న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన వివాదాస్పద భూ ఒప్పందంలో తాను తీసుకున్న చర్యలను హర్యానా ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాగట్టిగా సమర్థించుకున్నారు. ‘చర్యలు తీసుకోవడమన్నది మొదలుపెడితే.. అది ఉన్నత స్థాయి నుంచి మొదలవ్వాలి. అదే నైతికత. అత్యున్నత స్థాయిలో మోసం జరిగితే.. అది మోసం అని చెప్పడానికి దమ్మూధైర్యం కావాలి’ అని చెప్పారు. సీఎన్‌ఎన్-ఐబీఎన్‌లో ప్రసారమయ్యే కరణ్ థాపర్ ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.