superstitious
-
శ్రావణం వరకూ మోగని పెళ్లి బాజాలు
కొవ్వూరు: ఈ ఏడాది ఆగస్టు ఐదో తేదీ వరకూ పెళ్లి బాజాలకు బ్రేక్ పడింది. ఏప్రిల్ 28 నుంచి వరుసగా మూఢమి రావడంతో రెండున్నర నెలలుగా వివాహాలు, ఉపనయనాలు, గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు నిలిచిపోయాయి. క్రోధి నామ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదో తేదీ నుంచి ముహూర్తాలు ప్రారంభమై 26వ తేదీ చైత్ర మాసం వరకూ శుభ ముహూర్తాలు నడిచాయి. ఏప్రిల్ 28వ తేదీ చైత్ర చవితి ఆదివారం నుంచి జూలై ఎనిమిదో తేదీ వరకూ ఆషాఢ శుద్ధ తదియ వరకూ శుక్ర మౌఢ్యమి (మూఢం) నడుస్తోంది. మే 7 నుంచి చైత్ర బహుళ చతుర్ధశి మంగళవారం నుంచి జూన్ ఏడో తేదీ వరకూ గురు మౌఢ్యమి నడిచింది. వరుసగా గురు, శుక్ర మౌఢ్యములు రావడంతో రెండు నెలలుగా వివాహాలకు ఆటంకం ఏర్పడింది. మరో వైపు జూలై ఐదో తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. ఆషాఢ మాసం ఆగస్టు ఐదో తేదీ వరకూ కొనసాగుతుంది. ఇది శూన్యమాసం కావడంతో ఈ ¯ðనెలలో కూడా వివాహాలు, ఉపనయనాలు, గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు నిర్వహించరు. మొత్తం మీద ఏప్రిల్ 28 నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకూ పెళ్లి బాజాలు మోగే అవకాశం లేదని పండితులు, పురోహితులు చెబుతున్నారు. మూఢంలో కేవలం అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, నూతన వ్యాపారాల ప్రారంభోత్సవాలు, సీమంతాలు, రిజి్రస్టేషన్ల వంటి పనులకు మౌఢ్యమిలోని మంచి రోజుల్లో చేసుకోవచ్చునని పండితులు సూచిస్తున్నారు. సెపె్టంబర్ నాలుగో తేదీ నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకూ బాద్రపదం కూడా శూన్యమాసం కావడంతో ఈనెలలో వివాహాల ముహూర్తాలు ఉండవు. శ్రావణ మాసంలోనే.. శ్రావణ మాసం ఆగస్టు ఏడో తేదీ నుంచి ప్రారంభమై 28వ తేదీ వరకూ నడుస్తుంది. ఈ నెలలోనే దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఆగస్టు ఏడో తేదీ నుంచి 28 వరకూ ముహూర్తాలు ఉన్నాయి. వాటిలో 5,12,13,19, 20, 26, 27 తేదీల్లో శుక్ర, మంగళవారాలు మినహా అన్నీ రోజులూ దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.వందలాది మంది ఉపాధికి గండి గత రెండున్నర నెలలుగా వివాహ ముహూర్తాలకు మూఢాలు అడ్డంకి కావడంతో వందలాది మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. కేవలం వివాహాలపై ఆధారపడి ఎన్నో వృత్తుల వారు జీవనం సాగిస్తున్నారు. కల్యాణ మండపాలు, కేటరింగ్, వంటవాళ్లు, పురోహితులు, ఫొటో, వీడియో గ్రాఫర్స్, ట్రావెల్స్ కార్లు, బస్సులు, ఐస్‌క్రీమ్‌లు, మినరల్ వాటర్స్, ఈవెంట్ మేనేజ్మెంట్లు, పూలు, డెకరేషన్స్, లైటింగ్, కూరగాయలు, కిరాణా, వస్త్ర, బంగారు, వెండి వ్యాపారాలు, షామ్యానాలు, మాంసపు దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, సాంస్కృతిక కళాకారులకు పని లేకుండా పోయింది. మరెంతో మంది రోజువారీ కూలీలకూ ఉపాధి కొరవడింది. అడపాదడపా చిన్నచిన్న ఫంక్షన్లు వస్తున్నా పెళ్లిళ్లు అయితే సరైన గిరాకీ లభిస్తుందని ఆయా వర్గాల వారు చెబుతున్నాయి.ఆగస్టు ఏడో తేదీ వరకూ మళ్లీ ఎదురు చూపులు చూడాల్సిందేనని పేర్కొంటున్నారు.శ్రావణంలో దివ్యమైన ముహూర్తాలు గురు, శుక్ర మౌఢ్యాలు వరుసగా రావడంతో వివాహాలు, ఉపనయనాలు, గృహ ప్రవేశాలు 70 రోజుల పాటు నిలిచిపోయాయి. ఏప్రిల్ 28 తర్వాత వివాహాలకు ఇంత వరకు మళ్లీ ముహూర్తాలు లేవు. శ్రావణ మాసంలో ఆగస్టు 7 నుంచి 28 వరకూ నాలుగైదు రోజులు మినహా దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి.సెప్టెంబర్‌లో మళ్లీ భాద్రపద మాసం శూన్యమాసం కావడం వలన వివాహ ముహూర్తాలు ఉండవు. – వారణాసి హనుమంతశర్మ, రాష్ట్ర పురోహిత సంఘం అధ్యక్షుడు, కొవ్వూరు -
‘నాది మూఢనమ్మకం కాదు.. ఆచారాన్ని గౌరవించడం’
అహ్మదాబాద్: గుజరాత్ మంత్రి అర్వింద్ రైయానీ మూఢనమ్మక విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజ్‌కోట్ జిల్లాలోని తన సొంతూళ్లో గురువారం జరిగిన ఉత్సవం సందర్భంగా ఆయన ఇనుప గొలుసులతో కొట్టుకుంటున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అయింది. దీంతో ఒక మంత్రి మూఢనమ్మకాలను ప్రొత్సహిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. చుట్టూ కొందరు నోట్లు విసురుతుంటే.. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తికి పోటీగా అర్వింద్ సైతం గోలుసులతో వీపులో బాదుకున్నారు. అయితే విమర్శలను మంత్రి సున్నితంగా తిప్పికొట్టారు. ‘ఏటా మా సొంతూళ్లో మా కుటుంబసభ్యులంతా కలిసి కులదైవానికి ఉత్సవం జరుపుతుంటాం. చిన్ననాటి నుంచి ఆ దేవత భక్తుడిని నేను. ఉత్సవం సమయంలో గొలుసులతో కొట్టుకున్నా. మా ఆచారాలను గౌరవిస్తాను. పూజల్లో భాగంగా చేపట్టే ఈ కార్యాన్ని మూఢనమ్మకంగా చూడొద్దు’ అని తెలిపారు. కాంగ్రెస్‌కు ఆ రెండింటికి తేడా తెలియదని గట్టి కౌంటరే ఇచ్చారు ఆయన. રાજકોટ: રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી માતાજીનો માંડવામાં ધુણ્યા#ArvindRaiyani@BJP4Gujarat pic.twitter.com/hDJNbcqr6E — Gujarat Mirror (@gujaratmirror26) May 27, 2022 -
సెప్టెంబర్ 14నే ఐఫోన్-13 రిలీజ్..! కారణం అదేనా..!
Is Apple Superstitious?: మొబైల్ లవర్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తోన్న ఐఫోన్-13 సిరీస్ ఫోన్లను ఆపిల్ సంస్థ సెప్టెంబర్ 14 న కాలిఫోర్నియా వేదికగా రిలీజ్ చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్-13 సిరీస్ ఫోన్ల కోసం ఆపిల్ మొబైల్స్ ప్రియులు కళ్లలో వత్తులువేసుకొని కూర్చున్నారు. ఇక ఈ మొబైల్ లాంచింగ్ విడుదలను వీక్షించేందుకు ఈవెంట్‌ను కూడా ఆ సంస్థ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాలు చేసింది. అయితే, ఆపిల్‌కు ఇక్కడో విచిత్రమైన సమస్య ఎదురైంది. ఆపిల్ సంస్థ మూఢ నమ్మకాలను నమ్ముతోందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఐఫోన్-13 సిరీస్ మొబైల్స్‌ను సెప్టెంబర్ 14న లాంచ్ చేయడమే దీనికి కారణం. ఎటువంటి మూఢకాలను నమ్మని నేపథ్యంలో ఐఫోన్-13 సిరీస్ మొబైల్స్‌ను సెప్టెంబర్14 కు బదులు 13 వ తేదీన విడుదల చేయొచ్చు కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ట్విటర్లో #iPhone14 పేరిట హాష్టాగ్ ట్రెండ్ చేస్తున్నారు. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! వచ్చిందంతా పదమూడు నంబర్‌తోనే..! అనేక పాశ్చాత్యదేశాల్లో పదమూడో నంబర్‌ను దురదృష్టసంఖ్యగా భావిస్తారు. ఈ సంఖ్య ఒక గుడ్డి మూఢనమ్మకంగా ఆయా దేశాల్లోని ప్రజల్లో ఉండిపోయింది. పదమూడో నంబర్ ఆయా ప్రజలు ఎంతగా గుడ్డిగా నమ్ముతారో అనేదానికి అనేక ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. ఉదాహరణకు, స్ట్రెస్ మేనేజ్మెంట్ సెంటర్ ఫోబియా ఇనిస్టిట్యూట్ అంచనా ప్రకారం 700 నుంచి 800 మిలియన్ డాలర్లు ప్రతి శుక్రవారం 13 వ ఆయా దేశాల స్టాక్‌ఎక్సేచేంజ్ మార్కెట్లో కోల్పోతారు. ఇదిలా ఉండగా కొన్ని హోటళ్లు 13 వ నంబర్ ఫ్లోర్‌ను దాటవేస్తారు. కొన్ని విమాన సంస్థలు పదమూడో నంబర్‌ను పూర్తిగా తీసివేస్తాయి. తాజాగా నెటిజన్లు ఐఫోన్-13 నంబర్ సిరీస్ నంబర్ మొబైల్ కొన్నవారిపై, ఆపిల్ కంపెనీ దుష్ప్రభావాలు చూపుతోందని ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. మూఢనమ్మకాలకు స్వస్తి చెప్పుతూ.. నేటి టెక్నాలజీ యుగంలో మూఢనమ్మకాలకు తావు ఇవ్వకుండా ఆపిల్ తన పనిని తాను చేసుకుంటుంది. ప్రజల్లోని మూఢనమ్మకాలకు స్వస్తి పలకాలనే ఉద్ధేశ్యంతో ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను కంపెనీ రిలీజ్ చేయనుంది. ఆపిల్‌కు ఈ విచిత్రమైన పరిస్ధితి ఇప్పుడు వచ్చిందంటే పొరపడినట్లే ..! 2010లో ఆపిల్ ఐఫోన్-4 విడుదలకు ముందుకూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంది. నాలుగో నంబర్‌ను చైనా, కొన్ని ఆసియా దేశాల్లో మరణానికి సూచకంగా భావిస్తారు. ఒక నివేదిక ప్రకారం ఐఫోన్-4 అమ్మకాలు భారీగా జరిగాయి. ఐఫోన్-4 రిలీజైనా కొన్ని గంటలకే ఫోన్లన్ని అమ్ముడయ్యాయి. ఇదిలాఉండగా కొన్ని దిగ్గజ కంపెనీలు కెనాన్, నోకియా మాత్రం మూఢనమ్మకాలకు బలం చేకూర్చేలా నాలుగో నంబర్‌ను స్కిప్ చేస్తూ గాడ్జెట్స్‌ను మార్కెట్లోకి వదిలాయి. Iphone 14 is trending? Did we just skip 13 altogether? pic.twitter.com/I2LVg2v1Af — Konrad Juengling (@PDX_er) September 8, 2021 How do all the people speculating about the iPhone 14 (relative to the "iPhone 13") not realize that Apple's gonna skip the 13 altogether, like most high rises skip the 13th floor? pic.twitter.com/2tXNkdbIA1 — James 劉 Mielke (@LimitedRunJames) September 8, 2021 చదవండి: Google Photos: మీ స్మార్ట్ఫోన్లలో డిలీటైనా ఫోటోలను ఇలా పొందండి...! -
బాబోయ్ అక్కడ దయ్యాలు తిరుగుతున్నాయా!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో దయ్యాలు సంచరిస్తున్నాయన్న వదంతులు స్థానికులను బెంబెలెత్తిస్తున్నాయి. గతేడాది డిల్లీలోని ఓ ఇంట్లో 11 మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ ఇంట్లో మోహన్ సింగ్ అనే డాక్టర్ డయాగ్నోస్టిక్ సెంటర్ నడిపిస్తున్నాడు. కాగా, గత కొన్నిరోజులుగా ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఆ ఇంట్లో చనిపోయినవారి ఆత్మలు తిరుగుతున్నాయంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే ల్యాబ్ యాజమాని మాత్రం ఆ వార్తలను కొట్టిపారేసారు. ల్యాబ్ యాజమాని మాట్లాడుతూ.. ‘ఇక్కడ దయ్యలు ఉన్నాయనేది ముఢ నమ్మకం. నేను అలాంటి వార్తలను నమ్మను. దయ్యాలు ఉన్నాయన్నది నిజమైతే నేను ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టే వాడినే కాదు. ఎలాంటి భయం లేకుండానే చాలా మంది రోగులు ఇక్కడికి టెస్టులు చేయించుకునేందుకు వస్తున్నారు. నేను ఇక్కడ గణపతి పూజతో పాటు గౌరి పూజలు చేయిస్తాను. అలా చేసిన తర్వాత మళ్లీ చెడు శక్తులు ఉన్నట్లు భావించకుడదని పూజారి నాకు సూచించారు. ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను నడపడానికి నాకు ఎలాంటి సమస్య లేదు. ఇది ప్రధాన రహదారికి ఆనుకుని ఉంది’ అని తెలిపారు. అలాగే సురేశ్ అనే స్థానికుడు ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘ఆ ఇంట్లో చనిపోయినవారు చాలా మంచివారు. కాబట్టి వారి ఆత్మలు నేరుగా స్వర్గానికి చేరుంటాయి.. ఇక వారు దయ్యలుగా మారే అవకాశం లేదు’ అని అభిప్రాయపడ్డారు. -
ఎవరికైనా దమ్ముంటే..నాకు మంత్రాలు చేయండి
పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్ జిల్లా దొరా బాంచెన్ కాల్మొక్తా.. అనే ఫ్యూడల్ వ్యవస్థను ఎదురించింది. తెలంగాణ ఉద్యమంలో ముందుండి చరిత్ర సృష్టించింది. ప్రతి ఇంటా ఓ ఇంజనీర్ విద్యార్థి. వాడకో మెడికల్ విద్యార్థి. ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్. అరచేతిలో స్మార్ట్ ఫోన్. ప్రతి క్షణం గూగుల్ సెర్చ్. ఆలోచనలు మాత్రం పాతాళంలో. ఇంటి ముందు నిమ్మకాయలు, పసుపు కుంకుమ చూస్తే చాలు ఇంటి పక్కనున్న వారిపైనే అనుమానం. పిచ్చి ముదిరితే ఊరిలో ఉండే అమాయకులపై మంత్రగాళ్లంటూ అనుమానం. చివరికి హత్యల వరకు వెళ్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత కొన్నేళ్లుగా ఇలాంటి హత్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల క్రితం జిల్లాలోని రామగిరి మండలం బేగంపేట సమీపంలోని పన్నూరు వద్ద దేవల్ల లక్ష్మి అనే వృద్ధురాలిని మంత్రాల నెపంతో హతమార్చారు. తాజాగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి మూడు కి.మీ దూరంలో ఉన్న నిమ్మనపల్లిలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. అజ్ఞానాన్ని దూరం చేయని అక్షరాస్యత తెలంగాణలో అన్నింటా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పేరును ప్రథమంగా చెప్పుకోవచ్చు. అక్షరాస్యత ప్రస్తుతం 60శాతం దాటింది. కానీ గ్రామాల్లో మంత్రాల నెపంతో హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిమ్మనపల్లి గ్రామంలో దంపతుల హత్య వెనక ఓ ఆసక్తి కరమైన కథ ఉంది. శంకర్ తన కూతురి పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పందిట్లోనే తూలిపోయాడు. దీంతో ఆ పెళ్లి రద్దయింది. ఇదంతా తన అన్నా, వదినలు చేసిన పన్నాగమేనంటూ పగ పెంచుకొని వారిని అంతమొందించినట్లు తెలుస్తోంది. నాకు మంత్రాలు చేయండి మంత్ర, తంత్రాలు పూర్తి బూటకం. మూఢ నమ్మకాలను వీడాలి. ఎవరికైనా దమ్ముంటే నాకు మంత్రాలు చేసి చూపించాలి. మంత్రాలతో నా నోటిమాట పడిపోవాలి. నా కాళ్లు చేతులు పడిపోవాలి. మంత్రాలున్నాయనే వారికి ఇదే నా సవాల్.– బండారి రాజలింగం, తక్కళ్లపల్లి -
ప్రజలు మూఢ నమ్మకాలు వీడాలి
చెన్నూర్‌రూరల్ : మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలు మూఢ నమ్మకాలను వీడా లని జైపూర్ ఏసీపీ సీతారాములు అన్నారు. మండలంలోని ఆస్నాద గ్రామంలో శనివారం రాత్రి కమిషనరేట్ పరిధిలో మూడ నమ్మకాలపై, రోడ్డు ప్రమాదాలపై, మద్యం తాగితే కలిగే నష్టాలు, ర్యాగింగ్, బాల్యవివాహలు, గల్ఫ్ మోసాలు, రైతుల అత్మహత్యలు వివిధ రకాల సమస్యల గురించి నాటకాల రూపంలో కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులకు సహకరించొద్దన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆన్నారు. యువత చెడు వ్యసనాల జోలికిపోవద్దన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా జేపీవో దృషికి తెస్తే పరిష్కరిస్తారన్నారు. గ్రామంలో మద్యం బెల్ట్ షాపులను నిర్వహించొద్దని సూచించారు. చెన్నూర్ పట్టణ సీఐ కిశక్షర్, సర్పంచ్ కొల్లూరి బుచ్చమ్మ, లచ్చన్న, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
పెచ్చరిల్లిన మూఢజాడ్యం
దాసరిగూడెం (నార్కట్‌పల్లి): ‘‘చేతబడి చేసి నా తండ్రిని పొట్టనబెట్టుకున్నావ్.. ఎప్పటికైనా నిన్ను చంపుతా’’ ఓ యువకుడు ఐదు పదుల వయసు దాటిన వ్యక్తిని పలుమార్లు బెదిరించాడు..అందరూ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు.. కానీ ఆ యువకుడు అతడితో పాటే కూలీ గా చేస్తూ దారుణంగా నరికి హత్య చేశాడు.. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా వృద్ధి చెందుతున్నా..పచ్చని పల్లెల్లో మూఢజాడ్యం పెచ్చరిల్లుతూనే ఉందనడానికి నార్కట్‌పల్లి మండలం దాసరిగూడెంలో బుధవారం వెలుగుచూసిన హత్యోదంతమే ఉదాహరణ. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆది నుంచి అనుమానాలే.. నార్కట్‌పల్లి మండలం దాసరిగూడెం గ్రామానికి చెందిన శ్రీలోజు రామలింగాచారి (55) కులవృత్తితో పాటు కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు చొప్పున కుమారులు, కూతుళ్లు ఉన్నారు. అందరి వివాహాలు జరిపించాడు. పెద్ద కుమారుడు జిల్లా కేంద్రంలో ఉంటుండగా, చిన్న కుమారుడితో రామలింగాచారి గ్రామంలోనే నివాసముంటున్నాడు. అయితే కొన్నేళ్లుగా గ్రామంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు రామలింగాచారే కారణమని గ్రామస్తులు భావిస్తున్నారు. ఇతడు చేతబడి చేయడంతోనే ఆ ఘటనలు చోటు చేసుకున్నాయని వాదనలు బలంగా ఉన్నాయి. ఏడాది క్రితం ఇదే గ్రామానికి చెందిన గుడిసె యాదయ్య ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి మృతికి కూడా రామలింగాచారే కారణమని అనుమానిస్తూ అతడి కుమారుడు రాంజనేయులు కక్ష పెంచుకున్నాడు. పలుమార్లు రామలింగాచారిని బాహాటంగానే బెదిరించేవాడని గ్రామస్తులు పేర్కొన్నారు. అయితే రామలింగాచారి, రామంజనేయులు ఇద్దరూ కలిసి గ్రామంలోని ఉప్పల లింగారెడ్డి కోళ్ల ఫారంలో కూ లీలుగా పనిచేస్తున్నారని తెలిపారు. నీ తండ్రిని చంపుతా..! రామలింగాచారి చిన్న కుమారుడు శంకరాచారి ఇటీవల అత్తగారింటికి వెళ్లడంతో రామలింగాచారి ఇం ట్లో ఒంటరిగా ఉన్నాడు. కాగా, రామంజనేయులు మంగళవారం రాత్రి పూటుగా మద్యం సేవించాడు. శంకరాచారికి ఫోన్ చేసి నీ తండ్రిని చంపుతానని బెదిరించాడు. ఎప్పటిలాగే తాగి వాగుతున్నాడని..ఉదయం వచ్చి మాట్లాడతానని చెప్పానని, ఇలా ఘాతుకానికి ఒడిగడతాడని అనుకోలేదని మృతుడి కుమారుడు శంకర్ వాపోయాడు. ఒక్కడే ఘాతుకానికి ఒడిగట్టాడా..? రామంజనేయులు పూటుగా మద్యం సేవించి రామలింగాచారి ఇంటికి వచ్చాడు.కోళ్ల ఫారంలో కోళ్ల లోడ్ ఎత్తేది ఉందని ఇంట్లో ఒంటరిగా ఉన్న రామలింగాచారిని వెంట తీసుకెళ్లాడు. గ్రామంలోని ఆంజ నేయస్వామి ఆలయం వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. రామంజనేయులు కోళ్ల ఫారం యజమాని వద్దకు వెళ్లి రామలింగాచారిని హత్య చేశానని చెప్పి పారిపోయాడు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని సీఐ ప్రవీణ్ కుమార్‌రెడ్డి,ఎస్ఐ మోతీరామ్, ఏఎస్ఐ గౌస్ పరిశీ లించారు. అయితే హత్య జరిగిన తీరు పరి శీలిస్తే ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడా..? ఇంకెవరైన పాల్గొన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని పోలీసులు చెప్పారు. పోలీసుల అదుపులో నిందితుడు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రామంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. అయితే చేతబడి నెపంతోనే రామలింగాచారిని హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు పేర్కొన్నట్టు తెలిసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
మూడనమ్మకంతో నాలుకకు వాతలు