్లు వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మామిడికుదురులో 23వ రోజు దీక్షల్లో భాగంగా అప్పనపల్లికి చెందిన మహిళలు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ పాల్గొన్నారు. మలికిపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇదే గ్రామంలో ఆక్వారైతులు నిర్వహించిన ర్యాలీకి పార్టీ కో ఆర్డినేటర్లు చింతపాటి వెంకటరామరాజు, మత్తి జయప్రకాశ్ మద్దతు పలికారు. పెద్దాపురం, సామర్లకోట జేఏసీ దీక్షా శిబిరాలను వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు సందర్శించి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ మండల నాయకుడు అలమండ చలమయ్య ఆధ్వర్యంలో ఏలేశ్వరం ప్రధానరహదారిలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. పార్టీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ చేసి బాలాజీ చౌక్‌లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. -
వాడవాడలా సమైక్యాంధ్ర ఆందోళనలు
సాక్షి, రాజమండ్రి : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 42వ రోజుకు చేరినా అదేవాడి.. వేడితో సాగింది. సందేశాత్మక ప్రదర్శనలతో వివిధ వర్గాల సమైక్యవాదులు ప్రజల్లో ఉద్యమస్ఫూర్తి రగిలించారు. మాక్ పార్లమెంట్, ఓటింగ్ వంటి కార్యక్రమాలతో ఆలోచన రేకెత్తించారు. ‘తెలుగువారి ఐక్యతను విచ్ఛిన్నం చేసి, సీమాంధ్రుల నుంచి రాజధానిని లాక్కుని పారిపోతున్న కేసీఆర్‌ను ప్రజలు అడ్డుకుని దాడిచేసి గుణపాఠం చెప్పారు. ప్రజల దాడితో సొమ్మసిల్లిన కేసీఆర్‌ను తెలుగుతల్లి చేరదీని హైదరాబాద్ అందరిదీ అని హిత బోధ చేస్తుంది.’ ఇదీ పెద్దాపురంలో బార్ అసోసియేషన్, న్యాయశాఖ ఉద్యోగులు, జేఏసీ ప్రతి నిధులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ప్రదర్శించిన వినూత్న రూపకం ఇతివృత్తం. తెలుగుతల్లి హైదరాబాద్ బొమ్మను పొదివి పట్టుకుని నిలుచుంటే కేసీఆర్ దాన్ని ఎత్తుకు పారిపోతాడు. దీంతో ప్రజలు తిరగబడి కేసీఆర్‌పై దాడి చేస్తారు. అపుడు సొమ్మసిల్లిన కేసీఆర్‌కు తెలుగుతల్లి తాగడానికి నీళ్లు ఇచ్చి, హైదరాబాద్‌ను లాక్కున్నందుకే ఈ గతి పట్టిందని హితబోధ చేస్తుంది. ఈ రూపకం పలువురిని విశేషంగా ఆకర్షించింది. మాక్ పార్లమెంట్, ఓటింగ్ రామచంద్రపురం పట్టణంలో ఉపాధ్యాయులు మాక్ పార్లమెంట్, ఎన్నికలు నిర్వహించారు. సమైక్యాంధ్రకు, సోనియాకు మధ్య పోటీ పెట్టా రు. వెయ్యిమంది నుంచి ఓట్లు సేకరించగా అం దరూ సోనియాకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. రాజమండ్రిలో.. కోటగుమ్మం సెంటర్లో వ్యాపార సంస్థల జేఏసీ దీక్షల్లో ముస్లింలు పాల్గొన్నారు. డీవైఈఓ కార్యాలయంలో హెచ్ఎంల సంఘం దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగుల దీక్షలు, జేఏసీ ఫెడరేషన్ దీక్షలు, మున్సిపల్ ఉద్యోగులు, ఏపీఎన్జీఓలు, మున్సిపల్ కార్మికుల దీక్షలు కొనసాగు తున్నాయి. ఇంటర్మీడియెట్ బోర్డు ఉద్యోగులు ఇన్నీసుపేటలో జూనియర్ కళాశాల ఎదుట దీక్ష లు ప్రారంభించారు. ధవళేశ్వరంలో ఏపీఎన్జీఓలు, కడియంలో బాధ్యత స్వచ్ఛంద సంస్థ, వెలుగుబంటి చారిటబుల్ ట్రస్టు, పేపరుమిల్లు కార్మికుల దీక్షలు సాగుతున్నాయి. కాకినాడలో.. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కలెక్టరేట్ వద్ద చేస్తున్న రిలే దీక్షల్లో మంగళవారం ఐడియల్ కళాశాల పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కూడా దీక్షలో పాల్గొన్నారు. దండోరా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజననకు యత్నిస్తున్న దుష్టశక్తుల దిష్టిబొమ్మను కలెక్టరేట్ వద్ద దహనం చేశారు. ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, న్యాయవాదులు, న్యాయ, రిజిష్ట్రేషన్ శాఖల ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, విద్యార్థులు దీక్షలు చేస్తున్నా రు. మత్స్యశాఖ ఉద్యోగులు జగన్నాథపురంలో వంటావార్పు చేపట్టారు. అనుబంధ శాఖల ఉద్యోగులతో ర్యాలీ చేశారు. రమణయ్యపేట వద్ద వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయం ఎదు ట జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కోనసీమలో... అమలాపురం గడియార స్తంభం సెంటర్లో జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బండారులంక అభ్యుదయ కళానికేతన్, అమలాపురం మానవతా స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధులు కళారూపాలు ప్రదర్శించారు. వానపల్లిపాలెంలో పంచాయతీ పాలకవర్గం దీక్ష చేపట్టింది. మానవహారంగా ఏర్పడి సభ్యులు నినాదాలు చేశారు. ఎన్.కొత్తపల్లిలో జేఏసీ దీక్ష శిబిరంలో సర్పంచ్ లంకే రామకృష్ణవర్మ 24 గంటల దీక్ష ప్రారంభించా రు. గొల్లవిల్లిలో అంగన్వాడీ కార్యకర్తలు, భీమనపల్లిలో విద్యార్థులు, అల్లవరం ఎంపీడీఓ కార్యాలయంలో గోడిలంక పంచాయతీ పాలకవర్గం దీక్ష చేసింది. అల్లవరంలో వివిధ రాజకీ య పక్షాల సమావేశం చర్చించింది. ముమ్మిడివరంలో గౌడ సంఘం నిరసన ర్యాలీ జరిపి కేసీఆర్ దిష్టిబొమ్మ దహ నం చేసింది. కొత్తపేటలో జెడ్పీ హైస్కూల్ టీచర్లు, వానపల్లి పీహెచ్సీ వైద్యాధికారిణి సుమలత, మహిళా సిబ్బంది దీక్షల్లో పాల్గొన్నారు. రావులపాలెం, ఆలమూరుల్లో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీ మహా ధర్నా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద జాతీయ రహదారిపై తెలుగుదేశం పార్టీ మహాధర్నా చేసింది. కొత్తపేట, మండపేట, రామచంద్రపురం నియోజక వర్గాల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తపేట ఇన్చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యం వహించగా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు. హైవేపై వంటా వార్పూ నిర్వహించారు. ఆత్రేయపురంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో కళ్లకు గంతలతో 21 మంది సర్పంచ్‌లు దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. గొర్రెలతో గొర్రెల కాపరులు నిరసన ప్రదర్శన చేశారు. అంబాజీపేట సెంటర్లో జర్నలిస్టులు దీక్షలు చేశారు. గాడిదకు వినతి పత్రాలు ఇచ్చారు. మామిడికుదురులో పీఈటీలు వెనక్కి నడిచి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై డ్రిల్. యోగాసనాలతో నిరసన తెలిపారు. మలికిపురంలో ఉద్యోగ జేఏసీ రిలే దీక్షలు సాగుతున్నాయి. రాజోలులో రైతులు ర్యాలీ చేశారు. రాజోలు, టేకిశెట్టిపాలెంలో ఉద్యోగ జేఏసీ, తాటిపాకలో పొలిటికల్ జేఏసీల దీక్షలు. మోరి పోడులో యూటీఎఫ్ దీక్షలు సాగుతున్నాయి. మెట్టసీమలో... పెద్దాపురం, సామర్లకోటల్లో తహసీల్దారు కార్యాలయాల వద్ద దీక్షలు కొనసాగుతున్నా యి. సామర్లకోటలో స్కూళ్లు బంద్ అయ్యాయి. అబ్కారీ డిపోకు తాళం వేశారు. పెద్దాపురంలో జేఏసీ, బార్ అసోసియేషన్, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. తునిలో జేఏసీ దీక్షల్లో పాన్‌షాప్‌ల సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎన్జీఓల దీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులకు ముగ్గుల పోటీ లు నిర్వహించారు. ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు, వైఎస్సార్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ దాడిశెట్టి రాజా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి పాల్గొన్నారు. ఉత్తరాల ఉద్యమం ప్రారంభం రాష్ట్ర విభజన ఆపాలంటూ లక్ష ఉత్తరాలు రాసే కార్యక్రమం పిఠాపురం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యాన గొల్లప్రోలులో ప్రారంభమైంది. ఉపాధ్యాయ పోరాటసమితి నేతలు మహ్మద్ అబ్జలుల్లాఖాన్, మేడసాని సత్యనారాయణలు 72గంటల దీక్ష చేపట్టారు. పిఠాపురం ఉప్పాడ సెంటర్, మున్సిపల్ కార్యాలయం, కొత్తపల్లి, గొల్లప్రోలు సెంటర్లలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఏలేశ్వరంలో తొట్టి రిక్షాలు తొక్కుతూ నిరసన తెలిపారు. ఉద్యోగులు బాలాజీ చౌక్‌లో రాస్తారోకో చేశారు. ఏలేశ్వరం, ప్రత్తిపాడు, రౌతులపూడిల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కిర్లంపూడిలో విద్యార్థులు, గండేపల్లిలో జర్నలిస్టులు, కేబుల్ ఆపరేటర్లు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దీక్షల్లో పాల్గొన్నారు. జగ్గంపేట పొలిటికల్ జేఏసీ శిబిరంలో విశ్వబ్రాహ్మణులు, జేఏసీ శిబిరంలో పంచాయతీ కార్యదర్శులు దీక్షల్లో పాల్గొన్నారు. మంత్రి తోట నరసింహం సంఘీభావం తెలిపారు. గండేపల్లిలో దీక్షలను మంత్రి ప్రారంభించారు. జగ్గంపేటలో విశ్వబ్రాహ్మణులు పనిముట్లతో ర్యాలీ చేశారు. రాష్ట్రం ముక్కలైతే ఇంతే... రాష్ట్రం ముక్కలైతే ఉరితాళ్లే గతి ఉంటూ సీతానగరంలో సమైక్య వాదులు మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యం లో రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండల కేంద్రాల్లో దీక్షలు కొనసాగుతున్నాయి. రాజానగరంలో పంచాయతీ సిబ్బంది దీక్షల్లో పాల్గొన్నారు. అనపర్తి, రంగంపేట, బిక్కవోలు మండల కేంద్రాల్లో, మండపేటలో జేఏసీ దీక్ష లు కొనసాగుతున్నాయి. రామచంద్రపురం డివిజన్ కాజులూరు, జగన్నాథగిరిల్లో చేసిన వంటావార్పుల్లో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. కె.గంగవరంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం నిర్మించారు. రంపచోడవరంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వంటా వార్పు, రాజవొమ్మంగిలో నాయీబాహ్మ్రణులు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కోటగుమ్మం సెంటర్లో వాహనాలను కడిగి నిరసన తెలిపారు. బీసీ, ఎస్సీ విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరంలో జేఏసీ ఆధ్వర్యంలోని దీక్ష శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం పార్లమెంటు నియోజక వర్గ కోఆర్డినేటర్ గొల్ల బాబూరావు, క్రమశిక్షణ సంఘం సభ్యులు బుచ్చిమహేశ్వరరావు, కోఆర్డినేటర్లు గుత్తుల సాయి సంఘీభావం తెలిపారు. పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురులో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై కుర్చీల్లో వినాయక విగ్రహాలను ఉంచి పూజలు చేశారు. మామిడికుదురులో రిలే దీక్షలలో గెద్డాడ గ్రామస్తులు పాల్గొన్నారు. రైతు విభాగం రాష్ట్ర సభ్యుడు జక్కంపూడి తాతాజీ, కోఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, మత్తి జయప్రకాష్ హాజరయ్యారు. రావులపాలెం మండలం గోపాలపురం వద్ద హొటళ్ల నిర్వాహకుల సంఘం వంటావార్పు లో వైఎస్సార్ కాంగ్రెస్ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. పార్టీ మద్దతుదారుడు ఐ.కుమార్ ఉప్పురాశిపై కూర్చుని రిలే దీక్ష చేయగా జగ్గిరెడ్డి సంఘీభావం తెలిపారు. మలికిపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ రిలే దీక్షలు కొనసాగున్నాయి. -
చైతన్య దీప్తి

అవిభజనమస్తు
సాక్షి నెట్వర్క్: సర్వవిఘ్నాలను తొలగించి శుభాలు చేకూర్చే ఆ విఘ్నేశ్వరుడుని సీమాంధ్రప్రజ ఈ వినాయకచవితి పర్వదినాన వ్యక్తిగత ఆకాంక్షలు పక్కనపెట్టి రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలంటూ ప్రార్థిస్తోంది. సోమవారం నుంచి మొదలయ్యే గణేశచతుర్ధి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం వాడవాడలా ప్రతిష్టించిన ప్రతిమల వద్ద రాష్ట్రంలో వేర్పాటువాదం పోవాలంటూ సమైక్యవాదులు మొక్కుకున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఉపాధ్యాయులు వినాయకుని విగ్రహాల వద్ద మోకరిల్లి విభజనపై సోనియాగాంధీ మనసుమార్చమని ప్రార్థించారు. కనిగిరిలో క్రైస్తవ సంఘం ర్యాలీ చేపట్టింది. వైఎస్ కుమార్తె షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావానికి సంఘీభావంగా ఒంగోలులో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి మోటారుబైక్ ర్యాలీ నిర్వహించారు. విజయవాడలో జేఏసీ నేతలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ వినాయకుడి మట్టి ప్రతిమలను ఉచితంగా పంచిపెట్టారు. వైఎస్సార్ సీపీ నేత పి.గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డుపై వినాయకుడికి పూజలు నిర్వహించారు. కడపలో అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, డీఆర్వో ఈశ్వరయ్య, నగరపాలకసంస్థ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, రాజీవ్ విద్యామిషన్ పీఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీవో వీరబ్రహ్మయ్యతో పాటు గ్రూప్-1 అధికారుంతా ఆదివారం కలెక్టరేట్ ఎదుట రిలేదీక్షలకు కూర్చున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: వాకాడు అశోక్ స్తంభం కూడలిలో భవననిర్మాణ కార్మికులు రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై రాతిగోడను కట్టి నిరసన తెలిపారు. విజయనగరంలో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు, జేఏసీ ప్రతినిధులు విజయనగరంలోని మయూరి జంక్షన్లో బైఠాయించి కళ్లకు, చెవులకు, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని రాష్ట్ర విభజన ప్రక్రియను చెడుగా అభివర్ణిస్తూ చెడు కనకు, వినకు, మాట్లాడకు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇందిరానగర్ వద్ద రహదారిపై టైర్లుకాల్చి సమైక్యవాదులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు అనంతపురం నగరంలో కదం తొక్కారు. ముస్లిం మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది సుభాష్ రోడ్డులో శాంతి ర్యాలీ నిర్వహించారు. టవర్‌క్లాక్ వద్ద మానవహారం నిర్మించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఉపాధ్యాయ జేఏసీ సభ్యులు భిక్షాటన చేశారు. కొత్తపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో సమైక్యవాదులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడిలో సమైక్యాంధ్రకు మద్దతుగా క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. గోపాలపురంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మానవహారం ఏర్పాటు చేశారు. నల్లజర్ల మండలం నబీపేటలో అమ్మవారికి పూజలు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గ్రామస్తులు వేడుకున్నారు. కొవ్వూరులోబ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై హోమాలు నిర్వహించారు. అత్తిలిలో స్టేట్ హైవేపై గంగిరెద్దులతో విన్యాసాలు చేయించారు. తిరుపతిలో అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు నడిరోడ్డుపై షామియానా వేసి భక్తి సంగీత విభావరి నిర్వహించి, వినూత్న రీతిలో నిరసన తె లిపారు. బెరైడ్డిపల్లెలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వినాయకునికి వినతిపత్ర ం సమర్పించారు. పుంగనూరులో ఉపాధ్యాయులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. చంద్రగిరిలో సమైక్యవాదులు రోడ్డుపై యోగాసనాలు వేసి నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో ఉపాధ్యాయులు వినాయకుడి గుడిలో పూజలు నిర్వహించి రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. చేనేతకార్మికుల మానవహారం శ్రీకాకుళం: అంపోలులో చేనేత కార్మికులు జాతీయ రహదారిపై మానవహారం నిర్మించి, రోడ్డును దిగ్బంధించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, నాయకుల మనసు మారాలని కోరుతూ శ్రీకాకుళం పట్టణంలో ఉపాధ్యాయులు గాయత్రీ దేవికి హోమం నిర్వహించారు. పాలకొండలో సర్వే, గణాంకశాఖల ఉద్యోగులు రోడ్డుపైనే నాట్లు వేసి నిరసన తెలిపారు. కవిటిలో రజకులు రోడ్డుపైనే బట్టలు ఉతికి నిరసన తెలిపారు. సమైక్యగళార్చన కర్నూలు: డోన్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా రెడ్డి సామాజికవర్గ నాయకులు నిర్వహించిన సమైక్యగళార్చనలో దాదాపు 5వేల మంది పాల్గొని మార్కెట్‌యార్డు నుంచి కొత్తబస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆళ్లగడ్డ పట్టణంలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలకు శోభానాగిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. సమైక్యవాదులపై దాడికి నిరసనగా ఉద్యోగ జేఏసీ నాయకులు జాతీయ రహదారిలో తెలంగాణవాసులకు పూలు ఇచ్చిన నిరసన తెలిపారు. రోడ్డుపైనే దుస్తులు ఉతికి రజకుల నిరసన గుంటూరు: మంగళగిరిలో రజక వృత్తిదారులు రహదారులపై బట్టలు ఉతికి నిరసన తెలిపారు. సత్తెనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు రోడ్డుపై వెళ్లే వాహనాలు శుభ్రం చేసి నిరసన తెలిపారు. మాచర్ల పట్టణంలో గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రహదారిపై యజ్ఞయాగాదులు నిర్వహించారు. రాష్ర్టం సమైక్యంగా ఉండాలని కాంక్షిస్తూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలిసి బ్రాహ్మణులు చెన్నకేశవస్వామికి వినతి పత్రం అందజేశారు. 17న ‘విశాఖ సమైక్యాంధ్ర గర్జన’ విశాఖలో ఆదివారం మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన నాన్ పొలిటికల్ జేఏసీ సమావేశంలో ఈనెల 17న నగరంలో 5లక్షల మందితో విశాఖ సమైక్యాంధ్ర గర్జన పేరిట సభ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణలోని వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేసే యత్నాలకు నిరసనగా ఏయూ విద్యార్థులు వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒంటికాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. విభజన భయంతో మరో ఐదుగురి మృతి రాష్ట్రాన్ని విభజిస్తారన్న భయంతో మరో ఐదుగురు తదిశ్వాస విడిచారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం సుభలయ గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థి వాకాడ చంద్రశేఖర్(15) శనివారం రాత్రి టీవీలో సమైక్యాంధ్ర ఆందోళన వార్తలు చూసి రాష్ట్రం విడిపోతే ఉద్యోగాలు రావని చెబుతూ మరణించాడని మృతుని తాత అప్పారావు చెప్పారు. విద్యార్థి తల్లిదండ్రులు చైన్నైలో వలసకూలీలుగా పనిచేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పొల్గొంటున్న చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం రాయపేడు నివాసి చవరంబాక్కం వెంకటేష్ (38), అనంతపురం జిల్లా అమడగూరు మండల కేంద్రానికి చెందిన నరసింహప్ప(55), పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెంకు చెందిన దూది పాండు రంగారావు (40) ఆదివారం, నిడమర్రు మండలం దేవరగోపవరానికి చెందిన కూలి సత్యనారాయణ (40) శనివారంఅర్ధరాత్రి దాటాక గుండెపోటుతో మృతిచెందారు. -
కాంగ్రెస్ ఎంపీలు సోనియా పెంపుడు కుక్కలు
సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ ఎంపీలు, సోనియా గాంధీ ఇంటివద్ద పెంపుడు కుక్కల్లా వ్యవహరిస్తున్నారని, ఒకరికి మంత్రి పదవి, మరొకరికి ప్రాజెక్టులు ఇవ్వగా వాటిని పట్టుకుని వేళ్లాడుతున్నారని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించా రు. తెలుగు జాతి ఆత్మగౌరవయాత్రలో భాగంగా చంద్రబాబు శనివారం కృష్ణా జిల్లా గన్నవరం, ఆగిరి పల్లి, నూజివీడు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ అసమర్దుడని, ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకుంటాడని, లీకువీరుడని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స ఉత్సవ విగ్రహమని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారని ఆరోపించారు. విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలు రోడ్లపైకి వచ్చినా వారి సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని, తెలుగుజాతిని విభజించేందుకే యత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలు వస్తే తెలంగాణాలో టీఆర్ఎస్, సీమాంధ్ర లో జగన్ గెలుస్తారని కాంగ్రెస్ భావిస్తోందని, త ర్వాత ఆ పార్టీని తమ పార్టీలో విలీనం చేసుకొని పబ్బం గడుపుకోవచ్చంటూ కాంగ్రెస్ ఆడిన బొమ్మ, బొరుసు ఎత్తుగడే విభజనని చంద్రబాబు అన్నారు. దీన్ని అడ్డుకునేందుకు తాను తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్రను చేపట్టానని చెప్పారు. రాష్ట్ర విభజనకు తాను లేఖ ఇచ్చానని, రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయూలని తాను చెప్పినా, ఒక ప్రాంతానికి అన్యాయం జరిగే ట్లు నిర్ణయాలు తీసుకుంటారా? అంటూ ప్రశ్నించారు. తెలుగుజాతిలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తే సోనియాగాంధీకి శృంగభగం తప్పదన్నారు. అంతకు ముందు గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలోని మహిళా పారిశ్రామికవాడలో మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. బాబుకు జేఏసీ నిరసన సెగ సమైక్యాంధ్రపై వైఖరిని స్పష్టం చేయకుండా చంద్రబాబు ఆత్మగౌరవయాత్రను నిర్వహిస్తున్నారంటూ నూజివీడు జేఏసీ శనివారం ఆయునకు నిరసన తెలిపింది. పండ్ల మార్కెట్ సెంటరులో ఆయున సమావేశం సాగుతున్నంతసేపూ, జేఏసీ శిబిరం వద్ద వారు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూనే ఉన్నారు. -
చంద్రబాబు గుంట నక్క: కొండ్రు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ పెంపుడు కుక్కగా మారారని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్య విద్య మంత్రి కొండ్రు మురళీమోహన్ తీవ్రంగా స్పందించారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రజాప్రతినిధులను పెంపుడు కుక్కలంటావా? నువ్వే పెద్ద గుంట నక్కవు. నీ పక్కన మరికొన్ని గుంట నక్కలను పెట్టుకుని నిస్సిగ్గుగా మాట్లాడిస్తున్నావు. వాళ్లతోపాటు మరో ఐదువేలమంది కుక్కలను వెంట పెట్టుకుని యాత్ర చేస్తున్నావు’’ అని ధ్వజమెత్తారు. సోనియాగాంధీకి డబ్బు పిచ్చి పట్టిందంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘రెండెకరాల ఆసామివి రూ. 20 వేల కోట్లు సంపాదించుకున్నావు. వ్యవస్థలను మేనేజ్ చేసుకుని బతుకుతున్న నువ్వా మాట్లాడేది? నీకు నిజంగా ధైర్యముంటే, అవినీతికి పాల్పడలేదనుకుంటే నీ ఆస్తులపై సీబీఐ విచారణ వేయించుకో’’అని సవాల్ విసిరారు. ఉద్యమం చేస్తున్న ఏపీఎన్జీవోలు కూడా రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి మంత్రి పదవుల రాజీనామాల వ్యవహారాన్ని ప్రస్తావించగా... కాంగ్రెస్‌లో ఉండటం ఇష్టంలేనివారే ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. విభజన అనివార్యమైతే విశాఖను రాజధాని చేయాలన్నారు. -
అధికారమిస్తే ఏడాదిలో పరిష్కరిస్తా!
రాష్ట్ర విభజనపై చంద్రబాబు విభజనపై ఎలాంటి టర్నింగ్ తీసుకోలేదు సీమాంధ్రులకు న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటా రాహుల్‌ను ప్రధానిని చేసేందుకే విభజన సోనియా కుట్రను తెలుగుజాతి యావత్తూ తిప్పికొట్టాలి సాక్షి, గుంటూరు: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాను... రాష్ట్రప్రజల గురించి నాకంతా తెలుసు... ఒక్క ఏడాది నాకు అధికారమిస్తే, అన్నిప్రాంతాల సమస్యల్ని పరిష్కరిస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి చెప్పారు. ‘విభజన’ అంశంపై తాను ఇప్పటికీ ఎటువంటి టర్నింగ్ తీసుకోలేదంటూనే సీమాంధ్రులకు న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటానని తెలిపారు. తెలుగు ఆత్మగౌరవయాత్రలో భాగంగా ఆయన సోమవారం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల బస నుంచి రెండోరోజు బస్సుయాత్రను ప్రారంభించారు. కొండమోడు, పెదనెమలిపురి, శ్రీనివాసనగర్, త్రిపురాపురం మీదుగా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు, చల్లగుండ్ల, చీమలమర్రి, కండ్లకుంట గ్రామాల్లో పర్యటించారు. ఇటలీ వనిత సోనియా తెలుగుజాతి మధ్య చిచ్చు పెట్టిందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో వైఎస్ఆర్సీపీ సోనియా ఆటలో భాగమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రధాని మన్మోహన్సింగ్ రబ్బర్‌స్టాంప్‌గా తయారయ్యారని.. వ్యక్తిత్వం కోల్పోయిన ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నందునే ‘విభజన’ అంశాన్ని తెరమీదికి తెచ్చారని చెప్పారు. పప్పుసుద్ద రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు ఓట్లు, సీట్లు రాబట్టేందుకే సోనియా తంటాలు పడుతోందని విమర్శించారు. ఈ వ్యూహంలో భాగంగానే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పావుగా మార్చుకుందని చెప్పారు. ఆ వసూళ్లరాయుడు ఎప్పుడూ ఫామ్‌హౌస్‌లోనే ఉండి ఈ రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేయాలని కుట్ర, కుతంత్రాలు పన్నుతుంటాడని విమర్శించారు. సోనియా కుట్రను తెలుగుజాతి యావత్తూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆనాడు దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీపెట్టి ఇందిర మెడలు వంచిన సంగతిని చరిత్ర చ దివి తెలుసుకోవాలన్నారు. ‘విభజన’ అంశంపై తాను ఇప్పటికీ ఎటువంటి టర్నింగ్ తీసుకోలేదని మరోమారు స్పష్టంచేశారు. కానీ సీమాంధ్రులకు న్యాయం జరిగేంతవరకు తాను అండగా ఉంటానని చంద్రబాబు హామీనిచ్చారు. రెండో రోజు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోవడంతో చంద్రబాబు మధ్యాహ్నం 12 గంటల వరకు శిబిరంలోనే ఉండిపోవడం గమనార్హం. రెడ్డిగూడెంలో బాబుకు సమైక్య సెగ టీడీపీ అధినేత చంద్రబాబుకు సమైక్య సెగ మొదలైంది. ఆయన సోమవారం రాత్రి రెడ్డిగూడెంలో ప్రసంగిస్తున్న సమయంలో కొందరు యువకులు ముందుకు దూసుకువచ్చి సమైక్యవాదానికి మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. బాబు వ్యక్తిగత సిబ్బంది, రక్షణ వలయాన్ని దాటుకుంటూ బస్ వద్దకు చేరుకుని... సమైక్యవాదం వర్ధిల్లాలి, జై సమైక్యాంధ్ర అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు ‘ఎవడ్రా మీకు ప్లకార్డులు ఇచ్చి పంపింది?’ అంటూ దుర్భాషలాడారు. వారిపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగింపజేశారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు ఉండటంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపివేసి సత్తెనపల్లికి వెళ్లిపోయారు. -
వైద్య పరీక్షల కోసం నేడు అమెరికాకు సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లనున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు ఆదివారం చెప్పారు. వైద్య చికిత్స కోసం ఆమె సోమవారం సాయంత్రం అమెరికా వెళ్లనున్నట్లు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా, ఈ విషయం చెప్పిన పార్టీ నేత, మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. చికిత్స కోసం సోనియా అమెరికా బయలుదేరడం గత ఆరు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. 2011 ఆగస్టులో ఆమె అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. కాగా, లోక్‌సభలో ఆగస్టు 26న ఆహార బిల్లుపై ఓటింగు జరుగుతున్న సమయంలో అస్వస్థతకు గురైన సోనియా, ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. -
విభజనకు బాబు చీకటి ఒప్పందం
ఏలూరు, న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే 20ఏళ్ళపాటు తమ పార్టీల భవిష్యత్తు అంధకారంలో మగ్గిపోతుందనే భయంతోనే సోనియాగాంధీ, చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకుని రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కుట్ర పన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళనాని పేర్కొన్నారు. వైఎస్ జగన్ నిరవధిక దీక్ష భగ్నానికి నిరసనగా ఏలూరులో ఆళ్ళనాని చేపట్టిన రెండు రోజుల మౌన నిరాహార పాదయాత్ర చివరి రోజైన ఆదివారం నగర ప్రజలు నీరాజనాలు పలికారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ సుమారు 18 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డప్పులు, వాయిద్యాలతో పెద్దెత్తున పాల్గొన్నారు. ఏలూరులోని 21డివిజన్లలో వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన నిరాహారదీక్ష శిబిరాలను ఆయన పాదయాత్రగా వెళ్ళి సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. పాదయాత్ర ముగింపు సభలో ఆళ్ళనాని మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతంలో కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా ప్రజలంతా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారని, దీనికి భిన్నంగా వ్యవహరిస్తే క్షమించరని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజల కష్టంతో హైదరాబాద్‌ను అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దితే ఇప్పుడు తెలంగాణకు ఇచ్చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. -
తెలంగాణ ఏర్పాటు నిజం కాబోతోంది: దామోదర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిజం కాబోతున్నదనే విషయాన్ని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ తనతో చెప్పారని, ఆమె మాటలపై తనకు ఎంతో నమ్మకం ఉందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో శనివారం తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల పదవీ విరమణ పొందిన వాణిజ్య పన్నుల శాఖ అదనపు డెరైక్టర్ టి.వివేక్ సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఉన్నవారు హైదరాబాదీయులేనని స్పష్టంచేశారు. వివిధ మతాలు, కులాలు, ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడ్డారని, వీరిలో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలుగా నిలబడ్డవారికి ఓట్లేసి గెలిపించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు, దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్, అద్దంకి దయాకర్, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ జేఏసీ నేతలు వెంకటేశ్వర్లు, బి.శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహార భద్రతకు ఆమోదం
-
సోనియాకు అస్వస్థత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను హుటాహుటిన అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చేర్పించారు. ఆహార భద్రత బిల్లుకు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలపై లోక్‌సభలో ఓటింగ్ కొనసాగుతుండగా రాత్రి 8.15 గంటల సమయంలో సోనియా నిస్సత్తువకు గురయ్యారు. వెంటనే ఆమెను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి కుమారి సెల్జా ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు కార్డియాలజీ విభాగంలో అన్నిరకాల పరీక్షలు చేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాయి. ఎయిమ్స్ ఇన్చార్జి డెరైక్టర్ ఆర్.సి.డేకా, కార్డియో-థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి బలరామ్ ఐరాన్‌తో పాటు పలువురు ప్రముఖ వైద్యులు సోనియాకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆమె ఆదివారం రాత్రి నుంచే విషజ్వరంతో బాధపడుతున్నారని, ఆమె నివాసంలోనే వైద్యులు పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. నిస్సత్తువతో పాటు గుండెల్లో కొద్దిగా నొప్పి ఉందని సోనియా చెప్పడంతో.. కార్డియో-న్యూరో విభాగానికి తరలించే ముందు ఐసీయూలో ఉంచినట్లు ఎయిమ్స్ వర్గాలు వివరించాయి. ఈసీజీతో పాటు కొన్ని పరీక్షలు చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఆందోళన చెందాల్సిందేమీ లేదని, సోనియా బాగున్నారని కాంగ్రెస్ నేత ద్వివేది చెప్పారు. ఇలావుండగా ఎయిమ్స్ చుట్టుపక్కల భద్రత కట్టుదిట్టం చేశారు. సోనియా త్వరగా కోలుకోవాలని ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో ఆకాంక్షించారు. లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, కేంద్ర మంత్రులు గులాంనబీ ఆజాద్, వయలార్ రవి, ఆనంద్‌శర్మ, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎయిమ్స్‌కు వెళ్లి సోనియా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రాహుల్‌తో పాటు సోనియా కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రాలు ఎయిమ్స్ కార్డియో-న్యూరో విభాగంలో ఆమె వద్ద ఉన్నారు. -
‘ఆహార భద్రత’కు ఆమోదం
లోక్‌సభలో సుదీర్ఘచర్చ..మూజువాణి ఓటుతో నెగ్గిన బిల్లు కోట్లాది మంది ఆకలికి శాశ్వత పరిష్కారం: సోనియా బిల్లుపై ఓటింగ్‌లో పాల్గొనలేకపోయిన కాంగ్రెస్ అధినేత్రి అనారోగ్యంతో వెళ్లిపోయిన సోనియా.. ఎయిమ్స్‌లో చేరిక దేశంలో మూడింట రెండు వంతుల మంది పేదలకు ఆహార హక్కు కల్పిస్తూ కేంద్రం రూపొందించిన ఆహార భద్రత బిల్లు ఎట్టకేలకు లోక్‌సభ ఆమోదం పొందింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశంలో ఆకలి, పోషకాహార లోపాలను నిర్మూలించటమే బిల్లు లక్ష్యమని ఆమె ప్రకటించారు. దీన్ని ఓటు భద్రత బిల్లుగా బీజేపీ అభివర్ణించింది. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఆహార భద్రత బిల్లు ముఖ్యాంశాలు ప్రభుత్వానికి అయ్యే వ్యయం - 1,30,000 కోట్లు పథకంతో లబ్ధి పొందేవారి సంఖ్య- 82కోట్లు దేశ జనాభాలో లబ్ధిదారుల శాతం-66% అంత్యోదయ అన్న యోజన పథకం కింద ప్రస్తుతం 2.43 కోట్ల అత్యంత నిరుపేద కుటుంబాలకు నెలకు ఇస్తున్న 35 కేజీల ధాన్యాన్ని ఇకముందూ ఇస్తారు. గర్భిణులకు, బాలింతలకు బిడ్డ పుట్టాక ఆరు నెలల వరకు అంగన్వాడీ ద్వారా ఉచిత ఆహారం. సాధారణ గ్రూపు కుటుంబాల్లోని ఒక్కో వ్యక్తికి నెలకు 3 కిలోల ధాన్యాలు ఇస్తారు. వీటి ధర ఆయా ధాన్యాల కనీస మద్దతు ధరలో 50 శాతానికి మించకుండా ఉంటుంది. ప్రాధాన్యతా గ్రూపు కుటుంబాల్లోని వ్యక్తులకు నెలకు 5 కిలోల చొప్పున ధాన్యాన్ని ఇస్తారు. వీటిలో బియ్యం (కిలో రూ.3), గోధుమలు (కిలో రూ.2), జొన్నలు ఇతర తృణధాన్యాలు (కిలో రూ.1) ఉంటాయి. న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ, యూపీఏ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆహార భద్రత బిల్లు ఎట్టకేలకు లోక్‌సభ ఆమోదం పొందింది. ఎన్నికలకు ముందు ఈ బిల్లుకు ఎట్టిపరిస్థితుల్లో ఆమోదం పొందాలన్న కాంగ్రెస్ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్న సందేహాలు, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో అసలు బిల్లు ప్రవేశపెట్టటం సాధ్యమవుతుందా అన్న సంశయాలకు తెరదించుతూ.. సోమవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టటం, వాడివేడిగా చర్చ జరగటం, అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించటం వరుసవెంట జరిగిపోయాయి. అయితే.. 15వ లోక్‌సభలో తొలిసారి గళం విప్పి ఆహార భద్రత బిల్లుపై ప్రసంగించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆ తర్వాత అస్వస్థతకు గురవటంతో ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు. ఆమె అనారోగ్యానికి గురవటంతో అర్ధంతరంగా సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం సోనియా చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరారు. సోనియా కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా.. తన తల్లితో పాటు ఆస్పత్రికి వెళ్లటంతో ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు. అంతకుముందు.. ఆహార మంత్రి కె.వి.థామస్ ఆహార భద్రత బిల్లును లోక్‌సభలో చర్చకు ప్రవేశపెట్టారు. బిల్లు లక్ష్యాలు, ఇతర అంశాలను స్థూలంగా వివరించారు. ఆహార భద్రత బిల్లు అమలులోకి వచ్చినప్పటికీ.. రాష్ట్రాలకు ఆహార ధాన్యాల సరఫరాను తగ్గించబోమని స్పష్టంచేశారు. బిల్లుపై చర్చ జరిగేటపుడు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కూడా సభలో ఉన్నారు. ఈ బిల్లు వెనుక కీలక పాత్రధారి అయిన సోనియాగాంధీ కాంగ్రెస్ తరఫున మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్తులో దేశం నుంచి ఆకలి, పోషకాహారలేమిని నిర్మూలించటం మా లక్ష్యం’’ అని ప్రకటించారు. ‘‘పేద ప్రజల కష్టాలకు ముగింపు పలికే చరిత్రాత్మక చర్య చేపట్టే అవకాశం ఈ సభకు ఈ రోజు వచ్చింద’’ని.. రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనపెట్టి ఆహార భద్రత బిల్లుకు మద్దతివ్వాలని తన ప్రసంగంలో కోరారు. ‘‘ఇది ఆహార భద్రత బిల్లు కాదు.. ఓటు భద్రత బిల్లు’’ అని ప్రతిపక్ష బీజేపీ విమర్శించింది. ఈ బిల్లు లోపభూయిష్టంగా, బలహీనంగా ఉన్నప్పటికీ.. తాము దానికి మద్దతిస్తున్నామని ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చి, ఈ చట్టాన్ని మరింత మెరుగుపరచటం కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ బిల్లును తెచ్చారని.. యూపీఏ సర్కారుకు వెలుపలి నుంచి మద్దతిస్తున్న సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌యాదవ్ విమర్శించారు. ఈ బిల్లు రాష్ట్రాలపై భారం మోపుతుందని.. దీనిపై ముఖ్యమంత్రులతో చర్చించాలని, అప్పటివరకూ బిల్లును పక్కనపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సుదీర్ఘంగా సాగిన చర్చకు ఆహార మంత్రి కె.వి.థామస్ బదులిస్తూ రాష్ట్రాలను సంప్రదించలేదన్న ఆరోపణలను కొట్టివేశారు. తాము నాలుగు సార్లు రాష్ట్రాలతో చర్చలు జరిపామని చెప్పారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేసినప్పుడే ఈ చట్టం విజయవంతమవుతుందని పేర్కొన్నారు. అనంతరం.. ఆహార భద్రతపై జూలై 5న జారీచేసిన ఆర్డినెన్స్‌ను తిరస్కరిస్తూ తీర్మానం, బిల్లు ఆమోదంపై సంయుక్తంగా ఓటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార బిల్లుకు ప్రతిపక్షం సూచించిన దాదాపు 300కు పైగా సవరణలను సభ తిరస్కరించింది. అందులో.. బాలింతలకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఆహార ధాన్యాలు అందించాలంటూ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ చేసి ప్రతిపాదన కూడా ఉంది. ఈ బిల్లుకు ప్రభుత్వం నాలుగు సవరణలు ప్రతిపాదించగా అవి ఆమోదం పొందాయి. బిల్లు అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపటమనేది ఈ సవరణల్లో ఒకటి. మొత్తంగా మూజువాణి ఓటుతో బిల్లును లోక్‌సభ ఆమోదించింది. కోట్లాది మంది ఆకలి సమస్యకు శాశ్వత పరిష్కారం: సోనియా ‘‘ఆకలి, పోషకాహార లోపాలను నిర్మూలించటమే కాంగ్రెస్ లక్ష్యం. దేశంలో కోట్లాది మంది ఆకలి సమస్యకు శాశ్వతంగా ముగింపు పలుకుతూ ఆహార భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ఆహార భద్రత బిల్లు ఒక చరిత్రాత్మక అవకాశం. భారతీయులందరికీ ఆహార భద్రతను కల్పించే బాధ్యతను దేశం తీసుకుంటుందని పెద్ద సందేశం పంపాల్సిన సమయమిది. అన్ని రాజకీయ పార్టీలూ విభేదాలను పక్కనపెట్టి ఆహార భద్రత బిల్లుకు మద్దతివ్వాలి. దీనిని అమలు చేయటానికి మనకు తగినన్ని వనరులున్నాయా? ఇది రైతులకు ప్రయోజనం కలిగిస్తుందా? అన్నవి సమస్యలు కాదు. దీనికి మనం వనరులు సమకూర్చాల్సి ఉంటుంది. మనం అమలు చేయాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అమలు చేయటానికి ప్రజా పంపిణీ వ్యవస్థను సంస్కరించటం తప్పనిసరి. ఆహార బిల్లు ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరేలా చూడాలంటే లీకేజీలను తొలగించాల్సి ఉంటుంది. యూపీఏ ప్రభుత్వ చర్చలతో దేశంలో సాధికార విప్లవం వచ్చింది. ఇది మాకు గర్వకారణం. ఆహార భద్రత కల్పిస్తామని 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. యూపీఏ ప్రభుత్వం 2005లో సమాచార హక్కును తీసుకొచ్చింది. ఇది ప్రజా జీవితంలో అనూహ్య పారదర్శకతను పెంపొందించింది. కొన్నిసార్లు మాకు కూడా ఇది ప్రతికూలంగా మారింది. అదే ఏడాది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హక్కును తీసుకువచ్చింది. దీనిద్వారా ప్రతి నాలుగు గ్రామీణ గృహాల్లో ఒక గృహానికి ఉపాధిని అందించింది. ఫలితంగా గ్రామీణ వేతనాలు పెరిగాయి. 2006లో విప్లవాత్మక ఆహార హక్కుల చట్టం తెచ్చాం. సంప్రదాయంగా జీవనం కోసం అడవులు, అటవీ ఉత్పత్తులపై ఆధారపడిన లక్షలాది గిరిజన, ఇతర కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది. 2008లో విద్యా హక్కు అమలులోకి తెచ్చాం. దీని ఫలితంగా పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ఆహార భద్రత హక్కును తెస్తున్నాం. ఈ చట్టం కేవలం ఒక ఆరంభమే. ముందుకు వెళ్లే కొద్దీ నిర్మాణాత్మక సూచనలను తీసుకోవటానికి మేం సిద్ధంగా ఉన్నాం. అనుభవం నుంచి మేం నేర్చుకుంటాం. ఇది ఓటు భద్రత బిల్లు ‘‘ఇది ఓటు భద్రత బిల్లు.. ఆహార భద్రత బిల్లు కాదు. నేను ఆహార భద్రత బిల్లుకు అనుకూలమే. కానీ ప్రభుత్వం తెచ్చిన బిల్లులో చాలా లోపాలున్నాయి. వాటిని సవరించాలి. 2009లో భారత రాష్ట్రపతి తన ప్రసంగంలో ఆహార భద్రత బిల్లు గురించి మాట్లాడారు. కానీ.. మీరు బయటకు వెళ్లేటపుడు ఈ బిల్లును తీసుకువస్తున్నారు. అసలు తగినంత ఆహారం అంటే అర్థమేమిటి? కొనుగోలు శక్తి ఆధారంగా ఉంటుం దా? కేలరీల విలువ ఆధారంగా ఉంటుందా? లేక పోషకాల ఆధారంగా ఉంటుం దా? అర్హమైన గృహాలు అని మీరు అన్నారు... ఎందుకీ తమాషా? కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ఉంటే ఏంచేస్తారు? ఒక వ్యక్తిని గృహంగా వర్గీకరిస్తారా అనేది మీరు స్పష్టంచేయాలి. ఈ బిల్లు అమలుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? సార్వజనీన ఆహార భద్రత కల్పించటం బిల్లు లక్ష్యంగా ఉండాలి.’’ - మురళీమనోహర్జోషి (బీజేపీ) పార్లమెంట్ సమావేశాలు 6 వరకు పొడిగింపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ 6వ తేదీ వరకు పొడిగించారు. సీమాంధ్ర ఎంపీల ఆందోళనలు, వాయిదాల నేపథ్యంలో లోక్‌సభ సరిగా సాగకపోవడంతో పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులను ఆమోదించడం కోసం సమావేశాలను మరో ఐదు రోజులపాటు పొడిగించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సోమవారం నిర్ణయం తీసుకుంది. యూపీఏ సమీకృత అభివృద్ధికి ఉదాహరణ: ప్రధాని ఆహార భద్రత బిల్లు యూపీ ప్రభుత్వ ప్రజానుకూల సమీకృత అభివృద్ధికి మరో ఉదాహరణ అని ప్రధాని మన్మోహన్సింగ్ పేర్కొన్నారు. బిల్లు ఆమోదం తర్వాత పార్లమెంటు వద్ద విలేకర్లతో ఈ మాట అన్నారు. దేశంలో 82 కోట్ల మందికి ఆహార భద్రత ఆహార భద్రత బిల్లు రాజ్యసభ ఆమోదం కూడా పొందిన తర్వాత చట్టంగా మారుతుంది. దేశ ప్రజల్లో అత్యధికులకు ఆహార భద్రత కల్పిస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరుతుంది. దేశంలోని మూడింట రెండు వంతుల ప్రజలకు.. అంటే దాదాపు 82 కోట్ల మందికి ఒక్కొక్కరికి ప్రతి నెలా ఐదు కిలోల చొప్పున ఆహార ధాన్యాలు.. బియ్యం, గోధుమలు, ఇతర ధాన్యాలను కిలో ఒక రూపాయి నుంచి 3 రూపాయల ధరకే అందించటం ఈ చట్టం లక్ష్యం. దీనిని అమలు చేయటానికి 6.2 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవుతాయని.. అందుకు రూ. 1.30 లక్షల కోట్ల రూపాయలు వ్యయమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. -
రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
ఆర్మూర్, న్యూస్‌లైన్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో విడివిడిగా జరుగుతాయని పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని, సోనియాగాంధీ ధృడ సంకల్పంతో తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. సీమాంధ్రులు ఆటంకాలు సృష్టించినా, ఆటలాడినా కాంగ్రెస్ అధినేత్రి నిర్ణయం మారదన్నారు. పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, న్యాయవాదులు, ప్రజలు, మేధావులు ముక్తకంఠంతో సోనియాకు మద్దతుగా నిలవాలని సూచించారు. డీఎస్ తెలం గాణ విషయంలో ఏమీ మాట్లాడడం లేదని అందరూ అంటుంటారు... మీడియాతో మాట్లాడితే తెలంగాణ రాదు. తెలంగాణ కావాలంటే ఉద్యమాలు, మీడియా అన్నీ కావాలని అన్నారు. ఏ స్థాయిలో ఏం చేయాలో అదే తాను చేశానని చెప్పుకొచ్చారు. -
అంతా ‘సొంత’ రాజకీయమే
ఆంధ్రప్రదేశ్ ‘విభజన’ సమస్యను తనకు తానై సృష్టించుకున్న కాంగ్రెస్ అధిష్టానానికి, దాని అధినాయకి, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆ సమస్య రోజుకొక తీరుగా ఏకుమేకై కూర్చుంటోంది! దారీతెన్నూ తెలియని కాలువలు ప్రవాహ వేగాన్ని మార్చుకుని వాగులు వంకలు, డొంకలు చూసుకున్నట్టుగానే ‘సమస్య’ పరిష్కా రానికి గాను తలాతోకాలేని ప్రతిపాదనలను ఆశ్రయిస్తోం ది! రాష్ట్ర సమస్యను ఓ ‘పాములబుట్ట’గా మార్చింది. మూడు ప్రాంతాల ప్రజల నుంచి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా అభిప్రాయాలు తెలుసుకోకుండా, జనవాక్య సేకరణతో (ప్లెబిసైట్) నిమిత్తం లేకుండా గుప్పెడు మంది నాయకు లతో మంతనాలు జరిపి, కేవలం కాంగ్రెస్ పార్టీ అభిప్రా యంగా ఆ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయంగా తెలుగు జాతిని చీల్చడానికి సిద్ధమైంది. కేవలం ఎన్నికలు, ఓట్లు, సీట్ల మీదనే దృష్టి పెట్టి ప్రజల్ని విభజించి పాలించడానికి పార్టీ స్థాయిలో చేసిన నిర్ణయాన్ని ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటింపజేస్తే ఇతర ప్రధాన పార్టీలన్నీ కూడా ‘గుడ్డెద్దు చేలోపడినట్టు’ అవే ఎన్నికల ప్రయోజనాల కోసం తలకెత్తుకుని ఊరేగుతూ వచ్చాయి. ఈ లోపు పరిస్థితులు రాష్ట్ర వ్యాపితంగా చేయి దాటిపోతున్నందున కాంగ్రెస్ అధిష్టానం చిట్కాలకు దిగిం ది. ‘విభజన’ను రకరకాల రంగుల్లో ప్రజలకు చూపిం చడం ప్రారంభించింది. ఒకసారి రాష్ట్రాన్ని రెండుగా (ఆం ధ్ర, తెలంగాణ) చీల్చాలని, మరోసారి ‘రాయల-తెలం గాణ’ అనీ, ఇంకోసారి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్ని తెలంగాణకు జోడించాలనీ, మరొకసారి భద్రా చలం రాజధానిగా తెలంగాణలోని గిరిజన ప్రాంతాల న్నింటినీ కలిపి ‘మన్యసీమ’గా ఏర్పాటు చేస్తే ఎలా ఉం టుందనీ, అసలు అదీ ఇదీ కాదు రాష్ట్రాన్ని మూడు రాష్ట్రా లుగా (ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ) ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో ‘తమాషా’ చూడాలనీ ఎవరో బయట వారు కాదు, ఆ పార్టీలోని వారి ద్వారానే ‘టుమ్రీలు’ జనంలోకి వదులుతూవచ్చింది! ఇంతకూ ఈ ‘సర్కస్’ అంతా పేరుతో సోనియా ఎందుకు నడిపినట్టు? తెలుగుజాతిని చీల్చడం ద్వారా కేంద్రంలో తిరిగి కాంగ్రెస్‌ను అధికారం లోకి తేవాలన్నదే ఏకైక లక్ష్యమని ప్రజలకు అర్థమైపో యింది. ‘విభజన’ తంత్రాన్ని 2014 ఎన్నికల చివరికంటా ప్రయోగిస్తూ ఉండాలని నిర్ణయించుకున్న అధిష్టానం ముందు పార్టీ స్థాయిలో రక్షణమంత్రి ఆంటోనీ ఆధ్వర్యం లో ఒక కమిటీని వేసినట్టేవేసి, అంతలోనే దాన్ని వెనక్కి లాగింది. ఈ పరిస్థితుల్లో, రాష్ట్ర ‘విభజన’ సమస్యపై తానుగా కనబడకుండా ముఖం చాటేస్తూ వచ్చిన సోని యా ఉన్నట్టుండి మొట్టమొదటి సారిగా మూడు రోజుల నాడు ఢిల్లీలో నేషనల్ మీడియా సెంటర్‌ను ప్రారంభిస్తూ మరో కొత్త ప్రతిపాదన చేసింది. ‘ఆంటోనీ కమిటీ’ కేవలం కాంగ్రెస్ పార్టీపరంగా ఏర్పాటై నది మాత్రమేనని, కాని ఈ సారి ‘విభజన’ సమస్య పరిష్కారం కోసం సరాసరి ప్రభు త్వ కమిటీనే నియమిస్తామనీ ఆమె ప్రకటించారు! ఎందుకని? కాంగ్రెస్ అధిష్టానం కన్ను, సోనియా మనస్సూ తిరిగి తిరిగి రానున్న ఎన్నికల్లో దక్కించుకోగల లోక్‌సభ స్థానాల మీదనే లగ్నమై ఉంది. కాగా, వివిధ సర్వేక్షణల ప్రకారం తక్షణమే ఎన్నికలు నిర్వహించే పక్షం లో, తెలుగుజాతిని చీల్చు-చీల్చకపో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో రాగల మొత్తం లోక్‌సభ సీట్లు 7 లేదా 8 సంఖ్య దాటబో వనీ, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూడబోతోందని అంచనాలు వేశాయి! ఆ క్షణం నుంచి కాంగ్రెస్ అధిష్టానం చావు తెలివితేటలతో వ్యూహాన్ని మార్చి ‘ప్రభుత్వ కమిటీ’ పేర ‘కొత్తసీసాలో పాత సారా’ ను నింపి తీవ్ర అనిశ్చిత పరిస్థితులలో ఆందోళనలో ఉన్న రాష్ట్ర ప్రజల గొంతు తడపాలనే ప్రయత్నంలో ఉంది! ఆ ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి, కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ పనికిమాలిన ప్రతిపాదనలతో రాష్ట్ర ప్రజల్ని మరింత గందరగోళంలోకి నెట్టారు! ఎందుకీ తప్పుడు ‘విన్యాసాలు’? మళ్లీ అదే సమా ధానం - కిశోర్‌దేవ్ మాటల్లోనే చెప్పాలంటే రాష్ట్రాన్ని ముక్కలుచేసి, మూడు వేర్వేరు రాష్ట్రాలుగా (ఆంధ్ర, తెలం గాణ, రాయలసీమ) చేయడంవల్ల ఆంధ్రలో 17, తెలం గాణలో 17, రాయలసీమలో 8 లోక్‌సభ స్థానాలుగా విభ జితమై ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ ‘లబ్ధి’ పొందవచ్చు! ‘విభజన’ ప్రతిపాదనలో ఆదినుంచీ సమస్యను ఆ కోణం నుంచే అధిష్టానం ‘బుర్ర’లు కరిగించుకుంటోందే తప్ప తెలుగుజాతి ఐక్యతను, గత ఘనకీర్తిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. వేల ఏళ్ల చరిత్ర కలిగి ఏక భాషా సంస్కృతులతో దీపించే తెలుగుజాతి భావిభాగ్యోన్నతి ప్రయోజనాలను పణంగా పెడుతోంది. విభజించి పాలిం చే కాంగ్రెస్ నీతికి ఈ తంతు అద్దంపడుతోంది. రాష్ట్ర సంక్షోభానికి నిందించాల్సిన అధిష్టానవర్గ కూట రాజకీ యాన్ని పక్కన పెట్టి కిశోర్‌చంద్రదేవ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్య క్షుడు బొత్స, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీద విరు చుకుపడ్డారు. సందేహం లేదు, సమస్యను నానబెట్టడం లోనూ, సకాలంలో ప్రజలను అప్రమత్తం చేయకుండా రహస్యంగా దాచి ఉంచడంలోనూ ఈ ఇరువురూ బాధ్యు లే. కానీ కిశోర్‌చంద్రదేవ్ కూడా అదే పనిచేశారు. వంది మాగధతత్వం, విధేయత వ్యక్తిగతస్థాయిలో పార్టీ వరకే పరిమితమైతే తప్పులేదు, కానీ ప్రజాబాహుళ్యం విశాల ప్రయోజనాలను, తెలుగుజాతి ఔన్నత్యాన్నీ దెబ్బతీసి కించపరుస్తున్న విషమ ఘడియలలో కూడా పదవులకు అంటకాగే మనస్తత్వం క్షమార్హం కాదు. యూపీ, మధ్య ప్రదేశ్ల తరువాత కేంద్రంలో ప్రభుత్వాల మనుగడకు మెజారిటీ సభ్యులను పంపించే ఏకైక దక్షిణాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే! 2004లోనూ, 2009లోనూ ఆ గౌర వాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి అప్పనంగా దక్కించిపెట్టిన పెద్ద రాష్ట్రం మనదే! రేపు పొరపాటున 2014లో కేంద్రం లో అధికారంలోకి రావాలన్నా కాంగ్రెస్ అధిష్టానానికి ఈ రాష్ట్రమే గతి. అయితే తెలుగుజాతి విభజనకు కాంగ్రెస్ పాల్పడేపక్షంలో అది ‘దింపుడు కల్లం’ ఆశే! కేంద్రంలో పాలకపక్షాల మనుగడకు సంఖ్యా పరంగా కీలకమైన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లు కనుకనే ఇప్పటిదాకా కాంగ్రెస్, బీజేపీ ఆ రెండు రాష్ట్రా లపైనే ఆశలు పెట్టుకుంటూ, ఆ రాష్ట్రాల ప్రజల ప్రయోజ నాలతో జూదమాడుతూవచ్చాయి. ఎవరి స్థానాలకు ఎసరువచ్చినా ఈ రెండు రాష్ట్రాల ప్రజలు లేదా ప్రతి పక్షాలు సహకరించని ప్రతిసారీ ఢిల్లీలో చక్రం తిప్పే పాలక పక్షాలు ఆ రాష్ట్రాలను విభజించి, నియోజకవర్గాల పున ర్వ్యవస్థీకరణకు కూడా పాల్పడుతుంటాయి. అటుమొన్న యూపీలో మాయావతి ముఖ్యమంత్రిగా చేసిన పనీ అదే. నాలుగు రాష్ట్రాల కింద విడగొట్టేయడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ అధికారానికి తూట్లుపొడవడం ఆమె లక్ష్యం! అలాగే మధ్యప్రదేశ్‌లో బీహార్‌లో, యూపీలో పాగావేయ డం ద్వారా కేంద్రంలో తన పాలనను సుస్థిరం చేసుకోవ డానికి బీజేపీ-ఎన్డీయే పరివార్ ప్రభుత్వం ఆ మూడు రాష్ట్రాలనూ చీల్చి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్లను ప్రత్యేక రాష్ట్రాలుగా ప్రకటించి అవినీతిపరుల్ని అందలమె క్కించి అభాసుపాలవుతూవచ్చింది. ఇప్పుడు ఆ మూడు ప్రత్యేక రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఏం చెబుతున్నారు? రాజకీయ ప్రయోజనాల కోసం చిన్న రాష్ట్రాలుగా విడ గొట్టరాదని ఒకరూ (రమణ్‌సింగ్), ఆర్థికంగా సౌష్టవంగా ఉం డి, కేంద్ర ప్రభుత్వంపైన ఆధారపడకుండా ఉండగల స్థితిలో ఉండాలని మరొకరూ (విజయ్ బహుగుణ) పద మూడేళ్ల తర్వాత కూడా తమ జార్ఖండ్ రాష్ట్ర ప్రజలు అభి వృద్ధి ఫలాలకు దూరంగానే ఉండిపోయారని ఇంకొకరూ (హేమంత్ సొరేన్) బాహాటంగానే ప్రకటిస్తున్నారు!! విచిత్రమేమిటంటే తెలుగుజాతిని చీల్చడానికి ఒకరికి మిం చి ఒకరు పోటాపోటీల మీద అధిష్టానం తరఫున కాలు దువ్విన ముగ్గురూ... గులామ్ నబీ అజాద్, దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ తమ సొంత రాష్ట్రాలైన కాశ్మీర్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో ప్రజల నుంచి దూరమై ‘ఛీ’ కొట్టించుకున్న వాళ్లే! ఈ అనూహ్య పరిణామాలకు మూలమేమిటో కేంద్ర ప్రభుత్వ విదేశాంగశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన టి.ఎన్.కౌల్ ఇలా వివరించారు. ‘స్వతంత్ర భారతదేశం ఉత్తరప్రదేశ్‌ను కనీసం మూడు రాష్ట్రాలుగా విభజించకుం డా ఒక్క రాష్ట్రంగానే అట్టిపెట్టవలసి వచ్చింది? అంటే, ఉత్తరాన కొండ ప్రాంతాలను, తూర్పు ప్రాంతాన్ని (అవథ్), పశ్చిమ భాగాన్ని (పాత ఆగ్రా రాష్ట్రం) ఎందుకు యూపీ నుంచి వేరు చేయలేదు? జనాభా పెరుగుతోంది, ప్రజల్లో రాజకీయ చైతన్యమూ పెరుగుతోంది, ప్రజా స్వామ్య వ్యవస్థ రూపొందుతోంది, అలాగే అభివృద్ధి కార్య క్రమాలూ అమలులోకి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పరి పాలనా సౌలభ్యం దృష్ట్యా యూపీని అలా విడగొట్టేయ వచ్చుగదా? కాని ఆ నాడు కాంగ్రెస్ పాలకులు రాజకీయ కారణాల వల్లనే విడగొట్టలేదు! ఎందుకని? లోక్‌సభలోని 543 సీట్లలో అత్యధిక సీట్లు (84) ఉన్న రాష్ట్రం యూపీ ఒక్కటే! అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులోనూ, ప్రధాన మంత్రి ఎంపికలోనూ ఈ సంఖ్య కీలకమవుతూ వచ్చింది. కాంగ్రెస్ ప్రధాను లుగా ఉన్న ముగ్గురూ - నెహ్రూ, లాల్‌బహదూర్‌శాస్త్రి, ఇందిరాగాంధీ - ఉత్తర ప్రదేశ్ వారే. దేశం స్వాతంత్య్రం పొందకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 1956లో ప్రధానంగా భాషా ప్రాతిపదికపైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ పరిస్థితుల్లో, మద్రాస్, బొంబాయి, పంజాబ్ రాష్ట్రాల్లో మాదిరిగా యూపీని కూడా విభజించాలన్న పట్టుదల లేకపోవడానికి కారణం - మొత్తం యూపీ ప్రజలు హిందీ లోనే మాట్లాడతారు. కాబట్టి రాష్ట్రాన్ని విభజించాలనే డిమాండ్ లేదు. పరి పాలనా సౌలభ్యం ప్రాతిపదికపైన యూపీని ముక్కలు చేస్తే, వేర్పాటువాదం వ్యాప్తి చెంది పాలనా సౌలభ్యం పేరిట బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో కూడా ప్రత్యేక రాష్ర్ట వేర్పాటు కోర్కెలు మొలకెత్తే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వాలు సంకోచించాయి. యూపీ అంటే ఏమిటని ప్రశ్నించే వారికి రాష్ట్రాల పునర్వ్య వస్థీకరణ కమిషన్ సభ్యులలో ఒకరైన కె.ఎం. ఫణిక్కర్ వ్యంగ్యంగా ‘ఇండియా అంటే భారత్, భారత్ అంటే యూపీ’ అన్నారు! ఆ మాట ఇప్పటికీ రాజకీయ వర్గాల బుర్రల్ని ఏలుతూనే ఉంది. ‘ప్రజాసేవ’ పేర ఆ ప్రజలకే తలపెట్టే ద్రోహం నుంచి నాయకులు విముక్తమైతే తప్ప ప్రజలకు సుఖశాంతులు కల్ల! ‘ప్రాచ్య ఖండపు ఇటలీ భాష’గా (ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్) ప్రపంచ ఖ్యాతి కెక్కిన తెలుగు భాషను, తెలుగుజాతినీ మన ఇటాలియన్ కోడలమ్మ అనాలోచిత నిర్ణయాలతో న్యూనపరచదనే విశ్వసిద్దాం!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -

విభజన పాపం వారిదే
సాక్షి, నెల్లూరు: విభజన పాపం కాంగ్రెస్, టీడీపీలదేనని సింహపురి వాసులు ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్లు ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తోందన్నారు. విభజన ప్రకటన ఉపసంహరించుకునే వరకు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘ఎవరెటు’ చైతన్యపథం చర్చావేదికకు ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థులు హాజరయ్యారు. విభజన జరిగితే అన్నివర్గాల వారు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పార్టీలు రెండు కళ్ల ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. సీమాంధ్ర నేతల రాజీనామాల విషయమై చిత్తశుద్ధి కరువైందని ధ్వజమెత్తారు. సోనియా వద్ద మోకాళ్లపై కూర్చుని తమ పదవులు కాపాడుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామో, నిరంకుశ పాలనలో బతుకుతున్నామో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. సీమాంధ్రులు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే, ఇప్పుడు ఆ మహానగరాన్ని తెలంగాణకు ధారాదత్తం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ రవీంద్రరెడ్డి మాట్లాడుతూ బలమైన రాష్ట్రాన్ని బలహీనంగా మార్చి ఆటాడించాలని కేంద్రం చూస్తోందని దుయ్యబట్టారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ ఎం.శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ విభజన జరిగితే నిధుల విడుదల గగనమైపోతుందన్నారు. బొల్లినేని ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఏవీ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లోనే పూర్తిస్థాయి వైద్యం అందుబాటులో ఉందని చెప్పారు. విభజనే జరిగితే సీమాంధ్రుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. -
విదేశీ బుద్ధి పోని సోనియా
పిఠాపురం, న్యూస్‌లైన్: తెలుగు ప్రజలు ఆడపడుచుగా అభిమానించినా కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు విదేశీ బుద్ధి పోలేదని మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అందుకే తెలుగు ప్రజలను విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘తెలుగుజాతి విశిష్టత - విభజన వ ల్ల అనర్థాలు’ అంశంపై తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఆదివారం జరగిన చర్చాగోష్టిలో చలసాని మాట్లాడారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని తాకట్టు పెట్టడానికి చూస్తున్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, ఆయన కూతురు కవిత చరిత్రహీనులని దుయ్యబట్టారు. సీమాంధ్ర ఉద్యోగులను పెట్రోలు పోసి తగులబెట్టాలని పిలుపునిచ్చిన తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చదువుకున్న మూర్ఖుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో తెలుగువారికి ఉద్యోగావకాశాలు ఉండగా, హైదరాబాద్‌లో సీమాంధ్రులను నాన్‌లోకల్ చేయడం ద్వారా ఉద్యోగావకాశాలను హరించారన్నారు. తెలంగాణ కు వంత పాడుతున్న మంత్రి బొత్స తెలుగుజాతిలో పుట్టిన చీడపురుగని విమర్శించారు. భద్రాచలం డివిజన్‌ను కోస్తాంధ్రలో కలపాలని, లేకపోతే నీటి వివాదాలు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. -
మిన్నంటిన నిరసనలు
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర నినాదాలతో సీమాంధ్ర జిల్లాలు ఆదివారం నాడూ మార్మోగాయి. ర్యాలీలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు కొనసాగాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గృహ నిర్మాణశాఖ ఉద్యోగులు కలెక్టరేట్ వర కు ర్యాలీ తీశారు. కొత్తపేట పాతబస్టాండ్ వద్ద హాస్టల్ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఏలేశ్వరంలో వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పాదచారులకు, ప్రయాణికులకు పువ్వులు పంచుతూ నిరసన తెలి పారు. ముమ్మిడివరంలో రజకులు సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. తాపేశ్వరంలో వ్యవసాయ అధికారులు, రైతుమిత్ర సంఘాలు, రైతులు రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. తుని, పెద్దాపురం పట్టణాల్లో క్రైస్తవులు ర్యాలీలు నిర్వహించారు. విజయనగరంలో ఇంద్రజాలికుడు చారి కళ్లకు గంతలు కట్టుకుని వాహనం నడుపుతూ నిరసన ర్యాలీ చేశారు. సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో సీమాంధ్ర కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎంపీల వేషధారణలో ఉన్న వ్యక్తులు సోనియా వేషధారిణి చుట్టూ చెక్కభజన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. మునిసిపల్ ఉపాధ్యాయులు గొడుగులతో నిరసన ర్యాలీ చేయగా.. మునిసిపాలిటీ సిబ్బంది చెవిలో పువ్వులు పెట్టుకుని సమైక్యనినాదాన్ని వినిపించారు. అనంతపురం ఎస్కేయూ ఎదురుగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆర్యవైశ్య సంఘం, ఆసుపత్రి సిబ్బంది, ఉపాధ్యాయుల రిలే దీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి సంఘీభావం తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు నిరసన ర్యాలీ చేశారు. చీరాలలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్జీఓ, ఉద్యోగ సంఘాల ప్రతి నిధులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మైనింగ్ కార్యాలయాలకు తాళాలు వేసి, విధులు బహిష్కరించాలని సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల మైనింగ్ శాఖ అధికారులు గుంటూరులో తీర్మానించారు. విజయవాడ దుర్గగుడి ఉద్యోగులూ సమైక్యం కోసం ఆందోళనబాట పట్టారు. జగ్గయ్యపేటలో బోనాలు సమర్పించి మహిళలు నిరసన వ్యక్తంచేశారు. శ్రీకాకుళంలో జెడ్పీ,రెవెన్యూ, పురపాలక సంఘ ఉద్యోగులు దీక్షల్లో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రోడ్డుపై కూర్చొని ఐదు లక్షల సార్లు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ కాగితాలపై రాసి 1500 మంది విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. విస్సాకోడేరులో సెయింట్జాన్ స్కూల్ విద్యార్థులు మోకాళ్లపై నిలబడి జాతీయ జెండా చేతబూని నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనతో కలిగే నష్టాలను వివరిస్తూ కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయులు సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు, ఎస్ఎంఎస్లు, ఈ-మెయిల్స్ పంపారు. ఆళ్లగడ్డలో జేఏసీ నేతలు మోకాళ్లతో నడిచి నిరసన వ్యక్తం చేశారు. మరో 12 మంది మృతి న్యూస్‌లైన్ నెట్వర్క్: రాష్ట్ర విభజన నిర్ణయంపై కలత చెంది శనివారం రాత్రి, ఆదివారాల్లో పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు, తూర్పులో ఒకరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రాజాలు వదిలారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు(55), పాము మాణిక్యం(68), కొయ్యలగూడెం మండలం పరింపూడికి చెందిన శ్రీనివాస్(45) శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. చాగల్లు మండలం ఎస్.ముప్పవరానికి చెందిన కోటిచుక్కల నాగరాజు(36) టీవీలో విభజన వార్తలు చూస్తూ ప్రాణాలు వదిలాడు. నరసాపురం రుస్తుంబాద మెరకగూడెంకు చెందిన డ్వాక్రా సభ్యురాలు సావిత్రి(65) విభజన వార్తలతో కొద్దిరోజులుగా దిగులుగా ఉన్న ఆమె మృతిచెందింది. పెరవలి మండలం గవర్లపాలెంకు చెందిన రాంబాబు (23), నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో షేక్ మస్తాన్ (50) గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి వీఆర్ఏ తుడుం రమణ(42), చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లికి చెందిన మునస్వామి(51), కర్నూలుజిల్లా జూపాడుబంగ్లా మం డలం లింగాపురానికి చెందిన వెంకటలక్ష్మయ్య(45) టీవీల్లో వీక్షిస్తూ గుండెపోటుతో మరణించాడు. కొత్తపల్లి మండలం జి.వీరాపురానికి చెందిన శివుడు(37) గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం ఎండమూరుకు చెందిన నాగమణి గుండెపోటుతో మృతిచెందింది. -
అంత ధీమా ఉంటే.. ప్రజా తీర్పు కోరండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేంద్రంలో మూడోసారి కూడా నూటికి నూరు శాతం అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అంత ధీమా ఉంటే.. ప్రజల తీర్పు కోరాలని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు సవాల్ చేశారు. ‘‘అసమర్ధత, అవినీతి, అక్రమాలలో ఆరితేరినందుకు జనం మళ్లీ పట్టంకడతారా?’’ అని ఆయన ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ నేతలు వై.రఘునాథ్‌బాబు, ఎన్.రామచంద్రరావు, శ్రీధర్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశాన్ని అన్ని విధాలా దివాలా తీయించిన ఘనత యూపీఏకే దక్కిందని ధ్వజమెత్తారు. ధరలు ఆకాశాన్నంటాయని, ఆర్ధిక లోటు ఆందోళనకర స్థాయికి చేరిందని, పారిశ్రామిక ఉత్పత్తి తిరోగమన దిశలో ఉందని, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని.. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని చరిత్రలోనే చూడలేదని విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను వదిలిపెట్టి.. బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ నరేంద్రమోడీని అపఖ్యాతి పాల్జేయటమెలా, లౌకికవాదం ముసుగులో ఓట్లు దండుకోవటమెలా అనే రెండు సూత్రాల కార్యక్రమాన్ని కాంగ్రెస్ అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ ఇచ్చామని చెబుతున్న హక్కులన్నీ ఆదేశిక సూత్రాల్లో ఉన్నవేనన్నారు. అనంతపురంలో పదెకరాలు, మహబూబ్‌నగర్‌లో 15 ఎకరాలున్న రైతులకన్నా.. హైదరాబాద్‌లోని కిళ్లీ బడ్డీ యజమానే నయమన్నారు. రాజ్యసభలో తాను తెలంగాణపై మాట్లాడిన అంశాలపై ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని వెంకయ్య పేర్కొన్నారు. తెలంగాణపై తమ వైఖరిలో మార్పు లేదని, సిద్ధాంతపరమైన నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. ‘టీడీపీతో పొత్తు ఉంటుందా?’ అని ప్రశ్నించగా.. పొత్తులపై చర్చించలేదని.. ఏవైపు నుంచి ఎటువంటి ప్రతిపాదనలు లేవని బదులిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 272కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. బీసీ సబ్‌ప్లాన్‌పై నేటి నుంచి బీజేపీ దీక్ష బీసీ సబ్‌ప్లాన్ కోసం సోమ, మంగళవారాల్లో బీజేపీ నేతలు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద దీక్ష చేపట్టనున్నారు. పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, కె.లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ తదితరులు దీక్షలో పాల్గొంటారు. -
సోనియాకు కృతజ్ఞతా సభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపేందుకు భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆ ప్రాంతానికి చెందిన మంత్రులు నిర్ణయించారు. సభను ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలన్న అంశాన్ని త్వరలో సమావేశమై ఖరారు చేయనున్నారు. శనివారం సచివాలయంలో మంత్రి కె.జానారెడ్డి చాంబర్లో సమావేశమైన మంత్రులు తెలంగాణ అంశానికి సంబంధించి ఢిల్లీలో నెలకొన్న పరిణామాలతోపాటు సీమాంధ్రలో, హైదరాబాద్‌లో జరుగుతున్న ఆందోళనల గురించి చర్చిం చారు. సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సారయ్య, సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, డీకే అరుణ, సునీతా లక్ష్మారె డ్డి తదితరులు పాల్గొన్నారు. విజయోత్సవ సభలు మాత్రం వాయిదా: తెలంగాణ ప్రక్రియ ఢిల్లీలో ముందుకుసాగేలా తమవంతు ప్రయత్నాలపైనా మంత్రులు చర్చిం చారు. పార్లమెంటులో ఎంపీల సస్పెన్షన్ అంశాలపైనా సమీక్షించారు. ఈ పరిణామాలతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముందుకు కదలకపోవడంతో తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఒకింత ఆందోళనకు దారి తీసేదిగా మారుతోందన్న అభిప్రాయానికి వచ్చారు. తెలంగాణబిల్లును సాధ్యమైనంత త్వరగా కేబినెట్ ఆమోదించి పార్లమెంటులో ప్రవేశపెట్టించేలా కేంద్రం పెద్దలతో సంప్రదింపులు జరుపుతుండాలని నిర్ణయించారు. ఢిల్లీలో సీమాంధ్ర నేతలు చేస్తున్న యత్నాలను, కేంద్రంలో నెలకొంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటుకు మూలకారణం కాంగ్రెస్సేనని, ఈ దిశగా ప్రజల్లో పార్టీ పట్ల మరింత ఆదరణ పెరిగేలా గ్రామాల్లో విస్తృతప్రచారానికి తెరతీయాలని సంకల్పించారు. అయితే తెలంగాణ బిల్లు రాకుండా విజయోత్సవ సభలు నిర్వహించడం సబబుకాదని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కాంగ్రెస్సే తీరుస్తోందన్న అంశాన్ని ప్రజలకు చెప్పేందుకు గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విజయోత్సవ సభలకు బదులు కృతజ్ఞతా సభలను ఎక్కడికక్కడ నిర్వహించుకోనున్నారు. అయితే తెలంగాణ ప్రాంతమంతటికీ కలిపి ఓ భారీ బహిరంగ సభను నిర్వహించి సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేయించాలని నిర్ణయించారు. ఈనెల 28న మరోసారి సమావేశమై తేదీ, వేదికను ఖరారు చేయనున్నారు. ఈనెల 27న మహబూబ్‌నగర్‌లో సభ నిర్వహించనున్నట్లు ముందుగానే ప్రకటించినందున ఆ తేదీనే సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి డీకే అరుణ తెలిపారు. ఉద్యమాలను సద్దుమణిగేలా చేయండి: సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తి తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆయన చాంబర్లో కలిశారు. సీమాంధ్రలో ఉద్యమం, ఏపీఎన్జీవోలు, జిల్లా స్థాయిఅధికారులు, గ్రూప్-1అధికారులు కూడా సమ్మెకు దిగడం తదితర అంశాలపై ఆయనతో చర్చించారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని చల్లబరిచే చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఏపీఎన్జీవోలతో సమ్మెను విరమింపచేయాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు కూడా సమ్మెకు దిగడం దారుణమని, దీన్ని ఉపేక్షించడం సరికాదని అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆయా సంఘాల నేతలతో సీఎం నేరుగా చర్చించి ఉద్యమాలను సద్దుమణిగేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం కిరణ్ ఏమాత్రం స్పందించకుండా మౌనం దాల్చారని సమాచారం. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం స్వచ ్ఛందంగా వచ్చిందేనని చెప్పి మిన్నకున్నారు. ఈ పరిణామంపై మంత్రులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఉద్యోగులను పిలిచి చర్చించి అపోహలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. -
మెదక్ నుంచి రాహుల్?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, సోనియా తనయుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? వ్యూహంలో భాగంగానే టీఆర్ఎస్ బహిష్కృత ఎంపీ విజయశాంతిని పార్టీలో చేర్చుకున్నారా? అవుననే అంటున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాలు. ఇటీవల జిల్లాకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలు ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో రాహుల్ పోటీపై పార్టీ ఉన్నతస్థాయి వర్గాల్లో చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ ప్రకటన నేపథ్యంలో మెజారిటీ లోక్‌సభ స్థానాలు సాధించడం లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయనను కట్టడి చేసేందుకు విజయశాంతిని పార్టీలో చేర్చుకునేలా పార్టీ వ్యూహం రచించించినట్టు సమాచారం. విజయశాంతికి కేంద్రంలో సముచిత స్థానం కల్పిస్తామనే హామీ లభించిందని ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల సారాంశాన్ని అధికార పార్టీ నేత ఒకరు వెల్లడించారు. ఇందిరమ్మ బాటలో రాహుల్ కూడా మెదక్ నుంచి పోటీ చేయడం ఖాయమని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. -
సోనియా తీరుపై టీడీపీ నేత యనమల విమర్శ
కొరిటెపాడు (గుంటూరు), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు తెరలేపి తెలుగువారి భవిష్యత్తును ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నాశనం చేశారని ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. టీడీపీ నేతలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణలు చేస్తున్న నిరవధిక నిరహార దీక్ష శిబిరం గురువారం నాలుగో రోజుకు చేరింది. యనమల దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కేసీఆర్ సొత్తు కాదని రాష్ట్ర ప్రజలందరిదని గుర్తుచేశారు. స్వార్థరాజకీయాల కోసం రాష్ట్ర విభజన ప్రకటన చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు చాలా మంచివారని, అక్కడ రాజకీయనేతల స్వార్థ ప్రయోజనాల వల్లే రాష్ట్ర విభజన ప్రకటన చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంతవరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ రాహుల్‌గాంధీని ప్రధానని చేయడం కోసమే సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించారని, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు చూసైనా కేంద్రం విభజన ప్రకటనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఒక వైపు సీమాంధ్ర జిల్లాలు, హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర మంటలు ఎగిసి పడుతుంటే సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు పదవులు పట్టుకుని వేలాడుతున్నారని, రాజీనామాలు చేయకుంటే వారికి రాజకీయ మరణశాసనం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి మాట్లాడుతూ రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం కోసం టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని వారి ఆటలు సాగవన్నారు. రాష్ట్ర విభజనపై యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆంటోని కమిటీ దొంగల ముఠా కమిటీ అని పేర్కొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పదేళ్లుగా అధికారానికి దూరమై ఢిల్లీ చుట్టు ప్రదక్షణ చేస్తున్న దిగ్విజయ్‌సింగ్‌కు ఆంధ్రప్రదేశ్‌ను విభజించే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో తెలుగుజాతి మధ్య విద్వేషాలు ప్రజ్వరిల్లాయని విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన, రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. అనంతరం కబడ్డీ, కుర్చీల ఆటలు ఆడారు. దీక్షకు మద్దతు తెలిపిన వారిలో మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, జేఆర్ పుష్పరాజ్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, దాసరి రాజామాస్టారు, వెన్నా సాంబశివారెడ్డి, సహెచ్ మధు, కె.వీరయ్య, నిమ్మకాయల రాజనారాయణ, బోనబోయిన శ్రీనివాసయాదవ్, అనగాని సత్యప్రసాద్, పోతినేని శ్రీనివాసరావు, మల్లి, రావిపాటి సాయికృష్ణ తదితరులు ఉన్నారు. -
సమైక్యనాదం
సాక్షి, కాకినాడ : సమైక్య ఉద్యమం జిల్లావ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ప్రారంభమై 23 రోజులైనా ఊరు..వాడా నిరసనలు హోరెత్తుతున్నాయి. దిండి-చించినాడ వంతెనపై రామరాజు లంక వాసుల వంటావార్పు వల్ల ఉభయగోదావరి జిల్లాల మధ్య మధ్యాహ్నం వరకు రాకపోకలు స్తంభించాయి. పాడిగేదెలు, గిత్తలతో సమైక్యవాదులు రావులపాలెం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలపడంతో 16వ నంబర్ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజమండ్రిలో ఫ్యూచర్ కిడ్స్పాఠశాలకు చెందిన 1500మంది విద్యార్థులు ఆం ధ్రప్రదేశ్ మ్యాప్‌గా ఏర్పడి రాష్ర్టపతి, ప్రధాని, సోనియాలకు పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కేంద్రమంత్రులు ఎంఎం పళ్లంరాజు, కె.చిరంజీవి కనిపించడం లేదంటూ కి ర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. నిరసనలతో హోరెత్తిన కాకినాడ కాకినాడలో 23వ రోజు కూడా నిరసనలు హోరెత్తాయి. కాకినాడలోని జేఎన్టీయూ, ఏపీటీ, జీపీటీలతో పాటు బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఎంసెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకోవడంతో నాలుగోరోజు కూడా జరగలేదు. డీఆర్డీఏ, ఐకేపీల ఆధ్వర్యంలో సుమారు 3 వేల మంది మహిళా సమాఖ్య సభ్యులు మహా ర్యాలీ నిర్వహించారు.కలెక్టరేట్ ఎదుట పంచాయతీ ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలకు జేఏసీ రాష్ర్ట కో చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు కేవీవీ సత్యనారాయణరాజు, రవికిరణ్‌వర్మ, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంఘీ భావం తెలిపారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేస్తున్న ప్రభుత్వ వాహన డ్రైవర్స్ సంఘం నేతలకు తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీలు చైతన్యరాజు, వర్మల ఆధ్వర్యంలో చైతన్య విద్యార్థులు నగరంలో బైకు ర్యాలీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టడంతో వారికి సంఘీభావంగా నగరంలో ప్రైవేటు పాఠశాలలను గురు,శుక్రవారాలు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యమంలోకి మున్సిపల్ కమిషనర్లు సీమాంధ్రలోని 33 మున్సిపాల్టీలకు చెందిన కమిషనర్లు రాజమండ్రిలో సమావేశమై సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. విధులు నిర్వహిస్తూనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరసన తెలుపుతామన్నారు. సియోన్ అంధుల పాఠశాల విద్యార్థులు ప్రభుత్వాస్పత్రి వద్ద ధర్నా చేశారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బొమ్మూరు వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. బొమ్మూరులో న్యాయవాదులు మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించగా, మాజీ సర్పంచ్ మత్స్యేటి ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయరహదారిైపై కోడిపందాలు ఆడి నిరసన తెలిపారు. రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో పీహెచ్‌సీలకు తాళాలు వేసి వైద్యులు, సిబ్బంది ర్యాలీ చేశారు. ఏలేశ్వరంలో సుమారు 2వేలమంది స్థానిక బాలాజీచౌక్‌లో సర్వమతప్రార్థనలు, వంటావార్పు, రాస్తారోకోలతో హోరెత్తించారు. తుని గొల్ల అప్పారావు సెంటర్లో న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టి పాదచారులకు బూట్ పాలిష్ చేశారు. రామచంద్ర పురంలో న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది, సైకిల్‌షాపు ఓనర్లు, మెకానిక్‌ల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. రాజోలులో ఉద్యోగ సంఘాల దీక్షలకు గజల్ శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. పెద్దాపురంలో జేఏసీ శిబిరానికి వచ్చిన ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ను స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాను చేసి ఆమోదింప చేసుకోవాలంటూ నిలదీశారు. ఉరకలేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆది నుంచి అగ్రభాగాన ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు గురువారం కూడా పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆమరణదీక్షకు సంఘీభావంగా పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్టీ నగర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నరవ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో వందలాది మంది మానవహారంగా ఏర్పడి కబడ్డీ, తాడాట వంటి ఆటలతో నిరసన తెలిపారు. రాష్ర్ట విభజనను తట్టుకోలేక మరణించిన వారికి సంతాపసూచకంగా మౌనం పాటించారు. రావులపాలెంలో జేఏసీ, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పాడిగేదెలు, గిత్తలతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేయగా ట్రాఫిక్ స్తంభించింది. కోరుకొండలో వైఎస్ విజయమ్మకు మద్దతుగా పార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ జోతుల లక్ష్మీనారాయణ, యూత్ కన్వీనర్ గణపతిరావు చే స్తున్న ఆమరణ నిరాహారదీక్షలను బుధవారం అర్ధరాత్రి భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. ముమ్మిడివరంలో డీసీసీబీ మాజీ డెరైక్టర్ పెయ్యల చిట్టిబాబు, మెండు గోవిందరావు, పోలిశెట్టి నాగేశ్వరరావు, కాట్రు అప్పారావులు చేపట్టిన ఆమరణ దీక్ష నాల్గవ రోజుకు చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఏలేశ్వరంలో సుమారు 100 ట్రాక్టర్లతో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. పెదపూడి మండలం చింతపల్లి వద్ద పైన గ్రామానికి చెందిన విద్యార్థులు రాస్తారోకో చేయగా, ఎమ్మెల్యీ బొడ్డు భాస్కరరామారావు పాల్గొన్నారు. కడియం, బొమ్మూరులలో దీక్షాశిబిరాలకు పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు సంఘీభావం తెలిపారు. కాకినాడలో కలెక్టరేట్ వద్ద జేఏసీతో పాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, తుని నియోజకవర్గంలో కొనసాగుతున్న దీక్షా శిబిరాలకు పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ రొంగలిలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ కూసుమంచి శోభారాణి, అడ్డతీగలలో చేపట్టిన దీక్షలకు వైఎస్సార్ సీపీ నియోజక వర్గ కో ఆర్డినేటర్ అనంతబాబు సంఘీభావం తెలిపారు. మలికిపురంలో చేపట్టిన దీక్షల్లో పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు గెడ్డం ఫిలిప్‌రాజు ఆధ్వర్యంలో చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసనతెలిపారు. బస్సుయాత్రకు అనూహ్య స్పందన వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర బండార్లంక నుంచి అమలాపురం రూరల్, ఉప్పలగుప్తం, అల్లవరం మండల పరిధిలోని పలు గ్రామాల మీదుగా అమలాపురం గడియార స్తంభం సెంటర్ వరకు సాగింది. మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, చింతా కృష్ణమూర్తి, మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు, ఇతర కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో మాధవపట్నం నుంచి సామర్లకోట మీదుగా పెద్దాపురం వరకు సాగింది. సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం వద్ద వంటావార్పులో పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ నాయకులు చలమలశెట్టి సునీల్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. రెండు ప్రాంతాల్లో వందలాదిగా పార్టీ శ్రేణులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీలతో హోరెత్తించారు. -
వ్రాద్రా విషయంలో నేను చేసింది కరెక్టే: ఖేమ్కా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన వివాదాస్పద భూ ఒప్పందంలో తాను తీసుకున్న చర్యలను హర్యానా ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాగట్టిగా సమర్థించుకున్నారు. ‘చర్యలు తీసుకోవడమన్నది మొదలుపెడితే.. అది ఉన్నత స్థాయి నుంచి మొదలవ్వాలి. అదే నైతికత. అత్యున్నత స్థాయిలో మోసం జరిగితే.. అది మోసం అని చెప్పడానికి దమ్మూధైర్యం కావాలి’ అని చెప్పారు. సీఎన్ఎన్-ఐబీఎన్‌లో ప్రసారమయ్యే కరణ్ థాపర్ ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
పాక్‌తో ఘర్షణపై ఏం చేద్దాం?
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్‌ల మధ్య నియంత్రణ రేఖ వెంబడి తలెత్తుతున్న ఘర్షణలు, భారత సైనికుల హత్యల అంశంపై చర్చించేందుకుగాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ సమావేశమయ్యారు. భారత సైనికుల హత్యలపై బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షం అధికార కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో సోనియా ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రపతిని కలిసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతితో సుమారు గంటన్నరపాటు సమావేశమైన సోనియా జాతీయ ప్రాముఖ్యం గల పలు అంశాలపై చర్చించా రు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి దిగజారుతుండటంపై సోనియా ఆందోళన వ్యక్తంచేశారని తెలుస్తోంది. అదేవిధంగా పాకిస్థాన్‌పై కఠిన వైఖరి అవలంబించాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా న్యూయార్క్‌లో జరగబోయే భారత్, పాక్ ప్రధానమంత్రుల భేటీపై ఆలోచించాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పాక్ పట్ల ప్రధాని వైఖరి అంత కఠినంగా లేకపోవడంపై కూడా సోనియా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ పార్లమెంటు చేసిన తీర్మానానికి ప్రతిగా భారత్ కూడా పార్లమెంటు ఉభయసభల్లో తీర్మానం ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.