State Minister
-
మోదీ భజన చేసే యువత చెంప పగలగొట్టాలి: కర్ణాటక మంత్రి
ప్రధాని నరేంద్ర మోదీ పట్ల కర్ణాటక రాష్ట్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని, ప్రధానిని పొగిడే యువత చెంప పగలగొట్టాలని కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి అన్నారు. కారటగిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి శివరాజ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, మరోసారి ప్రజలను మోసం చేయవచ్చని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. ‘రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. ఇచ్చారా? మోదీ మోదీ అని నినాదాలు చేస్తూ ఆయనకు మద్దతిచ్చే యువత సిగ్గుపడాలి. వాళ్ల చెంప పగలగొట్టాలి. పదేళ్లుగా అబద్ధాలతోనే నడిపించారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘దేశంలో 100 స్మార్ట్ సిటీలు ఇస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. అవి ఎక్కడ ఉన్నాయి? ఒక్కటైనా చెప్పండి’ అని ప్రశ్నించారు. ‘ఆయన (ప్రధాని మోదీ) తెలివైనవాడు. బాగా దుస్తులు ధరిస్తాడు. స్మార్ట్ ప్రసంగాలు చేస్తాడు. సముద్రపు లోతుల్లోకి వెళ్లి పూజలు చేస్తూ స్టంటులు చేస్తాడు. ఒక ప్రధానమంత్రి చేయవలసిన పని ఇదేనా?’ అన్నారు. -
‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు.. కానీ’.. మరోమారు వార్తల్లోకి ఆ మంత్రి
కోహిమా: పరిస్థితులు ఎలా ఉన్నా సందర్భానుసారం నవ్వులు పూయించటంలో కొందరు నిష్ణాతులుంటారు. అలాంటి వారిలో నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఒకరు అని చెప్పకతప్పదు. తనలాగే ఒంటరిగా ఉండండంటూ జనాభా పెరుగుదలపై చమత్కారమైన సలహా ఇచ్చి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారు. అంతకు ముందు ఈశాన్య ప్రజలకు చిన్నకళ్లు ఉంటాయని జాత్యాహంకార వ్యాఖ్యలపైనా తనదైన శైలీలో సమాధానమిచ్చి వార్తల్లో నిలిచారు మంత్రి టెమ్జెన్. తాజాగా మరోమారు ‘చిన్న కళ్లు’ వ్యాఖ్యలతో వైరల్‌గా మారారు. తాజాగా తన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు మంత్రి టెమ్జెన్. తాను ఎల్లప్పుడూ ఫోటో పోజులకు రెడీ అని పేర్కొన్నారు. తనకు ఉన్న చిన్న కళ్లతోనే మైల్ దూరంలో ఉన్న కెమెరాలను గుర్తించగలనని చమత్కరించారు. ‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు.. కానీ, ఒక మైల్ దూరం నుంచి నేను కెమెరాను చూస్తాను. ఎల్లప్పుడూ పోజ్‌కు రెడీ. ఇది చదువుతున్నప్పుడు మీ పెదాలపై చిరునవ్వును చూస్తాను.’ అంటూ ట్వీట్ చేశారు. ఆదివారం ఉదయం ఫోటో షేర్ చేయగా కొన్ని గంటల్లోనే ఐదు వేల వరకు లైకులు, వందల కొద్ది కామెంట్లు వచ్చాయి. లాఫింగ్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. మీరు మమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచుతారనే దాంట్లో ఎలాంటి సందేశం లేదు అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. దేశంలోనే అత్యంత వినోదభరితమైన మంత్రిగా మరొకరు పేర్కొన్నారు. My eyes may be small, but I can see the camera from a mile. Always pose ready. 📸 Also I can see you smile as you reading it! 😉 Good Morning pic.twitter.com/7ntWw5UMVx — Temjen Imna Along (@AlongImna) October 9, 2022 ఇదీ చదవండి: బార్కొలానా వీక్.. సముద్రంపై ‘తెరచాప’ పడవల పందెం -
మద్యం సేవించాలని మంత్రి ఉచిత సలహా.. వీడియో వైరల్
రాయ్‌పుర్: మద్యం సేవించటం ద్వారా కుటుంబాలు రోడ్డు పాలవుతాయని పెద్దలు చెబుతుంటారు. లిక్కర్‌కు దూరంగా ఉండాలని కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇస్తుంటాయి ప్రభుత్వాలు. మద్యం హానికరం అని లిక్కర్ సీసాలపై పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటుంది. కానీ, డి-అడిక్షన్ కార్యక్రమం వేదికగా ఛత్తీస్‌గఢ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి ప్రేమ్‌సాయి సింగ్ టెకమ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. లిక్కర్ ప్రజలను ఏకం చేస్తుందని, అయితే, కొద్ది మోతాదులో తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ‘నశా ముక్త్ అభియాన్’లో భాగంగా వద్రాఫ్నగర్లో డి-అడిక్షన్ కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. పలు పాఠశాలలకు చెందిన పిల్లలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం వేదికగా లిక్కర్ ప్రజలను ఏకం చేస్తుందటూ మంత్రి చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘ నేను ఓ మీటింగ్‌కు హాజరయ్యాను. అక్కడ ఓ వర్గం లిక్కర్ అనారోగ్యానికి గురిచేస్తుందని, దానిని తాగటం మంచిది కాదని వాదించింది. మరోవర్గం.. లిక్కర్ వల్ల లాభాలు ఉన్నాయని పేర్కొంది. అయితే, లిక్కర్ ప్రతిఒక్కరిని కలుపుతుంది. కానీ, నియంత్రణ ఉండాలి. మనం సైతం ఉత్సవాలు, ఎన్నికల సమయంలో దానిని ఉపయోగిస్తాం. ’ అని పేర్కొన్నారు టెకమ్. బీజేపీ విమర్శలు.. లిక్కర్‌పై రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుట్టారు బీజేపీ ఎమ్మెల్యే అజయ్ చంద్రాకర్. ‘భూపేశ్ బఘేల్ జీ ప్రభుత్వం, పార్టీ కార్టూన్లతో నిండిపోయింది. ఏఒక్కరికి విషయం అర్థంకాదు. ఇది పని చేసే ప్రభుత్వం కాదు. ఢిల్లీ(కాంగ్రెస్ అధిష్ఠానం) చేతిలో కీలుబొమ్మ. ’ అని ఆరోపించారు. మరోవైపు.. కొద్ది రోజుల క్రితం భంగ్, గంజాయీని లిక్కర్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగించాలని బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణమూర్తి బంధి వ్యాఖ్యానించిన తర్వాత రాష్ట్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. #WATCH | At a de-addiction drive, Chhattisgarh Min Premsai Singh Tekam says, "There should be self-control. I once went to a meeting where they spoke for & against liquor. One side spoke of its benefits. Liquor should be diluted, there should be a duration (to consume it)"(31.8) pic.twitter.com/FE8HJd3ktD — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 1, 2022 ఇదీ చదవండి: Jharkhand Crisis: గవర్నర్‌ను కలవనున్న అధికార కూటమి నేతలు -
‘నాది మూఢనమ్మకం కాదు.. ఆచారాన్ని గౌరవించడం’
అహ్మదాబాద్: గుజరాత్ మంత్రి అర్వింద్ రైయానీ మూఢనమ్మక విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజ్‌కోట్ జిల్లాలోని తన సొంతూళ్లో గురువారం జరిగిన ఉత్సవం సందర్భంగా ఆయన ఇనుప గొలుసులతో కొట్టుకుంటున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అయింది. దీంతో ఒక మంత్రి మూఢనమ్మకాలను ప్రొత్సహిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. చుట్టూ కొందరు నోట్లు విసురుతుంటే.. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తికి పోటీగా అర్వింద్ సైతం గోలుసులతో వీపులో బాదుకున్నారు. అయితే విమర్శలను మంత్రి సున్నితంగా తిప్పికొట్టారు. ‘ఏటా మా సొంతూళ్లో మా కుటుంబసభ్యులంతా కలిసి కులదైవానికి ఉత్సవం జరుపుతుంటాం. చిన్ననాటి నుంచి ఆ దేవత భక్తుడిని నేను. ఉత్సవం సమయంలో గొలుసులతో కొట్టుకున్నా. మా ఆచారాలను గౌరవిస్తాను. పూజల్లో భాగంగా చేపట్టే ఈ కార్యాన్ని మూఢనమ్మకంగా చూడొద్దు’ అని తెలిపారు. కాంగ్రెస్‌కు ఆ రెండింటికి తేడా తెలియదని గట్టి కౌంటరే ఇచ్చారు ఆయన. રાજકોટ: રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી માતાજીનો માંડવામાં ધુણ્યા#ArvindRaiyani@BJP4Gujarat pic.twitter.com/hDJNbcqr6E — Gujarat Mirror (@gujaratmirror26) May 27, 2022 -
'బల్జిత్ కౌర్ అనే నేను'.. పంజాబ్‌లో ఏకైక మహిళా మంత్రి
పంజాబ్‌లో కొత్తగా ఏర్పడిన ‘ఆప్’ సర్కార్ మంత్రివర్గంలోని ఏకైక మహిళ బల్జిత్‌కౌర్. మలౌత్ నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారిగా శాసనసభ్యురాలిగా ఎంపికయ్యారు. బల్జిత్ తండ్రి సాధుసింగ్ ఫరిద్కోట్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినప్పటికీ, ఆమె ఎప్పుడూ రాజకీయాలపై ఆసక్తి చూపలేదు. రాజకీయాల్లోకి వస్తానని ఊహించలేదు. అభ్యర్థుల ఎంపిక కోసం చేసిన విశ్లేషణలలో పార్టీ పెద్దలకు చాలామంది బల్జిత్ పేరు సూచించారు. అలా పార్టీ టికెట్ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. దీంతో తాను చేస్తున్న డాక్టర్ ఉద్యోగాన్ని వదులుకున్నారు. ‘మంచి పనిచేశావు. తప్పకుండా గెలుస్తావు’ అని ప్రోత్సాహం ఇచ్చిన వారికంటే– ‘తొందరపడుతున్నావు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు మన చేతుల్లో ఉండవు’ అని వెనక్కిలాగిన వారే ఎక్కువ. ‘రెండు సార్లు వరుసగా గెలిచిన హర్‌ప్రీత్ సింగ్‌పై గెలవడం ఆషామాషీ ఏమీ కాదు’ అనేవారు సరేసరి. అయితే బల్జిత్‌కౌర్ అవేమీ పట్టించుకోలేదు. ‘ఒక్కసారి బరిలో దిగానంటే వెనక్కి చూసేది లేదు’ అనుకునే మనస్తత్వం కౌర్‌ది. ఆమె ఎక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్లినా, పార్టీ అభిమానులతో పాటు ఏ పార్టీ వారో తెలియని పేషెంట్లు కూడా వచ్చి తమ సమస్యలు చెప్పుకునేవారు. అంత బిజీషెడ్యూల్‌లోనూ వారితో ఓపికగా మాట్లాడేవారు కౌర్. ఎన్నికల సభలలో ఒకవైపు నేతలు ప్రసంగాలు సాగుతుండేవి. మరోవైపు బల్జిత్ పేషెంట్లతో మాట్లాడుతూ మందుల చిట్టీలు రాస్తున్న దృశ్యం సర్వసాధారణంగా కనిపించేది. కౌర్ ఎన్నికల ఉపన్యాసాల్లో స్త్రీసాధికారికతకు సంబంధించిన అంశాలు ఎక్కువగా వినిపించేవి. ‘రోగాలతోపాటు అవినీతిని రూపుమాపే డాక్టర్ వస్తున్నారు’ అనే నినాదం ఆకట్టుకుంది. ముక్త్సర్ ప్రభుత్వ ఆస్పత్రిలో బల్జిత్‌కౌర్ వైద్యురాలిగా పనిచేసిన సమయంలో ఆమెను ‘డాక్టర్ జీ’ లేదా ‘మేడమ్’ అని పిలిచే వారికంటే ‘అక్కా’ ‘అమ్మా’ అని ఆత్మీయంగా పిలిచేవారే ఎక్కువ. ఎందుకంటే బల్జిత్ తన బాధ్యత ‘కేవలం వైద్యచికిత్స మాత్రమే’ అని ఎప్పుడూ అనుకోలేదు. పేషెంట్లను ఆప్యాయంగా పలకరించేవారు. ఎవరికైనా డబ్బు అవసరం పడితే ఇచ్చేవారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించేవారు. ముక్త్సర్ చుట్టుపక్కల అట్టారి, బుడిమల్, లంబీదాబీ....మొదలైన గ్రామాల నుంచి ఆస్పత్రికి పేషెంట్లు వచ్చేవారు. వారందరికీ బల్జిత్ పెద్దదిక్కు. ఒక ధైర్యం. అందుకే ఆమె శాసనసభ్యురాలిగా గెలిచినప్పుడు, ఆ గెలుపు అనేక గ్రామాల సంతోçషం అయింది. బల్జిత్కౌర్లో రచయిత్రి, కవయిత్రి కూడా ఉన్నారు. ఎండలో మెరిసే కొండల అందాన్ని, చెట్ల సోయగాన్ని, పిట్టల పాటల పరవశాన్ని కవితలుగా రాయడమే కాదు రకరకాల సామాజిక సమస్యలపై పత్రికలకు వ్యాసాలు రాయడం కూడా ఆమె అభిరుచి. ‘నాకు అప్పచెప్పిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తాను. ఒక మహిళగా, వైద్యురాలిగా స్త్రీ సంక్షేమం, మెరుగైన ఆరోగ్యవ్యవస్థ గురించి పనిచేస్తాను’ అంటున్నారు బల్జిత్‌కౌర్. -
మంత్రి గారు మాస్క్ ముఖానికి పెట్టుకోవాలి, అక్కడ కాదు..!
డెహ్రాడూన్: కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలంటూ ఆరోగ్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ, చాలా మంది ఆ మాటలను పెడచెవిన పెట్టి మాస్క్‌ల వాడకానికి మంగళం పాడుతున్నారు. సాధారణ ప్రజల పరిస్థితి ఇలా ఉంటే.. పదిమందికీ చెప్పాల్సిన మంత్రులు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ మంత్రి అయితే మాస్క్‌ను ముఖానికి కాకుంగా కాలి బొటన వేలికి తగిలించి ఓ ముఖ్యమైన భేటీలో దర్శనమిచ్చారు. సదరు మంత్రి గారి నిర్వాకానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లో బీజేపీకి చెందిన ఐదుగురు నేతలు ఓ సమావేశంలో పాల్గొన్నారు. అందులో ముగ్గురు రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరికీ మాస్క్‌లు లేవు. వీరిలో యతీశ్వరానంద్ అనే మంత్రి అయితే మాస్క్‌ను ఏకంగా కాలి బొటన వేలికి తగిలించి సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫొటోను ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గరిమా దాసౌని ట్విటర్లో పోస్టు చేశారు. ''ఇదీ అధికార భాజపా మంత్రుల పరిస్థితి. వీరంతా మాస్క్‌లు పెట్టుకోని వారిని శిక్షించమని చెబుతారు'' అంటూ విమర్శించారు. మాస్క్ పెట్టుకోవడానికి ఏది సరైన చోటో ఉత్తరాఖండ్ మంత్రిని అడిగి తెలుసుకోండి అంటూ ఆప్ నేత దీప్ ప్రకాశ్ పంత్ కామెంట్ చేశారు. దీనిపై ప్రస్తుతం విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మంత్రికి త్రుటిలో తప్పిన ప్రమాదం
జయపురం : రాష్ట్ర జౌళి పరిశ్రమల శాఖ మంత్రి పద్మినీ దియాన్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కొరాపుట్‌లో ఆదివారం ఉదయం ఓ సమావేశానికి హాజరైన ఆమె తన కారులో తిరిగి కొట్‌పాడ్ వైపు వెళ్తుండగా, ఆమె కారుకి ఎదురుగా వస్తున్న మోటార్‌బైక్ కారుని బలంగా ఢీకొట్టింది. దీంతో మంత్రి కారు ముందు భాగం కొంత ధ్వంసం కాగా, కారు డ్రైవరుకి స్వల్ప గాయాలయ్యాయి. అయితే మోటారుబైక్పై వస్తున్న బినోదకుమార్ పండాకి మాత్రం తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వైద్యసేవల నిమిత్తం బొరిగుమ్మ హాస్పిటల్‌కి క్షతగాత్రులను తరలించారు. మంత్రి సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
మంత్రి భార్య, కుమారుడికి పాజిటివ్
సాక్షి, చండీగఢ్: పంజాబ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ట్రిప్ట్ రజీందర్ సింగ్ బజ్వా (77) భార్య రత్నేశ్వర్ కౌర్,కుమారుడు కూడా కరోనా బారిన పడ్డారు. మంత్రికి కోవిడ్-19 సోకిన రెండు రోజుల తరువాత, నిర్వహించిన పరీక్షల్లో ఆయన భార్య, కొడుకు కూడా కరోనా వైరస్ వ్యాధి సోకినట్టు గురువారం గుర్తించారు. ఈ విషయాన్ని కోవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ రాజేష్ భాస్కర్ ధృవీకరించారు. ఇద్దరికి పెద్దగా వైరస్ లక్షణాలు లేనప్పటికీ , క్వారంటైన్ చేసినట్టు వెల్లడించారు. జూలై 9న గ్రామీణాభివృద్ధి శాఖ సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి బాజ్వాకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తోపాటు, మంత్రులు సుఖ్జిందర్ సింగ్ రాంధావా, అరుణ చౌదరికి, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పర్మిందర్ పింకీ, కుల్బీర్ జీరా, బరిందర్‌మీత్ సింగ్ పహ్రా లకు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోగా నెగటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా పంజాబ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,799 కరోనా కేసులు నమోదు కాగా 221 మంది మరణించారు. -
అచ్చం సినిమా సీన్‌ను తలపించేలా..
ముంబై : సినిమా సీన్‌ను తలపించే ఘటన ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఎరువుల షాపులపై తనిఖీలు నిర్వహించటానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దాదాజి భూసే రైతు వేషం వేశారు. ఓ సాధారణ రైతులా వెళ్లి ఓ ఎరువుల షాపు యజమాని పనిపట్టారు. ఈ సంఘటన ఆదివారం ఔరంగాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం మంత్రి దాదాజి భూసే రైతు వేషంలో ఔరంగాబాద్‌లోని ఎరువుల షాపులపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవభారత్ అనే ఎరువుల షాపు దగ్గరకు వెళ్లి 10 బస్తాల యూరియా కావాలని అడిగారు. ( ముంబైకి మరో ముప్పు) అయితే షాపు యజమాని ఎరువుల నిల్వలు ఉన్నప్పటికి లేవని సమాధానం ఇచ్చాడు. స్టాక్ రిజిస్టర్ చూపించమని అడిగితే ఇంట్లో మర్చిపోయానని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన మంత్రి జిల్లా అధికారులను షాపుపై సోదాలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో పంచనామా నిర్వహించిన పోలీసులు దాదాపు 1300 యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మంత్రి భూసే మాట్లాడుతూ.. క్వాలిటీ కంట్రోల్ అధికారులు సక్రమంగా పనిచేయాలని, అలా అయితేనే రైతులు ఇబ్బందులు పడరని తెలిపారు. -
రేపు మంత్రి రావెల రాక
అనంతపురం అర్బన్ : జిల్లాలో చేపట్టిన ‘చంద్రన్న దళిత బాట’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాంఘిక, గిరిజన సంక్షేమ సాధికారత శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు సోమవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. సంక్షేమ పథకాలపై ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు, ప్రజ లకు ఆవగాహన కల్పించేందుకు మధ్యాహ్న ం మూడు గంటలకు ఆర్ట్ కళాశాల ఎదురుగా ఉన్న మైదానంలో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్న ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సుకు జిల్లాలోని దళిత, గిరిజన సామాజిక వర్గాల ప్రజలు, సంఘాల నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు. -
వందేమాతరం.. మనదే ఈ తరం
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రీ భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు అంటూ.. చిన్నారుల దేశభక్తి గీతాలు, సమైక్యతను చాటేలా వ్యాయామ విద్యార్థుల విన్యాసాలు, జాతీయ భావాన్ని కలిగించే ప్రసంగాలతో ఏలూరు పోలీస్ పరేడ్ గ్రేండ్స్లో సోమవారం స్వాతంత్య్ర దిన వేడుకలు అంబరాన్నంటాయి. –ఏలూరు (మెట్రో) జిల్లావ్యాప్తంగా 70వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లాస్థాయిలో ఏలూరులో జరిగిన వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బేటీ బచావో–బేటీ పడావో నినాదంతో సర్వశిక్షాభియాన్ శకటాన్ని ప్రదర్శించారు. ఆర్డబ్ల్యూఎస్, డీఆర్డీఏ, వైద్యారోగ్య శాఖ, 108, 104, చంద్రన్న సంచార చికిత్స, అటవీ శాఖ, వ్యవసాయ, ఐటీడీఏ శాఖలు శకటాలను ప్రదర్శించాయి. విన్యాసం.. అబ్బురం వేడుకలలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ‘దేశమంటే మట్టికాదోయ్– దేశమంటే మనుషులోయ్’, కొవ్వలి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ‘జయహో..’, శర్వాణీ ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ‘భరత ఖండమే నా దేశం’, గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ కళాశాల విద్యార్థులు ‘భారతీయం’, ఏలూరు రవీంద్రభారతి విద్యార్థులు ‘చెక్‌దే ఇండియా’, చైతన్య విద్యార్థులు ‘వందేమాతరం’ నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. గోపన్నపాలెం వ్యాయామ విద్యార్థులు అబ్బురపరిచే విన్యాసాలతో అలరించారు. విజేతలకు మంత్రి మాణిక్యాలరావు ప్రశంసా పత్రాలు అందించారు. గోపన్నపాలెం వ్యాయామ కళాశాల విద్యార్థుల నృత్యం మొదటి స్థానంలో నిలిచింది. కలెక్టర్ కె.భాస్కర్, ఎస్పీ భాస్కర్‌భూషణ్, డీఈవో డి.మధుసూదనరావు, డెప్యూటీ డీఈవో డి.ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రుణాల కోసం ఎదురుచూపులు
- కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు - మంత్రి పోచారంను కలిసి విన్నవించిన బీసీలు కలెక్టరేట్: వెనుకబడిన తరగతులను గత కాంగ్రెస్ ప్రభుత్వం మరింత వెనక్కునెట్టింది. బీసీలకు రుణాల విషయంలో చివరకు చేత్తులెత్తేసింది. ఇక కొత్త రాష్ట్రంలో.. కొత్త ప్రభుత్వం తప్పక అందిస్తుందని దరఖాస్తుదారులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. రుణాలు మంజూరు చేయాలంటూ నిరసనలు, ధర్నాలు చేసిన వారు ఇటీవల రాష్ట్రమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్నీ అందించారు. జిల్లా బీసీ సంక్షేమశాఖ కూడా రుణాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆంక్షల జీవో జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 2,675 మందికి రుణాలు అందించాల్సి ఉంది. వాటిలో రూ.40వేలు మొదలుకుని రూ.రెండులక్షల వరకు రుణసౌకర్యం అందిస్తామని చెప్పారు. రూ.40వేలు రుణం పొందేవారికి రూ.20 వేలు, రూ.50వేలు రుణం పొందేవారికి రూ.25వేలు, రూ.లక్షకు 50వేలు, రూ.2లక్షలకు రూ.లక్ష సబ్సిడీగా ప్రభుత్వం పేర్కొంది. 50శాతం సబ్సిడీ కావడంతో ఎన్నడూ లేనంతగా దరఖాస్తుదారులు బీసీ ార్పొరేషన్ వద్ద క్యూకట్టారు. బీసీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రుణాల సబ్సిడీని మరింత పెంచుతామంటూ అప్పటి పాలకులు గొప్పలు చెప్పారు. దీంతో దరఖాస్తుదారులు సంబురపడ్డారు. ఆ తర్వాత సర్కారు అసలు కథ మొదలు పెట్టింది. ఎప్పుడూ లేనివిధంగా రుణాల మంజూరుకు పలు నిబంధనలను విధిస్తూ జీవో నం.101ను విడుదల చేసింది. జీవోలో పేర్కొన్న నిబంధనలతో పాటు రుణాల సబ్సిడీలోనూ కోత విధించింది. లబ్ధిదారుల సంఖ్యనూ కుదించి, బీసీలపై వివక్ష చూపింది. జీవో నం. 101పై అప్పట్లో ఎన్నికల ముందు పెద్ద దూమారం లేసింది. బీసీలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పలు ఆంక్షలతో ఆర్థిక సంవత్సరం మరో వారంలో ముగుస్తుండగా.. రుణాల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రుణాలు అలాగే ఉండిపోయాయి. బీసీలకు ఒక్క పైసా అందలేదు. రుణాలపైనే ఆశలు వెనుకబడిన తరగతులకు చెందిన చాలామంది బీసీ కార్పొరేషన్ రుణాలపైనే ఆశలు పెట్టుకున్నారు. రుణాలు అందితే బతుకుదెరువుకు ఆసరా ఉంటుందంటున్నారు. సారీసెంటర్, బ్యాంగిల్స్టోర్, కిరాణ మర్చంట్, ఫొటోస్టూడియో, జిరాక్స్‌సెంటర్, గొర్రెల పెంపకం తదితర యూనిట్లకు రుణాలు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఎంతోఆశతో దరఖాస్తుదారులు బ్యాంకర్ల కాళ్లావేళ్లా పడి బ్యాంకు అర్హత పత్రాలు తీసుకువచ్చి దరఖాస్తు చేసుకున్నారు. రూ.50వేలు, రూ.లక్ష, రూ.2లక్షల వరకు రుణాల కోసం బ్యాంకు అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సబ్సిడీ, లబ్ధిదారుని సీరియల్ నంబర్ కూడా అందించారు. కానీ చివరికి రుణాలు ఇవ్వకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిదారి పట్టింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి రుణాలను త్వరితగతిన అందించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. -
అమ్మకు సమన్లు
జయలలిత, శశికళ కోర్టుకు రండి ఎగ్మూర్ కోర్టు ఆదేశం విచారణకు ఐటీ రిటర్నింగ్ కేసు సాక్షి, చెన్నై: ఆదాయపు పన్ను దాఖలు కేసు సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ మెడకు చుట్టుకునేనా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడో దాఖలైన కేసు విచారణను వేగవంతం చేయడానికి ఎగ్మూర్ ఆర్థిక నేరాల కోర్టు నిర్ణయించింది. విచారణ కోసం కోర్టుకు రావాలంటూ జయలలిత, శశికళకు గురువారం సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ మూడో తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. రాష్ర్ట ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై కేసులకు కొదవ లేదు. ఇందులో ప్రధానంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ బెంగళూరు కోర్టులో సాగుతోంది. మరొకటి ఆదాయపు పన్ను ఎగవేత కేసు. 1991-92,1992-93 సంవత్సరానికి గానూ, శశి ఎంటర్ ప్రెజైస్కు సంబంధించి గానీ, 1993-94కు గాను జయలలిత, శశికళ వ్యక్తిగతంగా తమ ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయలేదన్న అమ్మకు సమన్లు ఆరోపణలు వచ్చారుు. డీఎంకే హయంలో ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝుళిపించింది. జయలలిత, శశికళలు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయలేదని గుర్తించి ఆ ఇద్దరిపై అభియోగం మోపుతూ కేసు నమోదు చేశారు. ఎగ్మూర్ కోర్టులో: ఆదాయ పన్ను ఎగవేత వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణ చెన్నై ఎగ్మూర్ ప్రధాన మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో ఆర్థిక నేరాల విచారణ 18 ఏళ్లుగా కోర్టులో సాగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వాలు మారాయి. విచారణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. ఈ కేసు నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ ఇటీవల హైకోర్టును జయలలిత, శశికళ ఆశ్రయించారు. అయితే, ఆ ఇద్దరికి చుక్కెదురైంది. హైకోర్టు పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. అలాగే, ఈ కేసు విచారణను నాలుగు నెలల్లో ముగించాలని ఎగ్మూర్ కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణ వేగవంతం: సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎగ్మూర్ ఆర్థిక నేరాల కోర్టు విచారణ వేగవంతం చేయడానికి నిర్ణయించింది. న్యాయమూర్తి దక్షిణామూర్తి నేతృత్వంలో గురువారం విచారణ జరిగింది. ఆదాయపు పన్ను శాఖ తరపున న్యాయవాది రామస్వామి వాదన విన్పించారు. నేరారోపణ ఎదుర్కొంటున్న జయలలిత, శశికళలపై సెక్షన్ 313 ప్రకారం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. జయలలిత తరపున హాజరైన న్యాయవాదులు వివరణకు ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. నాలుగు వారాల పాటుగా విచారణను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ మూడో తేదీకి న్యాయమూర్తి దక్షిణామూర్తి వాయిదా వేశారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న జయలలిల, శశికళను నేరుగా విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. అదే రోజున ఈ ఇద్దరు తప్పని సరిగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని, అందుకు తగ్గ సమన్లు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు. చుక్కెదురు: ఎన్నికల సమయంలో తమ అధినేత్రికి వ్యతిరేకంగా కోర్టు ఆదేశాలు రావడాన్ని అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దీనిని అస్త్రంగా చేసుకుని ఎక్కడ ప్రతి పక్షాలు తమ మీద దాడికి దిగుతాయోనన్న కలవరం మొదలైంది. తమకు విముక్తి కల్పించాలన్న పిటిషన్లు అన్నీ తిరస్కరణకు గురి కావడం, తాజాగా విచారణకు రావాలంటూ కోర్టు ఆదేశించడంతో తదుపరి కార్యాచరణపై జయలలిత, శశికళ తరపున న్యాయవాదులు సమాలోచనలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యాన్ని అస్త్రంగా చేసుకుని, మరి కొద్ది రోజుల పాటుగా విచారణను వాయిదా వేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం జయలలిత ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉండటమే. -
చంద్రబాబును ఎందుకు నిలదీయరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాజీనామా చేయాలని పదేపదే డిమాండ్ చేస్తున్న ఏపీఎన్జీవో నేతలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును ఎందుకు నిలదీయడం లేదని మంత్రి కొండ్రు మురళి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించాలని చంద్రబాబు లేఖ ఇచ్చినా ఆయన్ను రాజీనామా చేయాల్సిందిగా ఎందుకు డిమాండ్ చేయడంలేదన్నారు. అన్ని పార్టీలు లేఖలిచ్చిన తరువాతే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని...ఇందులో తమ పార్టీ తప్పేముందన్నారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం కొండ్రు మీడియాతో మాట్లాడుతూ కేవలం తమ పార్టీనే లక్ష్యంగా ఆందోళనలు చేస్తే ఊరుకునేది లేదని, ఇకపై తమ పార్టీ నేతల జోలికొచ్చినా, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫొటోలను తగలబెట్టినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇకపై మౌనంగా ఉండకుండా జనంలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. -
క్షమాపణ చెప్పాల్సిందే
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ఉద్యోగులు చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం నెల, రెండు నెలలకంటే ఎక్కువ రోజులు జరగదని.. ఉద్యోగులను, ఉద్యమాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ తిమ్మన్న డిమాండ్ చేశారు. శనివారం స్థానిక అంబేద్కర్ భవన్లో సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ సమావేశం సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ కాకరవాడ చిన్న వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తిమ్మన్న మాట్లాడుతు సీమాంధ్ర పౌరుషం మంత్రికి తెలియనిది కాదని, అయినప్పటికీ ఈ విధంగా మాట్లాడడం దారుణమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో పాటు బిచ్చగాళ్లు, హిజ్రాలు కూడా పాల్గొంటుంటే మంత్రి నీరుగార్చడం తగదన్నారు. మంత్రి టీజీ వైఖరికి నిరసనగా ఈ నెల 19న ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రం విడిపోతే భావి తరాలకు తీరని నష్టం తప్పదని.. విద్యార్థి సంఘాలు నిద్ర వీడి ఉద్యమాల్లో అగ్రభాగాన నిలవాలని కోరారు. వైఎసార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాల్లో విద్యార్థులే ప్రధాన పాత్ర పోషించారని, ఇక్కడా తమ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. న్యాయవాది మురళి మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం ఇంతటి తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నా కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ముఖం చాటేయడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సమావేశంలో జేఏసీ నేతలు యాగంటీశ్వరయ్య, మియ్య, శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.