
బీజింగ్ : చైనాలో విషాదం చోటుచేసుకుంది. బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో 15 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పదకొండు మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఉత్తర చైనాలోని పింగ్యావోలో సోమవారం చోటుచేసుకుంది. కాగా ప్రమాదం సంభవించిన సమయంలో బొగ్గు గనిలో 35 మంది కార్మికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రక్షణ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment