సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ పెంపుడు కుక్కగా మారారని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్య విద్య మంత్రి కొండ్రు మురళీమోహన్ తీవ్రంగా స్పందించారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రజాప్రతినిధులను పెంపుడు కుక్కలంటావా? నువ్వే పెద్ద గుంట నక్కవు. నీ పక్కన మరికొన్ని గుంట నక్కలను పెట్టుకుని నిస్సిగ్గుగా మాట్లాడిస్తున్నావు. వాళ్లతోపాటు మరో ఐదువేలమంది కుక్కలను వెంట పెట్టుకుని యాత్ర చేస్తున్నావు’’ అని ధ్వజమెత్తారు.
సోనియాగాంధీకి డబ్బు పిచ్చి పట్టిందంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘రెండెకరాల ఆసామివి రూ. 20 వేల కోట్లు సంపాదించుకున్నావు. వ్యవస్థలను మేనేజ్ చేసుకుని బతుకుతున్న నువ్వా మాట్లాడేది? నీకు నిజంగా ధైర్యముంటే, అవినీతికి పాల్పడలేదనుకుంటే నీ ఆస్తులపై సీబీఐ విచారణ వేయించుకో’’అని సవాల్ విసిరారు. ఉద్యమం చేస్తున్న ఏపీఎన్జీవోలు కూడా రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి మంత్రి పదవుల రాజీనామాల వ్యవహారాన్ని ప్రస్తావించగా... కాంగ్రెస్‌లో ఉండటం ఇష్టంలేనివారే ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. విభజన అనివార్యమైతే విశాఖను రాజధాని చేయాలన్నారు.
చంద్రబాబు గుంట నక్క: కొండ్రు
Published Tue, Sep 3 2013 4:06 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
Advertisement
Advertisement