
'కుట్రలో కాదు... అభివృద్ధిలో కలిసి రండి'
హైదరాబాద్: రాష్ట్ర విభజనను ఎమర్జెన్సీతో పోల్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్ని మంత్రి హరీష్ రావు ఖండించారు. మీడియాతో శనివారం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ టీడీపీ నేతలు రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనేందుకు అనర్హులని అన్నారు. విభజనను ఎమర్జెన్సీతో పోల్చిన చంద్రబాబు వ్యాఖ్యల్ని టీటీడీపీ నేతలు సమర్ధిస్తారా? లేక వ్యతిరేకిస్తారా? అని మంత్రి హరీష్ ప్రశ్నించారు. టీటీడీపీ నేతలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.. కుట్రలో కాదని ఆయన వ్యాఖ్యానించారు. నిజాయితీ ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ద్వారా నిరసన తెలపాలని మంత్రి హరీష్ రావు అన్నారు.