
నోట్ల వర్షం నడుమ.. మందంపాటి గొలుసులతో బాదుకున్న మంత్రి వీడియో ఒకటి ట్రోల్‌కు గురైంది.
అహ్మదాబాద్: గుజరాత్ మంత్రి అర్వింద్ రైయానీ మూఢనమ్మక విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజ్‌కోట్ జిల్లాలోని తన సొంతూళ్లో గురువారం జరిగిన ఉత్సవం సందర్భంగా ఆయన ఇనుప గొలుసులతో కొట్టుకుంటున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అయింది.
దీంతో ఒక మంత్రి మూఢనమ్మకాలను ప్రొత్సహిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. చుట్టూ కొందరు నోట్లు విసురుతుంటే.. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తికి పోటీగా అర్వింద్ సైతం గోలుసులతో వీపులో బాదుకున్నారు.
అయితే విమర్శలను మంత్రి సున్నితంగా తిప్పికొట్టారు. ‘ఏటా మా సొంతూళ్లో మా కుటుంబసభ్యులంతా కలిసి కులదైవానికి ఉత్సవం జరుపుతుంటాం. చిన్ననాటి నుంచి ఆ దేవత భక్తుడిని నేను. ఉత్సవం సమయంలో గొలుసులతో కొట్టుకున్నా. మా ఆచారాలను గౌరవిస్తాను. పూజల్లో భాగంగా చేపట్టే ఈ కార్యాన్ని మూఢనమ్మకంగా చూడొద్దు’ అని తెలిపారు. కాంగ్రెస్‌కు ఆ రెండింటికి తేడా తెలియదని గట్టి కౌంటరే ఇచ్చారు ఆయన.
રાજકોટ: રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી માતાજીનો માંડવામાં ધુણ્યા#ArvindRaiyani@BJP4Gujarat pic.twitter.com/hDJNbcqr6E
— Gujarat Mirror (@gujaratmirror26) May 27, 2022