చైనా ఆక్రమణపై వివరణ ఇవ్వనున్న ఆంటోనీ | Chinese intrusion: AK Antony likely to address Parliament today | Sakshi
Sakshi News home page

చైనా ఆక్రమణపై వివరణ ఇవ్వనున్న ఆంటోనీ

Published Fri, Sep 6 2013 11:45 AM | Last Updated on Mon, Aug 13 2018 3:34 PM

చైనా ఆక్రమణపై వివరణ ఇవ్వనున్న ఆంటోనీ - Sakshi

చైనా ఆక్రమణపై వివరణ ఇవ్వనున్న ఆంటోనీ

న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌లోని లడక్‌ వద్ద చైనా ఆర్మీ 640 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కబ్జా చేసిందని వస్తున్న వార్తలకు రక్షణ మంత్రి ఏకే ఆంటొనీ శుక్రవారం వివరణ ఇవ్వనున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పర్యటించిన అధికారులు కబ్జాను ధృవీకరిస్తున్నారు. దీంతో ఆంటొనీ పార్లమెంట్‌కు వచ్చి దీనిపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఆంటొనీ ఈరోజు మధ్యాహ్నం ఉభయసభల్లో వివరణ ఇస్తారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో చైనా ఆర్మీ నిరంతరంగా భారత భూభాగంలోకి చొచ్చుకువస్తూ భారత్‌కు చికాకు కలిగిస్తోంది. దీనిపై మంత్రుల స్థాయిలో చర్చలు జరిగినా చైనా తన తీరు మార్చుకోవడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement