workers died
-
మట్టి పెళ్లలు విరిగిపడి.. ఐదుగురి మృతి
అహ్మదాబాద్: గుజరాత్లో విషాదం చోట చేసుకుంది. మెహసానా జిల్లాలోని కడి పట్టణ సమీపంలో శనివారం ఓ నిర్మాణ స్థలంలో మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటన ఐదుగురు కార్మికులు మృతి చెందారు. జిల్లా కేంద్రానికి 37 కిలోమీటర్ల దూరంలోని జసల్‌పూర్ గ్రామంలో కార్మికులు భూగర్భ ట్యాంకు కోసం గొయ్యి తవ్వుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.Five Labourers Killed in Construction Site Collapse in Gujarat's Mehsana District #Mehsana #Gujarat #ConstructionCollapseMishap @INCGujarat @AAPGujarat https://t.co/UBMZgVKjXQ— Vibes of India (@vibesofindia_) October 12, 2024క్రెడిట్స్: Vibes of India ప్రమాద స్థలంలో ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రహ్లాద్‌సిన్హ్ వాఘేలా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టిపెళ్లలు కూలిపోవడంతో పలువురు కార్మికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐదు మృతదేహాలను వెలికితీశాం. ముగ్గురికిపైగా కార్మికులు చిక్కుకున్నారని తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావటానికి అధికారులు కృషి చేస్తున్నారు. -
కుప్పకూలిన లిఫ్ట్.. ఏడుగురు కార్మికుల మృతి..!
ముంబై: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ హైరైజ్అపార్ట్మెంట్లో నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ కూలి ఏడుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. టెర్రస్ నుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రంవెలుగు చూసింది. ఈ మేరకు థానే మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. కాగా థానేలోని ఘోడ్‌బందర్ రోడ్లో 40 అంతస్థుల భవనం నిర్మాణంలో ఉంది. ఆదివారం బిల్డింగ్ టెర్రస్‌పై వాటర్ఫ్రూఫింగ్ పనులు జరిగాయి. సాయంత్రం పనులు ముగించుకున్న కార్మికులు 5.30 గంటల సమంలో పైనుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్‌లోని సపోర్టింగ్ కేబుల్స్‌లో ఒకటి తెగిపోవడంతో లిఫ్ట్ అమాంతం కిందకు పడింది. ఈ ఘటనలో యిదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సహాయక చర్యలు చేపట్టారు. లిఫ్ట్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మృతులను మహేంద్ర చౌపల్(32), రూపేష్ కుమార్ దాస్(21), హరున్ షేక్(47), మిత్లేష్(35), కారిదాస్(38)తోసహా మరో ఇద్దరి గుర్తించాల్సి ఉంది. ప్రమాదంపై థానే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ అధికారి యాసిన్ తాడ్వి మాట్లాడుతూ.. ఇది నిర్మాణ లిఫ్ట్ అని, సాధారణ ఎలివేటర్ కాదని తెలిపారు. 40వ అంతస్తు నుంచి కుప్పకూలి P3 (అండర్ గ్రౌండ్ థర్డ్ లెవల్ పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ ఏరియా) వద్ద పడిందని యాదవ్ పేర్కొన్నారు. చదవండి: అమ్మా.. నేను చనిపోతే నీకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది... #WATCH | Five people died, and a few were injured after a lift collapsed in Maharashtra's Thane: Thane Municipal Corporation pic.twitter.com/AuDiVms1aW — ANI (@ANI) September 10, 2023 -
Maharashtra Samruddhi Expressway: నిర్మాణ దశలో ఘోర ప్రమాదం
ముంబై: మహారాష్ట్రలో నిర్మాణంలో ఉన్న సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వంతెనలోని శ్లాబులను యథాస్థానంలో కూర్చోబెట్టేందుకు వినియోగించే గిర్డెర్ లాంఛర్ కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సెగ్మెంట్ లాంచర్(క్రేన్)తో కలుపుకుని దాదాపు 700 టన్నుల బరువైన గిర్డెర్ లాంఛర్ 35 మీటర్ల ఎత్తునుంచి కిందకు కుప్పకూలింది. దీంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది దాని కింద నలిగిపోయారు. ఈ ఘోర దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైను నాగ్‌పూర్‌ను కలుపుతూ 701 కిలోమీటర్ల పొడవైన సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తున్నారు. ముంబైకి 80 కి.మీ.ల దూరంలో థానె జిల్లాలో సార్లాంబే గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రిదాటాక ఈ ఘటన జరిగింది. ఘటనపై నిపుణులతో కూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసినట్లు ఉపముఖ్యమంత్రి ఫడ్నవిస్ చెప్పారు. పోతపోసిన బాక్స్ శ్లాబులను తర్వాతి రోజు నిర్మాణం కోసం సిద్ధంచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేíÙయా ఇస్తామన ప్రధాని ప్రకటించారు. తలో రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. దుర్ఘటన నేపథ్యంలో సంబంధిత ఇద్దరు కాంట్రాక్టర్లపై పోలీసులు కేసు నమోదుచేశారు. మొత్తం ఎక్స్‌ప్రెస్‌వేలో ఇప్పటికే 600 కి.మీ.ల మేర నిర్మాణం పూర్తయి రాకపోకలు సైతం మొదలయ్యాయి. ఈ 101 కి.మీ.ల నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీద గత ఆరు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. -
లిఫ్ట్ వైరు తెగి ఇద్దరు కార్మికుల మృతి
ఇబ్రహీంపట్నం: లిఫ్ట్ వైరు తెగిపడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన శనివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ ప్లాంట్ (ఎన్టీటీపీఎస్) ప్రాంగణంలో జరిగింది. ఎన్టీటీపీఎస్లో నిర్మిస్తున్న 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌లో పని చేసేందుకు ఉదయం 9గంటలకు కార్మికులు వచ్చారు. ప్లాంట్‌లోని 16వ చానల్ (అంతస్తు)లో పని చేసే కార్మికులు 20మంది కిందకు వచ్చేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ కిందకు వచ్చిన తర్వాత 18 మంది దిగారు. జార్ఖండ్‌కు చెందిన కార్మికులు చోటూ కుమార్‌సింగ్ (23), జితేంద్రసింగ్ (24) లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా, ఒక్కసారిగా డోరు మూసుకుపోయి మళ్లీ పైకి వెళ్లిపోయింది. సుమారు 150 అడుగుల ఎత్తులో ఉన్న 16వ చానల్‌కు వెళ్లిన తర్వాత లిఫ్ట్ వైరు తెగి కిందపడిపోయింది. లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన చోటూ కుమార్‌సింగ్, జితేంద్రసింగ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని సహచర కార్మికులు బయటకు తీసి ఎన్టీటీపీఎస్ బోర్డు వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పది మంది ఎక్కాల్సిన లిఫ్ట్‌లో ఒకేసారి 20మంది రాకపోకలు సాగిస్తున్నారని, మెటీరియల్ కూడా దానిలోనే తరలిస్తున్నారని, అధిక బరువు వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు. భద్రత వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎన్టీటీపీఎస్ ప్లాంట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యోగాలు ఇవ్వాలని వివిధ పార్టీల నాయకులు ప్లాంట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సీఐ పి.శ్రీను నేతృత్వంలో మృతదేహాలను పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
ఏడుగురిని బలిగొన్న విష వాయువులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, పాడేరు/పెదబయలు: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి. రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఆయిల్స్‌లో విష వాయువులు ఏడు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. వంట నూనెల కర్మాగారానికి చెందిన ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ట్యాంక్‌లోకి దిగిన కార్మికులు ఒకరి తర్వాత ఒకరుగా అరగంట వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు. మృతులలో ఐదుగురు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్లోని పెదబయలు మండలానికి చెందిన వారు కాగా, ఇద్దరు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు వాసులు. మృతులంతా రోజు వారి కూలీలే. అంతా 45 ఏళ్ల లోపు వారే.. గురువారం ఉదయం 7 – 7.30 గంటల మధ్య ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పెద్దాపురం పరిసర గ్రామాల నుంచి స్థానికులు బాధిత కుటుంబాలకు మద్ధతుగా ఫ్యాక్టరీ వద్దకు తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా తోడ్పాటు అందివ్వాలని కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కుంటుంబానికి రూ.25 లక్షలు వంతున పరిహారం ప్రకటించారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, ప్రత్యక్ష సాకు‡్ష్యలు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉక్కిరి బిక్కిరి.. జి రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఆయిల్స్ ఫ్యాక్టరీ ఆవరణలోని ఏడు ఆయిల్ ట్యాంకర్లలో ఐదో నంబర్ ట్యాంక్‌ను గురువారం శుభ్రం చేయాలనుకున్నారు. 24 అడుగుల లోతున్న ఈ ట్యాంక్‌లో అడుగున ఉండే వంట నూనె మడ్డిని తొలగించేందుకు వీరు ట్యాంక్‌లోకి దిగారు. ట్యాంకులో నిల్వ చేసిన నూనెను ప్యాకింగ్‌కు తరలించిన తర్వాత క్లీన్ చేశాకే తిరిగి మరోసారి ఆయిల్‌తో నింపుతుంటారు. అలా ఖాళీ అయిన ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు ఎనిమిది మంది కార్మికులను ప్లాంట్ సూపర్వైజర్ రాజు పురమాయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరూ ట్యాంక్‌లోకి దిగారు. తొలుత ట్యాంక్‌లోకి దిగాక, కళ్లు తిరిగి ఊపిరాడక పోవడంతో బయటకు వచ్చిన వెచ్చంగి కిరణ్ మాత్రమే ప్రాణాలతో బయట పడ్డాడు. ఇతని పరిస్థితి గమనించి కూడా, మిగతా వారిని లోపలకు దింపడం దారుణం అని మిగతా కార్మికులు మండిపడుతున్నారు. ట్యాంక్‌లో ఆక్సిజన్ 20 శాతం లోపు ఉండటంతోనే కార్బన్ డయాక్సైడ్, మోనాక్సైడ్‌తో కూడిన విష వాయువులు కమ్మేసి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ ‘సాక్షి ప్రతినిధి’కి చెప్పారు. ఈ ఫ్యాక్టరీలో ట్యాంకుల్లో నిల్వ చేసుకునేందుకు అనుమతి ఉందా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇక్కడున్న ఏడు ట్యాంకులన్నీ 18 నుంచి 24 అడుగుల లోతున ఉన్నాయి. మృతులను బయటకు తీసుకువచ్చేందుకు ట్యాంకర్‌ను కట్ చేయాల్సి వచ్చింది. ఫ్యాక్టరీ సీజ్.. దర్యాప్తునకు ఆదేశం కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కృతికా శుక్లా, ఎం రవీంద్రనాథ్‌బాబు రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఫ్యాక్టరీని సీజ్ చేసి, కార్యకలాపాలను నిలిపివేశారు. యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ మొత్తం ఘటనపై విచారణకు జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ఫ్యాక్టరీస్, కార్మిక శాఖ అధికారులతో త్రిసభ్య కమిటీని కలెక్టర్ ఏర్పాటు చేశారు. త్వరగా విచారణ పూర్తి చేసి, నివేదిక అందజేయాలని ఆదేశించారు. కాగా, పెద్దాపురం వద్ద కూడా ఇదే యాజమాన్యం ఏఎస్ ఆయిల్స్ పేరుతో మరో ఫాక్టరీని నడుపుతోంది. అందరూ రెక్కాడితే కానీ డొక్కాడని వారే.. మృతులంతా పొట్టకూటి కోసం వలస వచ్చిన వారే. రోజువారీ రూ.650 చొప్పున పని చేస్తున్నారు. ప్యాకింగ్ సెక్షన్లో పని చేసే వారిని ట్యాంక్‌లు శుభ్రంచేసే పనికి పురమాయించడం వల్లే అవగాహన లేక చనిపోయారని మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఇక తమకు ఎవరు దిక్కంటూ జగదీష్, ప్రసాద్ కుటుంబ సభ్యులు మృతదేహాల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం కోసం ఇద్దరి మృతదేహాలను పెద్దాపురం ఆస్పత్రికి, ఐదుగురి మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పారు. బాధితులకు అండగా సీఎం జగన్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి మరో రూ.25 లక్షలు వంతున ఇచ్చేలా ఒప్పించారు. మొత్తంగా ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబంలో అర్హులైన వారికి పింఛన్ సహా ఇతర ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్మికుల మృతి విచారకరం : గవర్నర్ సాక్షి, అమరావతి : కాకినాడ జిల్లా జి.రాగంపేటలోని అంబటి ఆయిల్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందడంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారని రాజ్‌భవన్ వర్గాలు గురువారం ఓ ప్రకటరలో పేర్కొన్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నలుగురికి 20 మంది పిల్లలు పెదబయలు మండలానికి చెందిన దగ్గరి బంధువులు ఐదుగురి మృతితో మన్యంలో విషాదం నెలకొంది వీరంతా సంక్రాంతి పండగకు స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడిపారు. రెండు వారాల క్రితమే ఫ్యాక్టరీకి తిరిగి వెళ్లారు. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొర్రా రామారావుకు భార్య కొమాలమ్మ, ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ చిన్న వయసు వారే. వెచ్చంగి కృష్ణారావుకు భార్య లక్ష్మితో పాటు నలుగురు పిల్లలు. కుర్తాడి బొంజన్నకు భార్య నీలమ్మతో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. వెచ్చంగి సాగర్‌కు వివాహం కాలేదు. తల్లిదండ్రులు సీతారామ్, సత్యవతి, చెల్లెళ్లు ఇతనిపైనే ఆధారపడి ఉన్నారు. నర్సింగరావుకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. మృతులు వీరే.. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పెదబయలు మండలం పరేడ∙ గ్రామ పంచాయతీ లక్ష్మీపురానికి చెందిన వెచ్చంగి కృష్ణారావు (36), వెచ్చంగి నరసింగరావు (40), వెచ్చంగి సాగర్ (23), ఉంచేడుపుట్టు గ్రామం కురుతాడుకు చెందిన కుర్తాడి బొంజుబాబు(35), బాండపల్లి గ్రామ పంచాయతీ సంపాపుట్టు గ్రామం కొర్రా రామారావు (45), పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన కట్టమూరి జగదేష్ (25), యల్లమిల్లి ప్రసాద్ (27). పెదబయలు మండలానికి చెందిన ఐదుగురూ దగ్గర బంధువులు. ఒక్కొక్కరం లోపలకు దిగేశాము. ఏదోలా అనిపించింది. వెంటనే ఊపిరాడక కళ్లు బైర్లు కమ్మేశాయి. ట్యాంక్ లోపల అరస్తూ పడిపోతున్న కృష్ణారావును పైకి లాగుదామనుకున్నా. అయితే అప్పటికే నాలో శక్తి సన్నగిల్లింది. ఎలాగోలా మిచ్చెన పట్టుకుని బయటికొచ్చి పడిపోయాను. – ప్రత్యక్ష సాక్షి కిరణ్ -
ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. ఉపాధి హామీ కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆమదాలవలస మండలం మందడిలో ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గురువందల పాపమ్మ, అంబటి సత్తెమ్మ, కురమాల లక్ష్మి మృతి చెందారు. అమలాపురం గౌరమ్మకు తీవ్ర గాయాలు కాగా, శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. చదవండి: హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు -
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం: లభించని ఆ ముగ్గురి ఆచూకీ.. డ్రోన్లతో సెర్చ్ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ మినిస్టర్స్ రోడ్‌లోని రాధా ఆర్కేడ్‌లో ఉన్న డెక్కన్ కార్పొరేట్ అగ్నిప్రమాదంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ దుర్ఘటనలో గల్లంతైన ముగ్గురి ఆచూకీ శుక్రవారం కూడా లభించలేదు. భవనంలోకి అడుగుపెట్టడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో విక్టిమ్ లోకేషన్ కెమెరాతో (వీఎల్సీ) కూడిన డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. రాధా ఆర్కేడ్‌లో గల్లంతైన డెక్కన్ కార్పొరేట్ ఉద్యోగులు జునైద్, వసీం, జహీర్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాలని పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు శుక్రవారం ఉదయం ఉపక్రమించారు. వీరి సెల్ఫోన్ల లాస్ట్ లోకేషన్స్ గురువారం ఉదయం భవనం వద్దే ఉండగా...ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అయ్యాయి. మరోపక్క ప్రమాదానికి కారణాలు విశ్లేషించడానికి క్లూస్‌టీమ్‌ను లోపలకు పంపాలని భావించారు. అయితే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ దట్టమైన పొగ, భరించలేని వేడి ప్రతికూలంగా మారాయి. వీటి కారణంగా నేరుగా, లేడర్ ద్వారా ప్రయత్నించినా బృందాలు భవనంలోకి అడుగుపెట్టే పరిస్థితి కనిపించలేదు. స్పష్టత లేదు... ఈ నేపథ్యంలోనే రెండో అంతస్తులో భవనం వెనుక వైపు రెండు చోట్ల మృతదేహాలు ఉన్నట్లు ఆనవాళ్లను శుక్రవారం సాయంత్రం గుర్తించారు. అయితే ఇవి స్పష్టంగా కనిపించకపోవడంతో ఔనా? కాదా? అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దీంతో డ్రోన్ కెమెరా చిత్రీకరించిన వీడియోను ఇంప్రొవైజేషన్ విధానంలో విశ్లేషించడానికి ల్యాబ్‌కు పంపించారు. మొదటి అంతస్తులో కొంత వరకు లోపలికి వెళ్లిన డ్రోన్ అక్కడ మెట్ల మార్గం, శ్లాబ్ కూలి ఉన్నట్లు గుర్తించింది. భవనం మొత్తం శిథిలాలు, కాలిపోయిన వస్తువులు ఉండటంతో పాటు బూడిద సుమారు రెండు అడుగుల మేర పేరుకుపోయినట్లు గుర్తించారు. పది గంటలకు పైగా మంటల్లో ఉన్న ఈ ఆరంతస్తుల భవనం స్ట్రక్చరల్ స్టెబిలిటీని నిర్థారించాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. దీంతో వరంగల్ నిట్ నిపుణుల బృందంతో కలిసి పరిశీలించారు. నిట్ డైరెక్టర్ రమణ రావు, జీహెచ్ఎంసీ అధికారులు క్రేన్ సహాయంతో భవనం పై అంతస్తుల వరకు వెళ్లి పరిశీలించి మంటల్లో కాలిపోయిన కొన్ని శిథిలాలను సేకరించారు. భవనం పూర్తిగా బలహీనంగా మారిందని దీన్ని పూర్తిగా విశ్లేషించిన తర్వాత మాత్రమే పూర్తి వివరాలు చెప్పగలుగుతామని రమణరావు అన్నారు. బయటే బస్తీల జనం.. ఈ భవనాన్ని ఆనుకుని ఉన్న కాచిబోలిలో సుమారు 15 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బస్తీలో చాలా ఇళ్లకు శుక్రవారం కూడా తాళాలు కనిపించాయి. భవనం వెనుక ఉన్న ఉత్తమ్ టవర్స్‌లో కిమ్స్ ఆస్పత్రి నర్సింగ్ హాస్టల్ ఉంది. ఇక్కడ నుంచి నర్సులను ఖాళీ చేయించారు. ఈ భవనాన్ని కూల్చిన తర్వాతే చట్టుపక్కల వారికి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరోపక్క ఈ భవనం కూల్చివేత పనులు ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారని తెలిసింది. శుక్రవారం సాయంత్రం దీన్ని పరిశీలించిన ఆ సంస్థ బృందం కూల్చివేత పూర్తి చేయడానికి మూడు–నాలుగు రోజులు పడుతుందని అభిప్రాయపడింది. గల్లంతైన వారు గుజరాత్ నుంచి వలసవచ్చిన వాళ్లు కావడంతో శుక్రవారం ఉదయానికి వారి కుటుంబీకులు నగరానికి చేరుకున్నారు. తమ వారి కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న వీరికి రెండు మృతదేహాలు కనిపించాయనే వార్త శరాఘాతమైంది. అవి ఎవరివో, కనిపించని మూడో వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వసీం సోదరుడు ఇమ్రాన్, జునైద్ సోదరుడు ఆసిఫ్ రోజంతా భవనం ముందే గడిపారు. చీకటి పడటంతో శుక్రవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ ఆపేసిన అధికారులు శనివారం మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. అగ్నిప్రమాదం తీరు తెన్నులు, భవనం లోపలి పరిస్థితులను గమనించిన ఓ పోలీసు అధికారి ‘ఆ ముగ్గురూ బతికే అవకాశాలు లేవు. ఇన్ని గంటల మంటలు, ఇంత వేడి, ఫైర్ ఇంజన్లు చల్లిన నీళ్లు..ఇవన్నీ పరిశీలిస్తుంటే వారి ఎముకలు దొరికే అవకాశమూ తక్కువే’ అని వ్యాఖ్యానించారు. డ్రోన్ల సాయంతో... లోపలికి వెళ్లలేక వెనక్కు వచ్చిన టీమ్స్ డ్రోన్ కెమెరాల సాయం తీసుకోవాలని స్పష్టం చేశాయి. దీంతో అధికారులు ఓ ప్రైవేట్ సంస్థను సంప్రదించి వీఎల్‌సీతో కూడిన డ్రోన్లను రప్పించారు. వేడి కారణంగా ఈ డ్రోన్లు సైతం లోపలకు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. భవనం ముందు భాగంతో పాటు నాలుగు వైపుల నుంచి డ్రోన్ ఎగురవేసి అనువైన, ఖాళీగా ఉన్న భాగాల నుంచి లోపలి ప్రాంతాన్ని పరిశీలించారు. -
ఇండోనేసియా బొగ్గు గని ప్రమాదంలో 10 మంది మృతి
జకార్తా: ఇండోనేసియా పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 10 మంది కార్మికులు మరణించారు. మరో నలుగురిని సహాయ బృందం కాపాడింది. ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన గనిలో ప్రమాదకరమైన మిథేన్ వంటి వాయువుల కారణంగానే పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. విషవాయువులు పీల్చడం వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 800 అడుగుల పొడవున్న గని కావడంతో సహాయ చర్యలు కాస్త సంక్లిష్టంగా మారాయి. మరణించిన వారిలో ఎక్కువ మందికి కాలిన గాయాలతో పాటు ఊపిరి సమస్యలు తలెత్తడంతో ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా కొత్త ఎత్తుగడ.. వీధి కుక్కల సాయంతో.. -
టన్నెల్ పనుల్లో ప్రమాదం
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ శివారులోని రేగుమాన్గడ్డ వద్ద జరుగుతున్న టన్నెల్ పనుల్లో ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. టన్నెల్‌లోని పంప్‌హౌస్ వద్ద క్రేన్ వైర్ తెగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. పంప్‌హౌస్‌లో అడుగున జరుగుతున్న పనుల కోసం క్రేన్ సహాయంతో కాంక్రీట్ బకెట్‌ను కిందకు దింపుతుండగా క్రేన్‌వైర్ తెగడంతో అది టన్నెల్లో ఉన్న కార్మికులపై పడినట్లు తెలిసింది. ఆ సమయంలో అక్కడ ఆరుగురు కార్మికులు ఉండగా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలం వద్ద ఇరుక్కుపోయిన మృతదేహాలను ఎయిర్‌ప్రెషర్ సహాయంతో బయటకు తీశారు. ఇందుకోసం సుమారు 3 గంటల సమయం పట్టినట్లు అక్కడివారు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదుగురి మృతదేహాలను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలుకు చెందిన దయ్యాల శ్రీను (42), జార్ఖండ్‌కు చెందిన బోలేనాథ్ (45), ప్రవీనేజ్ (38), కమ్లేశ్ (36), బిహార్‌కు చెందిన సోను కుమార్(36) ఉన్నట్లు గుర్తించామని ఆసుపత్రివద్ద పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన లాల్ బల్విందర్ సింగ్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని కుడిచేతికి తీవ్రగాయం అయినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే నేపథ్యంలో ప్రాజెక్టు పనులు ప్రస్తుతం నిలిచిపోయాయని, నిర్వహణ పనుల్లో భాగంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాజెక్టు ఈఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని వెల్లడించారు. భవన, నిర్మాణరంగ కార్మికుల కేంద్ర బోర్డు చైర్మన్ శ్రీనివాసులు నాయుడు ఘటనాస్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సొంతూళ్లకు తరలించారు. -
విషాదం.. ఇసుక తిన్నెలు కూలి ఇద్దరి మృత్యువాత
సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకున్న ఆ కుటుంబాల్లో కనుమ రోజు విషాదం నిండింది. ఇసుకను ట్రాక్టర్‌కు లోడ్ చేసేందుకు వెళ్లిన ఇద్దరు కూలీలపై ఇసుక తిన్నెలు విరుచుకుపడ్డాయి. అందులో కూరుకుపోయి ఇద్దరు ఊపిరాడక మృతి చెందారు. ఇదే ఘటనలో మరొక కూలీ గాయాలతో బయటపడ్డాడు. పెనుకొండ మండలం మరువపల్లిలో ఈ ఘటన జరిగింది. అనంతపురం, పెనుకొండ రూరల్: ఇసుక తిన్నెలు విరిగిపడి ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. పెనుకొండ సీఐ రామకృష్ణ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దుద్దేబండకు చెందిన వెంకటరెడ్డి (32), ఈడిగ వెంకటేష్ (43), మరో వ్యక్తి నాగభూషణ ముగ్గురూ కలసి బుధవారం ఉదయం ఇసుక తీసుకురావడానికి పెనుకొండ మండలం మరువపల్లి గ్రామ శివార్లలోకి చేరుకున్నారు. అక్కడి చెరువులో ఇసుక తవ్వుతుండగా ఒక్కసారిగా ఇసుక తిన్నెలు విరిగి కూలీలపై పడ్డాయి. వెంకటరెడ్డి, వెంకటేష్‌లు ఇసుకలో కూరుకుపోయి ఊపిరాడక ప్రాణం విడిచారు. ఇదే ప్రమాదంలో గాయపడి షాక్‌కు గురైన మరో కూలీ నాగభూషణ కాసేపటి తర్వాత తేరుకుని.. ఊరిలోకి పరుగులు తీసి సమాచారం చేరవేశాడు. గ్రామస్తులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పనిముట్ల సాయంతో ఇసుక తొలగించి రెండు మృతదేహాలను బయటకు తీశారు. బంధువుల రోదనలతో ఆ ప్రదేశం మార్మోగిపోయింది. ప్రమాదంలో మృతిచెందిన ఈడిగ వెంకటేష్‌కు భార్య పద్మావతి, మతిస్థిమితంలేని కూతురు శిల్ప, కుమారుడు శ్రీకాంత్ ఉన్నారు. మరో మృతుడు వెంకటరెడ్డికి భార్య పుష్పావతి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ పెద్దలు మృతిచెందడంతో ఆ కుటుంబాలు విషాదంలో మునిగాయి. అనంతరం సీఐ రామకృష్ణ, కియా పోలీస్‌స్టేషన్ ఎస్ఐ సుధాకర్ తమ సిబ్బందితో ప్రమాదస్థలిని పరిశీలించి, మృతదేహాలను ట్రాక్టర్లో పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి మరువపల్లిలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వెంకటరెడ్డి, ఈడిగ వెంకటేష్‌ల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్సీపీ సమన్వయకర్త శంకరనారాయణ డిమాండ్ చేశారు. పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను పరిశీలించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. పిల్లల చదువులకు చేయూతనందిస్తామన్నారు. భవిష్యత్తులో కూడా వైఎస్సార్సీపీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈయన వెంట దుద్దేబండ ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ నాగలూరు బాబు, వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి.. పెనుకొండ మండలం మరువపల్లి చెరువులో ఇసుక తరలి పోతోంది అని డిసెంబర్ 23న సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఇష్టారాజ్యంగా జరుగుతున్న తవ్వకాలకు చెక్‌పెట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఇసుకతిన్నెలు విరిగిపడి ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే ఈ రోజు ఇంతటి విషాదం చోటుచేసుకునేది కాదని గ్రామస్తులు చర్చించుకున్నారు. -
ముద్ద దిగకముందే మృత్యువాత
అప్పుడప్పుడే అన్నం వండుకున్నారు..తినడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలోనే ఊహించని ఘటన. నలుదిక్కులూ దద్దరిల్లేలా భారీ పేలుడు. క్షణాల్లోనే పరిస్థితి భీతావహంగా మారిపోయింది. వండుకున్న అన్నం తినకముందే కూలీలు మాంసపు ముద్దలుగా మారిపోయారు. పేలుడు తీవ్రతకు శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వాటిని కుక్క నోట కరుచుకుని తీసుకెళ్లడం చూపరులను కలచివేసింది. ఎక్కడి నుంచో వచ్చి దయనీయస్థితిలో మృత్యువాత పడ్డారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. కర్నూలు(అర్బన్): ఆలూరు మండలం హత్తిబెళగల్ కంకర క్వారీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న భారీ పేలుడులో 10 మంది కూలీలు దుర్మరణం చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడి కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. వీరంతా ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారిగా అధికారులు నిర్ధారించారు. క్వారీలో నిల్వ ఉంచిన జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లు ఒక్కసారిగా పేలడంతో భారీ శబ్దాలు సంభవించాయి. ఈ శబ్దాలకు సమీపంలోని హత్తిబెళగల్, అగ్రహారం గ్రామాల్లోని అనేక ఇళ్లు కంపించాయి. ఆయా గ్రామాల్లోని అనేక ఇళ్లలో భోజనం చేస్తున్న వారి కంచాల్లో మిద్దెలపై నుంచి మట్టి పడింది. భారీ శబ్దాలతో పాటు మంటలు నింగికెగసడంతో రెండు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేని పరిస్థితి నెలకొంది. పేలుడు సంభవించిన సమయంలో విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ప్రజలందరూ ఇళ్లను వదలిపెట్టి వీధుల్లోకి వచ్చారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటు రాత్రంతా జాగరణ చేశామని గ్రామస్తులు చెప్పారు. మూడు, నాలుగేళ్లుగా క్వారీ పేలుళ్ల వల్ల తమ ఇళ్లు కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయని, వెంటనే నిలుపుదల చేయాలని తహసీల్దారు నుంచి కలెక్టర్ వరకు అనేక వినతి పత్రాలు అందించినా, ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదని వాపోయారు. హత్తిబెళగల్‌లో 50 ఇళ్లకు నష్టం హత్తిబెళగల్ గ్రామ సమీపంలోని కొండల్లో విఘ్నేశ్వర క్రషర్స్ చేస్తున్న బ్లాస్టింగ్ ప్రాంతంలో జరిగిన భారీ పేలుడు శబ్దాలకు సమీపంలోని అగ్రహారం, హత్తిబెళగల్ గ్రామాల్లోని ఇళ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. హత్తిబెళగల్ గ్రామంలోని చాకలివీధిలోనే దాదాపు 30 మట్టి మిద్దెలు కంపించి మట్టి కుప్పలు కుప్పలుగా ఇళ్లలో పడిపోయింది. మరికొని ఇళ్ల గోడలు పగుళ్లు ఇచ్చాయి. దీంతో ఎప్పుడు తమ ఇళ్లు కూలిపోతాయోననే భయంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కైలాష్ నీవెక్కడ? కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): క్వారీ పేలుళ్ల ఘటనలో మృతి చెందిన కూలీలు ఒడిశా రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టర్ కైలాష్ ద్వారా ఇక్కడికి వచ్చారు. నెలకు రూ.12,000 కూలితో అగ్రిమెంట్ అయి క్వారీలో పనికి చేరారు. ఈ ఘటనలో మృతి చెందిన పది మందిలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కంచన్‌కుమార్ పాశ్వాన్, బూంచి కుమార్ పాశ్వాన్ మృతదేహాలను గుర్తించారు. మిగిలిన 8 మంది మృతదేహాలను గుర్తించలేకపోతున్నారు. వీరిని కాంట్రాక్టర్ కైలాష్ మాత్రమే గుర్తు పట్టేందుకు వీలుంది. తినే అన్నంలో మట్టి పడింది పగలంతా పొలాల్లో పనిచేసి వచ్చిన మేము రాత్రి భోజనం చేసే సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. ఇంటి మిద్దెలో నుంచి మట్టి అన్నం తినే కంచంలో పడింది. ఇళ్లంతా మట్టి నిండుకుంది. ఏమి జరుగుతోందో తెలియక ఎంతో భయపడ్డాం. కరెంట్ కూడా లేకపోవడంతో భయం భయంగా రాత్రంతా గడిపాం. మా ఇంటితో పాటు కొండను ఆనుకొని ఉన్న చాకలివీధిలోని అన్ని ఇళ్లూ వణికిపోయాయి. ఇళ్లు పడిపోతాయేమోనని భయపడ్డాం. – కవిత, హత్తిబెళగల్ మృత్యువును తప్పించుకున్న ముగ్గురు కూలీలు క్వారీలో జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 30 మంది కూలీలు పనిచేస్తున్నారు. వీరిలో 15 మంది ఒక షిఫ్టుగా హత్తిబెళగల్ కొండల్లో బ్లాస్టింగ్ చేస్తున్నారు. పగలు షిప్టు పూర్తి చేసుకున్న జార్ఖండ్ కూలీలు ఏడుగురితో పాటు మరికొందరు ఒడిశాకు చెందిన కూలీలు బ్లాస్టింగ్ జరుగుతున్న కొండల సమీపంలోనే రేకుల షెడ్డులో వంట చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జార్ఖండ్‌కు చెందిన మరో ముగ్గురు కూలీలు సొంత పనిమీద సమీపంలోని ఆలూరుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో భారీ విస్పోటనం సంభవించడంతో జార్ఖండ్‌కు చెందిన కంచన్ కుమార్ పాశ్వాన్ (40), బూంచి కుమార్ పాశ్వాన్ (35) తదితరులు అక్కడికక్కడే మృతి చెందగా, దిలీప్ పాశ్వాన్ (35), వికాస్ పాశ్వాన్ (20) తో పాటు మరికొందరు తీవ్ర గాయాలకు గురయ్యారు. పనిమీద బయటకు వెళ్లిన అక్షయ్‌సింగ్ పాశ్వాన్, బారీకర్ పరశురాం, ఆకాష్ పరశురాం మాత్రం మృత్యువు నుంచి తప్పించుకున్నారు. వీరంతా జార్ఖండ్ రాష్ట్రం మీరాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బానా ప్రాంతానికి చెందిన వారుగా చెబుతున్నారు. ఆ దృశ్యం..కన్నీరు తెప్పించింది! విస్ఫోటం సంభవించిన ప్రాంతంలో శనివారం ఉదయం ఒక కుక్క మృతి చెందిన ఓ కార్మికుని కాలును నోటితో కరచుకొని ఈడ్చుకెళ్తున్న దృశ్యం చూపరులకు కన్నీరు తెప్పించింది. çసంఘటన అనంతరం ప్రమాద తీవ్రతను బట్టి జరగకూడని సంఘటనలు ఎక్కడ చోటు చేసుకుంటాయో, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందేమోననే భావనతో పోలీసులు రాత్రికి రాత్రే మృతదేహాలను మూటగట్టి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అలాగే శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు సంఘటన జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇతరులెవ్వరినీ ఆ ప్రాంతానికి రాకుండా కట్టుదిట్టం చేశారు. కానీ .. మృతుల శరీర భాగాలు ఎక్కడపడితే అక్కడ పడినా ఎవరూ పట్టించుకోలేదు. అలాగే ఈ ఘోర దుర్ఘటనలో ఒక టిప్పర్, రెండు ట్రాక్టర్లు పూర్తిగా కాలిపోవడంతో పాటు వాటి విడి భాగాలు ఉవ్వెత్తున ఎగిసి ఫర్లాంగు దూరంలో అక్కడక్కడా పడిపోయాయి. కార్మికులు వేసుకున్న షెడ్డు పూర్తిగా కాలిపోయింది. వారికి సంబంధించిన వస్తువులు, దుస్తులు, ఇతరత్రా సామాన్లన్నీ మంటల్లో కాలిపోయాయి. చాలా ఎత్తుకు మంటలు ఎగిసిపడడంతో కార్మికులు నివాసం ఉన్న షెడ్డు, పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన ప్రాంతం అంతా బూడిదమయమైంది. కేవలం రేకుల షెడ్డు పైకప్పు మాత్రం అక్కడక్కడా వేలాడుతూ కనిపించింది. పేలుడు పదార్థాలతో పాటు డీజిల్ డ్రమ్ములు కూడా అక్కడే ఉండడంతో అవి కూడా పేలిపోయాయి. క్వారీ సీజ్ చేయాలి ఆలూరు: హత్తిబెళగల్ గ్రామంలోని కొండపై నిర్వహిస్తున్న క్వారీని వెంటనే సీజ్ చేయాలని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం డిమాండ్ చేశా రు. శనివారం పేలుడు ఘటన స్థలానికి చేరుకుని పేలుళ్లకు గల కారణాలను ఆయన తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఈ పేలుళ్లు జరిగి కార్మికులు మృతి చెందారన్నారు. గతంలో క్వారీని బంద్ చేయించాలని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అధికారుల అండదండలతోనే క్వారీ నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలలని డిమాండ్ చేశారు. అలాగే క్వారీ నిర్వాహకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. పోస్టుమార్టం పూర్తి కర్నూలు (హాస్పిటల్)/ఆలూరు: పేలుడులో చనిపోయిన పదిమంది మృతదేహాలకు కర్నూలు పెద్దాస్పత్రి మార్చురీలో ఫొరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ శంకర్‌నాయక్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రంగయ్య పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను అక్కడే ఉంచారు. వాటి తరలింపుపై అయోమయం నెలకొంది. మృతదేహాలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి తరలించి..అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఒడిశాకు తరలించాలని భావించినప్పటికీ, అందులో స్థానికులెవ్వరైనా ఉంటే కొత్త సమస్యలు తలెత్తుతాయన్న సందిగ్ధంలో అధికారులు తరలింపు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.అయితే.. ప్రస్తుతానికి గుర్తించిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కంచన్ కుమార్ పాశ్వాన్, బూంచి కుమార్ పాశ్వాన్ల మృతదేహాలను మాత్రమే బంధువులకు అప్పగించేందుకు చర్యలు చేపడుతున్నారు. మిగిలిన 8 మృతదేహాల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. అక్రమ క్వారీలపై చర్యలు: రాష్ట్రంలోని అక్రమ క్వారీలపై సమగ్ర విచారణ జరిపిస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మైనింగ్ మంత్రి సుజయ కృష్ణరంగారావు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీలో పనిచేసే కార్మికుల వివరాలను ఆయా సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.శనివారం వీరు కర్నూలు పెద్దాస్పత్రిలో కూలీల మృతదేహాలను పరిశీలించారు. అలాగే పేలుళ్లు జరిగిన ప్రాంతంలో పర్యటించారు. ఘటనపై విచారణ కమిటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ కె.సత్యనారాయణను నియమించారు. మంత్రుల వెంట డీజీపీ ఠాకూర్, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి తదితరులు ఉన్నారు. -
కర్నూలు: క్వారీలో భారీ పేలుడు
-
క్వారీలో భారీ పేలుడు
ఎటు చూసినా ముక్కలు ముక్కలైన శరీర భాగాలు..ఏ భాగం ఎవరిదో గుర్తు పట్టలేని పరిస్థితి.. కాలువలా ప్రవహించిన రక్తం.. ఇదీ శుక్రవారం కర్నూలు జిల్లాలోఓ క్వారీలో చోటు చేసుకున్న భారీ పేలుడు తర్వాత కనిపించిన భీతావహ దృశ్యం. అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ధనదాహం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి 12 మంది అమాయక కూలీలు బలైపోయారు. గనుల్లో అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలను కచ్చితంగా పాటించి తీరాలని సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు ఇటీవలే ఆదేశించినా ప్రభుత్వంలో ఇసుమంతైనా చలనం రాలేదు. ఫలితంగా 12 పేద ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆలూరు/కర్నూలు వైఎస్సార్ సర్కిల్: కర్నూలు జిల్లాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఆలూరు మండలం హత్తిబెళగల్ వద్ద కొండపైనున్న కంకర క్వారీలో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది కూలీలు దుర్మరణం చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. 10 మంది గల్లంతయ్యారని సమాచారం. గాయపడిన వారు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బాధితులంతా ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. ఈ క్వారీని తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీనివాస్ చౌదరి, అతడి సోదరుడు సువాస్ చౌదరి నిర్వహిస్తున్నారు. సంఘటనా స్థలంలో భయానక పరిస్థితి నెలకొంది. భారీ పేలుడు ధాటికి మృతుల శరీరాలు ముక్కలు ముక్కలయ్యాయి. శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఏ శరీర భాగం ఎవరిదో గుర్తు పట్టలేనంతగా మారాయి. గాయపడిన వారు అపస్మారకస్థితిలో వెళ్లారు. షాక్‌కు గురై ఏమీ చెప్పలేకపోతున్నారు. పైగా వారి భాష కూడా ఇక్కడెవరికీ అర్థం కావడం లేదు. దీంతో పేలుడు ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత రావడం లేదు. క్షతగాత్రులను ఆలూరు, కర్నూలు ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. పేలుడు తీవ్రతకు మూడు ట్రాక్టర్లు, ఒక లారీ మంటల్లో చిక్కుకుని దగ్ధమయ్యాయి. పేలినవి ఎలక్ట్రికల్ డిటోనేటర్లు! క్వారీలో భారీఎత్తున పేలుడు సామగ్రిని నిల్వ ఉంచినట్లు సమాచారం. 300కు పైగా ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, కిలోల కొద్దీ గన్‌పౌడర్, స్లర్రీ ఎక్స్‌ప్లోజివ్స్, జల్, జిలెటిన్ స్టిక్స్ లాంటి మందుగుండు అక్కడ ఉందని స్థానికులు చెబుతున్నారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం... ఈ క్వారీలో కొద్ది రోజుల క్రితమే గుంతలు తవ్వి పేలుళ్లు జరిపారు. కొన్ని గుంతల్లో నింపిన మందుగుండు పేలలేదు. శుక్రవారం రాత్రి ముందుగా అక్కడున్న గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. అవి డిటోనేటర్ల వైర్లకు వ్యాపించాయి. దీంతో ప్రస్తుతం జరిపే పేలుళ్లతో కలిసి పేలని గుంతల్లో ఉన్న డిటోనేటర్లు కూడా ఒకేసారి పేలడంతో పెద్దఎత్తున విస్ఫోటనం సంభవించింది. భారీగా మంటలు చెలరేగాయి. అవి అక్కడున్న షెడ్లకు వ్యాపించడంతో అందులో నిల్వ ఉంచిన 300 డిటోనేటర్లు, గన్‌పౌడర్, జిలెటిన్ స్టిక్స్, జల్ లాంటి పదార్థాలు కూడా పేలిపోయాయి. గ్రామ శివార్ల వరకూ మంటలు వ్యాపించాయంటే పేలుడు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. డిటోనేటర్లను ఎక్కువ లోతులో అమర్చడం వల్లే భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. సాధారణంగా వాటిని నాలుగు అడుగుల లోతులో అమర్చాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా అంతకుమించిన లోతులో అమర్చినట్లు మైనింగ్ అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం క్వారీలో 50 మంది దాకా కూలీలు పని చేస్తుంటారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే. అక్కడే టెంట్లు వేసుకుని కుటుంబాలతో సహా ఉంటున్నారు. భారీ పేలుడు నేపథ్యంలో వీరిలో చాలామంది చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. సంఘటన స్థలంలోకి వెళ్లడానికి అధికారులు అర్ధరాత్రి దాటినా సాహసం చేయలేకపోయారు. అక్కడ మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయన్న సమాచారంతో ఎవరూ Ðవెళ్లలేకపోయారు. ఆరు గ్రామాల్లో కంపించిన భూమి పేలుడు తీవ్రతకు హత్తిబెళగల్ గ్రామంలోని 25 మట్టి మిద్దెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అవి కూలిపోయి మీద పడతాయన్న భయంతో ఇళ్ల నుంచి గ్రామస్తులంతా పరుగులు తీశారు. హత్తిబెళగల్తోపాటు తుమ్మలబీడు, ఆలూరు, అరికెర, కురువెళ్లి, హులేబీడు, పెద్దహోతూరు తదితర గ్రామాల్లో సైతం భూమి కంపించినంత శబ్ధం రావడంతో తీవ్ర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మా ప్రాణాలు పోతున్నా పట్టదా? హత్తిబెళగల్ గ్రామస్తులు ఆలూరు పోలీసుస్టేషన్‌కు చేరుకొని అక్కడే బైఠాయించారు. గనుల తవ్వకాల వల్ల తమ ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నా పట్టించుకోవడం లేదని పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులపై మండిపడ్డారు. నాలుగైదేళ్ల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాలని వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. క్వారీలో పేలుడు ఘటనపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా మీరేం చేస్తున్నారంటూ ఆదోని ఆర్డీఓ, తహసీల్దార్ నాగరాజు, వీఆర్వోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లీజు గోరంత.. తవ్వేది కొండంత హత్తిబెళగల్ సమీపంలోని కొండ దాదాపు 50 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఈ కొండలో రోడ్మెటల్తోపాటు క్వారŠజ్ట్ ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ గనికి సంబంధించి ఆలూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి, సువాస్ చౌదరి సర్వే నంబరు 669లోని కేవలం 10 ఎకరాలకే లీజు పొందినట్లు సమాచారం. లీజుకు తీసుకున్న ప్రాంతంతోపాటు మరికొంత విస్తీర్ణాన్ని ఆక్రమించి అక్రమంగా కంకర తవ్వకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. పైగా కూలీల భద్రతకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. కనీసం తలకు హెల్మెట్ కూడా సమకూర్చలేదు. కన్పించని ఫోర్టబుల్ మ్యాగజైన్ మైనింగ్ ప్రాంతాల్లో పేలుడు సామగ్రిని భద్రపరిచేందుకు ఫోర్టబుల్ మ్యాగజైన్ రక్షణ కవచంగా ఉంటుంది. అందులో ఉంచితే పిడుగులు పడినా షార్ట్ సర్క్యూట్ కాదు. ఇనుప పెట్టెలోని చెక్కపెట్టెలాగా ఉండే ఫోర్టబుల్ మ్యాగజైన్‌ను క్వారీ వద్ద ఉంచకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం ఇవ్వకుండానే పేలుళ్లు వాస్తవానికి క్వారీలో భారీఎత్తున పేలుళ్లు జరపాలంటే స్థానిక పోలీసులతోపాటు రెవెన్యూ, మైనింగ్, మైన్‌సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సమీప గ్రామాల ప్రజలకు ముందుగానే తెలియజేయాలి. అయితే, అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పి రాత్రి, పగలు తేడాలేకుండా ఇష్టారాజ్యంగా పేలుళ్లు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘోరం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు బేఖాతర్ మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారుల ఉదాసీనతతోపాటు అధికార పార్టీ అండతో మైనింగ్ వ్యాపారులు చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మైనింగ్ ప్రాంతంలో ప్రతి ఏడు అడుగులకు ఒక బెంచ్ నిర్మాణం(ర్యాంపు) చేపట్టాలి. అయితే మీటర్ల కొద్దీ బెంచ్‌లను ఏర్పాటు చేయకపోవడం, ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడంతో పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి. బెంచ్‌ల నిర్మాణం చేపట్టకపోవడంతో ఈ ఏడాది మార్చి 29న వెల్దుర్తి మండలం సిద్దనగట్టు గ్రామంలోని సుద్దక్వారీలో జేసీబీ బోల్తా పడి నాగరాజు, హరి అనే కూలీలు మృతి చెందారు. అదే విధంగా ఇసుక డంప్ వద్ద నిబంధనలు పాటించకపోవడంతో జూలై 15న మల్లేపల్లె గ్రామం వద్ద లక్ష్మిదేవి అనే మహిళ ఇసుక దిబ్బలు పడి మృతి చెందింది. రెండేళ్ల క్రితం ప్యాపిలి మండలం చండ్రపల్లె గ్రామంలో క్వారీలోని మట్టి దొర్లి నలుగురు చనిపోయారు. జూలై 21న సి.బెళగళ్ మండలం పలుకుదొడ్డి గ్రామంలోని కంకర క్వారీలో పేలుళ్లకు ఉపయోగించే క్రమంలో ట్రాక్టర్ మీద పడి బోయచంద్రశేఖర్, ముల్లామస్తాన్ వలీ అక్కడికక్కడే మృతి చెందారు. టీడీపీ నేతలకు ఉసురు తగలక తప్పదు ‘‘అధికార టీడీపీ నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారికి ఉసురు తప్పకుండా తగులుతుంది. క్వారీ యజమానిపై గ్రామస్తులు పలుమార్లు పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. లీజుదారులకు ఇచ్చిన దానికంటే ఎక్కువ భాగాన్ని డిటోనేటర్లతో పేల్చడం దారుణం. ఇప్పటికైనా ఇక్కడ జరుగుతున్నా అక్రమాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి’’ – గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే, ఆలూరు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆరుగురి ఊపిరి తీసిన విషవాయువు
తాడిపత్రి: అనంతపురం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఉక్కు పరిశ్రమలో విషవాయువు లీక్ కావడంతో ఆరుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. తాడిపత్రి మండలంలోని అక్కన్నపల్లి సమీపంలో ఉన్న గెర్డావ్ ఉక్కు పరిశ్రమలో గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని పిగ్ఐరన్ (ముడి ఇనుము)వేడి చేసేందుకు ఉపయోగించే కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ కావడంతో కార్మికులు కుప్పకూలిపోయారు. పరిశ్రమలోని రోలింగ్ విభాగంలో సుమారు 400 అడుగుల లోతు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ పైపు వాల్వును ఓ కార్మికుడు తిప్పడంతో అందులోని వాయువు లీకై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన మరో ముగ్గురు కార్మికులు.. స్పృహతప్పి పడిపోయిన సహచరుడిని బయటికి తీసుకొచ్చేందుకు అండర్‌గ్రౌండ్‌లోకి దిగారు. వారు కూడా లోపలికి వెళ్లిన కొన్ని క్షణాల్లోనే ఊపిరాడక అక్కడిక్కడే కుప్పకూలి పోయారు. అక్కడికి వచ్చిన మరో ఇద్దరు కార్మికులు కూడా విషవాయువు పీల్చి స్పృహతప్పిపోయారు. ఈ ఘటన తెలిసి పరిశ్రమలో అలజడి రేగింది. కార్మికులందరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్పృహతప్పి పడిపోయిన వారిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారందరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఈఘటనతో తాడిపత్రిలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. మృతుల్లో వసీం, గురువయ్యలు పరిశ్రమ సిబ్బంది కాగా గంగాధర్, లింగమయ్యలు కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ డిల్లీరావు, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, ఆర్డీఓ మలోల హుటాహుటీన తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: కార్మికులు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి పలు సంఘటనలు చోటు చేసుకున్నాయని, అయితే పరిశ్రమ యాజమాన్యం వాటిని సహజ మరణాలుగా చిత్రీకరించి వెలుగులోకి రానీయ కుండా చేసిందన్నారు. ప్రశ్నించిన కార్మికులపై యాజ మాన్యం బెదిరింపులకు దిగుతోందని చెప్పారు. రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.. మృతి చెందిన వారి కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం రూ. 50 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆస్పత్రి ప్రాంగణంలో అఖిలపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. అయితే టీడీపీకి చెందిన కొందరు నాయకులు రూ. 5 లక్షల చొప్పున చెల్లిస్తామని చెప్పారు. రూ. 50 లక్షలు ఇవ్వాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలు పట్టుబట్టారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసుల రంగప్రవేశం చేసి ఇరువురికి సర్దిచెప్పారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేంత వరకు ఆందోళన చేస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.రమేశ్‌రెడ్డి, పైల నరసింహయ్య తేల్చిచెప్పారు. పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేస్తాం.. గెర్డావ్ స్టీలు పరిశ్రమలో జరిగిన ఘటనపై విచారణ చేస్తున్నామని, ఇప్పటికే క్రిమినల్ కేసు కూడా నమోదు చేశామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లిస్తామని జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జరిగిన ఘటనపై విచారణను ఇప్పటికే ప్రారంభించామని పరిశ్రమల శాఖ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ తెలిపారు. పరిశ్రమలో ఉన్న సేఫ్టీ పరికరాలు పనిచేస్తున్నాయా లేదా అన్న వివరాలు విచారణలో తెలియాల్సి ఉందన్నారు. మృతులు: 1. రంగనాథ్ (21) (తాడిపత్రి మండలం బోడాయిపల్లి), 2.గంగాధర్ (35) (అనంతపురం జిల్లా తుమ్మళ్ల మార్కపల్లి), 3.వసీమ్ (37) (కర్నూలు జిల్లా బేతంచెర్ల), 4.లింగయ్య (35) (వైఎస్సార్ జిల్లా కోడిగాండ్లపల్లి), 5.గురువయ్య (37) (ప్రకాశం జిల్లా గాండ్లపల్లి), 6.మనోజ్ (25) (అనంతపురం జిల్లా తాడిపత్రి). వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఉక్కు కర్మాగారంలో గ్యాస్ లీకై ఆరుగురు కార్మికులు మృతి చెందడం పట్ల ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
మ్యాన్ హోల్లోకి దిగి ఊపిరాడక ఇద్దరు కూలీల మృతి
-
ఉప్పల్ స్టేడియం వద్ద విషాదం
సాక్షి, హైదరాబాద్: భావి విశ్వనగరం.. భాగ్యనగరం మరో ఇద్దరు పారిశుధ్య కార్మికులను పొట్టనపెట్టుకుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియం గేట్ నంబర్ 1 వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. మ్యాన్ హోల్ లోపలికి దిగిన కార్మికులు ఊపిరి ఆడకపోవడంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మ్యాన్‌హోల్ నుంచి మృతదేహాలను బయటికి తీశారు. మృతులు సంతోష్(28), విజయ్(25)లు హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సంస్థలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని, వీరి స్వస్థలం ఒడిశా అని పోలీసులు తెలిపారు. జలమండలి వాటర్ పైప్ లైన్ నిర్మాణం నిమిత్తం సెంట్రింగ్ కర్రలు తొలగించే క్రమంలో దిగిన కార్మికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తప్పు ఎవరిది?: రెండేళ్ల కిందట హైటెక్ సిటీ సమీపంలో మ్యాన్ హోల్ లో పడి నలుగురు కార్మికులు మృతి చెందడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పెద్ద ఎత్తున మినీ ఎయిర్‌టెక్ మిషన్లను అందుబాటులోకి తెచ్చిన సందర్భంలో ‘‘ఇక నుంచి కార్మికులు మ్యాన్ హోల్స్‌లో దిగే పరిస్థితి ఉండదు’’ అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కాగా, బుధవారం ఉప్పల్ స్టేడియం వద్ద చోటుచేసుకున్న ఘటనలో తప్పు జలమండలిదా, ఎల్ అండ్ టీ సంస్థదా అన్నది తేలాల్సిఉంది. తోటి కార్మికుల మరణవార్త ఆ సంస్థలో పనిచేస్తోన్న మిగతావారిని కలవరపాటుకు గురిచేసంది. -
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురి మృతి
సాక్షి,చెన్నై: ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటన శివకాశి జిల్లాలోని రాముదేవపట్టిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడిక్కడే మృతిచెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాలివి.. రాముదేవిపట్టిలో ఏఆర్వీ, ఎస్ ఏఎస్ బాణాసంచా తయారీ కర్మాగారాలు ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో బాణాసంచా కర్మాగారంలో దాదాపుగా 50మంది కార్మికులు పని చేస్తున్నారు. బాణసంచా తయారు చేస్తున్న సమయంలో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఆ మంటల్లో నలుగురు కార్మికలు దుర్మరణం చెందారు. గాయపడిన వారిని శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాణాసంచా తయారీ ఆ కార్మికుల పాలిట మృత్యువుగా మారింది. మృతిచెందిన కార్మికుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
శివకాశి బాణసంచా ఫ్యాకర్టీలో భారీ పేలుడు..
-
గోడ కూలి ఇద్దరు మృతి
హైదరాబాద్: గోడ కూలి ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ సంఘటన నగరంలోని మెహిదీపట్నం అయోద్యనగర్‌లో బుధవారం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పక్కనే ఉన్న ఓ గోడ కూలడంతో ఇద్దరు కూలీలు మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత
విజయవాడ: భవానీపురం హెచ్‌బీ కాలనీ వద్ద డ్రైనేజీలో పడి మృతిచెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి. ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. కనీస సదుపాయాలు కల్పించకుండా పారిశుద్ధ్య కార్మికుల జీవితాలతో కార్పొరేషన్ అధికారులు చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తక్షణం పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
మట్టిపెళ్లలు పడి ఇద్దరు మృతి
మాదాపూర్: నగరంలోని మాదాపూర్ కొత్తగూడలో విషాదం చోటు చేసుకుంది. బహుళ అంతస్తుల భవనం నిర్మాణంలో భాగంగా భారీ సెల్లార్ గుంత తవ్వుతుండగా ప్రమాదవశాత్తూ మట్టి పెళ్లలు పడి ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. మృతిచెందిన వారిని భారతవ్వ (35), కిష్టవ్వ (22)గా గుర్తించారు. శిథిలాల నుంచి నలుగురు కూలీలు త్రుటిలో బయటపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మట్టి పెళ్లల కింద మరికొందరు కూలీలు ఉన్నట్టు సమాచారం. భారీ భవన నిర్మాణంలో ఇంజనీర్ల పర్యవేక్షణ లోపించనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాణ సంస్థపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదస్థలాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంవల్లనే ప్రమాదం జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. కాగా, ప్రమాదస్థలిలో మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించేందుకు ఒప్పుకోమంటూ వారు స్పష్టం చేశారు. -
లాతూర్‌లో విషాదం : తొమ్మిది మంది మృతి
-
లాతూర్‌లో విషాదం : ఏడుగురి మృతి
లాతూర్ : మహారాష్ట్రలో సోమవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. లాతూర్‌లోని ఓ పరిశ్రమలో విషవాయువులు పీల్చి ఏడుగురు కార్మికులు మృతిచెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. లాతూర్ పారిశ్రామికవాడలోని కీర్తి ఆయిల్ మిల్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువులు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
టీహబ్ నిర్మాణ పనుల్లో అపశ్రుతి
హైదరాబాద్: మాదాపూర్‌లో జరుగుతున్న టీ హబ్ నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. టీ హబ్ రెండో దశ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నోవర్టిస్ సాఫ్ట్వేర్ కంపెనీ సమీపంలో జరుగుతున్న టీ హబ్ నిర్మాణ పనుల్లో సోమవారం రాత్రి సెల్లార్ పునాది గోడ కూలి జియాఉల్ అన్సారీ అలియాస్ సోను(22), దిలీప్‌కుమార్ యాదవ్(40)లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరితోపాటు గాయపడిన ఇతర కార్మికులు చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారు బిహార్‌కు చెందినవారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పేలిన రియాక్టర్.. ఇద్దరు కార్మికుల మృతి
హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని ఓ ఫార్మా కంపెనీలో బుధవారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గగన్‌పహాడ్ లోని సంజీమ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
-
ఇద్దరు మిషన్ భగీరథ కార్మికుల మృతి
వరంగల్ రూరల్: నర్సంపేట మండలం మహేశ్వరం శివారులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను పాకాల కొత్తగూడెం మిషన్ భగీరథ కార్మికులుగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గోడ కూలి ఇద్దరు కూలీల దుర్మరణం
గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లాలో గోడ కూలి ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం, వేల్కూరు గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. వేల్కూరు పంచాయతీ పీబీ అగ్రహారానికి చెందిన ఎత్తురాజులు ఇంటి తలుపుల తయారీ కోసం సీమచింత చెట్టు కోసేందుకు అదే గ్రామానికి చెందిన నటేశన్(50), పెరుమాళ్ (52)ను వెంట బెట్టుకుని వెళ్లాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం ముగ్గురు కలసి సమీపంలోని పాత కోళ్ల షెడ్ వద్ద సేదతీరారు. వర్షానికి బాగా తడిసి ఉన్న గోడ వారిమీద కుప్పకూలింది. గోడ శిధిలాల కిందపడి నటేశన్, పెరుమాళ్ అక్కడికక్కడే మరణించారు. ఎత్తురాజులు తీవ్రంగా గాయపడగా అతన్ని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పొట్టకూటికొచ్చి కానరాని లోకాలకు...
ఆత్మకూరు రూరల్ : పొట్టకూటి కోసం ఊరు కాని ఊరొచ్చిన ఇద్దరు యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలితీసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడటంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన ఆత్మకూరు మండలంలోని కరటంపాడు, బసవరాజుపాళెం డొంక రోడ్డులో చెరువు కట్ట వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణపట్నం నుంచి రాయలసీమకు విద్యుత్ సరఫరా చేసేందుకు టవర్లు నిర్మించే కాంట్రాక్టర్ వద్ద పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లాకు చెందిన పలువురు కూలీలు పనిచేస్తున్నారు. వీరు అల్లీపురం సమీపంలోని గోదాము వద్ద ఉంటూ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో బసవరాజుపాళెం వద్ద నిర్మాణం ఉన్న టవర్ వద్దకు సామాన్లతో పాటు 15 మంది కూలీలు, వారికి కావాల్సిన ఆహారపదార్ధాలతో అల్లీపురం నుంచి ట్రాక్టర్ బయలుదేరింది. కరటంపాడు దాటిన తర్వాత మహిమలూరు చె రువు కట్ట వద్ద ఆదివారం రాత్రి బొంతరాళ్ల లారీ బోల్తాపడటంతో అందులోని రాళ్లు దారికి అడ్డంగా ఉన్నాయి. దీంతో కూలీలతో వెళుతున్న డ్రైవర్ రాజేష్ ట్రాక్టర్‌ను చెరువు కట్టపైకి మళ్లించాడు. కట్ట పైభాగానికి వెళ్లిన తర్వాత ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్‌కు ఇరువైపులా కూర్చున్న షేక్ అలాం(32), షేక్ కలాం (31) ఇంజన్ కింద ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందారు. అక్కడే కూర్చున్న షేక్ షౌకత్ ఆలిని దారిన వెళుతున్న వారు బయటకు లాగారు. ఆలితో పాటు గాయపడిన రాజేష్‌ను 108 అంబులెన్స్‌లో ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. షౌకత్ ఆలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలాన్ని ఆత్మకూరు డీఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, సీఐ అల్తాఫ్హుస్సేన్, ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి పరిశీలించారు. ట్రాక్టర్‌ను క్రేన్‌సాయంతో లేపి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాంకు భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా, కలాంకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. కరటంపాడు సెంటర్లో టీ తాగి బయలుదేరిన పది నిమిషాలకే ప్రమాదానికి గురయ్యామని మృతుల బంధువు బాబు ఆవేదన వ్యక్తం చేశాడు.