శ్రీకాకుళం రూరల్/సంతకవిటి, న్యూస్‌లైన్: జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన అగ్నిప్రమాదాల్లో 21 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. శ్రీకాకుళం రూరల్ మండలం నైరా పంచాయతీ పరిధి వెంకటాపురంలో బుధవారం రాత్రి జరిగిన సంఘటనలో 7 పురిపాకలు కాలిపోయాయి. సంతకవిటి మండలం అక్కరాపల్లిలో మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు జరిగిన ప్రమాదంలో 8 మిద్దె ఇళ్లు, 6 పురిపాకలు కాలిబూడిదయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. వివరాలు ఇవీ... శ్రీకా కుళం రూరల్ మండలం నైర పంచాయతీ పరిధి వెం కటాపురంలో బుధవారం రాత్రి 8.30 గంటల సమ యంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో కోనారి కృష్ణ, కోనారి మల్లేసు, కోనారి తవిటమ్మ, కోనారి నారా యుడు, కోనారి శిమ్మయ్య, కోనారి సూర్యనారాయణ, కోనారి రామయ్య ఇళ్లు కాలిబూడిదయ్యాయి.
ఆమ దాలవలస అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. స్థాని కులు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బొబ్బాది చంద్రమౌళి, అనిల్‌కుమార్, సర్పంచ్ కర్రి కృష్ణమోహాన్, అరవల రాంప్రతాప్ తదితరులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని సర్పంచ్ తదితరులు కోరారు. ఇదిలా ఉండగా సంతకవిటి మండలం అక్కరాపల్లిలో మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 14 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. రూ 7 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. దేవుడి వద్ద పెట్టిన దీపం అంటుకోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. కార్తీక ఏకాదశి కావడంతో అర్ధరాత్రి 12 గంటలకే అక్కరాపల్లిలోని యాదవుల వీధిలో ఉంటున్న పలువురు స్నానాలు చేసి శంకరంపేటలోని సత్యనారాయణస్వామి కోవెలకు వెళ్లారు.
వీళ్లల్లో కొందరు ఇళ్లల్లో దేవుడి వద్ద దీపాలు వెలిగించారు. ఆ తర్వాత ఏం జరి గిందో తెలియదుగాని ఒక్కసారిగా మంటలు కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తమై మంటలను అదుపుచేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో గాలులు వీచడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. యువకులు అప్రమత్తంగా వ్యవహరించి ఇళ్లల్లో ఉన్న వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకురావడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో కరగాన గరికయ్య, రాము, తవుడు, రామారావు, గొంటు రాములమ్మ, నరసయ్య, రాములు, సూర్యారావులకు చెందిన మిద్దె ఇళ్లతోపాటు తూలుగు అక్కలనాయుడు, బూర్లె జోగినాయుడు, శాసపు జయమ్మ, రాగోలు రామరావు, కరగాన అప్పలస్వామి, కరగాన రమణలకు చెందిన పురిపాకలు అగ్నికి ఆహుతయ్యాయి.
పూజకు వెళ్లిన వారెవరూ సెల్‌ఫోన్లు తీసుకువెళ్లకపోవడంతో వారికి వెంటనే సమాచారం అందలేదు. తెల్లవారుజామున 3 గంటలకు తిరిగివచ్చినప్పటికి ఇళ్లన్నీ కాలిబూడిదవడాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ ప్రమాదంలో గరికయ్యకు చెందిన రూ 50 వేల నగదుతో పాటు రెండున్నర తులాల బంగారం పుస్తెలు తాడు కాలిపోయింది. కరగాన రాముకు చెందిన రూ 30 వేల నగదు, అరతులం బంగారం, తవుడు ఇంట్లో రూ 20 వేల నగదు, రామారావుకు చెందిన రూ 10 వేల నగదు, వెండి వస్తువులు, నరసయ్యకు చెందిన రూ 15 వేల నగదు, అరతులం బంగారం కాలిపోయాయి. సంఘటన స్ధలాన్ని తహశీల్దార్ బి.సూరమ్మతో పాటు ఆర్‌ఐ ప్రవీణ్‌కుమార్, వీఆర్వో మల్లేశ్వరరావు తదితరులు పరిశీలించారు. ఇదిలా ఉండగా మంత్రి కోండ్రు మురళీమోహన్ పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ 5 వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు.
అగ్ని ప్రమాదాల్లో 21 ఇళ్లు దగ్ధం
Published Thu, Nov 14 2013 2:59 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement