బీజింగ్: ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో ఒక రెస్టారెంటు కుప్పకూలి 17 మంది మరణించారు. లిన్‌ఫెన్ అనే పట్టణంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రెండంతస్తుల ఈ హోటల్ భవనం శిథిలాల నుంచి మొత్తం 45 మందిని బయటకు తీశారు. వీరిలో 17 మంది విగతజీవులుగా బయటపడగా, 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. భవనం కూలిపోవడానికి కారణాలేమిటనేది వెంటనే తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment