chain
-
నేటి నుంచి మార్కెట్లోకి ‘భారత్ రైస్’
కేంద్ర ప్రభుత్వం బియ్యం ధరల తగ్గింపునకు శ్రీకారం చుట్టి, సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది. మంగళవారం (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు భారత్ రైస్‌ను ప్రభుత్వం మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ బియ్యాన్ని కిలో రూ.29కి విక్రయించనున్నారు. బియ్యం ధరల తగ్గింపునకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, దేశీయ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలలో గణనీయమైన తగ్గింపు లేదు. నిత్యావసరాల ధరలు ప్రస్తుతం 14.5 శాతం మేరకు పెరిగాయి. భారత్ రైస్ నేటి నుంచి ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్‌తో సహా అన్ని చైన్ రిటైల్‌లలో అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిలో రూ.29కి లభ్యమయ్యే భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల బస్తాలలో లభించనుంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తొలుత భారత్ బ్రాండ్ కింద తక్కువ ధరకు గోధుమ పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టమోటాల విక్రయాలను ప్రారంభించింది. ‘భారత్ ఆటా’ను 2023, నవంబరు 6న ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది బయటి మార్కెట్లో కిలో రూ. 35 ఉండగా, ప్రభుత్వం రూ.27.50కే అందిస్తోంది. అదే సమయంలో పప్పులు కిలో రూ.60కి అందుబాటులోకి వచ్చాయి. -
రైల్లో అలారం చైన్‌కు లగేజీ తగిలిస్తే కేసు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులు, లగేజీ బ్యాగులు, సెల్ఫోన్లను అలారం చైన్ పుల్లింగ్ పరికరానికి వేలాడదీయడం చట్టరీత్యా తీవ్ర నేరమని రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో హెచ్చరించారు. పలు ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్ల కోచ్‌లను ఎల్బీహెచ్ కోచ్‌లుగా ఆధునీకరించారు. అత్యవసర పరిస్ధితిలో రైలును ఆపేందుకు గతంలో ఉపయోగించిన అలారం చైన్ స్థానంలో పాసింజర్స్ ఎమర్జెన్సీ అలారం సిగ్నలింగ్ డివైజ్ (పీఈఏఎస్డీ) అమర్చారు. ఈ పరికరం ఎరుపు రంగుతో హ్యాండిల్‌ను పోలి ఉండటంతో ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులు, లగేజీలు, సెల్‌ఫోన్‌ను వేలాడదీస్తున్నారు. ఈ కారణంగా పరికరం ఆటోమెటిక్‌గా లాక్ అయ్యి రైలు నిలిచిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ఈ తరహా ఘటనలు అక్టోబరు వరకూ డివిజన్ వ్యాప్తంగా 2,159 జరిగినట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు సరైన కారణం లేకుండా అలారం చైన్ ఉపయోగించడం తీవ్ర నేరమని, రైల్వే చట్టం 141 సెక్షన్ ప్రకారం రూ.1000 జరిమానా, లేదా ఒక ఏడాది జైలు శిక్ష లేదా రెండు విధించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చదవండి: ‘స్కిల్’ శిక్షకులకు ఆహ్వానం -
తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్‌లోనే..
రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ( Reliance Retail Ltd ) వ్యాల్యూ అపరెల్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పటికే ప్రసిద్ధి చెందిన టాటా జూడియో ( Tata Zudio ) చైన్, ల్యాండ్‌మార్క్ గ్రూప్ యాజమాన్యంలోని మ్యాక్స్, షాపర్స్ స్టాప్‌కు చెందిన ఇక్ ట్యూన్‌కి పోటీగా కొత్త బ్రాండ్ యూస్టా ( Yousta )ని ప్రారంభించింది. అన్ని ఉత్పత్తులు రూ. 999 లోపే సమకాలీన టెక్-ఎనేబుల్డ్ స్టోర్ లేఅవుట్లతో, యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సరసమైన ధరలకు యూస్టా హై ఫ్యాషన్ ఉత్పత్తులను అందిజేస్తుందని కంపెనీ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్టోర్‌లో అన్ని ఉత్పత్తులు రూ. 999 కంటే తక్కువ ధరకే లభిస్తాయి. అందులోనూ ఎక్కువ భాగం రూ. 499 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం విశేషం. హైదరాబాద్‌లో తొలి స్టోర్ రిలయన్స్ యూస్టా తమ తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్లో ప్రారంభించింది. యూస్టా స్టోర్లను అనేక టెక్ టచ్ పాయింట్లను అమర్చారు. క్యూఆర్ స్క్రీన్లు, సెల్ఫ్-చెక్అవుట్ కౌంటర్లు, కాంప్లిమెంటరీ వైఫై, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ యూస్టా ఉత్పత్తులను అజియో ( Ajio ), జియో మార్ట్ ( JioMart ) ద్వారా కూడా ఆన్లైన్లో యాక్సెస్ చేయవచ్చు. -
గెజిట్‌లో ఆన్లైన్ రమ్మీ నిషేధ చట్టం
ఆన్లైన్ రమ్మీ.. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఈ పదమే ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకుల నోట్లో ఎక్కువగా నలిగిందంటే అతిశయోక్తి కాదేమో. సామాన్యుల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు ఈ ఆటకు బానిసై అప్పులపాలైన వారు ఎందరో..! ఇక రుణఒత్తిడి భరించలేక బలవన్మరణాలకు పాల్పడిన వారూ పదుల సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక తర్జనభర్జనలు, విమర్శలు, ప్రతి విమర్శల తర్వాత ఎట్టకేలకూ ఆన్లైన్ రమ్మీ నిషేధం బిల్లుకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు.మంగళవారం ఈ మేరకు గెజిట్‌లో ప్రచురించడంతో ఇకపై ఆన్లైన్ పేకాట ఆడితే.. తాటతీస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సాక్షి, చైన్నె: ఆన్లైన్ రమ్మీని నిషేధిస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని ప్రభుత్వ గెజిట్‌లో మంగళవారం ప్రకటించారు. గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదంతో న్యాయశాఖ కార్యదర్శి గోపి రవికుమార్ సంతకంతో ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ, సమగ్ర వివరాలను,శిక్షలు, కమిషన్ ఏర్పాటు గురించి గెజిట్‌లో వివరించారు. దీంతో కమిషన్ చైర్మన్, సభ్యుల ఎంపిక చేసేందుకు సీఎం ఎంకే స్టాలిన్ కార్యాచరమ ప్రారంభించారు. నేపథ్యం ఇదీ.. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీకి బానిసై, అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడిన వారి సంఖ్య తాజాగా 43కు చేరిన విషయం తెలిసిందే. ఈ గేమింగ్‌ను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన చట్టాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించారు. దీంతో గత నెల మరోసారి అసెంబ్లీ వేదికగా చట్టానికి మెరుగులు దిద్ది సభ ఆమోదంతో రాజ్‌భవన్‌కు పంపించారు. దీనిని కూడా ఆమోదించేందుకు గవర్నర్ కాలయాపన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించింది. గవర్నర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం తీసుకురావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో ఈ చట్టాన్ని ఆమోదిస్తూ గవర్నర్ ఆర్ఎన్రవి నిర్ణయం తీసుకున్నారు. గెజిట్‌లో చట్టం వివరాలు.. ఈ చట్టంలోని సమగ్ర వివరాలను 13 పేజీలలో పొందు పరిచారు. ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి బెట్టింగ్ గేమింగ్‌లపై రాష్ట్రంలో నిషేధించినట్లు వివరించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన పక్షంలో మూడు కేటగిరీలుగా విభజించి శిక్ష విధించనున్నారు. గేమ్ ఆడే వారు, ప్రకటనలు చేసే వారు, నిర్వాహకులుగా విభజించి అందరికీ వివిధ రకాల శిక్షలను, జరిమానాలను విధించనున్నారు. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు కానుంది. ఈ కమిషన్‌కు చైర్మన్, సభ్యులు ఉంటారు. అలాగే ఈ గేమింగ్ వ్యవహారలపై సైబర్ క్రైం నిఘా ఉంచనుంది. తమిళనాడులో ఈ గేమింగ్ నిషేధం వివరాలను సంబంఽధిత సంస్థలకు తొలుత నోటీసుల ద్వారా తెలియజేయనున్నారు. అప్పటికీ ఆ యా సంస్థలు గేమింగ్‌లు నిర్వహిస్తే తొలుత సైబర్ క్రైం కొరడా ఝుళిపిస్తుంది. అలాగే సమగ్ర వివరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిషన్‌కు అందజేస్తుంది. ఈ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉన్న అన్ని అధికారాలూ ఉంటాయి. తొలిసారిగా గేమ్ ఆడి పట్టుబడే వారికి 3 నెలలు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తారు. ఫేస్బుక్ వంటి వ్యక్తిగత సామాజిక మాధ్యమాల పేజీల్లోకి ప్రకటనల రూపంలో నిషేధిత బెట్టింగ్ గేమింగ్ సమాచారం పంపిన పక్షంలో, ఆ ప్రకటనదారుకు, నిర్వహకులకు ఏడాది జైలు శిక్ష, రూ. 5 లక్ష వరకు జరిమానా విధించనున్నారు. మళ్లీ మళ్లీ పట్టుబడిన పక్షంలో ఐదేళ్లు వరకు జైలు, రూ. 20 లక్షల వరకు జరిమానా విధించే విధంగా కఠినంగా వ్యవహరించనున్నారు. కమిషన్ ఏర్పాటుకు కార్యాచరణ ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని మంగళవారం సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు, చట్ట నిపుణులతో సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలతో పదవీ విరమణ పొందిన సీనియర్ ఐఏఎస్, ఐజీ స్థాయి పోలీసు అధికారులు, ఆన్లైన్ రంగంలోని నిపుణులను ఈ కమిషన్‌లో సభ్యులుగా నియమించనున్నారు. ఈ జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కమిషన్ ఏర్పాటుతో ఆన్లైన్ రమ్మీ నిషేధ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్టే. గేమింగ్‌లను క్రమబద్ధీకరించే విధంగా ఈ కమిషన్ కొరడా ఝుళిపించనుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు ఆన్లైన్ రమ్మీ తదితర బెట్టింగ్ గేమింగ్ల యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
‘నాది మూఢనమ్మకం కాదు.. ఆచారాన్ని గౌరవించడం’
అహ్మదాబాద్: గుజరాత్ మంత్రి అర్వింద్ రైయానీ మూఢనమ్మక విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజ్‌కోట్ జిల్లాలోని తన సొంతూళ్లో గురువారం జరిగిన ఉత్సవం సందర్భంగా ఆయన ఇనుప గొలుసులతో కొట్టుకుంటున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అయింది. దీంతో ఒక మంత్రి మూఢనమ్మకాలను ప్రొత్సహిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. చుట్టూ కొందరు నోట్లు విసురుతుంటే.. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తికి పోటీగా అర్వింద్ సైతం గోలుసులతో వీపులో బాదుకున్నారు. అయితే విమర్శలను మంత్రి సున్నితంగా తిప్పికొట్టారు. ‘ఏటా మా సొంతూళ్లో మా కుటుంబసభ్యులంతా కలిసి కులదైవానికి ఉత్సవం జరుపుతుంటాం. చిన్ననాటి నుంచి ఆ దేవత భక్తుడిని నేను. ఉత్సవం సమయంలో గొలుసులతో కొట్టుకున్నా. మా ఆచారాలను గౌరవిస్తాను. పూజల్లో భాగంగా చేపట్టే ఈ కార్యాన్ని మూఢనమ్మకంగా చూడొద్దు’ అని తెలిపారు. కాంగ్రెస్‌కు ఆ రెండింటికి తేడా తెలియదని గట్టి కౌంటరే ఇచ్చారు ఆయన. રાજકોટ: રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી માતાજીનો માંડવામાં ધુણ્યા#ArvindRaiyani@BJP4Gujarat pic.twitter.com/hDJNbcqr6E — Gujarat Mirror (@gujaratmirror26) May 27, 2022 -
కొత్త బిజినెస్‌ను కన్మర్ఫ్ చేసిన సూపర్‌స్టార్
Salman Khan About Salman Talkies: నటుడిగానే కాదు.. నిర్మాతగా, ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌గా , బీయింగ్ హ్యూమన్ లాంటి బ్రాండ్‌తో వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్. ఇప్పుడీ సీనియర్ హీరో కొత్త బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నాడు. చిన్న చిన్న పట్టణాల్లో థియేటర్ల చెయిన్‌తో ప్రేక్షకుడిని అలరించబోతున్నాడు. ‘సల్మాన్ టాకీస్’ పేరిట వీటిని నడిపించబోతున్నట్లు తెలుస్తోంది. ముందు మహారాష్ట్రలో మొదలుపెట్టి.. ఆ తర్వాతి పదేళ్లలో దేశం మొత్తం విస్తరించాలన్నది సల్లూ భాయ్ ప్లాన్. నిజానికి ఈ ప్రాజెక్టు కొన్నేళ్ల క్రితం ప్రతిపాదనే. అయితే అది ఆగిపోయిందని అంతా భావించారు. ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా సల్మాన్ టాకీస్ గురించి వార్త చక్కర్లు కొడుతుండడంతో.. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా సల్మాన్ ధృవీకరించాడు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని, త్వరలోనే సల్మాన్ టాకీస్ ప్రాజెక్ట్‌ను లాంఛ్ చేయనున్నట్లు వెల్లడించారు. ‘ముంబై లాంటి మహానగరాల్లో కాదు.. థియేటర్ సౌలభ్యం లేని చిన్న ఊర్లలో వీటిని ప్రారంభిస్తాం. పనులు కరోనా వల్ల కాస్త ఆలస్యం అవుతోంది అంతే!’ అని సల్మాన్ వెల్లడించాడు. చిన్న చిన్న పట్టణాల్లో ట్యాక్స్ ఫ్రీ టికెట్లతో అనుమతులతో థియేటర్ల చెయిన్ ‘సల్మాన్ టాకీస్’గా వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యంగా మాస్ ఆడియొన్స్‌ను దృష్టిలో పెట్టుకుని వీటిని మొదలుపెడుతున్నాడు సల్మాన్. అంతేకాదు టికెట్లపై సబ్సిడీ రేట్లు, పిల్లలకు ఉచిత టికెట్లతో వీటిని నడిపించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో చాలాకాలం సల్మాన్ చర్చలు జరిపినట్లు ముంబై మిర్రర్ ఒక కథనం ప్రచురించింది. సినిమాలతోనే కాదు.. బిగ్‌బాస్‌లాంటి రియాలిటీ షోల ద్వారా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు సల్మాన్. ఇక 2011లో సల్మాన్ సొంత ప్రొడక్షన్ హౌజ్ ‘సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ ప్రొడక్షన్స్ హౌజ్ ప్రారంభించాడు. ఈ బ్యానర్లో తీసిన సినిమాల ద్వారా వచ్చిన సొమ్ము.. బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్‌కు వెళ్తోంది. ఇక బీయింగ్ హ్యూమన్ క్లాతింగ్ బ్రాండ్ సాలీనా టర్నోవర్ 500 కోట్ల రూపాయలుగా ఉంటోంది. -
దొంగ బంగారు చైన్ ముక్క మింగేశాడు కానీ..
సాక్షి, బెంగళూరు : ‘‘తొండి మొదలుమ్ ద్రిక్షక్షియుమ్’’ మళయాల సినిమాలో హీరో ఫాహద్ ఫజిల్( ఓ దొంగ) బస్‌లో బంగారు గొలుసు కొట్టేసి, దొరక్కుండా ఉండటానికి దాన్ని మింగేస్తాడు. అచ్చం అలాంటిదే కాకున్నా.. ఓ దొంగ చైన్ ముక్కను మింగేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. సిటీ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ చైన్ స్నాచింగ్ జరిగింది. ఎంటీ స్ట్రీట్‌కు చెందిన హేమ అనే మహిళ దుకాణానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ముగ్గురు స్నాచర్లు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొడానికి యత్నించారు. ఆమె కేకలు వేస్తూ చైన్‌ను గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో చైన్‌లోని ఓ భాగం దొంగ చేతిలో చిక్కింది. స్థానికులు అక్కడికి చేరుకుని ఓ స్నాచర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు. ఇదే సమయంలో గొలుసు ముక్కను దొంగ మింగేశాడు. పోలీసుల విచారణలో తన వద్ద గొలుసు లేదని చెప్పడంతో పోలీసులు అనుమానంతో నగరంలోని విక్టోరియా ఆస్పత్రిలో స్కానింగ్ చేయించారు. కడుపులో బంగారుచైన్ ముక్క కనిపించింది. పోలీసులు కక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. చదవండి : అన్నయ్య రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య -
వీడియో : ఢిల్లీలో చైన్ స్నాచింగ్
-
గోల్డ్ ది గ్రేట్
నా పేరు శ్యామ్ సుందరం అండీ. నా భార్య నన్ను అందంగా శ్యామ్ అని పిలుచుకుంటుందండీ. అయితే ఇప్పుడు నేను నా గురించో, నా భార్య గురించో చెప్పబోవడం లేదు. నా కుక్క గురించే చెప్పాలనుకుంటున్నానండీ. కుక్కే గాని కుక్క అనడం నాకిష్టం లేదనుకోండి. మీకందరికీ అలా ముందు ముందుగా ఆ ముక్కేదో చెప్పేస్తే తర్వాత్తర్వాత అలా అనకపోయినా పర్లేదని అనేశానన్నమాట. వాడికో పేరుందండి. దటీజ్ గోల్డీ అండి. వాడని ఎందుకన్నానంటేనండి, వాడు వాడు కాబట్టి. అది కాదు కాబట్టి అని మీకు మనవి చేసుకోవాలనే ఈ కాస్త వివరణ. సుత్తి లేకుండా సూటిగా విషయానికొచ్చేస్తానండి. మా గోల్డీ గాడు నన్ను వదిలి పారిపోయాడండి. నన్ను ఒంటరోణ్ణి చేసి అకస్మాత్తుగా ఎటో మాయమైపోయాడండి. కారణం చిన్నదేనండి. కానీ దానికి ముందు మేటర్ మాత్రం చాలా పెద్దదే వుందండి. మీతో నా బాధ పంచుకోవాలని నా ఆరాటం. సాక్షాత్తు కన్న కొడుకు ఇంటి నుంచి పారిపోయినట్టనిపిస్తోందండి. గోల్డీ కేవలం ఒక కుక్క కాదు సార్. నా ప్రాణం. నా కుటుంబ సభ్యులతో కంటే, వాడితో నేను, నాతో వాడు గడిపిన క్షణాలే ఎక్కువ. వాడు నాకు దొరకడమే ఓ విచిత్రం. మార్నింగ్ వాకింగ్‌లో రోజూ కూడా నడిచేవాడు. మేం గవర్నమెంట్ క్వార్టర్స్‌లో వుంటాం. రాత్రిపూట మా క్వార్టర్ ముందే పడుకునే వాడు. పొద్దునే వాకింగ్ కోసం నేను తలుపులు తీయగానే పటపటా వొళ్ళు దులుపుకుని రెడీ అయిపోయేవాడు.పొద్దున్నే కుక్క మొహం చూడ్డం ఏంట్రా బాబూ అనుకుని ఛీ అని విదిలించేవాణ్ణి. కొన్ని బంధాలు అంత తేలిగ్గా వదిలించుకోలేం. వాడు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా నా వెంటే నడిచేవాడు. కొన్నాళ్ళకి మేం వేరే క్వార్టర్‌కి మారినప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ తినేవాడో ఏమో! అప్పుడిక అనుకున్నాను, వీడికీ నాకూ ఎక్కడో లింకుందని. మా ఆవిడతో చెప్తే అన్నం పెట్టడం మొదలుపెట్టింది. వాడు ఇక మా ఇంట్లోకి రావడం మొదలుపెట్టాడు. అయినా ఆ హిస్టరీ అంతా ఇప్పుడెందుకులెండి. ‘వాడిని ఈ మధ్య గొలుసు వేసి తిప్పుతున్నారే. ఎలా పోయాడు?’ అంటున్నారంతా. విషయం గొలుసు కాదు. నిజమే! ఇంతకుముందు గొలుసు లేకుండా వదిలేసేవాళ్ళం. ఈ మధ్యనే గొలుసు వేసి బంధించడం మొదలుపెట్టాం. అలవాటు లేని కట్టడి. నచ్చి వుండక పోవచ్చు. కానీ కారణం అది కాదనుకోండి. ఏదో చిన్న తప్పు చేశాను. దానికింత పెద్ద శిక్ష వేశాడు వాడు. బంధమే తెంచుకుని పోయాడు. నాతో ఉన్న బంధాన్ని తెంచుకుని పోయాడు. ఆగండి కొంచెం. కన్నీళ్ళొస్తున్నాయి.ఏమిటో నేనేదో నా కడుపులో దు:ఖం మీతో చెప్పుకుంటున్నా కదా! కాసేపు ఆగొచ్చుగా వెదవ కన్నీరు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పొంగాలో తెలీదు. అదిగో ఆ సిమెంటు దిమ్మ మీద కాసేపు కూచుంటాను. హమ్మయ్య కూచున్నాన్లెండి. ఇక్కడ నేను కూర్చున్నప్పుడల్లా ఎగిరి గంతేసి పక్కనే కూర్చునేవాడు మా గోల్డీ. ఇంకెవరి కుక్కయినా నా దగ్గరకొచ్చి ముద్దు చేయించుకుంటే నా సామిరంగా ఇక ఎటాకే అన్నమాట. కుళ్ళుమోతోడు. నేనెవరినీ ముద్దు చేయకూడదు వాణ్ణి తప్ప. నేను లేకపోతే హాయిగా కాలనీలో కుక్కలతో బాగానే ఆడుకుంటాడు. సర్లెండి. ఆ సోదంతా ఎందుకు గాని. బంధాలు మక్కువే కాని బంధనాలు ఎవరికిష్టం వుంటాయి చెప్పండి? కానీ మా గోల్డీ గాడు మాత్రం నా బంధం తెంచుకుపోయింది గొలుసు గురించి కాదు. వాడికీ నాకు చాలా ఇష్యూస్ వున్నాయి.మీరలా నవ్వక్కర్లేదండోయ్. ఏదో పెళ్లాంతో, పిల్లలతో వున్నట్టు ఒక కుక్కతో ఇష్యూసేంటండీ అని పగలబడుతున్నారు కదా! నేనూహించగలను. నవ్వుకుంటే నవ్వుకోండి. ఇంతకీ గొలుసు ఎందుకేసేనో ముందు చెప్తాను. వీధిలో వదిలితే బయటి కుక్కలన్నీ వాడి మీదే ఎగబడతాయి. అయితే మీరనుకున్నట్టు కుక్కలన్నీ మీదపడి కరుస్తాయని కాదు గొలుసు వేసింది. మేటర్ వేరే వుంది. కుక్కలన్నీ మా వాడంటే ఇష్టపడుతున్నాయి. ఆడ కుక్కలు ఇష్టపడితే సరే. మగ కుక్కలు కూడా వెనకపడతాయి. మా వాడి రంగు బంగారంలా మెరిసిపోతుంది. వాడి పేరు గోల్డీ అని పెట్టడానికి కారణం అదే. వాడంటే కుక్కలకు అట్రాక్షన్ వెనక కారణం కూడా అదే. అందుకే గొలుసు వేయాల్సి వచ్చింది.‘ఏమిటీ.. గొలుసు వేయడం దేనికి? హాయిగా ఎంజాయ్ చేయనివ్వొచ్చు కదా!’ అంటారా? నా పాయింట్ అది కాదండి బాబూ.అందులో నాకిష్టం లేని కుక్క ఒకటి వుంది. దాని మీదే మా వాడు మనసు పారేసుకున్నాడు. ఏమిటీ పిచ్చి మాటలని కొట్టి పారేయకండి. నిజంగా ఆ కర్రి కుక్క మీద మా వాడికి పిచ్చే పట్టింది. అది బక్కగా ఎండు కట్టెలా వుంటుంది. పైగా మచ్చలు మచ్చలు. ఛీ ఒకటే రోతగా వుంటుంది. ఎంత కొట్టినా అది మా ఇంటి చుట్టే తిరుగుతుంది. ‘నిను వీడని నీడను నేనే’ అని పాట పాడుతుందేమో. అంతే అది మా గోల్డీ గాడికి తెలిసిపోతుంది. ఇక ఒక్కసారిగా పైకి లేస్తాడు. నన్ను అదోలా చూస్తాడు. వాడెప్పుడు ఎలా చూస్తాడో నాకు తెలుసు. నా ప్రేయసితో నన్నెన్నాళ్ళు దూరంగా వుంచుతావో నేనూ చూస్తా అన్నట్టు వుంటాయి వాడి చూపులు. ఏమాత్రం వీలు దొరికిందా ఇంక దానితోనే షికార్లు. మా గోల్డీ తక్కువోడు కాదు సార్. మహా ముదురు నా కొడుకు. అదంటే నాకు ఇష్టముండదని వీడికి తెలుసు కదా, నేను పక్కనున్నప్పుడు మాత్రం అది పక్కకొస్తే దాన్ని దూరంగా అరిచి తరిమేస్తాడు. అబ్బే మా మధ్య ఏమీ లేదు అని చెప్పడానికన్నమాట. వాళ్ళిద్దరూ కలుసుకునే రహస్య స్థావరాలు వేరే వున్నాయి లెండి.‘ఏమైందండీ తిరిగితే?’ అంటారు మీరు. ఎదుటివాళ్ళకయితే ఎన్నయినా చెప్తాం లెండి. మా పక్క క్వార్టర్లో సుధాకర్ గారు పెంచుకుంటున్నారే, ఆ తెల్లబొచ్చు తింగరి బుచ్చితో తిరగొచ్చు కదా. అబ్బే అదంటేనే గిట్టదు. అది దగ్గరికొస్తే చాలు భయంకరంగా అరుస్తుంది. పాపం దానికేమో వీడి మీద మోజు. ఏంట్రా చిన్నా ఆ కర్రి దాంతో ఎందుకురా? ఈ తెల్లదానితో జతకట్టరా అన్నాను. దానికి మావోడేమన్నాడో తెలుసా? చెప్తాను జస్ట్ వెయిట్. ప్లీజ్ లెట్ మీ టేక్ సమ్ బ్రేక్. మీరు కూడా కాస్త రిలాక్సవ్వండి. ఆ.. ఎక్కడున్నాను? ఓకే. నేనూ మా గోల్డీ ఏ భాషలో మాట్లాడుకున్నామో సెలవివ్వండని మీరు ఏమైనా వ్యంగ్యం పోవాలనుకుంటున్నారా? మీకేం తెలుసండి బాబూ. అందరికీ అన్ని భాషలుంటాయి. మా ఇద్దరికీ అర్థమయ్యే భాష ఒకటుంది. అది చెవులు కదిపితే ఏమంటుందో, తోక అదే పనిగా ఊపితే ఏమంటుందో, కళ్ళు కుడివైపు తిప్పితే అర్థమేంటో, ఎడమ వైపు తిప్పితే అర్థమేంటో, తన చుట్టూ తాను తిరుగుతున్నట్టే తిరుగుతూ నా వైపు చూస్తే అర్థమేంటో, ఎప్పుడు మొరుగుతుందో, ఎప్పుడు మూలుగుతుందో అన్నీ నాకు తెలుసు. రాత్రి నేను చాలాసేపు చదువుకుంటూ వుంటాను. వాడు నన్ను చదువుతూ వుంటాడు. నా ప్రతి కదలికా వాడికి క్షుణ్ణంగా తెలుసు. పడుకున్నట్టే వుంటాడు కానీ కళ్ళు మూసినా తెరిచినా వాడి పరిశోధనాంశం నేనే. చెప్పాల్సిందేమంటే నా భాషని మా గోల్డీ బాగా నేర్చుకున్నాడు. సరే విషయానికొస్తాను. మా గోల్డీ ఏమన్నాడంటే...‘మీలా అన్ని రంగులు మాకు తెలీదు. కాబట్టి రంగు భేదం పాటించడం మా జాతికి తెలియని విషయం.’ అని తేల్చి చెప్పాడు. అబ్బా చెంప మీద కొట్టినట్టనిపించిందండి. వాడు ఏ అంగ విన్యాసంతో ఈ మాట చెప్పాడని మీరు వంకర్లు పోతూ అడగక్కర్లేదులెండి. ప్రతీదీ అవయవాలతోనే చెప్పాలా? వాడి చూపులు చాలు. చూడబోతే మనుషుల కంటే కుక్కలకే ఎక్కువ తెలివి తేటలున్నాయని నేను చెప్పబోతున్నట్టుగా మీరు నిర్ధారించుకుంటే మీరు జ్ఞానవంతులే. పదివేల నుంచి లక్ష రెట్లు ఎక్కువ మనుషుల కంటే వాసన చూసే శక్తి కుక్కలకు వుంటుందని తెలుసుకుని మా గోల్డీగాణ్ణి ఒక గ్రహాంతర వాసిలా చూడ్డం మొదలుపెట్టాను. వాడి పుణ్యమా అని కుక్కల గురించి చాలా చాలా చదివేశాను. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో సెన్సరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ జేమ్స్ వాకర్ వారి బృందం చేసిన పరిశోధనలు చూస్తే మతిపోయింది. అంతెందుకు చెప్పండి. అలెగ్జాండ్రా హోరోవిట్జ్ అనే ఆవిడ రాసిన ‘ఇన్ సైడ్ ఆఫ్ ఏ డాగ్’ అనే పుస్తకం ఒకటి చాలు. ఆ లెక్కకొస్తే మా గోల్డీ ప్రపంచంలోనే అత్యున్నత మేలు జాతి శునకాల కంటే మేలైన మేధస్సు ఉన్నవాడని నేను ఢంకా భజాయించి చెప్పగలను. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను చాలు.మా ఇంటికి ఒకసారి ఎవరైనా కొత్తగా వస్తే గోల్డీ మొరుగుతాడు. మళ్లీ వస్తే మొరగడు. ఓహో కొత్త వాళ్ళొస్తే మొరుగుతాడు కదా అనుకున్నాం. ఒకసారి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. మొరగలేదు.ఆశ్చర్యపోయాం. తీరా ఆరా తీస్తే ఆ వచ్చిన వ్యక్తి ఇంతకు ముందు వచ్చిన వ్యక్తికి పరిచయమున్న వాడు. అంటే ఒక మనిషి నుంచి ఆ మనిషికి సంబంధించిన మనుషుల వాసన కూడా పసిగట్టాడన్న మాట. కుక్కల్ని కొట్టేవాళ్ళు ఎవరైనా రోజూ వచ్చినా రోజూ మొరుగుతాడు. అదేమిటబ్బా అని ఆరా తీస్తే వాళ్ళకి కుక్కలంటే పడదని తెలిసింది. అందుకే మా గోల్డీకి వాళ్ళంటే పడదు. ఇంతకీ ఆ నల్ల కుక్క దగ్గరకి మా గోల్డీని పోనివ్వటం లేదని మా మీద అలిగి వాడు ఆ కర్రిదాన్ని లేపుకు పోయాడని మీరు డౌటుపడితే, మహాప్రభో అదేం కాదు. వాడి ఇష్టానికి అనుగుణంగా అప్పుడప్పుడూ వదిలేస్తాను కదా, అందుకు వాడికి నేనంటే కాస్త కృతజ్ఞతాభావం వుందండోయ్. మరేమైంది? అని మీరు విసుక్కోవద్దు. కొంచెం శాంతం కావాలి మరి.మనం మనుషులం. మన పద్ధతుల్లోనే వాటిని పెంచుతాం.మన పద్ధతులు వాటికి నచ్చవు. వేరే కుక్కలు చెప్తాయో లేదో కాని, మా వాడు మాత్రం అన్ని సందర్భాల్లో తన నిరసన వ్యక్తం చేసేవాడు. మా గోల్డీ మనిషై వుంటే, వాడిని మించిన విప్లవకారుడు మరొకడు వుండే వాడు కాదనిపించేది చాలాసార్లు. మనం రా ఫుడ్ తినం. జంతువులకు రా ఫుడ్ ఇష్టం. మాంసం తెచ్చి నూనె వేసి ఉప్పూ కారం మసాలాలు దట్టించి వండుకుంటాం. వాడికి కూడా అలాగే పెడతాం.మొదట్లో చాలా ప్రొటెస్ట్ చేశాడు. కానీ తప్పక అదే తినడం అలవాటు చేసుకున్నాడు.‘ప్రకృతిలోంచి వచ్చి ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నార్రా! మీరు చెడితే చెడిపోయారు. ప్రకృతిలో భాగంగా బతికే మాలాంటి ప్రాణుల్ని కూడా ఎందుకు చెడగొడతార్రా బాబూ’ అని కొంచెం మందలించేవాడు. అబ్బే! మనమెందుకు వింటాం. మా అలవాట్లే వాడి మీద రుద్దాం. మా ఆహారం మీద మీ ఆంక్షలేంటి అని మనం ఇంకెవర్నో తిట్టుకుంటున్నామే. జంతువులు కూడా మనుషుల్ని అలాగే తిట్టుకుంటాయని మా గోల్డీ చాలాసార్లు చెప్పాడు. నిజమే అనుకున్నా గాని వాడి మాట మాత్రం ఎప్పుడూ వినలేదు. వాడికి మాలాగే రుచిగా పెట్టాలని మా కోరిక. రుచికి మించిన శత్రువు లేడని వాడి హెచ్చరిక. అందుకే వాడిని అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరకి తీసుకుపోవడం, అరుగుదలకి, వగైరా వగైరా జబ్బులకు మందులు వాడటం చేస్తుంటాం.వాడు నవ్వుకుంటాడు. ఎందుకురా నవ్వుతావంటే, ‘నాయాళ్ళారా మీ అజ్ఞానంతో పాటు మీ అభిరుచులతో నన్ను కూడా రోగిష్టి వాడిని చేసేశారు కదా’ అని వాడి కంటెన్షన్.ఆగండాగండి. మా వాడు మా అభిమానం, ప్రేమ తట్టుకోలేక, దానిమూలంగా ఆసుపత్రుల చుట్టూ తిరగలేక పారిపోయాడని మీరనబోతున్నారు అంతేగా. అయితే మీరు దాల్ మే లెగ్గేసినట్టే. మా వాడు అంత డెలికేట్ డెసిషన్స్ తీసుకునే సెన్సిబుల్ కాదు. చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్ ఫ్రెండ్ మా గోల్డీ. ఏంటి.. సస్పెన్స్‌లో పెట్టి చంపేస్తున్నానంటారా? అలాంటి ఉద్దేశాలేమీ లేవు. మా గోల్డీకి సంబంధించిన పూర్తి సమాచారం మీకందితే, మీరెక్కడ ఉన్నా ఓ చేయి నా భుజం మీద వేసి ఓదారుస్తారనే. అసలేం జరిగిందంటే.. నా ప్రేమని వాడు భరించలేని స్థితికి వచ్చే పని ఒకటి చేశాను. అదే.. అదే వాడు నానుంచి దూరమయ్యేలా చేసింది. ఎంత మంచి వాడు, నా అత్యుత్సాహంతో నేనే వాడిని దూరం చేసుకున్నాను. నేను ఏం చెప్పినా చేస్తాడు. మా అలవాట్లు తెలుసుకుంటాడు. వాటిని నచ్చకపోయినా భరిస్తాడు. నేనే రెండుమూడు సార్లు వాణ్ణి కొట్టాను. అసహ్యించుకున్నాను. అయినా వాడు మాత్రం నా కోపం పోయిందని తెలుసుకున్నాక వచ్చి మెల్లిగా వొళ్లో వాలిపోయేవాడు. వాడికి వారానికి రెండుసార్లు స్నానం చేయిస్తాం. వాడి షాంపూ, సబ్బు, డియోడరెంట్ అన్నీ సెపరేట్. స్నానం చేయించిన తర్వాత మా గోల్డీ గాడి బొచ్చు చూడాలండీ. బంగారానిక్కూడా కుళ్ళేసుకొస్తుందంటే నమ్మండి. దాని వొంటి మీద ఒకసారి చేయి వేసి నిమిరితే జన్మజన్మాంతరాల స్పర్శానుభవం పొందినట్టే అనిపించేది. కానీ చాలాసార్లు స్నానం చేయించిన రోజే వాడు ఏదో బురదలోనో, మట్టిలోనో కసిదీరా దొర్లిదొర్లి వచ్చేవాడు. పోనీలే ఆడుకుంటాడు కదా అని వదిలేస్తే వాడు చేసే ఘనకార్యం ఇది. నాకు కోపం ముంచుకొచ్చి కర్ర తీసుకుని కొట్టేవాణ్ణి. దగ్గరకు రానిచ్చేవాణ్ణి కాదు. బయటే పెట్టి తలుపు పెట్టేసేవాణ్ణి. పాపం వాడు మాత్రం తలుపుకు ఆనుకుని అక్కడే పడుకునే వాడు. ఎప్పుడో జాలి పుట్టి ఏ బట్టో తీసుకుని వాడి వొళ్లంతా దులిపి అప్పుడు ఇంట్లోకి రానిచ్చేవాణ్ణి. దగ్గరకొచ్చి నా కళ్ళలోకి కళ్లు పెట్టి అలాగే చూసేవాడు. మనం ఏది శుచీ శుభ్రం అనుకుంటున్నామో అది వాడికి నచ్చడం లేదేమో. కడుక్కోవలసిందంతా లోపలే దాచుకుని పైపైన చేసే ఈ ప్రక్షాళన కార్యక్రమం అంతా నాటకంలా వాడికనిపిస్తుందేమో. మనం చేసే ప్రతి పనీ వాడి సహజత్వం నుండి దూరం చేసే అసహజమైన దానిగానే అనుకుంటున్నాడేమో. అప్పుడు వాడి కళ్ళలోకి చూస్తే ఎందుకో నా కళ్ళలో నీళ్ళు తిరిగేయి. అదంతా తల్చుకుంటుంటే ఇప్పుడూ తిరుగుతున్నాయనుకోండి. ఓహో! ఇదన్నమాట కారణం అనుకొని అప్పుడే ఓ కంక్లూజన్‌కి వచ్చేయకండి. స్నానం చేయించినందుకు చిరాకు పుట్టి పారిపోయాడని అనేసుకోవద్దు. అలా అనేసుకుని ఎంతైనా కుక్క కుక్కే. అందుకే కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధెక్కడ పోనిచ్చుకుంటుందని మాటలు జారేస్తారేమో అంత పనిచేయకండి. అసలు జంతువుల్ని మనుషులు ఎందుకు పెంచుకుంటారో తెలుసా? అది జంతు ప్రేమ కాదు. మనలోపలున్న జంతువులకీ, బయట స్వేచ్ఛగా తిరిగే జంతువులకీ మధ్య జరిగే యుద్ధానికి మనం పెట్టుకున్న అందమైన పేరు. అంత ఆశ్చర్యంగా చూడక్కర్లేదు. వాస్తవానికి మన లోపలున్న జంతువులు బయట హాయిగా వున్న జంతువుల మీద కుళ్ళుతో వాటిమీద కసి తీర్చుకోడానికి వాటికి ఇష్టం లేని పనులు చేయడానికి మనల్ని ఉసికొల్పుతాయి. ఇక మనం పెంచుకున్నవి మనకు నచ్చని పనులు చేసి వాటి నిరసన తెలియజేస్తాయి. ఇదంతా నేను మా గోల్డీ సాహచర్యంలో తెలుసుకున్న విశేషాలే సుమా. సరే! విషయానికే వద్దాం. స్నానం చేయించినంత మాత్రానికే పారిపోయే కురచబుద్ధి వాడు కాదు మా గోల్డి. నా వల్లే నా సరదా సంతోషాలే వాణ్ణి నా నుండి దూరం చేశాయి. వాడిది సహజంగానే బంగారంలా మెరిసిపోయే జుట్టు అని చెప్పాను కదా. అలాంటి వాడికి నా సరదా కోసం ఒక పూల చొక్కా కుట్టించాను. ఒక రంగు టోపీ కొన్నాను. వాటిని బలవంతంగా ఒకరోజు అలంకరించాను. అంతే, ఆ రోజు నుంచి నాతో మాట్లాడటం మానేశాడు. ఏంటో గొంతులో ఏదో ఇరుక్కున్నట్టుంది ఉండండి. పొలమారితే ఎవరో తల్చుకున్నట్టే. వెదవ! నన్ను తలుచుకుంటున్నాడేమో.వాడికేదో పోయేకాలమొచ్చి పోయాడని అనొద్దండి.మీకు దండం పెడతాను. మేముండే చోటుకి నెమళ్ళు బాగా వస్తాయి. బావుంటుంది కదా అని ఓ నెమలి కన్నుల చొక్కా కుట్టించేను గోల్డీకి. అంతే! వాడికి ఎక్కడ లేని తిక్క రేగింది. వాడన్న మాటల్ని మీకోసం ఇక్కడ మీకు తెలిసిన భాషలో చెప్తున్నా చూడండి.‘మీ మనుషులు మారర్రా అన్నాడు. ప్రపంచంలో ఇన్ని లక్షల కోట్ల జీవులున్నాయి. ఒక్కటంటే ఒక్కటైనా బట్టలు వేసుకుంటాయా? అది ప్రకృతికి విరుద్ధంరా! మీ మనుషులు చేసేదంతా ప్రకృతి విరుద్ధమే. ఆ నెమలిని చూడు. ఏదో రోజు ఆ నెమలిని కూడా మచ్చిక చేసుకుని నువ్వు దానికి కూడా పనికిమాలిన చీర ఏదో చుట్టినా చుడతావు. బాబూ నీకూ నీ చాదస్తంతో కూడిన అజ్ఞానంతో నిండిన అసహజత్వానికీ పరాకాష్టలాంటి నీ అలవాట్లకో నమస్కారం. నీకూ నాకూ రాం రాం.’ అని అన్నాడండి. దాని తర్వాత ఒకటి రెండురోజులు నెమలి మా దొడ్డి వైపు వస్తే దాన్ని తరిమేసే వాడు. అలా చివరికి ఒకరోజు తనను తానే నానుండి దూరంగా తరిమేసుకున్నాడు. మీరిప్పుడు ఏమంటారో నాకు తెలుసు. ‘మీ కుక్కప్రేమ నక్కలెత్తుకెళ్ళా. ఆ కుక్క నాయాలకు చొక్కా ఎందుకు కుట్టించారండి’ అంటారా? అనండి. అంటే అన్నాడు గాని భలే అన్నాడని నవ్వుకుంటున్నారు కదా. ‘నెమలికి కూడా మీరు చీర కట్టగలిగే నేర్పరులే’ అని నన్ను వెక్కిరించండి. ‘ చీర కట్టిన నెమలి. ఆహా! పోతేపోయాడు కాని మాంచి జ్ఞానోదయం చేశాడండి మీ గోల్డి!’ అంటారా? అనండి అనండి. మీరనాలి.నేను పడాలి. అంత దిక్కుమాలిన పని చేశాను మరి.నిజంగానే మనిషి తక్కువోడు కాదు. తనలోపల పాతిపెట్టాల్సిన వాటినెన్నింటినో నిత్యం బయటపెడుతూనే ఉన్నాడు. స్వార్థం, కుళ్ళు, ద్వేషం, అసహనం, మోహం, అత్యాశ, క్రోధం ఇలా ఎన్నని చెప్పాలి! వేటిని ఇనప కచ్చడాలు వేసి బిగించాలో వాటిని నిర్లజ్జగా వదిలేసి, ఏవేవో కపట వస్త్రాలతో తనను తాను కప్పుకుంటున్నాడు. మనిషి చేసే ప్రతి పనీ ప్రకృతి విరుద్ధమే అని నిరూపించగల అద్భుత మేధావి మా గోల్డీ గాడు. కాని వాడి భాష నాకు మాత్రమే తెలుసుగా ఏం చేస్తాం. నేనేమీ ఏడ్వటం లేదండి. నిజంగా. ఇన్ని విషయాలు నాకు బోధించి పోయాడు మా గోల్డీ గాడు. అదే తల్చుకుని పొంగిపోతున్నా. నిజంగానండి. పైకి చూపుతున్న గాంభీర్యం కాదు.ఏంటి? ఒకసారి సారీ చెప్పేసి, ఆ చొక్కా చింపి పారేయాల్సిందంటారా? వెధవ చొక్కా. కనీసం కుక్కయినా దక్కేదంటారా? మీ వ్యంగ్యానికేంగాని నా పశ్చాత్తాపాన్ని ప్రకటించుకునే అవకాశాన్ని కూడా నాకివ్వలేదు మా గోల్డి. దానికి కూడా అర్హుడనని వాడనుకోలేదు కాబోలు. వాడు కచ్చితంగా నెమళ్ళను నా నుండి కాపాడే మహోద్యమం ఏదో మొదలుపెట్టడానికే ఏ అడవుల్లోకో పారిపోయి ఉంటాడని నా నమ్మకం. నన్ను చూసి మీరేమీ జాలి పడక్కర్లేదు. తెలివిమాలిన వారు సానుభూతికి అనర్హులు. హచికో సినిమాలో కుక్క, చనిపోయిన యజమాని కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూసి చూసి పాపం చివరికి గడ్డకట్టుకుపోయిందే! నేను కూడా అలాగే అయిపోయేలా వున్నానని మాత్రం భయం కలుగుతోంది. అందులో యజమాని కోసం ఎదురుతెన్నులు చూసి కుక్క అలాగైంది. కుక్క కోసం ఎదురుతెన్నులు చూసి నేనిలా అవుతున్నాను. అంతే. వాడిని మర్చిపోలేను. దయచేసి వేరే కుక్కను పెంచుకోమని మీరు సలహాలు ఇవ్వొద్దు. మా గోల్డీ స్పెషల్. వాడి కోసం చుట్టుపక్కల ఎక్కడెక్కడ అడవులున్నాయో అన్నీ వెదుకుతున్నాను. ఒకవేళ వాడు కనబడితే ఏం చేస్తానో చెప్పమంటారా?బతిమాలుకుంటాను. వాడు రానంటే వాడితోనే వుండిపోతాను. వాడికి బట్టలిష్టం లేదుగా. నేను కూడా వాడి ఇష్టాన్నే ఫాలో అయిపోతా. సూఫీ గురువు సర్మద్లాగా నగ్నంగా తిరుగుతాను. ఔరంగజేబు రాజధాని నగరం నడిరోడ్డు మీద తల తీయించేశాడే ఆ సూఫీ గురువు గురించి మాట్లాడుతున్నానని మీరు కనిపెట్టే వుంటారు.ఔను! ఒక కవి తత్వాన్ని తలబిరుసు అనుకున్నాడు రాజు. అందుకే తల నరికించాడు. కాని ప్రజలు ఆ ఫకీరు అంతరాత్మలోని సత్యమనే వెలుగును దర్శించారు. అందుకే అతని సమాధిని ఒక తీర్థ స్థలంగా మార్చేశారు.ఉండండి ఉండండి. దూరంగా ఏవో నెమళ్ళు ఆడుకుంటున్నాయి. పక్కనే ఏదో కుక్క కూడా ఉన్నట్టుంది. తర్వాత చెప్తాను. పరుగు పెడుతూ మాట్లాడలేను. అవును! మా గోల్డీలానే వున్నాడు. ఉండండి ఒక్క నిమిషం. తర్వాత మాట్లాడుకుందాం. మీరు వెయిట్ చేసినందుకు సంతోషం. కానీ నేనే మీతో మాటల్లో పడి మళ్ళీ బుద్ధి తక్కువ పని చేశాను. నా హడావుడి పరుగు చూసి నెమళ్ళన్నీ ఒక్కసారిగా రెక్కల్ని ఎడాపెడా చాచేసి కూడబలుక్కున్నట్టు రివ్వున ఎగిరిపోయాయండి. దగ్గరకు పోయి చూస్తే అక్కడ కుక్క ఏదీ కనిపించలేదు. పైకి చూస్తే నెమళ్ళతోపాటు కుక్క ఆకారంలో ఎర్రని వర్ణం ధగధగా మెరిసిపోతూ కనిపించిందండోయ్. మీరు నమ్ముతారో లేదో. వాడు కచ్చితంగా మా గోల్డీనే. కచ్చితంగా చెప్తున్నా కదా, మా గోల్డీనే. ఇంక నేను మీతో మాట్లాడలేను. ఎందుకంటే నా వొంటికి పట్టింది చెమటో కన్నీళ్ళో నాకు తెలీదు. కాసేపు ఇక్కడే నేల మీద సేద తీరి పైకి చూస్తూ ఉంటాను. మా గోల్డీ నాకోసం తప్పకుండా వస్తాడు. మీకు ఒక విషయం తెలుసా తనను పెంచుకుంటున్న యజమానిని వదిలి కుక్కలు ఎక్కడికీ వెళ్ళవు. వస్తాడు. మా గోల్డీ తప్పకుండా వస్తాడు. కనీసం తనతో నన్ను తీసుకుపోడానికైనా వస్తాడు. - ప్రసాదమూర్తి -
కూతురిని గొలుసుతో బంధించిన తండ్రి
లక్నో : తన కూతురు ఓ యువకుడితో చనువుగా ఉంటోందని అనుమానించిన తండ్రి బాలిక (17) కాళ్లకు ఇనుప గొలుసు కట్టి ఇంట్లో బంధించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో శనివారం చోటుచేసుకుంది. తన తండ్రి గత మూడు రోజులుగా ఇనుస గొలుసుతో కట్టేసి ఇంట్లో బంధించాడని సమీపంలో మీర్గంజ్ పోలీస్ స్టేషన్లో బాలిక ఫిర్యాదు చేసింది. తాను ఓ యువకుడితో స్నేహం చేస్తున్నాని, తన తల్లిదండ్రులు, సోదరులు కలిసి తన ఇంట్లో బంధించారని ఫిర్యాదులో పేర్కొంది. అర్థరాత్రి ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలో తప్పించుకుని వచ్చి పోలీస్‌లను ఆశ్రయించినట్లు తెలిపింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక తండ్రిని శనివారం అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను అక్రమంగా నిర్భందించారని ఐపీసీ సెక్షన్ 342 ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలికను మహిళ కానిస్టేబుల్ సహాయంతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమె మేజర్ అయ్యే వరకు బాలిక సంరక్షణ కేంద్రంలో ఉంటుందని అధికారులు తెలిపారు. బాలిక ఆరోపణలపై కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని బరేలీ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ వెల్లడించారు. -
నగరంలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్‌స్టేషన్ పరిధిలోని వసంత్‌నగర్ 9వ ఫేజ్‌లో గురువారం ఉదయం చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఓ మహిళ తన భర్తతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ యువకుడు క్షణాల్లో ఆమె మెడలోంచి చైన్‌ను లాక్కెల్లాడు. అలాగే మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్ దగ్గర కూడా మరో చైన్‌స్నాచింగ్ జరిగింది. కాగా... ఈ సంఘటనలు సమీపంలోని సీసీ కెమెరాలో నమోదు కావడంతో వాటి ద్వారా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
దారుణం : మతిస్థిమితం లేదని అన్నావదినలే..
-
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్టు
రూ. 6 లక్షల విలువైన బంగారు సొత్తు స్వాధీనం కాకినాడ క్రైం: మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలను మూడేళ్లుగా తెంచుకుపోతున్న ఇద్దరు చైన్ స్నాచర్లను ఎట్టకేలకు కాకినాడ టూ టౌన్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 6 లక్షల విలువైన 196.8 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను కాకినాడ క్రైం డీఎస్పీ ఏ. పల్లపురాజు బుధవారం కాకినాడ త్రీ టౌన్ క్రైం పోలీసుస్టేçషన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాకినాడ బ్యాంకుపేట గంగాలమ్మగుడివీధి, అబుద్నగర్కు చెందిన మేడిచర్ల శ్రీను (32) ఆటో డ్రైవర్. చెడు వ్యసనాలకు బానిసైన ఇతను కాకినాడ టూ టౌన్, సర్పవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో 2015, 2016, 2017 సంవత్సరాల్లో నాలుగు చోట్ల మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలను అపహరించుకుపోయాడు. అతనితో పాటు స్థానిక అన్నమ్మఘాటీ కుంతీదేవిపేట, నరసింహరోడ్డుకు చెందిన వల్లూరి ఆషీష్కుమార్ (23) 2017లో రెండు చైన్‌స్నాచింగ్ దొంగతనాల్లో పాల్గొన్నాడు. ఇతనికి సొంతంగా లారీ ఉన్నప్పటికీ సరైన కిరాయిలు రాకపోవడం, నెలవారీ ఫైనాన్స్‌లు కంపెనీకి చెల్లించకపోవడంతో చైన్‌స్నాచింగ్‌కు దిగాడు. ఇద్దరూ మోటారు సైకిల్‌పై వచ్చి రోడ్లపై నడచి వెళుతున్న మహిళల మెడలోని బంగారు వస్తువులను తెంచుకుని పారిపోయేవారు. నిందితులు ఇద్దరిపై కాకినాడ టూ టౌన్ పరిధిలో రెండు, సర్పవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో 2 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు డీఎస్పీ పల్లపురాజు ఆధ్వర్యంలో కాకినాడ వన్, టూ, త్రీ టౌన్ క్రైం ఎస్సైలు, డీఎస్పీ క్రైం పార్టీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. గాలింపు చర్యల్లో వారు కాకినాడ గంగాలమ్మతల్లి గడి వీధి, బ్యాంకుపేటలో డోర్ నంబర్ 19–5–10 ఇంట్లో ఉన్నట్టు గుర్తించి దాడి చేసి మేడిచర్ల శ్రీను, వల్లూరి ఆషీష్కుమార్లను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వాటిలో ఇటీవల కాకినాడ నాగమల్లితోట ద్వారంపూడి ఫంక్షన్ హాలు సమీపంలో జరిగిన చైన్‌స్నాచింగ్ కేసులో బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ పల్లపురాజు తెలిపారు. నిందితుల నుంచి నాలుగు కేసులకు సంబంధించిన రూ. 6 లక్షల విలువైన 196.8 గ్రాముల బంగారు ఆభరణాలను, చైన్‌స్నాచింగ్‌కు వినియోగించిన బజాజ్ పల్సర్ మోటార్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన క్రైం ఎస్సైలు, క్రైం పార్టీ సిబ్బందిని ఆయన అభినందించారు. క్రైం ఎస్సై రామారావు, సుధాకర్, డిటెక్టివ్ పార్టీ హెచ్‌సీ కొప్పిశెట్టి గోవిందరావు పాల్గొన్నారు. -
మహిళ మెడలో గొలుసు అపహరణ
గుత్తి : గుత్తి ఆర్ఎస్ రైల్వే క్వార్టర్స్‌లో మంగళవారం పట్టపగలే మహిల మెడలో గొలుసు చోరీకి గురైంది. వివరాలిలా ఉన్నాయి. ఆర్ఎస్ క్వార్టర్స్‌లో ఉంటున్న రైల్వే ఉద్యోగి రమణమ్మ యథావిధిగా మధ్యాహ్నం భోజనం చేసి విధులకు బయలుదేరింది. స్టేషన్ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ఓ యువకుడు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలు తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ చాంద్‌బాషా తెలిపారు. -
దొంగకు దేహశుద్ధి
– పోలీసులకు పట్టించిన కాలనీ ప్రజలు కర్నూలు : కిరాణ దుకాణంలో ఉన్న మహిళ మెడలో గొలుసు చోరీకి పాల్పడిన దొంగకు కాలనీ ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని అమ్మహాస్పిటల్ – రవీంద్ర స్కూల్ దగ్గర సుబ్బయ్య కిరాణం అంగడి నిర్వహిస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఆయన భార్య అంగట్లో కూర్చొని ఉండగా, కర్నూలు కొత్తపేటకు చెందిన పాత నేరస్తుడు భరత్ సరుకుల కొనుగోలు పేరుతో దుకాణంలోకి వెళ్లి గొలుసు చోరీకి విఫలయత్నం చేశాడు. అది గమనించిన సుబ్బయ్య అడ్డుపోవడంతో కత్తితో మెడపైన, కాలిపై పొడిచి గాయపరిచాడు. అంగట్లో జరుగుతున్న పెనుగులాటను ఇరుగుపొరుగు వారు చూసి పరుగెత్తుకుంటూ వచ్చి దొంగను పట్టుకొని దేహశుద్ధి చేశారు. వెంటనే క్యూఆర్‌టీకి సమాచారం అందించగా, మూడో పట్టణ ఎస్ఐ మల్లికార్జున అక్కడికి చేరుకొని దొంగను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఇతను గతంలో కూడా చోరీలకు పాల్పడి రెండుసార్లు జైలు జీవితం గడిపాడు. ఇటీవలే బెయిల్‌పై బయటికి వచ్చి మళ్లీ చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు. కిరాణ దుకాణం నిర్వాహకుడు సుబ్బయ్యను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మూడవ పట్టణ పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
బంగారు గొలుసు అపహరణ
కదిరి టౌన్ : నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును అగంతకులు లాక్కెళ్లారు. పట్టణంలోని అడపాల వీధిలో నివాసముంటున్న గంగులమ్మ ఆర్అండ్బీ బంగ్లాలో స్వీపర్‌గా పనిచేస్తోంది. సోమవారం విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను అటకాయించారు. మెడలోని గొలుసును లాక్కొంటుండగా గంగులమ్మ ప్రతిఘటించి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చేలోపు ఆ యువకులు గొలుసు లాక్కొని ఆమెను కిందకు తోసేసి ఉడాయించారు. గాయపడిన బాధితురాలిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఒంటరిగా ఉండగా..
♦ ఇంట్లోకి చొరబడిన దొంగ ♦కత్తితో బెదిరించి, ఆపై చెంప ఛెళ్లుమనిపించి... ♦మెడలోని బంగారు చైన్‌తో ఉడాయింపు చెన్నేకొత్తపల్లి : స్థానిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే రాజారెడ్డి భార్య సావిత్రమ్మ మెడలోని బంగారు చైన్‌ను మంగళవారం ఓ దుండగుడు బలవంతంగా లాక్కెళ్లాడు. భర్త సరుకులు తెచ్చేం దుకు బజారుకెళ్లగా సావిత్రమ్మ ఇంట్లో టీవీ చూస్తూ, కుమారుడితో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని యువకుడు ఇంటి తలుపులు తెరచుకుని లోనికి ప్రవేశించాడు. వెనుక నుంచి వెళ్లి ఆమె చెవులను గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. ఆ తరువాత ఆమె చెంపలపై బలవంతగా కొట్టాడు. దీంతో బిత్తరపోయిన ఆమె ఏం జరుగుతోందో అర్థం కాక అదోలా చూస్తుండిపోయారు. ఇదే అదనుగా అతను ఆమె మెడలోని చైన్‌ను బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. ఆ తరువాత తేరుకున్న ఆమె దొంగ.. దొంగ.. అంటూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునేలోపే అతను మాయమయ్యాడు. లాక్కెళ్లిన చైను 5 తులాలు ఉందని, దాని విలువ దాదాపు రూ.1.50 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపారు. దొంగ తన వెంట తెచ్చుకున్న చాకును సైతం ఇంట్లోనే పడేసి వెళ్లిపోయాడన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ తమ సిబ్బందితో బాధితురాలి ఇంటికి చేరుకున్నారు. ఘటనపై ఆరా తీశారు. -
దేవరగట్టు దసరా సంబరం
-
అంబరాన్నింటిన సంబరం
- దేవగరట్టులో ఉత్కంఠగా సాగిన గొలుసు తెంపు కార్యక్రమం - గొరువయ్యల ఢమురుక శబ్దంతో హోరెత్తిన క్షేత్రం - ఆకట్టుకున్న దేవదాసీల క్రీడోత్సవం - భారీగా తరలివచ్చిన భక్తులు - నేటితో ముగియనున్న ఉత్సవాలు హొళగుంద/ఆలూరు రూరల్: దేవరగట్టు దసరా ఉత్సవాల సంబరం అంబరాన్నింటింది. ఉత్సవంలో భాగంగా శుక్రవారం గొరువయ్యల నృత్యాలు, దేవదాసీల క్రీడోత్సవాలను చూసేందుకు తరలివచ్చిన భక్తులతో క్షేత్రం పరిసరాలు కిటకిటలాడాయి. హాలహర్వి మండలం బల్లూరుకు చెందిన గొరువయ్య గాదిలింగప్ప ఒకే దెబ్బకు ఇనుప గొలుసును తెంపేసాడు. దాదాపు 20 కేజీలు గొలుసును ఒకే దెబ్బకు తెంపండంతో భక్తులు గొరువయ్యను అభినందించారు. అంతకు ముందు గొరువయ్యలు చేసిన ఢమురుకల శబ్దంతో దేవరగట్టు హోరెతింది. సింహాసన కట్టమీద అదిష్టించిన శ్రీమాళమల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల ఎదుట ఈ కార్యక్రమాలు కొనసాగాయి. క్షేత్ర పరిసరాల గ్రామాల నుంచే కాకుండా, కర్ణాటక రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చిన గొరవయ్యలు తమ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. పిల్లనిగ్రోవి ఊదుతూ, త్రిశూలం చేతబట్టి, ఢమురకులను ఆడిస్తూ లయబద్దంగా నృత్యం చేశారు. సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దేవదాసిల క్రీడోత్సవం, వసంతోత్సవం, కంకణ విసర్జన కార్యక్రమాలతో విగ్రహాల ఊరేగింపుతో కొండ పైనున్న ఆలయానికి చేరుకున్నాయి. శనివారం సాయంత్రం విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవంలో ఎఽలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆలూరు సీఐ శంకరయ్య, ఎస్ఐలు మారుతి, మస్తాన్‌వలి, వెంకటరమణ, కృష్ణమూర్తి బందోబస్తు నిర్వహించారు. -
మళ్లీ రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు..
-
సినీ ఫక్కీలో నిందితుడిని పట్టుకున్న యువకులు
మహిళ మెడలో చైన్ స్నాచింగ్ మంగళగిరి : మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన నిందితుడిని సినీ ఫక్కీలో పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన ఆదివారం పట్టణంలో చోటుచేసుకుంది. పాతమంగళగిరి బిట్రావారివీధికి చెందిన మునగాల లక్ష్మీనర్సమ్మ మధ్యాహ్నం తన సోదరుని ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని దుండగుడు ద్విచక్రవాహనంపై వచ్చి లక్ష్మీనర్సమ్మ మెడలోని బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. బాధితురాలి అరుపులతో చేరుకున్న స్థానికులు దుండగుడిని వెంబడించారు. నలుగురు యువకులు తమ ద్విచక్రవాహనాలపై బాధితురాలిని ఎక్కించుకుని వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆంజనేయకాలనీలో నుంచి వేగంగా నిందితుడు వెళుతున్న ద్విచక్రవాహనం జాతీయరహదారిపైకి వెళ్లే సమయంలో వార్డు మాజీ కౌన్సిలర్ వంగర పెదలక్ష్మయ్యను ఢీకొట్టాడు. సమీపంలోని వారంతా ఒక్కసారిగా అప్రమత్తమై వాహనంపై ఉన్న యువకుడిని అడ్డుకోవడంతో వెంబడిస్తున్న బాధితురాలు, యువకులు చేరుకుని చైన్ లాగింది అతడేనని గుర్తించింది. చొక్కా జేబులు వెతకగా జేబులో గొలుసు దొరికింది. దీంతో ఆగ్రహించిన యువకులు దొంగకి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని రక్షక్ వాహనం ఎక్కించారు. ఇంతలో నిందితుడు సెల్‌ఫోన్ మోగింది. పోలీసులు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి అవతల నుంచి మాట్లాడేది ఎవరో విన్నారు. అవతలి నుంచి మేమిద్దరం పెదవడ్లపూడి సెంటర్లో ఉన్నాము..పని అయిందిగా త్వరగా వచ్చేయి అంటూ సమాధానం వచ్చింది. వెంటనే పోలీసులు పెదవడ్లపూడి సెంటర్‌కు చేరుకుని మిగిలిన నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చైన్‌స్నాచింగ్‌కు పాల్పడింది మంగళగిరి పట్టణానికి చెందిన రవిగా పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు తోట సాయి, సుధాకర్ అని చెప్పారు. వీరిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలు లక్ష్మీనర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ
తొర్రూరు : మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును గుర్తుతెలియని దుండగుడు లాక్కెళ్లిన సంఘటన మండలంలోని పత్తేపురం గ్రామశివారులో మంగళవారం సాయంత్రం జరిగింది. సీఐ శ్రీధర్‌రావు కథనం ప్రకారం.. పత్తేపురం గ్రామానికి చెందిన కాయిత యాకమ్మ గ్రామశివారులో ఉన్న మామిడితోటలో పశువులను మేపుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వెళ్లాడు. మామిడితోటకు మందు పిచీకారి చేసేందుకు వచ్చానని ఆమెతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న మూడు తులాల రూ.60 వేల విలువ చేసే బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోయాడు. బాధితురాలు యాకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
బంగారు సరుడు చోరీ
ఆత్మకూరు రూరల్ : పట్టణంలోని శివాలయం వీధిలో నివసిస్తున్న పువ్వాడి మాధవి అనే మహిళ మెడలోని నాలుగు సవర్ల బంగారు సరుడును చోరీ చేసిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఆత్మకూరు పోలీసుల వివరాల మేరకు.. శివాలయం వీధిలో ఉంటున్న శ్రీనివాసులు, మాధవిలు బుధవారం రాత్రి తమ ఇంటి వరండాలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని నాలుగు సవర్ల సరుడును లాక్కెళ్లారు. ఆమె కేకలు వేయడంతో వారు పరారయ్యారు. బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై ఎం.పూర్ణచంద్రరావు దర్యాప్తు చేస్తున్నారు. -
నగరంలో మరో చైన్ స్నాచింగ్
* పద్మారావునగర్‌లో వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ * నిఘానేత్రానికి చిక్కిన నిందితుడు హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరంలో మరో గొలుసు దొంగతనం జరిగింది. పద్మారావునగర్‌లో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే స్నాచింగ్ దృశ్యాలు నిఘానేత్రానికి చిక్కాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. పద్మారావునగర్‌కు చెందిన రామనాథరావు, రమాదేవి(70) భార్యాభర్తలు. బుధవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రి వెనుక గల డయాగ్నోస్టిక్ సెంటర్లో వైద్య పరీక్షలు చేయించుకుని నడుచుకుంటూ వెళుతుండగా.. వెనుక నుంచి వచ్చిన చైన్ స్నాచర్ రమాదేవి మెడలోని గొలుసు తెంపబోయాడు. ఆమె గట్టిగా పట్టుకోవడంతో చిన్న బంగారు గొలుసు ముక్క స్నాచర్ చేతిలో ఉండిపోయింది. రామనాథరావు వాకింగ్ స్టిక్‌తో నిందితుడిని నిలువరించబోయేలోగా అతను పరిగెత్తుకుంటూ వెళ్లి నిలిపి ఉంచిన వాహనంపై పరారయ్యాడు. ఈ క్రమంలో రామనాథరావు కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. -
మంగళగిరిలో చైన్ స్నాచింగ్
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. బైక్‌పై వచ్చిన అగంతకులు ఓ యువతి మెడలో బంగారు గొలుసును తెంపుకుపోయారు. గురువారం ఉదయం మెయిన్ బజార్లో ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారు బిస్కట్ పేరుతో మోసం
► మహిళ మెడలోని తులంనర చైన్ అపహరణ ► సిరిసిల్లలో సినీఫక్కీలో చోరీ సిరిసిల్ల టౌన్ : రోడ్డుపై బంగారు బిస్కెట్ దొరికిందని.. అందరం పంచుకుందామని ఇద్దరు మహిళలు మరో మహిళ మెడలోని తులంన్నర బంగారు గొలుసు అపహరించుకుపోయారు. ఈ ఘటన సిరిసిల్లలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కోనరావుపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన రమణమ్మ ఉదయం కరీంనగర్ వెళ్లింది. మధ్యాహ్నం స్వగ్రామానికి వెళ్లేందుకు సిరిసిల్లకు చేరుకుంది. మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి, బస్సు కోసం బస్టాండుకు బయల్దేరింది. స్థానిక పత్తిపాక వీధిలో ఇద్దరు మహిళలు తమకు బంగారం బిస్కెట్ దొరికిందని రమణమ్మకు తెలిసేలా మాట్లాడారు. రమణమ్మ దగ్గరకు వచ్చి నకిలీ బంగారు బిస్కెట్ చూపించి, ముగ్గురం కలిసి పంచుకుందామన్నారు. వారించిన రమణమ్మ పోగొట్టుకున్నవాళ్లకు అప్పగించాలని కోరగా.. మనం దొంగతనం చేయలేదని, ఎవరికీ ఇచ్చే అవసరం లేదని నచ్చజెప్పారు. ఇంతలో అటువైపు నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. తాను స్వర్ణకారుడినని చెప్పి దొరికింది నిజమైన బంగారమేనని నమ్మబలికాడు. ఈ బిస్కెట్ తీసుకుని రమణమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును మహిళలకు ఇవ్వమని సూచించాడు. వారి మోసాన్ని గుర్తించని రమ ణమ్మ మెడలోని తులంన్నర బంగారు గొలుసును వారికిచ్చింది. సుమారు పదితులాల బరువుగల నకిలీ బంగారు బిస్కెట్‌ను తీసుకుంది. కొద్ది సేపట్లో ఇద్దరు మహిళలు, స్వర్ణకారుడు అక్కడి నుంచి ఉడాయించారు. అనుమానం వచ్చిన రమణమ్మ మరో స్వర్ణకారుడి వద్దకు వెళ్లి బిస్కెట్ చూపించగా, అది నకిలీదని తేలింది. ఐడీ పార్టీ పోలీసులు రాజేందర్, బాబు దొంగల కోసం గాలించినా ఫలితం లేకపోయింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన దొంగల ముఠా ఈ పని చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
తెంపింది ఒకరు... పట్టుబడింది మరొకరు
రాజాం: పట్టణంలోని గాంధీ వీధిలో ఓ చిన్నారి మెడలో చైన్ తెంపేసి పరారైన దొంగ తప్పించుకోగా, మరో వ్యక్తిని స్థానికులు దొంగ అనుకొని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాజాంలో శుక్రవారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... స్థానిక గాంధీ వీధిలో హర్షిణి అనే చిన్నారి తోటి స్నేహితులతో ఆడుకుంటుంది. ఇంతలో నీలం రంగు షర్టు వేసుకొని వచ్చిన అగంతుకుడు ఆ చిన్నారిని ముద్దులాడినట్టు నటించి మెడలో ఉన్న చైన్ తెంపేసి పారిపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు వెంబడించగా ఆ దొంగ మెయిన్‌రోడ్డులోని జనాల్లో కలిసిపోయాడు. ఇది గమనించని స్థానికులు అక్కడే తిరుగాడుతున్న గొల్లవీధికి చెందిన కోడిబోయిన శ్రీను అనే మరో వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తాను కాదని మొర్రోమన్నప్పటికీ స్థానికుల ఒత్తిడితో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శ్రీను గతంలో చిల్లర దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ముద్రపడడంతో వారి అనుమానం మరింత బలపడింది. దొంగ దొరికాడని తెలుసుకున్న చిన్నారి అమ్మమ్మ పైడమ్మ తన కాలనీవాసులతో స్టేషన్‌కు వెళ్లి దొంగను పరిశీలించింది. చైన్ తెంపింది ఇతడు కాదని తేల్చింది. అయినప్పటికీ చైన్ కూడా రోల్డ్ గోల్డ్దని చావు కబురు చల్లగా చెప్పింది. దీంతో చేసేదేమీలేక పోలీసులు శ్రీనును విడిచిపెట్టేశారు. అసలు దొంగను వెతకడంలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా చైన్ తెంపినప్పుడు చిన్నారి మెడకు చిన్నపాటి గాయమైంది. స్థానికులు ఆమెను వైద్యసేవలకు తరలించారు. -
సీసీ కెమెరాలో యాంటీస్నాచింగ్ టీమ్ కాల్పుల విజువల్స్
-
మహిళ మెడలో గొలుసు చోరీ
వరంగల్ టౌన్: వరంగల్ జిల్లాలోని బ్యాంకుకాలనీలో బుధవారం సరిత అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. దొంగిలించిన బంగారు గొలుసు 10 గ్రాములు ఉంటుందని బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పొలంలో మహిళను బెదిరించి ...
కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంటలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారుల్లో ఒంటరిగా పొలం పనులు చేసుకుంటున్న మహిళను దుండగుడు కత్తితో బెదిరించాడు. మెడలోని గొలుసు ఇవ్వకుంటే చంపేస్తానని అన్నాడు. దాంతో బయపడిన మహిళ మెడలోని రెండు తులాల గొలుసును దుండగుడికి ఇచ్చేసింది. ఆ గొలుసును తీసుకుని దుండగుడు బైక్‌పై పరారైయ్యాడు. దాంతో మహిళ బిగ్గరగా అరవడంతో స్థానికులు వెంటనే ఆమె వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుని... పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అందులోభాగంగా నిందితుడి వివరాలను బాధితురాలిని అడిగి తెలుసుకుంటున్నారు. -
లోన్ అంటూ చైన్ కొట్టేశాడు
గోల్నాక : లోన్ వచ్చిందంటూ చైన్ కొట్టేశాడు ఓ మాయగాడు. ఈ సంఘటన హైదరాబాద్ నాచారం పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని అనంతరామ్నగర్కు చెందిన ఓ మహిళ శనివారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గుడికి వెళ్లి వస్తోంది. ఇంతలో బైక్‌పై వచ్చిన ఓ యువకుడు ఆమె దగ్గర ఆగి 'మీ ఆయన నాకు బాగా తెలుసు. మీకు ఎల్.ఐ.సి లోన్ వచ్చింది. ఆఫీసుకు వస్తే లోన్‌కి సంబంధించిన పత్రాలు తీసుకుని వెళ్లొచ్చు' అని నమ్మబలికాడు. అతడు చెప్పింది నిజమని నమ్మి ఎంచక్కా బైక్ ఎక్కి చలో అంది ఆ మహిళ. అంబర్‌పేట నుంచి ఆమెను నాచారం పరిధిలోని మల్లాపూర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఓ ఇంటి ముందు ఆపి... ఇదే కార్యాలయం, వెళ్లి పత్రాలు తీసుకురండి అని చెప్పాడు. సరే అని ఆమె లోపలికి వెళ్లబోతుండగా... 'ఆగండాగండి, మీ మెడలో మంగళసూత్రం ఉంటే లోన్ ఇవ్వకుండా నిలిపివేయొచ్చు, అది తీసి ఇలా ఇవ్వండి' అని చెప్పాడు. అప్పుడు కూడా ఆమెకు అనుమానం రాలేదు, అతను చెప్పినట్టే చేసింది. అంతే...క్షణాల్లో మంగళసూత్రంతో బైక్‌పై తుర్రుమన్నాడు ఆగంతకుడు. నిండా మోసపోయానని అప్పటికి గ్రహించిన సదరు వివాహిత కళావతి అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శనక్కాయలంటూ చైన్ లాక్కెళ్లాడు..
అనంతపురం క్రైం : శనక్కాయలు కావాలా.. అమ్మయ్యా.. అంటూ ఓ ఆగంతకుడు ఇంటి వాకిలి వద్దకు వచ్చాడు. ఏమీ వద్దప్పా అంటూ మహిళ మరో గదిలోకి వెళ్లింది. ఆమెను అనుసరిస్తూ లోపలికి వెళ్లిన ఆగంతకుడు ఆమెను చితకబాది మెడలోని ఏడుతులాల బంగారు తాళిబొట్ల గొలుసు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు సుమారు 25 కుట్లు వేశారు. ప్రస్తుతం పెద్దాస్పత్రిలో కోలుకుంటోంది. నగరంలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. బాధితురాలి కథనం మేరకు.. ఓలేటి లక్ష్మినారాయణ, ఓలేటి లక్ష్మిదేవి (50) దంపతులు పెన్నార్ భవనం ఎదురుగా మీసేవా కేంద్రం పక్కన నివాసం ఉంటున్నారు. కలెక్టరేట్ ఎదుట భవాని హోటల్ నిర్వహిస్తున్నారు. రోజువారి క్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 6.15 గంటలకు లక్ష్మీనారాయణ సరుకులు సర్దుకుని హోటల్‌కు వెళ్లాడు. మరో పదిహేను నిముషాల్లో లక్ష్మిదేవి కూడా వెళ్లాల్సి ఉండటంతో ఆమె తల దువ్వుకుంటోంది. ఇంతలో ఓ ఆగంతకుడు ఇంటి వాకిలి వద్దకు వచ్చాడు. లోపలికి తొంగిచూస్తూ...‘శనక్కాయలు కావాలా.. అమ్మయ్యా.. అంటూ పిలిచాడు. వద్దునాయనా.. అంటూ లక్ష్మిదేవి మరో గదిలోకి వెళ్లింది. ఇంతలో మెల్లగా లోపలికి ప్రవేశించిన ఆగంతకుడు గుర్తు పట్టకుండా మొహానికి ముసుగు వేసుకున్నాడు. లోపల వాకిలికి గడియ పెట్టాడు. ఆమె వద్దకు వెళ్లి మెడలోని ఏడు తులాల రెండు పొరవల బంగారం తాళిబొట్టు చైనును లాక్కునే యత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో బలమైన వస్తువుతో తలపై దాడి చేశాడు. పెనుగులాటులో ఇల్లంతా రక్తపు మరకలు అయ్యాయి. చైను లాగేసుకుని ఆగంతకుడు అక్కడి నుంచి ఉడాయించాడు. పోతూపోతూ ఇంటి బయట వాకిలి వేసి గడియపెట్టి వెళ్లిపోయాడు. కాసేపటికి షాక్ నుంచి తేరుకున్న లక్ష్మిదేవి మొబైల్ నుంచి పక్కింటి వారికి ఫోన్ చేసింది. వారువచ్చి బయట గడియ తీసి లోపలికి వెళ్లిచూడగా లక్ష్మిదేవి రక్తపుమడుగులో ఉంది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలపై బలమైన గాయూలు ఉండటంతో 25 కుట్లు వేశారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ గోరంట్లమాధవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితురాలికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. -
జెంటిల్మెన్స్ WIT... లేడీస్ ఫేవRIGHT హైదరాబాద్!
కేవలం కబుర్లు చెప్పి, మసిపూసి మారేడుకాయ చేసి భార్యను ఆకట్టుకోవడం హైదరాబాద్‌లోనే సాధ్యం. అలా మహిళలను ఆకట్టుకునేందుకు అనువైన నగరం హైదరాబాద్.మీరిప్పటికిప్పుడు మీ భార్యకు మెళ్లో గొలుసు కొనిపెట్టలేరు. కానీ ఉపాయాన్ని కనిపెట్టి, అపాయాన్ని కప్పెట్టగలరు. ఎలా..? అలా ఆమెను అలా షికారుకు తీసుకెళ్తారు. ఎక్కడికీ...? ‘‘వచ్చే ఏడాది ఈ పాటికి నేను చేయించాలనుకుంటున్న చోటికి నిన్ను ఇవాళ్ల కాస్త షికారు తిప్పుతాను. కానీ ప్రస్తుతానికి మాత్రం జస్ట్ తీసుకెళ్లగలనంతే. ఆ ఆభరణం తాలూకు రోడ్డే మన నెక్లెస్ రోడ్డు’’ అంటారు గడుసుగా. ఇలా మహిళల కోసం రోడ్డు పేరు పెట్టిన నగరం ఏదైనా ఉందా? ఒకవేళ అచ్చతెనుగులో ఏ కాసుల పేరు రోడ్డనో, ఏ వడ్డాణాల వీధనో పెడితే కాస్త ఎబ్బెట్టుగానైనా ఉండవచ్చు. కానీ నెక్లెస్ రోడ్డు అనే మాటలో ఏ ఎబ్బెట్టు లేదని బెట్ చేయవచ్చు. అప్పుటికీ ఆమె బెట్టు తగ్గించుకోకుండా ఇప్పటికి మరి బంగారం ఏమీ లేదా? అంటే... మీ బడ్జెట్‌కు తగ్గట్టు... ‘‘అలాగైతే ఈ సారికి ఔటర్ ‘రింగ్’రోడ్డులో ఉన్న రింగుతో సరిపెట్టుకోలేవా?’’ అంటూ మరో ల్యాండ్‌మార్కు పేరు చెప్పి సముదాయిస్తే చాలు... సరిపెట్టుకోగల సాధ్వీమణులు ఉండరంటారా? ఒక్క ‘నెక్లెస్’ రోడ్డూ, ఔటర్ ‘రింగు’ రోడ్డూ... అన్న మాటేముంది?... అటు ఇటుగా దాదాపూ అన్ని రోడ్ల పరిస్థితీ అంటే...! ‘మోతీ’నగర్‌కు తీసుకెళ్లి... ‘‘అరెరె పేరును బట్టి ముత్యాలు దొరుకుతాయేమోనని తీసుకొచ్చా. కానీ ఇక్కడ కాదట. పెరల్స్ మార్కెట్ పంజాగుట్ట అట’’ అంటూ నాలుక కరచుకోవచ్చు. లేదా ‘‘బంగారం ఇప్పించాల్సిందే’’ అంటూ పట్టుబట్టిన లలనామణిని... ‘‘ఇక తప్పుతుందా పద.. నిన్ను వెంటనే తీసుకెళ్తా ‘కంచన్’బాగ్’’ అంటూ గబగబా రెక్కపట్టుకుని లాక్కెళ్లాలి. తీరా తీసుకెళ్లాక ‘‘అరె... కంచన్‌బాగ్ అంటే బంగారపు ఉద్యానవనాలు కాదా? మరి ఇక్కడ దొరకదా బంగారం?’’ అంటూ ఆశ్చర్యం అతిగా నటించవచ్చు. అలా అన్నీ అతివలకు అతిఇష్టమైన రోడ్ల పేర్లే ఇక్కడ. ‘‘గాజులు కొనుక్కుంటా... కాస్త రేపు లాడ్ బజార్‌కు వెళ్దామా’’ అంటూ భార్య గోముగా అడిగిందనుకోండి. గడుసు మగమారాజులకు అది ఇష్టం లేదనుకోండి. ‘‘గాజుల కోసం వెళ్లాలంటే గాజుల రామారం వెళ్తే సరి. అనవసరంగా లాడ్‌బజార్‌కు ఎందుకు? లాడ్ బజార్ అంటే... రేపు గారాబం చేయాలనుకున్నప్పుడు నిన్న తీసుకెళ్లాల్సిన మార్కెట్కదా’’ అంటూ గాజులు సవరిస్తూ చెప్తే సరి. ఆ చమత్కారానికి మగువ లొంగిపోయిందా... ఆ పూటకు కరుసు వాయిదా. పరుసు కాయిదా. మగ చమత్కారాలు పసిగట్టి వాళ్లకు బుద్ధి చెప్పడానికి... ‘‘పదండి అలా మల్లేపల్లి వరకు వెళ్లి మల్లెపూలు కొనుక్కొద్దాం’’ అంటూ ఆమె అందనుకోండి. అవ్వాళ అదేంటీ... మన వీధి మలుపు చివర్లో చిన్న బల్ల చెక్క దగ్గరే కదా మల్లెపూలు దొరికేది’’ అంటూ అప్పుడు మీరు పరాకు నటించడానికి వీల్లేదు. మల్లెపూలు కొనకపోయినా మల్లేపల్లి వెళ్లాల్సిందే. లేదంటే రేపు బోరుకొడుతోంది. తగ్గడానికి బోరబండ తీసుకెళ్లమని ఆమె మళ్లీ బలవంతం చేయవచ్చు. ఇంతటి చమత్కారపూరిత మైన వీధులూ, రోడ్ల పేర్లు హైదరాబాద్‌కు ఎందుకు వచ్చాయి? ఎందుకు వచ్చాయంటే ఏం చెబుతాం. నవాబుగారి కొడుకు యువరాజా వారు ‘భాగ్మతి’ అనే అమ్మాయిని ప్రేమించినందుకు... ఆమె పేరిట ఈ ‘భాగ్య’నగరాన్ని నిర్మించాట్ట. ఇక ఆమెకు ‘హైదర్’మహల్ అని పేరు పెట్టి ఈ మహానగరానికంతా ఆమె పేరే ఉండేలా చూశాట్ట. ఇలా తాను వలచిన మగువకు నగరం పేరు పెట్టి ఆనందించి, ఆమెనూ ఆనందింపజేశాట్ట. మహానగర ఆవిర్భావం, నామకరణంలోనే ఈ ‘జీన్స్’ ఉంటే ఇక రోడ్లూ, వీధుల పేర్లకు పెట్టే పేర్లిలా ఉండక వేరేలా ఉండే అవకాశం ఉందా? ఇప్పిస్తామంటూ తప్పించుకు తిరగడానికి మగపురుషులకు తగినంత అవకాశముండుగాక. అందుకే... సరసులైన పాలకులతో పాటు... గడుసువారైన భర్తలూ... సాధ్వీమణులున్న నగరం ఇలా మహిళలకు ఇష్టమైన పేర్లతో వర్ధిల్లుగాక. - యాసీన్ -
చైన్ బ్యాచ్.
-
గొలుసు కోసమే స్వర్ణలత హత్య!
పరియస్తుడే ప్రాణం తీశాడు ముగ్గురు నిందితుల అరెస్టు విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెల్లడి మచిలీపట్నం క్రైం : సంచలనం కలిగించిన స్వర్ణలత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. స్వర్ణలతతో పరిచయం ఉన్న వ్యక్తే పథకం ప్రకారం ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్వర్ణలతను అంతమొందించటంలో పరిచయం ఉన్న వ్యక్తితో పాటు మరో ఇరువురు పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ డాక్టర్ కె.వి. శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించి సంఘటన వివరాలు వెల్లడించారు. మచిలీపట్నంకు చెందిన మరకా శ్రీను, ముచ్చు శ్రీను, కుంభా శ్రీను స్నేహితులు. మొదటి నుంచి వ్యసనాలకు బానిసైన మరకా శ్రీను గతంలో పలు బైక్ దొంగతనాలకు పాల్పడగా అతనిపై మచిలీపట్నంతో పాటు విజయవాడ, ఏలూరుల్లోని పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముచ్చు శ్రీను ఆటో డ్రైవర్ కాగా, కుంభా శ్రీను కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే గతంలో మరకా శ్రీనుకి పట్టణానికి చెందిన కడియాల స్వర్ణలతకు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇటీవల వేసవి సెలవులకు పుట్టింటికి వచ్చిన స్వర్ణలతను గతంలో ఉన్న పరిచయంతోశ్రీను మాయమాటలు చెప్పి బయటికి వెళదామని కోరాడు. దీంతో స్వర్ణలత అతనితో కలిసి బయటికి వెళ్లేందుకు ఒప్పుకుంది. శ్రీను అతని స్నేహితులైన ముచ్చు శ్రీను, కుంభా శ్రీనును కలిసి తనకు ఓ మహిళ పరిచయమైనట్లు చెప్పి ఆమెను నమ్మకంగా తీసుకెళ్లి అంతమొందిస్తే పెద్ద మొత్తంలో బంగారం చేతికి వస్తుందని, వచ్చే బంగారాన్ని పంచుకుని దర్జాగా బతకొచ్చని చెప్పడంతో స్వర్ణలతను హత్య చేసేందుకు వారివురు అంగీకరించారు. ఈ నెల 10 వతేదీన శ్రీను స్వర్ణలతకు ఫోన్ చేసి బయటికి రమ్మని కోరాడు. బయటకు వచ్చిన స్వర్ణలతను ముచ్చు శ్రీను, అతని స్నేహితులు ఆటోలో ఎక్కించుకుని బందరు మండల పరిధిలోని చిన్నాపురం మీదుగా భోగిరెడ్డిపల్లి ఐదో నంబరు పంట కాలువ సమీపానికి తీసుకెళ్లారు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆటో డ్రైవర్ శ్రీను, మరకా శ్రీను తువ్వాలును ఆమె మెడకు చుట్టి ఊపిరి ఆడకుండా చేశారు. అలాగే ముందుగా పథకం వేసుకున్న వారు పురుగుమందు బాటిల్‌ను వెంట తీసుకెళ్లి ఆమె గొంతులో బలవంతంగా పోశారు. అయినప్పటికీ స్వర్ణలత చనిపోయిందో లేదోననే అనుమానంతో ఆటోలోని స్టెఫినీ టైరుతో ఆమె తలపై బలంగా కొట్టి హత్య చేశారు. అనంతరం ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని అక్కడి నుంచి ఆటోలో తిరిగి స్వర్ణలత ఇంటి సమీపానికి చేరుకుని ఆమె మూడేళ్ల కుమారుడిని ఇంటికి సమీప ప్రాంతంలో వదిలేసి ఉడాయించారు. ఈ సంఘటనపై భోగిరెడ్డిపల్లి వీఆర్వో ఈ నెల 11వ తేదీన రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు స్వర్ణలతను హత్య చేసింది పై ముగ్గురేనని తేలడంతో గురువారం మధ్యాహ్నం బందరులోని మూడుస్తంభాల సెంటర్లో రూరల్ సీఐ ఎస్ వీ వీ ఎస్ మూర్తి, ఎస్సై ఈశ్వర్, స్టేషన్ సిబ్బంది వారిని అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి అపహరించిన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆటోతో పాటు వారు ఉపయోగించిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా అరెస్టు చేసిన ముగ్గురిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకేసును ఛేదించండంలో కృషి చేసిన సీఐ మూర్తి, ఎస్సై ఈశ్వర్‌లతో పాటు స్టేషన్ సిబ్బందిని ఆయన అభినందించారు. రూరల్ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి, టౌన్ సీఐ బీవి సుబ్బారావు, రూరల్, మచిలీపట్నం ఎస్సైలు ఈశ్వర్‌కుమార్, శ్రీహరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
గొలుసు దొంగల అరెస్టు
అల్వాల్,న్యూస్‌లైన్: గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అల్వాల్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.15 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి డీసీపీ శివకుమార్ వివరాల ప్రకారం..బాలాజీనగర్‌లోని హనుమాన్‌మందిరం వద్ద మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా,అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నేరాల చిట్టా బయటపెట్టారు. మల్కాజిగిరి యాదవ్‌నగర్‌కు చెందిన కుక్కుట్ల నారాయణ అలియాస్ చిన్నా(25), 2008లో దొంగతనానికి పాల్పడి జైలుకెళ్లి విడుదలైన అనంతరం సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన బి.శివకుమార్ అలియాస్ శివ(21), సికింద్రాబాద్ సినిమా థియేటర్లో ఆపరేటర్‌గా పనిచేస్తే ఆరేపల్లి రాజశేఖర్(21), మాణికేశ్వరినగర్‌కు చెందిన కె.శ్యాంసుందర్(22)లు ముఠాగా ఏర్పడ్డారు. వీరు అల్వాల్, కీసర, నేరేడ్మెట్, ఉప్పల్, కుషాయిగూడ పోలీసుస్టేషన్ల పరిధుల్లో మూడు ఆటోలు, 17 గొలుసు దొంగతనాలకు పాల్పడి 32 తులాల ఆభరణాలు అపహరించారు. మరో ఘటనలో: యాప్రాల్ కిందిబస్తీకి చెందిన ఎన్.రాజు (21) నిలిపివున్న ద్విచక్రవాహనాలను మారు తాళం చెవులతో దొంగిలించి విక్రయించేవాడు. నాగరాజును అరెస్టు చేసి అతడ్నించి మూడు ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. -
చైనా ఆక్రమణపై వివరణ ఇవ్వనున్న ఆంటోనీ