31 killed as cooking gas explosion at restaurant in northwest China - Sakshi
Sakshi News home page

పండుగ సెలవుల్లో విషాదం: రెస్టారెంట్‌లో పేలిన సిలిండర్‌.. 31 మంది దుర్మరణం

Published Thu, Jun 22 2023 8:54 AM | Last Updated on Thu, Jun 22 2023 9:18 AM

China Yinchuan Restaurant LPG Cylinder Explosion Kills Few - Sakshi

బీజింగ్‌: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి 31 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది పండుగ సెలవులకు బంధువుల ఇళ్లకు వచ్చిన వాళ్లే గమనార్హం.  

నార్త్‌వెస్ట్రన్‌ నగరం ఇంచువాన్‌లో బుధవారం సాయంత్రం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న రెస్టారెంట్‌.. జనాలతో కిక్కిరిసిపోయిన టైంలో రెస్టారెంట్‌లోని గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయ్యి.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది.  మంటలు భారీగా ఎగసిపడడంతో 31 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరికొందరు గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక బృందాలు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేసే యత్నం చేశాయి. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగ్గా..  గురువారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో మంటలు పూర్తిగా చల్లారాయి. 

స్వయంప్రతిపత్తి ఉన్న నింగ్క్సియా రాజధాని ప్రాంతమే  ఇంచువాన్‌. డ్రాగన్‌ బోట్‌ ఫెస్టివల్‌ కోసం మూడురోజులపాటు సెలవులు ప్రకటించారక్కడ. దీంతో బంధువులు, స్నేహితుల ఇళ్లకు వచ్చినవాళ్లే ఎక్కువగా మృతుల్లో ఉన్నారు. ఇంచువాన్‌లో ప్రమాదం జరిగిన ఓవైపు ఈ వీధిలో గ్లాస్‌ ముక్కలు, చెల్లాచెదురుగా పడి ఉన్న శకలాలు.. మరోపక్క అయినవాళ్ల కోసం గుండెలు పగిలేలా ఏడుస్తున్న బంధువుల రోదనలతో  హృదయ విదారకమైన దృశ్యాలు ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి. 

ఘటనపై అధ్యక్షుడు జీ జింగ్‌పిన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అండగా ఉంటామని, ప్రజా భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. 

ఇదీ చదవండి: ఏం ఎండలురా భయ్‌.. మాడిపోతోందీ మనోళ్లే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement