coal mine explosion
-
బొగ్గు గనిలో ప్రమాదం.. 30 మంది కార్మికులు మృతి
టెహరాన్: ఇరాన్లో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. బొగ్గు గనిలో పేలుడు కారణంగా 30 మంది మరణించగా మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఈ ఘోరం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది.వివరాల ప్రకారం.. ఇరాన్ రాజధాని టెహరాన్‌కు 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న తబాస్‌లోని బొగ్గు గనిలో శనివారం అర్థరాత్రి ప్రమాదం జరిగింది. బొగ్గు గని నుంచి మీథేన్ గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గు గనిలో 70 మంది పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 30 మంది మరణించగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గని లోపల మరో 24 మంది చిక్కుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అలాగే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. ❗️30 Dead In Iran Coal Mine Explosion, 20+ Missing - IRNATabas, in the South Khorasan province, was rocked by the blast on Sunday morning as emergency workers continue trying to free miners trapped underground.pic.twitter.com/xUbqjBV0kU— RT_India (@RT_India_news) September 22, 2024మరోవైపు.. బొగ్గు గనిలో పేలుడు ఘటనపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందించారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ ప్రారంభించామని తెలిపారు. ఇది కూడా చదవండి: కమలా హారీస్‌కు పుతిన్ మద్దతు.. ట్విస్ట్ ఇచ్చిన లావ్రోవ్ -
ఇండోనేసియా బొగ్గు గని ప్రమాదంలో 10 మంది మృతి
జకార్తా: ఇండోనేసియా పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 10 మంది కార్మికులు మరణించారు. మరో నలుగురిని సహాయ బృందం కాపాడింది. ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన గనిలో ప్రమాదకరమైన మిథేన్ వంటి వాయువుల కారణంగానే పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. విషవాయువులు పీల్చడం వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 800 అడుగుల పొడవున్న గని కావడంతో సహాయ చర్యలు కాస్త సంక్లిష్టంగా మారాయి. మరణించిన వారిలో ఎక్కువ మందికి కాలిన గాయాలతో పాటు ఊపిరి సమస్యలు తలెత్తడంతో ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా కొత్త ఎత్తుగడ.. వీధి కుక్కల సాయంతో.. -
గనిలో పేలుడు.. 15 మంది మృతి
బీజింగ్ : చైనాలో విషాదం చోటుచేసుకుంది. బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో 15 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పదకొండు మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఉత్తర చైనాలోని పింగ్యావోలో సోమవారం చోటుచేసుకుంది. కాగా ప్రమాదం సంభవించిన సమయంలో బొగ్గు గనిలో 35 మంది కార్మికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రక్షణ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. -
బొగ్గు గనిలో పేలుడు: 200 మంది మృతి
-
బొగ్గు గనిలో పేలుడు: 200 మంది మృతి
టర్కీ బొగ్గు గనిలో భారీ విస్పోటం సంభవించింది. ఆ ప్రమాదంలో దాదాపు 200 మంది మరణించారు. బొగ్గు గని శిధిలాల కింద 400 మందికిపైగా కార్మికులు చిక్కుకుని ఉంటారని ఆ దేశ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పుడు గనిలో 787 మంది ఉన్నారని చెప్పారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని మనిసా ప్రావెన్స్ సోమా జిల్లాలోని ఆ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ప్రమాద ఘటనలో 80 మంది గాయపడ్డారని, వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని టర్కీ ఇంధన శాఖ మంత్రి చెప్పారు. సహాయక చర్యలు తీవ్ర తరం చేసినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాలో జరిగిన లోపాల కారణంగా ఆ పేలుడు సంభవించిందని తెలిపారు. అదికాక గనిలోని ఎలివేటర్ పని చేయడం లేదని చెప్పారు. గనిలోని షిఫ్ట్ పూర్తవుతున్న తరుణంలో ఆ ప్రమాదం జరిగిందన్నారు. 2012లో టర్కీలోని బొగ్గు గనులలో దాదాపు 80 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అందులో 61 మంది మరణించగా, 91 మంది కార్మికులు గాయపడ్డారు.