
జకార్తా: ఇండోనేసియా పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 10 మంది కార్మికులు మరణించారు. మరో నలుగురిని సహాయ బృందం కాపాడింది. ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన గనిలో ప్రమాదకరమైన మిథేన్ వంటి వాయువుల కారణంగానే పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు.
విషవాయువులు పీల్చడం వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 800 అడుగుల పొడవున్న గని కావడంతో సహాయ చర్యలు కాస్త సంక్లిష్టంగా మారాయి. మరణించిన వారిలో ఎక్కువ మందికి కాలిన గాయాలతో పాటు ఊపిరి సమస్యలు తలెత్తడంతో ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా కొత్త ఎత్తుగడ.. వీధి కుక్కల సాయంతో..
Comments
Please login to add a commentAdd a comment