
గంటా, లగడపాటిపై చర్యలు తీసుకోవాలి: కొండ్రు
శ్రీకాకుళం: రాష్ట్ర విభజన అంశంలో అధిష్టానం చెప్పినట్లే నడుచుకుంటామని మంత్రి కొండ్రు మురళి స్పష్టం చేశారు. అధిష్టానంకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని ఆయన బుధవారమిక్కడ హెచ్చరించారు. ఒకవేళ విభజన అనివార్యమైతే సీమాంధ్రకు అన్యాయం జరగదని కొండ్రు తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు, లగడపాటి రాజగోపాల్పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా గంటా శ్రీనివాసరావు, లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. విభజన విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వారు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.