Shanxi province
-
చైనా తొలి చక్రవర్తి సమాధికి పాదరస రక్షణ!
బీజింగ్: చైనాను పాలించిన మొట్టమొదటి చక్రవరి కిన్ షీ హువాంగ్. ఆయన సమాధికి పాదరసం(మెర్క్యూరీ)తో రక్షణ కలి్పంచినట్లు తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ద్రవ రూపంలో ఉండే లోహమే పాదరసం. ఇది విషపూరితమైంది. కిన్ క్రీస్తుపూర్వం 221 నుంచి 210 దాకా.. పదేళ్లపాటు డ్రాగన్ దేశాన్ని శాసించాడు. కిన్ సమాధిని కట్టుదిట్టంగా నిర్మించారు. షాన్షీ ప్రావిన్స్‌లో 1974లో రైతులు పొలం దున్నుతుండగా కిన్ షీ హువాంగ్ సమాధి బయటపడింది. చక్రవర్తి సమాధిని తెరిచే చూస్తే వినాశనం తప్పదన్న ప్రచారం బాగా వ్యాప్తిలో ఉంది. దీంతో, తెరిచే సాహసం చేయలేకపోయారు. సమాధికి సమీపంలో మట్టితో తయారు చేసిన సైనికులు, ఆయుధాలు, గుర్రాల విగ్రహాలు భారీగా బయటపడ్డాయి. మరణానంతరం కూడా చక్రవర్తిని కాపాడడానికి ఈ ‘టెర్రకోట ఆరీ్మ’ని ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, చక్రవరి సమాధి చుట్టూ మెర్క్యూరీ లోహం స్వేచ్ఛగా కదులుతున్నట్లు పరిశోధకులు ఇటీవలే తేల్చారు. సమాధిని ఎవరూ తాకకుండా ఇలాంటి ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. -
తండ్రిబాటలో నడిచి..చరిత్ర సృష్టించి.. జిన్‌పింగ్ ప్రస్థానమిదే..
చైనా అధినేత షీ జిన్‌పింగ్ 1953 జూన్ 15న శాన్‌షీ ప్రావిన్స్‌లో జన్మించారు. ఆయన తండ్రి షీ షీ ఝాంగ్‌షువాన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, చైనా ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. జిన్‌పింగ్ బాల్యం ఎక్కువగా యావోడాంగ్ అనే పల్లెటూరిలో గడిచింది. తండ్రి ఆదేశాల మేరకు సాంస్కృతిక విప్లవ సమయంలో రైతులతో కలిసి సాధారణ జీవితం గడిపారు. వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారు. ప్రాథమిక విద్య అనంతరం సింగువా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. 1974లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సభ్యుడిగా చేరారు. పార్టీ శాఖ కార్యదర్శిగా రాజకీయ జీవితం ఆరంభించారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఫుజియాన్ ప్రావిన్స్‌లోని షియామెన్ నగర ఉప మేయర్‌గా ఎన్నికయ్యారు. 1979లో కే లింగ్లింగ్‌ను వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా కొద్ది కాలానికే ఆమె నుంచి విడిపోయారు. 1987లో ప్రముఖ జానపద గాయని పెంగ్ లియువాన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి కుమార్తె షీ మింగ్జే ఉన్నారు. ఆమె అమెరికాలో చదువుకుంటున్నారు. జిన్‌పింగ్ 1999 నుంచి 2002 దాకా ఫుజియాన్ గవర్నర్‌గా, 2002 నుంమచి 2007 దాకా ఝెజియాంగ్ గవర్నర్‌గా వ్యవహరించారు. 2007లో కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ(పీఎస్సీ)లో చేరారు. 2008 నుంచి 2013 దాకా చైనా ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. తొలిసారిగా 2012లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా, 2013లో చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పొగడ్తలు, తెగడ్తలు... 1949 అక్టోబర్ 1న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆవిర్భవించింది. ఆ తర్వాత జన్మించిన తొలి సీపీసీ ప్రధాన కార్యదర్శి జిన్‌పింగే. పార్టీలో ఎన్నో సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. క్రమశిక్షణకు, అంతర్గతంగా ఐక్యతకు పెద్దపీట వేశారు. అవినీతిపై ఉక్కుపాదం మోపారు. సొంత పార్టీ మాజీ నేతలకు కూడా శిక్షలు విధించారు. ఇది చైనాలో ప్రశంసలందుకుంది. కానీ ఆయన విదేశాంగ విధానంపై భిన్న స్వరాలు వినిపించాయి. పదేళ్ల జిన్‌పింగ్ పాలనలో అమెరికాతో చైనా సంబంధాలు క్షీణించాయి. భారత్‌తో సరిహద్దు వివాదాలు పెచ్చరిల్లాయి. తైవాన్ విషయంలో జిన్‌పింగ్ దూకుడు విమర్శలపాలవుతోంది. హాంకాంగ్‌లో నేషనల్ సెక్యూరిటీ చట్టం విషయంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కరోనా పుట్టుకకు చైనాయే కారణమన్న నిందను మోయాల్సి వచ్చింది. జీరో–కోవిడ్ పాలసీ వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందన్న వాదనలున్నాయి. జిన్‌పింగ్ తయారీ రంగాన్ని ప్రోత్సహించారు. ఫలితంగా చైనా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఎదిగింది. -
చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్
-
కూలిన రెస్టారెంటు: 29 మంది మృతి
బీజింగ్: ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో జుక్సైన్ రెస్టారెంటు కుప్పకూలిన ఘటన విషాదాన్ని నింపింది. శనివారం ఉదయం 9.40 నిమిషాలకు చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. రెండంతస్థుల భవనం శిథిలాల కింద నుంచి 59 మంది క్షతగాత్రులను బయటకు తీశారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా 21 మంది స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆదివారం ఉదయం సహాయక చర్యలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ప్రమాదానికి గల కారణాలను మాత్రం ఇంకా గుర్తించలేదన్నారు. కాగా ప్రమాదం జరిగిన రోజు ఆ రెస్టారెంటులో 80 ఏళ్ల వ్యక్తి బర్త్‌డే పార్టీ జరుపుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ వేడుకకు ఎక్కువమంది హాజరవడంతో బాధితుల సంఖ్య అధికంగా ఉందని తెలిపారు. (చదవండి: సాంబార్లో సగం బల్లి.. మిగతాది ఏమైనట్లు?!) చదవండి: ‘మహా’ విషాదంలో 13 మంది మృతి చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్ ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గనిలో పేలుడు.. 15 మంది మృతి
బీజింగ్ : చైనాలో విషాదం చోటుచేసుకుంది. బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో 15 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పదకొండు మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఉత్తర చైనాలోని పింగ్యావోలో సోమవారం చోటుచేసుకుంది. కాగా ప్రమాదం సంభవించిన సమయంలో బొగ్గు గనిలో 35 మంది కార్మికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రక్షణ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. -
మూడు ట్రక్కులు డీ: తొమ్మిది మంది మృతి
బీజింగ్: చైనా షాంగ్జి ప్రావిన్స్‌లోని యజ్హో నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని జాతీయ రహదారిపై బుధవారం మూడు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎనిమిది మంది రహదారిపై పనులు చేస్తున్న పనివారని చెప్పారు. మరోకరు ట్రక్కులోని వ్యక్తి అని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.