'తెలుగువారందరూ హైదరాబాద్‌లో భాగస్వాములే' | if tdp and bjp recall thier lettere on telangana, we will fight back on bifurcation | Sakshi
Sakshi News home page

'తెలుగువారందరూ హైదరాబాద్‌లో భాగస్వాములే'

Published Sun, Aug 18 2013 2:32 PM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

'తెలుగువారందరూ హైదరాబాద్‌లో భాగస్వాములే' - Sakshi

'తెలుగువారందరూ హైదరాబాద్‌లో భాగస్వాములే'

శ్రీకాకుళం: తెలుగు ప్రజలందరూ హైదరాబాద్‌లో భాగస్వాములేనని మంత్రి కొండ్రు మురళి స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్ర విభజనకు సంబంధించి ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజలు హైదరాబాద్ నగరంలో భాగస్వాములవుతారని తెలిపారు. రాష్ట్ర విభజనపై తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు స్పష్టమైన లేఖలు ఇచ్చిన కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణపై ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు. టీడీపీ, బీజేపీలు లేఖలు ఉపసంహరించుకుంటే విభజనను అడ్డుకుంటామన్నారు.
 
 
సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం మరింత ఉధృతమైన సంగతి తెలిసిందే.  కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీఎన్జీవో సంఘం  డిమాండ్ చేస్తూ నిరసన బాట పట్టింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement