Kondru murali
-
ఏపికి 3 రాజధానులు అవసరమే
-
రాజధాని శంకుస్థాపనకు దూరం: ఏపీ కాంగ్రెస్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు తమ పార్టీ దూరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ శైలజానాథ్, కొండ్రు మురళి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో వారు మాట్లాడుతూ... రాజధాని కోసం 35 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారని టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మరో 50 వేల ఎకరాల అటవీ భూముల డీనోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం కోరిందన్నారు. బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే వేల ఎకరాల భూ సేకరణ చేపట్టారని ఆరోపించారు. రాజధాని కోసం ఏర్పాటు చేసిన ప్రొ.శివరామకృష్ణ కమిటీని కూడా పట్టించుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబుపై శైలజానాథ్, కొండ్రు మురళి మండిపడ్డారు. -
'సెక్షన్- 8తో ఏపీకి ఒరిగేదేమీ లేదు'
హైదరాబాద్: సెక్షన్- 8పై తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కొండ్రు మురళి మండిపడ్డారు. ఒకవేళ ఆ సెక్షన్ అమలయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు ఒరిగేదేమీలేదని, ఇక్కడి ప్రజలకు ఎలాంటి లాంభం కలగబోదని స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఓటుకు కోట్లు పంచి అవినీతి కేసుల్లో ఇరుక్కున్న చంద్రబాబుకు ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యంలేదని విమర్శించారు. -
ఇచ్చి పుచ్చుకుందాం.. రా!
పాలకొండ, న్యూస్‌లైన్, ‘ఈసారి నీ పాత నియోజకవర్గంలో నన్ను గెలిపించు.. నా పాత నియోజకవర్గంలో నిన్ను గెలిపించేందుకు కృషి చేస్తా..’ -ఇదీ మాజీ మంత్రులు కళావెంకటరావు, కోండ్రు మురళిల మధ్య కుదిరిన అవగాహన.‘ఈసారి నేను గెలవటం డౌటే.. నా గురువు కిశోర్‌చంద్రదేవ్ ఎంపీగా గెలవడమే ముఖ్యం. అందుకే నీకు సాయం చేస్తా. బదులుగా ఎంపీ ఓట్లు మాకు పడేలా చెయ్యి..’ -ఇదీ పాలకొండ కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మక సుగ్రీవులు, టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు ఇచ్చిన ఆఫర్. ‘నియోజకవర్గంలోని కాళింగుల ఓట్లు ఈసారి నాకు పడేలా చేస్తే.. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించేలా చేస్తా. లేదంటే మీ కోరిక ఏంటో చెబితే మా అధినేతతో చెప్పి తీరేలా చేస్తా. ఇంకా కాదంటే మీ కులం ఓట్లకు రేటు చెప్పు.. ఇప్పిస్తా..’ -ఇదీ టెక్కలి కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి రామ్మోహన్‌రావుకు టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన బంపర్ ఆఫర్.! జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇలా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీయటమే లక్ష్యంగా సాగుతున్న ఈ అనైతిక వ్యవహారంపై ఆ రెండు పార్టీల కార్యకర్తలు భగ్గుమంటున్నారు. దీనివల్ల రెండు పార్టీలకు తీవ్ర నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. దీనిపై వారి హెచ్చరికలను మ్యాచ్ ఫిక్సింగ్ నేతలు బేఖాతరు చేస్తున్నారు. టెక్కలిలో వెలమ కులానికి చెందిన అచ్చెన్నాయుడికి కులసమీకరణాల ప్రకారం తగినంత బలం లేదు. ఈ నియోజకవర్గంలో కాళింగ సామాజికవర్గానిది నిర్ణయాత్మక శక్తి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఆ సామాజిక వర్గానికి చెందినవారు కావటంతో అచ్చెన్నను ఓటమి భయం వెన్నాడుతోంది. అర దుకే కాళింగ సామాజిక వర్గానికే చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి రామ్మోహనరావుతో ఫిక్సింగ్‌కు సిద్ధపడ్డారు. ఈసారి సాయం చేస్తే రానున్న ఎన్నికల్లో టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ పేరును సూచిస్తానని, లేదంటే ఓట్లు వేయించేందుకు రేటు చెప్తే సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. అచ్చెన్నను నమ్మితే కొంప మునగటం ఖాయమని కొందరు, సొమ్ము చేసుకునేందుకు ఇదే మంచి అవకాశమని మరికొందరు చెబుతుండటంతో రామ్మోహనరావు సంకట స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. అయితే అచ్చెన్నకు సాయం చేసేందుకు కాళింగ సామాజికవర్గ నేతలు ససేమిరా అంటున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు రామ్మోహనరావు ఒప్పుకున్నా వీరు సహకరించే అవకాశం కనిపించటం లేదు.పాలకొండలో టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణను గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి సుగ్రీవులు కంకణం కట్టుకున్నట్టు సమాచారం. తన గురువు, కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ అరకు ఎంపీగా గెలవడమే తనకు ప్రధానమని ఆయన చెబుతున్నారు. సుగ్రీవులు ప్రతిపాదనకు టీడీపీ అభ్యర్థి జయకృష్ణ కూడా అంగీకరించారని తెలుస్తోంది. ఎంపీ ఓట్లను కిశోర్దేవ్కు వేయిస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి జయకృష్ణ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్లు సమాచారం.ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కళా వెంకటరావు.. రాజాం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి కోండ్రు మురళీ ఇప్పటికే ఫిక్సింగ్పై అవగాహనకొచ్చినట్టు ఆ రెండు పార్టీలవారే చెబుతున్నారు. 2004లో ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మురళి సహకారం తీసుకుని గట్టెక్కాలని కళా భావిస్తున్నారు. అందుకు ప్రతిగా రాజాంలో మురళి గెలుపునకు సహకరించాలని నిర్ణయించుకున్నారు. గతంలో కళా ప్రాతినిధ్యం వహించిన ఉణుకూరు నియోజకవర్గం పరిధిలో రాజాం ప్రాంతం ఉండటమే దీనికి కారణం. ఇదిలా ఉండగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఫిక్సింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. -
నీకు నేను.. నాకు నువ్వు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రిజర్వేషన్ల కారణంగా సొంత నియోజవర్గాలకు దూరమైన మాజీ మంత్రులు కళా వెంకటరావు, కోండ్రు మురళీమోహన్‌లు కాకతాళీయంగానే ఒకరి నియోజకవర్గంలో మరొకరు పోటీ చేయాల్సి వస్తోంది. ఇదే అంశం వీరి మధ్య అనైతిక ఒప్పందానికి బాట వేసింది. మూడు దశాబ్దాల క్రితం రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన కళా వెంకట్రావు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సొంత నియోజకవర్గం రాజాం ఎస్సీలకు రిజర్వు కావడంతో ఆయన ఎచ్చెర్ల నుంచి పోటీ చేయాల్సి వస్తోంది. ఈసారి గెలవడం ద్వారా పూర్వవైభవం సాధించాలన్న ఆయన లక్ష్యం ఆచరణ సాధ్యంగా కనిపించడం లేదు. స్థానికేతరుడైన కళా ఎచ్చెర్లలో పట్టు సాధించలేకపోతున్నారు. ప్రధానంగా నియోజకవర్గ ప్రజలు ఆయన్ను తమ నాయకుడిగా గుర్తించడమే లేదు. ఎన్నికలు సమీపిస్తున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఆయనలో గుబులు మొదలైంది. మరోవైపు రాజాం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోండ్రు మురళీ పరిస్థితీ అలాగే ఉంది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన ఆయన రాజాం నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. 2009లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి చరిష్మాతో గెలిచిన ఆయన పరస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. క్యాడర్ దాదాపుగా జారిపోయింది. వేళ్ల మీద లెక్కించదగ్గ అనుచరులే మిగిలారు. నియోజకవర్గంలోని ఒక్క మండలంలో కూడా ప్రభావం చూపలేని దుస్థితిలో పడిపోయారు. దాంతో జోగీ.. జోగీ రాసుకున్న చందంగా కళా, కోండ్రు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయానికి తెరతీశారు. విశ్వసనీయులైన కొందరు సన్నిహితుల మధ్యవర్తిత్వంతో ఈ మేరకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. పరస్పర సహకారం ఆ ఒప్పందం ప్రకారం తన సొంత నియోజకవర్గం ఎచ్చెర్లలో కళా వెంకట్రావుకు సహకరించేందుకు కోండ్రు మురళీ సమ్మతిం చారు. ప్రధానంగా లావేరు, ఎచ్చెర్ల మండలాల్లో మిగిలి ఉన్న కొద్దిమంది కోండ్రు అనుచరులు కళాకు అనుకూలంగా పనిచేస్తారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రవికిరణ్ ఉన్నప్పటికీ టీడీపీకే పని చేయాలని తన అనుచరులకు కోండ్రు సంకేతాలు ఇచ్చారు. నేనున్నానని భరోసా ఇచ్చి మరీ తెచ్చిన రవికిరణ్కే వెన్నుపోటు పొడవడానికి సిద్ధమయ్యారని దీనితో అర్థమవుతోంది. దీనికి ప్రతిగా.. రాజాం నియోజకవర్గంలో ఉన్న కళా వెంకట్రావు బంధువర్గం మొత్తం కోండ్రుకు సహకరిస్తుంది. రేగిడి, రాజాం మండలాల్లోని కళా అనుచరగణం పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి మరీ కోం డ్రుకు అనుకూలంగా పని చేస్తుంది. అంటే రాజాం నియోజకవర్గలో టీడీపీ అభ్యర్థి ప్రతిభా భారతికి వ్యతిరేకంగా పనిచేస్తారన్న మాట. ఈ మేరకు కళా నుంచి స్పష్టమైన సూచనలు పంపారు. ఇప్పటికే కళా వర్గీయులు ప్రతిభా భారతితో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తాజా మ్యాచ్ పిక్సిం గ్‌తో వారంతా పూర్తిగా ప్రతిభా భారతికి చెయ్యివ్వడం ఖాయమని తేలిపోయింది. జెడ్పీటీసీ ఎన్నికల వరకు ఆమె వెంటే ఉన్న వారంతా ప్రస్తుతం వ్యూహాత్మకంగా తప్పుకుంటున్నారు. ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ప్రభావం కనిపిస్తోంది. దాంతో ఎచ్చెర్ల కాంగ్రెస్ అభ్యర్థి రవికిరణ్, రాజాం టీడీపీ అభ్యర్థి ప్రతిభా భారతిలకు గుబులు పట్టుకుంది. కళా, కోండ్రు తమ రాజకీయ ప్రయోజనాల కోసం తమకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు కొత్త కావడంతో రవి కిరణ్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. కానీ ప్రతిభా భారతి మాత్రం కళాపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కుమ్మక్కు రాజకీయాలు ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీల్లో వర్గపోరును సరికొత్త మలుపు తిప్పుతున్నాయి. -
ఎన్నికలు దాటాక.. వంతెన మరిచారు!
మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ను ఎమ్మెల్యేను చేసిన శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలోని గారన్నాయుడుపేట-పనసపేట గ్రామాల ప్రజల అవస్థకు తార్కాణం ఈ చిత్రం. 2009 ఎన్నికల సమయంలో మురళీమోహన్ ఇక్కడికి ప్రచారానికి వచ్చినప్పుడు.. కాలువపై చిన్నపాటి వంతెన నిర్మిస్తే తమ కష్టాలన్నీ తీరిపోతాయని ప్రజలు మొరపెట్టుకున్నారు. అదెంత పని ఓట్లేసి గెలిపిస్తే చేయించేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ప్రజల ఓట్లతో గెలిచారు. మంత్రి పదవీ చేపట్టారు. కానీ వారికి ఇచ్చిన హామీ మరిచిపోయూరు. ఐదేళ్లు గడిచినా.. సమస్య మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ ప్రమాదకరమైన చెక్కబల్లల వంతెన ఆధారంగానే ప్రజలు కాలువను దాటుతున్నారు. అయితే మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్న కోండ్రుకు ఈసారి అదే ఓటుతో బుద్ధి చెప్పేందుకు స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారు. - న్యూస్‌లైన్, సంతకవిటి, (శ్రీకాకుళం జిల్లా) -
నువ్వే.. నువ్వే!
మరణానికి ముందే పోస్టుమార్టం మొదలైపోయింది. ఆ మరణానికి కారణం మీరంటే.. మీరనే నిందారోపణలు, పరస్పర ఫిర్యాదులు ఊపందుకున్నాయి. అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజల చేతుల్లో ఎలాగూ మరణం(ఓటమి) తప్పదని గ్రహించినట్లున్నారు జిల్లా కాంగ్రెస్ భారాన్ని ప్రస్తుతం మోస్తున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు. దానికి బాధ్యులెవరన్న చర్చ వచ్చి తీరుతుంది. ఆ మచ్చ తమపై పడకుండా అప్రమత్తమవుతున్నారు. అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికలు పూర్తికాకముందే.. ఆ ఎన్నికల్లో ఎదుర్కోబోయే పరాజయానికి బాధ్యత ఎవరన్నదానిపై కేంద్రమంత్రి కృపారాణి, రాష్ట్రమాజీ మంత్రి కోండ్రు మురళీ పరస్పర ఫిర్యాదులకు తెరతీశారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా పార్టీ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని కోండ్రు అధిష్టానం ప్రతినిధులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తన వర్గీయులతో కూడా ఫిర్యాదులు చేయించాలని భావిస్తున్నారు. మరోవైపు కృపారాణి కూడా కోండ్రు మురళీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. కనీసం సొంత నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దర్పం తప్ప బాధ్యత ఏదీ? కృపారాణిపై ఫిర్యాదు జిల్లాలో అధికార స్థానంలో ఉన్న ఏకైక నేత అయినప్పటికీ కృపారాణి పార్టీని పట్టించుకోవడం లేదని కోండ్రు వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలపై ఆమె ఇంతవరకు పార్టీ నేతలతో చర్చించలేదని ఈ వర్గం ఆరోపిస్తోంది. జిల్లా కేంద్రానికి రావడం లేదు.. కనీసం పార్టీ జిల్లా అధ్యక్షుడు డోల జగన్‌తో కూడా చర్చించనే లేదని కృపారాణికి వ్యతిరేకంగా ఫిర్యాదులు గుప్పిస్తోంది. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే సత్యవతితోగానీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు జగన్తోగానీ మాట్లాడటానికి కేంద్రమంత్రి ఇష్టపడటం లేదని కూడా కోండ్రు వర్గం చెప్పుకొచ్చింది. తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లో అన్ని వార్డుల్లో అభ్యర్థులను కూడా పోటీ పెట్టలేని దుస్థితికి పార్టీని దిగజార్చారని ఆరోపిస్తోంది. కృపారాణి ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారు.. అయినా తన భర్త, పార్టీ నాయకుడైన కిల్లి రామ్మోహన్రావుకైనా బాధ్యతలు అప్పగించకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనే పార్టీ పరిస్థితి ఇంతగా దిగజారితే.. ఇక జిల్లా, మండల పరిషత్తు ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని కోండ్రు అధిష్టానానికి స్పష్టం చేశారు. కృపారాణి తీరు ఇలాగే కొనసాగితే పార్టీ ఉనికే ప్రశ్నార్థంగా మారిపోతుందని తేల్చిచెప్పేశారు. అసలు కోండ్రు ఎక్కడున్నారు? కేంద్రమంత్రి ఎదురుదాడి కృపారాణి కూడా అంతే దీటుగా కోండ్రు మురళీపై ఎదురుదాడి చేస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిని గుప్పిట్లో పెట్టుకుని కూడా పార్టీని ఆయన పట్టించుకోవడం మానేశారని అధిష్టానం ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. డోల జగన్ ఇంతవరకు పార్టీ సమావేశం నిర్వహించకపోవడాన్ని కోండ్రు వైఫల్యంగానే ఆమె చెప్పుకొస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గం ఎచ్చెర్ల, ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాంలలోనే అత్యధికంగా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతున్న విషయాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలతో సామరస్యంగా మాట్లాడకుండా కోండ్రు దురుసుగా ప్రవర్తిస్తున్నారని కూడా తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం. అందువల్లే పార్టీలో ఉండాల్సిన కొంతమంది కూడా రాజీనామా బాట పడుతున్నారని కృపారాణి అధిష్టానం ప్రతినిధులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అందుకు పాలకొండ సీనియర్ నేత సామంతుల దామోదర రావు పార్టీ మారడాన్ని ఆమె ఉదాహరణగా చూపుతున్నారు. కోండ్రు మురళి ఇటీవల పాలకొండ వెళ్లినప్పుడు సామంతుల వర్గీయులతో సామరస్యంగా చర్చించకుండా హెచ్చరిక స్వరంతో మాట్లాడారని ఆమె అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. అదే విధంగా శ్రీకాకుళం నియోజకవర్గంతోపాటు మరికొన్ని చోట్ల ఏమాత్రం స్థాయిలేని నేతలకు టిక్కెట్లు ఇప్పిస్తామని ఆయన హామీలు ఇచ్చేస్తుండటంతో పార్టీ మరింతగా దిగజారుతోందని కృపారాణి ఆరోపిస్తున్నారు. ఇలా కోండ్రు, కృపారాణి పరస్పరం ఆరోపణలతో కాంగ్రెస్‌లో విభేదాల కుంపటి రాజుకుంది. రాబోయే పార్టీ ఓటమికి కారణమంటూ ముందస్తుగానే పరస్పరం ఆరోపణలతో కాంగ్రెస్వర్గ విభేదాలు రక్తి కడుతున్నాయి. -
కాంగ్రెస్‌పై పవన్‌కు అంత ఉక్రోశం ఎందుకో?
-
కాంగ్రెస్‌పై పవన్‌కు అంత ఉక్రోశం ఎందుకో?
హైదరాబాద్ : పవన్ కల్యాణ్‌కు కాంగ్రెస్‌పై అంత ఉక్రోశం ఎందుకో చెప్పాలని మాజీ మంత్రులు కొండ్రు మురళి, బాలరాజు సూటిగా ప్రశ్నించారు. సమాజాన్ని పవన్ చదవలేకపోయాడని, అతనికి సమాజంపై పూర్తి అవగాహన లేదని వారు శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. పవన్ అంబేదర్క్, జ్యోతిరావు పూలేలను పొడగలేదని ఈ సందర్భంగా కొండ్రు, బాలరాజు గుర్తు చేశారు. ఎస్సీ, బీసీలకు కాంగ్రెస్ పార్టీలో తప్ప మరేపార్టీలోను గౌరవం ఉండదని వారు అన్నారు. ఈ వాస్తవాలను గ్రహించి పవన్ మాట్లాడి ఉంటే బాగుండేదని మాజీమంత్రులు సూచించారు. ఒకరిద్దరి అండ చూసుకుని పవన్ రెచ్చిపోయాడని కొండ్రు విమర్శించారు. -
కాంగ్రెస్‌కు గుడ్‌బై
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు గుడ్‌బై చెబుతున్నారు. గురువారం హొంజరాంలో సమావేశమైన నేతలు, కార్యకర్తలు మాజీ మంత్రి కోండ్రు మురళిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు వెల్లడించిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నామని ప్రకటించారు. వీరఘట్టం, న్యూస్‌లైన్: పాలకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వీరఘట్టం మండలం క్యాడర్ మొత్తం టాటా... బైబై చెప్పేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే సుగ్రీవులకు ఇక్కడ మంచి ఆదరణ ఉండేది. రాష్ర్ట విభజనకు ప్రధాన కారణమైన పార్టీలో కొనసాగేందుకు సిగ్గుపడుతూ ఒక్కొక్కరు భవిష్యత్‌ను వెతుక్కుంటున్నారు. 2005లో జరిగిన స్థానిక ఎన్నికల సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున సిఫార్సులు, లాబీయింగ్‌లు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యూ కట్టేవారు. ఇప్పుడు పిలిచి టిక్కెట్లు ఇస్తామన్నా తీసుకొనేవారు కరువయ్యారు. దీంతో ఎమ్మెల్యేకు ఏమి చేయాలో తెలియడం లేదు. బుజ్జగింపులు చేస్తున్నా విభజన పాపం ఎవరిదంటూ కార్యకర్తలు నిలదీస్తుండడంతో ఎమ్మెల్యే తెల్లమొహం వేస్తున్నారు. -
దళితులకు నీవు చేసిందేమిటి?
విశాఖపట్నం: మంత్రి కోండ్రు మురళికి చేదు అనుభవం ఎదురైంది. విశాఖలో సోమవారం కేంద్రమంత్రి జైరాం రమేష్ దళిత సంఘాలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కోండ్రు ప్రసంగిస్తుండగా దళిత సంఘాల సమాఖ్య ప్రతినిధులు అడ్డుకున్నారు. దళితులకు నీవు చేసిందేమిటి? దళిత మంత్రివైన్పటికీ సొంత నియోజకవర్గం దళితులకు ఏమి చేశావ్? అని నిలదీశారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేట ఘటనలో ఆరుగురు దళితులు చనిపోయారు వారికి ఏం న్యాయం చేశావా? అంటూ ఆగ్రహంతో ప్రశ్నించడంతో సమావేశం రసాభాసగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని శాంతింపజేశారు. సమావేశం అనంతరం బయటకు వచ్చాక కూడా వారు మంత్రితో వాగ్వాదానికి దిగారు. -
పాలనా ప్రహసనం.. ముగిసింది
అనూహ్య పరిస్థితుల్లో శాసనసభ స్తుప్తాచేతనావస్థలోకి జారుకుంది. రాష్ట్రపాలన రాష్ట్రపతి చేతుల్లోకి వెళ్లిపోయింది. మంత్రులు మాజీలయ్యారు. త్వరలో ఎన్నికలకు వెళుతున్న తరుణంలో గత ఐదేళ్లలో మన ప్రజాప్రతినిధులు.. ముఖ్యంగా అధికార భోగాలను అనుభవించిన మంత్రి పుంగవులు జిల్లాకు ఏం చేశారని ఒక్కసారి వెనుదిరిగి చూస్తే.. ఒక్క ధర్మానను మినహాయిస్తే.. మిగతావారు చెప్పుకొనేందుకు ఏమున్నది గర్వకారణం.. అంతా నిరాశే తప్ప.. అన్న నిట్టూర్పే మిగులుతుంది. పక్క జిల్లా నుంచి వచ్చి ఇక్కడి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన శత్రుచర్ల.. రాజాంకు మారి రాజయోగం అబ్బిన కోండ్రు జిల్లాకు చేసింది శూన్యమేనని చెప్పకతప్పదు. : కోటి ఆశలతో ఆరంభం.. అంతలోనే మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణం.. దిశా నిర్దేశం లేని ప్రభుత్వాలు.. ప్రజల బాగోగు లు పట్టని మంత్రులు.. ఇవి చాలవన్నట్లు తెలుగుజాతిని చీల్చిన విభజన చిచ్చు... చివరికి రాష్ట్రపతి పాలనలోకి వెళ్లడంతో ప్రస్తుత అసెంబ్లీ ప్రస్థానం ముగిసింది. ప్రహసనప్రాయంగా మారిన పాలనకు తెరపడింది. 2009లో కాంగ్రెస్‌కు ప్రజలు కట్టబెట్టిన అధికారం బూడిదలో పోసిన పన్నీరైంది. జిల్లాకు ఇది చేశామని చెప్పుకోవడానికి కూడా లేని దుస్థితిలో రాష్ట్ర మంత్రులు డమ్మీలైపోయారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో జిల్లా ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. 2009 ఎన్నికల్లో ప్రజల తీర్పు సారంశం ఒక్కటే. 2004-09లో సంక్షేమ రాజ్యాన్ని అందించిన వైఎస్‌ను మళ్లీ సీఎం చేయడమే. అందుకే జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఏకంగా 9 చోట్ల కాంగ్రెస్‌ను గెలిపించారు. ప్రజలు ఆశించిన విధంగానే వై.ఎస్. సీఎం అయ్యారు కానీ విధి వక్రీకరించింది. రెండోసారి అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే 2009 సెప్టెంబరు 2న ఆయన హఠాన్మరణం చెందారు. పిడుగుపాటులాంటి ఈ దుర్ఘటన జిల్లా ప్రగతికి గొడ్డలిపెట్టుగా పరిణమించింది. మంత్రులు ముగ్గురు.. ప్రగతి పిడికెడే! 2009-14 మధ్య కాలంలో జిల్లా నుం చి ముగ్గురు ప్రతినిధులు రాష్ట్ర మంత్రులుగా చేశారు. వై.ఎస్. మూడు నెలల పాలనను మినహాయిస్తే మిగిలిన పరిపాలనా కాలమంతా మాటలతోనే కాలక్షేపం చేశారని చెప్పొచ్చు. ఈ కాలంలో జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజు, కోండ్రు మురళీమోహన్‌లు మంత్రులుగా చేశారు. వీరిలో ధర్మాన చాలావరకు నయం. శత్రుచర్ల, కోండ్రు మురళీలు పూర్తిగా విఫలమయ్యారు. దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం -ధర్మాన ఎంతో నయం వైఎస్ ప్రభుత్వంలో చూపించిన జోరును కొనసాగించకపోయినా.. తనకున్న అనుభవంతో, నిధులు రప్పించే సామర్థ్యంతో కొంతవరకు నెట్టుకువచ్చారు. రోశయ్య ప్రభుత్వంలో కూడా ధర్మాన రెవెన్యూ మంత్రిగా కొనసాగారు. ఈ సమయంలోనే అరసవల్లిలో టీటీడీ కల్యాణ మండపం, పర్యాటక శాఖ బడ్జెట్ హోటల్‌ను మంజూరు చేయించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ధర్మాన ప్రభ కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. ఆయనను కీలకమైన రెవెన్యూ శాఖ నుంచి తప్పించి ఆర్ అండ్ బి శాఖ కేటాయించారు. ఈ శాఖ మంత్రిగా ధర్మాన జిల్లాకు ఏకంగా మూడు ప్రధాన వంతెనలు మంజూరు చేయించారు. జిల్లా కేంద్ర ప్రజల చిరకాల కోరిక అయిన పొన్నాడ వంతెన దాదాపు పూర్తి కావచ్చింది. శ్రీకాకుళం పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. అదే విధంగా పాదయాత్రలో వైఎస్ ఇచ్చిన హామీని ఆచరణలోకి తీసుకువచ్చారు. జలుమూరు మండలం కొమ్మనాపల్లి వద్ద వంశధార నదిపై వంతెన నిర్మాణం చేపట్టారు. ఇక జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో రోడ్లకు మహర్దశ కలిగిందనే చెప్పాలి. కళింగ రోడ్డు, జీటీ రోడ్డు, జెడ్పీ రోడ్లను విస్తరించారు. అరసవల్లి జంక్షన్ నుంచి కలెక్టరేట్‌కు 80 అడుగుల రహదారి నిర్మించారు. నవభారత్ జంక్షన్ నుంచి పాతవంతెన, రామలక్ష్మణ జంక్షన్ మీదుగా పెద్దపాడు వరకు ప్రధాన రహదారిని విస్తరించారు. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని వేధించేందుకు కాంగ్రెస్ అధిష్టానం పన్నిన కుట్రలో ధర్మాన కూడా బాధితుడయ్యారు. సీబీఐ చార్జిషీట్లో తన పేరును కూడా చేర్చడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అక్రమంగా తనను ముద్దాయిని చేసిన కాంగ్రెస్‌లో కొనసాగలేనని చెప్పి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. హోదాకే మంత్రి - శత్రుచర్ల తీరు ఇదీ! ‘ఆరో వేలు’ మాదిరిగా మారిపోయింది మంత్రి శత్రుచర్ల వ్యవహారం. ఆయన మంత్రి అనే విషయాన్నే ప్రజలు పెద్దగా గుర్తించలేదనే చెప్పొచ్చు. రోశయ్య ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా పని చేసిన ఈ ఐదేళ్లలో ఆయన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించిన సందర్భం దాదాపు లేదనేది విస్మయకర వాస్తవం. ఒక్కసారి కూడా ఉన్నతాధికారులతో తన శాఖ వ్యవహారాలుగానీ, జిల్లా ప్రగతి గురించి కనీసం చర్చించలేదు. డీఆర్సీ వంటి సమావేశాలకు మొక్కుబడిగా హాజరుకావడం మినహా అధికార కార్యక్రమాలను ఏమాత్రం పట్టించుకోలేదు. తన నియోజకవర్గమైన పాతపట్నానికే ఎప్పుడోగానీ వచ్చేవారు కాదు. వచ్చిన సందర్భాల్లో కూడా చిన్న చిన్న కార్యక్రమాలకే పరిమితమయ్యేవారు. ఇక జిల్లా కేంద్రానికి ఆయన వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కెట్టొచ్చు. వరుసగా వారం రోజులు ఎప్పుడూ జిల్లాలో లేని ఆయనకు చెప్పుకోవడానికి ఇంకేముంటుంది! ఆత్రం.. ఆరాటం... ఆచరణ శూన్యం - ఇదీ కోండ్రు కథ మంత్రి కావాలన్న రాజకీయ లక్ష్యాన్ని సాధించిన కోండ్రు మురళీ జిల్లాకు చేసింది మాత్రం ఏమీ లేదు. కిరణ్ ప్రభుత్వంలో ఆయనకు మంత్రియో గం ప్రాప్తించింది. కీలకమైన వైద్యవిద్య, ఆరోగ్యశ్రీ, 108,104 శాఖలను కేటాయించారు. మంత్రి హోదాను తన రాజకీయహంగు, ఆర్భాటాలకే ఆయన వినియోగించుకున్నారన్న విమర్శలున్నాయి. జిల్లాలో రిమ్స్ సమస్యల పరిష్కారంపై కూడా ఆయన దృష్టి పెట్టలేదు. అదనపు సీట్లు ఆశించిన రీతిలో సాధించలేదు. రిమ్స్ విస్తరణ పూర్తికాలేదు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 108, 104 సేవలు పడకేశాయి. ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ రెండు సేవలు నిర్వీర్యం కావడం ఆయన వైఫల్యమేనని చెప్పొచ్చు. పేదల ప్రజల సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకం కోండ్రు హయాంలో నీరుగారిపోయిం ది. దాదాపు 133 రోగాలను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధి నుంచి తప్పిం చింది. తన నియోజకవర్గం రాజాంకు కూడా కోండ్రు చేసిందేమీ లేదు. కీలకమైన రాజాం రైల్వే లైన్‌ను సాధించలేకపోయారు. పారిశ్రామిక కేంద్రంగా పేరుగాంచిన రాజాంలో కొత్త ప్రాజెక్టులు తేలేకపోయారు. వెరసి జిల్లా మంత్రుల పదవీకాలం నిరాశాజనకంగా ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా ప్రగతి పడకేసింది. -
చివరి వరకూ కాంగ్రెస్‌లోనే ఉంటా....
న్యూఢిల్లీ : సీమాంధ్రలో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి సారించింది. రాష్ట్ర విభజనపై ఆగ్రహంగా ఉన్న సీమాంధ్ర ప్రజలను శాంతింప చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సీమాంధ్ర మంత్రులతో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ బుధవారం ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా మంత్రులకు సోనియా పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. భేటీ అనంతరం మంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ విభజన విషయంలో తమ సమస్యలను సోనియా సావధానంగా విని, సానుకూలంగా స్పందించారన్నారు. విభజన నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్రలో పార్టీ కార్యకర్తలు నిస్తేజంగా ఉన్నారని, వారిలో ఉత్తేజం నింపాల్సిన అవసరం ఉందని తెలిపామన్నారు. విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, 2014 ఎన్నికల్లో అన్ని సీట్లు గెలుచుకోలేమని సోనియాకు వివరించినట్లు కొండ్రు చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కాకుండా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఎన్నికలకు మరికొంత సమయం ఇస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని సోనియాకు తెలిపామన్నారు. తాను చివరివరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని.... సోనియాగాంధీ, రాహుల్ నాయకత్వంలో పని చేయటం గర్వంగా ఉందని కొండ్రు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి సీమాంధ్రలో పర్యటించాలన్న మంత్రుల సూచనకు సోనియా అంగీకరించరించినట్టు సమాచారం. -
కిరణ్.. ఆరోపణలు చేయించొద్దు: కొండ్రు
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత మీడియా పెట్టుకొని తమపై వ్యక్తిగత ఆరోపణలు చేయిస్తున్నారని.. ఈ పద్ధతి వీడకపోతే తామూ చాలా విషయాలు బయటపెట్టాల్సి ఉంటుందని మంత్రి కొండ్రు మురళీమోహన్ హెచ్చరించారు. ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్‌నే కిరణ్ నేడు దూషించడం సిగ్గుచేటన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కిరణ్‌కుమార్‌రెడ్డి ఐ న్యూస్ ఛానెల్లో రూ. 25 కోట్లు పెట్టుబడి పెట్టారు. దాని నిర్వహణ బాధ్యతలు ఆయన తమ్ముడు సంతోష్‌కుమార్‌రెడ్డి చూస్తున్నారు. ఆ చానెల్లో నాపై, బొత్స, ఆనం, రఘువీరా, కన్నా లక్ష్మీనారాయణ, బాలరాజుపై రోజుకో రకమైన ఆరోపణలతో కథనాలు వేయిస్తున్నారు. ఇది మంచి పద ్ధతి కాదు. ఇదే కొనసాగితే మేము కూడా చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిలో నాయకత్వ లక్షణాలున్నాయని.. కిరణ్‌లో అవి కూడా లేవన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానంటూ సీమాంధ్ర ప్రజల్ని కిరణ్ మోసగించారని ఆరోపించారు. సీమాంధ్ర సమస్యలు చెప్పేందుకు అవకాశం లేకుండా తమ గొంతునొక్కేశారని దుయ్యబట్టారు. -
'జగన్‌కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి'
హైదరాబాద్ : అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉందని మంత్రి కొండ్రు మురళి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ తాము ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అన్నా రావాలి లేదా... ఇంకో కొత్త ప్రభుత్వం అన్నా రావాలని కొండ్రు వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విభజించమని కేంద్రానికి లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్రకు న్యాయం జరగలేదని ముసలి కన్నీరు కారుస్తున్నారని కొండ్రు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీమాంధ్రకు ఆర్థిక ప్యాకేజీ, పోలవరంకు జాతీయ హోదా ఇవ్వడాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. సమైక్యాంధ్ర అంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కొండ్రు మురళి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆ నాయకత్వ లక్షణాలు కూడా లేవని ఆయన విమర్శించారు. కిరణ్ తో అన్ని అంశాలు చర్చించిన తర్వాతే హైకమాండ్ విభజనపై నిర్ణయం తీసుకుందన్నారు. సీఎం మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమైక్య సెంటిమెంట్ రెచ్చగొట్టారని కొండ్రు మురళి అన్నారు. కాంగ్రెస్‌ను వీడామంటున్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను నేరుకు స్పీకర్‌కు లేదా పీసీసీకి కానీ ఇవ్వాలన్నారు. దొంగ రాజీనామాలు చేసి కాంగ్రెస్‌ను టార్గెట్ చేయవద్దని హితవు పలికారు. -
ఎవరు కొత్త పార్టీ పెట్టినా జనం ఛీ కొడతారు:కొండ్రు
-
కిరణ్‌పై కొండ్రు తిరుగు బావుటా!
హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ నేతలు తమ భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి కొండ్రు మురళి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నిన్న మొన్నటి వరకూ క్రమశిక్షణ గల కార్యకర్త అంటూ కిరణ్‌ను సమర్థించిన కొండ్రు హఠాత్తుగా స్వరం మార్చి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కొత్తపార్టీ పెడితే ప్రజలే ఛీ కొడతారని అన్నారు. ఇచ్చిన పదవిని ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారని కొండ్రు మండిపడ్డారు.. అవినీతిపురులకు పదవులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టారని కొండ్రు తెలిపారు. బొత్స నివాసంలో సాయంత్రం జరిగే సమావేశంలో ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కాగా ఈ రోజు ఉదయం బొత్స సత్యనారాయణతో సీమాంధ్ర మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీకి మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్, కాసు కృష్ణారెడ్డి, టీజీ వెంకటేష్, బాలరాజు, కొండ్రు మురళి తదితరులు ఉన్నారు. మరోవైపు మంత్రి మహీధర్ రెడ్డి ....ముఖ్యమంత్రి కిరణ్‌ను కలిశారు. -
పంతాల పేటముడి!
ఒకరు కేంద్ర మంత్రి.. ఇంకొకరు రాష్ట్ర మంత్రి.. ఇద్దరిదీ ఒకటే పంతం.. తమ మాటే నెగ్గాలి.. తాము చెప్పిన వారికే టిక్కెట్ దక్కాలి. నరసన్నపేట కేంద్రంగా ఈ పీటముడి బిగుసుకుంటోంది. కోండ్రు ఒకరికి దన్నుగా నిలిస్తే.. కృపారాణి ఇంకొకరికి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. జిల్లాపై ఆధిపత్యమే లక్ష్యంగా అమాత్యులు వేస్తున్న ఈ ఎత్తులు పైఎత్తులు ఎన్నికల్లో పార్టీని ఎటూ తీసుకుపోతాయోనని కాంగ్రెస్ శ్రేణులు కంగారు పడుతున్నాయి. పంతాలు వీడకపోతే.. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టకపోతే ఎన్నికల్లో పార్టీ మట్టికొట్టుకుపోతుందని ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కేంద్ర, రాష్ట్ర మంత్రులు కృపారాణి, కోండ్రు మురళీల చెలగాటం జిల్లా కాంగ్రెస్‌కు ప్రాణసంకటంగా పరిణమిస్తోంది. పార్టీలో మిగిలిన కొద్దిమంది నేతలు వీరిద్దరి ఆధిపత్య పోరులో నలిగిపోతున్నారు. ఆధిపత్యం ఎవరిదో తెలీదు గానీ.. ఇద్దరూ పంతానికి పోతున్నారు. దీనికి నరసన్నపేట నియోజకవర్గ టిక్కెట్ వ్యవహారమే తాజా తార్కాణం. జిల్లా పార్టీపై పట్టు సాధించేందుకు దీన్నే సాధనంగా చేసుకున్నారు. ఇక్కడి టిక్కెట్ ఇప్పిస్తానని డోల జగన్‌కు మంత్రి కోండ్రు అభయహస్తం ఇవ్వగా.. ఆయనెవరు ఇవ్వడానికి.. మీదే ఆ టిక్కెట్టు అంటూ కేంద్ర మంత్రి కృపారాణి శిమ్మ కుటుంబానికి వెన్ను తడుతున్నారు. దాంతో వ్యవహారం తెగే వరకు సాగేలా ఉందని కాంగ్రెస్‌వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. కోండ్రు తహతహ మంత్రి అయినప్పటికీ జిల్లాలో ఎక్కడా పట్టు లేకపోవడంతో మంత్రి కోండ్రు మురళీ కొంతకాలంగా అసహనంగా ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇతర నియోజకవర్గాల్లోకి చొచ్చుకుపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు డీసీసీబీ అధ్యక్షుడు డోల జగన్‌తో కలిసి ముందుగానే వ్యూహరచన చేశారు. నరసన్నపేట టిక్కెట్ ఇప్పిస్తానని చెప్పారు. ఆ నియోజకవర్గంలో సంప్రదాయంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న సామాజికవర్గానికి వ్యతిరేకంగా డోలను తెరపైకి తెచ్చారు. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స, కేంద్ర మంత్రి చిరంజీవిలతో కూడా మాట్లాడి మార్గం సుగమం చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కృపారాణిని మాటమాత్రంగానైనా సంప్రదించ లేదు. డోల జగన్ పూర్తిగా తమ సన్నిహితుడిగానే ఉండాలన్నది మంత్రి మురళీ ఉద్దేశం. తద్వారా కృపారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కూడా తన వర్గాన్ని పెంచుకోవాలన్నది ఆయన లక్ష్యం. అంతా తాను అనుకున్నట్లే సాగుతోందని ఆయన ధీమాగా ఉన్న తరుణంలో కృపారాణి ప్రతిదాడికి దిగారు. తెర పైకి శిమ్మ కుటుంబం తన నియోజకవర్గ పరిధిలో కోండ్రు జోక్యాన్ని కేంద్ర మంత్రి కృపారాణి ఏమాత్రం సహించలేకపోయారు. తొలి దశలోనే ఆయన్ను అడ్డుకోవాలని నిర్ణయించారు. డోల జగన్ అవకాశాలకు గండి కొట్టేందుకు వ్యూహాత్మకంగా శిమ్మ కుటుంబాన్ని తెరపైకి తెచ్చారు. నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే శిమ్మ ప్రభాకర్‌రావు దంపతులను ఇటీవల సంప్రదించారు. నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గానికి కాకుండా ఇతరులకు అవకాశం ఇవ్వాలని మంత్రి మురళీ ప్రయత్నిస్తున్నారని వారితో చెప్పారు. అలా కాకుండా సంప్రదాయంగా ఆధిపత్యం సాగిస్తున్న సామాజికవర్గానికే టిక్కెట్టు ఇచ్చేలా పార్టీ అధిష్టానాన్ని ఒప్పిస్తానని చెప్పారు. శిమ్మ ప్రభాకర్‌రావు భార్య ఉషారాణిని అభ్యర్థిగా నిలుపుతామని కూడా హామీ ఇచ్చేశారు. అలా అయితే తన లోక్‌సభ నియోజకవర్గంలో సామాజికవర్గ సమీకరణల సమతూకం సాధ్యమవుతుందని కూడా అధిష్టానానికి వివరిస్తానని చెప్పారు. ఈ ప్రతిపాదనపై శిమ్మ దంపతులు తమ తుది నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ పరిణామాలు మాత్రం కోండ్రు, కిల్లిల మధ్య ఆధిపత్య పోరు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. కృపారాణి అనూహ్యంగా చేసిన ప్రతిదాడితో మంత్రి మురళీ ఆత్మరక్షణలో పడిపోయారు. జిల్లా పార్టీపై పట్టు సాధించాలన్న తన వ్యూహానికి కృపారాణి గండికొడతారని ఆయన ఊహించలేదు. నరసన్నపేట కేంద్రంగా మొదలైన ఆధిపత్య పోరు జిల్లా అంతటా వ్యాపించి పార్టీకి ఉన్న కొనఊపిరినీ కూడా తీసేసేలా ఉందని కాంగ్రెస్ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. -
సిగపట్ల సంబరం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లా సాంస్కృ తిక వైభవాన్ని చాటి చెప్పాల్సిన సిక్కోలు సంబరాలు.. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఆధిపత్య పోరుకు ఆజ్యం పోస్తున్నాయి. అసలే జిల్లాపై పెత్తనం కోసం ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్న రాష్ట్ర మంత్రి కోండ్రు మురళి, కేంద్ర మంత్రి కృపారాణి చివరికీ సంబరాలనూ విడిచిపెట్టలేదు. ఈ నెల 28 నుంచి జరగాల్సిన ఈ ఉత్సవాలు ఇప్పటికే వాయిదా పడగా.. తిరిగి ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై వీరిద్దరి పట్టుదల కారణంగా పీటముడి పడింది. మింగమంటే కప్పకు కోపం... వదలమంటే పాముకు కోపం అన్న చం దంగా ఉన్నతాధికారులు ఇరకాటంలో పడ్డారు. దాంతో అసలు సంబరాల నిర్వహణే ప్రశ్నార్థకంగా మారింది. ఫిబ్రవరి రెండో వారంలోనే:కోండ్రు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో సిక్కోలు సంబరాలు నిర్వహించడమేమిటని మంత్రి కోండ్రు ఆగ్రహించినట్లు తెలుస్తోంది. తామం తా హైదరాబాద్‌లో ఉన్న సమయంలో జిల్లాలో మీరు సంబరాలు చేసుకుంటారా అని ఆయన అధికార యంత్రాంగాన్ని నిలదీశారని సమాచారం. నెలాఖరు వరకు అసెంబ్లీ ఉంటుంది.. తర్వాత రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి 7న ఉన్నందున తాము రాలేమని ఆయన తేల్చిచెప్పారు. అందువల్ల ఫిబ్రవరి రెండో వారంలో సంబరాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ప్రజాప్రతినిధుల తరపున తానీ మాటలు చెబుతున్నానని, పాటించాల్సిందేనని హుకుం జారీ చేశారు. తద్వారా తన మాటే వినాలన్న సంకేతాన్ని ఆయనఅధికారులకు పంపించారు. దాంతోపాటే ఉత్సవాలను కృపారాణి హైజాక్ చేయకుండా అడ్డుకట్ట వేశారు. ఆయన ఆదేశాలకు జిల్లా యంత్రాంగం తలొగ్గింది. సంబరాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి తేదీ మాత్రం ఇంకా ప్రకటించలేదు. కృపారాణి కస్సుబుస్సు కాగా సంబరాలు వాయిదా పడటం, దాని వెనుక పరిణామాలు కేంద్రమంత్రి కృపారాణిని అసంతృప్తికి, ఆగ్రహానికి గురి చేశాయి. ఉత్సవాలను వాయిదా వేయడం కంటే, మంత్రి కోండ్రు ఆదేశాల మేరకు ఫిబ్రవరి రెండోవారంలో నిర్వహించడానికి అధికారులు సమ్మతించడం ఆమెకు మింగుడు పడటం లేదు. ఫిబ్రవరి 5 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. దాంతో మంత్రి కృపారాణి ఢిల్లీలో ఉండాల్సిందే. తాను లేకుండా సంబరాలు ఎలా నిర్వహిస్తారని ఆమె అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రాష్ట్రమంత్రి చెబితే వాయిదా వేశారు సరే.. మరి కేంద్ర మంత్రిగా ఉండాల్సిన అవసరం లేదా అని ఆమె నిలదీస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తన ఆమోదంతోనే సిక్కోలు సంబరాల తేదీలను ఖరారు చేయాలని స్పష్టం చేశారు. అంటే పార్లమెంటు సమావేశాలు ముగిసే ఫిబ్రవరి 25 వరకు జరపరాదని ఆమె చెప్పకనే చెప్పారు. సంకటంలో అధికార యంత్రాంగం ఈ పరిణామం జిల్లా అధికార యంత్రాంగాన్ని సంకట స్థితిలోకి నెట్టేసింది. రాష్ట్ర మంత్రి చెప్పినట్లు సిక్కోలు సంబరాలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించాలా?... కేంద్ర మంత్రి చెప్పినట్లు ఏకంగా ఫిబ్రవరి చివరి వారానికి వాయిదా వేయాలా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. కాగా ఫిబ్రవరి చివరివారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే మంత్రుల ఆధ్వర్యంలో సంబరాల నిర్వహణ సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో ఉన్నతాధికారులకు పాలుపోవడం లేదు. -
'కాంగ్రెస్ హైకమాండ్‌ను ధిక్కరిస్తే వేటు తప్పదు'
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చురాజేస్తున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్‌ను ధిక్కరిస్తూ రెబెల్స్ ఎన్నికల బరిలో దిగుతుండగా, వారికి కొందరు ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తున్న ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండ్రు మురళి చెప్పారు. రాజ్యసభ ఎన్నికలు, తిరుగుబాటు దారులపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారిస్తోందని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే నాయకులపై వేటుతప్పదని మురళి హెచ్చరించారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా టీ సుబ్బిరామి రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా చైతన్య రాజు, ఆదాల ప్రభాకర రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. మరో నేత జేసీ దివాకర్ రెడ్డి కూడా ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది. -
`ఆయన కొత్త పార్టీ ఊహజనితమే`
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో దశాబ్ధాల అనుబంధం ఉందని, ఆయన కొత్త పార్టీ పెట్టడమనేది ఊహజనితమేనని మంత్రి కొండ్రు మురళి వ్యాఖ్యానించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో విభజన బిల్లుపై చర్చ జరగాల్సిందేనని మంత్రి కొండ్రు మురళి డిమాండ్ చేశారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగకుంటే విభజనకు అనుకూలమని కేంద్రం భావిస్తుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా సమైక్య తీర్మానం కోసం పట్టుబతామని కొండ్రు చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడినా పార్టీకి వచ్చే నష్టమేమి లేదని ఆయన తెలిపారు. పార్టీని కాపాడటానికి ద్వితీయ శ్రేణి నాయకత్వం పటిష్టంగా ఉందని మంత్రి కొండ్రు మురళి చెప్పారు. -
కాంగ్రెస్ పార్టీలో 'కండువా' కలకలం
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో 'కండువా' కలకలం రేగింది. సీమాంధ్ర నాయకులు కత్తులు దూసుకునేందుకు 'కండువా' ఆజ్యం పోశాయి. కాంగ్రెస్ పార్టీని వదిలివెళ్లే నేతలపై పీసీసీ అధ్యక్షుడు సత్తిబాబు చేసిన కామెంట్స్ చిచ్చు రేపాయి. కాంగ్రెస్‌ను వీడి వేరే పార్టీల్లో చేరేందుకు 'కర్చీఫ్' వేసిన నాయకులు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని ఆయన సెలవిచ్చారు. అయితే పక్కపార్టీలోకి వెళ్లాలన్న ఉద్దేశంతో సొంత పార్టీపై విమర్శలు చేస్తే మాత్రం ఉపేక్షించబోమని సత్తిబాబు హెచ్చరించారు. మంత్రులను కూడా వదిలిపెట్టబోమన్నారు. బొత్స వ్యాఖ్యలపై మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయి మాటల యుద్ధానికి దిగారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ ఖాళీ అవుతుందని పెట్టుబడుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. నేతలు ఇతర పార్టీల వైపు చూడటం కాదని... పార్టీలే ఇతర పార్టీలపై కండువాలు వేస్తున్న సమయమిది అని చురక అంటించారు. గంటా వ్యాఖ్యలపై మంత్రి కొండ్రు మురళీ మండిపడ్డారు. వేరే పార్టీలో 'కర్చీఫ్' వేసుకుని కాంగ్రెస్‌ను విమర్శిస్తే సహించబోమని హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్, గంటా శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలతో మంత్రి పితాని సత్యనారాయణ శృతి కలిపారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే పార్టీ ఖాళీ అవుతుందని పితాని పేర్కొన్నారు. 'కండువా' వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఇంకెంత దూరం వెళతాయో చూడాలి. -
గంటా, లగడపాటిపై చర్యలు తీసుకోవాలి: కొండ్రు
శ్రీకాకుళం: రాష్ట్ర విభజన అంశంలో అధిష్టానం చెప్పినట్లే నడుచుకుంటామని మంత్రి కొండ్రు మురళి స్పష్టం చేశారు. అధిష్టానంకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని ఆయన బుధవారమిక్కడ హెచ్చరించారు. ఒకవేళ విభజన అనివార్యమైతే సీమాంధ్రకు అన్యాయం జరగదని కొండ్రు తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు, లగడపాటి రాజగోపాల్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా గంటా శ్రీనివాసరావు, లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. విభజన విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వారు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. -
అగ్ని ప్రమాదాల్లో 21 ఇళ్లు దగ్ధం
శ్రీకాకుళం రూరల్/సంతకవిటి, న్యూస్‌లైన్: జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన అగ్నిప్రమాదాల్లో 21 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. శ్రీకాకుళం రూరల్ మండలం నైరా పంచాయతీ పరిధి వెంకటాపురంలో బుధవారం రాత్రి జరిగిన సంఘటనలో 7 పురిపాకలు కాలిపోయాయి. సంతకవిటి మండలం అక్కరాపల్లిలో మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు జరిగిన ప్రమాదంలో 8 మిద్దె ఇళ్లు, 6 పురిపాకలు కాలిబూడిదయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. వివరాలు ఇవీ... శ్రీకా కుళం రూరల్ మండలం నైర పంచాయతీ పరిధి వెం కటాపురంలో బుధవారం రాత్రి 8.30 గంటల సమ యంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో కోనారి కృష్ణ, కోనారి మల్లేసు, కోనారి తవిటమ్మ, కోనారి నారా యుడు, కోనారి శిమ్మయ్య, కోనారి సూర్యనారాయణ, కోనారి రామయ్య ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఆమ దాలవలస అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. స్థాని కులు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బొబ్బాది చంద్రమౌళి, అనిల్‌కుమార్, సర్పంచ్ కర్రి కృష్ణమోహాన్, అరవల రాంప్రతాప్ తదితరులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని సర్పంచ్ తదితరులు కోరారు. ఇదిలా ఉండగా సంతకవిటి మండలం అక్కరాపల్లిలో మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 14 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. రూ 7 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. దేవుడి వద్ద పెట్టిన దీపం అంటుకోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. కార్తీక ఏకాదశి కావడంతో అర్ధరాత్రి 12 గంటలకే అక్కరాపల్లిలోని యాదవుల వీధిలో ఉంటున్న పలువురు స్నానాలు చేసి శంకరంపేటలోని సత్యనారాయణస్వామి కోవెలకు వెళ్లారు. వీళ్లల్లో కొందరు ఇళ్లల్లో దేవుడి వద్ద దీపాలు వెలిగించారు. ఆ తర్వాత ఏం జరి గిందో తెలియదుగాని ఒక్కసారిగా మంటలు కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తమై మంటలను అదుపుచేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో గాలులు వీచడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. యువకులు అప్రమత్తంగా వ్యవహరించి ఇళ్లల్లో ఉన్న వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకురావడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో కరగాన గరికయ్య, రాము, తవుడు, రామారావు, గొంటు రాములమ్మ, నరసయ్య, రాములు, సూర్యారావులకు చెందిన మిద్దె ఇళ్లతోపాటు తూలుగు అక్కలనాయుడు, బూర్లె జోగినాయుడు, శాసపు జయమ్మ, రాగోలు రామరావు, కరగాన అప్పలస్వామి, కరగాన రమణలకు చెందిన పురిపాకలు అగ్నికి ఆహుతయ్యాయి. పూజకు వెళ్లిన వారెవరూ సెల్ఫోన్లు తీసుకువెళ్లకపోవడంతో వారికి వెంటనే సమాచారం అందలేదు. తెల్లవారుజామున 3 గంటలకు తిరిగివచ్చినప్పటికి ఇళ్లన్నీ కాలిబూడిదవడాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ ప్రమాదంలో గరికయ్యకు చెందిన రూ 50 వేల నగదుతో పాటు రెండున్నర తులాల బంగారం పుస్తెలు తాడు కాలిపోయింది. కరగాన రాముకు చెందిన రూ 30 వేల నగదు, అరతులం బంగారం, తవుడు ఇంట్లో రూ 20 వేల నగదు, రామారావుకు చెందిన రూ 10 వేల నగదు, వెండి వస్తువులు, నరసయ్యకు చెందిన రూ 15 వేల నగదు, అరతులం బంగారం కాలిపోయాయి. సంఘటన స్ధలాన్ని తహశీల్దార్ బి.సూరమ్మతో పాటు ఆర్ఐ ప్రవీణ్‌కుమార్, వీఆర్వో మల్లేశ్వరరావు తదితరులు పరిశీలించారు. ఇదిలా ఉండగా మంత్రి కోండ్రు మురళీమోహన్ పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ 5 వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు. -
ఏ నిమిషంలోనైనా విభజన ఆగిపోవచ్చు: కొండ్రు మురళి
శ్రీకాకుళం: ఏ నిమిషంలోనైనా రాష్ట్ర విభజన ఆగిపోవచ్చని మంత్రి కొండ్రు మురళి ఆశాభావం వ్యక్తం చేశారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు సీమాంధ్రకు ప్యాకేజీలు ఏమీ కోరలేదని చెప్పారు. సమైక్యరాష్ట్రం కోసం తమ పోరాటం కొనసాగిస్తామని మంత్రి అన్నారు. ఒక పక్క కేంద్రం దూకుడు మీద విభజన చర్యలు చేపడుతుంటే, మంత్రులు తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతన్నారు. ఈ విధంగా రోజుకో రకంగా మంత్రులు మాట్లాడి ప్రజలను ఆయోమయానికి గురిచేస్తున్నారు. -
హెల్త్‌కార్డుల మార్గదర్శకాలు జారీ
శుక్రవారం అర్ధరాత్రి జీవోలు సాక్షి, హైదరాబాద్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల నగదురహిత వైద్యానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. గత రెండేళ్లుగా వివిధ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపినా... ఉద్యోగ సంఘాల అభ్యంతరాలతో చర్చలు విఫలమవుతూ వచ్చాయి. అయితే గత రెండు మూడురోజులుగా ఆయా సంఘాలు, ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులతో జరిపిన ముమ్మర చర్చల నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఉద్యోగుల హెల్త్‌కార్డులకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాత్రి 8 గంటల సమయంలో సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కొండ్రు మురళి, ఈ శాఖకు చెందిన ఐఏఎస్ అధికారులతో సుమారు గంటసేపు ఉద్యోగ సంఘాలు చర్చించాయి. అనంతరం జీవో 171, 174, 175, 176లను విడుదల చేశారు. జీవోలను కాన్ఫిడెన్షియల్‌గా పెట్టారు. ఈ వివరాలను శనివారం సీఎం అధికారికంగా ప్రకటించనున్నందునే జీవోలను కాన్ఫిడెన్షియల్‌గా పెట్టామని అధికారులు చెబుతున్నారు. కేసు తీవ్రతను బట్టే... చెల్లింపులు : దీపావళి కానుకగా ప్రభుత్వం చెప్పుకుంటున్న ఈ హెల్త్‌కార్డుల పథకంలో ఉద్యోగుల డిమాండ్లన్నీ పూర్తిగా తీర్చలేదు. అయితే మధ్యేమార్గంగా వెళ్లినట్లు తెలుస్తోంది. ఏదైనా అనారోగ్యానికి చికిత్స నిమిత్తం తాము గరిష్టంగా రెండు లక్షలు మాత్రమే చెల్లిస్తామని... దీనికి అదనంగా అయితే సదరు ఉద్యోగస్తుడే భరించాలని ప్రభుత్వం ఇన్నాళ్లూ చెబుతూ వచ్చింది. అయితే ఉద్యోగ సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే తాజా మార్గదర్శకాల్లో... కేసు తీవ్రతను, వైద్యుల సిఫారసులను బట్టి రెండు లక్షల పరిమితిని సడలించి చికిత్సకయ్యే పూర్తి ఖర్చును చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఇది కేసుల వారీగా ఉంటుంది. అంటే రెండు లక్షల వ్యయపరిమితి కొనసాగుతుంది. అయితే ఈ సడలింపునకు అనుమతించే క్రమంలో చికిత్సకు ఆటంకం కలగకుండా చూస్తామని, ఖర్చు రెండు లక్షల పరిమితి దాటిందని ఆసుపత్రులు చికిత్సను నిలిపివేయకుండా చర్యలు తీసుకుంటామని, వారికి ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటాయని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ ఉన్నాతాధికారి ఒకరు శుక్రవారం రాత్రి సాక్షితో మాట్లాడుతూ చెప్పారు. -
సమ్మెను విరమింపచేసేందుకు ముఖ్యమంత్రి ఒత్తిడి!
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గత 70 రోజులుగా సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు చేపట్టిన సమ్మెను విరమింప చేసేందుకు ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేపట్టినట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయం సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాల నేతలపై ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలిసింది. సోమవారం నాడు జరిగిన రాష్ట్ర కేబినెట్ ఉప సంఘ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలకు, రాష్ట్ర మంత్రులకు మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే సమ్మె చేస్తున్న నేతలపై మంత్రి కొండ్రు మురళి చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డ సంగతి తెలిసిందే. కేబినెట్ ఉపసంఘం సమావేశం తర్వాత అశోక్ బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లయితే తాము సమ్మె విరమణపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మె విరమణకు ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి అన్నివర్గాల్లో నెలకొంది. -
'అధిష్టానం తొత్తుగా మంత్రి కొండ్రు మురళి'
కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రి కొండ్రు మురళి, ఉద్యోగ సంఘాల నేతల మధ్య వాడివేడి చర్చకు దారి తీసింది. మంత్రి కొండ్రు మురళీ తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సోమవారం మధ్నాహ్నం జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న సమ్మెను మంత్రి కొండ్రు మురళి తప్పుపట్టినట్టు సమాచారం. ప్రభుత్వ స్కూళ్లను మూయించి..ప్రైవేట్ స్కూళ్లను ఎలా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి ప్రశ్నించారు. మీ పిల్లలు చదివే స్కూళ్లను మూయించకుండా.. ప్రభుత్వ స్కూళ్లను ఎలా మూయిస్తున్నారని మంత్రి కొండ్రు నిలదీయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజకీయ నేతలు ప్రజల్లోకి వెళ్లి ఉద్యమిస్తే..మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఉద్యోగ సంఘాల నేతలు ధీటుగానే జవాబిచ్చారు. అంతేకాకుండా అధిష్టానానికి తొత్తుగా వ్యవహరిస్తున్నావంటూ కొండ్రు మురళీ తీరును ఉద్యోగ సంఘాల నేతలు తప్పపట్టారు. ఇదిలా ఉండగా.. శ్రీకాకుళం జిల్లాలోని మంత్రి కొండ్రు మురళి కార్యాలయానికి సమైక్య ఉద్యమకారులు తాళం వేసినట్టు తెలిసింది.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రులు విజ్క్షప్తి చేశారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించిన తర్వాతే తాము ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. బుధవారం మధ్నాహ్నం ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నట్టు తెలిసింది. -
చంద్రబాబును ఎందుకు నిలదీయరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాజీనామా చేయాలని పదేపదే డిమాండ్ చేస్తున్న ఏపీఎన్జీవో నేతలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును ఎందుకు నిలదీయడం లేదని మంత్రి కొండ్రు మురళి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించాలని చంద్రబాబు లేఖ ఇచ్చినా ఆయన్ను రాజీనామా చేయాల్సిందిగా ఎందుకు డిమాండ్ చేయడంలేదన్నారు. అన్ని పార్టీలు లేఖలిచ్చిన తరువాతే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని...ఇందులో తమ పార్టీ తప్పేముందన్నారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం కొండ్రు మీడియాతో మాట్లాడుతూ కేవలం తమ పార్టీనే లక్ష్యంగా ఆందోళనలు చేస్తే ఊరుకునేది లేదని, ఇకపై తమ పార్టీ నేతల జోలికొచ్చినా, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫొటోలను తగలబెట్టినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇకపై మౌనంగా ఉండకుండా జనంలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. -
చంద్రబాబు గుంట నక్క: కొండ్రు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ పెంపుడు కుక్కగా మారారని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్య విద్య మంత్రి కొండ్రు మురళీమోహన్ తీవ్రంగా స్పందించారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రజాప్రతినిధులను పెంపుడు కుక్కలంటావా? నువ్వే పెద్ద గుంట నక్కవు. నీ పక్కన మరికొన్ని గుంట నక్కలను పెట్టుకుని నిస్సిగ్గుగా మాట్లాడిస్తున్నావు. వాళ్లతోపాటు మరో ఐదువేలమంది కుక్కలను వెంట పెట్టుకుని యాత్ర చేస్తున్నావు’’ అని ధ్వజమెత్తారు. సోనియాగాంధీకి డబ్బు పిచ్చి పట్టిందంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘రెండెకరాల ఆసామివి రూ. 20 వేల కోట్లు సంపాదించుకున్నావు. వ్యవస్థలను మేనేజ్ చేసుకుని బతుకుతున్న నువ్వా మాట్లాడేది? నీకు నిజంగా ధైర్యముంటే, అవినీతికి పాల్పడలేదనుకుంటే నీ ఆస్తులపై సీబీఐ విచారణ వేయించుకో’’అని సవాల్ విసిరారు. ఉద్యమం చేస్తున్న ఏపీఎన్జీవోలు కూడా రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి మంత్రి పదవుల రాజీనామాల వ్యవహారాన్ని ప్రస్తావించగా... కాంగ్రెస్‌లో ఉండటం ఇష్టంలేనివారే ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. విభజన అనివార్యమైతే విశాఖను రాజధాని చేయాలన్నారు. -
'సమైక్యంగా ఉంచాలని ఆంటోనిని కోరతా'
హైదరాబాద్ నగర అభివృద్ధిలో అన్ని ప్రాంతాల ప్రజలకు భాగస్వామ్యం ఉందని రాష్ట మంత్రి కొండ్రుమురళి మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. విద్యా, వైద్య రంగాలకు సంబంధించి ముఖ్య కేంద్రాలన్ని హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎ.కే.ఆంటోనిని కోరతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ వేయాలని ఆయన యూపీఏ సర్కార్‌ను ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనేది కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వ్యక్తిగత అభిప్రాయమని కొండ్రుమురళి పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు మంగళవారం ఆంటోని కలవనున్నారు. ఈ సందర్బంగా వారంతా న్యూఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం తమను కలవాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి సీఎం కిరణ్‌కు పిలుపు వచ్చింది. దాంతో ఆయన ఈ రోజు ఉదయం ఢిల్లీ పయనమైయ్యారు. అదికాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీఎం కిరణ్ ఈ రోజు న్యూఢిల్లీలో పేర్కొన్న విషయం కూడా విధితమే. -
కాంగ్రెస్ నేతలకు అడుగడుగునా పరాభవం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు ఆ పార్టీ నేతలు ఎక్కడ కనిపిస్తే అక్కడ అడ్డగిస్తున్నారు. అధిష్టానాన్ని ఎదిరించలేని కాంగ్రెస్ నేతల నిర్వాకంపై దుమ్మెత్తిపోస్తున్నారు. సీమాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ నేతలకు ఆదివారం అడుగడుగునా పరాభవాలు ఎదురయ్యాయి. మంత్రులు కోండ్రు మురళీ మోహన్, శత్రుచర్ల విజయరామరాజు కాన్వాయ్‌లను విజయనగరం జిల్లా పూసపాటిరేగ జాతీయ రహదారి వద్ద సమైక్యవాదులు ఆదివారం అడ్డుకున్నారు. కోండ్రు మురళి విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తుండగా ఎన్జీఓ నేత ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో సమైక్య వాదులు కాన్వాయ్‌ను నిలుపుదల చేశారు. శత్రుచర్ల విజయరామరాజు శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తుండగా ఎన్జీఓ నేతలు పూసపాటిరేగ జాతీయరహదారిపై ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత గానీ వారి వాహనాలు ముందుకు వెళ్లలేకపోయాయి. అనంతపురం జిల్లా గుత్తిలో గుంతకల్లు ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మధుసూదన్‌గుప్తాను సమైక్యవాదులు అడ్డగించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సమైక్యాంధ్ర శిబిరానికి వచ్చిన ఎంపీ కనుమూరి బాపిరాజును సమైక్యవాదులు చుట్టుముట్టారు. రాజీనామా చేయాలంటూ పట్టు బట్టారు. అనంతరం బాపిరాజు విలేకరులతో మాట్లాడుతూ, వెంకటేశ్వరస్వామి సాక్షిగా తెలంగాణ ప్రకటన గురించి ముందుగా తనకు తెలియదన్నారు. పాలకొల్లులో సమైక్యాంధ్ర రిలే నిరహార దీక్ష శిబిరం వద్ద ఎమ్మెల్యే ఉషారాణి మాట్లాడుతూ, సమైక్యవాదులు కాంగ్రె స్పార్టీ హైకమాండ్‌ను తప్పుబట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జేఏసీ కన్వీనర్ డాక్టర్ వర్మ ఆమె వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. దాంతో ఇద్దరిమధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. -
'తెలుగువారందరూ హైదరాబాద్‌లో భాగస్వాములే'
శ్రీకాకుళం: తెలుగు ప్రజలందరూ హైదరాబాద్‌లో భాగస్వాములేనని మంత్రి కొండ్రు మురళి స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్ర విభజనకు సంబంధించి ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజలు హైదరాబాద్ నగరంలో భాగస్వాములవుతారని తెలిపారు. రాష్ట్ర విభజనపై తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు స్పష్టమైన లేఖలు ఇచ్చిన కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణపై ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు. టీడీపీ, బీజేపీలు లేఖలు ఉపసంహరించుకుంటే విభజనను అడ్డుకుంటామన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం మరింత ఉధృతమైన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీఎన్జీవో సంఘం డిమాండ్ చేస్తూ నిరసన బాట పట్టింది. -
ప్రజల అభీష్టం మేరకే రాజీనామాలు: కొండ్రు
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా మరో ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేశారు. మంత్రులు కొండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజు సోమవారం తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు వారు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిసి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. ప్రజాభీష్టం మేరకే తాము పదవులకు రాజీనామాలు చేసినట్లు కొండ్రు మురళి తెలిపారు. రాష్ట్ర విభజనపై సీపీఐ, బీజేపీ, టీడీపీ తమ నిర్ణయాన్ని మార్చుకుంటే.... కాంగ్రెస్ నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తామని కొండ్రు మురళి అన్నారు. ఇప్పటికే సగం మంది సీమాంధ్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం తొలిసారి సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి సమైక్య సెగ తగలింది. సీమాంధ్ర ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని తమ నిరసన తెలిపారు. -
కేసీఆర్ వ్యాఖ్యలు అసమంజం: కోండ్రు
హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై మంత్రి కోండ్రు మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేసీఆర్ వ్యాఖ్యలు అసమంజంగా ఉన్నాయని కోండ్రు మండిపడ్డారు. కొందరు తెలంగాణనేతలు సీమాంధ్ర ప్రజలను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన శనివారమిక్కడ అన్నారు. కోమటిరెడ్డి, పొన్నం వంటివారి వ్యాఖ్యలు గర్హనీయమని, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తన స్థాయిని దిగజార్చుకునేలా మాట్లాడుతున్నరని కోండ్రు వ్యాఖ్యానించారు. మరోమంత్రి బాలరాజు మాట్లాడుతూ ముందు చూపున్న నేతగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వాస్తవాలే మాట్లాడారని అన్నారు. సీఎం అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. సీఎం వ్యాఖ్యలను కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తున్నారని అన్నారు. కాగా రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సమర్థించిన విషయం తెలిసిందే. -
నివేదిక వచ్చిన తర్వాతే విభజన ప్రక్రియ
-
రాజీనామాలకైనా సిద్దం:కొండ్రు