పాపన్నపేట, న్యూస్‌లైన్: డిసెంబర్‌లోపేప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఏడుపాయల దుర్గా భవానీ శరన్నవరాత్రోత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. సకలజనుల ఉద్యమం, యువకుల పోరాటం, తెలంగాణ ప్రక్రియకు తోడ్పడ్డాయన్నారు. 2009 డిసెంబర్ 9న ఇచ్చిన హామీ మేరకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నోట్ తయారు చేసి కేంద్ర కేబినెట్ చేత ఆమోదింపజేసిందన్నారు. ఇక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరింత వేగవంతమవుతుందన్నారు.
హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ డిసెంబర్‌లోగా ఏర్పడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన యూపీఏ చైర్‌పర్సన్ సోనియా, ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చూపిన చొరవ మరువలేనిదన్నారు. సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించేందుకు మంత్రుల బృందం కృషి చేస్తోందని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రజలు 60 ఏళ్లుగా చేస్తున్న పోరాటాన్ని గుర్తించి సీమాంధ్రులు కూడా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అన్నదమ్ముల్లా వీడిపోయి,అత్మీయులుగా కలిసి ఉందామని పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి, ఏడుపాయల దేవాలయ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ చైర్మన్లు వెంకటేశ్వర్‌రెడ్డి, నర్సింలుగౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లప్ప, కాంగ్రెస్ నాయకులు రమేష్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్‌లోపే తెలంగాణ
Published Sun, Oct 6 2013 2:44 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement
Advertisement