చైనా ఆక్రమణపై వివరణ ఇవ్వనున్న ఆంటోనీ | China 'gobbles' up 640 sq km of Indian land in Ladakh | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 6 2013 12:45 PM | Last Updated on Thu, Mar 21 2024 5:25 PM

జమ్ముకాశ్మీర్‌లోని లడక్‌ వద్ద చైనా ఆర్మీ 640 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కబ్జా చేసిందని వస్తున్న వార్తలకు రక్షణ మంత్రి ఏకే ఆంటొనీ శుక్రవారం వివరణ ఇవ్వనున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పర్యటించిన అధికారులు కబ్జాను ధృవీకరిస్తున్నారు. దీంతో ఆంటొనీ పార్లమెంట్‌కు వచ్చి దీనిపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఆంటొనీ ఈరోజు మధ్యాహ్నం ఉభయసభల్లో వివరణ ఇస్తారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో చైనా ఆర్మీ నిరంతరంగా భారత భూభాగంలోకి చొచ్చుకువస్తూ భారత్‌కు చికాకు కలిగిస్తోంది. దీనిపై మంత్రుల స్థాయిలో చర్చలు జరిగినా చైనా తన తీరు మార్చుకోవడం లేదు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement