బీజింగ్: ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో జుక్సైన్ రెస్టారెంటు కుప్పకూలిన ఘటన విషాదాన్ని నింపింది. శనివారం ఉదయం 9.40 నిమిషాలకు చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. రెండంతస్థుల భవనం శిథిలాల కింద నుంచి 59 మంది క్షతగాత్రులను బయటకు తీశారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా 21 మంది స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆదివారం ఉదయం సహాయక చర్యలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ప్రమాదానికి గల కారణాలను మాత్రం ఇంకా గుర్తించలేదన్నారు. కాగా ప్రమాదం జరిగిన రోజు ఆ రెస్టారెంటులో 80 ఏళ్ల వ్యక్తి బర్త్‌డే పార్టీ జరుపుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ వేడుకకు ఎక్కువమంది హాజరవడంతో బాధితుల సంఖ్య అధికంగా ఉందని తెలిపారు. (చదవండి: సాంబార్‌లో సగం బల్లి.. మిగతాది ఏమైనట్లు?!)
చదవండి: ‘మహా’ విషాదంలో 13 మంది మృతి
చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్ ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment