చైనా ఆక్రమణపై వివరణ ఇవ్వనున్న ఆంటోనీ
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌లోని లడక్ వద్ద చైనా ఆర్మీ 640 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కబ్జా చేసిందని వస్తున్న వార్తలకు రక్షణ మంత్రి ఏకే ఆంటొనీ శుక్రవారం వివరణ ఇవ్వనున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పర్యటించిన అధికారులు కబ్జాను ధృవీకరిస్తున్నారు. దీంతో ఆంటొనీ పార్లమెంట్‌కు వచ్చి దీనిపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఆంటొనీ ఈరోజు మధ్యాహ్నం ఉభయసభల్లో వివరణ ఇస్తారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో చైనా ఆర్మీ నిరంతరంగా భారత భూభాగంలోకి చొచ్చుకువస్తూ భారత్‌కు చికాకు కలిగిస్తోంది. దీనిపై మంత్రుల స్థాయిలో చర్చలు జరిగినా చైనా తన తీరు మార్చుకోవడం లేదు.