చంద్రబాబును ఎందుకు నిలదీయరు? | Kondru Murali blames Babu for State's bifurcation | Sakshi
Sakshi News home page

చంద్రబాబును ఎందుకు నిలదీయరు?

Published Wed, Sep 4 2013 6:27 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Kondru Murali blames Babu for State's bifurcation

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాజీనామా చేయాలని పదేపదే డిమాండ్ చేస్తున్న ఏపీఎన్జీవో నేతలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును ఎందుకు నిలదీయడం లేదని మంత్రి కొండ్రు మురళి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించాలని చంద్రబాబు లేఖ ఇచ్చినా ఆయన్ను రాజీనామా చేయాల్సిందిగా ఎందుకు డిమాండ్ చేయడంలేదన్నారు. అన్ని పార్టీలు లేఖలిచ్చిన తరువాతే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని...ఇందులో తమ పార్టీ తప్పేముందన్నారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం కొండ్రు మీడియాతో మాట్లాడుతూ కేవలం తమ పార్టీనే లక్ష్యంగా ఆందోళనలు చేస్తే ఊరుకునేది లేదని, ఇకపై తమ పార్టీ నేతల జోలికొచ్చినా, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫొటోలను తగలబెట్టినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇకపై మౌనంగా ఉండకుండా జనంలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement